6.18 దేవునియందు భక్తీ మరియు ప్రేమ

Devotion and Love for God:
హిందూ మతం
- (Devotion and Love for God) విహారాలు, స్తూపాలు స్థాపించి భౌద్ధ – జైన బోధనలను కొనసాగించిన వారు? శ్రమణులు
- హిందువులు ఏయే సూత్రాలను విశ్వసిస్తారు? సర్వేజనా సుఖినోభవంతు, లోకాసమస్తా సుఖినోభవంతు అనే సూత్రాలను
- హిందూ మతం ఎప్పటి నుండి వాడుకలోకి వచ్చింది? సా.శ 1000 సంవత్సరాల తరువాత
- హిందూమతం వాడుకలోకి రాకముందు హిందువులు ఎవరిగా మనకు పరిచయం? వైదికుల యొక్క అనుచరులుగా
- హిందూ మత ముఖ్య లక్షణాలు ఎప్పుడు రూపుదిద్దుకొన్నాయి? సా.శ 500 సంవత్సరాలకు పూర్వం
- సా.శ 400 కాలం నాటి శివ లింగం ఎక్కడ ఉంది? విదిశ (మధ్య ప్రదేశ్) పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు
- హిందూ మత పవిత్ర గ్రంధాలు?
- వేదాలు
- ఉపనిషత్తులు
- రామాయణం
- మహా భారతం (భగవద్గీత తో కలిపి)
- పురాణాలు

భాగవతులు,శైవులు
- భాగవతులు ఎవరిని ఆరాధిస్తారు? విష్ణువు లేదా నారాయనుడు
- భాగవతులు విష్ణువును ఏ విధంగా విశ్వసిస్తారు? పరమాత్మ అని, విశ్వాన్ని సృష్టించిన వాడు అని, అతి శక్తి మంతుడు అని, అన్ని తెలిసినవాడు అని
- భూమిమీద విష్ణువు యొక్క ముఖ్య రూపాలు ? రాముడు, కృష్ణుడు
- భాగవతుల దృష్టిలో మోక్షాన్ని ఎలా పొందగలం? విష్ణువుని పూజించడం, భక్తితో ఆరాధించడం ద్వారా మాత్రమే (యజ్ఞాలు చేయడం, బ్రాహ్మణులకు దానాలు ఇవ్వడం, వేదాలు వల్లివేయడం అవసరం లేదని భావించారు)
- జైనమత గురువులకు గల పేరు? తీర్థంకరులు
- సుమారు 2200 సంవత్సరాల క్రితానికి చెందిన పురాతన నాణాలలో బలరాముడు వేటిని ధరించాడు? నాగలి, ముసలము (కృష్ణుడు చక్రము, శంకము, ఖడ్గాములను ధరించాడు)
- బుద్దుడు, తీర్తంకరులను పూజించిన ప్రాంతాలు ఎక్కడ కనుగొన్నారు?
| తెలంగాణా | నేలకొండపల్లి |
| ఫణిగిరి | |
| ఆంధ్రప్రదేశ్ లోని | అమరావతి నాగార్జునకొండ |
| జగ్గయ్యపేట | |
| భట్టిప్రోలు |
కథకులు

- కథకులు బుద్దుని కధలను ఏ పేరుతో రాసారు? జాతక కథలు అనే పేరుతో
- కథకులు శివుని, విష్ణువు కథలను ఏ పేరుతో రాసారు? పురాణాలు
- సమస్యల పరిశ్కారానికీ మోక్షాన్ని పొందడానికి దేవుణ్ణి అరాదించడమే సులభ మార్గం అని చెప్పినవారు? కథకులు
భగవంతుడి పట్ల ప్రేమ – భక్తీ ఉద్యమం
- భక్తీ ఉద్యమం ఎక్కడ మొదలైనది? తమిళనాడు లో
- భక్తులు దేవుని స్తుతిస్తూ స్థానిక బాషలలో రాసిన పాటలు ఎప్పుడు గ్రంధస్తం చేసారు? సా.శ 1100 లలో
(ఫలితంగా తిరుమల, శ్రీకాళహస్తి దేవాలయాలకు అధిక ప్రాధాన్యత వచ్చింది)
ఆళ్వారులు – నయనార్లు
- ఆళ్వారులు ఎవరి భక్తులు ? విష్ణు భక్తులు (ప్రధానమైనవారు 12 మంది)
- 12 ప్రధాన ఆళ్వారులలో ముఖ్యులు? పెరియాళ్వారు, నమ్మాళ్వారు
- ఆళ్వారులలో ఒకే ఒక మహిళ ఎవరు ? ఆండాళ్ ఆళ్వారు
- అండాళ్ ఆళ్వారు ఎవరి కుమార్తె? పెరియాళ్వారు కుమార్తె
- సృష్టి పద్యాన్ని ఎవరు రాసారు? నమ్మాళ్వారు
- సృష్టి పద్యం ఏ పాదం తో మొదలవుతుంది? తండ్రివి నీవే ఓ పరమాత్మా (విష్ణు)
- సృష్టి పద్యం లో నమ్మాళ్వారు? దేనిని తెలియజేసాడు? విష్ణువును ప్రపంచ సృష్టికర్త గాను, తన తండ్రిగాను చెప్పాడు.
- నాయనార్లు ఎంతమంది? 63 మంది
- నాయనార్లు ఎవరు? శివభక్తులు (వీరిలో కన్నప్ప లాంటి వేటగాళ్ళు, నందనర్, పుల్లయ్య లాంటి నిమ్నకులాల వారు ఉన్నారు)
- ఒక ఆలయం నుండి మరొక ఆలయానికి వెళ్లి శివుని గూర్చి కీర్తనలు పడిన నాయనార్లు ఎవరు? అప్పర్, మణిక్కవాచకర్ (ఇలా పాటలు పడినవారిలో మహిళలు కరైక్కాలమ్మ, అమ్మయ్యార్)
- భయం లేదు మాకు ఎరాజైనా అనే పద్యాన్ని రాసిన నాయనారు ఎవరు? అప్పార్
- భయం లేదు మాకు ఎరాజైనా అనే పద్య౦ లో అప్పార్ దేనిని పేర్కొన్నాడు? శివ భక్తులు ఏ రాజుకు, చావుకూ, రోగాలకు, నరకానికి భయపడరు. వారెప్పుడు నిత్య సంతోశులె
- పేదలైనా రోగులైనా దళితజాతి వారైనా శైవభక్తులైతే చాలు వారిపట్ల తమకు అపార గౌరవ౦ అని పెర్కొన్నవారు? అప్పార్
- పరమ శివా నిన్ను భజియింతును నాకు ముక్తిని ఇమ్ము అనే పద్యాన్ని ఎవరు రాసారు? మాణిక్యవాచకర్
- నన్నీ ప్రపంచం పిచ్చివాడు అన్నా, లోకులు నన్ను చూసి పరిహసించినా ఎన్నడు సిగ్గుపడను. అన్నీ భూషణాలు గా భావిస్తా అని పెర్కొన్నవారు? మాణిక్యవాచాకర్
క్రైస్తవ మతం

- క్రైస్తవ మతం ఏ ప్రాంతం లో అభివృద్ధి చెందింది? ఇజ్రాయెల్, పాలస్తీనా లలో (తూర్పు మధ్య ప్రాంతం)
- సెయింట్ థామస్ బాసిలికా చర్చి ఎక్కడ ఉంది? చెన్నై
- సెయింట్ థామస్ బాసిలికా చర్చిని ఎప్పుడు నిర్మించారు? 1523 లో (2 వేల సంవత్సరాల క్రితం భారతదేశం వచ్చిన సెయింట్ థామస్ పేరున ఈ చర్చిని నిర్మించారు)
- క్రైస్తవ మతం ఎవరి పేరుమీద స్థాపించబడినది? యేసు క్రీస్తు పేరుమీద
- యేసు క్రీస్తు ఎక్కడ జన్మించారు? బెత్లెహేము (జేరుసలేము దగ్గర ఇజ్రాయెల్ దేశంలో) 2000 సంవత్సరాల క్రితం
- యేసు క్రీస్తు దేనిని ప్రకటించారు? శాంతి, ప్రేమ, కరుణలు గూర్చి
- మనం శత్రువునైన ప్రేమతో గెలవగలం అని నమ్మినవారు? యేసు క్రీస్తు (దెబ్బకు దెబ్బ వంటి పద్దతులు అనుసరించ కూడదు అని పేర్కొన్నారు)
- క్రైస్తవులు పవిత్ర గ్రంధం? బైబిల్ (యేసు క్రీస్తు బోధనలు, పర్వతం మీద ప్రసంగం వంటి అనేక అంశాలు ఉన్నాయి)
- సెయింట్ థామస్ ఎవరు? యేసు క్రీస్తు శిష్యుడు (రోమన్ వర్తకులతో కలిసి భారత దేశానికి యేసు బోధనలను తీసుకువచ్చాడు)
ఇస్లాం మతం

- ఇస్లాం మతం ఎక్కడ రూపుదిద్దుకొంది? అరేబియా లో
- ఇస్లాం మతాన్ని ఎవరు స్థాపించారు? మహమ్మద్ ప్రవక్త
- మహమ్మద్ ప్రవక్త ఎక్కడ జన్మించారు? మక్కాలో (అరేబియా) 570 లో
- దేవుడు ఒక్కడే మానవులంతా భగవంతుని సృష్టి అని బోధించినవారు? మహమ్మద్ ప్రవక్త
- అల్లాకు రూపం లేదు అని ప్రకతిన్చినవారు? మహమ్మద్ ప్రవక్త
- అల్లా దూత గా ఎవరిని పరిగనిస్తారు? మహ్మద్ ను
- ఇస్లాం మత పవిత్ర గ్రంధం? ఖురాన్ (అల్లా బోధనలు ఖురాన్ లో ఉన్నాయి అని ముస్లిం లు అంటారు)
- అల్ ఫాతిహ అనగా? అల్లాహ్ మాత్రమే స్తుతింప దగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు.అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు
- భారతదేశం లో మొట్టమొదట నిర్మించ బడిన మసీదు? చేరమాన్ మసీదు (కేరళ)
- ఇస్లాం మతం భారతదేశానికి ఎలా వచ్చింది? భారతదేశం లో ఓడలను సందర్శించిన అరబ్ వర్తకుల ద్వారా (ఇస్లాం లోకి మారిన అరబ్ టర్కిష్ విజేతల ద్వారా)
- ఇటువంటి ఉపయోగకరమైన టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి kings dsc యు ట్యూబ్ ఛానల్ మరియు kingsdsc.in వెబ్సైట్








