Our Earth

9.1 భూమి – మనం

  • Our Earth మానవ చరిత్ర అంతా పసుపు పచ్చ వృత్తం లోని చిన్న చుక్కలో జరిగింది అని పెర్కొన్నవాడు? కార్ల్ సగాన్
  • అంతరిక్షం నుండి తీసిన భూమి యొక్క ఫోటోను ఏ పేరుతో పిలుస్తారు? పాలిపోయిన నీలం చుక్క
  • ఈ భూమిమీద మానవ జీవితం ఉద్భవించి ఎంత కాలం అయినది? లక్షకు పైగా సంవత్సరాలు

మన విశ్వం, సూర్యుడు, భూమి  

  • భూ కేంద్ర సిద్దాంతాన్ని ప్రతి పాదించిన వారు? టాలమి
  • గ్రహణాలు, చలనాలు, విశ్వం యొక్క అనంతమైన ప్రక్రుతి గూర్చి ప్రస్తావించిన ప్రాచీన భారతీయ గ్రంథాలు? వేదంగజ్యోతిష్యం సూర్య సిద్దాంతం, భాగవత పురాణాలు
  • సూర్య కేంద్ర సిద్దాంతాన్ని ప్రతిపాదించినవారు? కోపర్నికస్
  • గెలాక్సీ అనగా? నక్షత్రాల సమూహాలు

Our Earth (భూమి ఒక గ్రహం)

  • కక్ష్య అనగా? సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారి (ప్రామాణిక దీర్ఘ వృత్తాకార కక్ష్య)
  • కక్ష్య తలం అనగా? సూర్యుని  చుట్టూ భూమి తిరిగే మార్గం ఒకే తలం లో ఉంటుంది దీనికి గల పేరే
  • భూ పరిబ్రమణ వేగం? గంటకి 1,07,200 కిమీ
  • భూమికి సూర్యునికి మధ్య అత్యధిక దూరం? 152 మిలియన్ కిమీ
  • భూమికి సూర్యునికి మధ్య అత్యల్ప దూరం? 147 మిలియన్ కిమీ
  • భూమి సూర్యుని చుట్టూ ఒక పరిబ్రమానం పూర్తిచేయడానికి పట్టు సమయం? 365 ¼ రోజులు (ఒక సంవత్సరం)
  • భూమి మీద కాలాలు ఏర్పడడానికి గల కారణాలు
    • భూ బ్రమణం
    • భూ పరి బ్రమణం
    • భూమి చుట్టూ చంద్రుడు నెలకు ఒక సారి తిరగడం
    • సూర్యుడు తన చుట్టూ తానూ తిరగడం
    • కక్ష్యతలం తో పోలిస్తే భూ అక్షయం వంగి ఉండడం
    • భూమి గోళాకారం లో ఉండడం
    • పరిబ్రమణ కాలం లో సూర్యుని నుండి భూమి యొక్క దూరం
  • Eorthe గ్రీకు పదం యొక్క అర్ధం ఏమిటి? నేల, మట్టి, పొడినేల
  • భూమికి (Our Earth) సంస్కృతం లో గల పేర్లు? పృథ్వీ, ధరణి, అవని, పుడమి (భారతీయ భాషలలో భూమికి ఉన్న పేర్లు సంస్కృత మూలాల నుండి వచ్చినవే)
  • ఎక్కువ మంది శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం భూమి ఎప్పుడు ఏర్పడింది? 4 ½ బిలియన్ సంవత్సరాల క్రితం

భూమి అంతర్గత నిర్మాణం

  • భూ కేంద్రం ఎన్ని కిమీ లోతులో ఉంది? 6000 కిమీ పైన
  • భూమిని (Our Earth) ప్రధానంగా ఎన్ని పొరలుగా విభజించారు? 3 (భూ పటలం, భూ ప్రావారం, భూ కేంద్ర మండలం)

భూ పటలం

  • భూ పటలం (Our Earth) ఎన్ని కిమీ వరకు విస్తరించి ఉంది? 100 కిమీ వరకు (మనం నివసించే పొర)

భూ ప్రావారం

  • భూ ప్రావారం ఎన్ని కిమీ వరకు విస్తరించి ఉంది? 100 కిమీ నుండి 2900 కిమీ వరకు
  • భూ ప్రావారం లో ప్రధానంగా ఉండే రసాయనాలు? సిలికేట్లు (పై భాగం మెత్తగా ఉండి తేలుతూ ఉంటుంది)

భూ కేంద్ర మండలం

  • భూ కేంద్ర మండలం ఎన్ని కిమీ వరకు విస్తరించి ఉంది? 2900 కిమీ నుండి 6376 కిమీ వరకు
  • భూ కేంద్ర మండలం లో ప్రధానంగా ఉండే పదార్ధాలు? ఇనుము, నికెల్
  • భూ కేంద్రాన్ని ఎన్ని భాగాలు గా విభజించారు? 2 (బయటి కేంద్ర భాగం, లోపలి కేంద్ర భాగం)
  • బయటి కేంద్రం లో ద్రవ రూపం లో ఉండే లోహాలు? ఇనుము నికెల్ (2900 కిమీ -5100 కిమీ )
  • లోపలి కేంద్ర భాగం లో ఏ లోహాలు ఉంటాయి? ఇనుము బంగారం వంటి భార లోహాలు (5100 కిమీ -6376 కిమీ)
  • భూమి ఘన పరిమాణం లో భూ పటలం ఎంత శాతం ఉంటుంది? 1% మాత్రమే (భూ ప్రావారం 16%, భూకేంద్ర మండలం 83% ఉంటుంది)

భూపటలం (Our Earth) యొక్క కదలికలు

  • ఖండ చలన సిద్దాంతాన్ని ప్రతిపాదించిన వారు? అల్ఫ్రెడ్ వెజినర్ (జర్మని) వాతావరణ భూ భౌతిక శాస్త్రవేత్త
  • పాంజియా అనే గ్రీకు పదానికి అర్ధం ? మొత్తం భూమి (220 మిలియన్ సంవత్సరాల క్రితం)
  • పాంజియా చుట్టూ ఉన్న సముద్రానికి గల పేరు? ఫాంథాల్సా
  • పాంజియా మధ్యలో ఉన్న సముద్రానికి గల పేరు? టెథిస్
  • పాంజియా ఉత్తర భూ భాగానికి గల పేరు? లారేశియా
  • పాంజియా దక్షిణ భూ భాగానికి గల పేరు? గొండ్వానా
  • ప్రస్తుతం ఉన్న ఖండాలు ఏ యుగం నుండి ఏర్పడ్డాయి? మెసోజోయిక్ యుగం నుండి (మాధ్యమిక జీవ యుగం)
  • లారేశియా లేదా అంగరా భూమి లో భాగాలు? ఉత్తర అమెరికా, గ్రీన్ ల్యాండ్, యురేషియా మొత్తం
  • గొండ్వానా భూ భాగం లో భాగాలు? దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారత్, అరేబియా, మలేషియా, ఈస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా
  • లారేశియా, గొండ్వాన భాగాలు ఏ సముద్రం చేత వేరు చేయబడ్డాయి? టెథిస్ సముద్రం చేత

భూమి గ్రిడ్ వ్యవస్థ

  • హైదరాబాద్ నగర అక్షాంశ రేఖాంశాలు ఏవి? 17°38నిమిషాల ఉత్తర అక్షాంశాలు, 78°48 నిమిషాలు తూర్పు రేఖాంశాలు
  • గ్రిడ్ అనగా? గ్లోబు పై గీసిన అక్షాంశ రేఖాంశాల వలన ఏర్పడిన చతురస్రాకార భాగం

అక్షాంశాలు

  • భూ గోళం మధ్య లో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని ఏమంటారు? భూ మధ్య రేఖ (ఉత్తర దక్షిణ దూరాలకు సమాన దూరం లో ఉంటుంది)
  • 0 డిగ్రీల అక్షాంశానికి గల పేరు? భూ మధ్య రేఖ (భూమిని 2 సమాన భాగాలు గా చేస్తుంది)
  • అక్షాంశాల రేఖంశాలను వేనిలో సూచిస్తారు? డిగ్రీలు (°), నిమిషాలు (‘), సెకండ్లు (‘’) లో
  • లాటిట్యూడ్ (అక్షాంశాలు) అనే పదం ఏ లాటిన్ పదం నుండి ఉద్భవించింది? లాటిట్యూడో నుండి
  • లాటిట్యూడో అనగా అర్ధం? వెడల్పు
  • అక్షాంశాల మొత్తం? 0 డిగ్రీల భూ మధ్య రేఖ + 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు + 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాలు (మొత్తం 181)

(ఉత్తరం వైపు అక్షంశాన్ని “ఉ తోను, దక్షిణం వైపు ఉన్న అక్షంశాలను “ద తోను సూచిస్తారు)

  • అక్షంశాలన్నిటిలో పొడవైన అక్షాంశం? భూ మధ్య రేఖ
  • అక్షాంశాలు ధ్రువాల వద్ద ఏవిధంగా ఉంటాయి? బిందువులు గా
  • భూ మధ్య రేఖ – ఉత్తర ధృవం మధ్య గల భాగానికి పేరు? ఉత్తరార్ధ గోళం
  • భూ మధ్య రేఖ – దక్షిణ దృవం మధ్య గల భాగానికి గల పేరు? దక్షిణార్ధ గోళం  
  • ఒక ధృవం నుండి మరొక ద్రువానికి మధ్య గల అక్షంశాలు? 180 (భూమధ్య రేఖ కాకుండా )
  • అర్ధగోలాన్ని ఆంగ్లం లో ఏ పేరుతో పిలుస్తారు? హేమీ స్పియర్
  • హేమీ అనగా అర్ధం? సగ భాగం

రేఖాంశాలు

  • రేఖాంశాన్ని ఆంగ్లం లో ఏమంటారు? లాంగిట్యూడ్
  • లాంగిట్యూడ్ అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది? లాంగిట్యూడో (లాటిన్ పదం)
  • లాంగిట్యూడో అనగా అర్ధం? పొడవు
  • రేఖంశాలు అనేవి ___ ? అర్ధ వృత్తాలు (అక్షాంశాలు వృత్తాలు)
  • భూమి గోళాకారం గా ఉంది అని ఉజ్జయిని గుండా మధ్యాహ్న రేఖ పొతు౦ది అని పేర్కొన్న ప్రాచీన భారతీయ గ్రంథం? సూర్య సిద్దాంతం
  • ఆర్యబట్ట ప్రకారం మధ్యాహ్న రేఖలు ఏ ప్రాంతాల గుండా పయనిస్తాయి? ఉజ్జయిని, శ్రీలంక, రోహ తక్
  • అలెగ్జాండ్రియా గుండా వెళ్ళే మధ్యాహ్న రేఖ తో పాటు మధ్యాహ్న రేఖల గూర్చి తెలిసిన ప్రాచీన ఖగోళ భారతీయ శాస్త్రేవేత్త? వరాహ మిహురుడు
  • ప్రాచీన భారతీయులు దేనిని కొలవడం ద్వారా ఒక ప్రదేశ అక్షంశాన్ని తెలుసుకొనేవారు? ధ్రువ నక్షత్రం యొక్క వాలును కొలవడం ద్వారా
  • ప్రామాణిక రేఖంశంగా ఏ రేఖాంశాన్ని పరిగనిస్తారు? 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశాన్ని (గ్రీన్విచ్ మెరిడియన్ అంటారు)
  • గ్రీనిచ్ రేఖాంశం ఏ ప్రాంతం గుండా పోతుంది? ఇంగ్లాండ్ లోని నక్షత్ర శాల గుండా పోతుంది
  • రేఖాంశాల మొత్తం ? 360 (0 – 179 తూర్పు రేఖాంశాలు, 0 – 179 పశ్చిమ రేఖాంశాలు, 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖంశ౦, 0 గ్రీనిచ్ రేఖాంశం)
  • 0 డిగ్రీల రేఖాంశానికి సరిగా వ్యతిరేఖ దిశలో ఉన్న రేఖాంశం? 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం (యాంటి మెరీడియన్)
  • అక్షాంశాలకు గల పేరు? సమాంతర రేఖలు
  • రేఖంశాలకు గల పేరు? మెరిడియన్లు (అనగా మధ్యాహ్నం అని అర్ధం), మధ్యాహ్న రేఖలు
  • మెరిడియన్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి ఉద్భవించింది? మెరిడియానస్ నుండి
  • ఒక రేఖాంశం దాటడానికి యెంత సమయం పడుతుంది? 4 నిముషాలు

రేఖాంశాలు, సమయం

  • ప్రపంచాన్ని మొత్తం ఎన్ని కాల మండలాలు గా విభజించారు? 24 కాల మండలాలు గా (టైం జోన్స్)
  • ఒక్కొక్క కాలం మండలం ఎన్ని డిగ్రీల మేర ఉంటుంది? 15 డిగ్రీల మేర
  • ఒక కాల మండలానికి మరొక కాల మండలానికి ఎంత సమయంస్ ఉంటుంది? 1 గంట (15° * ఒక రేఖాంశానికి 4 నిమిషాలు = 60 నిమిషాలు)

(గ్రీనిచ్ రేఖ నుండి తూర్పు వైపు వెళుతుంటే సమయం కలపాలి. పడమర వైపు వెళుతుంటే సమయం తీసివేయాలి)

  • 0° రేఖాంశం వద్ద సోమవారం మధ్యాహ్నం అయినపుడు 180° రేఖాంశం వద్ద ఎంత సమయం అవుతుంది? అర్ధ రాత్రి 12 గంటలు అవుతుంది (180°రేఖాంశానికి పడమటి వైపు మంగళ వారం మొదలవుతూ ఉంటె తూర్పు వైపు సోమవారం అయిపోతూ ఉంటుంది)
  • భారతదేశం లో ఎన్ని గంటల కాల ప్రాంతాలు ఉంటాయి? 2 గంటల కాల ప్రాంతాలు (దీని అర్ధం దేశం తూర్పు పశ్చిమ ప్రాంతాల మధ్య ఒక గంట సమయం తేడా ఉంటుంది. ఈశాన్య ప్రాంతాలలో ఇంకా ఎక్కువ తేడా ఉంటుంది)
  • తూర్పు నుండి పడమర కు పయనిస్తున్నపుడు ప్రతి ఒక్క డిగ్రీకి ____? 4 నిమిషాలు కోల్పోతారు (పడమర నుండి తూర్పు కు పయనిస్తున్నపుడు ప్రతి డిగ్రీకి 4 నిమిషాలు అదనంగా పొందుతారు)
  • భారత్ ప్రామాణిక రేఖంశంగా దేనిని నిర్ణయించారు? 82 ½ డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని
  • భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖంశానికి మధ్య కాల వ్యత్యాసం ఎంత? 5 ½ గంటలు ముందు
ప్రదేశంఅక్షాంశంరేఖాంశం
కన్యాకుమారి8° 05’ ఉత్తర అక్షాంశం77° 32’ తూర్పు రేఖాంశం
ఇంపాల్24° 49’ ఉత్తర అక్షాంశం93° 56’ తూర్పు రేఖాంశం
జైసల్మేర్26° 55’ ఉత్తర అక్షాంశం70° 54’ తూర్పు రేఖాంశం
పూనా18° 31’ ఉత్తర అక్షాంశం73° 51’ తూర్పు రేఖాంశం
పాట్నా25° 36’ ఉత్తర అక్షాంశం85° 08’ తూర్పు రేఖాంశం

ఇటువంటి ఉపయోగకరమైన టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి kings dsc యు ట్యూబ్ ఛానల్ మరియు kingsdsc.in వెబ్సైట్

Leave a Comment