ప్రధాన భూ స్వరూపాలు? పర్వతాలు, పీటభూములు, మైదానాలు
భూమి మీద ఎత్తును దేని ఆధారంగా కొలుస్తారు? సముద్ర మట్టం ఆధారంగా
నింపూరు గ్రామం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? 50 మీటర్లు ఎత్తులో
కాంటూరు రేఖలు అనగా ? సమాన ఎత్తు ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలు (వీటినే సమతల రేఖలు అంటారు)
కాంటూరు రేఖల లక్షణాలు
వంకర టింకర గా ఉంటాయి
ఒకదానికి ఒకటి ఖండించు కోవు
రెండు కాంటూరు రేఖల మధ్య దూరం భూ స్వరూపం పై ఆధారపడి ఉంటుంది
భూ వాలు ఎత్తుగా ఉంటె కాంటూరు రేఖలు ఒకదానికి ఒకటి దగ్గరగా ఉంటాయి
భూ వాలు తక్కువగా ఉంటె కాంటూరు రేఖలు దూరంగా ఉంటాయి
ఎత్తును చూపే పటాల వల్ల ఉపయోగాలు (Reading Maps of Different kinds)
ఈ పటాలు భూ ఉపరితల స్వభావాన్ని తెలుసుకోవడానికి ఉపయోగ పడతాయిపర్వతాలు లోయలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకో వచ్చురోడ్లు వేసేటపుడు, ఆనకట్టలు కట్టేటపుడు ఈ పటాలు బాగా ఉపయోగ పడతాయిహెచ్చు తగ్గుల ప్రాంతాలలో ఏ మర్గాన రోడ్లు వేయాలో నిర్ణయించడానికి ఉపయోగ పడతాయి
ఆనకట్టలు కట్టేటపుడు ఎంత ప్రదేశం నీరు మునుగుతుందో లెక్క వేయడానికి ఉపయోగపడతాయి
MSL అనగా? సగటు సముద్ర మట్టం (Mean Sea Level)
గోదావరి నది ఏ దిక్కుగా ప్రవహిస్తుంది? తూర్పు వాలు దిక్కుగా (Reading Maps of Different kinds)
Rain and Rivers
7.2 వర్షం – నదులు
భూ ఉపరితలం పై ఎంత శాతం నీరు ఆవరించి ఉన్నది? 71%
మొదటి భాగం
భాష్పిభవనం అనగా? నీరు ఆవిరి కావడం
మేఘాలు ఎలా ఏర్పడుతాయి? చిన్న నీటి బిందువులతో
మేఘాలు అనగా ? గాలిలో తేలియాడుతున్న చిన్న నీటి బిందువుల సమూహాలు
ద్రవీభవనం అనగా? నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడాన్ని
జలచక్రం అనగా? సముద్రం లో నీరు ఆవిరి అయి మేఘాలుగా ఏర్పడి వర్షంగా పై తిరిగి తిరిగి సముద్రం లో కలవడం
అవపాతం అనగా? గాలిలోని తేమ భూమి మీద పడడాన్ని అవపాతం అంటారు
అవపాత రూపాలు ఏవి? మంచుగా, వర్షంగా, పొగమంచుగా, తుషారం గా వడగండ్లు గ అనేక రూపాలు
ఆర్ద్రత అనగా? వాతావరణం లో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరి (ఉష్ణోగ్రత తో పాటు ఆర్ద్రత పెరిగినపుడు ఉక్కగా ఉండి జిగటగా ఉంటుంది)
పవనాలు ఎలా వీస్తున్నాయి? అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం మీదుగా (ఋతుపవనాలు అంటారు)
నైరుతి ఋతు పవనాలు ఏకాలం లో వీస్తాయి? వేసవి లో (నైరుతి నుండి వేస్తాయి కాబట్టి ఆపేరు వహ్చింది)
ఋతుపవన శాఖలు ఎన్ని? 2 (అరేబియా సముద్రం నుండి వీచేవి, బంగాళాఖాతం నుండి వీచేవి)
తెలంగాణాలో ఉష్ణోగ్రతలు ఏ నేలనుండి ఏ నెలల మధ్య ఉంటాయి? మార్చి నుండి జూన్ వరకు
నైరుతి ఋతుపవనాలు తెలంగాణా రాష్ట్రానికి ఎప్పుడు చేరుకొంటాయి? జూన్ నాటికి (తూర్పు, ఉత్తర ప్రాంతాలు అధిక వర్షాన్ని పొందుతాయి)
రాష్ట్రములో అతి తక్కువ వర్షపాతం పొందే ప్రాంతం? మహబూబ్ నగర్, జోగులాంబ జిల్లాలు
పశ్చిమ కనుమలలో కురిసే వర్షపాతం ఏరకమైనది? పర్వతీయ వర్షపాతం
బంగాళాఖాతం లో తుఫానులు ఎనెలల మధ్య సంభవిస్తాయి? మే నుండి అక్టోబర్ మధ్య
ఈశాన్య ఋతుపవనాలు ఏ నెలల మధ్య వీస్తాయి? అక్టోబర్ మరియు నవంబర్ నెలలలో
ఈశాన్య ఋతుపవనాలకు మరొక పేరు? తిరోగమన ఋతుపవనాలు
వర్షపాతాన్ని కొలిచే పరికరం? వర్శమాపకం
ప్రామాణిక ప్రదేశం లో కురిసిన వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? సెంటి మీటర్ లలో
రెండవ భాగం
ఉపనదులు అనగా? అందులలో కలిసే చిన్న వాగులు సెలయేర్లు
డెల్టాలు ఎక్కడ అనగా? నది సముద్రం లో కలిసే చోటు
తూర్పు కోస్తాలో విశాల డెల్టాలు ఏ నదులకు ఉన్నాయి? గోదావరి కృష్ణా నదులకు
వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రదేశాలో ప్రారంభం అయ్యే నదులకు ఉదాహరణ? దిండి, మంజీరా, మూసి
నదీ తాలూకు వరదమైదానం అనగా? నది మొత్తం వెడల్పు తో ఎత్తైన ఒడ్డు కలిగి ఇసుక రాళ్ళతో నిండి ఉంటుంది. వీటి మధ్య నది సన్నని కాలువ లాగ ప్రవహిస్తుంది. అక్కడ చెట్లు పెరిగే అవకాశం లేదు. ఈ చెట్లు పెరిగే భాగాన్ని నదీ తాలూకు వరద మైదానం అంటారు
మొక్కల పెంపకాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వాలు ఏ పేరుతో కార్యక్రమాలు ప్రారంభించాయి? పచ్చదనం పేరుతో
చెట్లు పెంపకం అనే భారీ కార్యక్రమం లో ముందంజ లో ఉన్న రాష్ట్రము? తెలంగాణా
మొక్కల పెంపకం లో తెలంగాణా రాష్ట్ర విశిష్టత
230 కోట్ల మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది
ప్రతి గ్రామం లో 40 వేల మొక్కలు పెంచాలని
ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం లో 40 లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకొంది
గ్రామస్థాయి హరిత రక్షణ కమిటిలు ఎవరి అధ్యక్షతన ఏర్పడినవి? సర్పంచ్ అధ్యక్షతన
తూర్పు కోస్తాలో భయంకర తుఫాను ఎప్పుడు సంభవించింది? 1977 నవంబర్ లో (6 మీటర్ల ఎత్తున సముద్ర అలలు కోస్తాతీరం లో 100 గ్రామాలను సర్వనాశనం చేసి 9941 మంది ప్రాణాలు బలిగొన్నాయి)
కలుషిత నీరు త్రాగడం వల్ల వచ్చే అంటువ్యాధులు? కలరా, వీరేచనాలు, కామెర్లు
తుఫానుల వల్ల కలిగే తక్షణ దుష్పలితాలు? జననష్టం, పంటనష్టం, ఆస్తినష్టం
ప్రక్రుతి వైపరీత్యాల కొరకు ఏర్పాటు చేసిన అత్యవసర కిట్ లో ఏ వస్తువులు ఉండాలి? ముఖ్యమైన కాగితాలు, ఆహర పదార్దాలు, డబ్బు, అత్యవసర సమయం లో సంప్రదించే ఫోన్ నెంబర్స్
డయేరియా ప్రబలినపుడు వేటిని సేవించాలి? టీ, దికాషను, గంజి, లేత కొబ్బరి నీళ్ళు
హాలోజెన్ బిళ్ళల యొక్క ఉపయోగం ఏమిటి? నీటిని శుద్ధి చేయడానికి ఈ బిళ్ళలు ఉపయోగ పడతాయి
ఇటువంటి ఉపయోగకరమైన టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి kings dsc యు ట్యూబ్ ఛానల్ మరియు kingsdsc.in వెబ్సైట్