10.1 భౌగోళిక స్వరూపాలు

- India Relief Features: భౌగోళిక స్వరూపాలు అనగా? పర్వతాలు, పీటభూములు, మైదానాలు
ఉనికి
- ఒక ప్రదేశాన్ని కచ్చితంగా సూచించడానికి ఉపయోగించేవి? అక్షాంశాలు, రేఖాంశాలు
- భారతదేశ విస్తరణ అక్షాంశ రేఖాంశాల పరంగా? 8°4 ′ నుండి 37°6 ′ ఉత్తర అక్షాంశాలు, 68° 7 ′ నుండి 97°25 ′ తూర్పు రేఖాంశాల మధ్య (టెక్స్ట్ బుక్ లో 8 – 50 డిగ్రీలు ఉత్తర రేఖాంశాల మధ్య 68 డిగ్రీలు దక్షిణ మరియు 9 డిగ్రీలు తూర్పు అక్షాంశాల మధ్య అని తప్పుగా పేర్కొనబడినది. పేజి నెంబర్ 2లో గమనించగలరు)
- భారత దేశం ఏ అర్ధ గోళం లో ఉంది (India Relief Features)? ఉత్తరార్ధ గోళం లో ( టెక్ట్ బుక్ లో దక్షిణార్ధ గోళం అని పేర్కొనబడినది గమనించగలరు పేజి నెంబర్ 2లో)
- తెలంగాణా ఏయే అక్షాంశాలు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? 15° 46′ నుండి 19°47′ ఉత్తర అక్షాంశాలు, 77°16′ నుండి 81°43′ తూర్పు రేఖాంశాల మధ్య
- ద్వీపకల్పం అనగా? 3వైపులా నీరు ఒక వైపు భూ భాగం కలిగి ఉండడం చేత
- ఇందిరా పాయింట్ ప్రాముఖ్యత
- భారతదేశానికి అత్యంత దక్షిణాన ఉన్న భూ భాగం చివరి (బిందువు) (భారత ప్రధాన భూ భాగానికి దక్షిణాన ఉన్న చివరి బిందువు కన్యాకుమారి)
- గ్రేట్ నికోబార్ దీవిలో ఉంది
- ఇందిరా పాయింట్ అనే పేరును 1984 లో పెట్టారు
- 2004 సునామీలో ఈ ప్రాంతం లో కొంత సముద్రం లో మునిగి పోయింది
- గుజరాత్ ఓడిస్సా సముద్ర తీర రేఖల పొడవు ఎంత? గుజరాత్ తీర రేఖ పొడవు 2340.62 km, ఓడిసా తీరరేఖ పొడవు 574.71 km
- భారతదేశ ప్రామాణిక రేకాంశం గా దేనిని గుర్తించారు? 82°30′ తూర్పు రేఖాంశాన్ని
- 82°30′ తూర్పు రేఖాంశ0 ఏ ప్రాంతం మీదుగా పోతుంది? అలహాబాద్ మీదుగా
- గ్రీనిచ్ మరియు భారత ప్రామాణిక కాలానికి మధ్య వ్యత్యాసం ఎంత? 5 గంటల 30 నిమిషాలు
- భారతదేశం తూర్పు పడమర లుగా ఎంత దూరం విస్తరించి ఉంది? 2933 కిమీ లు
- భారతదేశం ఉత్తర దక్షినాలు గా ఎంత దూరం విస్తరించి ఉంది? 3214 కిమీ
భూగర్భ నేపథ్యం

- ప్రపంచ భూ భాగం 2 ప్రధాన ఖండాలు గా ఏర్పడ్డాయి అవి ఏవి? అంగరా భూమి (లరేశియా). గొండ్వానా
(భారత భూ భాగం గొండ్వానా భూ భాగం లో ఉంది)
- గొండ్వానా భూ భాగం ఎప్పుడు ముక్కలు గా విడిపోయింది? 20 కోట్ల సంవత్సరాల క్రితం
- భారత ద్వీపకల్ప ఫలకం ఏ దిశగా పయనించి యురేషియా ఫలకం (అంగరా భూమి) తో డీ కోట్టింది ? ఈశాన్యంగా పయనించి (ఇలా ఒత్తిడి ముడుతలు పడే ప్రక్రియ వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి)
- భారతదేశం లో ఉత్తర సమతల మైదానాలు ఎలా ఏర్పడ్డాయి (India Relief Features)? ద్వీపకల్ప పీటభూమి అంచులు పగలడం వల్ల పెద్ద లోయ ఏర్పడింది. ఈ లోయలోకి ఉత్తరాది నుండి హిమాలయ నదులు, దక్షిణాది నుండి ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రు తో మేటలు వేయబడి మైదానాలు ఏర్పడ్డాయి.
India Relief Features (ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు)

- భారత దేశాన్ని ఎన్ని భౌతిక స్వరూపాలు గా (India Relief Features) విభజించారు? 6 (హిమాలయాలు, గంగా సింధు మైదానం, ద్వీపకల్ప పీటభూమి, తీరప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం, దీవులు)
హిమాలయాలు
- హిమాలయాలు ఎన్ని కిమీ పొడవుతో విస్తరించి ఉన్నాయి (India Relief Features) ? 2400 కిమీ పొడవుతో (ప. ప్రాంతం లో 500 కిమీ వెడల్పుతో, మధ్య తూర్పు ప్రాంతాలలో 200 కిమీ వెడల్పుతో ఉన్నాయి)
హిమాద్రి
- హిమాలయాలలో అన్నిటికన్నా ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఏ పేరుతో పిలుస్తారు? హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు అని (పర్వతాల సగటు ఎత్తు సముద్ర మాట్టం నుండి 6100 మీటర్లు)
మిమాచల్
- మధ్య హిమాలయాలకు గల పేరు? హిమాచల్, నిమ్న హిమాలయాలు
- మధ్య హిమాలయాలు వేటి వేటి మధ్య ఏర్పడ్డాయి? శివాలిక్ శ్రేణులు, ఉత్తరాన ఉన్నత హిమాలయాల మధ్య (వీటి ఎత్తు 3500 నుండి 4500 మీటర్లు, వెడల్పు 60-80 కిమీ. చాలా పర్వతాలు 5050 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్నాయి)
- మాక్ డొక్ డింపెప్ లోయ ఎక్కడ ఉంది? మేఘాలయ లో
- మధ్య హిమాలయాలలో ముఖ్య పర్వత శ్రేణులుకు ఉదా? పీర్ పంజాల్, దౌల్ దార్, ముస్సోరీ, నాగ్ తిబా, మహా భారత లేక్
- మధ్య హిమాలయాలలో పొడవైన పర్వతశ్రేణి? పీర్ పంజాల్ (కాశ్మీర్ లో) హిమాలయాల ద. భాగాన ఉంది
- కాశ్మీర్ లోయ ఏయే పర్వతశ్రేణుల మధ్య ఉంది (పీర్ పంజాల్ మరియు జస్కర్ శ్రేణుల మధ్య)
- కాశ్మీర్ లోయ పొడవు ఎంత? 135 కిమీ (వెడల్పు 40 కిమీ, వైశాల్యం 4921 చ కిమీ) ఆగ్నేయం నుండి వాయవ్య దిశగా వ్యాపించి ఉంది.
- కాశ్మీర్ లోయ సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? 1585 మీటర్ల సగటు ఎత్తులో
- మధ్య హిమాలయాలకు తూర్పున ఉన్న శ్రేణులు? ముస్సోరీ మరియు నాగ్ తిబా
- ముసోరి శ్రేణి ఎత్తు ఎంత? 2వేలు – 2వేల 600 మీటర్లు (పొడవు 120 కిమీ. ముస్సోరీ నుండి లాన్స్ డౌన్ మధ్య విస్తరించి ఉంది.
- మధ్య హిమాలయాలలో వేసవి విశ్రాంతి స్థావరాలు? ముస్సోరీ, నైనిటాల్, చక్రాటా & రానిఖేట్, సిమ్లా, డార్జిలింగ్, ఆల్మోరా (సముద్ర మట్టం నుండి 1500-2000 మీటర్ల ఎత్తులో ఉన్నాయి)
శివాలిక్ శ్రేణులు
- శివాలిక్ శ్రేణులకు గల మరొక పేరు? బాహ్య హిమాలయాలు (బాహ్య శ్రేణులు కలిగి ఉన్నందున ఆ పేరు)
- శివాలిక్ శ్రేణి నిటారైన ఉత్తర వాలు కలిగి ఏవిధంగా కనిపిస్తుంది? హాగ్ బ్యాక్ గా
- శివాలిక శ్రేణి పొడవు? 2400 కిమీ (పోట్వార్ పీటభూమి నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు వ్యాపించి ఉంది)
- శివాలిక శ్రేణి వెడల్పు? హిమాచల్ ప్రదేశ్ లో 50 కిమీ, అరుణాచల్ ప్రదేశ్ లో 15 కిమీ కన్నా తక్కువగా
- శివాలిక్ శ్రేణులు ఏ నదీ లోయతో విస్తరించ బడ్డాయి? తీస్తా నదీ లోయతో (ఈ శ్రేణులు ఎత్తు 600 నుండి 1500 మీటర్ల మధ్య )
- శివాలిక్ శ్రేణుల సరస్సులు ఎండిపోయి మైదానాలుగా ఏర్పడ్డాయి వాటికి గల పేరు? పశ్చిమాన డూన్స్, తూర్పున డౌర్స్ అని పిలువబడుతున్నాయి (ఉదా: డెహ్ర డూన్)
- డెహ్ర డూన్ ఎక్కడ ఉంది? ఉత్తరాంచల్ లో (75 కిమీ పొడవు, 15-20 కిమీ వెడల్పు తో)
- హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా ఉన్న లోయ బ్రహ్మపుత్ర లోయ
- దిహంగ్ లోయ ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్ లో
- హిమాలయాలు ఏ ప్రాంతం లో జడ పిన్ను వంపు తిరిగి దక్షిణానికి విస్తరించి ఉన్నాయి? దిహంగ్ లోయ తరువాత
- తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలకు గల పేరు? పూర్వాంచల్
- పూర్వాంచల్ పర్వతాలు వేటితో ఏర్పడ్డాయి? అవక్షేప శిలలు, ఇసుక తో
- ప్రాంతీయంగా పూర్వాంచల్ పర్వతాలకు గల పేరు? పాట్ కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపురి కొండలు, ఖాసి కొండలు, మిజో కొండలు
| కొండలు | విస్తరించిన రాష్ట్రాలు |
| పూర్వాంచల్ | అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరాం |
| పాట్ కాయ్ కొండలు | అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ (భారత్ మయన్మార్ సరిహద్దు ప్రాంతం) |
| నాగా కొండలు | నాగాలాండ్ |
| మణిపురి కొండలు | మణిపూర్ |
గంగా సింధు మైదానం

- విశాల ఉత్తర మైదానం ఏ నదుల వల్ల ఏర్పడింది? గంగా, సింధూ, బ్రహ్మపుత్ర నదులవల్ల
- గంగా సిందు మైదానాన్ని ఎన్ని ప్రధాన భాగాలు గా విభజించారు? 3 (పశ్చిమ భాగం, మధ్య భాగం, తూర్పు భాగం)
- గంగ సింధు మైదానం యొక్క పశ్చిమ భాగం ఏ నదులతో ఏర్పడింది? సింధు, దాని ఉపనదులతో
- సింధు నది ఉపనదులు ఏవి? జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లైజ్
- సింధు నది పరివాహక ప్రాంత అధిక భాగం ఎక్కడ ఉంది? పాకిస్తాన్ లో
- అంతర్వేది అనగా? 2 నదుల మధ్య ప్రాంతం
- గంగ సింధు మైదానం యొక్క ఏ భాగం లో సారవంతమైన అంతర్వేదులు (దో అబ్) అత్యధికంగా ఉన్నాయి? పశ్చిమ భాగం లో
- గంగ సింధు మైదాన మధ్య భాగానికి గల పేరు? గంగా మైదానం (గగ్గర్ నుండి తీస్తా వరకు విస్తరించి ఉంది)
- గంగా మైదానం లో ప్రవహించు నదులు? గంగా, యమునా, వాటి ఉపనదులు సొన్, కోసి వంటివి
- గంగా మైదానం లో ప్రధానంగా ఏ ప్రాంతాలు ఉన్నాయి? ఉత్తర ప్రదేశ్, బీహార్, కొంత హర్యానా, జార్ఖండ్, ప. బెంగాల్
- గంగా సింధు మైదాన తూర్పు భాగం ఎక్కడ ఉంది? అసోం లోని బ్రహ్మపుత్ర లోయలో (బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడినది)
- శివాలిక్ పాద బాగం లో 8-16 కిమీ సన్నటి మేఖలుగా గులక రాళ్ళతో నిక్షేపనం చేయబడిన భూ భాగానికి గల పేరు? బాబర్ (వీటి క్రింద నదులు వాగులు ప్రవహించి దిగువ ప్రాంతం లో బయటకు వస్తాయి)
- టెరాయి అనగా? చిత్తడి నేలలు
ద్వీపకల్ప పీటభూమి

- భారత దేశ పీటభూమి కి ద్వీపకల్ప పీటభూమి అని పేరు ఎందుకు వచ్చింది? భారత పీటభూమి కి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి
- ద్వీపకల్ప పీటభూమి దక్షిణ అంచు? కన్యాకుమారి (పడమరి అంచుగా పడమటి కనుమలు, తూర్పు అంచుగా తూర్పు కనుమలు ఉన్నాయి)
- ద్వీపకల్ప పీటభూమి ప్రధాన భాగాలు? 2 (మాళ్వా పీటభూమి, దక్కన్ పీటభూమి)
- మాళ్వా పీటభూమికి దక్కన్ పీటభూమి కి సరిహద్దుగా ఉన్న స్వరూపాలు? వింధ్య శ్రేణులు
- మాళ్వా పీటభూమి కి తూర్పు వైపున ఉన్న పీటభూమి? చోటా నాగపూర్ పీటభూమి
- ఖనిజ వనరులు సమృద్ది గా ఉన్న పీటభూమి? చోటా నాగపూర్ పీటభూమి
- దక్కన్ పీటభూమి యొక్క ఆకారం? త్రిభుజాకారం
- దక్కన్ పీటభూమికి ఉత్తర సరిహద్ధుగా ఉన్న పర్వతాలు? సాత్పూరా పర్వతాలు
- దక్కన్ పీటభూమి సరిహద్దులు
- ఉత్తర సరిహద్దు గా : సాత్పురా పర్వతాలు
- తూర్పు హరిహద్దు గా : మహాదేవ్, కైమూర్ పర్వతాలు, తూర్పు కనుమలు
- పశ్చిమ సరిహద్దుగా : పచ్చిమ కనుమలు ఉన్నాయి
- దక్షిణ సరి హద్దుగా : నీలగిరి పర్వతాలు ఉన్నాయి
- పడమటి కనుమలు
- తూర్పు కనుమల కంటే ఎత్తు ఎక్కువ
- అవిచ్చిన్నత శ్రేణులు గా ఉండి తీర మైదానాలకు ప్రవేశ ద్వారంగా ఉన్నాయి
- పొడవు 1600 కిమీ
- గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలను కలుస్తాయి
- ఎత్తు 2000 మీటర్లు
- కొండలు: పళని (తమిళనాడు), అన్నామలై, కార్దమం కొండలు (కేరళ)
- దక్కన్ పీటభూమి ఎటువైపు నుండి ఎటువైపు కు వాలి ఉంది? పడమర నుండి తూర్పు కు
- నీలగిరి పర్వతాలలో ప్రఖ్యాతి గాంచిన వేసవి విడిది ? ఊటి (ఉదగమండలం)
- నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం? దొడబెట్ట (2637 మీటర్లు ఎత్తు)
- అన్నామలై కొండలలో ఎత్తైన శిఖరం? అనై ముడి (2695 మీటర్లు)
- తూర్పు కనుమలు
- ఉత్తరాన మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు విస్తరించి ఉన్నాయి
- విచ్చిన్న శ్రేణులు
- సగటు ఎత్తు 900 మీటర్లు
- ఎత్తైన శిఖరం అరోమా కొండ (చింతపల్లి ఆంధ్ర ప్రదేశ్)
- అరోమా కొండ ఎత్తు 1680 మీటర్లు
- భాగాలు : నల్లమల, వేలికొండ, పాలకొండ, శేషాచలం
- అగ్ని పర్వత ప్రక్రియ వల్ల ఏర్పడిన నేలలు? నల్లరేగడి నేలలు
థార్ ఎడారి

- ఆరావళి పర్వతాల వర్శచాయా ప్రాంతం లో ఉన్న ఎడారి? థార్ ఎడారి (వర్షపాతం 100-150 మిమి మధ్య)
- థార్ ఎడారిలో ఉన్న ఒకే ఒక్క నది ? లూని (కాలువల నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సులలోనికే ప్రవహిస్తాయి. ఇలా ప్రవహించే వాటిని అంతస్తలీయ ప్రవాహం అంటారు)
- దేశం లోనే అత్యంత పొడవైన కాలువ? ఇందిరా గాంధి కాలువ (650 కిమీ)
- ఇందిరా గాంధి కాలువ ఎక్కడ ప్రారంభం అవుతుంది? పంజాబ్ నుండి (థార్ ఎడారికి నీళ్ళు అందిస్తుంది)
తీర మైదానాలు
- పశ్చిమ తీర మైదానం ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటుంది? రాన్ అఫ్ కచ్ నుండి కన్యాకుమారి వరకు
- పశ్చిమ తీర మైదానాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు? 3 ( కొంకన్ తీర ప్రాంతం, కెనరా తీర ప్రాంతం, మలబార్ తీరప్రాంతం)
- కొంకన్ తీర ప్రాంతం ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉంది? మహారాష్ట్ర, గోవా (ఉత్తర భాగం)
- కెనరా తీర ప్రాంతం ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉంది? కర్ణాటక (మధ్య భాగం)
- మలబార్ తీరప్రాంతం ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉంది? కేరళ (దక్షిణ భాగం)
- తూర్పు తీర మైదానం విస్తరణ? ఓడిసాలోని మహానది నుండి తమిళనాడు లోని కావేరి డెల్టా వరకు
- తీర మైదానాలు వాటి పేర్లు
- ఉత్కల్ తీరం (ఓడిసా)
- సర్కార్ తీరం (ఆంధ్ర ప్రదేశ్)
- కోరమండల్ తీరం (తమిళనాడు)
- చిల్కా సరస్సు ఎక్కడ ఉంది? ఒరిసా లో
- కొల్లేరు సరస్సు ఎక్కడ ఉంది? ఆంధ్ర ప్రదేశ్ లో
దీవులు

- భారతదేశం లో దీవులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 (అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతం, లక్షదీవులు అరేబియా సముద్రం)
- మయన్మార్ కొండలలో భాగము గా ఉన్న కొండలు? అండమాన్ నికోబార్ దీవులు
- మయన్మార్ కొండలు ఎక్కడ ప్రారంభం అయ్యాయి? అర్కాన్ యోమా నుండి (సముద్రం లో మునిగి పైకి వచ్చిన శిఖర ప్రాంతాలే అండమాన్ దీవులు)
- అండమాన్ నికోబార్ దీవులలో అగ్ని పర్వతాల వల్ల ఏర్పడిన దీవులు? నార్కొండా౦, బారెన్
- భారతదేశ దక్షినాది అంచు ఎక్కడ కలదు (India Relief Features)? నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ దగ్గర (2004 సునామీలో ముంపుకు గురైనది)
- లక్ష దీవులు ఎలా ఏర్పడ్డాయి? ప్రవాళ బిత్తికల నుండి
- లక్షదీవుల విస్తీర్ణం? 32 చదరపు కిమీ
- ఇటువంటి ఉపయోగకరమైన టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి kings dsc యు ట్యూబ్ ఛానల్ మరియు kingsdsc.in వెబ్సైట్









