Gender Equality

6.16 స్త్రీ, పురుష సమానత్వ దిశగా పయనం

  • Gender Equality స్త్రీ పురుషుల మధ్య విబేధాలు? 2 (శారీరకమైన తేడా, సామాజికమైన చిన్న చూపు)
  • స్త్రీల అసమానత, వివక్షకు కారణం? స్త్రీలను పురుషులకంటే తక్కువగా భావించే కొందరు పురుషుల భావన (దీనినే సామాజిక తేడా లేదా లింగపర తేడా అంటారు

తగ్గుతున్న బాలికలు, స్త్రీలు  

  • స్త్రీ పురుష నిష్పత్తి భారతదేశం లో (Gender Equality)
    • 1951 లో ప్రతి 1000 మంది పురుషులకు 946 మంది స్త్రీలు1981 లో ప్రతి 1000 మంది పురుషులకు 934 మంది స్త్రీలు
    • 2011 లో ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు
  • స్త్రీ పురుష నిష్పత్తి తెలంగాణా రాష్ట్రము లో (Gender Equality)
    • 1991 లో ప్రతి 1000 మంది పురుషులకు 969 మంది స్త్రీలు
    • 2011 లో ప్రతి 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలు

(పురుషుల కన్నా ఎక్కువ మంది స్త్రీలు ముందుగా చనిపోతున్నారు)

  • బాల బాలికల నిష్పత్తి తెలంగాణా రాష్ట్రము లో (Gender Equality)
    • 1991 ప్రతి 1000 మంది బాలలకు 978 మంది బాలికలు
    • 2001 ప్రతి 1000 మంది బాలలకు 963 మంది బాలికలు.
    • 2011 ప్రతి 1000 మంది బాలలకు 933 మంది బాలికలు
  • ఇటీవల కాలం లో బాలికల సంఖ్య తగ్గిపోవడానికి గల కారణాలు
    • బాలికలకు సరిపడినంత పోషకాహారం లభించక పోవడం
    • సరైన వైద్య చికిత్స అందక వివక్షతకు లోనవుతున్నారు
    • భ్రూణ హత్యలు
    • స్త్రీలు తక్కువగా చదువుకొని ఉండడం
    • ఇంటిపని, పొలం పనులలో అప్పగించడం
    • పాటశాలలో నేర్చుకొన్న విషయం మననం చేసుకొనే అవకాశం లేకపోవడం
  • భ్రూణ హత్య అనగా? పుట్టడానికి ముందే తల్లి గర్భం లోనే శిశువును చంపడం

అక్షరాస్యతలో అంతరాలు

  • అక్షరాస్యులు గా ఎవరిని పేర్కొంటారు? 7 సంవత్సరాలు పైబడి చదవడం రాయడం వచ్చిన వారిని
  • 1991 నాటికి ప్రతి 100 మంది స్త్రీలలో ఎంతమంది అక్షరాస్యులు ఉన్నారు? 28 మంది
  • 1991 నాటికి ప్రతి 100 మంది పురుషులలో ఎంతమంది అక్షరాస్యులు ఉన్నారు? 52 మంది 
  • 2011 నాటికి ప్రతి 100 మంది స్త్రీలలో ఎంతమంది అక్షరాస్యులు ఉన్నారు? 58 మంది
  • 2011 నాటికి ప్రతి 100 మంది పురుషులలో ఎంతమంది అక్షరాస్యులు ఉన్నారు? 75 మంది
  • భారతదేశం లో బాగా విస్తరించిన విద్య వ్యవస్థను కలిగి ఉన్న రాష్ట్రాలు? ఆంధ్ర, తెలంగాణా
  •  ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో పాటశాల/కళా శాలల సంఖ్య ? లక్షకు పైగా
  • ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో చదివే విద్యార్దులు? 1.50 కోట్లు మంది
  • తెలంగాణా రాష్ట్రము లో 100 మంది బాలికలలో 5వ తరగతి లేదా ఆ పై చదువులు చదివేవారు? 65 మంది (15 మంది ఆడపిల్లలు మాత్రమే ఇంటర్ మీడియట్ వరకు విద్యను అభ్యసించగలుగుతున్నారు. 1/6వ వంతు 5వ తరగతి తరువాత పాటశాలకు దూరం అవుతున్నారు)
  • తెలంగణా స్త్రీ పురుష అక్షరాస్యత (Gender Equality)
    • 1991లో పురుషుల అక్షరాస్యత 53, స్త్రీల అక్షరాస్యత 292001లో పురుషుల అక్షరాస్యత 68, స్త్రీల అక్షరాస్యత 46
    • 2011లో పురుషుల అక్షరాస్యత 75, స్త్రీల అక్షరాస్యత 58
  • ఏ చట్టాల ద్వారా తల్లిదండ్రుల ఆస్తులలో కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా సమాన వాటా కల్పించడం తప్పనిసరి అయినది. 1980 దశకం లో వచ్చిన చట్టాల ద్వారా
  • వాతసత్వ ఆస్థి లో లింగ వివక్ష లేకుండా స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన మొదటి రాష్ట్రము? తెలంగాణా
  • భారత దేశ రాజధాని? ఢిల్లీ
  • భారతదేశం లో ప్రథమ మహిళా రైలింజన్ డ్రైవర్? సురేఖా యాదవ్ (Gender Equality)
  • భారతదేశం లో పొలం లో పనిచేసేవాళ్ళలో ప్రతి 10 మందిలో ఎంత మంది స్త్రీలు ఉన్నారు? 8 మంది

Ancient Religion & Society

6.17 ప్రాచీన కాలం లో మతం – సమాజం

  • ఆహరం కోసం వేట, సేకరణ మీద ఆధారపడేవారు? చెంచులు
  • భక్త కన్నప్ప కథ ఎక్కడ ఉంది? పెరియ పురాణం లో (12వ శతాబ్దంప)
  • ఈ తమిళ పెరియ పురాణం దేనిని గూర్చి తెలుపుతుంది? శ్రీ శ్రీకాళహస్తి ప్రాంతం లో నివసించిన వేట సేకరణ సమాజ జీవన శైలి మత విస్వశాల గూర్చి
  • భక్త కన్నప్ప ఏ సమాజానికి చెందినవాడు? వేట సేకరణ సమాజానికి
  • భక్త కన్నప్ప వేటిని శివునికి సమర్పించేవాడు అని పెరియ పురాణం పేర్కొంది? మాంసం, తేనే, పూలు, పండ్లు
  • చెంచులు ఏ ప్రాంతం లో నివసిస్తునారు? నల్లమల అటవీ ప్రాంతం లో
  • చెంచులు నృత్యం ద్వారా ఏ దేవతను పూజిస్తారు? గారెల మైసమ్మ (గంగమ్మ)
  • చెంచులు గారెల మైసమ్మ తో పాటు ఎవరిని కొలుస్తారు? శ్రీ శైలం మల్లికార్జున స్వామి, అహోబిలం శ్రీ నరసింహస్వామి ని (వీరిని అల్లుళ్ళు గా భావిస్తారు)

తొలి వ్యవసాయదారులు – పశుపోషకులు

  • పురాతత్వ పరిశోధనలు ఆధారంగా చెంచులు ఎవరిని ఆరాదించే వారు అని తెలుస్తుంది? అమ్మతల్లి (నేల తల్లి)
  • అమ్మతల్లి ని చెంచులు ఏ రూపం లో భావిస్తారు? చిన్న రాతి ప్రతిమలు, చెట్లు రూపం లో (పంటలు పశువులు సమృద్దిగా విలసిల్లాలంటే అమ్మతల్లి అనుగ్రహం అవస్యకమని భావిస్తారు)
  • 5000 సంవత్సరాల క్రితం నాటి కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మతల్లి ప్రతిమ ఎక్కడ బయటపడింది? మెహర్ నగర్ లో
  • 4000 సంవత్సరాలు నాటి రాళ్ల మీద చెక్కిన జంతు బొమ్మలు ఎక్కడ దర్శనమిస్తాయి? మస్కి లో
  • 5000 సంవత్సరాల క్రితం నాటి రావి ఆకులతో ఉన్న కుండ పాత్రలు ఎక్కడ బయటపడ్డాయి? ముండిగాక్ లో (ఆఫ్ఘనిస్తాన్)
  • భారతదేశం లో పశుపోషకులు వివిధ రాష్ట్రాలలో వారి పేర్లు
రాష్ట్రముపశుపోషకుల పేర్లు
మహారాష్ట్రదంగర్
కర్ణాటకకురుబ
తెలంగాణా & ఆంధ్రకురుమ, గొల్ల, యాదవ
  • భారతదేశం లో పశుపోషకులు ఎవరిని కొలుస్తారు? మల్లన్న, భీరప్ప లను
  • కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో పశుపోషకులు ఏ స్త్రీ దేవతామూర్తులను పూజిస్తారు? రేనుకామాత, ఎల్లమ్మ, మైసమ్మ, పోచేమ్మ

సింధులోయ నాగరికత నాటి మతం

  • సింధు ప్రాంతం లో వెలసిన నగరాలు ఎంతకాలం విలసిల్లాయి? 9వందల ఏండ్లు (4 వేల 600 సంవత్సరాల క్రితం)
  • సింధులోయ నాగరికత కు మరొక పేరు? హరప్పా సంస్కృతీ
  • పురావస్తు త్రవ్వకాలలో మొదట బయటపడిన ప్రాంతం? హరప్పా
  • హరప్పా ప్రజలు ముఖ్యంగా ఏ చెట్టును పవిత్రంగా భావించేవారు? రావి చెట్టు
  • హరప్పా ప్రజల పురుష దేవుడు తరువాతి కాలం లో ఏ రూపం లో పూజలు అందుకొన్నాడు? శివుని రూపం లో

వేదకాలం లో మతం

  • భారతదేశం లో మొట్టమొదటి సాహిత్యం? వేదాలు
  • వేదాలు ఎన్ని?4 (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం
  • వేదాలలో అతి ప్రాచీనమైనది? ఋగ్వేదం (3500 సంవత్సరాల క్రితం సంకలన౦ చేసారు)
  • వేదాలను ఎవరు సంకలనం చేసారు? ఋషులు (వీటిలో దేవతలను కీరించే మంత్రాలు, ప్రపంచ శాంతి, సంక్షేమం కోసం చేసే ప్రార్ధనలు ఉన్నాయి)
  • వేదాలు కీర్తించే దేవుళ్ళు లో ముఖ్యమైన వారు? 3 (అగ్ని, ఇంద్రుడు (యుద్ద దేవత), సోమలత (ప్రత్యేక పానీయం చేయడానికి వాడే తీగామొక్క)

*** వేదాలలో చాలా శ్లోకాలు పురుషులు సంకలనం చేయగా కొన్నింటిని మాత్రమె స్త్రీలు సంకలనం చేసారు ***

Greenery in Telangana
Greenery in Telangana (very useful information)
  • ఋగ్వేదం లో ప్రార్థనలు వేటికోసం ఉన్నాయి? పశువులు, సంతానం, అశ్వాలు కోసం
  • జనపదాల కాలం లో సంకలనం చేయాబడిన వేదాలు? యజుర్వేదం, అధర్వణ వేదం (క్రతువులు, అగ్ని బలులు, జంతు బలులు గూర్చి వివరించాయి)
  • నాటి సమాజం లో ముఖ్యమైన వర్గాలు
    • బ్రాహ్మణులూ     : అత్యన్నతమైన వారిగా పరిగణింప బడ్డారు. యజ్ఞాలు, వేదాలు వల్లించడం చేసేవారు
    • క్షత్రియులు       : రాజ్యాన్ని పాలించేవారిగా, ప్రజలను రక్షించేవారిగా పరిగణింప బడ్డారు
    • వైశ్యులు          : పశుపోషకులు, భూమిని సాగుచేసేవారిగా ఉంటూ, బ్రాహ్మణ క్షత్రియులకు బహుమతులు, కప్పము కట్టేవారు
    • శూద్రులు         : వేదకాలము తరువాత చివరిగా 4వ వర్గం గా ఉద్భవించారు. వ్యవసాయం, వడ్రంగం, కమ్మరి, వృత్తులు చేసేవారు

చనిపోయిన పూర్వీకుల ఆరాధన – దక్కన్ లోని రాక్షస గుళ్ళు  

  • రాక్షస గుళ్ళు అనగా? పెద్ద పెద్ద బండరాళ్ళతో నిర్మించిన సమాధి కట్టడాలు (చనిపోయిన పూర్వికులను పూజించడం కోసం)
  • రాక్షస గుళ్ళు నిర్మించే పద్దతి ఎప్పుడు ప్రారంభం అయినది? సుమారు 3వేల సంవత్సరాల క్రితం
  • రాక్షస గుళ్ళు నిర్మించే పద్దతి ఏ ప్రాంతాలలో వాడుకలో ఉండేది? దక్కన్ ప్రాంతం, దక్షిణ భారతదేశం, ఈశాన్య భారతదేశం, కాష్మీర్ లో
  • రాక్షస గుళ్ళు సమాధులలో ఏ ఏ రంగు కుండలు పూడ్చి పెట్టేవారు? నలుపు, ఎరుపు కుండలు (వీటితో పాటు పనిముట్లు, ఇనుముతో తయారుచేసిన ఆయుధాలు, గుర్రాల ఆస్థి పంజరాలు, బంగారం తో చేసిన ఆభరణాలు లభించాయి)

మెగాలిథిక్స్ – తెలంగాణా (బృహత్ శిలాయుగం)

  • సర్కోఫగి అనగా? చనిపోయిన వారి అవశేషాలు ఉంచిన రాతి పెట్టెలు లేదా మట్టి పెట్టెలు
  • టెర్రకోట మట్టితో తయారుచేసిన సర్కోఫగి ఎక్కడ కనుగొన్నారు? ఏలేశ్వరం (నల్గొండ)
  • మెన్ హిర్స్ అనగా? పొడవైన రాళ్ళు (మెగా లిథిక్ కాలం నాటి సమాధులు. బృహత్ శిలా కాలం నాటి కట్టడాలు)
  • మెన్ హిర్స్ ఎక్కడ కనుగొన్నారు? దేవుని గుట్ట (వరంగల్) లో
  • డోల్ మెన్ అనగా? చిన్న గది లాటి సమాధి నిర్మాణం
  • మేగాలితిక్ కాలం నాటి డోల్ మెన్ ఎక్కడ కనుగొన్నారు? పోతన పల్లి (మహబూబ్ నగర్)
  • బ్రహాత్ శిలాయుగం కాలం నాటి గుండ్రటి రాళ్ళు ఎక్కడ ఎక్కడ బయటపడ్డాయి? రేపుని గ్రామం (వరంగల్)
  • మహా జనపద కాల ప్రజలు వేటిని ఆరాధించారు? సూర్యుడు, నదులు, అమ్మతల్లి, కోతి, ఏనుగు, సర్పాలు, చెట్లు, చనిపోయిన పూర్వికులు

మరణం తర్వాత ఏం జరుగుతుంది

  • నచికేతుడు ఎముని దగ్గరకు ఎందుకు వెళ్ళాడు? మరణానికి కారణం యముడే కాబట్టి. మరణం తరువాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి
  • నచికేతుని కథ ఎక్కడ గలదు? కటోపనిషత్ లో
  • ఆశ్రమాలలో నివసించే గురువులకు గల పేరు? ఋషులు లేదా మునులు
  • ఋషులు, రాజుల ఆలోచనలను వేటిద్వారా చదువ వచ్చు? ఉపనిషత్తులు ద్వారా
  • ఋషులలో ప్రసిద్ది చెందినవారు? యాజ్ఞావల్కుడు, ఉద్దాలక ఆరుణి
  • వినాశనం లేనిదానికి ఋషులు పెట్టిన పేరు? ఆత్మా లేక బ్రహ్మము
  • అమరత్వాన్ని పొందాలి అంటే వేటిని గూర్చి తెలుసుకోవాలి? ఆత్మా లేదా బ్రహ్మము

పరివ్రాజకులు

  • పరివ్రాజకులు అనగా? ఇంటిని వదిలి గ్రామం నుండి మరొక గ్రామానికి, అరణ్యం నుండి మరొక అరణ్యానికి తిరుగుతూ ఉండే సత్యాన్వేషకులు
  • సత్యాన్వేషకులు ను ఏ పేర్లతో పిలుస్తుంటారు? భిక్షువులు లేదా తిరిగేవాళ్ళు
  • సత్యాన్వేషకులు లో ప్రసిద్ది చెందిన వారు?
    • వర్ధమాన మహావీరుడు
    • గౌతమ బుద్దుడు
    • మక్కలిగోశాల
    • అజిత కేశకంబలి
  • గణ సంగం లో జన్మించిన సత్యాన్వేషకుడుగా ఎవరిని పేర్కొనవచ్చు? గౌతమ బుద్దుడు, వర్ధమాన మహావీరుడు (30 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి పరివ్రాజకుడు అయ్యాడు)
  • ఏ ప్రశ్నకు సమాధానం కోసం వర్ధమాన మహావీరుడు పరివ్రాజకుడు అయ్యాడు? పుట్టుక చావు అనే చక్రబంధం నుండి విమోచన ఎలా అనే ప్రశ్నకు సమాధానం గా
  • వర్ధమాన మహావీరుని ప్రశ్నకు ఎంతకాలం తరువాత సమాధానం దొరికింది? 12 ½ సంవత్సరాల తరువాత
  • ఇతరులకు దుఃఖాన్ని కలుగాజేస్తే మన పాపాలు పెరుగుతాయి అని బోధించిన వారు? వర్ధమాన మహావీరుడు (చిన్న ప్రాణికి కూడా హింస తలపెట్ట కూడదు అని తెల్పాడు)
  • వర్ధమాన మహావీరుడు స్థాపించిన మతం? జైన మతం
  • దుఖాన్ని పోగొట్టుకోవడం ఎలా అని అలోసించిన వారు? గౌతమ బుద్దుడు
  • గౌతమ బుద్ధుని ప్రశ్నకు ఎంతకాలం తరువాత సమాధానం దొరికింది? 6 సంవత్సరాల ధ్యానం తరువాత
  • గౌతమ బుద్దుని అభిప్రాయం ప్రకారం దుఃఖానికి కారణం? కోరికలు (కోరికలను అదుపులో ఉంచితే దుఃఖం నుండి విముక్తి కలుగుతుంది)
  • అమితమైన ప్రాయచిత్తాలకు, సంతోషాలకు బదులుగా బుద్దుడు చూపిన మార్గం? మధ్యే మార్గం
  • బుద్దుని బోధనలే ___? భౌద్దమతం
  • బుద్దుని బోధనలు ను తన శిష్యులు ఏ పేరుతో సంకలనం చేసారు? త్రిపీటకాలు (సుత్త, అభిధమ్మ, వినయ పీటికలు)
  • ఇటువంటి ఉపయోగకరమైన టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి kings dsc యు ట్యూబ్ ఛానల్ మరియు kingsdsc.in వెబ్సైట్

Sculptures and Monuments
Sculptures and Monuments (Very useful information)

Leave a Comment