
6.1 Study of Maps – Preparation (పటాల అధ్యయనం – తయారీ)
- తెలంగాణా రాష్ట్ర గీతం ? జయ జయహే తెలంగాణా జననీ జయకేతనం
- తెలంగాణా గీత రచయిత? అందెశ్రీ
- జాతీయ గీతం ? జనగణ మన
- జనగణ మణ గీత రచయిత? రవీంద్రనాథ్ టాగూర్
- ప్రతిజ్ఞ ఎవరు రాసారు? పైదిమర్రి వెంకట సుబ్బారావు
- భారత రాజ్యంగ పీటికను ఎవరు రూపొందించారు? జవహర్ లాల్ నెహ్రు
- ఒక స్థానం నుండి సాపేక్షంగా చెప్పేదానిని ఏమంటారు? దిక్కు
- ఉత్తర దిక్కును దేనితో సూచిస్తారు? బాణం తో
- ప్రాంతాలు – దిక్కులు
| ప్రాంతాలు | దిక్కులు |
| In which direction is Mahabubnagar from Vikarabad | south-east |
| In which direction is Hyderabad from Yadadri | south-west |
| In which direction is Khammam from Suryapet | south-east |
| Is Komarambheem towards East of Adilabad | Yes |
| If you want to go from Manchiryal to Peddapalli, in which direction will you travel? | South |
- Maps పటం లో గల దూరాలకు భూమిపై ఉన్న వాస్తవ దూరాలకు గల నిష్పత్తి? స్కేలు
- మహబూబ్ నగర్ వనపర్తి మధ్య దూరం? 50 కిమీ
- 1 సెం మీ కు 1 కిమీ మొదలైన పదాల ద్వారా సరళ వాక్యాలలో తెలిపే స్కేలు ? స్టేట్ మెంట్ స్కేలు
- Maps పటాలు తయారు చేసేవారు రూపొందించిన చిహ్నాలకు గల పేరు? సంప్రదాయక చిహ్నాలు
7.1 Understanding different types of maps (వివిధ రకాల పటాలను అర్ధం చేసుకోవడం)
- వందేమాతరం రచయిత? బంకించంద్ర చటర్జీ
- కొకానా బీచ్ ఎక్కడ ఉంది? బ్రెజిల్ దేశం లో (దక్షిణ అమెరికా).
- లిబియా దేశం (ఆఫ్రికా లో ) ఉన్న ఎడారి? సహారా
| ప్రాంతాలు | దిక్కులు |
| Mehar went to Bhopal from Hyderabad. In which direction did he travel? | North |
| Ashok went to Chennai from Lucknow. In which direction did he travel? | South |
| Regina went to Bhubaneshwar from Mumbai. In which direction did she travel? | East |
| Weprechu went to Jaipur from Kohima. In which direction did he travel? | West |
- హైదరాబాద్ నుండి రాష్ట్ర రాజదానులకు మధ్య దూరం

- భౌతిక పటాలు వేటిని గూర్చి తెలుపుతాయి? వివిధ భూ స్వరుపాను గూర్చి , వివిధ ప్రాంతాల ఎత్తులను గూర్చి
- భూమి మీద ఎత్తును దేని ఆధారంగా కొలుస్తారు?సముద్ర మట్టం ఆధారంగా
- నింపూరు గ్రామం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? 50 మీటర్ల ఎత్తులో
- నింపూరు గుడి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? 100 మీటర్ల ఎత్తులో
- నింపూరు కొండ పై భాగం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? 150 మీటర్ల ఎత్తులో
- సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు? సమతల రేఖలు / కాంటూర్ లైన్స్
- భూ వాలు ఎత్తుగా ఉంటె కాంటూరు రేఖలు ఎలా ఉంటాయి? దగ్గరగా ఉంటాయి
- కాంటూరు రేఖలు ____? ఒక దానికొకటి ఖండించు కోవు, వంకరలు తిరిగి ఉంటాయి
- భూవాలు తక్కువగా ఉంటె కాంటూరు రేఖలు _____? దూరంగా ఉంటాయి
- రోడ్లు వేసేటపుడు, ఆనకట్టలు కట్టేటపుడు ఉపయోగపడే పటాలు? ఎత్తును తెలిపే పటాలు
- సముద్రం ఎత్తు నిరంతరం ______? పెరుగుతూ తరుగుతూ ఉంటుంది
- M S L విస్తరించుము? Mean Sea Level
- సాధారణంగా అతి తక్కువ ఎత్తుగల భూమి ఎన్ని మీటర్ల ఎత్తునుండి ఎన్ని మీటర్ల ఎత్తు మధ్య ఉంటుంది? 0 నుండి 200 మీటర్ల మధ్య
8.1 Study and Analysis of Maps (పటాల అధ్యయనం మరియు విశ్లేషణ)

- ముఖ్యమని భావించే అంశాలు సూచించడానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు వేటిని ఉపయోగిస్తారు? పటాలను
Maps in Different Periods (వివిధ కాలాలలో పటాలు)

- భూమి నీరు ఆకాశం లను చూపించే చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్ ఎక్కడ లభించింది? జవోరా న౦దు (మధ్య ప్రదేశ్)
- ప్రాచీన భారతీయ పటం లో ఎన్ని సముద్రాలు ఎన్ని ద్వీపాలను చూడవచ్చు ? ఏడు సముద్రాలు ఏడు ద్వీపాలు
- ప్రాచీన భారతీయ పటం లో కేంద్ర స్థానం లో ఉన్న పర్వతం? మేరు పర్వతం
- ప్రాచీన కాలం లో భారత దేశం ఏ ద్వీపం లో ఉంది? జంభూ ద్వీపం లో
- భారత దేశాన్ని ప్రాచీన కాలం లో ఏ పేరుతో సంబోదించారు? భరతవర్షం పేరుతొ
- వివిధ ప్రదేశాల ఉనికిని గుర్తించడానికి ఉపయోగ పడేవి? అక్షాంశాలు రేఖాంశాలు
- తీర రేఖ యొక్క విస్తృత పటాలు, లోతట్టు ప్రాంతాలు ద్వీపాల ఉనికిని చూపించే స్కెచ్ లు ఉపయోగించిన వారు? హిందూ మహాసముద్ర తీర ప్రాంతల వెంట ప్రయాణించే నావికులు
- అక్షాంశ రేఖాంశాల భావనను క్రి శ 5వ శతాబ్దం లో ఉపయోగించిన వారు? ఆర్య భట్ట
- మొఘలుల కాలంలో పట తయారీదారులు ఎవరి పద్దతులు అనుసరించారు? మధ్య ఆసియా వారి పద్దతులు
- 17వ శతాబ్దం లో అట్లాస్ ను ఎవరు తయారుచేసారు? సాదిక్ ఇస్ఫాహాన్ (జాన్ పూర్ లో )
- తన పటాలలో ప్రదేశాల ఉనికిని నిర్ణయించడానికి అక్షాంశ రేఖాంశాలను ఉపయోగించిన వారు? సాదిక్ ఇస్ఫాహాన్
- మనకు అందుబాటులో ఉన్న పురాతన పటాలు ఎప్పటివి? నాలుగు వేల సంవత్సరాల నాటివి
- మనకు అందుబాటులో ఉన్న పురాతన పటాలు ఎవరు రూపొందించారు? సుమేరియన్స్
- సుమేరియా ప్రస్తుత పేరు? ఇరాక్
- భూముల నుండి వచ్చే ఆదాయ లెక్కల కోసం భూముల వివరాలను పటాల సహాయం తో భద్ర పరిచినవారు? సుమేరియన్స్
- మొదటి ప్రపంచ పటాలు తయారు చేసినవారు? బాబిలోనియన్స్ (ఇరాక్ వాసులు)
- ప్రపంచ గుండ్రటి పళ్ళెం మాదిరి ఉంది అని ఊహించుకొన్నవారు? బాబిలోనియన్స్
- బాబిలోనియన్ లు రూపొందించిన పట వివరణ: లోపలి వలయం లో తెలిసిన పట్టణాలు, గ్రామాలు నదులు,చిత్తడి భూములు, కొండలు ఉన్నాయి, బాబిలోనియా పట్టణాన్ని మధ్యలో చూపారు. లోపలి వలయం బయట చేదు నది ఉంది (ఉప్పునీటి సముద్రం). దాంట్లో త్రికోణం లో 7 సముద్రాలు ఉన్నాయి.
- వివిధ ప్రదేశాలను తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలు తయారుచేసిన వారు? అనాక్సిమాండర్ (గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు), హేకేటియాస్ (టర్కీ లో మిలేటాస్ కు చెందినవాడు), హెరిడోటస్ (గ్రీకు)
- భూమి గుండ్రంగా ఉందని దానిచుట్టూ సముద్రం ఉందని భావించినవారు? బాబిలోనియన్స్, గ్రీకులు
- గ్రీకులు ప్రపంచాన్ని ఎన్ని ఖండాలు గా విభజించారు? 3 (యూరప్, లిబియా (ఆఫ్రికా), ఆసియా
- గ్రీకులు రూపొందించిన ప్రపంచ పటాన్ని వేరు చేస్తున్న సముద్రం? మధ్యధరా సముద్రం
- దగ్గర దూర ప్రాంతాల గూర్చి తెలుసుకొని పటాలు రూపొందించడం లో ఆసక్తి చూపినవారు? గ్రీకులు, రోమన్లు
- అక్షాంశ రేఖాంశాల ఆధారంగా పటాలు ఖచ్చితంగా తయారుచేయడానికి ప్రయత్నించిన వారు ? గ్రీకులు
- అక్షాంశ రేఖాంశాలను సరిగా గీయడానికి గ్రీకులకు ఎంత కాలం పట్టింది? 2000 సంవత్సరాలు
- ప్రాచీన కాలం లో అక్షాంశ రేఖాంశాలను ఉపయోగించి సవివర పటాలు తయారుచేసిన భౌగోళిక శాస్త్ర వేత్త? టాలమి (ప్రస్తుతం అందుబాటులో లేవు)
- టాలమి తయారుచేసిన Maps పటాలు ఏ ప్రాంతం గూర్చి సరైన సమాచారం ఇచ్చాయి? యూరప్ దాని చుట్టుప్రక్కల దేశాలకు సంబంధించి
- పటాల తయారీలో అరబ్బు పండితులు, నావికులు ఎవరి పుస్తకాలను ఉపయోగించుకొన్నారు? టాలమి పుస్తకాలను
- తన రాజుకోసం క్రి శ 1154 లో ప్రపంచ పటాన్ని తయారుచేసిన అరబ్ పండితుడు? అల్ ఇద్రిసి
- అల్ ఇద్రిసి రూపొందించిన ప్రపంచ పటం ఏ ఖండాన్ని పూర్తిగా చూపించింది? యురేషియా ఖండాన్ని
- అల్ ఇద్రిసి రూపొందించిన ప్రపంచ పటం యురేషియా తో పాటు ఏ ఖండం యొక్క ఉత్తర భాగాన్ని మాత్రమే చూపించింది? ఆఫ్రికా ఖండ ఉత్తర భాగం
- అల్ ఇద్రిసి రూపొందించిన ప్రపంచ పటంలో ఆసక్తి గొలిపే అంశం? దక్షిణాన్ని పట పై భాగం లోను, ఉత్తరాన్ని క్రింది భాగం లోను చూపించడం జరిగింది. అరేబియా ను పటం మధ్యలో చూపించాడు
- బైబిల్ ప్రకారం రూపొందించిన ప్రపంచ పటం ఎన్ని ఖండాలను పేర్కొంది? 3 (ఆసియా, యూరప్, ఆఫ్రికా)
- బైబిల్ ప్రకారం రూపొందించిన ప్రపంచ పటం ప్రకారం అన్నింటికంటే పెద్ద ఖండం ? ఆసియా
- యేసు క్రీస్తు జన్మస్థలం ? జెరూసలేం
- జెరూసలేం ప్రాంతం ఏ ఖండం లో ఉంది? ఆసియా
- టాలమి పుస్తకాలను యురోపియన్స్ తిరిగి ఎప్పుడు కనుగొన్నారు? క్రి శ 1480 ప్రాంతం లో (కాని టాలమి గీసిన పటాలు మాత్రం దొరకలేదు)
- అమెరికాను కనుగొన్నది? కొలంబస్
- భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నది? వాస్కోడి గామ
- 16వ శతాబ్దం లో ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగిన దేశం? హాలండ్
Map Projection (పటాలలో ప్రక్షేపణం)

- పట తయారిదారుల పితగా ఎవరిని పేర్కొంటారు? గెరార్డస్ మేర్కేటార్ (డచ్ దేశం)
- గెరార్డస్ మేర్కేటార్ కాలం ? క్రి శ 1512-1594)
- గెరార్డస్ మేర్కేటార్ చిత్రించిన పట విధానం పేరు? మేర్కేటార్ ప్రక్షేపణం
- మనం ఉపయోగిస్తున్న పటాలు ఎవరి పటాల ఆధారంగా రూపొందించారు? మేర్కేటార్ ప్రక్షేపణం పటాల ఆధారంగా
- ప్రపంచాన్ని చూపించడానికి నేటికి ఎవరి పద్దతిని వాడుతున్నారు? మేర్కేటార్ పద్దతిని
- ఖండాలు పరిమాణం దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం దిశలను సరిగా చూపించే విధానాన్ని రూపొందించిన వారు? మేర్కేటార్
Colonial administration, explorations, military use, and map making
(వలసల ఏర్పాటు, అన్వేషణలు, సైనిక వినియోగం, పటాల తయారీ)

- పటాలు తయారుచేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం భాగారదేశం లో ఏ శాఖను ఏర్పాటు చేసింది? భారత దేశ సర్వేక్షణ శాఖ (Survey of India)
- భారత దేశ సర్వేక్షణ శాఖ (Survey of India) సర్వేయర్ జనరల్ గా ఎవరు నియమించబడ్డారు? జేమ్స్ రేన్నెల్
- సర్వే ఆధారంగా భారతదేశపు మొట్టమొదటి పటాలు తయారు చేసినవారు? జేమ్స్ రేన్నెల్
- ప్రపంచం లో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ ను ఆరంభించినవారు ? విలియం లా౦బ్టన్ (1802 లో)
- చెన్నై నుండి హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును ఎత్తును నిర్ధారించిన వారు? విలియం లా౦బ్టన్
- చెన్నై నుండి హిమాలయాల వరకు సర్వేక్షణను పూర్తీ చేసినవారు? సర్ జార్జ్ ఎవరెస్ట్
- ఎవరి సర్వేక్షణ ద్వారా ప్రపంచం లోని ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అని తెలుస్తుంది? సర్ జార్జ్ ఎవరెస్ట్ సర్వేక్షణ ద్వారా
- మొదటి సారి శాస్త్రీయ పద్దతి ఉపయోగించి ఎవరెస్ట్ శిఖరాన్ని కొలిచిన వారు? జార్జ్ ఎవరెస్ట్
- ఎవరెస్ట్ శిఖర సర్వేక్షణ ఏ ప్రాంతం నుండి మొదలైనది? సముద్ర తీరమైన చెన్నై నుండి
- మొబైల్ పోన్ కంపెనీకి అవసరమైన పటం ? గ్రామాలు, పట్టణాలు చూపించే పటం
- మైక్రో వేవ్ టవర్ల నిర్మాణానికి అవసరమైన పటం? కొండలు అడవులు చూపించే పటం
Reading different thematic (subject-specific) maps (వివిధ విషయ నిర్దేశిత (థీమాటిక్) పటాలను చదవడం )
- ఒక విషయం / అంశం గూర్చి తెలిపే పటాలు? విషయ నిర్దేశిత పటాలు (థిమాటిక్ మాప్స్)
- థిమాటిక్ మాప్స్ కు ఉదా? మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, రాజధానులు వంటి రాజకీయ పటాలు
- ప్రజలు భూమిని ఉపయోగించు కొంటున్న విధానాన్ని తెలియజేసే పటాలు? భూ వినియోగ పటాలు
- కొండలు నదులు పీటభూములు వంటి వాటిని చూపే పటాలు? భౌతిక పటాలు
- అధికారిక విషయ నిర్దేశిత పటాలలో రంగులను ఏ శ్రేణిలో ఉపయోగిస్తారు? ఛాయా క్రమ శ్రేణిలో
- జనాభాను పటంలో రంగులు పూరించడం ద్వారా చూపే పటాలు? జనసాంద్రత పటాలు
Showing elevations and depressions in maps (పటాలలో ఎత్తు పల్లాలు చూపడం )

- పాటలలో ఎత్తు పల్లాలను చూపడానికి ఉపయోగించే సంకేతాలు? కాంటూరు రేఖలు
- కాంటూరు రేఖలు అనగా? సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే రేఖలు
- కాంటూరు రేఖలకు గల మరొక పేరు? ఐసో లైన్స్
- పటంలో సమాన విలువలు కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలును ఏమంటారు? ఐసోప్లేత్
- భూమి యొక్క వాలు, సముద్ర మట్టం ఎత్తును సూచించే రేఖలు? కాంటూరు రేఖలు
- కాంటూరు రేఖలు బాగా దగ్గరగా ఉంటె అర్ధం ఏమిటి? తీవ్రమైన వాలు ఉందని
Atlas (అట్లాస్)
- అట్లాస్ అనగా ? పటాల సంకలనం
Surface shading representation (ఉపరితల ఛాయా చిత్రీకరణ)

- ఉపరితల చాయా చిత్రీకరణ అనగా? విమానాలు, హెలికాఫ్టర్ లు, వేడిగాలి బుగ్గలనుండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లి భూమిని ఫోటోల రూపం లో చిత్రించడం
- ఉపరితల చాయా చిత్రాలు ____? పటాలు కావు
- ఉపగ్రహ చాయా చిత్రాలు అనగా? అంతరిక్షం లో కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీయబడిన భూ ఉపరితల చాయాచిత్రాలు
- ఉపగ్రహ చాయా చిత్రాలును ఎలా ఉపయోగిస్తారు? పటాల తయారి, ప్రణాళికల రూపకల్పన, వాతావరణ పరిశోధన, అటవీ సంరక్షణ, యుద్ద తంత్రము లలో
- ఇటువంటి టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్స్ కోసం చూస్తూనే ఉండండి kingsdsc.in














