Globe: The Model of the Earth
6.2 Globe:

- భూమికి నమూనా ? గ్లోబు
- గ్లోబు Globe లో వేటిని చూడవచ్చు? భూ ఆకారం, నేల నీరు , ఖండాలు మహాసముద్రాలు, ప్రపంచ దేశాలు
- భూమి నీలంగా కనిపించడానికి కారణం? భూమిపై అధిక భాగం మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల
- భూమి యొక్క ఆకారం? గోళాకారం (ఖచ్చితమైన గోళాకారం కాదు, అలా అని గుండ్రంగా ఉండదు. ధ్రువాల వద్ద కొద్దిగా నొక్కుకు పోయి భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్లు ఉంటుంది)
- అమెరికాను కనుగొన్న కొలంబస్ ఏ దేశానికి చెందినవాడు? ఇటలి
- 1492 లో ఏ దేశానికి భయలుదేరి కొలంబస్ అమెరికా చేరుకొన్నాడు. భారత్ కి బయలు దేరి అమెరికా చేరుకొన్నాడు
- ప్రపంచం లో గడ్డకట్టుకొని ఉన్న మహాసముద్రం? ఆర్కిటిక్ మహాసముద్రం
- మసహముద్రాలు ఎన్ని ? 5 (పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, అంటార్కిటిక్)
- మహా సముద్రాలలో కెల్లా పెద్ద మహాసముద్రం? పసిఫిక్
- ఖండాలు ఎన్ని ? 7 (ఆసియా, ఆఫ్రికా, ఉ.అమెరికా, ద.అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా)
- మంచుతో కప్పి ఉన్న ఖండం పేరు? అంటార్కిటికా
- ఉత్తర ధృవం లో గడ్డ కట్టిన మహా సముద్రం ? ఆర్కిటిక్ మహాసముద్రం
- అంటార్కిటికా ఖండానికి మరొక పేరు? అంటార్కిటికా మంచు కవచం (Tha Antarctic Shield of Ice)
- భారతదేశం ఏ ఖండం లో ఉంది? ఆసియా
- ఉత్తర అభిముఖంగా ఉన్నపుడు ఎడమ వైపు దిక్కు ? పడమర
- ఉత్తర అభిముఖంగా ఉన్నపుడు కుడి వైపు దిక్కు ? తూర్పు
- భూ భ్రమణం ఎటువైపు నుండి ఎటువైపుకు ఉంటుంది? పడమర నుండి తూర్పుకు
- భూమికి రెండు వైపులా ఉండే 2 చుక్కలుకు గల పేరు? ధ్రువాలు
- ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూ నాభి గుండా గీసిన రేఖకు గల పేరు? అక్షం
- భూమి దేనిచుట్టు బ్రమాణం చేస్తుంది? తన అక్షం చుట్టూ
- గ్లోబు మీద /పటం లో ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి గల రేఖలు? అక్షాంశాలు, రేఖాంశాలు
- అక్షాంశ రేఖాంశాలపై అవగాహన ప్రాచీన కాల భారతీయ ఖగోళ & గణిత శాస్త్రవేత్త? ఆర్యభట్ట
- అక్షాంశాలు అనగా? భూమి కి అడ్డంగా గీయబడిన ఊహారేఖలు ? అక్షాంశాలు
- అక్షంశాలలో పొడవైన అక్షాంశం? భూమధ్య రేఖ
- గ్లోబును 2 సమాన భాగాలుగా చేయు అక్షాంశం? భూమధ్య రేఖ
- భూమధ్య రేఖ ఏయే ఖండాల గుండా పోతుంది? 3 ఖండాలు (ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా)
- భారత దేశం ఏ అర్ధ గోళం లో ఉంది? ఉత్తరార్ధ గోళం లో
- ఏ అర్ధ గోళం లో భూభాగం కంటే జల భాగం ఎక్కువగా ఉంది? దక్షిణార్ధ గోళం
- ఒక దృవం నుండి వేరొక ధృవాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను ఏమంటారు? రేఖాంశాలు
- ఈ రేఖలు ఒకే పొడవును కలిగి ఉంటాయి? రేఖాంశాలు
- రేఖాంశాల లో ఎన్ని రేఖాంశాలు ముఖ్యమైనవి? 2 (గ్రీనిచ్ రేఖాంశం, అంతర్జాతీయ దినరేఖ)
- గ్రీనిచ్ రేఖాంశానికి మరొక పేరు? 0 డిగ్రీల రేఖాంశం
- అంతర్జాతీయ దినరేఖకు మరొక పేరు? 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం
- అక్షాంశ రేఖాంశాల వల్ల ఉపయోగం? ఒక ప్రాంత ఉనికిని తెలుసుకోవచ్చు
- ఇటువంటి టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్స్ కోసం చూస్తూనే ఉండండి kingsdsc.in









