Emergence of Kingdoms and Republics

6.10 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

Emergence of Kingdoms and Republics (సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం)

  • ఉత్తర భారతదేశ మైదానానికి గల పేరు? గంగా సింధూ మైదానం
  • హిమాలయాలకు, ద్వీపకల్ప పీటభూమి కి మధ్య ప్రవహించు నదులు? గంగా, యమునా
  • గంగా మైదానం సారవంతం గా ఉండుటకు కారణం? అధిక వర్షపాతం, హిమాలయాలనుండి ప్రవహించే నదులు తెచ్చే ఒండ్రు మట్టి
  • గంగా సింధూ మైదానాలలో స్థిరపడిన ఆదిమ తెగలకు పేరు? జన (సంస్కృత పదం)
  • గంగా సింధూ మైదానాలలో స్థిరపడిన ఆదిమ తెగల ప్రాంతానికి గల పేరు? జనపద (సంస్కృత పదం)
  • ఎప్పటి నుండి గంగా సింధూ మైదానం లో ఆదిమ తెగలు స్థిరపడడం మొదలు పెట్టారు? 4000 సంవత్సరాల నుండి
  • ఆదిమ తెగలు వేటితో చేసిన పనిముట్లను ఉపయోగించారు? రాతి, రాగి, కంచు, మరియు ఇనుము తో చేసిన పనిముట్లు
  • ఆదిమ తెగలు నివసించిన పెద్ద గ్రామాలు లేదా పట్టణాలకు గల పేరు? మహా జనపదాలు/పెద్ద జనపదాలు
  • మహా జనపదాల Mahajanapadas గూర్చి సమాచారం వేటిద్వారా తెలుస్తుంది? పురావస్తు త్రవ్వకాలు, రచనలు
  • నాటి కాలం లో ఎక్కువగా అనుసరించిన గ్రంధాలు? వేదాలు
  • మహా జనపదాల కాలం లో ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు? ఢిల్లీ, అత్రంజిఖేర, కౌశంబి (అలహాబాద్ దగ్గరలో), పాట్నా, అయోధ్య, రాజ్ గిరి (Emergence of Kingdoms and Republics)
  • మహా జనపదాల కాలం లో రాసిన పుస్తకాలు? ఉపనిషత్తులు, ధర్మ సూత్రాలు, దిగానికాయ, మజ్జిమనికాయ, హీరిడోటాస్ చరిత్ర, స్ట్రాబో రచనలు

Kingdom, army and taxes (రాజ్యం, సైన్యం, పన్నులు)

  • మహా జనపదాల కాలం లో భూ యజమానులను ఈవిధంగా పిలిచేవారు? గృహపతి/ గహపతి (కుటుంభ సభ్యులతో వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసే వారు)
  • దాస అనగా? లొంగిపోయిన సేవకులు (బానిసలు)
  • బృతక అనగా? కూలి / జీతం తీసుకొని పనిచేసేవారు
  • నాటి కాలం లో గ్రామపెద్ద అవడానికి అర్హత ? అత్యధిక భూమి ఉండాలి
  • గ్రామ పెద్ద విధులు? రాజు తరపున పన్నులు వసూలు, న్యాయ మూర్తి గా, పోలీస్ అధికారి గా శాంతి భద్రతలు కాపాడే వాడు  
  • గోండుల గ్రామ నాయకుడు? పట్లా (బయట దాడుల నుండి గ్రామాన్ని రక్షించ వలసి వచ్చేది)
  • పట్లా అధితులకు అయ్యే ఖర్చు, పండుగల ఖర్చు ఏవిధంగా పొందేవాడు? గ్రామస్తులు ఒక రోజు తమ పొలం లో వేతనం లేకుండా పనిచేయడం ద్వారా
  • నాటి కాలం లో ఆబరణాలు వేటితో తయారు చేసేవారు? బంగారం వెండి తో
  • పింగాణి వస్తువులను ఎప్పటి నుండి ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది? మహాజనదం కాలానికి ముందునుండే
  • రాజు సిరిసంపదలతో ఉండడానికి గల మార్గాలు? 2 (రాజ్య ప్రజలపై పన్నులు పెంచడం, పొరుగు రాజ్యాలను జయించడం) (Emergence of Kingdoms and Republics)
  • భాగ అనగా? గృహపతులు రాజుకు చెల్లించిన పన్ను
  • భాగ ఏవిధంగా ఉండేది? పండిన పంటను 6 భాగాలు చేసి ఒక భాగం రాజుకు చెల్లించేవారు
  • వృత్తి పని వారు రాజుకు ఏ విధంగా పన్ను చెల్లించే వారు? ప్రతి నెల ఒక రోజు ఉచితంగా పని చేయడం ద్వారా
  • పశు కాపరులు పన్నును రాజుకు ఏవిధంగా చెల్లించేవారు? జంతువులు, జంతు ఉత్పత్తులు ఇవ్వడం ద్వారా
  • వ్యాపారస్తులు పన్నును ఏవిధంగా చెల్లించేవారు? అమ్మిన వస్తువుల ను బట్టి (పన్ను వసూలు నిమిత్తం గ్రామ పెద్దలకు రాజు ఆజ్ఞా ఇచ్చేవాడు. గ్రామ పెద్ద అధికారం సంపద పెరుగుదల కు ఇది సహాయపడినది)
  • వేటాడేవారు, సేకరణ చేసేవారు పన్నును ఏవిధంగా చెల్లించేవారు? అటవీ ఉత్పత్తులు ను సమర్పించడం ద్వారా (ఈ కాలంలోనే నాణాల ఉపయోగం ప్రారంభం అయినది)
  • గంగ నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న మహా జనపదం? మగధ
  • ఏప్రాంతం లో ఏనుగులకు యుద్ద శిక్షణ ఇచ్చేవారు? మగధ ప్రాంత అడవులలో ఏనుగులు పట్టుకొని  
  • మగధ రాజ్యం లో ఏ ప్రాంతం లో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి? దక్షిణ ప్రాంతం లో
  • మగధను బలమైన రాజ్యంగా తీర్చి దిద్దినవారు? బింబి సారుడు, అజాత శత్రువు
  • మగధ ను పాలించిన మొదటి రాజు? బింబిసారుడు
  • బింబిసారుని కుమారుడు? అజాత శత్రువు
  • మగధ సామ్రాజ్యం లో మరొక బలమైన రాజు? మహా పద్మనందుడు
  • మహా పద్మనందుని కాలంలో మగధ సామ్రాజ్యం ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించింది? వాయవ్యం నుండి ఓడిసా వరకు

Vajji – a Gana (వజ్జి: ఒక గణరాజ్యం)

  • మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉన్న జనపదం? వజ్జి (Emergence of Kingdoms and Republics)
  • ఏ జనపదం లో పాలకులు బృంద౦ పాలించేది? వజ్జి జనపదం లో
  • వజ్జి జనపదం లో ప్రతి ఒక్కరు తమను ఏ విధంగా సంభోదించు కొనేవారు? రాజ
  • వజ్జి జనపద సమావేశం లో ప్రవేశించడానికి అవకాసం లేనివారు? మహిళలు, బానిసలూ, సేవకులు
  • గణాలకు చెందిన ప్రఖ్యాత బోధకులు? బుధుడు, మహావీరుడు
  • గణ రాజ్యాలు ఎంతకాలం మనగలిగాయి? 1500 సంవత్సరాలు
  • జనపదాలు మొత్తం? 16
  • మహా జనపదాలు వాటి రాజధానులు
వరుస సంఖ్యజనపదం పేరురాజధాని
1అంగచంప
2మగధరాజగృహం
3కాశివారణాసి
4కోసలశ్రావస్తి
5వజ్జివైశాలి
6మల్లకుశి నగరం
7చేదిశుక్తిమతి
8వత్సకౌశాంబి
9కురుఇంద్ర ప్రస్థం
10పంచాలఆహిచ్చత్రం / కాంపిల్య
11మత్సవిరాటనగరం
12శూరసేనమథుర
13అస్మక / అస్సకపోతలి / పొదన /కోటి లింగాల
14అవంతిఉజ్జయిని / మాహిష్మతి
15గాంధారతక్షశిల
16కాంబోజరాజపురం
  • గోదావారి తీరాన వెలసిన జనపదం? అస్మక
  • అస్మక జనపద రాజధాని? పోతలి / పొదన/ కోటి లింగాల
  • మగధ జనపద రాజధాని? రాజ గృహం
  • శ్రావస్తి ఏ జనపదానికి రాజధాని? కోసల
  • వత్స జనపద రాజధాని? కౌసా౦బి
  • ఉజ్జయిని ఏ జనపదానికి రాజధాని? అవంతి
  • గాంధార జనపద రాజధాని? తక్షశిల
  • శూరసేన జనపద రాజధాని? మధుర

ఇటువంటి ఉపయోగకరమైన కంటెంట్ కొరకు చూస్తూనే ఉండండి Kingsdsc.in వెబ్ సైట్ అండ్ Kings dsc యు ట్యూబ్ ఛానల్

Greenery in Telangana
Greenery in Telangana (very useful information)

Sculptures and Monuments
Sculptures and Monuments (Very useful information)

Leave a Comment