
Dokur Village (డోకూర్ గ్రామం)

దక్కన్ పీఠభూమి వాలు? పశ్చిమం వైపు నుండి తూర్పు వైపుకు
- పీఠభూమి ప్రాంత లక్షణాలు: కొండలు, పర్వత శ్రేణులు, గుట్టలు ఉండి వాటి మధ్య చదును భూములు ఉంటాయి. సాగు భూమి చిన్న విస్తీర్ణం లో మాత్రమే సాధ్యం. వర్షపాతం తక్కువగా ఉంటుంది
- Dokur డోకూర్ గ్రామం ఏ మండలం లో ఉంది? దేవరకద్ర మండలం
- మహబూబ్ నగర్ పట్టణానికి డోకూర్ గ్రమానిక్ మధ్య యెంత దూరం? 25 కిమీ
- Dokur డోకూర్ గ్రామ పాత పేరు? డాకుర్ (డాకు పదం నుండి వచ్చింది)
- డాకు అనే పదానికి అర్ధం ఏమిటి? బందిపోటు (బందిపోటు ముటాలు అచ్చటి పొదల్లో దాక్కొని నివసించేవి)
Climate and Rainfall (వాతావరణం, వర్షపాతం)
- Dokur (డోకూర్) గ్రామ వేసవి ఉష్ణోగ్రతలు? 40 డిగ్రీల సెల్సియాస్ (ఫిబ్రవరి – జూన్ మధ్య)
- Dokur (డోకూర్) గ్రామ చలికాల ఉష్ణోగ్రతలు? 20-30 డిగ్రీల సెల్సియస్ (నవంబర్ – జనవరి మధ్య)
- Dokur (డోకూర్) గ్రామ౦ లో వర్షాకాలం ఏయే నెలల మధ్య ఉంటుంది? జూన్ చివరి నుండి అక్టోబర్ మధ్య
- Dokur (డోకూర్) గ్రామాన్ని కరువు పీడిత ప్రాంతం గా ఎందుకు పేర్కొంటారు? తక్కువ వర్షపాత సంవత్సరాలు మరల మరల రావడం వల్ల త్రాగడానికి పశువులకు పంటలకు నీటి సమస్య ఏర్పడుతుంది కనుక కరువు పీడిత ప్రాంతంగా పేర్కొంటారు
Soils (నేలలు)
- డోకూర్ గ్రామ౦ సగం వ్యవసాయ భూములు ఏ రకమైనవి? యెర్ర నేలలు
- డోకూర్ గ్రామ ప్రజలు నేల సారం పెంచడానికి ఏ విధానాన్ని అవలంబిస్తారు? ఒక పంట పండిన తరువాత 2వ పంట కాలాన్ని వదిలి వేస్తారు
- డోకూర్ గ్రామ౦ లో నల్ల రేగడి నేలలు ఎంత లోతు వరకు ఉంటాయి? 60 సెంటి మీటర్ల లోతు వరకు
- డోకూర్ గ్రామ౦ తక్కువగా ఏ నేలలు ఉన్నాయి? నల్ల రేగడి (ఇక్కడ సారవంతమైనవి)
- డోకూర్ గ్రామ౦లొ చాలా ఉత్పాదకత కలిగిన నేలలు? నల్లరేగడి నేలలు
- డోకూర్ గ్రామ౦ లో చవుడు, గరుసు, ఇతర ప్రధాన నేలలు ఎంత శాతం ఉన్నాయి? 30%
Water Resources – Tanks and Ponds (నీటి వనరులు – చెరువులు, కుంటలు)

- డోకూర్ గ్రామ ముఖ్య నీటి వనరు? పెద్ద చెరువు
- పెద్ద చెరువుకు నీటి ఎక్కడినుండి లభిస్తుంది? దేవరకద్ర చెరువు నుండి
- దేవరకద్ర చెరువు డోకూర్ గ్రామానికి ఎంత దూరం లో ఉంది? 5 కిమీ దూరం లో
- డోకూర్ గ్రామ పెద్ద చెరువు నిండిన తరువాత ఆ నీరు ఎక్కడికి వెళుతుంది? చాకలి కోయి కుంట, వాని వంపు, బదివంపులకు వెళుతుంది (ఇవి అన్ని గొలుసుకట్టు చెరువులు)
- గొలుసు కట్టు చెరువుల పద్దతిని రూపొందించడానికి కారణం? సాధ్యమైనంత వరకు వాన నీటిని పట్టి ఉంచడానికి
- గొలుసుకట్టు చెరువుల విధానాన్ని ఏ భూ స్వరుపాలలో ఏర్పాటు చేస్తారు? పీఠభూమి ప్రాంతాలలో
- గతం లో ప్రతి కుటుంభం నుండి ఒక వ్యక్తీ చెరువు పూడిక తీసి పిచ్చి మొక్కలు తీసేవారు. అందరు కలిసి చెరువులో చేపలు పట్టుకొని ఊరిమద్య లో కుప్పగా పోసి పంచుకొనేవారు ఈ మాటలు పలికింది? వెంకట రెడ్డి అనే వృద్ద రైతు
- ఒకప్పుడు డోకూర్ గ్రామ చెరువు ద్వార ఎంత భూమి సాగయ్యేది? 400 ఎకరాల భూమి
- డోకూర్ గ్రామ౦లో ప్రస్తుతం వరి పంటను ఏ నీటితో సాగు చేస్తున్నారు? త్రావ్విని బోరు బావుల నీటితో
- డోకూర్ గ్రామ౦ లో ప్రస్తుత అధిక సాగు దేనిపై ఆధార పడి ఉంది? బోరు బావులపై
Wells and Borewells (బావులు, బోరుబావులు)
- గతం లో డోకూర్ గ్రామ బావులలో ఎంత లోతులో నీరు లభించేది? 40, 60 అడుగుల లోతులో (ప్రస్తుతం ఎండిపోయాయి)
- డోకూర్ గ్రామ౦ లో ప్రస్తుతం నీటి కోసం ఎంత లోతు త్రవ్వవలసి వస్తుంది? 300-500 అడుగులు (గతం లో 100-150 అడుగుల్లో నీరు లభించేది)
Agriculture and Crops (వ్యవసాయము మరియు పంటలు)
- డోకూర్ గ్రామ ప్రజలు పండించే పంటలు? పత్తి, వేరుశనగ, ఆముదం, వరి, సజ్జ, అలసంద, కంది
- డోకూర్ గ్రామ ప్రజలు వేరుశనగ పంటను తగ్గించి ఆముదం సాగు చేయడానికి గల కారణం? అడవి పందుల సమస్య వల్ల
- డోకూర్ గ్రామ ప్రజలు చవుడు నేలల్లో పండిస్తున్నరు ? సజ్జ
- వరి పంట సాగుకు ఏ నీటిని ఉపయోగిస్తున్నారు ? పెద్ద చెరువు, సంపెంగ వాగులోని నీటిని (వాగు ఎండి పోతే వరిపంట ఎండిపోతుంది)
- రబీ పంటగా (అక్టోబర్ – జనవరి మధ్య) బోరుబావులపై ఆధారపడి ఏ పంటలను సాగు చేస్తున్నారు? వరి, వేరు శనగ
- హర్వేస్టార్ లు అనగా ? కోత యంత్రాలు
- వరినుండి దిగుబడి ఎకరానికి ఎంత ఉంటుంది (డోకూర్ గ్రామ రైతులు ప్రకారం) ? 20-30 క్వింటాళ్ళు
Fruit Gardens (పండ్ల తోటలు)

- చీనీ తోటలు అనగా ? బత్తాయి / మోసంబి తోటలు
- పండ్ల చెట్ల నడుమ రబీలో అంతర పంటలుగా డోకూర్ గ్రామ ప్రజలు ఏ పంటను వేస్తారు? వేరు శనగ
- అంతర పంటలుగా వేసిన వేరు శనగ కు ఏ నీటి విధానాన్ని అవలంబిస్తారు? తుంపర సేద్య విధానాన్ని
- సుస్థిర భూ వినియోగ విధానం అనగా? భూ సారాన్ని కాపాడు కొంటూ, భూ గర్భ జలాలు పునరుద్దరించ బడేలా, అటవీ భూమి, పచ్చిక బీళ్ళు, సాగు భూమి మధ్య సమతౌల్యం ఉండేలా సేద్యం చేయడం
Livelihoods (జీవనోపాధులు)
- డోకూర్ గ్రామ౦ లో వ్యవసాయ పనులు ఎన్ని నెలలు ఉంటాయి? 6 నెలలు
- ఉపాధి కోసం డోకూర్ గ్రామ ప్రజలు ఏయే గ్రామాలకు వలస వెళతారు? హైదరాబాద్, గోవా, పూనా ప్రాంతాలకు (జూన్ లో తిరిగి వస్తారు)
Animal Husbandry (పశు పోషణ)
- డోకూర్ గ్రామ ప్రజలు పాలను ఎవరికి విక్రయిస్తారు? ప్రభుత్వ సహకార సంఘాలకు (లీటర్ పాల ధర 35-40 రూపాయలు)
- డోకూర్ గ్రామ గొర్రెల కాపరుల ఆదాయం సంవత్సరానికి ఎంత ఉంటుంది? సుమారు 1 లక్ష రూపాయలు
- పంట పురుగుల నియంత్రణకు ఏ సేంద్రియ పద్దతిని డోకూర్ గ్రామ ప్రజలు ఉపయోగిస్తున్నారు? వేప కషాయం
- డోకూర్ గ్రామ ప్రజలు తమ గొర్రెలను మన్యం కొండలతో పాటు ఏయే ప్రాంతాలలో మేపుతారు? నల్గొండ, కర్నూలు జిల్లాలలో
Other Occupations (ఇతర పనులు)
| వృత్తులు | కుటుంభాల సంఖ్య |
| వడ్రంగ౦ పనిచేసేవారు | 2 |
| కమ్మరి పని చేసేవారు | 2, 3 |
| ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కుటుంబాలు | 20 |
| రైస్ మిల్లు | 1 |
| గొర్రెల పెంపకం పై ఆధారపడిన కుటుంబాలు | 20 |
Market and Transport (మార్కెట్, రవాణా)
- పండించిన వరికిని ఎక్కడ అమ్ముతారు? దేవరకద్ర లోని వ్యవసాయ మార్కెట్ లో
- పత్తిని ఎక్కడ అమ్ముతారు? జడ్చర్ల, మదనపురం (వనపర్తి రోడ్డు) లో
- డోకూర్ గ్రామ రైతులు ఎదుర్కొనే సమస్యలలో ఒకటి? వర్తకులు వాళ్లకు ఇష్టం వచ్చిన ధరలను నిర్ణయించడం
Residential Area of the Village (గ్రామనివాస ప్రాంతం)

2011 జనాభా గణన ప్రకారం
| గ్రామం లో కుటుంబాలు | 570 |
| మొత్తం జనాభా | 3400 |
| ఎక్కువ భూమి ఉన్న కుటుంభాలు | 350 |
| ½ ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న కుటుంభాలు (వ్యవసాయ కూలీలు) | 220 |
| 30 ఎకరాల భూమి ఉన్న పెద్ద రైతులు | 3, 4 |
| అధికశాతం రైతులు (చిన్న రైతులు) | ½ నుండి 5 ఎకరాలు |
- డోకూర్ గ్రామ ప్రజలకు త్రాగునీటి సదుపాయం ? తాగు నీటి పంపుల ద్వార సహాయం చేస్తున్నారు
- దేవరకద్ర నుండి వనపర్తి ఏ జాతీయ రహదారి మార్గం లో ఉంది? N H 44
- డోకూర్ గ్రామానికి రైల్వే స్టేషన్ ఏ దిశలో ఉంది? ఉత్తర దిశలో (3 పాసింజర్ రైళ్ళు ఆగుతాయి)
- భూములను ఎన్ని రకాలుగా విభజిస్తారు? 2 (మెట్ట, తరి)
- మెట్ట భూమిలో వేటిని పండిస్తారు? అపరాలు
- తరి భూముల్లో ఏ పంటను పండిస్తారు? సాగు నీటితో వరి పంటను
- ఇటువంటి టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్స్ కోసం చూస్తూనే ఉండండి kingsdsc.in








