తెలంగాణా లోని కొండలు ఏ కనుమల లోనివి ? పశ్చిమ కనుమల లోనివి
జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దున ఉన్న కనుమలు? తూర్పు కనుమలు (ఛత్తీస్ ఘడ్, ఆంధ్ర ప్రదేశ్, ఓడిసా రాష్ట్రాలలోకి విస్తరించి ఉన్నాయి
ఈ కొండలలో నివసించే గిరిజన సమూహాలు? సవర, కొండ దొర, గదబ, గోండు, మన్నెదొర, ముఖ దొర, కోయ
గిరిజన ప్రజల వృత్తి ? అటవీ ఉత్పత్తులు సేకరణ, వేట
Penugolu (పెనుగోలు) గ్రామం ఏ జిల్లాలో ఉంది? ములుగు జిల్లా లో (వాజేడు మండలం)
Penugolu (పెనుగోలు) లో నివసించే గిరిజన తెగ? కోయ తెగ
కోయ అనగా అర్ధం ఏమి? కొండలలో ఉంటున్న మంచి మనిషి
కోయ గిరిజన తెగ మాట్లాడే భాష? కోయ భాష
కొండ ప్రాంతాల నుండి వలసలుగా వెళ్ళిన కోయ ప్రజలు ఎక్కువగా ఎక్కడ స్థిరపడ్డారు? ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరి జిల్లాలలో
వలసవెళ్ళిన కోయప్రజలు ఏ భాషనూ తమ భాషగా చేసుకొన్నారు? తెలుగు బాషను
పెనుగోలు గ్రామానికి సరిహద్దులుగా ఉన్న గుట్టలు
దిక్కు
గుట్ట పేరు
ఉత్తరం
కర్రెగుట్ట లేదా నల్ల గుట్ట (ఛత్తీస్ ఘడ్ రాష్ట్రము లో)
దక్షిణం
వంక మామిడి గుట్ట
తూర్పు
కళ్ళు కుంటల గుట్ట
పడమర
చిన్న కుమ్మరి లంక, పెద్ద కుమ్మరి లంక
వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుండి ప్రవహించే వాగుపేరు? నల్లందేవి వాగు (గోదావరి నదిని కలిసే ప్రాంతం లో ఉంది)
గుమ్మడి దొడ్డే గ్రామం ఏ కొండలలో ఉంది? వాజేడు కొండలలో
చీకుపల్లి దగ్గర ఉన్న ప్రఖ్యాత జలపాతం? బొగతా జలపాతం
వాజేడు పెనుగోలు గ్రామం మధ్య దూరం? 20 కిమీ
పెనుగోలు గ్రామ ప్రజలు ఆసుపత్రి, ఉన్నత పాటశాల చదువుల నిమిత్తం ఎక్కడికి వెళతారు ? వాజేడు (మండల కేంద్రం) కు
పోడు
పెనుగోలు గ్రామం లో కోయలు ఏ పద్దతిలో పంటలు సాగు చేస్తారు? పోడు పద్దతి లో
పోడు వ్యవసాయానికి మరొక పేరు? ఝూమ్ సాగు (కొండలలో వ్యవసాయం చేసే ప్రత్యేక విధానం)
పోడు వ్యవసాయం అమలులో ఉన్న రాష్ట్రాలు? ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో
పోడు వ్యవసాయం చేసే పద్దతి? కొండలలో చెట్లు నరికి భూమిని సదును చేసి వ్యవసాయం చేస్తారు. డిసెంబర్ లో చెట్లు నరికి ఆ కొమ్మలను ఏప్రిల్, మే నెలల్లో తగలబాడతారు. జూన్ లో వర్షాలు పడినప్పుడు విత్తులు విట్టుతారు. కొంత కాలం వ్యవసాయం చేసిన తరువాత ఆప్రాంతం విడిచి వేరే ప్రాంతానికి వెళతారు. మొదటి విడిచిన ప్రాంతానికి చాలా సంవత్సరాలు గడిచిన తరువాత తిరిగి వస్తారు. వీరు నాగలి గాని పారగాని ఉపయోగించారు. ఈ విధంగా వ్యవసాయం చేసేపద్దతిని పోడు వ్యవసాయం అంటారు
పోడు వ్యవసాయం లో నేలను దున్నక పోవుటకు గల కారణం? వానలు పడినపుడు పై మట్టి తెలికగా కొట్టుకొని పోయి నేల సారం తగ్గుతుంది కాబట్టి
పోడు వ్యవసాయం ద్వార పండించే ముఖ్య పంటలు? జొన్నలు, మొక్కజొన్నలు, దుంపలు, చిరుధాన్యాలు, అపరాలు, కూరగాయలు, ఆకు కూరలు (ఈ పండించిన పంటలు వీరికి 6 నెలల వరకు ఆహారంగా సరిపోతాయి) కోయలు మంచే కట్టి డిసెంబర్ వరకు పంటలు కాపాడుకొంటారు
పోడు పద్దతిలో జొన్న సగటున ఎకరానికి ఎంత దిగుబడి ఇస్తుంది? 250 కిలోలు
Penugolu వ్యవసాయ భూమి దిగుబడి
గతం లో ప్రతి కుటుంబానికి ఉన్న సగటు భూమి
2-2.5 ఎకరాలు
ప్రస్తుతం ప్రతి కుటుంబానికి ఉన్న సగటు భూమి
1-1.5 ఎకరాలు
జొన్న సగటు దిగుబడి ఎకరానికి
250 కిలోలు
ప్రతి కుటుంబానికి లభించే జొన్నలు
600 కిలోలు
ప్రతి కుటుంబానికి లభించు చిరు ధాన్యాలు
150-250 కిలోలు
వెదురు కొట్టే పనిద్వారా సంపాదించు ఆదాయం
రోజుకు 150 రూపాయలు
పెనుగోలు గుట్టలపై నివసించే కుటుంబాలు
32 (124 మంది)
అటవీ ఉత్పత్తులు
పెనుగోలు గ్రామ ప్రజలు ముఖ్య ఆహార వనరు? తేనే, వెదురు చిగుళ్ళు
లేత వెదురు చిగుళ్ళకు పేరు? కరికొమ్మలు
వెదురు పొదల చివర్లనుండి సేకరించే ఆహరం? కరికొమ్మలు
పెనుగోలు గ్రామ ప్రజలుకు వేసవిలో లభించు ముఖ్య ఆహారం? తాటి కల్లు
పెనుగోలు గ్రామ ప్రజలుకు త్రాగు నీరు ఎక్కడ నుండి లభిస్తుంది? నీటి ఊటలు, వాగుల నుండి (నీటి కోసం గ్రామస్తులు 30 నిమిషాలు నడిచి వెళ్ళవలసి వస్తున్దుంది)