Landforms:

- నైసర్గిక స్వరూపం అనగా? భూ స్వరూప ఎత్తులో ఉన్న అంతరం (భూ ఉపరితల స్వరూపాలు పర్వతాలు పీఠభూములు, మైదానాలు) Telangana Landforms
Types of Landforms (భూ స్వరూప రకాలు)
- భూస్వరూపాలు ఎన్ని రకాలు? 3 (పర్వతాలు, పీఠభూములు, మైదానాలు)
Mountains (పర్వతాలు)
- అత్యధిక ఎత్తు, వాలులు కలిగి పైన తక్కువ సమతల ఉపరితలం గలిగి ఉన్న భూస్వరూపం? పర్వతం
- భారతదేశం లో ముఖ్య పర్వతశ్రేణులు? హిమాలయాలు, ఆరావళి, వింధ్యా సాత్పూర పర్వతాలు
- కొండలు – విస్తరించిన ప్రాంతాలు

| కొండల పేర్లు | విస్తరించిన ప్రాంతాలు |
| సాత్ మల కొండలు | ఆదిలాబాద్, నిర్మల్ |
| బాలాఘాట్ శ్రేణులు | మహబూబ్ నగర్, నిర్మల్ |
| అనంతగిరి కొండలు | వికారాబాద్ జిల్లా |
| కందికల్ కొండలు | పెద్దపల్లి, జయ శంకర్ జిల్లా |
| రాఖీ కొండలు | జగిత్యాల జిల్లా |
| దేవరకొండ కొండలు | నల్గొండ |
| నిర్మల్ కొండలు | నిర్మల్ జిల్లా |
| సిర్నపల్లి కొండలు | నిజామాబాద్ జిల్లా |
Plateaus (పీఠభూములు)
- విశాల ఉపరితలం కలిగి ఉన్న ఎత్తైన ప్రదేశాలను ఏమంటారు? పీఠభూములు
- భారతదేశం లోని అతిపెద్ద పీఠభూములు? దక్కన్ పీఠభూములు
- భారతదేశం లోని దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపు ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతాన్ని ఏమంటారు? పశ్చిమ కనుమలు
- తెలంగాణా ప్రాంతాన్ని తెలంగాణా పీఠభూమి అని ఎందుకు అంటారు? తెలంగాణాలో అత్యధిక భాగం దక్కన్ పీఠభూమిలో ఉండడం వల్ల
- తెలంగాణా పీఠభూమి / దక్కన్ పీఠభూమి ఎటువైపుకు వాలి ఉంది? తూర్పు కు
Plains (మైదానాలు)

- సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల స్వరుపాలకు గల పేరు? మైదానాలు
- మైదానాలు ఎలా ఏర్పడతాయి? పెద్ద నదులు మేట వేసిన ఒండ్రు తో ఏర్పడతాయి
- పంజాబ్ మైదాన ప్రాంతం ఏ నదుల వల్ల ఏర్పడింది? సింధు దాని ఉపనదుల ప్రభావం వల్ల
- ఉత్తర ప్రదేశ్ బీహార్ బెంగాల్ రాష్ట్రాలలో ఏర్పడిన మైదానము? గంగా మైదానము
- భారతదేశం లో విశాల మైదానానికి గల పేరు? గంగా సింధు మైదానం
- భారతదేశ తూర్పు దిక్కన బంగాళాఖాత తీరానికి అనుకోని ఉన్న మైదానం? తూర్పు తీర మైదానం
- తూర్పు తీరమైదనాన్ని కలిగిన రాష్ట్రాలు? తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, ఓడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధిక భాగం
- పశ్చిమ తీర మైదానం కలిగిన రాష్ట్రాలు? గురరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు
- ఎగువ తెలంగాణా పీఠభూమి గుండా ప్రవహించు నదులు? గోదావరి, కృష్ణ (తూర్పు కు ప్రవహిస్తున్నవి)
- ఎగువ తెలంగాణా పీఠభూమి తెలంగాణా రాష్ట్రానికి ఏ దిశలో ఉంది ? పశ్చిమ దిశలో
- ఎగువ తెలంగాణా పీఠభూమిని మినహాయిస్తే మిగిలిన తెలంగాణా ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారు? దిగువు తెలంగాణా పీఠభూమి అని (ఇది కుడా తూర్పుకు వాలి ఉంది)
- ఎగువ తెలంగాణా పీఠభూమిలో ఉన్న నగరాలు/ పట్టణాలు? జంట నగరాలు, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ
- జంట నగరాలు అని వేటిని పేర్కొంటారు? హైదరాబాద్ – సికింద్రాబాద్ లను
- దిగువ తెలంగాణా పీఠభూమి లో ఉన్న పట్టణాలు? వరంగల్, కరీంనగర్
- తెలంగాణా నదులలో ప్రధాన నదులు? గోదావరి, కృష్ణ (బంగాళాఖాతం లో కలుస్తున్నాయి)
- గోదావరి నది ఏ ప్రాంతం లో తెలంగాణా లో ప్రవేశిస్తుంది? బాసర వద్ద (నిర్మల్ జిల్లా )
Delta (డెల్టా)

- డెల్టాలు ఎలా ఏర్పడతాయి? నదులు తీసుకువచ్చిన ఒండ్రు మట్టి, ఇసుక మేటలు వేయబడి డెల్టాలు ఏర్పడతాయి
- డెల్టాలు ఏ ఆకారం లో ఉంటాయి? త్రిభుజాకారం లో
- హ్యూమస్ దేనితో ఏర్పడుతుంది? ఆకులు చెట్లు మొదలగునవి కుల్లిపోగా వాటితో ఏర్పడుతుంది
- భారత దేశం లో ముఖ్య డెల్టా ప్రాంతాలు
| డెల్టా | విస్తరించిన ప్రాంతం |
| సుందర్ బన్స్ డెల్టా / గంగ బ్రహ్మపుత్ర డెల్టా | ప్రప్రంచం లోనే పెద్ద డెల్టా. ప. బెంగాల్ ప్రాంతం |
| మహానది డెల్టా | ఓడిసా ప్రాంతం |
| గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా | ఆంధ్ర ప్రదేశ్ |
| కావేరి డెల్టా | తమిళనాడు రాష్ట్రము |
- కృష్ణా నది ఉపనదులు ఏవి? కుడివైపున: తుంగభద్రా, కోయన, ఘటప్రభ, మల ప్రభ, యర్లా ఎడమవైపున: బీమా, మూసి, మున్నేరు, దిండి, పాలేరు
- గోదావరి ఉపనదులు ఏవి? ఎడమ వైపు : ప్రాణహిత (పెద్ద ఉపనది), ఇంద్రావతి, శబరి, సీలేరు, పూర్ణ కుడివైపున: మంజీరా, మానేరు, ప్రవర, మూల
- గోదావరి పై నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట ? సర్ అర్ధర్ కాటన్ బ్యారేజ్ (ధవళేస్వరం బ్యారేజ్)
- సర్ అర్ధర్ కాటన్ బ్యారేజ్ (ధవళేస్వరం బ్యారేజ్) ఎక్కడ ఉంది? ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమండ్రి దగ్గరలో
6.3.2 Penamakuru – A Village in the Krishna Delta (కృష్ణాడెల్టాలోని ఒక గ్రామం – పెనమకూరు)

Bandar Canal (బందరు కాలువ)
- ఉయ్యూరు పెనమ కూరు మధ్య దూరం? 3 కిమీ
- ఉయ్యూరు పెనమకూరు మధ్య ఉన్న కాలువ? బందరు కాలువ
- ప్రకాశం బ్యారేజ్ ఎక్కడ ఉంది? విజయవాడ లో (కృష్ణా నదిపై)
- బందరు కాలువ ఎక్కడి నుండి ప్రవహిస్తుంది? ప్రకాశం బ్యారేజ్ నుండి
- కృష్ణా నదికి బందరు కాలువకు మధ్య ఉన్న గ్రామం? పెనమకూరు
- ప్రకాశం బ్యారేజ్ ని ఎప్పుడు నిర్మించారు? 1855 వ సంవత్సరం లో
- కృష్ణా నది ఉత్తర ఒడ్డున ఉన్న నగరం? విజయవాడ
- కృష్ణా నది ద్వారా మళ్లించిన నీటితో ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 12 లక్షల ఎకరాలు
Soils (నేలలు)
- పెనమకూరు లో ఎక్కువ భాగం ఏ నేలలు ఉన్నాయి? సారవంతమైన ఒండ్రు, నల్లరేగడి నేలలు (కొన్ని ప్రాంతాలలో ఇసుక భూములు ఉన్నాయి )
- ఒండ్రు నేలలు లేదా ఒండలి నేలలు అనగా? నదులచే నిక్షేపించ బడిన నేలలు
- ఎక్కువ సారవంతమైన నేలలు? ఒండ్రు నేలలు
- పెనమకూరు లో నల్లరేగడి ఎంత లోతువరకు కనిపిస్తుంది? 15 అడుగుల లోతువరకు
- సెల్ఫ్ ప్లవింగ్ (స్వయంగా మట్టి మార్పిడి) అనగా? నల్లరేగడి ప్రాంతం లో ఆరిపోయిన నేలలో పగుళ్ళు ఏర్పడతాయి. భూ ఉపరితలం పై ఉన్న మట్టి ఈ పగుళ్ళలో చేరుతుంది. దీనికి గల పేరే
- పెనమకూరు లో భూమి ఎల్లప్పుడు సారవంతంగా ఉండడానికి గల కారణం? సెల్ఫ్ ప్లవింగ్
Rainfall and Irrigation (వర్షపాతం, సాగునీరు)

- పెనమ కూరు లో ఏ ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షం సంభవిస్తుంది? నైరుతి ఋతుపవనాల వల్ల (జూన్ – అక్టోబర్)
- పెనమకూరు లో నీరు సమృద్ది గా లభించే చోట ఎన్ని పంటలు పండిస్తారు? 2 లేదా 3 పంటలు
- పెనమకూరు గ్రామం లో నీరు ఎంత లోతులో లభిస్తుంది? 15 నుండి 25 అడుగుల లోతులో (ఈ ప్రాంతం లో ఎక్కువ బోరు బావులు సబ్ మెర్సిబుల్ మోటార్ తో పనిచేస్తున్నాయి
- ఏయే సంవత్సరాలలో కృష్ణా నదికి భయంకర వరదలు వచ్చాయి? 1997, 2006, 2009
Crops (పంటలు)
- సాల్వ పంట వివరణ: పల్లపు భూములలో వరిని నాటి, ఋతుపవన ప్రారంభం లో సాల్వ పంటకు వరినారు పోస్తారు. జూన్, జూలై మాసాలలో దాన్ని పొలాలలో నాటుతారు. ఈ పంటలనే సాల్వ పంటలు అంటారు
- MTU, 2716, BPT, స్వర్ణ అనేవి ఏమిటి? వరి వంగడాలు
- సాల్వ పంట ఎప్పుడు కోతకు వస్తుంది? అక్టోబర్ నవంబర్ లో
- డిసెంబర్ నుండి వేసే శీతాకాల పంటకు గల పేరు? దాళ్వా (వరి లేదా పప్పు ధాన్యాలు పండిస్తారు)
- చెరకు పంట చేతికి రావడానికి పట్టు కాలం? 9 నెలలు నుండి 1 సంవత్సరం
- పెనమకూరు మెట్ట భూముల్లో ప్రస్తుతం ఏ పంటను పండిస్తున్నారు? పసుపు, కంద, అరటి
- పసుపు, కంద, అరటి పంటలు వర్షాకాల ప్రారంభం లో నాటితే ఎప్పుడు చేతికి వస్థాయి? ఫిబ్రవరి, మార్చి నెలల్లో
Vegetables (కూరగాయలు)
- మెట్ట భూములు, లేదా గరువు భూములు, నీరు లభించని పల్లపు భూములు ఏ సాగుకు అనుకూలము? కూరగాయలు
- పెనమకూరు రైతులు పండిన కూరగాయలను ఎక్కడ విక్రయిస్తారు? ఉయ్యూరు రైతు బజారులో
- భూ సారాన్ని పెంచడానికి రైతులు ఏ పంటలును వేస్తారు? జీలుగ, పిల్లి పెసర (చిక్కుడు జాతికి చెందిన పంటలు)
- భూమిలో నత్రజని శాతం పెరగడానికి ఏ పంటలను వేస్తారు? చిక్కుడు జాతి పంటలను
- భూమిలో నత్రజని శాతం పెరగాలి అంటే వేసిన చిక్కుడు జాతి పంటలను ఎలా ఉపయోగించు కొంటారు? వేసిన 30-40 రోజుల తరువాత మొక్కలను భూమిలో కలిపి దున్నుతారు
Gardens (తోటలు)
- తేమను నిలుపుకొనే సామర్ధ్యం తక్కువగా ఉన్న నేలలు ? ఇసుక తో కూడిన మట్టినేలలు
- ఇసుక నేలల్లో వేటిని పండిస్తారు? పండ్ల మొక్కలు, తోటలు
Land Ownership and Tenancy System (భూయాజమాన్యం, కౌలుదారి విధానం)

- పెనమ కూరులో మొత్తం కుటుంభాల సంఖ్య? 750
- పెనమకూరులో 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న కుటుంభాలు? 10 కుటుంబాలు
- పెనమకూరు లో 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న కుటుంభాలు? 150 కుటుంభాలు
- పెనమకూరు లో భూమి లేని కుటుంబాలు ? 590 కుటుంభాలు
Basket Weaving (బుట్టలు అల్లడం)
- బందరు కాలువకు ఇరువైపులా నివసించే బుట్టలు అల్లే కుటుంబాల సంఖ్య? 15-20 కుటుంభాలు
- జగన్నాధ నాంచారయ్య గూర్చి వివరణ: 30 సంవత్సరాల క్రితం బందరు కాలువ దగ్గర స్థిరపడ్డాడు. ఈత ఆకులు సేకరించి బుట్టలు అల్లుతాడు. రోజుకు 5-6 బుట్టలు అల్లి విక్రయిస్తారు. కట్టా శివయ్య : బుట్టవల సహాయం తో కాలువలోని చేపలు పట్టి ప్రక్క గ్రామం లో విక్రయిస్తాడు
Poultry Farming (కోళ్ళ పెంపకం)
- పెనమకూరు గ్రామ కోళ్ళ ఫారం లో కోళ్ళ సంఖ్య? 80 వేలు
- పెనమకూరు గ్రామ కోళ్ళ ఫారం లో కోళ్ళు రోజుకు ఎన్ని గుడ్లు పెడతాయి? 50 వేల గుడ్లు
- పెనమకూరు గ్రామ కోళ్ళ ఫారం లో కోళ్ళ గుడ్లు ఎక్కడికి ఎగుమతి అవుతాయి? విజయవాడ, అసోం, బీహార్ రాష్ట్రాలకు
- వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఉదాహరణ? కోళ్ళ పెంపకం, రైసు మిల్లు
Road Transport and Markets (రోడ్డు రవాణా, మార్కెట్లు)
- పెనమకూరు చెరకు రైతులు పండిన పంటను ఎక్కడకి తరలిస్తారు? ఉయ్యూరు లోని పంచదార మిల్లుకు
- పెనమకూరు రైతులు అరటిపళ్ళు, కూరగాయలను ఎక్కడికి సరఫరా చేస్తారు? ఉయ్యూరు విజయవాడ లోని రైతు బజారులకు
- ఇటువంటి టెక్ట్ బుక్ కంటెంట్ బిట్స్ కోసం చూస్తూనే ఉండండి kingsdsc.in








