6.1 7.1 8.1 Maps

Maps

6.1 Study of Maps – Preparation  (పటాల అధ్యయనం – తయారీ)

  • తెలంగాణా రాష్ట్ర గీతం ? జయ జయహే తెలంగాణా జననీ జయకేతనం
  • తెలంగాణా గీత రచయిత? అందెశ్రీ
  • జాతీయ గీతం ? జనగణ మన
  • జనగణ మణ గీత రచయిత? రవీంద్రనాథ్ టాగూర్
  • ప్రతిజ్ఞ ఎవరు రాసారు? పైదిమర్రి వెంకట సుబ్బారావు
  • భారత రాజ్యంగ పీటికను ఎవరు రూపొందించారు? జవహర్ లాల్ నెహ్రు
  • ఒక స్థానం నుండి సాపేక్షంగా చెప్పేదానిని ఏమంటారు? దిక్కు
  • ఉత్తర దిక్కును దేనితో సూచిస్తారు? బాణం తో
  • ప్రాంతాలు – దిక్కులు
ప్రాంతాలుదిక్కులు
In which direction is Mahabubnagar from Vikarabadsouth-east
In which direction is Hyderabad from Yadadrisouth-west
In which direction is Khammam from Suryapetsouth-east
Is Komarambheem towards East of AdilabadYes
If you want to go from Manchiryal to Peddapalli, in which direction will you travel?South
  • Maps పటం లో గల దూరాలకు భూమిపై ఉన్న వాస్తవ దూరాలకు గల నిష్పత్తి? స్కేలు
  • మహబూబ్ నగర్ వనపర్తి మధ్య దూరం? 50 కిమీ
  • 1 సెం మీ కు 1 కిమీ మొదలైన పదాల ద్వారా సరళ వాక్యాలలో తెలిపే స్కేలు ? స్టేట్ మెంట్ స్కేలు
  • Maps పటాలు తయారు చేసేవారు రూపొందించిన చిహ్నాలకు గల పేరు? సంప్రదాయక చిహ్నాలు

7.1 Understanding different types of maps (వివిధ రకాల పటాలను అర్ధం చేసుకోవడం)

  • వందేమాతరం  రచయిత? బంకించంద్ర చటర్జీ
  • కొకానా బీచ్ ఎక్కడ ఉంది? బ్రెజిల్ దేశం లో (దక్షిణ అమెరికా).
  • లిబియా దేశం (ఆఫ్రికా లో ) ఉన్న ఎడారి? సహారా
ప్రాంతాలు దిక్కులు
Mehar went to Bhopal from Hyderabad. In which direction did he travel?North
Ashok went to Chennai from Lucknow. In which direction did he travel?South
Regina went to Bhubaneshwar from Mumbai. In which direction did she travel?East
Weprechu went to Jaipur from Kohima. In which direction did he travel?West
  1. హైదరాబాద్ నుండి రాష్ట్ర రాజదానులకు మధ్య దూరం
  • భౌతిక పటాలు వేటిని గూర్చి తెలుపుతాయి? వివిధ భూ స్వరుపాను గూర్చి , వివిధ ప్రాంతాల ఎత్తులను గూర్చి
  • భూమి మీద ఎత్తును దేని ఆధారంగా కొలుస్తారు?సముద్ర మట్టం ఆధారంగా
  • నింపూరు గ్రామం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? 50 మీటర్ల ఎత్తులో
  • నింపూరు గుడి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? 100 మీటర్ల ఎత్తులో
  • నింపూరు కొండ పై భాగం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? 150 మీటర్ల ఎత్తులో
  • సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు? సమతల రేఖలు / కాంటూర్ లైన్స్
  • భూ వాలు ఎత్తుగా ఉంటె కాంటూరు రేఖలు ఎలా ఉంటాయి? దగ్గరగా ఉంటాయి
  • కాంటూరు రేఖలు ____? ఒక దానికొకటి ఖండించు కోవు, వంకరలు తిరిగి ఉంటాయి
  • భూవాలు తక్కువగా ఉంటె కాంటూరు రేఖలు _____? దూరంగా ఉంటాయి
  • రోడ్లు వేసేటపుడు, ఆనకట్టలు కట్టేటపుడు ఉపయోగపడే పటాలు? ఎత్తును తెలిపే పటాలు
  • సముద్రం ఎత్తు నిరంతరం ______? పెరుగుతూ తరుగుతూ ఉంటుంది
  • M S L విస్తరించుము? Mean Sea Level
  • సాధారణంగా అతి తక్కువ ఎత్తుగల భూమి ఎన్ని మీటర్ల ఎత్తునుండి ఎన్ని మీటర్ల ఎత్తు మధ్య ఉంటుంది? 0 నుండి 200 మీటర్ల మధ్య

8.1  Study and Analysis of Maps (పటాల అధ్యయనం మరియు విశ్లేషణ)

  • ముఖ్యమని భావించే అంశాలు సూచించడానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు వేటిని ఉపయోగిస్తారు? పటాలను

Maps in Different Periods (వివిధ కాలాలలో పటాలు)  

  • భూమి నీరు ఆకాశం లను చూపించే చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్ ఎక్కడ లభించింది? జవోరా న౦దు (మధ్య ప్రదేశ్)
  • ప్రాచీన భారతీయ పటం లో ఎన్ని సముద్రాలు ఎన్ని ద్వీపాలను చూడవచ్చు ? ఏడు సముద్రాలు ఏడు ద్వీపాలు 
  • ప్రాచీన భారతీయ పటం లో కేంద్ర స్థానం లో ఉన్న పర్వతం? మేరు పర్వతం
  • ప్రాచీన కాలం లో భారత దేశం ఏ ద్వీపం లో ఉంది? జంభూ ద్వీపం లో
  • భారత దేశాన్ని ప్రాచీన కాలం లో ఏ పేరుతో సంబోదించారు? భరతవర్షం పేరుతొ
  • వివిధ ప్రదేశాల ఉనికిని గుర్తించడానికి ఉపయోగ పడేవి? అక్షాంశాలు రేఖాంశాలు
  • తీర రేఖ యొక్క విస్తృత పటాలు, లోతట్టు ప్రాంతాలు ద్వీపాల ఉనికిని చూపించే స్కెచ్ లు ఉపయోగించిన వారు? హిందూ మహాసముద్ర తీర ప్రాంతల వెంట ప్రయాణించే నావికులు
  • అక్షాంశ రేఖాంశాల భావనను క్రి శ 5వ శతాబ్దం లో ఉపయోగించిన వారు? ఆర్య భట్ట
  • మొఘలుల కాలంలో పట తయారీదారులు ఎవరి పద్దతులు అనుసరించారు? మధ్య ఆసియా వారి పద్దతులు
  • 17వ శతాబ్దం లో అట్లాస్ ను ఎవరు తయారుచేసారు? సాదిక్ ఇస్ఫాహాన్ (జాన్ పూర్ లో )
  • తన పటాలలో ప్రదేశాల ఉనికిని నిర్ణయించడానికి అక్షాంశ రేఖాంశాలను ఉపయోగించిన వారు? సాదిక్ ఇస్ఫాహాన్
  • మనకు అందుబాటులో ఉన్న పురాతన పటాలు ఎప్పటివి? నాలుగు వేల సంవత్సరాల నాటివి
  • మనకు అందుబాటులో ఉన్న పురాతన పటాలు ఎవరు రూపొందించారు? సుమేరియన్స్
  • సుమేరియా ప్రస్తుత పేరు? ఇరాక్
  • భూముల నుండి వచ్చే ఆదాయ లెక్కల కోసం భూముల వివరాలను పటాల సహాయం తో భద్ర పరిచినవారు? సుమేరియన్స్
  • మొదటి ప్రపంచ పటాలు తయారు చేసినవారు? బాబిలోనియన్స్ (ఇరాక్ వాసులు)
  • ప్రపంచ గుండ్రటి పళ్ళెం మాదిరి ఉంది అని ఊహించుకొన్నవారు? బాబిలోనియన్స్
  • బాబిలోనియన్ లు రూపొందించిన పట వివరణ: లోపలి వలయం లో తెలిసిన పట్టణాలు, గ్రామాలు నదులు,చిత్తడి భూములు, కొండలు ఉన్నాయి, బాబిలోనియా పట్టణాన్ని మధ్యలో చూపారు. లోపలి వలయం బయట చేదు నది ఉంది (ఉప్పునీటి సముద్రం). దాంట్లో త్రికోణం లో 7 సముద్రాలు ఉన్నాయి.
  • వివిధ ప్రదేశాలను తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలు తయారుచేసిన వారు? అనాక్సిమాండర్ (గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు), హేకేటియాస్ (టర్కీ లో మిలేటాస్ కు చెందినవాడు), హెరిడోటస్ (గ్రీకు)
  • భూమి గుండ్రంగా ఉందని దానిచుట్టూ సముద్రం ఉందని భావించినవారు? బాబిలోనియన్స్, గ్రీకులు
  • గ్రీకులు ప్రపంచాన్ని ఎన్ని ఖండాలు గా విభజించారు? 3 (యూరప్, లిబియా (ఆఫ్రికా), ఆసియా
  • గ్రీకులు రూపొందించిన ప్రపంచ పటాన్ని వేరు చేస్తున్న సముద్రం? మధ్యధరా సముద్రం
  • దగ్గర దూర ప్రాంతాల గూర్చి తెలుసుకొని పటాలు రూపొందించడం లో ఆసక్తి చూపినవారు? గ్రీకులు, రోమన్లు
  • అక్షాంశ రేఖాంశాల ఆధారంగా పటాలు ఖచ్చితంగా తయారుచేయడానికి ప్రయత్నించిన వారు ? గ్రీకులు
  • అక్షాంశ రేఖాంశాలను సరిగా గీయడానికి గ్రీకులకు ఎంత కాలం పట్టింది? 2000 సంవత్సరాలు
  • ప్రాచీన కాలం లో అక్షాంశ రేఖాంశాలను ఉపయోగించి సవివర పటాలు తయారుచేసిన భౌగోళిక శాస్త్ర వేత్త? టాలమి (ప్రస్తుతం అందుబాటులో లేవు)
  • టాలమి తయారుచేసిన Maps పటాలు ఏ ప్రాంతం గూర్చి సరైన సమాచారం ఇచ్చాయి? యూరప్ దాని చుట్టుప్రక్కల దేశాలకు సంబంధించి
  • పటాల తయారీలో అరబ్బు పండితులు, నావికులు ఎవరి పుస్తకాలను ఉపయోగించుకొన్నారు? టాలమి పుస్తకాలను
  • తన రాజుకోసం క్రి శ 1154 లో ప్రపంచ పటాన్ని తయారుచేసిన అరబ్ పండితుడు? అల్ ఇద్రిసి
  • అల్ ఇద్రిసి రూపొందించిన ప్రపంచ పటం ఏ ఖండాన్ని పూర్తిగా చూపించింది? యురేషియా ఖండాన్ని
  • అల్ ఇద్రిసి రూపొందించిన ప్రపంచ పటం యురేషియా తో పాటు ఏ ఖండం యొక్క ఉత్తర భాగాన్ని మాత్రమే చూపించింది? ఆఫ్రికా ఖండ ఉత్తర భాగం
  • అల్ ఇద్రిసి రూపొందించిన ప్రపంచ పటంలో ఆసక్తి గొలిపే అంశం? దక్షిణాన్ని పట పై భాగం లోను, ఉత్తరాన్ని క్రింది భాగం లోను చూపించడం జరిగింది. అరేబియా ను పటం మధ్యలో చూపించాడు
  • బైబిల్ ప్రకారం రూపొందించిన ప్రపంచ పటం ఎన్ని ఖండాలను పేర్కొంది? 3 (ఆసియా, యూరప్, ఆఫ్రికా)
  • బైబిల్ ప్రకారం రూపొందించిన ప్రపంచ పటం ప్రకారం అన్నింటికంటే పెద్ద ఖండం ? ఆసియా
  • యేసు క్రీస్తు జన్మస్థలం ? జెరూసలేం
  • జెరూసలేం ప్రాంతం ఏ ఖండం లో ఉంది? ఆసియా
  • టాలమి పుస్తకాలను యురోపియన్స్ తిరిగి ఎప్పుడు కనుగొన్నారు? క్రి శ 1480 ప్రాంతం లో (కాని టాలమి గీసిన పటాలు మాత్రం దొరకలేదు)
  • అమెరికాను కనుగొన్నది? కొలంబస్
  • భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నది? వాస్కోడి గామ
  • 16వ శతాబ్దం లో ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగిన దేశం? హాలండ్

Map Projection (పటాలలో ప్రక్షేపణం)

  • పట తయారిదారుల పితగా ఎవరిని పేర్కొంటారు? గెరార్డస్ మేర్కేటార్ (డచ్ దేశం)
  • గెరార్డస్ మేర్కేటార్ కాలం ? క్రి శ 1512-1594)
  • గెరార్డస్ మేర్కేటార్ చిత్రించిన పట విధానం పేరు? మేర్కేటార్ ప్రక్షేపణం
  • మనం ఉపయోగిస్తున్న పటాలు ఎవరి పటాల ఆధారంగా రూపొందించారు? మేర్కేటార్ ప్రక్షేపణం పటాల ఆధారంగా
  • ప్రపంచాన్ని చూపించడానికి నేటికి ఎవరి పద్దతిని వాడుతున్నారు? మేర్కేటార్ పద్దతిని
  • ఖండాలు పరిమాణం దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం దిశలను సరిగా చూపించే విధానాన్ని రూపొందించిన వారు? మేర్కేటార్

Colonial administration, explorations, military use, and map making

(వలసల ఏర్పాటు, అన్వేషణలు, సైనిక వినియోగం, పటాల తయారీ)

  • పటాలు తయారుచేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం భాగారదేశం లో ఏ శాఖను ఏర్పాటు చేసింది? భారత దేశ సర్వేక్షణ శాఖ (Survey of India)
  • భారత దేశ సర్వేక్షణ శాఖ (Survey of India) సర్వేయర్ జనరల్ గా ఎవరు నియమించబడ్డారు? జేమ్స్ రేన్నెల్
  • సర్వే ఆధారంగా భారతదేశపు మొట్టమొదటి పటాలు తయారు చేసినవారు? జేమ్స్ రేన్నెల్
  • ప్రపంచం లో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ ను ఆరంభించినవారు ? విలియం లా౦బ్టన్ (1802 లో)
  • చెన్నై నుండి హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును ఎత్తును నిర్ధారించిన వారు? విలియం లా౦బ్టన్
  • చెన్నై నుండి హిమాలయాల వరకు సర్వేక్షణను పూర్తీ చేసినవారు? సర్ జార్జ్ ఎవరెస్ట్
  • ఎవరి సర్వేక్షణ ద్వారా ప్రపంచం లోని ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అని తెలుస్తుంది? సర్ జార్జ్ ఎవరెస్ట్ సర్వేక్షణ ద్వారా
  • మొదటి సారి శాస్త్రీయ పద్దతి ఉపయోగించి ఎవరెస్ట్ శిఖరాన్ని కొలిచిన వారు? జార్జ్ ఎవరెస్ట్
  • ఎవరెస్ట్ శిఖర సర్వేక్షణ ఏ ప్రాంతం నుండి మొదలైనది? సముద్ర తీరమైన చెన్నై నుండి
  • మొబైల్ పోన్ కంపెనీకి అవసరమైన పటం ? గ్రామాలు, పట్టణాలు చూపించే పటం
  • మైక్రో వేవ్ టవర్ల నిర్మాణానికి అవసరమైన పటం? కొండలు అడవులు చూపించే పటం

Reading different thematic (subject-specific) maps (వివిధ విషయ నిర్దేశిత (థీమాటిక్) పటాలను చదవడం )

  • ఒక విషయం / అంశం గూర్చి తెలిపే పటాలు? విషయ నిర్దేశిత పటాలు (థిమాటిక్ మాప్స్)
  • థిమాటిక్ మాప్స్ కు ఉదా? మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, రాజధానులు వంటి రాజకీయ పటాలు
  • ప్రజలు భూమిని ఉపయోగించు కొంటున్న విధానాన్ని తెలియజేసే పటాలు? భూ వినియోగ పటాలు
  • కొండలు నదులు పీటభూములు వంటి వాటిని చూపే పటాలు? భౌతిక పటాలు
  • అధికారిక విషయ నిర్దేశిత పటాలలో రంగులను ఏ శ్రేణిలో ఉపయోగిస్తారు? ఛాయా క్రమ శ్రేణిలో
  • జనాభాను పటంలో రంగులు పూరించడం ద్వారా చూపే పటాలు? జనసాంద్రత పటాలు

Showing elevations and depressions in maps (పటాలలో ఎత్తు పల్లాలు చూపడం )

  • పాటలలో ఎత్తు పల్లాలను చూపడానికి ఉపయోగించే సంకేతాలు? కాంటూరు రేఖలు
  • కాంటూరు రేఖలు అనగా? సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే రేఖలు
  • కాంటూరు రేఖలకు గల మరొక పేరు? ఐసో లైన్స్
  • పటంలో సమాన విలువలు కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలును ఏమంటారు? ఐసోప్లేత్
  • భూమి యొక్క వాలు, సముద్ర మట్టం ఎత్తును సూచించే రేఖలు? కాంటూరు రేఖలు
  • కాంటూరు రేఖలు బాగా దగ్గరగా ఉంటె అర్ధం ఏమిటి? తీవ్రమైన వాలు ఉందని

Atlas (అట్లాస్)

  • అట్లాస్ అనగా ? పటాల సంకలనం

Surface shading representation (ఉపరితల ఛాయా చిత్రీకరణ)

  • ఉపరితల చాయా చిత్రీకరణ అనగా? విమానాలు, హెలికాఫ్టర్ లు, వేడిగాలి బుగ్గలనుండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లి భూమిని ఫోటోల రూపం లో చిత్రించడం
  • ఉపరితల చాయా చిత్రాలు ____? పటాలు కావు
  • ఉపగ్రహ చాయా చిత్రాలు అనగా? అంతరిక్షం లో కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీయబడిన భూ ఉపరితల చాయాచిత్రాలు
  • ఉపగ్రహ చాయా చిత్రాలును ఎలా ఉపయోగిస్తారు? పటాల తయారి, ప్రణాళికల రూపకల్పన, వాతావరణ పరిశోధన, అటవీ సంరక్షణ, యుద్ద తంత్రము లలో
  • ఇటువంటి టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్స్ కోసం చూస్తూనే ఉండండి kingsdsc.in

Penugolu
6.5 Penugolu – A Village on the Hills (పెనుగోలు – కొండలపై ఒక గ్రామం)

Leave a Comment