Globe – Model of the Earth

Introduction to Globe గ్లోబు పరిచయం

  • Globe – Model of the Earth భూమికి నమూనా? గ్లోబు (Globe)
  • గ్లోబు (Globe) పై వేటిని చూపించ వచ్చు? ఖండాలు, మహా సముద్రాలు, దేశాలు
  • గ్లోబు (Globe) అనే పదం ఏ పదం నుండి పుట్టింది? గ్లోబస్ (లాటిన్ పదం) నుండి
  • గ్లోబస్ అనగా అర్ధం ఏమిటి? గోళం
Globe – Model of the Earth

Northern and Southern Hemispheres ఉత్తర దక్షిణార్ధ గోళాలు

  • 0 (సున్నా) డిగ్రీల అక్షంశాన్ని ఏమంటారు? భూమధ్య రేఖ
  • భూమిని 2 సమాన భాగాలుగా విభజించు రేఖ? భూమధ్య రేఖ
  • ఉత్తర దక్షిణ ద్రువాలకు సమాన దూరం లో భూమిపై గీసిన ఊహారేఖ? భూమధ్య రేఖ
  • భూమధ్య రేఖను ఆంగ్లం లో ఏ పేరుతో పిలుస్తారు? ఈక్వేటార్
  • భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న అర్ధం గోళం? ఉత్తరార్ధ గోళం
  • భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న అర్ధ గోళం? దక్షిణార్ధ గోళం
  • భూమధ్య రేఖ కు గల మరొక పేరు? అతిపెద్ద వలయం / అతిపెద్ద వృత్తం

Latitudes అక్షాంశాలు  

  • అడ్డుగా గీయబడిన సమాంతర రేఖలకు గల పేరు? అక్షాంశాలు
  • అక్షాంశాల వల్ల ఉపయోగం? ఒక ప్రదేశ ఉనికి తెలుసుకోవచ్చు
  • ఒక ప్రదేశ ఉనికి తెలుసు కోవడానికి అక్షాంశ రేఖాంశాలలో మొదట దేనిని తెలుపుతారు? అక్షాంశాన్ని
  • అక్షాంశాలు _________? వృత్తాలు
  • అక్షాంశాల మొత్తం ? 180 (భూమధ్య రేఖతో కలిపి 181)
  • 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 72 డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే ప్రదేశం లో ఉండే నగరం? ముంబాయి
  • 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 77 డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే నగరం? బెంగలూరు
  • 28 డిగ్రీల ఉత్తర అక్షాంశం 77 డిగ్రీల తూర్పు రేఖాంశం దాదాపు ఖండించు కొనే ప్రదేశం? న్యూ ఢిల్లీ
  • 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 88 డిగ్రీల తూర్పు రేఖాంశం ఖండించుకొనే ప్రదేశం? కోల్కతా

Longitudes రేఖాంశాలు

  • మొత్తం రేఖాంశాలు ఎన్ని? 360 (179 తూర్పు రేఖాంశాలు+ 179 పశ్చిమ రేఖాంశాలు+ గ్రీన్విచ్ రేఖ+ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం)
  • గ్రీన్విచ్ రేఖ కు గల పేర్లు ఏవి? ముఖ్య రేఖాంశం, ప్రామాణిక రేఖాంశం, 0 (సున్నా) డిగ్రీల రేఖాంశ౦
  • గ్రీన్విచ్ రేఖ తూర్పు భాగానికి గల పేరు? పూర్వార్ధ గోళం
  • గ్రీన్విచ్ రేఖ పశ్చిమ భాగానికి గల పేరు? పశ్చిమార్ధ గోళం
  • 0 (సున్నా) డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేఖ దిశలో ఉన్న రేఖాంశం? 180  డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం
  • 180  డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం నకు గల మరొక పేరు? అంతర్జాతీయ దినరేఖ
  • రేఖాంశాలకు గల పేర్లు? నిలువు రేఖలు, మధ్యాహ్న రేఖలు, అర్ధ వృత్తాలు
  • రేఖాంశాలు వేటిని తెలుపుతాయి? పఠం యొక్క పొడవు ఎత్తులను తెలుపుతాయి 
  • 1 డిగ్రీ రేఖాంశం జరగడానికి భూమికి ఎంత సమయం పడుతుంది? 4 నిమిషాలు
  • రేఖాంశాల పొడవులు __________? సమానం
  • భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి, ధ్రువాల వద్ద కలుసుకొనే రేఖలు? రేఖాంశాలు
  • రేఖాంశాలు ఏ ఏ దిశలలో వ్యాపించి ఉంటాయి? ఉత్తర, దక్షిణ దిశలలో
అక్షాంశాలుడిగ్రీలు
ఉత్తర ధృవం90 డిగ్రీలు N
ఆర్కిటిక్ వలయం66 ½ డిగ్రీలు N
కర్కట రేఖ23 ½ డిగ్రీలు N
భూమధ్య రేఖ0 డిగ్రీలు
మకర రేఖ23 ½ డిగ్రీలు S
అంటార్కిటిక్ వలయం66 ½ డిగ్రీలు S
దక్షిణ ధృవం90 డిగ్రీలు S
వ.సంఖ్యప్రదేశంఅక్షాంశంరేఖాంశం
1విజయవాడ16.5 N80.6 E
2కడప14.4 N78.8 E
3తిరుపతి13.6 N79.4 E
4విశాఖపట్నం17.6 N83.2 E
5మీ గ్రామం  
వ.సంఖ్యప్రదేశంఅక్షాంశం రేఖాంశం 
  నుండివరకునుండివరకు
1భారతదేశం8.4 N37.6 N68.7 E97.25 E
2ఆంధ్ర ప్రదేశ్12.6 N19.9 N76.8 E84.8 E
3తూర్పు గోదావరి16.3 N17.6 N81.3 E82.6 E
4కోరుకొండ మండలం17 N 81.95 E 

Axis of the Earth భూమి యొక్క అక్షం  

  • ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూ నాభి గుండా గీసిన రేఖను ఏమంటారు? అక్షం
  • అక్షం యొక్క చివరలు ? ఉ. ధృవం, ద. ధృవం
  • ఉత్తర ధృవాన్ని ఏ అక్షరం తో సూచిస్తారు? N
  • దక్షిణ దృవాన్ని ఏ అక్షరం తో సూచిస్తారు? S
  • భూమి ఏ దిశలో తిరిగుతుంది? పడమర నుండి తూర్పుకు
  • తన చుట్టూ తాను తిరగడానికి భూమికి యెంత సమయం పడుతుంది? 24 గంటలు
  • ఒక డిగ్రీ తిరగడానికి భూమికి ఎంత సమయం పడుతుంది? 4 నిమిషాలు
  • గ్రహణాలు ఎలా ఏర్పడతాయి? సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖ మీదకు వచ్చినపుడు
  • గ్రహణాలు ఎన్ని ? 2 (సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం)
  • సూర్య గ్రహణం ఎలా ఏర్పడుతుంది? సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినపుడు
  • సూర్య గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? అమావాస్య రోజున (అన్ని అమావాస్యలలో సంభవించదు)
  • చంద్ర గ్రహణం ఎలా ఏర్పడుతుంది? సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినపుడు
  • చంద్ర గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? పౌర్ణమి రోజున
  • ఖండాలు ఎన్ని ? 7 (ఆసియా, ఆఫ్రికా, ఉ.అమెరికా, ద.అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా)
  • ఖండాలన్నిటిలో పెద్ద ఖండం?  ఆసియా
  • ఖండాలలో చిన్న ఖండం ? ఆస్ట్రేలియా
  • మసహముద్రాలు ఎన్ని ? 5 (పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, అంటార్కిటిక్)
  • మహా సముద్రాలలో కెల్లా పెద్ద మహాసముద్రం? పసిఫిక్
  • మహా సముద్రాలలో కెల్లా చిన్న మహా సముద్రం? ఆర్కిటిక్
  • పసిఫిక్ మహా సముద్రం యొక్క ఆకారం? ట్రై ఏంగిల్ (త్రిభుజాకారం)
  • అట్లాంటిక్ మహా సముద్రం ఏ ఆకారం లో ఉంటుంది? S ఆకారం
  • హిందూ మహా సముద్రం ఏ ఆకారం లో ఉంటుంది? M ఆకారం
  • ఆర్కిటిక్ మహా సముద్ర ఆకారం? 0 ఆకారం
  • అంటార్కిటిక్ మహా సముద్రానికి గల పేరు? అంటార్కిటిక్ షీల్డ్ అఫ్ ఐస్ (మంచు కవచం)

Movements of the Earth భూమి యొక్క చలనాలు

  • భూ చలనాలు ఎన్ని? 2 (భూ భ్రమణం, భూ పరిభ్రమణం)
  • భూ భ్రమణ వేగం ఎంత? గంటకు 1610 కిమీ
  • రాత్రి పగలు సంభవించడానికి గల కారణం? భూ బ్రమణ౦
  • భూ భ్రమణానికి పట్టు సమయం? 23 గంటల, 56 నిమిషాల, 4.09 సెకండ్లు (సుమారు 24 గంటలు/ఒక రోజు)
  • భూ పరి భ్రమణం అనగా ? భూమి సూర్యుని చుట్టూ తిరగడం
  • భూ పరిబ్రమణ౦ వల్ల ఏవి సంభవిస్తాయి? ఋతువులు, గ్రహణాలు, ఆయనాలు, విషవత్తులు
  • ఋతువులను వేటి ఆధారంగా విభజించారు? వాతావరణం లోని మార్పుల ఆధారంగా
  • భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గానికి గల పేరు? కక్ష్య
  • భూ కక్ష్య ఏ ఆకారం లో ఉంటుంది? దీర్ఘ వృత్తాకారం లో
  • భూ కక్ష్య పొడవు యెంత? 965 మిలియన్ కిలో మీటర్లు
  • భూ పరిబ్రమణానికి పట్టు సమయం? 1 సంవత్సరం (365 ¼ రోజులు)
  • సాధారణ సంవత్సరం లో ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు (ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి)
  • లీఫ్ సంవత్సరం ఎన్ని సంవత్సరాలకు ఒక సారి సంభవిస్తుంది? 4 సంవత్సరాలకు ఒక సారి
  • లీఫ్ సంవత్సరం లో ఎన్ని రోజులు ఉంటాయి? 366 రోజులు (ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటాయి)
  • ఉత్తర ధృవం సూర్యుని వైపు ఒంగి ఉన్న కాలం లో పగటి కాలం ఎంత ఉంటుంది? 6 నెలలు
  • భూమి గుండ్రంగా ఉందని ఎప్పుడు ధ్రువీకరించారు? 15వ శతాబ్దం లో
  • వేసవి ఆయనంతం అనగా? పగలు ఎక్కువ రాత్రి తక్కువ ఉన్న స్థితి
  • సూర్యుడు కర్కట రేఖ మీద ఎప్పుడు ఉంటాడు? జూన్ 21న
  • రాత్రి నిడివి తక్కువగా ఉన్న రోజు? జూన్ 21
  • ఉ. అర్ధ గోళం లో వేసవి ఆయనంతం ఉన్నపుడు ద.అర్ధ గోళం లో ఏ స్థితి ఉంటుంది? చలికాలం (శీతాకాల ఆయనంతం)
  • మకర రేఖ పై సూర్యుడు ఎప్పుడు ఉంటాడు? డిసెంబర్ 22 న
  • శీతాకాల ఆయనంతం అనగా? దక్షిణార్ధ గోళం లో వేసవి కాలం ఉండే కాలం

Equinox విషవత్తు  

  • రాత్రి పగళ్ళు ఎప్పుడు సమానంగా ఉంటాయి? విషవత్తులలో
  • విషవత్తులు ఎప్పుడు సంభవిస్తాయి? మార్చి 21, సెప్టెంబర్ 23
  • భూమధ్య రేఖమీద సూర్య కిరణాలు ఎప్పుడు నిటారుగా పడతాయి? మార్చ్ 21, సెప్టెంబర్ 23
  • ఉత్తరార్ధ గోళం లో వసంత ఋతువు ఉంటె దక్షిణార్ధ గోళం లో ఏ ఋతువు ఉంటుంది? శరద్రుతువు
  • ఉత్తరార్ధ గోళం లో వసంత ఋతువు ఎప్పుడు సంభవిస్తుంది? మార్చ్ 21
  • ఉత్తరార్ధ గోళం లో శరదృతువు ఎప్పుడు సంభవిస్తుంది? సెప్టెంబర్ 23
  • సూర్య కిరణాలు భూమధ్య రేఖపై ఎప్పుడు నిత్తనిలుగా పడతాయి? విషవత్తుల కాలం లో
  • దక్షిణార్ధ గోళం లో ఎప్పుడు శరదృతువు సంభవిస్తుంది? మర్చి 21
  • దక్షిణార్ధ గోళం లో ఎప్పుడు వసంత ఋతువు సంభవిస్తుంది? సెప్టెంబర్ 23
  • గ్లోబు Globe – Model of the Earth రూపకర్త? మార్టిన్ బెహిం (1492)
  • ఆధునిక గ్లోబు రూపకర్త?  టకి అల్ దిన్
  • టకి అల్ దిన్ ఆధునిక గ్లోబును ఎక్కడ రూపొందించాడు ? కాన్ స్టాంటి నోపిల్ అబ్జర్వేటరీ నందు
  • టకి అల్ దిన్ ఆధునిక గ్లోబును ఎప్పుడు రూపొందించాడు ? 1570 సంవత్సరం లో
  • అతుకులు లేని గ్లోబును రూపొందించిన వారు? మొఘల్ శాస్త్రవేత్తలు
  • ఏ మొఘల్ చక్రవర్తి కాలం లో మొఘల్ శాస్త్రవేత్తలు అతుకులు లేని గ్లోబును రూపొందించారు? జహంగీర్ కాలం లో
  • లాటిట్యూడ్ అనే లాటిన్ పదం ఏ భాషాపదం నుండి ఉద్భవించింది? లాటిన్ భాష పదం లాటిటూడో
  • లాటిటూడో అనగా? భూమి సమాంతరంగా గీయబడిన అక్షాంశం
  • లాటిటూడో యొక్క అర్ధం ఏమిటి? వెడల్పు, మందం, పరిధి, పరిమాణం
  • లాంగిట్యూడ్ అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది? లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుండి
  • లాంగిట్యూడో అనగా? నిడివి, పొడవు, వ్యవధి అని అర్ధం
  • ఏ దేశం లో వేసవికాలం లో క్రిస్మస్ పండుగ జరుపుకొంటారు? ఆస్ట్రేలియా లో

ఇటువంటి best టెక్ట్ బుక్ కంటెంట్ బిట్స్ కోసం ఫాలో చేయండి kingsdsc.in

Early Civilisations
6.6 Early Civilisations – Amazing Facts You Must Know

Early Life to Settled Life
6.5 Best Explanation: Early Life to Settled Life

Leave a Comment