Language Script and Great Literary Works

6.19 భాష, లిపి మరియు గొప్ప గ్రంథాలు

  • (Language Script and Great Literary Works) షాద్ నగర్ రైల్వే స్టేషన్ లో బోర్డు పై ఎన్ని భాషలలో షాద్ నగర్ అని రాసి వుంది? 4 భాషలలో

Language Script and Great Literary Works (భాష అంటే ఏమిటి)

  • భాష అనగా? మనుషులు భావాలను, ఆలోచనలను భావోద్వేగాలను సమాచారాన్ని ఇతరులకు వ్యక్తం చేయడానికి ఉపయోగించే సముచిత ప్రసార సాధనం
  • భాష వల్ల ఉపయోగాలు (Language Script and Great Literary Works)
    • మన పనులు క్రమపద్దతి లో ప్రణాళికా బద్దంగా చేసుకోవడానికిఇతరుల దృష్టిని మనవైపు త్రిప్పుకోవడానికి, ఇతరుల ద్వారా పనులు సాధించుకోవడానికి,కొత్త విషయాలు కనిపెట్టడానికి, నవ్వడానికి, పది మందిని నవ్వించడానికిబాహ్య ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి, విషయాలు ఊహించు కోవడానికివిషయాన్ని పరిశోధన చేసి కారణాలు తెలుసుకోవడానికి
    • మన భావాలు ఇతరులతో పంచుకోవడానికి
  • దాహాన్ని తీర్చే సహజ పానీయాన్ని ఏయే పేర్లతో వివిధ బాషలలో పిలుస్తారు? వాటర్, నీళ్ళు, తణణ్ఇ
  • ఒకే మూల ద్రావిడ భాషలనుండి వచ్చిన భాషలు? తెలుగు తమిళం, కన్నడ, మళయాళ, గోండు
  • ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందిన భాషలు? సంస్కృతం, హిందీ, మరాటీ, బెంగాలి
  • ఏయే భాష పదాలు తెలుగు భాషలోకి వచ్చి చేరాయి? సంస్కృతం, మరాటీ, అరబిక్, పర్షియన్ బాషా పదాలు (Language Script and Great Literary Works)

లిపి, రచనలు

  • భాషనూ చదవడానికి రాయడానికి ఉపయోగపడేది? లిపి
  • లిపి లో అక్షరాలకు ముందు వేటిని ఉపయోగించే వారు? బొమ్మలను
  • 4 వేల సంవత్సరాల క్రితం సింధు ప్రజలు వాడిన లిపి? బొమ్మల లిపి
  • భారతదేశం లో వాడుతున్న అనేక లిపులకు మూల౦? అశోకుడు ఉపయోగించిన బ్రాహ్మి లిపి
  • భారతీయ భాషలన్నిటికీ మూలమైన లిపి? బ్రాహ్మి లిపి (దేవనాగరి, తెలుగు, తమిళం వంటి భాషలు)
  • పురాతన శిలా శాసనాలలో ఒక శిలాశాసనం ఆంధ్ర ప్రదేశ్ లోని ఎక్కడ ఉంది? కృష్ణా జిల్లా బట్టిప్రోలు స్తూపం లో (క్రి పూ 200 సంవత్సరాల నాటికి చెందినది
  • అమ్మ వివిధ బాషలలో పిలిచే విధానం
భాషఅమ్మను పిలిచే విధానం
తెలుగుఅమ్మ
తమిళంతాయ్
ఆంగ్లంమదర్
సంస్కృతంమాతృ
పర్షియామదర్
మరాటీఆయి
హిందీమా
  • లిపిని మొదట్లో వేటిపై రాసేవారు? గుడ్డ మీద, ఆకుల మీద, చెట్లు బెరడు మీద (కొంత మంది కుండల మీద రాసేవారు అవి నేటికి లభ్యం అవుతున్నాయి)
  • దక్షిణ భారతదేశం లో వేటిపై రాసేవారు? తాటి ఆకులను ఒకే కొలతలతో కత్తిరించి ఘంటం తో రాసేవారు (నల్లరంగు సిరా పూసేవారు)
  • ఉత్తర భారత దేశం లో వేటిపై రాసేవారు? భూర్జ పత్రాలపై (హిమాలయాలలో పెరుగుతుంది) బెరడు పొరను కాగితం లా ఉపయోగించి రాసేవారు
  • మౌకిక సాహిత్యం అనగా? వ్రాత పూర్వకంగా కాక నోటి మాటలతో నిలిచి ఉన్నవి

వేదాలు

  • వేదాలను మొదట మౌకిక రూపం లోనే బోధించేవారు ఇలా ఎంతకాలం కాపాడారు? 3వేల సంవత్సరాలు (తరువాత లిఖితం చేసారు)
  • విశ్వం ఎలా ప్రారంభం అయినది అనే అంశం ఏ వేదమంత్రం లో ఉంది? ఋగ్వేద మంత్రం లో
  • విశ్వ ప్రారంభాన్ని గూర్చి తెలిపే మంత్రం? నాసదీయ సుక్త (ఋగ్వేదం)

గొప్ప ఇతిహాసాలు – రామాయణం, మహా భరతం

  • గొప్ప వ్యక్తులు చేసిన పనులను తెలిపేవి? ఇతిహాసాలు
  • ఇతిహాసాలు వేటిని వివరిస్తాయి? మంచి చెడులకు, ధర్మం అధర్మానికి మద్య జరిగే సంఘర్షణలు వివరిస్తాయి
  • భారతదేశానికి ముఖ్యమైన ఇతిహాసాలు ? 2 (రామాయణం, మహాభారతం)
  • రామాయణం దేనిని తెల్పుతుంది? సీతారాముల చరిత్ర, రామ రావణ యుద్దాన్ని
  • ఆదర్శ పురుషుడు, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భార్య, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పాలకుడు గూర్చి ఏది వివరిస్తుంది? రామాయణం
  • రామాయణానికి గల పేరు? ఆదికావ్యం
  • రామాయణాన్ని ఎవరు రచించారు?వాల్మికి మహర్షి (సంస్కృతంలో )
  • విభిన్న మనస్తత్వాన్ని కలిగిన దాయాదుల మధ్య ఏర్పడిన సంఘర్షణలు వివరించేది? మహా భరతం
  • కౌరవ పాండవుల మధ్య ఏర్పడిన ఘర్షణ దేనితో ముగిసింది? మహా భారత సంగ్రామం తో  
  • ప్రపంచం లో ఎక్కువ శ్లోకాలు, వందలకొద్దీ చిన్న చిన్న కథలు కలిగిన కావ్య౦? మహా భరతం
  • రామాయణాన్ని మొదట్లో కథకులు చెప్పినట్లే మహా భారతాన్ని మొదట్లో ఎవరు చెప్పారు? వీధి భాగవతులు
  • మహా భారతాన్ని ఎవరు రచించారు? వ్యాస మహర్షి (సంస్కృతం లో)
  • ఈ ఇతిహాసాలు గ్రంధస్తం చేయబడి ఎంతకాలం అని చరిత్రకారుల అభిప్రాయం? 1600 సంవత్సరాలు

జాతక కథలు  

  • గౌతమ బుద్దుడు ధర్మాన్ని ప్రచారం చేయడానికి చాల జన్మలు ఎత్తినట్లు కథలు ఉన్నాయి వీటికి గల పేరు? జాతక కథలు
  • జాతక కథలను ఎప్పుడు సంకలనం చేసారు? 1600-1800 మధ్య కాలం లో

తమిళ సంగమ వాంగ్మయం  

  • పూర్వకాలం లో దక్షిణ భారత దేశం లో ఎక్కువ మంది మాట్లాడే భాష ? తమిళం
  • సంగం వాంగ్మయం అనగా? అనేక మంది కవులు, కవయిత్రులు, పండితులు, రాసిన పద్యాలు అని అర్ధం
  • నీ రాజ్యం ఏనుగులతో నిండి ఉన్న దట్టమైన అడవిలా ఉంది ఇది దేనికి సంబందించింది? సంగం వాంగ్మయం లో రాజునూ ఉద్దేశించి చెప్పిన పద్యం

వైద్య, శస్త్ర చికిత్స రంగాలలో విశిష్ట గ్రంధాలు

  • ఆయుర్వేద వైద్య విధానానికి ఆది గ్రంధాలు గా వేటిని పేర్కొంటారు? చరక సంహిత, సుశ్రుత సంహిత
  • మూలికలు, ఆకులు, గింజలు వంటివి సేకరించి మందులు ఎలా తయారు చేయాలి, ఎలా వాడాలి, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడం ఎలా అనే అంశాలను ఏ గ్రంధం తెలియజేస్తుంది? చరక సంహిత, సుశ్రుత సంహిత (ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, సమతుల్య ఆరోగ్యవంతమైన జీవనం ఎలా గడపాలి తెలిపాయి)
  • శస్త్ర చికిత్సను గూర్చి తెలిపే గ్రంధం? శుశ్రుత సంహిత
  • చరక సంహిత గ్రంధకర్త ? ఆచార్య చరకుడు
  • శుశ్రుత సంహిత గ్రంధకర్త? ఆచార్య శుశ్రుతుడు

ఖగోళ, గణిత శాస్త్రాలలోని గ్రంధాలు

  • ఆర్యభట్ట రచించిన పుస్తకం? ఆర్య భట్టీయం
  • భూ బ్రమనం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయి. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు అని చెప్పినవారు? ఆర్య భట్ట
  • గణితం లో దశాంశ పద్దతిని స్థాన విలువలు సంఖ్యామానం కనుగొన్నవారు? ఆర్యభట్ట & ఇతరులు (ప్రస్తుతం గణితం లో ఈ విధానాలానే అనుసరిస్తున్నాం)
  • పూర్వం రోమన్ లు నూట రెండు ని ఇలా రాసేవారు? CII
  • పూర్వం రోమన్ లు నూట ఇరవై ఏడు ని ఇలా రాసేవారు? CXXVII (C=100, X=10, V=5, I=1)
  • రోమనులు దేన్నీ ఉపయోగించలేదు? 0 (సున్నా)
  • ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే సంఖ్యామాన పద్దతి? దశాంశ సంఖ్యామాన పద్దతి
  • పాణిని గూర్చి ఆసక్తి కర వ్యాక్యలు
    • ప్రాచీన భారతదేశం లో ప్రముఖ మేధావి
    • సంస్కృత భాషలో అష్టాధ్యాయి రచించాడు (భాషకు క్రమ పద్దతిని, ఇతర భాషను సులభంగా నేర్చుకొనే౦దుకు తోడ్పడింది)
  • పాణిని రాసిన అష్టాధ్యాయి పై సుదీర్ఘ వ్యాఖ్యానాన్ని రాసిన వారు? పతంజలి
  • కుషానుల కాలం లో బుద్దుని జీవిత చరిత్ర తెల్పుతూ గ్రంధం రాసింది? అశ్వ ఘోషుడు
  • అశ్వ ఘోసుడు రచించిన గ్రంధం? బుద్ధ చరితం
  • సంస్కృతం లో మొట్టమొదటి పద్య కావ్యం? ఆశ్వ ఘోషుడు రచించిన బుద్ధ చరితం
  • రామాయణ, మహా భారతాల ఆధారంగా 13 నాటకాలు రచించినవారు? భాస (ప్రసిద్ది గాంచిన నాటక కర్త)
  • అభిజ్ఞాన శాకుంతలం అనే గొప్ప నాటకాన్ని రాసినవారు? కాళిదాసు (శకుంతల, దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ ) ప్రపంచ ప్రసిద్ది పొందిన వివిధ పద్యాలను రచించాడు
  • మృచ్చకటికం నాటక రచయిత? శూద్రకుడు (పట్టణ ప్రజల జీవితాలను వర్ణిస్తూ రాసాడు)
  • ఇటువంటి ఉపయోగకరమైన టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి kings dsc యు ట్యూబ్ ఛానల్ మరియు kingsdsc.in వెబ్సైట్

Greenery in Telangana
Greenery in Telangana (very useful information)

Leave a Comment