Urban Local Self Government (Very useful information)

6.14 పట్టణ ప్రాంతం లో స్థానిక స్వపరిపాలన

  • Urban Local Self Government నగరాలలో వచ్చే పెద్ద సమస్య? చెత్తను వదిలించు కోవడం, మురికి కాలువల నిర్వహణ
  • నగరాలలో పౌర సౌకర్యాల కల్పనకు పెద్ద వ్యవస్థ అవసరం. దీనికి గల పేరు? పురపాలక సంస్థ
  • జనాభా ఆధారంగా పురపాలక సంస్థలను ఎన్ని రకాలు గా వర్గీకరించారు? 3 రకాలు (నగర పంచాయితీ, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పోరేషన్)
  • నగర పంచాయితీ జనాభా ఎంత ఉంటుంది? 20 వేలు నుండి 40 వేలు
  • మున్సిపల్ కౌన్సిల్ జనాభా? 40 వేలు నుండి 3 లక్షలు
  • మున్సిపల్ కార్పోరేషన్ జనాభా? 3 లక్షలు పైన

Urban Local Self Government (మునిసిపాలిటీల ఏర్పాటు)

  • నగర ప్రాంతాలను ఏ విధంగా విభజిస్తారు? వార్డులు, డివిజన్ లు గా
  • పురపాలక సంస్థలో వార్డు ప్రతినిధులను ఏమంటారు? కౌన్సిలర్ లు
  • కార్పోరేషన్ (Urban Local Self Government) లో ప్రతినిధులను ఏమంటారు? కార్పొరేటర్ లు
  • పుపాలక సంస్థల పెద్దలు గా ఎవరు వ్యవహరిస్తారు? చైర్మన్ / మేయర్
  • చైర్మన్ / మేయర్ ఏ విధానం లో ఎన్నిక అవుతారు? ప్రత్యక్ష ఎన్నిక విధానం ద్వారా
  • పురపాలక సంఘ ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒక సారి జరుగుతాయి? ప్రతి 5 సంవత్సరాలకు ఒక సారి
  • పురపాలక సంఘాలలో ఓటరు గా నమోదు అవడానికి ఎంత వయసు ఉండాలి? 18 సంవత్సరాలు, లేదా అంతకంటే ఎక్కువ
  • EVM = ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం

పురపాలక సంఘం – నిధులు

  • పురపాలక సంఘ (Urban Local Self Government) ఎన్నికలలో పోటీ చేయడానికి కావలసిన కనీస వయసు? 21 సంవత్సరాలు దాటి
  • పురపాలక సంఘాలు ఏ పనులు చేపడతాయి?
    • నీటి సరఫరా
    • వీధి దీపాలు
    • కొత్త రోడ్లు వేయడం, మరమ్మత్తులు,
    • మురికి కాలువల మరమ్మత్తులు నిర్వహణ చెత్తను తొలగించడం
    • పాటశాల ను నడపడం
    • చౌక ధరల దుకాణాలు
    • ఆసుపత్రుల నిర్వహణ మొదలగునవి
  • పురపాలక సంఘాలలో (Urban Local Self Government) ముఖ్య భూమిక పోషించేది? కౌన్సిలర్ లు
  • కౌన్సిలర్ ల ముఖ్య విధి? ప్రజలతో కలిసి ఉండి వారి అవసరాలు, సమస్యలు పురపాలక సమావేశాలలో చర్చిస్తారు
  • పురపాలక సంఘాలు విధించే పన్నులుకు ఉదా
    • ఇంటి పన్ను
    • నీటి పన్ను
    • వీధి దీపాల పన్ను
    • దుకాణాల మీద పన్ను
    • సినిమా టికెట్ల మీద పన్ను
  • పురపాల సంఘాలు వేటిపై ఆధారపడి పని చేస్తాయి? ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు పై
  • సబ్ కంట్రాక్టింగ్ అనగా? పురపాలక సంఘాలు చెత్త సేకరించడం, తొలగించడం వంటి పనులను ప్రైవేట్ కంట్రాక్టర్ లకు నియమించే విధానం

వేములవాడ నగర పంచాయితీ

 

Greenery in Telangana
Greenery in Telangana (very useful information)
  • వేములవాడ నగర పంచాయితీ ఏ జిల్లాలో ఉంది? సిరిసిల్ల రాజన్న జిల్లాలో
  • వేములవాడ నగర పంచాయితీ లో ఎన్ని వార్డులు ఉన్నాయి? 20
  • వేములవాడ నగర పంచాయితీ ఎప్పటివరకు మేజర్ గ్రామ పంచాయితీ గా ఉండేది? 2011 వరకు
  • వేములవాడ నగర పంచాయితీలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఏమిటి? శ్రీ రాజ రాజేశ్వరి స్వామి దేవస్థానము
  • వేములవాడ నగర పంచాయితీ లో తాగు నీటి వ్యవస్థను ఏ పేరుతో పిలుస్తారు? ఆకాశ గంగా అని పిలుస్తారు
  • ఆకాశ గంగా తాగు నీటి వ్యవస్థ వేములవాడ నగర పంచాయితీలో ఎప్పుడు ప్రారంభం అయినది? 2003 లో
  • వేములవాడ నగర పంచాయితీ ప్రాంతం లో పై నుండి వేయబడిన పైప్ లైన్ ఏ పథకం ద్వారా వేయబడినది? స్వజల ధారా పథకం (నీటిని రోజు విడిచి రోజు సరఫరా చేస్తారు)
  • స్వజల ధారా పథకం ద్వరా వేయబడిన పైప్ లైన్ లో భాగంగా ఎన్ని కుటుంభాలకు కలిపి నల్లా ఏర్పాటు చేసారు? 10 నుండి 15 కుటుంభాలకు (ఇలా 5 వేల కుటుంభాలకు రక్షిత మంచినీటి సరఫరా జరుగుతుంది)
  • చెత్తను డంపింగ్ యార్డుకు వేటి ద్వారా తరలిస్తారు? హైడ్రాలిక్ డంపర్ బీన్స్, ట్రాలీ అటో రిక్షాలు, ట్రాక్టర్ లు ద్వారా
  • వేములవాడ నగర పంచాయితీని అనుకోని ఉన్న వాగులో ఏ వేడుకలు నిర్వహిస్తారు? బతుకమ్మ వేడుకలు

Diversity in our Society

6.15 మన సమాజం లో వైవిధ్యం

  • భారతదేశం లో రాష్ట్రాల సంఖ్య? 29
  • తెలంగాణా రాష్ట్రము లో ఎన్ని భాషలు మాట్లాడతారు? 7 భాషలలో
  • ఆఫ్రికా సంతతి కి చెందిన బానిసలను ఎవరి కాలం లో హైదరాబాద్ పెద్ద మొత్తం లో తీసుకు వచ్చారు? గోల్కొండ సుల్తానులు, నిజాం ల కాలం లో
  • ఆఫ్రికా బానిసలతో హైదరాబాద్ లో వెలసిన కాలనీలకు ఉదాహరణ? హబ్సిగూడ
  • ఏయే సుదూర ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ లో స్థిరపడ్డారు? సామర్ఖండ్, బొఖారా, ఇరాన్, టర్కీ
  • దక్కాని భాషలు అని వేటిని పేర్కొంటారు? తెలుగు, హిందీ, ఉర్దూ భాషలు
  • హైదరాబాద్ ఏయే బాషల కవిత్వానికి కేంద్రంగా ఉంది? తెలుగు, ఉర్దూ

థార్ ఎడారి

  • భారతదేశం పాక్ సరిహద్దులో ఉన్న ఎడారి పేరు? థార్ ఎడారి
  • థార్ ఎడారి లోని అధికభాగం ఎక్కడ ఉంది? మార్వార్ ప్రాంతం రాజస్థాన్ లో
  • ఎడారి ప్రాంతం గుండా పయనించి ఏయే ప్రాంతాలను దర్శిస్తారు?
    • గుజరాత్ లోని ద్వారకా
    • రాజస్థాన్ లోని అజ్మీర్, పుష్కర్ సరస్సు
    • అరబ్ లోని మక్కా, మదీనా
  • థార్ ఎడారిలో ముఖ్య నగరాలు ఏవి? జైసల్మిర్, బికనీర్, జోద్ పూర్
  • ఈ ప్రాంతం నుండి బయలు దేరి దేశం లో అనేక చోట్ల స్థిరపడిన వారు? మార్వాడి వర్తకులు
  • ప్రపంచం లోనే అత్యంత జన సాంద్రత గల ఎడారి? థార్ ఎడారి
  • థార్ ఎడారిలోని మిటాయిలు, చిరుతిళ్ళు కు ప్రసిద్ది పొందిన నగరం? బికనీర్ నగరం

సిక్కిం

  • కాంచన గంగ శిఖరం ఎక్కడ ఉంది? సిక్కిం
  • భారతదేశం లోని నేపాల్, భూటాన్, టిబెట్ (చైనా) సరిహద్దులలో ఉన్న రాష్ట్రము? సిక్కిం
  • రూమ్ టెక్ మటం ఎక్కడ ఉంది? సిక్కిం లో
  • సిక్కింలో ఉన్న ప్రజలు ఎన్ని భాషలు మాట్లాడతారు? 11 భాషలు
  • సిక్కిం లోకి భౌద్ధ మతాన్ని తెచ్చినవారు? టిబెటన్ లామాలు
  • సిక్కిం లో సుందరమైన మాటాలు నిర్మించినవారు? టిబెటన్ లామాలు
  • 1975 వరకు సిక్కిం రాష్ట్రాన్ని ఏ రాజవంశం పాలించేది? చోగ్యాల్ రాజవంశం
  • సిక్కి౦ ప్రజాస్వామ్య ప్రభుత్వం గా ఎప్పుడు మారింది? 1975 లో

పాండిచ్చేరి  

  • పాండిచ్చేరి భారత్ దేశానికి ఏ దిశలో ఉంది? ఆగ్నేయ దిశలో
  • పాండిచ్చేరి లో వర్తక కేంద్రాలు, కాలనీలు స్థాపించినవారు? డచ్, పోర్చుగీసు, ఇంగ్లీష్, ఫ్రెంచ్
  • పాండిచ్చేరి ఇండియన్ యునియన్ లో ఎప్పుడు చేరింది? 1954 లో
  • పాండిచ్చేరి ఇండియన్ యూనియన్లో ఎవరి అధీనం లోనుండి విడిపోయి చేరింది? ఫ్రెంచ్ నుండి విడిపోయి
  • పాండిచ్చేరి ఏ స్వతంత్ర ఉద్యమ కారులకు ఆశ్రయాన్ని కల్పించింది? సుబ్రహ్మణ్య భారతి, అరవింద ఘోష్ లకు

భిన్నత్వం లో ఏకత్వం

  • సుబ్రహ్మణ్య భారతి ఎవరు? తమిళనాడు కు చెందిన జాతీయవాద కవి
  • అరవింద ఘోష్ ఎవరు? బెంగాల్ నుండి విప్లవ జాతియవాదిగా పనిచేసి తరువాత ఆధునిక భారతదేశ ఆధ్యాత్మిక ఋషిగా అవతరించిన గురువు
  • అరవింద ఘోష్ యొక్క ఫ్రెంచ్ శిష్యురాలు? అమ్మ
  • అరవి౦దాశ్రమం స్థాపించినవారు? అమ్మ (అరవింద ఘోష్ యొక్క ఫ్రెంచ్ శిష్యురాలు)
  • శాంతి, ప్రపంచ సహకారం అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి UNO మద్దతుతో స్థాపించబడిన అంతర్జాతీయ గ్రామం? ఆరోవిల్లె
  • మానవజాతి ఏకత్వాన్ని వేడుక చేసుకొనేందుకు మొత్తం ప్రపంచంలోని ప్రజలు కలిసి ఉంటారు అనడానికి దేనిని ఉదాహరణగా చెప్పవచ్చు? పాండిచ్చేరి ని
  • ఆరోవిల్లె మైత్రి మందిర్ ఎక్కడ ఉంది? పుదుచ్చేరికి 10-15 కిమీ ఉత్తరంగా తమిళనాడు లో ఉంది
  • రక్తపుటేరులు ప్రవహించిన రోజు మరచిపోవద్దు ఓ స్నేహితుడా ఈ పాట పంక్తులను ఎక్కడి నుండి సేకరించారు? భారత ప్రజా నాయకమండలి (ఇఫ్టా) నుండి
  • రక్తపుటేరులు ప్రవహించిన రోజు మరచిపోవద్దు ఓ స్నేహితుడా అనే పాటను ఏ సన్నివేశం తరువాత పాడసాగారు? జలియన్ వాలాబాగ్ సన్నివేశం తరువాత
  • జలియన్ వాలాబాగ్ దురంతం లో మరణించిన సాహసికుల గౌరవ సూచికగా రాసిన పాట? రక్తపుటేరులు ప్రవహించిన రోజు మరచిపోవద్దు ఓ స్నేహితుడా
  • బ్రిటిష్ వ్యతిరేఖ నిరసన సంకేతంగా దేశ ప్రజలు దేనిని ఉపయోగించారు? జాతీయ జండా ను
  • డిస్కవరీ అఫ్ ఇండియా పుస్తక రచయిత? జవహర్ లాల్ నెహ్రు
  • డిస్కవరీ అఫ్ ఇండియాలో జవహర్ లాల్ నెహ్రు యేమని పేర్కొన్నాడు? దేశ ప్రజల ఐఖ్యత బయటి నుండి నేర్చుకోంది కాదు. విభిన్న ఆచారాలు నమ్మకాల పట్ల విస్తృత సహనాన్ని కనపరిచింది
  • మన దేశం గూర్చి చెప్పడానికి భిన్నత్వం లో ఏకత్వం అనే అంశాన్ని ఎవరు రూపొందించారు? జవహర్ లాల్ నెహ్రు
  • జాతీయ గీతాన్ని ఎవరు రచించారు? రవీంద్రనాథ్ టాగూర్
  • భారత మొదటి ప్రధానమంత్రి? జవహర్ లాల్ నెహ్రు
  • ఇటువంటి ఉపయోగకరమైన టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి kings dsc యు ట్యూబ్ ఛానల్ మరియు kingsdsc.in వెబ్సైట్

Sculptures and Monuments
Sculptures and Monuments (Very useful information)

Leave a Comment