Skip to content6.13 గ్రామ పంచాయితీలు

- Gram Panchayats: ప్రజా సౌకర్యాలు అనగా? ప్రజలందరికి సంబందించిన సౌకర్యాలు (మురికి కాలువలు, చేతి పంపులు, వీధి దీపాలు, రోడ్లు మొదలగునవి)
- గ్రామాలలో ప్రజా సౌకర్యాలను ఎవరి నిర్వహిస్తారు? గ్రామ పంచాయితీలు
- పట్టణాలలో ప్రజా సౌకర్యాలను ఎవరు నిర్వహిస్తారు? పురపాలక సంఘాలు
- ప్రజా సౌకర్యాలన్నిటిని నిర్వహించేవారు? ప్రభుత్వ శాఖలు
- ప్రజా సౌకర్యాలను ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయబడినవి? గ్రామ సభలు
- గ్రామ సభ లో సభ్యులు గా ఎవరు ఉంటారు? గ్రామ ఓటర్లు
Gram Sabha (గ్రామ సభ)
- గ్రామ పంచాయితీ (Gram Panchayats) పనులను పర్యవేక్షించేది? గ్రామ సభ
- గ్రామం లో ఓటర్లు ఎవరిని ఎన్ను కొంటారు? వార్డు సభ్యలును (పంచాయితీ సభ్యులు), సర్పంచ్ ను
- గ్రామ పంచాయితీ (Gram Panchayats) లో రోజువారి పనులను ఎవరు నిర్వహిస్తారు? గ్రామ సర్పంచ్
- గ్రామ పంచాయితీలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎవరి ద్వారా జరుగుతుంది? గ్రామా సభ ద్వారా
- ప్రభుత్వ పథకాలకు లబ్ది దారులు గా ఎవరిని ఎంపిక చేస్తారు? దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నవారిని
Structure of Gram Panchayat (గ్రామ పంచాయితీ నిర్మాణం)
- గ్రామ పంచాయితీ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్ర ఎన్నికల సంఘం
- గ్రామం లో ఓటు వేయడానికి అర్హత? 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తీ
- ఎన్నికల సంఘం గ్రామాన్ని ఏ విధంగా విభజిస్తుంది? వార్డులు గా (ప్రతి వార్డు నుండి వార్డు సభ్యుడు పంచాయితీ కి ఎన్నిక అవుతాడు)
- సాధారణంగా జనాభాను బట్టి వార్డు సభ్యులు ఎంత మంది ఉంటారు? 5 నుండి 21 మంది
- గ్రామ పంచాయితీలో పోటీచేయడానికి కావలసిన కనీస వయసు? 21 నిండి ఉండాలి
- స్థానిక సంస్థలలో స్త్రీలకు పార్లమెంట్ ఎంత శాతం సీట్లు కేటాయించింది? 50% (ఎస్సి, ఎస్టి, బిసి వారికి కూడా సీట్లు కేటాయించారు)
- గ్రామ పంచాయితీ ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒక సారి జరుగుతాయి? 5 సంవత్సరాలకు
- గ్రామ పంచాయితీ ఎన్నికలలో ఓటరు ఎన్ని ఓట్లు వేస్తాడు? 2 (1 వార్డు మెంబరు, 1 సర్పంచ్ కి)
Sarpanch, Deputy Sarpanch, Panchayat Secretary (సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరి)
- గ్రామ పంచాయితీ కి పెద్దగా ఎవరు వ్యవహరిస్తారు? సర్పంచ్
- గ్రామానికి మొదటి పౌరుడు? సర్పంచ్
- పంచాయితీ నిర్ణయాలును అమలుచేసే భాద్యత ఎవరిది? సర్పంచ్ ది
- సర్పంచ్ ను ఓటర్లు ఎలా ఎన్నుకొంటారు? ప్రత్యక్ష ఎన్నిక ద్వారా
- పంచాయితీ ఆదాయ వ్యయాలకు ఎవరు భాద్యత వహిస్తారు? సర్పంచ్
- ఉప సర్పంచ్ ని ఎవరు ఎన్నుకొంటారు? సర్పంచ్ & వార్డు సభ్యులు కలిసి
- సర్పంచ్ లేనపుడు ఆ భాద్యతను ఎవరు నిర్వహిస్తారు? ఉప సర్పంచ్
- పంచయితీ కార్యదర్శి గా ఎవరు ఉంటారు? ప్రభుత్వ ఉద్యోగి
- గ్రామ పంచాయితీ కార్యదర్శి విధులు ఏవి? పంచాయితీ లెక్కలు, సమావేశాలు, విషయాలు నమోదు చేస్తారు
Functions of Gram Panchayat (గ్రామ పంచాయితీ ఏమి చేస్తుంది)
- పంచాయితీ విధులు ఏవి?
- మురుకు నీటి కాలువల ఏర్పాటు / శుబ్రం చేయడం
- వీధి దీపాలు ఏర్పాటు / నిర్వహణ
- చౌక ధరల దుకాణాలు ఏర్పాటు / నిర్వహణ
- పాటశాల నడుస్తున్న తీరు పర్యవేక్షణ
- అంగన్వాడి, శిశు సంక్షేమ పథకాల పర్యవేక్షణ
- చిన్న నీటి పారుదల, వాటర్ షెడ్ ల నిర్వహణ
- భూ సంస్కరణలపై ప్రణాళికల తయారీ ఆచరణ లో పెట్టడం
- గ్రామ పంచాయితీ పరిధిలో అధికారం లేని అంశాలు
- సంత (మార్కెట్ లమీద అధికారం)
- పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు
- ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్వహణ
- గ్రామ పంచాయితీ సమావేశం ఎంత కాలానికి ఒక సారి జరుగుతుంది? ప్రతి నెలకు ఒక సారి
- గ్రామ పంచాయితీ సమావేశాన్ని ఎప్పుడు రద్దు చేస్తారు? ప్రతి సమావేశానికి సగం మంది సభ్యులు సమావేశం కావలి అలా కాని పక్షం లో
Sources of Funds of Gram Panchayat (గ్రామ పంచాయితీ నిధులు)
- గ్రామ పంచాయితీ సమావేశం దేనితో ప్రారంభం అవుతుంది? గత సమావేశ నివేదికతో
- పంచాయితీ బడ్జెట్ ను ఎప్పుడు తయారు చేస్తారు? ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ముందు (ఏప్రిల్ – మర్చి)
- గ్రామ పంచాయితీ కి పన్నులు ద్వారా ఎంత ఆదాయం లభిస్తుంది? 1/3 వంతు (ఇంటి పన్ను, భూమి శిస్తు మొదలగునవి)
- MGNREGA విస్తరించుము? Mahatma Gandhi National Rural Employment Guarantee Act
- ప్రతి మండలం లో ఉండే ఇంచుమించు గ్రామాల సంఖ్య? 20
- మండల పరిషత్ లు వేటి అధీనం లో పనిచేస్తాయి? జిల్లా పరిషత్ ల అధీనం లో
- MPTC full form? Mandal Parishad Territorial Constituencies
- ZPTC full form? Zilla Parishad Territorial Constituencies
Jangamma – Hajipally (జంగమ్మ – హజిపల్లి)
- హాజీపల్లి గ్రామం ఏ జిల్లాలో ఉంది? రంగారెడ్డి జిల్లా
- హాజీపల్లి సర్పంచ్ జంగమ్మ రాష్ట్రపతి చేతులమీదుగా ఏ అవార్డ్ అందుకొన్నారు? నిర్మల గ్రామ పురష్కార్ అవార్డు
- నిర్మల గ్రామ పురష్కార్ అవార్డు ను హాజీపల్లి సర్పంచ్ జంగమ్మకు ఏ రాష్ట్రపతి ప్రధానం చేసారు? శ్రీమతి పతిభాపాతిల్
- రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్ హాజీపల్లి సర్పంచ్ జంగమ్మకు ఎప్పుడు ప్రధానం చేసారు? డిసెంబర్ 2008 లో
- 2008 లో హాజీపల్లి గ్రామం ఏ అవార్డుకు ఎంపిక అయినది? శుభ్రం అవార్డుకు (రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు)
- శుబ్రం అవార్డు దేనికొరకు బహుకరిస్తారు? ఇళ్ళలో మరుగుదొడ్లు నిర్మించుకొని బయటి ప్రదేశాలలో బహిర్భూమికి పోనీ గ్రామాలకు
Gram Panchayats Conducting Gram Sabhas Properly (గ్రామ సభను సక్రమంగా నివసిస్తున్న గ్రామ పంచాయితీలు)
- గ్రామ పంచాయితీలను విజయవంతం గా నిర్వహించే గ్రామాలు
| గ్రామం | జిల్లా |
| గంగాదేవి పల్లి | వరంగల్ జిల్లా |
| రామచంద్రాపురం | కరీంనగర్ జిల్లా |
| అంకాపూర్ | నిజామాబాద్ జిల్లా |
| హివారే బజార్ గ్రామం | అహ్మద్ నగర్ (మహారాష్ట్ర) |
- గంగాదేవి పల్లిలో గ్రామసభ ద్వారా ఎన్ని కమిటీలు ఏర్పాటు చేసారు? 18 కమిటీలు (ప్రతి గ్రామస్తుడు ఏదో ఒక కమిటీ లో సభ్యుడు గా ఉండడం చెప్పుకోదగ్గది)
- ప్రాతినిద్య ప్రభుత్వానికి ఉదాహరణ గా తెలంగాణా లోని ఏ గ్రామాన్ని పేర్కొనవచ్చు? గంగాదేవి గ్రామాన్ని
- ఇటువంటి యూజ్ ఫుల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి kings dsc యూ ట్యూబ్ ఛానల్ అండ్ kingsdsc.inవెబ్ సైట్