ఆదిమానవుల పెంపుడు జంతువులు? గొర్రెలు, మేకలు, ఎద్దులు, పందులు
ఆది మానవులు ఆహార నిల్వ కొరకు ఏ పరికరాలను ఉపయోగించారు? మట్టి పాత్రలు, గంపలు, బుట్టలు, నేల మాళిగలు
ఆది మానవులు రంగులను ఎలా తయారు చేసేవారు? రాళ్ళు పిండి చేసి జంతువుల కొవ్వుతో రంగులు తయారుచేసిరి
ఆది మానవులు చిత్రాలు చిత్రించడానికి వేటిని ఉపయోగించిరి? కుంచెలు
బెలూం గుహలు ఎక్కడ ఉన్నాయి? కర్నూలు జిల్లలో
Early Life to Settled Life ఆది మానవులు బెలూం గుహలను ఎలా ఉపయోగించు కొన్నారు? విశ్రాంతి తీసుకోవడానికి, పనిముట్లు దాచుకోవడానికి
బెలూం గుహలు
ఆది మానవులు ఎముకలతో చేసిన పనిముట్లు, సూక్ష్మ రాతి పరికరాలును ఎక్కడ కనుగొన్నారు? బెలూం గుహలలో
బెలూం గుహల ప్రత్యేకత? ఎముకలతో చేసిన పనిముల్టు భారత ఉపఖండం మొత్తం లో బెలూం గుహల లోనే లభ్యం అయ్యాయి
కర్నూలు జిల్లాలో ఏయే గుహలు ఉన్నాయి? బెలూం గుహలు, ముచ్చట్ల చింతమాను గవి గుహలు, బేతం చర్ల గుహలు, బనగాన పల్లె గుహలు
ఆది మానవులు రాతి స్థావరాలు బయలుపడిన ప్రదేశం? చింతకుంట గ్రామం (ముద్దనూరు మండలం, కడప జిల్లా)
ఎరుపు రంగు చిత్రాలలో మూపురం ఉన్న ఎద్దు చిత్రం ఉన్న ఒకే ఒక గుహ? ఎద్దుల ఆవుల గుంపు గుహ
కడప జిల్లా చింత కుంట గ్రామం లో ఉన్న గుహలో సుమారు ఎన్ని చిత్రాలు పైగా ఉన్నాయి? 200 చిత్రాలు పైగా (10 చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి)
రాతి పనిముట్లు బయట పడిన నంధ్ర గ్రామం ఏ రాష్ట్రము లో గలదు? మధ్య ప్రదేశ్
యానాదులు చెంచు తెగలు ఎక్కువగా గల రాష్ట్రము? ఆంధ్ర ప్రదేశ్
యానాదుల వృత్తి ? వేట
ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమైన రాతి చిత్ర కళా స్థావరాలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ముఖ్య రాతి చిత్ర కళా స్థావరాలు గల ప్రాంతాలు? వినుకొండ, వెంబ కండ్రిగ, వేల్పుమడుగు, నందిపాడు, నాయుడు పల్లి, సింగరాయ కొండ, చింతకుంట, శ్రీ శ్రీకాళహస్తి, కావలి, కావల బుగ్గ, కేతవరం, రేణిగుంట, దాపల్లి, తినిగాల్, బుడగవి, ఆదోని, బల్లారం.
రాతి యుగాలు
పాతరాతి యుగం
ప్రాచీన శిలా యుగాలు ఎన్ని రకాలు? 3 (పాత రాతి యుగం, మధ్య రాతి యుగం, కొత్త రాతి యుగం)
పాలియో లిథిక్ యుగం అని ఏ యుగాన్ని పేర్కొంటారు? పాత రాతి యుగాన్ని
పాతరాతి యుగం యొక్క కాలం? 2.6 మిలియన్ సంవత్సరాల నుండి 10వేల సంవత్సరాల మధ్య
మధ్య రాతి యుగం
మధ్య రాతి యుగానికి గల పేరు? మేసో లిథిక్ యుగం
మధ్య రాతియుగం ఏ కాలానికి చెందినది? 10 వేలు బిసి – 8 వేలు బిసి
కొత్త రాతి యుగం
నియో లిథిక్ యుగం అని ఏ యుగాన్ని పిలుస్తారు? కొత్త రాతి యుగాన్ని
కొత్త రాతి యుగం యొక్క కాలం? 8వేలు బిసి – 3 వేలు బిసి మధ్య
ఇటువంటి బెస్ట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్స్ కోసం చూస్తూనే ఉండండి kingsdsc.in