Sculptures and Monuments నవీన సిరియా & పాలస్తీనా వాసులు వ్యవసాయం జంతువులు మచ్చిక చేసుకోవడం ఎప్పుడు ప్రారంభించారు? 10 వేల సంవత్సరాల పూర్వం
భారత ఉపఖండం లో 7 నుండి 8 వేల సంవత్సరాల నాటి పురాతన గ్రామాలు ఎక్కడ బయల్పడ్డాయి? బెలూచిస్తాన్ వాయవ్య ప్రాంతం లో
మొదటి నగరాలు భారత్ లో ఎక్కడ వెలిసాయి? వాయవ్య ప్రాంతం లో (బెలూచిస్తాన్, సింద్, పంజాబ్, గుజరాత్ లలో)
భారత ఉపఖండం లో పేరు గాంచిన ప్రాచీన నగరాలు? హరప్పా, మొహంజొదారో, కాలిబంగన్, లోథాల్)
హరప్పా నగరాలు – ఉపఖండం యొక్క మొట్టమొదటి నగరాలు
ఉత్తరాన ఆఫ్ఘానిస్తాన్ నుండి దక్షిణాన గుజరాత్ వరకు, తూర్పున పంజాబ్, హర్యానాల నుండి పడమర బెలూచిస్తాన్ వరకు ఒకే లక్షణాలతో వ్యాపించిన సంస్కృతికి పురావస్తు శాస్త్రజ్ఞులు పెట్టిన పేరు? హరప్పా సంస్కృతీ
హరప్పా సంస్కృతికి సింధులోయ నాగరికత అనే పేరు ఎందుకు వచ్చింది? అధిక భాగం సింధు, దాని ఉపనదుల ప్రాంతం లో ఏర్పడడం వల్ల
నగరాలు అంటే ఏమిటి
నగరాలు అనగా? వ్యవసాయం వేట ఆహారసేకరణ పై ఆధారపడకుండా జీవించే అధిక జనాభా కలిగిన ప్రాంతాలు
నగరాలు ఎన్ని రకాల ప్రజలను కలిగి ఉంటాయి? 3 లేదా 4 రకాల ప్రజలను (చేతి వృత్తుల వారు: కుండలు తయారీదార్లు, లోహపు పనివారు, వడ్రంగి పని చేసేవారు, భవన నిర్మాణం చేసే మేస్త్రీలు, రాళ్ళు కొట్టేవారు. వ్యాపారులు: కులీనులు,పూజారులు, పరిపాలనాదికారులు: పేద శ్రామికులు లేదా సైనికులు: )
హరప్పా నగరాలు ఎంతాకాలం వేలుగొందాయి? 700 సంవత్సరాలు (3900 సంవత్సరాలలో కనుమరుగు అయ్యాయి)
హరప్పా నగరాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? 4600 సంవత్సరాల క్రితం
హరప్పా నగర విశిష్ట లక్షణం ఏమిటి? భవనాలు బాగా కాల్చిన నిర్ణీత ఆకారం, పరిమాణము గల ఇటుకలుతో నిర్మించబడడం
ప్రధాన నగరాలు ఎన్ని భాగాలుగా విభజింపబడి నిర్మించబడ్డాయి? 2 భాగాలుగా (1. ఎత్తైన భవనాలు, ప్రధాన రాజ ప్రసాదాలు, నివాసాలు, కార్యాలయాలు, కోటలు, ధాన్యాగారాలు 2. చేతి వృత్తుల వారు, వర్తకులు, సామాన్య ప్రజలు ఉన్నారు)
భారత చరిత్రలోనే అత్యంత నాణ్యతగల కుండలు మట్టి పాత్రలు బొమ్మలను తయారుచేసినవారు? హరప్పా కాలం నాటి కుండల తయారీ దారులు
హరప్పా ప్రజలు ఏ లోహ వస్తువులు విస్తృతంగా ఉపయోగించేవారు? రాగి, వెండి, తగరం, ఇత్తడి
లోథాల్ నౌకా నిర్మాణ కేంద్రం యొక్క కొలతలు? తూర్పు పడమరల మధ్య దూరం 37 మీటర్లు, ఉత్తర దక్షినాల మధ్య దూరం 22 మీటర్లు)
హరప్పా ప్రజలు ఉపయోగించని లోహం? ఇనుము
హరప్పా కాలం లో రాతి బాట్లు అనేవి ఏమిటి? బరువును సూచించే రాళ్ళు
మొహంజొదారో లో మహా స్నానవాటిక కొలతలు పొడవు వెడల్పులలో? 11.8 మీటర్లు * 7 మీటర్లు
సింధూ లోయ నాగరికత తరువాత కాలం శిల్పకళ
అశోక స్థంబాల చివరన ఉన్న జంతు ఆకృతులను ఏ పేరుతో పిలిచేవారు? రాజ చిహ్నాలు (కాపిటల్స్)
అశోకుడు స్థాపించిన రాజ చిహ్నాలలో ప్రముఖమైనది? సారనాద్ లోని సింహ శిఖరం (బుద్దుడు మొదటి సారి బోధించిన ప్రాంతం)
సరనాద్ సింహ శిఖరం లో సింహాల సంఖ్య? 4 (ఈ నాలుగు తలలు నాల్గు దిక్కులను సూచిస్తూ ధర్మ చక్రాన్ని చూపిస్తూ ఉన్నాయి
మౌర్యుల రాతి స్థంబాలు, సింహ శిఖరాలు వేటికి గుర్తుగా ఉన్నాయి? మౌర్య చక్రవర్తుల శక్తికి రాజసానికి గుర్తుగా ఉన్నాయి
హరప్పా లోని ఎద్దుని పోలిన వృషభ శిఖరం ఎక్కడ కనిపిస్తుంది? రాం పూర్వాలోని వృషభ శిఖరం
భౌద్ధ స్తూపాలు – విహారాలు (Sculptures and Monuments)
సాంచి స్తూపం ఏ ఆకారం లో ఉంటుంది? అర్ధ గోళ ఆకారం (సగం బంతి ఆకారం)
సాంచి స్తూపం మధ్యలో వేటిని ఉంచారు? బుద్దుడు లేదా బౌద్ద బిక్షువు అవశేషాలు (దంతం ఎముక, జుట్టు వంటి శరీర భాగాలు)
ఏ స్తూపాన్ని బుద్దునికి ప్రతీకగా భావిస్తారు? సాంచి స్తూపాన్ని (స్తూపం గుమ్మటాన్ని విశ్వం గాను, స్థంబాన్ని భూమిని స్వర్గాన్ని కలిపే వారధి గా ను భావిస్తారు)
సాంచీ స్తూపం ఎక్కడ ఉంది? మధ్య ప్రదేశ్
బుద్దుని ఆస్తిక కలిగిన స్పటిక పేటికను పురావస్తు శాస్త్రజ్ఞులు ఎక్కడ కనుగొన్నారు? భట్టిప్రోలు లో
ఆంధ్ర ప్రదేశ్ లోని ఏయే ప్రాంతాలలో పురావస్తు శాస్త్రజ్ఞులు ప్రాచీన స్తూప శిథిలాలు కనుగొన్నారు? అమరావతి (గుంటూరు), భట్టిప్రోలు, రామ తీర్ధం, శాలిహుండం
ఇటుకలతో అమర్చబడిన భౌద్ధ స్తూపం ఖమ్మ౦ జిల్లాలో ఎక్కడ ఉంది? నేలకొండపల్లి లో
స్తూపం పై ఉన్న ఎగిరే ఆకృతులను ఎలా భావిస్తారు? బుద్దుని పూజించేందుకు స్వర్గం నుండి వచ్చిన దేవతలు గా (Sculptures and Monuments)
బ్రిటిష్ వారు ఏ శిల్ప తోరణాలను లండన్ కు తొలగించారు? 1900 సంవత్సరాల క్రితం నాటి అమరావతి శిల్పతోరనాలను (తరలించ లేని వాటిని మద్రాస్ మ్యూజియం లో భద్రపరిచారు)
ఇక్ష్వాకుల రాజధాని? విజయపురి
నాగార్జున కొండ స్తూపం ఎక్కడ ఉంది (Sculptures and Monuments) ? కృష్ణ నది ఒడ్డున (విజయ పురిలో భాగం) మొత్తం నగరం నాగార్జున సాగర్ లో మునిగిపోయింది
ప్రఖ్యాత భౌద్ధ శిల్పాలు ఎక్కడ లభించాయి? గాంధార (వాయవ్య ప్రాంతం), ఉ ప్రదేశ్ లోని మధుర, సారనాద్, నాగార్జున కొండ నుంచి లభించాయి
పిచ్చి పట్టిన ఏనుగును శాంతింప జేసే బుద్దుని చిత్రం ఎక్కడ ఉంది? అమరావతి లో
6 యువరాజులు, ఉపాలి అనే క్షురకుడు బుద్దుని శిల్పాలు ఎక్కడ చూడవచ్చు? నాగార్జున కొండలో (బౌద్ద సంఘం లో ప్రవేశానికి బుద్దుడు మొదట ఉపాలిని (క్షురకుని) ఆహ్వానించి తరువాత ఆరుగురు రాజులను ఆహ్వానించాడు)
విహారాలు అనగా? భౌద బిక్షువుల పీటాలు లేదా అవాసాలు (మత విద్యనూ నేర్పేవారు)
బౌద్ద గుహ విహారాలను ఎక్కడ కనుగొన్నారు? నాసిక్ కార్లే లలో
విహారాలకు ఉదా హరణ ? తక్షశిల, నాగార్జున కొండ, నలంద (గొప్ప విద్య బోధన కేంద్రాలు గా రూపొందాయి)
బుద్దుని జీవిత సంబందిత ప్రాంతాలను, భౌద్ధ సన్యాసుల విద్య పీటాలను సందర్శించిన చైనా యాత్రికులు? ఫాహియాన్, ఇత్సింగ్, హ్యుయాన్ త్సాంగ్
యాత్రికులు అనగా? పవిత్ర స్థలాలను దర్శించేందుకు వెళ్ళే ప్రజలు
నలందా (బీహార్) విద్య పీటం లో విద్యనూ అభ్యసిస్తూ కాలం గడిపినవారు? హ్యుయాన్ త్సాంగ్
ఇక్కడి ఉపాధ్యాయులు అందరూ అత్యంత సామర్ధ్యం నైపుణ్యం కలిగిన వారు అని నలందా విశ్వ విద్యాలయం గూర్చి పెర్కొన్నవారు? హుయాన్ త్సాంగ్ (కొత్తగా వచ్చేవారిని కాపలాదారులు కటిన ప్రశ్నలు వేసేవారు వాటికి సమాధానం ఇస్తేనే ప్రవేశానికి అనుమతి ఇచ్చేవారు. 10 మంది లో 7 లేదా 8 మంది సమాధానం చెప్పలేక పోయేవారు)‘
రాతిని తొలిచి నిర్మించిన చైత్యాలు – మొదటి దేవాలయాలు
శాతవాహనుల విరాళాలతో నిర్మించిన విహారాలను ఎక్కడ చూడవచ్చు? కార్లే, కన్హేరి, నాసిక్ లలో (పర్వత ప్రాంతాలలో గుహలు గా నిర్మించేవారు)
కార్లే చైత్యపు చిత్రాలు ఎప్పుడు నిర్మించారు? 2100 సంవత్సరాల పూర్వం
మధ్యప్రదేశ్ లోని సాంచి వద్ద నిర్మించిన ప్రాచీన కాలపు రాతి ఆలయం లో బుద్దుని విగ్రహం ఎక్కడ ఉంది. గర్భ గుహ అని పిలిచే చిన్న గది లో (దీనిని 1600 సంవత్సరాలకు పూర్వం నిర్మించారు)
ఇటువంటి ఉపయోగకరమైన టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి kings dsc యు ట్యూబ్ ఛానల్ మరియు kingsdsc.in వెబ్సైట్