First Empires: మౌర్య సామ్రాజ్య స్థాపకుడు? మౌర్య చంద్ర గుప్తుడు
వంశపాలన అనగా ? ఒక కుటుంభ వ్యక్తులు వారసత్వంగా రాజులైతే దానిని
మౌర్య చంద్ర గుప్తుని కొడుకు? బిందు సారుడు
Ashoka – A unique ruler (అశోకుడు విశిష్ట పాలకుడు)
First Empires మౌర్య చంద్ర గుప్తుని మనుమడు? అశోకుడు
First Empires మౌర్య సామ్రాజ్య విస్తరణ కారకులు? మౌర్య చంద్రగుప్తుడు, బిందు సారుడు, అశోకుడు
First Empires మౌర్య సామ్రాజ్య Mauryan Empire విస్తరణ? నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన కర్ణాటక వరకు, తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉంది
సామ్రాజ్యాలు అనగా? పెద్ద రాజ్యాలు
పెద్ద సామ్రాజ్యాల రాజులను ఏమంటారు? చక్రవర్తులు
భారత ఉపఖండం లో తొలి చక్రవర్తులలో ఒకరిగా ఎవరిని పేర్కొంటారు? చంద్ర గుప్త మౌర్యుడు
భారతదేశపు అతిపెద్ద ఎడారి? థార్ ఎడారి
First Empires మౌర్య సామ్రాజ్యం లో అధిక జనసాంద్రత గల ప్రాంతాలు? గంగ సింధు లోయ, కృష్ణా లోయ, మాళ్వా, గుజరాత్, పంజాబ్ ప్రాంతాలు
చంద్ర గుప్తుని మంత్రి ? కౌటిల్యుడు
కౌటిల్యునికి గల మరొక పేరు? చాణక్యుడు
కౌటిల్యుని గ్రంధం? అర్ధం శాస్త్రం
కౌటిల్యుడు అర్ధశాస్త్ర గ్రంధం లో వేటిని గూర్చి పేర్కొన్నాడు? రాజ్యాలను ఎలా జయించాలి, ఎలా రాజ్యాన్ని పాలించాలి, రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుండి ఎలా కాపాడు కోవాలి. పన్నులు ఎలా వసూలు చేయాలి. భారత్ ఉప ఖండం లో లభించే వివిధ వనరులు గూర్చి
చంద్ర గుప్తుని ఆస్థానం లో గ్రీకు రాయబారి? మెగస్త నీస్
మెగస్తనీస్ గ్రంధం? ఇండికా
మౌర్య సామ్రాజ్యం గూర్చిన సమాచారం వేటి ద్వారా తెలుస్తుంది? కౌటిల్యుడు అర్ధంశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా, అశోకుని శాసనాలు ద్వారా తెలుస్తుంది
మౌర్య సామ్రాజ్యం లో ముఖ్య నగరాలు? తక్షశిల, ఉజ్జయిని, పాటలీపుత్రం, వైశాలి, కళింగ, సువర్ణగిరి
మౌర్య సామ్రాజ్యం లో స్వయంగా చక్రవర్తి పాలనలో ఉన్న ప్రాంతం? పాటలీపుత్రం పరిసర ప్రాంతాలు
మౌర్య సామ్రాజ్య ప్రాదేశిక రాజధానులు? తక్షశిల, ఉజ్జయిని, సువర్నగిరి
ప్రాదేశిక రాజధానుల పాలకులను యేమని పిలిచేవారు? గవర్నర్ లు
మౌర్య సామ్రాజ్యం లో బంగారు గనులు గల ప్రాంతం? సువర్ణ గిరి
మౌర్య సామ్రాజ్యం లో విదేశీ వస్తువులు లభించే ప్రాంతం? తక్షశిల
మౌర్యులలో ప్రసిద్ది చెందిన పాలకుడు? అశోకుడు
శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్ట మొదటి రాజు? అశోకుడు
అశోక శాసనాలు చాలా వరకు ఏ భాషలో ఉన్నవి? ప్రాకృత భాష (బ్రాహ్మి లిపి లో)
కళింగ ప్రాంతం ప్రస్తుత పేరు? ఓడిశా
ఏ యుద్ధం తరువాత అశోకుడు యుద్ధం చేయను అని ప్రకటించాడు? కళింగ యుద్ధం తరువాత
ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయం పొంది యుద్దాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు? అశోకుడు
కళింగ యుద్దాన్ని తెలిపే అశోకుని శాసనం లో అశోకుడు యేమని ప్రకటించాడు?
చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు నేను కళింగను జయించాను
యుద్ధం లో 1 లక్షా 80 వేల మంది బందీలు అయ్యారు
లక్షకు పైగా సైనికులు చనిపోయారు
బలం ద్వారా గెలవడం కంటే దమ్మ (ధర్మం) ద్వారా గెలవడం మేలు అని నేను నమ్ముతాను అని పెర్కొన్నవారు? అశోకుడు
ధమ్మ అనే ప్రాకృత పదానికి సంస్కృత౦ లో సమాన పదం? ధర్మం
అశోక చక్రవర్తి ప్రతిరూపం ఉన్న కనగనహలి ఏ రాష్ట్రము లో ఉంది? కర్ణాటక
ధర్మ ప్రచారం చేయడానికి అశోకుడు నియమించిన అధికారులు? ధర్మ మహా మాత్రలు
అశోకుడు ఎవరి బోధనల వల్ల ప్రభావితుడైనాడు? బుద్దుని బోధనల వల్ల
అశోకుడు ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఏయే ప్రాంతాలకు ప్రతినిధులను పంపాడు? సిరియా, ఈజిప్ట్, గ్రీస్, శ్రీలంక లకు
మనుష్యులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలూ ఏర్పాటు చేసిన మౌర్య చక్రవర్తి? అశోకుడు
అశోకుని దృష్టిలో మతం పట్ల ఉన్న అభిప్రాయం? తమ మతాన్ని పొగడడం, ఇతర మతాన్ని విమర్శించడం రెండూ తప్పే
Kingdoms and Empires in the Deccan (దక్కన్ లో రాజ్యాలు – సామ్రాజ్యాలు)
పుట్టుక, వివాహం బంధుత్వం కలిగిన సమూహాలకు గల పేరు? తెగ
మౌర్య సామ్రాజ్య పతనం తరువాత కృష్ణ గోదావారి డెల్టాలో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొన్నవారు? శాతవాహనులు
శాతవాహనులు సుమారు ఎన్ని సంవత్సరాలు పాలించారు? 200 సంవత్సరాలు
శాతవాహనులు ఏయే ప్రాంతాలతో వ్యాపారాన్ని సాగించారు? బెంగాల్, రోమ్
శాతవాహనులు ఏ నది మీద సరుకు రవాణా చేసినట్లు తెలుస్తుంది? కృష్ణా నది మీద
కోటి లింగాల ప్రాంతం ఎక్కడ ఉంది? తెలంగాణాలో జగిత్యాల జిల్ల (గోదావరినది, పెద్దవాగు కలిసే చోట) శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎగువన ఉంది
శాతవాహనుల వంశానికి తొలి రాజధాని? కోటి లింగాలు
16 జనపదాలలో ఒకటైన అస్మక జనపద రాజధాని? కోటి లింగాలు
శాతవాహనులు ఇక్ష్వాకుల కాలానికి చెందిన నాణాలు, మట్టి, పింగాణి పాత్రలు ఎక్కడ బయట పడ్డాయి? కోటి లింగాలు లో జరిపిన త్రవ్వకాలలో (ఇటుకలతో చుట్టూ నిర్మించిన గుండ్రటి భావి బయటపడింది)
సాతవాహన వ్యవస్థాపకుడు? శ్రీముఖుడు
శాతవాహనుల కాలం నాటి అనేక ద్వారములు గల మట్టి కోట 4 వైపులా బురుజులు ఏ ప్రాంతం లో కనిపిస్తాయి? కోటి లింగాలలో
శాతవాహనుల కాలం నాటి భౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడిన ప్రాంతాలు? ఫనిగిరి, నేలకొండపల్లి, కొండాపూర్, దూలికట్టు, పెద్ద బంకూర్, కీసరగుట్ట
How did the headmen of some clans become small kings (కొంతమంది నాయకులు చిన్న రాజులుగా ఎలా ఎదిగారు)
మ్యాకదోని శిలా శాసనం ఎక్కడ లభించింది? బళ్ళారి జిల్లా (కర్ణాటక లో)
వేపుర గ్రామం లో ఏ తెగ నివసించేది? కాంత తెగ
వేపుర గ్రామ కాంత తెగకు అధిపతి? కుమారదత్త
వేపుర గ్రామ చెరువును త్రవ్వించిన కాంత తెగకు చెందిన గహపతి ఎవరు? సమ్హా
మ్యాకదోని శిలా శాసనం ఎవరి కాలానికి చెందినది? శాతవాహనుల కాలానికి
మ్యాకదోని శిలా శాసనం ఏ రాజు కాలం లో వేయబడినది? శ్రీ పులోమావి (శాతవాహన రాజు)
వేపుర గ్రామం ఏ జనపదం లోనిది? స్కందనాగ జానపదం లోనిది (శాతవాహన జిల్లా)
ఇక్ష్వాకుల రాజధాని? విజయపురి (కృష్ణా నది తీరం లో నాగార్జున కొండ సమీపం లో)
ఇక్ష్వాకులలో ముఖ్య రాజులు? శాంత మూలుడు, వీర పురుష దత్తుడు (అశ్వమేధం, వాయపేట యాగాలు చేసిరి)
ఇక్ష్వాకులు ఏ విధంగా ప్రకటించు కొన్నారు? రామాయణం లోని రాముని వంశానికి చెందినవారము అని
ఇక్ష్వాక మహిళలు అదిక మొత్తం లో విరాళాలు దేనికొరకు ఇచ్చిరి? భౌద్దారామలు, స్తూపాల నిర్మాణానికి (నాగార్జున కొండలో అతిపెద్ద ఆరామం, స్తూపం నిర్మించారు)
చైనా నుండి వచ్చిన కుశానులు దేనిని కేంద్రంగా చేసుకొని పాలన కొనసాగించారు? ఆఫ్ఘనిస్తాన్ ను
Some Important Empires of the Indian subcontinent (భారత ఉపఖండం లో ముఖ్యమైన సామ్రాజ్యాలు)
కనిష్కుని సామ్రాజ్యం లో భూభాగాలు? పాకిస్తాన్ నుండి, మధుర, ప్రయాగ రాజ్ వరకు & ఆక్సాస్ నది పరివాహక ప్రాంతం వరకు
భారతదేశం, చైనా, ఇరాన్, రోమ్ లను కలిపే అతిపెద్ద వ్యాపార మార్గాలు కూడా సమర్ధవంతంగా నిర్వహించిన వారు? కుశానులు
భారతదేశం, చైనా, ఇరాన్, రోమ్ ల మధ్య వ్యాపారం గొప్పగా వ్యాప్తి చెందినయుగంగా ఎవరి కాలాన్ని పరిగనిస్తారు? కుషానుల కాలాన్ని
శక సంవత్సరం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది? CE 78 నుండి (కనిష్కుడు అధికారం లోకి వచ్చిన సంవత్సరం)
శక యుగానికి గల పేర్లు? శక సంవత్సరం, శాకాబ్ది
గుప్తులు మొదటి ఏ ప్రాంతం లో రాజ్యాన్ని పాలించారు? బీహర్ లో
గుప్త సామ్రాజ్య విస్తరణ? గుజరాత్ నుండి బెంగాల్ వరకు, ఢిల్లీ నుండి మధ్య ప్రదేశ్ వరకు (3 తరాలలో ఈ ఘనత సాధించారు)
గుప్తులలో ప్రసిద్ద రాజులు? మొదటి చంద్ర గుప్తుడు, సముద్ర గుప్తుడు, 2వ చంద్ర గుప్తుడు, కుమార గుప్తుడు, స్కంద గుప్తుడు
గుప్తులు ప్రవేశపెట్టిన కొత్త విధానాలు? 2 (జయించిన రాజ్యం లో ఆరాజునే కొనసాగిస్తూ సామంతులు గా చేసుకొన్నారు. వారితో స్నేహంగా ఉన్న బ్రాహ్మణులూ, సామంత రాజులకు పూర్తీ అధికారాలతో గ్రామాలు ఇచ్చేవారు) వీరు ఎటువంటి పన్నులు చెల్లించవలసిన అవసరం లేదు
మెహ్రూలి ఇనుప స్థంభం ఎక్కడ ఉంది? ఢిల్లీ కుతుబ్ మీనార్ ప్రాంగణం లో
మెహ్రూలి ఇనుప స్థంభం ఎవరు ఏర్పాటు చేసాడు? 2వ చంద్రగుప్తుడు
మెహ్రూలి ఇనుప స్థంభం ప్రాముఖ్యత ఏమిటి? గత 1700 సంవత్సరాల నుండి బయట ఉన్న అది తుప్పు పట్టకపోవడం
గుప్తరాజులు చేసిన యాగం? అశ్వమేధ యాగం
గుప్తులు పోషించిన మతం? వైష్ణవ, శైవ మతాలు (విష్ణువు, శివుడు, దుర్గ మాతలకు దేవాలయాలు నిర్మించారు) జైన భౌద్ధ స్తూపలకు కూడా నిధులు కేటాయించారు (బౌద్ద శిల్పానికి చెందిన సారనాద్ కూడా ప్రసిద్ది గాంచింది)
గుప్తుల కాలం లో నిర్మించిన దేవాలయాలు
మధ్య ప్రదేశ్ లో : దియోగర్, ఉదయగిరి
ఉత్తర ప్రదేశ లో : బిటర్ గాం, ఎరాన్ లలో
ఇటువంటి ఉపయోగకరమైన సమాచారం కోసం చూస్తూనే ఉండండి. Kingsdsc.in వెబ్ సైట్ మరియు కింగ్స్ డిఎస్సి యు ట్యూబ్ ఛానల్