1H12 Indian National Movement

Table of Contents

1H12 భారత జాతీయోద్యమం

Background of the Indian National Movement (భారత జాతీయోద్యమం నేపద్యం)

  • జవహర్ లాల్ నెహ్రు యొక్క స్వీయ రచన? డిస్కవరీ అఫ్ ఇండియా
  • నెహ్రు దృష్టిలో భారత జాతీయ ఉద్యమం ఏ అంశాలపై ఆధారపడి సాగింది? అహింస, సత్యాగ్రహం
  • భారత జాతీయ ఉద్యమం Indian National Movement ప్రపంచం లోని ఏ జాతీయ ఉద్యమం తో పోల్చతగినది కాదు అని పేర్కొన్నవాడు? జవహర్ లాల్ నెహ్రు
  • భారత జాతీయ ఉద్యమ Indian National Movement సారాంశం ? భారత ప్రజలందరికి ఉమ్మడి జాతీయత ఉంది అని, బ్రిటిష్ పాలనను ప్రతిఘటించడం సమిష్టి ప్రయోజనమని గ్రహించడం

Social and Religious Reform Movements (సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు)

  • 19వ శతాబ్దం లో పాతుకు పోయిన సామాజిక దురాచారాలు? స్త్రీలను అట్టడుగు కులాల వారిని బాధలకు గురి చేయడం, బాలికల బ్రూన హత్యలు, బానిసత్వం, సతి, నిర్భంద వైవిధ్యం, బాల్య వివాహాలు
  • 19వ శతాబ్దపు మొదటి అర్ధ భాగం లో ప్రారంభం అయిన సంస్కర నోద్యమం లోని ప్రధాన ధోరణులు ఎన్ని? 2 (మత సంస్కరణలు, సామాజిక సంస్కరణలు)
  • మతపరమైన ప్రశ్నలను హేతువాద దృక్పథం లో ఆలోచన చేయడం మొదలు పెట్టినవాడు? రాజా రామ్మోహన్ రాయి
  • సతి దురాచార నిర్మూలనలో గొప్ప పాత్ర పోషించినవారు? రాజా రామ్మోహన్ రాయి
  • విలియం బెంటింక్ (గవర్నర్ జనరల్) సతి ఆచారం చట్ట విరుద్దం అని ఎప్పుడు ప్రకటించాడు? 4 డిసెంబర్ 1829 లో
  • భారతదేశం లో సామాజిక మత సంస్కరణల కోసం కృషి చేసిన సంస్థలు?బ్రహ్మ సమాజం, ప్రార్ధనా సమాజం, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం
  • బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేఖంగా ఏకేశ్వరో పాసనను ఆస్తిక వాదాన్ని ప్రోత్సహించిన సంస్థ? బ్రహ్మ సమాజం
  • విగ్రహారాధనకు వ్యతిరేఖంగా వేదాలకు తరలివెళ్ళాలి అని సూచించిన సంస్థ? ఆర్య సమాజ్
  • ఆర్య సమాజ్ స్థాపకుడు ? దయానంద సరస్వతి
  • భారతదేశ ప్రాచీన ఆదర్శాలు సంస్థల పునరుద్దరణ ధ్యేయంగా పనిచేసిన సంస్థ? థియోసాఫికల్ సొసైటీ
  • హేతుబద్ద ఆరాధనను చుసించిన సంస్థ? ప్రార్ధనా సమాజం
  • అన్ని మాతాల ఏకత్వాన్ని నొక్కి చెప్పిన సంస్థ? రామకృష్ణ మిషన్
  • పార్సీ ల మత సంస్కరణ కోసం ఏర్పాటైన సభ? రహ్నుమాయి మల్దియాన్ సభ (1851)
  • జోరాస్త్రియన్ మతం యొక్క సహజ స్వచ్చతను నొక్కి చెప్పించి?  రహ్నుమాయి మల్దియాన్ సభ (1851)
  • అనగారిన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన సంస్థలు? డిప్రేస్డ్ క్లాసెస్ మిషన్, డెక్కన్ ఎడుకేషనల్ సొసైటి, సర్వెంట్స్ అఫ్ ఇండియా సొసైటీ, ఆలీఘర్ సంస్థ, అమృత్సర్ చీఫ్ ఖాల్సా దివాన్, బాంబే సొసైటీ సర్విస్ లీగ్ ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్, సత్య సోధక్ సమాజ్ మరియు హరిజన సేవా సంఘ్
  • అణగారిన మహిళల విద్య అభివృద్ధి కోసం (స్త్రీ విద్య) కృషి చేసిన దంపతులు? జ్యోతిబా పూలే, సావిత్రి బాయి పూలే
  • జ్యోతిబా పూలే, సావిత్రి బాయి పూలే దంపతులు ఏర్పాటు చేసిన సంస్థలు ? సత్య శోధక సమాజం (1873), దీనబంధు సార్వ జనిక్ సభ (1882)
  • భారతదేశపు మొదటి మహిళా ఉపాద్యాయురాలు? సావిత్రిబాయి పూలే
  • జ్యోతి బాయి పూలే బిరుదు? మహాత్మా (1888 లో ప్రధానం చేసారు)
  • పండిత రమాబాయి యొక్క బిరుదు? పండిత
  • పండిత రమాబాయి ఏ భాషలో ప్రావీణ్యాన్ని సంపాదించింది? సంస్కృతం లో
  • రమాబాయి హిందూ మహిళలకు విద్యనూ అందించడానికి సామాజిక అన్యాయాలనుండి వారిని విముక్తి చేయడానికి ప్రారంభించినవి ? మహిళా ఆర్య సమాజం (పూనాలో), శారదా సదస్సు (ముంబాయి)
  • యాంగ్ బెంగాల్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు? హెన్రి లూయిస్ విలియన్ డెరోజియో (బెంగాల్ హేతువాది)
  • విద్య సామాజిక సంస్కరణల కోసం తనను తానూ అంకితం చేసుకొన్నవారు? ఈశ్వర్ చంద్ర విద్య సాగర్
  • వితంతు పునర్వివాహ చట్టం రూపొందించడం లో కీలక పాత్ర పోషించిన వాడు? ఈశ్వర్ చంద్ర విద్య సాగర్ (1856 లో )
  • ముస్లిం విద్య వ్యాప్తికి కృషి చేసిన సంఘ సంస్కర్త? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
  • మహమ్మదీయ ఆంగ్ల ప్రాచ్య కాలేజి స్థాపకుడు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1875 లో
  • మహమ్మదీయ ఆంగ్ల ప్రాచ్య కాలేజి తరువాతి కాలం లో ఎలా పరిణామం చెందినది? అలీఘర్ ముస్లిం విశ్వ విద్యాలయం గా
  • బెంగాల్ వివేకా నందుడు అని ఎవరిని పేర్కొంటారు? నరేంద్రనాద్ దత్తాను
  • రామకృష్ణ మిషన్ స్థాపకుడు ? నరేంద్రనాద్ దత్తా
  • భారతీయ సాంస్కృతిక మత ఔన్నత్యాన్ని ప్రపంచానికి తొలిసారి తెలిపిన ఘనత ఎవరికి దక్కుతుంది? స్వామీ వివేకానందుడు కి
  • ఆత్మ గౌరవ ఉద్యమం నకు  నాయకత్వం వహించిన వాడు? పెరియార్ ఇవి రామస్వామి నాయకర్
  • ఆత్మ గౌరవ ఉద్యమం ఎక్కడ జరిగింది? తమిళనాడు లో
  • తమిళనాడు లో భౌద్ధ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు? అయోతిదాస్
  • సామాజిక సంస్కరణ కారుల్లో అగ్రగామి గా నిలిచిన వారు?  నారాయణ గురు (కేరళ)శ్రీ నారాయణ ధర్మపరిపాలనా యోగం, సాధు జన పరిపాలనా యోగం అయ్యంకాళి, ఆంధ్ర లో- కందుకూరి వీరేశ లింగం, గురజాడ అప్పారావు, వేముల కూర్మయ్య, తెలంగాణా – మాడపాటి హనుమంత రావు, భాగ్యరెడ్డి వర్మ అరిగే రామస్వామి
  • భారతీయులలో హేతుబద్ధ లౌకిక ప్రజాస్వామ్య దృక్పదాన్ని అలవరచు కోవడానికి సహాయపడినది? పాశ్చాత్య విద్య
  • 1717లో మద్రాస్ లో స్వచ్చంద పాటశాల ప్రారంభించిన వారు? డానిష్ మిషనరీ
  • సేరంపూర్ లో పాటశాల ను 1793 లో ప్రారంభించింది? కెరీ, మర్మాన్ వంటి మిషనరీ లు
  • విల్సన్ కళాశాలను మిషనరీలు ఎక్కడ ఏర్పాటు చేసారు ? బొంబాయి లో (మద్రాస్ క్రిష్టియన్ కళాశాల ను మద్రాస్ లో ఏర్పాటు చేసారు)
  • 1853 లో ఆగ్రా లో ఏర్పాటు చేయబడిన కళాశాల? సెయింట్ జాన్ కళాశాల
  • వేదాలు, ఉపనిషత్తులను ఆంగ్లం లోకి అనువదించిన వారు? మాక్స్ ముల్లర్, విలియం జోన్స్
  • భారతదేశం లో పత్రికా చరిత్ర ఎవరి రాకతో ప్రారంభం అయినది? యురోపియన్స్ రాకతో
  • మొదటి ముద్రణా యంత్రాన్ని ఎవరు ఎచ్చట ప్రారంభించారు? పోర్చుగీసు వారు గోవాలో
  • 1684 లో బొంబాయి లో ముద్రణా యంత్రాన్ని నెలకొల్పిన వారు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపనీ వారు
  • భారత దేశం లో పత్రికా స్వేచ్చ కు మద్దతు ఇచ్చిన బ్రిటిష్ గవర్నర్ జనరల్? లార్డ్ మెకాలే
  • భారతదేశం లో మొదటి వార్తా పత్రిక? బెంగాల్ గెజిట్ (1780 లో)
  • బెంగాల్ గెజిట్ ను ప్రారంభించిన వారు? జేమ్స్ అగస్టస్ హిక్కి (వార పత్రికగా ప్రారంభించాడు)
  • భారత దేశం లో మొదటి సారి వార్తాపత్రికల పై ఆంక్షలు విధించిన వారు? లార్డ్ వేల్లస్లి (1799 లో )
  • పత్రికల స్వేచ్చల పై ఆంక్షలు తొలగించినది? లార్డ్ హేష్టింగ్స్ (1813-1823)
  • ఎవరి సిఫారసులు ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం మనదేశం లో పత్రికా చట్టాన్ని ప్రవేశ పెట్టింది? ధామస్ మన్రో సిఫారసుల ఆధారంగా (1823 లో ) విలియం బెంటింక్ పత్రికల పట్ల ఉదార వైఖరి అవలంబించాడు
  • చార్లెస్ మెట్కాఫ్ 1823 లో ఆర్డినెన్స్ రద్దు చేసి పొందిన బిరుదు? లిబరేటార్ అఫ్ ది ఇండియన్ ప్రెస్
  • ముఖ్య పత్రికలూ – వాటి స్థాపకులు / సంపాదకులు Indian National Movement కాలం లో
క్ర . సంఖ్యపత్రికస్థాపకులు / సంపాదకులు
1ఇండియన్ మిర్రర్దేవేంద్రనాథ్ టాగూర్
2అమృత బజార్శిశిర కుమార్ ఘోష్
3బంగదర్షన్బంకించంద్ర చటర్జీ
4ది హిందూసుబ్రహ్మణ్యం అయ్యర్, వీర రాఘవాచారి
5కేశరి, మరాటాతిలక్
6ఆంద్ర ప్రకాశికపార్థ సారథి నాయుడు
7కృష్ణ పత్రికకొండా వెంకటప్పయ్య
   
  • ప్రముఖ రాజకీయ సంస్థలు వాటి స్థాపకులు Indian National Movement కాలం లో
క్ర.సంఖ్యసంస్థలుస్థాపకులుస్థాపన ప్రదేశం
1బ్రిటిష్ ఇండియన్ అసోషియేషన్దేవేంద్రనాధ్ టాగూర్, రాధాకాంత్ దేవబ్1851 కలకత్తా
2ఇండియన్ అసోషియేషన్సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద మోహన్ బోస్1876 కలకత్తా
3బాంబే ప్రెసిడెన్సి అశోషియేషన్ఫిరోజ్ షా మెహతా కే టి షా, బద్రుద్దీన్ త్యాబ్జీ1885 బొంబాయి
4పూనా సర్వ జనీనక సభఎస్ హెచ్ చిప్లుంకర్ మహాదేవ గోవింద రనడే1870 పూణే
5మద్రాస్ మహాజన సభజి సుబ్రహ్మణ్యం అయ్యర్ ఏం వీరరాఘవా చారి పి ఆనందాచార్యులు1884 మద్రాస్
6మద్రాస్ నేటివ్ అసోషియేషన్గాజులు లక్ష్మి నరసు చెట్టి1852 మద్రాస్

Formation of the Indian National Congress (భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన)

  • బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్ సివిల్ సర్విస్ కి హాజరు కావడానికి గరిష్ట వయో పరిమితిని ఎంతకు తగ్గించింది? 21 నుండి 19 సంవత్సరాలకు (1878 లో )
  • బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ ఆయుదాల చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది? 1878 లో
  • భారతీయ ఆయుదాల చట్ట౦ దేనిని తెలియ జేస్తుంది? భారతీయులు ఆయుధాలు కలిగి యుండకూడదు అని
  • ఇల్బర్ట్ బిల్లు ను ఎవరు ప్రవేశ పెట్టారు? లార్డ్ రిప్పన్ (1883)
  • ఇల్బర్ట్ బిల్లు దేనిని తెలియజేస్తుంది? భారతీయ జడ్జిలకు కూడా సమాన న్యాయ అధికారాలు ఇవ్వాలి అని (నాటి కాలం లో బ్రిటిష్ వారిని విచారణ చేసే అధికారం భారతీయులకు ఇవ్వలేదు)
  • బ్రిటిష్ ఆయుదాల చట్టం దేనిని తెలియజేస్తుంది? భారతీయులు ఆయుధాలు కలిగి ఉండాలి అంటే బ్రిటిష్ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
  • వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం దేనిని తెలియ జేస్తు౦ది? ప్రభుత్వాన్ని విమర్శించే వార్తలు పత్రికలలో ప్రచురిస్తే ఆ పత్రికలు నిలిపివేయ బడతాయి. యజమాని పై చర్యలు తీసుకోవచ్చు
  • ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757 లో
  • భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది? 1885 లో డిసెంబర్ 28
  • భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు? అలెన్ అక్టేవియాస్ హ్యూమ్ (బ్రిటిష్ సివిల్ సర్విస్ ఉద్యోగి)
  • భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడ స్థాపించబడింది? బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్ పాల్ సంస్కృత కళాశాల లో
  • భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనా సమావేశం లో ఎంతమంది హాజరు అయ్యారు? 72 మంది
  • భారత జాతీయ కాంగ్రెస్ తోలిసమావేశ అధ్యక్షుడు? ఉమేష్ చంద్ర బెనర్జీ (బెంగాల్)
  • భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ప్రధాన కార్యదర్శి గా భాద్యతలు స్వీకరించిన వారు? AO హ్యూమ్
  • భారత జాతీయ కాంగ్రెస్ ఆశయాలు Indian National Movement కాలం లో ? వివిధ వర్గాల మధ్య సంఘీభావాన్ని సాధించడం, జాతీయ భావాన్ని ప్రోదిచేయడం, ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదించడం
  • రక్షక కవాట సిద్దాంతం దేనిని పేర్కొంటుంది? భారతీయులలో పెరుగుతున్న అసంతృప్తి ని శాంతి యుతంగా తెలియజేయడం (అందువలనే AO హ్యూమ్, లార్డ్ డఫ్రిన్ సూచనల మేరకు భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించాడు అనే అభిప్రాయం ఉంది. ఇది నిజం కాదు)
  • మితవాదుల కాలం? 1885-1905 (మితవాదుల యుగం)
  • మితవాదుల కాలంలో ఎక్కువ నాయకత్వం వహించిన వారు? సమాజం లోని ఉన్నత వర్గం మరియు ఆంగ్ల విద్య వంతులు
  • మిత వాదుల యుగం లో ప్రముఖులు? సురేంద్ర నాద్ బెనర్జీ, మదన్ మోహన్ మాలవ్యా, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, మహాదేవ గోవింద రణడే, ఆనంద మోహన్ బోస్, రాస్ బిహారీ, గోపాల్ కృష్ణ గోఖలే, తేజ్ బహదూర్ సఫ్రు, దాదాబాయి నౌరోజీ
  • బొంబాయి లోని ఎల్ఫిన్ సన్ కళాశాలలో మొదటి భారతీయ లెక్చరర్? దాదాబాయి నౌరోజీ
  • 1867 లో దాదాబాయి నౌరోజీ మొదటి ఈస్ట్ ఇండియా అశోషియేషన్ ను ఎక్కడ స్థాపించాడు? లండన్ లో
  • దేశం లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి దాదాబాయి నౌరోజీ స్థాపించిన పత్రిక? రాస్ట్ గోఫ్తార్ పత్రిక
  • దాదాబాయి నౌరోజీ బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఎప్పుడు నామినేట్ అయ్యాడు? 1892 లో
  • దాదాబాయి నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ కు ఎన్ని సార్లు ఎన్నిక అయ్యాడు? 3 సార్లు
  • దాదాబాయి నౌరోజీ బిరుదు? గ్రాండ్ ఓల్డ్ మాన్ అఫ్ ఇండియా
  • దాదాబాయి నౌరోజీ ప్రచారం చేసిన సిద్దాంతం ? డ్రెయిన్ థియరీ
  • దాదాబాయి నౌరోజీ గ్రంధం? పావర్టి అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా
  • బ్రిటిష్ పాలనను “భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్ర గా వ్యాక్యానించిన వారు? దాదాబాయి నౌరోజీ
  • బ్రిటిష్ నియంత్రణ లో మానవ జీవన సారం అంతా ప్రశాంతంగా ప్రచ్చన్నం గా ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ శాంతి భద్రతల నడుమ మనిషి ప్రశాంతంగా ఆకలిని అనుభవిస్తాడు. ప్రశాంతంగా సర్వ నాశనం అవుతున్నాడు అని వ్యంగంగా వ్యాక్యనించిన వారు? దాదాబాయి నౌరోజీ
  • అతివాదులకు ప్రాతినిద్యం వహించినవారు Indian National Movement కాలం లో ? తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, అరవింద ఘోష్
  • అతివాదుల అంతిమ లక్ష్యం అని దేనిని ప్రకటించారు Indian National Movement కాలం లో ? స్వరాజ్య సాధన
  • 1907 లో ఏ సమావేశం లో మితవాదుల నుండి ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డారు? సూరత్ లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం లో
  • (Indian National Movement కాలం లో) సూరత్ విభజన అనగా?  సూరత్ లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం లో అతివాదులు మితవాదులు అనే 2 వర్గాలుగా విడిపోయారు దేనినే
  • భారత జాతీయోద్యమం Indian National Movement లో అన్ని సందర్భాలలో కనిపించే 2 ముఖ్య సంఘటనలు ? బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేఖత, జాతీయ ఐఖ్యత
  • జాతీయ పోరాటం Indian National Movement ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగిసింది? 1857 సిపాయిల తిరుగుబాటు తో ప్రారంభమై 1947 భారత స్వతంత్ర సముపార్జన తో ముగిసింది

Vande Mataram Movement (వందేమాతర ఉద్యమం)

  • (Indian National Movement కాలం లో) అతివాదుల యుగం లో మొదటి ఘట్టం ? బెంగాల్ విభజన వ్యతిరేఖ ఉద్యమం
  • (Indian National Movement కాలం లో) బెంగాల్ విభజన వ్యతిరేఖ ఉద్యమం నకు గల పేర్లు? వందేమాతర ఉద్యమం, స్వదేశీ ఉద్యమం
  • (Indian National Movement కాలం లో) బెంగాల్ విభజనను ప్రకటించిన వారు? లార్డ్ కర్జన్ (బ్రిటిష్ రాజ ప్రతినిధి)
  • లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనను ఎప్పుడు ప్రకటించాడు? 1905 జూలై 4
  • (Indian National Movement కాలం లో) బెంగాల్ విభజన ఎప్పటినుండి అమలులోకి వచ్చింది? 1905 అక్టోబర్ 16 నుండి
  • లార్జ్ కర్జన్ ఏ సూత్రాన్ని అనుసరించి బెంగాల్ విభజన చేసాడు? విభజించు పాలించు అనే సూత్రాన్ని
  • బెంగాల్ విభజనను ఏ వర్గం వారు వ్యతిరేఖించారు? ఇరువర్గాలు (అతివాదులు, మిత వాదులు)
  • ఏ ఉద్యమం లో హిందూ ముస్లిం లు ఐఖ్యతకు చిహ్నంగా రాఖీలు కట్టుకొన్నారు? వందేమాతర ఉద్యమం లో (మితవాదుల తో ప్రారంభమై అతివాదులు సమరశీల నాయకత్వం వైపు సాగింది)
  • (Indian National Movement కాలం లో) వందేమాతర ఉద్యమం లో భాగంగా బహిష్కరణ తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించారు? 1905 కలకత్తా టౌన్ హలో జరిగిన సమావేశం లో
  • బెంగాల్ ప్రజలు ఏ రోజున సంతాప దినంగా, ఉపవాస దినంగా ప్రకటించారు? అక్టోబర్ 16న
  • (Indian National Movement కాలం లో) వందే మాతర గీతం ఎక్కడ నుండి తీసుకోబడినది? ఆనంద్ మఠ్ నవల నుండి
  • ఆనంద్ మఠ్ నవల ఎవరు రాసారు? బంకిం చంద్ర చటర్జీ
  • (Indian National Movement కాలం లో) వందేమాతర గీతం దీనిని వివరిస్తుంది? దేశాన్ని మాతృమూర్తి గా అభివర్ణిస్తూ, దేశ ఔన్నత్యాన్ని స్తుతిస్తుంది
  • జాతీయోద్యమం Indian National Movement కాలం లో నిరసనలు, పికెటింగ్ లు, ఆందోళన కారులకు నినాదంగా మారిన గీతం? వందేమాతరం 
  • పాశ్చాత్య వస్తువుల బహిష్కరణ సందేశాన్ని బొంబాయి నుండి పూణే వరకు తీసుకెళ్ళిన వారు ? లోకమాన్య తిలక్
  • విదేశీ వస్తు భాహిస్కరణ ను ప్రచారం చేసిన వారు Indian National Movement కాలం లో
ప్రాంతంప్రచారం చేసిన వారు
ముంబై – పూనేలోకమాన్య తిలక్
పంజాబ్, ఉత్తర భారత ప్రాంతాలుఅజిత్ సింగ్, లజపతి రాయ్
ఢిల్లీహైదర్ రాజా
మద్రాస్చిదంబరం పిళ్ళై
దేశ వ్యాప్త పర్యటనబిపిన్ చంద్రపాల్

(మొట్ట మొదటిసారి జాతీయోద్యమం సంప్రదాయ పండుగల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం జరిగింది)

Penugolu
6.5 Penugolu – A Village on the Hills (పెనుగోలు – కొండలపై ఒక గ్రామం)
  • ప్రజలను సమీకరించడానికి మహారాష్ట్ర లో శివాజీ, గణపతి ఉత్సవాలను నిర్వహించిన వారు? తిలక్
  • బెంగాల్ విభజన తరువాత అసలైన చైతన్యం 1908 లో జరిగింది. అది కేవలం బెంగాల్ విభజన కాదు బ్రిటిష్ విచ్చిన్నం అని పెర్కొన్నవారు? గాంధీ
  • బ్రిటిష్ వారు రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీ కి ఎప్పుడు మార్చారు? 1911
  • బ్రిటిష్ వారు రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీ కి మార్చడానికి ఉద్దేశం ఏమిటి? కలకత్తా లో మేధావుల ప్రాభల్యం తగ్గించడానికి
  • ఆంధ్ర లో వందేమాతర ఉద్యమానికి నాయకత్వం వహించినవారు? గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, అయ్యదేవర లక్ష్మణ రావు, గొల్లపూడి సీతారామ శాస్త్రి
  • (Indian National Movement కాలం లో) బిపిన్ చంద్ర పాల్ ఆంధ్ర లో ఎప్పుడు పర్యటించారు? 1907 ఏప్రిల్ నెలలో
  • బిపిన్ చంద్ర పాల్ ఆంధ్రపర్యటన సభలో హాజరైన విద్యార్థి సంఘ నాయకులు? గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, చిలుకూరి వీరభద్ర రావు
  • (Indian National Movement కాలం లో) వందేమాతరం  ఉద్యమ సమయం లో ఆంధ్ర లో చోటుచేసుకొన్న ప్రధాన సంఘటనలు ఎన్ని? 4 (రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల సంఘటన, కాకినాడ అల్లర్లు, కోటప్ప కొండ సంఘటన, తెనాలి బాంబు సంఘటన)

Rajahmundry Arts College Incident (రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల సంఘటన)

  • (Indian National Movement కాలం లో) రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల సంఘటన ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 24, 1907
  • (Indian National Movement కాలం లో) రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల సంఘటన గూర్చి వివరణ? బిపిన్ చంద్ర పాల్ ఉపన్యాస ప్రభావం తో విద్యార్దులు వందేమాతరం  బ్యాడ్జి లు ధరించి, వందేమాతరం  నినాదం తో పలకరించు కోవడం మొదలు పెట్టారు. ఇది శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ మార్క్స్ హంటర్ కు నచ్చలేదు. ప్రిన్సిపాల్ ఆదేశాలు దిక్కరించి విద్యార్థి సంఘ నాయకుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు సమ్మెకు దిగారు. 24 ఏప్రిల్ 1907 లో. హరిసర్వోత్తమ రావును కళాశాల బహిష్కరించింది. అతడిని ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడు గా ప్రకటిస్తూ ఉత్తర్వు జారి చేసింది. ఈ సంఘటన ఆంధ్రాలో స్వతంత్ర ఉద్యమం లో విద్యార్దుల భాగస్వామ్యానికి నాంది పలికింది.

Kakinada Riots (కాకినాడ అల్లర్లు)

  • (Indian National Movement కాలం లో) కాకినాడ అల్లర్లు ఎప్పుడు జరిగాయి? 31 మే 1907
  • (Indian National Movement కాలం లో) కాకినాడ అల్లర్లు గూర్చి వివరణ? కాకినాడ వైద్య అధికారి కెప్టెన్ కెంప్ కార్యాలయం వందేమాతరం  ఉద్యమం తో హోరెత్తింది. బజారుకు వెళ్ళుతుండగా వందేమాతర నినాదాలు. కోపం తో కెంప్ “కోపెల్ల కృష్ణారావు” ను చెంపదెబ్బ కొట్టాడు. 300 మంది యువకులు కెంప్ ఇంటి పై దాడి చేసారు. కెంప్ ను రహస్యంగా సైకిల్ పై కాకినాడ నుండి సామర్ల కోటకు అక్కడనుండి రాజమండ్రి మీదుగా మద్రాస్ కు పంపివేసారు

Kotappakonda Incident (కోటప్ప కొండ సంఘటన)

  • (Indian National Movement కాలం లో) కోటప్ప కొండ సంఘటన ఎప్పుడు జరిగింది? 18 ఫిబ్రవరి 1909
  • (Indian National Movement కాలం లో) కోటప్పకొండ సంఘటన గూర్చి వివరణ? 1909 ఫిబ్రవరి 18 కోటప్పకొండ ఆలయం శివరాత్రి పర్వదినం. చిన్నపరెడ్డి కి పోలీస్ కానిస్టేబుల్ కి తగాదాలో చిన్నపరెడ్డి కానిస్టేబుల్ ని కొట్టాడు. చిన్నపరెడ్డిని అరెస్ట్ చేసారు. వందలాది ప్రజలు పోలీస్ స్టేషన్ పై దాడిచేసి నిప్పు పెట్టి చిన్నపరెడ్డిని విడిపించుకొని వెళ్లారు. ఈ సంఘటన లో సబ్ కలెక్టర్, పోలీస్ సూపరిటెండే౦ట్ గాయపడ్డారు. ప్రభుత్వం ఈ సంఘటనను సేరియాస్ గా తీసుకొని చిన్నపరెడ్డిని ఉరి తీసింది

Tenali Bomb Incident  (తెనాలి బాంబు సంఘటన)

  • (Indian National Movement కాలం లో) తెనాలి బాంబు సంఘటన ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 6, 1909
  • (Indian National Movement కాలం లో) తెనాలి బాంబు సంఘటన గూర్చి వివరణ? కంచెర్ల చేన్నుగాడు (హరిజన యువకుడు). నందివెలుగు గ్రామవాసి. తెనాలి సమీపం లో కంచరపాలెం వద్ద కాలువ ఒడ్డు దాటుచుండగా బాంబు ప్రేలి చనిపోయాడు. ఏప్రిల్ 6, 1909. ఈ సంఘటనలో రైతు చుక్కపల్లి రామయ్య (కంచరపాలెం వాసి) కు 10 సంవత్సరాలు జైలు శిక్ష. కాటంరాజు వెంకటరాయుడు, లక్కరాజు బసవయ్య (కటేవరానికి చెందిన రైతులు) వీరిపై కేసు నమోదు అయ్యింది. బసవయ్య స్వరాజ్య సంపాదన అనే కరపత్రం లో విద్రోహ సాహిత్యం ముద్రించాడు అనే కారణం తో 5 సంవత్సరాలు జైలు శిక్ష. హైకోర్టులో అప్పులు చేసుకొంటే ఆ శిక్ష 2 సంవత్సరాలకు తగ్గించింది. ఈ కేసును వాదించింది మద్రాస్ లో జ్యుడీషియల్ లా ప్రాక్టిషనర్ గా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు
  • స్వదేశీ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆంధ్ర వాసులు Indian National Movement కాలం లో
ఆంధ్ర ప్రాంతంనాయకత్వం వహించినవారు
ఆంధ్రగాడిచర్ల హరిసర్వోతమ రావు, అయ్యదేవర కాళేశ్వర రావు
పిఠపురంజగ్గన్న శాస్త్రి
గుంటూరుకొండా వెంకటప్పయ్య
రాజమండ్రి లోమున్నేశ్వర రావు
విశాఖపట్నంసి వై చింతామణి

Role of Revolutionaries – First Phase (విప్లవకారుల పాత్ర – తొలిదశ)

  • సమరశీల జాతీయోద్యమ (Indian National Movement కాలం లో) విప్లవకారులకు ఆదర్శంగా ఎవరు నిలిచారు? ఐరిష్ తీవ్రవాదులు, రష్యన్ సూన్యవాదులు
  • సమరశీల జాతీయోద్యమ విప్లవకారుల ప్రధాన లక్ష్యాలు? రహస్య సంఘాలు స్థాపించి నిరంకుశంగా వ్యవహరించే బ్రిటిష్ అధికారులపై ఆయుధాలు, బాంబులతో దాడిచేసి హత మార్చడం, తద్వారా భయోత్పాతం సృష్టించి అధికారులు ఎవరు ఈ దుర్నితి లో వ్యవహరించకుండా చేయడం. ఆత్మ బలిదానాల ద్వార బ్రిటిష్ పాలన అంతం చేయడం.
  • సమరశీల జాతీయోద్యమ విప్లవకారుల కార్యకలాపాలు కొనసాగించిన సంస్థలు? తూర్పు భారతదేశం (బెంగాల్) లో అనుశీలన్ సమితి, యుగాంతర్ పత్రిక, మహారాష్ట్ర లో అభినవ భారత్, పంజాబ్ లో భారత్ మాతా సొసైటీ (ప్రధానంగా రహస్య సంస్థ గా కొనసాగాయి)
  • సమరశీల జాతీయోద్యమ (Indian National Movement కాలం లో) విప్లవఉద్యమం ఏ సంఘటన తో ప్రారంభం అయినది? 1897 పూణా లో బ్రిటిష్ అధికారులు రాండ్, ఐర్ స్ట్ లను దామోదర చాపెకర్, బాలకృష్ణ చాపెకర్ లు హతమార్చడం తో
  • దామోదర చాపెకర్, బాలకృష్ణ చాపెకర్ లు బ్రిటిష్ అధికారులను ఎందుకు హతమార్చారు? ప్లేగు వ్యాధి వ్యాపించిన నపుడు నివారణ చర్యల కొరకు బ్రిటిష్ వారు రాండ్, ఐర్ స్ట్ లను ఏర్పాటు చేసారు. వీరు సైనికులతో కలిసి ప్రజల ఇళ్ళల్లో బలవంతంగా దాడులు చేయించడం, మహిళలను అవమానించడం, ఇళ్ళల్లో వస్తువులు ద్వంశం చేయడం ఇటువంటి చర్యలవల్ల
  • కింగ్స్ ఫోర్డ్ (ముజఫర్ పూర్ జడ్జ్) పై 1908 లో హత్యాప్రయత్నం చేసిన వారు? ఖుదీరాం బోస్, ప్రపుల్లచాకీలు (ప్రపుల్లచాకీ బ్రిటిష్ వారికి చిక్కకుండా ఆత్మహత్య చేసుకొన్నాడు. ఖుదీరాం బోస్ కు మరణ శిక్ష పడింది)
  • విప్లవ ఉద్యమాలు (Indian National Movement కాలం లో) భారతదేశం వెలుపల ఏయే దేశాలలో కొనసాగాయి? అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో
  • లండన్ లోని భారతీయ విప్లవకారుల్లో ప్రముఖుడు? శ్యాంజీ క్రిష్ణవర్మ
  • శ్యాంజీ క్రిష్ణవర్మ లండన్ నుండి నడిపిన పత్రిక? ఇండియన్ సోషియాలజిస్ట్
  • మహారాష్ట్ర నుండి ఇంగ్లాండ్ చేరుకొని శ్యాంజీ క్రిష్ణవర్మ తో చేరిన విప్లవ కారుడు? వి డి సావర్కర్
  • మదన్ లాల్ డింగ్రా 1909 లో లండన్ లోని ఎవరిని కాల్చి చంపాడు? కర్జన్ విల్లిని (ఇండియా ఆఫీస్ అధికారి) డింగ్రా ఉరితీయ బడ్డాడు
  • శ్యాంజీ క్రిష్ణవర్మ అనుచరుల్లో ముఖ్యురాలు ? మేడం కామా (పార్శి కుటుంభం లో జన్మించింది)
  • మేడం కామా ఇంగ్లాండ్ లో స్థాపించిన సంస్థ? ఫ్రీ ఇండియా సొసైటీ
  • మేడం కామా ఏ ప్రాంతం లో తానూ రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది? స్టట్ గట్ (జర్మని లో జరిగిన ప్రపంచ సోషలిస్ట్ సమావేశానికి హాజరై )
  • గదర్ పార్టి ఎక్కడ రూపొందింది? అమెరికాలో (పంజాబ్ విప్లవ కారులతో)
  • గదర్ అనగా అర్ధం ఏమి ? తిరుగుబాటు
  • గదర్ ? ఇది ఒక రహస్య పత్రిక
  • గదర్ పత్రిక మార్గదర్శకుడు / ఆద్యుడు ? లాలా హరదయాళ్
  • గదర్ పార్టి లో ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రముఖుడు? దర్శి చెంచయ్య

Home Rule Movement (హోం రూల్ ఉద్యమం)

  • బ్రిటిష్ సామ్రాజ్యం లో అంతర్భాగంగా ఉంటూ భారతదేశానికి స్వ పరిపాలన సాధించడం లక్ష్యంగా ఏర్పాటైన ఉద్యమం? హోమ్ రూల్ ఉద్యమం
  • హోమ్ రూల్ అనగా ? స్వీయ పాలన
  • హోమ్ రూల్ సాధన కోసం ఏర్పాటు అయిన హోమ్ రూల్ శాఖలు? 2 (1 అనిబిసెంట్ నేతృత్వం లో  2 బాలగంగాధర్ తిలక్ నేతృత్వం లో
  • అనిబిసెంట్ (తియోసాఫిస్ట్ నాయకురాలు) దేనిని కేంద్రంగా చేసుకొని హోమ్ రూల్ ఉద్యమాన్ని కొనసాగించారు? అడయార్ (మద్రాస్ సమీపం లో )
  • బాల గంగాధర్ తిలక్ దేనిని కేంద్రంగా చేసుకొని హోమ్ రూల్ ఉద్యమం సాగించారు? బొంబాయి 1916 లో (మహారాష్ట్ర, కర్ణాటక లో బలంగా పనిచేసింది)
  • బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ కు ఏ ప్రాంతం లోకి ప్రవేసించడానికి వీలులేకుండా ఆంక్షలు విధించింది ? పంజాబ్
  • హోమ్ రూల్ ఉద్యమం పై ప్రజలకు అవగాహన కల్గించడానికి అనిబిసెంట్ స్థాపించిన పత్రికలూ? ది కామన్ వీల్, న్యూ ఇండియా (ఇవి ఆంగ్ల పత్రికలు)
  • ఆంధ్ర ప్రాంతం లో హోమ్ రూల్ నిర్వహించిన నాయకులు? గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్యి నారాయణ, చిలకమర్తి లక్ష్మి నారాయణ, అయ్యదేవర కాళేశ్వర రావు
  • బాలగంగాధర్ తిలక్ ను బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జైలులోనిర్భందించింది? 1908-1914 మధ్య అనేక నేరారోపణలు చేసి తిలక్ కు జైలు విధించారు
  • హోమ్ రూల్ ఉద్యమం ఎప్పుడు ముగిసింది? 1918 (పూర్తిగా స్వతంత్రం కావాలనే లక్ష్యాన్ని ఎప్పుడు బహిరంగపరచలేదు.

Gandhi’s Initial Movements (గాంధి తొలి పోరాటాలు)

  • గాంధీజీ పూర్తీ పేరు? మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
  • మహాత్మా గాంధి ఎక్కడ పుట్టాడు? పోరుబందర్ (కధియవార్ ప్రాంతం గురజాత్)
  • మహాత్మా గాంధి ఎప్పుడు జన్మించాడు? అక్టోబర్ 2, 1869 లో
  • భారత జాతి పిత గా ఎవరు కీర్తించ బడుతున్నారు? మహాత్మా గాంధి
  • మహాత్మా గాంధి విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? రాజ్ కోట్ భావనగర్ లలో
  • మహాత్మా గాంధి 1891 లో ఇంగ్లాండ్ లో ఏ డిగ్రీ పొందారు ? బారిస్టర్ ఏ లా
  • 1893 లో మహాత్మా గాంధి దక్షిణాఫ్రికా దేనికోసం వెళ్లారు ? దక్షిణాఫ్రికా లోని భారతీయ సంస్థ కు న్యాయ సలహాదారుగా
  • మహాత్మా గాంధి దక్షిణాఫ్రికా లో స్థాపించిన సంస్థ? నేటాల్ ఇండియన్ కాంగ్రెస్
  • మహాత్మా గాంధి దక్షిణాఫ్రికా లో ఏ పత్రికకు సంపాదకత్వం వహించాడు? ఇండియన్ ఒపీనియన్ పత్రికకు

Satyagraha (సత్యాగ్రహం)

  • మహాత్మా గాంధి మానస పుత్రికలు గా వేటిని పేర్కొంటారు? అహింస, సత్యాగ్రహం
  • గ్రేట్ మార్చ్ ను దక్షిణాఫ్రికా లో మహాత్మా గాంధి ఎక్కడ చేసాడు? నేటాల్ ప్రావిన్స్ న్యూ కాజల్ నుండి ట్రాన్సివాల్ సరిహద్దు పై (భారత సంతతి వారిచే 1913 లో
  • మహాత్మా గాంధి భారతదేశం నకు ఎప్పుడు తిరిగి వచ్చాడు? 1915 లో
  • మహాత్మా గాంధి సబర్మతి ఆశ్రమాన్ని ఎక్కడ నిర్మించాడు? అహ్మదాబాద్ సమీపం లో

Champaran Satyagraha (చంపారణ్ సత్యాగ్రహం)

  • భారత్ కు తిరిగి వచ్చిన తరువాత గాంధీజీ చేపట్టిన మొదటి ఉద్యమం? చంపారణ్ ఉద్యమం (బీహార్ 1917)
  • చంపారణ్ ఉద్యమాన్ని గాంధీజీ ఎవరికోసం చేపట్టాడు? నీలిమందు రైతుల సమస్యల పరిష్కారం కోసం
  • భారత రాజీయాల్లో గాంధీజీ ప్రవేశ పెట్టిన సూత్రం? సత్యాగ్రహం
  • సత్యాగ్రహ లక్ష్యం? సమస్యలను సంతోషంగా ధైర్యంగా ఎదుర్కొని ఎదుటివారిలో సానుకూల మార్పు తీసుకురావడమే
  • సత్యాగ్రహ ఆశయం? మనిషిలో చెడుని తొలగించి మంచిని పెంపొందించడం
  • సత్యాగ్రహ పద్దతిని రద్దు చేసినవారు? బ్రిటిష్ ప్రభుత్వం
  • చంపారణ్ ప్రాంతం లో ఎన్ని వంతుల భూభాగం లో నీలిమందుని పండించాలని బ్రిటిష్ వారు రైతులను పీడించారు? 3/20 వంతు భాగం లో
  • సత్యాగ్రహ ఆయుధానికి లభించిన అమోఘ విజయంగా గాంధీజీ చేపట్టిన ఏ ఉద్యమాన్ని పేర్కొంటారు? చంపారణ్ నీలిమందు రైతుల ఉద్యమాన్ని
  • చంపారణ్ ఉద్యమం తరువాత గాంధీజీ చేపట్టిన ఉద్యమం? అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె

Ahmedabad Mill Strike & Kheda Satyagraha (అహ్మదాబాద్ మిల్లు సమ్మె & ఖేదా సత్యాగ్రహం)

  • కార్మికుల జీతాలు ఎంత శాతం పెంచాలి అని అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం లో గాంధీజీ నిరాహార దీక్ష చేపట్టాడు? 35%
  • గాంధీజీ పాల్గొన్న 3వ ఉద్యమం ? ఖేడా ఉద్యమం (గుజరాత్) (పంట దిగుబడి 25% కన్నా తక్కువగా ఉండి పన్నుకట్టలేని స్థితి లో)
  • వల్లబాయ్ పటేల్ ఏ ఉద్యమం లో గాంధిజీ తో జతకలిశారు? ఖేడా రైతుల ఉద్యమం లో

Rowlatt Satyagraha (రౌలత్ సత్యాగ్రహం)

  • రౌలత్ చట్టం వ్యతిరేఖ ఆందోళనలు ఎప్పుడు చేపట్టారు? ఏప్రిల్ 6, 1919 లో
  • రౌలత్ చట్టానికి వ్యతిరేఖంగా గాంధిజీ ఏ బిరుదును వదులుకొన్నాడు? కైజర్ ఇ హింద్ బిరుదును
  • కైజర్ ఇ హింద్ బిరుదును బ్రిటిష్ వారు గాంధీజీ కి ఎప్పుడు ప్రధానం చేసారు? మొదటి ప్రపంచ యుద్ధం లో
  • దేశ వ్యాప్తంగా రాజకీయ విప్లవ పరిస్థితులు Indian National Movement సృష్టించిన ఉద్యమం? రౌలత్ ఉద్యమం
  • రౌలత్ చట్టం దేనిని తెలియజేస్తుంది? మొదటి ప్రపంచ యుద్ధం తరువాత దేశం లో పెరుగుతున్న జాతీయ వాదాన్ని విప్లవ ధోరణులను అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం సర్ సిడ్ని రౌలత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన చట్టం

Jallianwala Bagh Massacre (జలియన్ వాలాబాగ్ మారణహోమం)

  • భారతదేశ స్వతంత పోరాటం Indian National Movement లో శతాబ్దం లోకెల్లా జరిగిన అతిపెద్ద మరణ హోమం? జలియన్ వాలాబాగ్ సంఘటన
  • జలియన్ వాలాబాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్ 13
  • జలియన్ వాలాబాగ్ సంఘటన ఎక్కడ జరిగింది? అమృత్ సర్ (పంజాబ్) లోని జలియన్ వాలాబాగ్ లో
  • జలియన్ వాలాబాగ్ లో కాల్పులు జరిగించిన పోలీస్ అధికారి? జనరల్ డయ్యర్
  • జలియన్ వాలాబాగ్ సంఘటన విచారణకు నియమించిన కమిటి? హంటర్ కమిటి
  • జలియన్ వాలాబాగ్ సమావేశం ఎందుకు జరిగింది? రౌలత్ చట్టానికి వ్యతిరేఖంగా జరిగిన శాంతియుత సమావేశం

Khilafat Movement  (ఖిలాఫత్ ఉద్యమం)

  • ఖిలాఫత్ ఉద్యమం ఎవరి నాయకత్వం లో ప్రారంభం అయినది? మహమ్మద్ అలీ, షౌకత్ అలీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేతృత్వం లో
  • ఖిలాఫత్ ఉద్యమం ఎందుకు ప్రారంభం అయినది? టర్కీ ఖలీఫా ప్రతిష్టతను గౌరవాన్ని నిలబెట్టే లక్ష్యం తో
  • బ్రిటిష్ సామ్రాజ్య వాదాన్ని ఎడురించడానికి హిందూ ముస్లిం ఐఖ్యత ఎంతో ఉపయోగ పడింది అని ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు తెలిపినవారు? గాంధిజీ
  • హిందూ ముస్లిం ఐఖ్యత దృశ్యాలు కనిపించిన ఉద్యమం? ఖిలాఫత్ ఉద్యమం

Non-Cooperation Movement (సహాయ నిరాకరణ ఉద్యమం)

  • సహాయ నిరాకరణ ఉద్యమానికి రూపకల్పన చేసినవారు? గాంధిజీ
  •  సహాయ నిరాకరణ ఉద్యమ లక్ష్యం? స్వరాజ్యం
  • గాంధీజీ రూపొందించిన సహాయనిరాకరణ ను ఏ సమావేశం లో ఆమోదించినారు? 1920 లో జరిగిన కలకత్తా నాగపూర్ సమావేశం లో
  • సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభం అయినది? 1920 ఆగస్ట్ 31
  • సహాయ నిరాకరణలో భాగంగా స్థాపించబడిన జాతీయ విద్యాలయాలు? కాశీ విద్యాపీఠ౦, గుజరాత్ విద్యాపీఠ౦, ఢిల్లీ లోని జామియా మిలియాలు
  • సహాయ నిరాకరణలో భాగంగా న్యాయవాద వృత్తిని వదులుకొన్న జాతీయ నాయకులు? చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రు, బాబు రాజేంద్ర ప్రసాద్, వల్లబాయ్ పటేల్, టంగుటూరి ప్రకాశం పంతులు
  • సహాయ నిరాకరణలో భాగంగా ఎవరి పర్యటనను బహిష్కరించారు? వేల్స్ యువరాజు పర్యటనను
  • సహాయ నిరాకరణలో భాగంగా ఏ ప్రాంతం లో స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసారు? విజయవాడ లో
  • సహాయ నిరాకరణలో భాగంగా ఏ ప్రాంతం లో రైతులు పన్నులు చెల్లించడానికి నిరాకరించారు? మిడ్నాపూర్ రైతులు
  • సహాయ నిరాకరణలో భాగంగా కౌలు చెల్లించడానికి నిరాకరించిన రైతులు ఏ ప్రాంత వాసులు? రాయబరేలి, ఫైజాబాద్
  • పంజాబ్ లోని గురుద్వారాల అవినీతి పై జరిగిన ఉద్యమం? అకాళీ ఉద్యమం
  • బాల్డోలీ లో సామూహిక శాసనోల్లంఘన ఉద్యమానికి గాంధీజీ ఎప్పుడు పిలుపునిచ్చాడు? 1 ఫిబ్రవరి 1922
  • సహాయ నిరాకరణ ఉద్యమ నిలిపివేతకు దారి తీసిన సంఘటన? చౌరీ చౌరా సంఘటన
  • చౌరీ చౌరా సంఘటన ఎపుడు జరిగింది? 5 ఫిబ్రవరి 22
  • చౌరీ చౌరా సంఘటన ప్రాంతం ఎక్కడ ఉంది? ఉత్తర ప్రదేశ్ లోని ఘోరాక్ పూర్ జిల్లలో
  • చౌరీ చౌరా సంఘటన వివరణ? 5 ఫిబ్రవరి 22 న ప్రజలు ఊరేగింపుగా వెళుతున్నారు. పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఆగ్రహించిన ప్రజలు పోలిస్ స్టేషన్ కి నిప్పు పెట్టారు. 22 మంది పోలీసులు సజీవ దహనం అయ్యారు
  • చౌరీ చౌరా సంఘటన ను బట్టి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ ఎప్పుడు నిలిపివేశాడు? ఫిబ్రవరి 12, 1922
  • జాతీయోద్యమ Indian National Movement లో భాగంగా మహిళలు మొదటిసారి ఏ ఉద్యమం లో పాల్గొన్నారు? సహాయ నిరాకరణ ఉద్యమం లో
  • సహాయ నిరాకరణ ఉద్యమం లో గాంధీజీ సహకారిగా పాల్గొన్న మహిళలు? ఉన్నావ లక్ష్మీబాయమ్మ, దువ్వురి సుబ్బమ్మ, కోణకా కనకమ్మ
  • గాంధీజీ పాల్గొన్న విజయవాడ జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది ? 31 మర్చి 1921
  • జాతీయ జండా రూపకర్త? పింగళి వెంకయ్య
  • పింగళి వెంకయ్య జాతీయ జండా ను ఏ సమావేశం లో ఆవిష్కరించాడు? 31 మర్చి 1921 విజయవాడ లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం లో

Chirala-Perala Civil Disobedience Movement (చీరాల పేరాల శాసనోల్లంఘన ఉద్యమం)

  • చీరాల పేరాల సాశానోల్లంఘన ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1921 లో
  • జాతీయోద్యమ Indian National Movement కాలం లో చీరాల పేరాల (ప్రకాశం జిల్లా లో ) జనాభా? 15 వేలు
  • చీరలా పేరాల సాశానోల్లంఘన ఉద్యమ వివరణ? 15 వేల జనాభా పై 4 వేలు పన్ను భారం. బ్రిటిష్ ప్రభుతం చీరాల పేరాలను మున్సిపాలిటీ గా ప్రకటించారు. తద్వారా పన్ను భర౦ 4 వేలు నుండి 40 వేలకు పెరిగింది. పూర్వ స్థితి కొనసాగించాలని ఉద్యమం ప్రారంభం
  • చీరలా పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు? దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
  • 1000 మంది వాలంటీర్లతో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఏర్పాటు చేసిన దళానికి గల పేరు? రామదండు
  • చీరలా పేరాల ఉద్యమం లో పన్ను కట్టలేని ప్రజలు ఊరు వదలి నిర్మించు కొన్న తాత్కాలిక గ్రామ౦? రాం నగర్ (11 నెలలు అక్కడే గడిపారు)
  • చీరాల పేరాల ఉద్యమం వీగి పోవడానికి కారణం? దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్యను ప్రభుత్వం బరంపురం లో నిర్భందించింది. సరైన నాయకత్వం లేక ప్రజలు చీరాల పేరాల చేరుకొన్నారు

Palnadu Pullari Satyagraha (పల్నాటి పుల్లరి సత్యాగ్రహం)

  • పల్నాటి పుల్లరి సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? 1921 లో
  • పుల్లరి అనేది ఏమిటి? బ్రిటిష్ ప్రభుత్వం పశువులపై యజమానులకు విధించిన పన్ను
  • పల్నాడు లొ ఏయే ప్రాంతాలలో పుల్లరి సత్యాగ్రహం జరిగింది? వెల్దుర్తి, సిరిగిరి పాడు
  • పల్నాటి పుల్లరి ఉద్యమం ఎలా ప్రారంభం అయినది? 1921 సెప్టెంబర్ 22. మించాలపాడు గ్రామం. కన్నెగంటి హనుమంతు 200 మంది అనుచరులతో బ్రిటిష్ వారు బందించిన పశువులను విడిపించుకు పోయాడు. బ్రిటిష్ వారు అతనిని కాల్చి చంపారు. అలా ఈ ఉద్యమం మొదలైనది

Pedanandipadu Tax Refusal Movement (పెదనందిపాడు పన్ను నిరాకరణ ఉద్యమం)

  • పెదనందిపాడు పన్ను నిరాకణ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1922 లో
  • పెదనందిపాడు పన్ను నిరాకరణ ఉద్యమానికి నాయకుడు? పర్వతనేని వీరయ్య చౌదరి
  • పెదనంది పాడు గ్రామం ఏ జిల్లలో ఉంది? గుంటూరు
  • పెదనందిపాడు పన్ను నిరాకరణ ఉద్యమాన్ని అదుపులోకి తీసుకు రావడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎవరిని నియమించింది? రూథర్ ఫోర్డ్ ను

Rampa Revolt (రంప విప్లవం)

  • రంప విప్లవానికి నాయకత్వం వహించింది ఎవరు? మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు
  • అల్లూరి ఎక్కడ జన్మించాడు ? 1897 మొగల్తూరు లో
  • అల్లూరి సీతారామ రాజు ఎక్కడ చదువు కొన్నాడు? తుని ఉన్నత పాటశాల లో
  • అల్లూరి సీతారామ రాజు ఏరంగం లో ప్రవీణుడు? గుర్రపు స్వారీ, మూలికా వైద్యం, జ్యోతిష్యం, విలువిద్య లో
  • అల్లూరి సీతారామ రాజు ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశం లో పాల్గొన్నాడు? బెంగాల్ లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం లో
  • అల్లూరి సీతారామ రాజు తన విప్లవ భావాలకు మార్గం ఎప్పుడు వేసుకొన్నాడు? 1921 చిట్టగాంగ్ లో (బెంగాల్ విప్లవ వాదులతో చర్చించి)
  • అల్లూరి సీతారామ రాజు ఏయే పోలీస్ స్టేషన్ లపై దాడి చేసి ఆయుదాలు దోచుకొన్నాడు? చింతపల్లి, రాజవొమ్మంగి, కృష్ణ దేవి పేట స్టేషన్ లపై
  • అల్లూరి సీతారామ రాజుకు ఏ ప్రాంత వాసులు స్త్రీ పురుషులు హారతులు ఇచ్చి ఆహ్వానించారు? అన్నవరం, శంకవరం లో 1923
  • అల్లూరి సీతారామ రాజును బందించ దానికి బ్రిటిష్ వారు ఎవరిని నియమించారు? రూథర్ ఫోర్డ్ ను
  • అల్లూరి సీతారామ రాజు అనుచరులు? గాంమల్లుదొర, గాంగ౦టం దొర, అగ్గిరాజు
  • అల్లూరి సీతారామ రాజును బ్రిటిష్ వారు ఎప్పుడు కాల్చి చంపారు? మే 7, 1924

Second Phase of the Revolutionary Movement (విప్లవోద్యమ రెండవ దశ)

  • హిందూస్తాన్ రిపబ్లిక్ అశోషియేషన్ అనే సంస్థను స్థాపించిన వారు? సచిన్ సన్యాల్, జోగేష్ చంద్ర చటర్జీ, రాం ప్రసాద్ బిస్మల్, చంద్ర శేఖర్ ఆజాద్ లు
  • హిందూస్తాన్ రిపబ్లిక్ అశోషియేషన్ అనే సంస్థను ఎక్కడ స్థాపించారు? కాన్పూర్ లో 1924
  • హిందూస్తాన్ రిపబ్లిక్ అశోషియేషన్ అనే సంస్థ సభ్యులు చేపట్టిన ప్రధాన చర్య? కాకోరి కుట్ర కేసు
  • కాకోరి కుట్ర కేసు వివరణ? లక్నో – సహారన్ పూర్ రైలు మార్గం. కాకోరి వద్ద నడుస్తున్న రైలు నుండి డబ్బును కొల్లగొట్టారు. 29 మంది అరెస్ట్ అయ్యారు. ఇది కాకోరి కుట్రకేసు గా ప్రసిద్ది
  • కాకోరి కుట్ర కేసులో మరణ శిక్ష పడినవారు? రాం ప్రసాద్ బిస్మిల్, అసపుల్లఖాన్, రోషన్ లాల్, రాజేంద్ర లహరి
  • హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అశోషియేషన్ స్థాపించిన వారు? చంద్ర శేఖర్ ఆజాద్ 1928 లో
  • 1931 మధ్య బెంగాల్, పంజాబ్ లో జరిగిన హత్యలు? 9 (92 విప్లవ ఘటనలు సంభవించాయి)
  • సాండర్స్ ను హత్య చేసినవారు? భగత్ సింగ్, రాజగురు చంద్ర శేఖర్ ఆజాద్ లు
  • సాండర్స్ చేసిన దుచ్చర్య ? లాటీ చార్జ్ చేసి లాలా లజపతి రాయ్ మరణానికి కారణం అయ్యాడు
  • లాలా లజపతి రాయ్ పై సాండర్స్ లాటి చార్జి చేయడానికి కారణం? లాహోర్ లో సైమన్ కమిషన్ పై వ్యతిరేఖ ప్రదర్శన చేసినందుకు
  • భగత్ సింగ్, భతుకేస్వర్ దత్ లు ఢిల్లీ లోని కేంద్ర శాసన సభపై ఎప్పుడు పొగ బాంబులు విసిరారు? 1929 ఏప్రిల్ 8 న
  • సాండర్స్ హత్య, ఢిల్లీ శాసన సభపై బాంబులు విసిరిన కేసును లాహోర్ కుట్ర కేసుగా నడిపి ఎవరికి మరణ శిక్ష విధించారు? భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లకు
  • భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లకు మరణశిక్షను ఎప్పుడు విధించారు? 1931  మర్చి 23 న
    • (వీరిని విడిపించడం లో గాంధీజీ ఇర్విన్ ఒప్పందం లోగాంధీజీ చిత్తశుద్ది వహించ లేదని వదంతులు వచ్చాయి)
  • భగత్ సింగ్ ఎక్కడ జన్మించాడు? లైల్లాపూర్  జిల్లా (పంజాబ్ రాష్ట్ర౦ ప్రస్తుత పాకిస్తాన్ )
  • భగత్ సింగ్ ఎప్పుడు జన్మించాడు? 1907 సెప్టెంబర్ 27
  • భగత్ సింగ్ ఎక్కడ విద్యనూ అభ్యసించాడు? డి ఏ వి కళాశాల (లాహోర్)
  • భగత్ సింగ్ 1923 లో ఏ సంస్థ లో చేరాడు? హిందూస్తాన్ రిపబ్లిక్ ఆర్మీ లో
  • భగత్ సింగ్ పనిచేసిన పత్రిక? కీర్తి (సోషలిస్ట్ పత్రిక)
  • భగత్ సింగ్ 1925 లో ప్రారంభించిన సంస్థ ? నవజీవన్ భారత్ సభ
  • భగత్ సింగ్ నినాదం ? ఇంక్విలాబ్ జిందాబాద్
  • గౌరవ ప్రదమైన ఆదరణ కోసం లాహోర్ జైలులో 63 రోజులు నిరాహార దీక్ష చేసి మరణించిన జాతీయ నాయకుడు? జతిన్ దాస్
  • చిట్టగాంగ్ ఆయుధగారాన్ని దోచుకోన్నవారు? సూర్య సేన్
  • బెంగాల్ లో హిందూ స్తాన్ రిపబ్లికన్ ఆర్మీని స్థాపించిన వారు? సూర్యాసేన్
  • సూర్య సేన్ ను బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు ఉరి తీసింది? 1933
  • కాకోరి కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసులో నిందితుడి గా ఉన్న జాతీయ నాయకుడు? చంద్ర శేఖర్ ఆజాద్
  • చంద్ర శేఖర్ ఆజాద్ ను పోలీసులు ఎక్కడ కాల్చి చంపారు? అల్ఫ్రెడ్ పార్క్ వద్ద (అలహాబాద్) ఫిబ్రవరి 27, 1931

Communist Party of India Communist Party of India (కమ్యునిస్ట్ పార్టి అఫ్ ఇండియా)

  • భారత దేశం లో కమ్యూనిస్ట్ బావజాలాన్ని, లెనిన్ సిద్దాంతాలను పరిచయం చేసి కమూనిస్ట్ ఉద్యమానికి జీవం పోసినవారు? ఏం యెన్ రాయ్
  • భారత కమ్యూనిస్ట్ పార్టి ని ఏం యెన్ రాయ్ ఎక్కడ స్థాపించాడు? తాష్కెంట్ లో (1920 7 గురు భారతీయులతో కలిసి)

Swaraj Party (స్వరాజ్ పార్టి)

  • కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టిని ఎప్పుడు స్థాపించారు? 1923 లో
  • 1922 డిసెంబర్ లో జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? గయ లో
  • కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టి అధ్యక్షులు? చిత్తరంజన్ దాస్ (మోతీలాల్ నెహ్రు కార్యదర్శి)
  • కాంగ్రెస్ లోని సోషలిస్ట్ భావాలకు ప్రతీకగా నిలిచినవారు? జవహర్ లాల్ నెహ్రు
  • సైమన్ కమిషన్ భారత దేశం ఎప్పుడు పర్యటించింది ? 1928
  • సైమన్ కమిషన్ భారత దేశం పర్యటించ డానికి కారణం ? భారత దేశం లో స్వయం పరిపాలన అవకాశాలు పరిశీలించడానికి (మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు పనితీరు పర్యవేక్షించ డానికి)
  • సైమన్ కమిషన్ ను భహిస్కరించడానికి కారణం? ఈ కమిషన్ లో ఏ ఒక్కరు భారతీయ సభ్యులు లేనందున
  • సైమన్ కమిషన్ ఎప్పుడు యేర్పాటైనది? 1927
  • సైమన్ కమిషన్ లో సభ్యులు సంఖ్య? 7 (సర్ జాన్ సైమన్ అధ్యక్షుడు )
  • సైమన్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1930 లో
  • సైమన్ కమిషన్ పర్యటనలో వ్యతిరేఖంగా భారతీయులు చేసిన నినాదం? సైమన్ గో బ్యాక్
  • మద్రాస్ ఉమ్మడి రాష్ట్రము లో సైమన్ కమిషన్ వ్యతిరేఖ పోరాటానికి నాయకత్వం వహించింది? ఆంధ్రులు
  • మద్రాస్ ఉమ్మడి రాష్ట్రము లో సైమన్ కమిషన్ వ్యతిరేఖ పోరాటానికి నాయకులు? కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు, బులుసు సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్య, పట్టాభి, టంగుటూరి ప్రకాశం పంతులు
  • సైమన్ కమిషన్ వ్యతిరేఖ ఉద్యమం లోనే టంగుటూరి ప్రకాశం పంతులు తుపాకులకు ఎదురు నిలిచి పొందిన బిరుదు? ఆంద్ర కేసరి
  • సైమన్ కమిషన్ విజయవాడ మునిసిపల్ సభ్యులుకు ఇచ్చిన మూసి ఉన్న కవరులో ఏముంది? సైమన్ గో బాక్

Civil Disobedience Movement (శాసనోల్లంఘన ఉద్యమం)

  • భారత దేశం లో శాసనోల్లంఘన ఉద్యమం దేనితో ప్రారంభం అయినది? ఉప్పు సత్యాగ్రహం తో
  • శాసనోల్లంఘన ఉద్యమ నాయకుడు? మహాత్మా గాంధీ
  • 1928 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా లో
  • 1929 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? లాహోర్ లో
  • 1929 లో జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు? జవహర్ లాల్ నెహ్రు
  • సంపూర్ణ స్వరాజ్యమే అంతిమ లక్ష్యంగా ప్రకటించబడిన జాతీయ కాంగ్రెస్ సమావేశం? లాహోర్ కాంగ్రెస్ సమావేశం
  • రౌండ్ టేబుల్ సమావేశాలని బహిష్కరించాలి అని ఏ సమవేశం లో నిర్ణయం తీసుకొన్నారు? లాహోర్ కాంగ్రెస్ సమావేశం లో
  • దండి యాత్ర ఎప్పుడు ప్రారంభం అయినది? 12 మార్చి 1930
  • సబర్మతి నుండి దండి మధ్య దూరం ? 200 మైళ్ళు
  • దండి యాత్ర లో భాగంగా 200 మైళ్ళ దురాన్ని గాంధీజీ ఎప్పుడు చేరుకొన్నాడు? ఏప్రిల్ 6, 1930
  • శాసనోల్లంఘన ఉద్యమానికి గాంధీజీ ఎప్పుడు నాంది పలికారు ? ఏప్రిల్ 6, 1930
  • సత్యాగ్రహ దాడి ఏ కేంద్రం పై జరిగింది? దర్సన ఉప్పు కేంద్రం పై
  • సరిహద్దు గాంధిగా ఎవరిని పేర్కొంటారు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ను
  • ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఏర్పాటు చేసిన ఉద్యమ సంస్థ? ఖుదాయి ఖిద్మత్ గర్లు (రెడ్ షర్ట్స్ గా పేరు)
  • ఖుదాయి ఖిద్మత్ గర్లు అనగా అర్ధం ? దేవుని సేవకులు
  • శాసనోల్లంఘన ఉద్యమ ఫలితంగా పెషావర్ (వాయవ్య సరిహద్దు ప్రాంతం) లో ఎవరి నేతృత్వం లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నేతృత్వం లో
  • శాసనోల్లంఘన ఉద్యమం లో సత్యాగ్రహం చేసేవారిపై కాల్పులు జరపడానికి నిరాకరించిన వారు? గర్వార్ రైఫిల్స్ కు చెందిన 2 పటాన్ల సైనికులు

Salt Satyagraha in Andhra (ఆంధ్ర లో ఉప్పు సత్యాగ్రహం)

  • శానోల్లంఘన ఉద్యమానికి ఆంధ్ర రాష్ట్ర కన్వినర్ గా నియమితులైన వారు? కొండా వెంకటప్పయ్య
  • ఆంధ్ర లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ నాయకులు Indian National Movement కాలం లో
ప్రాంతంనాయకత్వం వహించిన వారు
కృష్ణ జిల్లాఅయ్యదేవర కాళేశ్వర రావు
గుంటూరుకొండా వెంకటప్పయ్య
గోదావరి జిల్లాలుబులుసు సాంబముర్తి
విశాఖ పట్నంతెన్నేటి విశ్వనాధం
నెల్లూరుబెజవాడ గోపాల రెడ్డి
  • గాంధీజీ అధికారికంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు ఎప్పుడు ప్రకటించాడు? 1934 లో
  • ఆంధ్ర లోని ఏ ప్రాంత ప్రజలు రెట్టించిన ఉత్సాహం తో విదేశీ వస్తు భాహిష్కరణ ఊరేగింపులు ప్రదర్శన ఉద్యమాలు నడిపారు? కోస్తా జిల్లా ప్రజలు

Round Table Conferences (రౌండ్ టేబుల్ సమావేశాలు)

  • మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1930 (లండన్ లో)
  • రౌండ్ టేబుల్ సమావేశాల ఉద్దేశం? సైమన్ కమిషన్ నివేదికను చర్చించి నూతన రాజ్యాంగ సంస్కరణలు నిర్ణయించడానికి
  • ఎంత మంది సభ్యులు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొన్నారు? 89 మంది సభ్యులు (కాంగ్రెస్ దీనిని బహిష్కరించింది)
  • రెండవ రౌండ టేబుల్ సమావేశం ఎపుడు జరిగింది? 1931 లో
  • గాంధీజీ ఎన్నవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు? 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి (గాంధీ ఇర్విన్ ఒడంబడికను అనుసరించి)
  • తిరిగివచ్చిన గాంధీజీ ని ప్రభుత్వం ఎక్కడ నిర్భందించినది? ఎరవాడ జైలులో (పూణే)
  • 2వ రౌండ్ టేబుల్ సమావేశం తరువాత శాసనోల్లంఘన ఉద్యమాన్ని తిరిగి ప్రరంబించాలి అని గా౦దీజి ఎప్పుడు నిర్ణయం తీసుకొన్నాడు? 1932 జనవరి లో జగిరిన జాతీయ కాంగ్రెస్ సమావేశం లో
  • 3వ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1932 నవంబర్ లో (కాంగ్రెస్ దీనిని బహిష్కరించింది)
  • రౌండ్ టేబుల్ సమావేశాల ఫలితం ఏమిటి? ఆంగ్ల ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసి౦ది (దీని ద్వారానే 1935 చట్టం ఏర్పడింది)

Poona Pact (పూనా ఒప్పందం)

  • కమ్యూనల్ అవార్డ్ ను ఎవరు ప్రకటించారు? రాం సే మాక్టోనాల్ద్ (బ్రిటిష్ ప్రధాని)
  • కమ్యూనల్ అవార్డ్ ను ఎప్పుడు ప్రకటించారు? 1932 ఆగస్ట్ లో (2వ రౌండ్ టేబుల్ సమావేశం తరువాత)
  • కమ్యూనల్ అవార్డ్ ద్వార ప్రత్యెక నియోజక వర్గాలు ఎవరికి కేటాయించబడ్డాయి? ముస్లిం లు, సిక్కులు, క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్ లు, దళితులు కు
  • దేశం మొత్తం మీద దళితులకు కేటాయించబడిన సీట్లు సంఖ్య? 71
  • అణగారిన వర్గాలను ప్రత్యెక వర్గంగా గుర్తిస్తూ కమ్యూనల్ అవార్డ్ ప్రకటించడాన్ని వ్యతిరేఖించి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోన్నవారు? గాంధీజీ (పూనా ఎర్రవాడ జైలులో)
  • పూనా ఒడంబడిక ఎవరెవరి మధ్య జరిగింది? గాంధిజీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మధ్య (1932)
  • పూనా వడంబడికను అనుసరించి దళితులకు కేటాయించబడిన 71 స్థానాలు ఎంతకు పెరిగాయి? 148 కి (కాని దళిత నియోజక వర్గాలలో ఎన్నికలు 2 స్థాయిలలో జరుగుతాయి)

Cripps Mission (క్రిప్స్ రాయభారం)

  • 2వ ప్రపంచ యుద్ద కాలం లో బ్రిటిష్ ప్రధాని? విన్ స్టన్ చర్చిల్
  • 2వ ప్రపంచ యుద్ద కాలం లో భారతీయుల సహకారం అవసరమై భారతీయులతో చర్యలు జరపడానికి చర్చిల్ ఎవరిని పంపాడు? స్టాఫర్డ్ క్రిప్స్ ను (బ్రిటిష్ మంత్రివర్గ సభ్యుడు)
  • క్రిప్స్ రాయబారం ? 1942
  • క్రిప్స్ ప్రతిపాదనలను “రేపు దివాళా తీయబోతున్న బ్యాంకు పేరుమీద ఎల్లుండి తేదీ తో ఇచ్చిన చెక్కు” గా అభివర్ణించింది? గాంధీజీ

Quit India Movement (క్విట్ ఇండియా ఉద్యమం)

  • క్విట్ ఇండియా తీర్మాణ౦ ఎప్పుడు చేసారు? జూలై లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమావేశం లో
  • క్విట్ ఇండియా తీర్మాణ౦ ఎప్పుడు ఆమోదించారు? 1942, ఆగస్ట్ 8
  • క్విట్ ఇండియా తీర్మాణ౦లో గాంధీ ఇచ్చిన నినాదం? డు ఆర్ డై (సాధించండి లేదా మరణించ౦డి)
  • క్విట్ ఇండియా ఉద్యమం లో ముఖ్య పాత్ర పోషించినవారు? జయప్రకాశ్ నారాయణ, అచ్యుత పట్వర్ధన్, రాం మనోహర్ లోహియా, అరుణా అసఫ్ అలీ

Role of Andhras in the Quit India Movement (క్విట్ ఇండియా పోరాటం లో ఆంధ్రుల పాత్ర)

  • కర్నూలు సర్కులర్ రూపశిల్పి? కళా వెంకట్రావు (క్విట్ ఇండియా తీర్మానం కంటే ముందు ఆంధ్రులు జారి చేసిన సర్కులర్)
  • కర్నూలు సర్కులర్ దేనిని తెలియ జేస్తుంది? ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం గూర్చి (సభలు సమావేశాలు నిర్వహించడం, రైళ్లు ఆపడం, టెలిఫోన్ తీగలు కత్తిరించడం)
  • కర్నూలు సర్క్యులర్ సందర్భం లో బ్రిటిష్ వారు ఏ సంస్థను చట్ట విరుద్దమైనది గా ప్రకటించారు? ఆంద్ర రాష్ట్ర కాంగ్రెస్ సంస్థ ను
  • భారత జాతీయోద్యమం Indian National Movement లో భాగంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఉద్యమం? క్విట్ ఇండియా ఉద్యమం
  • క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు చల్లబడింది? 1944 లో

Subhas Chandra Bose (సుభాష్ చంద్ర బోస్)

  • సుభాష్ చంద్ర బోస్ ఎక్కడ జన్మించాడు? కటక్ లో
  • ఇంగ్లాండ్ ఐ సి ఎస్ పరీక్షలో సుభాష్ చంద్ర బోస్ ఎన్నవ రాంక్ సాదించాడు? 4వ రాంక్
  • సుభాష్ చంద్ర బోస్ స్వతంత్ర పోరాటం లోకి ఎప్పుడు అడుగు పెట్టాడు? 1921 లో (ఐ సి ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి)
  • సుభాష్ చంద్ర బోస్ భారత్ లో ఎవరి వద్ద అనుచరుడు గా ఉన్నాడు? దేశబంధు చిత్తరంజన్ దాస్ వద్ద
  • సుభాష్ చంద్ర బోస్ ను మాండలే జైలులో 3 సంవత్సరాలు ఉంచడానికి కారణం? తీవ్రవాద కార్యక్రమాలతో సంబంధం ఉన్న కారణం చేత
  • జైలునుండి విడుదలైన తరువాత ఏ ప్రాంతానికి కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు? బెంగాల్ రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు
  • సుభాష్ చంద్ర బోస్ కాంగ్రెస్ అధ్యక్షుని గా ఏకగ్రీవం గా ఎప్పుడు ఎన్నిక అయ్యాడు? హరిపురం సమావేశం లో
  • యువ అతివాద నేత గా పేరు పొందినవారు? సుభాష్ చంద్ర బోస్
  • సుభాష్ చంద్ర బోస్ యువ అతివాద నేత గా ఎపుడు పేరు పొందాడు? 1928 కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా
  • జాతీయ ప్రణాళికా కమిటిని సుభాష్ చంద్ర బోస్ ఎప్పుడు ఏర్పాటు చేసాడు? 1938 అక్టోబర్ లో
  • గాంధిజీ నిలబెట్టిన డాక్టర్ పట్టాబి సీతారామయ్యను ఓడించి కాంగ్రెస్ అధ్యక్షునిగా సుభాష్ చంద్ర బోస్ ఏ సమావేశం లో ఎన్నిక అయ్యాడు? త్రిపుర సమావేశం లో
  • సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన దళం? ఫార్వార్డ్ బ్లాక్
  • 2వ ప్రపంచ యుద్ద కాలం లో బ్రిటిష్ ప్రభుత్వం తో రాజీకి రావద్దంటూ రాజీ వ్యతిరేఖ సదస్సును సుభాష్ చంద్రబోస్ ఎక్కడ నిర్వహించాడు? రాం ఘడ్ లో
  • సుభాష్ చంద్ర బోస్ దేనికి సుప్రీం కమాండర్ గా నియమితులయ్యారు? ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) పునర్వ్యవస్తికరించి సుప్రీం కమాండర్ గా
  • సుభాష్ చంద్ర బోస్ దేనిని కేంద్రంగా చేసుకొని స్వతంత్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకటించారు? అండమాన్ నికోబార్ దీవులను కేంద్రంగా చేసుకొని
  • సుభాష్ చంద్ర బోస్ ఇచ్చిన నినాదాలు ? చలో ఢిల్లీ, జైహింద్
  • బర్మా ప్రస్తుత పేరు ? మయన్మార్

Constitutional Reforms (రాజ్యాంగ సంస్కరణలు)

  • బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చట్టాలలో ప్రధానమైనవి? 1909 మింటో మార్లే సంస్కరణలు, 1919 మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, 1935 భారత ప్రభుత్వ చట్ట౦
  • మింటో (లార్డ్), మార్లే (భారత రాజ్య కార్యదర్శి) సంస్కరణలలో ముఖ్య అంశాలు? ముస్లిం లకు ప్రత్యెక నియోజక వర్గాలు, పరోక్ష ఎన్నికల విధానం, కౌన్సిల్ లో భారతీయులకు 2 స్థానాలు కేటాయింపు.
  • లార్డ్ ఎడ్విన్ మాంటేగ్ (భారత రాజ్య కార్యదర్శి), లార్డ్ చేమ్స్ ఫర్డ్ (గవర్నర్ జనరల్) సంస్కరణలలో ముఖ్య అంశాలు? కేంద్ర రాష్ట్ర వేరు వేరు జాబితాలు, ద్వంద్వ పాలన, ప్రత్యెక పబ్లిక్ సర్విస్ కమిషన్ లు, ఆడిటర్ జనరల్ అఫ్ ఇండియా నియామకం
  • బ్రిటిష్ ఇండియా రూపొందించిన చట్టాలలో అత్యంత ముఖ్యమైన చట్టం? 1935 భారత ప్రభుత్వ చట్టం
  • 1935 చట్టం లో ముఖ్య అంశాలు? కేంద్ర రాష్ట్రాలలో ద్వంద్వ పాలనకు స్వస్తి, కేంద్ర జాబితాను రిజర్వేడ్, ట్రాన్స్ఫర్డ్ద్  జాబితాగా విభజించడం, భారత సమాఖ్య ప్రతిపాదన, చట్ట సభలలో హరిజనులకు, ఆంగ్లో ఇండియన్స్ కు, భారత క్రిష్టియన్స్ కు, యురోపియన్స్ కి ప్రత్యేక ప్రాతినిద్యం                

Role of Women in the National Movement ( జాతీయోద్యమం లో స్త్రీల పాత్ర)

  • కాదంబినీ గంగూలి కాంగ్రెస్ కార్యకలాపాలలో ఎప్పుడు పాల్గొన్నారు? 1889 లో
  • జాతీయ విప్లవ భావాలను Indian National Movement విదేశాలలో ప్రచారం చేసిన స్త్రీ? మేడం బకాజీ కామా
  • 1940 వామపక్ష ఉద్యమానికి నేతృత్వం వహించిన స్త్రీ? అరుణ అసఫ్ అలీ
  • ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపకులు? సుభాష్ చంద్ర బోస్
  • ఇండియన్ నేషనల్ ఆర్మీ లోని ఝాన్సీ రాణి రెజిమెంట్ లో దైర్య సాహసాలు ప్రదర్శించిన మహిళా? కెప్టెన్ లక్ష్మి

Towards Independence (స్వాతంత్రం వైపుగా)

  • భారతదేశ చివరి వైశ్రాయ్? లార్డ్ మౌంట్ బాటన్ 1947 మార్చి లో
  • మౌంట్ బాటన్ ప్రణాళిక అనగా? దేశాన్ని ఐఖ్యంగా ఉంచడానికి వీలు లేని పరిస్థితుల్లో దేశ విభజన నిర్ణయానికి మౌంట్ బటన్ వచ్చాడు దీనినే (పాక్ ఏర్పాటుకు ముస్లిం లీగ్ పట్టుబట్టడం వల్ల)
  • భారత్ పాక్ ఏర్పాటుకు సరిహద్దు రేఖకు సంబంధించి నియమించబడిన కమిషన్ ? రాడ్ క్లిఫ్ కమిషన్
  • ఇండియా పాకిస్తాన్ మధ్యన ఉన్న సరిహద్దు రేఖ ? రాడ్ క్లిఫ్ సరిహద్దు రేఖ
  • ఏయే ప్రాంతాలతో పాకిస్తాన్ ఏర్పడింది ? బలూచిస్తాన్, నార్త్ వెస్ట్ ప్రాంటియాక్ ప్రావిన్స్ (వాయవ్య సరిహద్దు రాష్ట్రాలు), సింద్, పంజాబ్, బెంగాల్ తో పాటు ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాలు
  • క్యాబినెట్ మిషన్ భారతదేశం ఎప్పుడు వచ్చింది ? 1946 మార్చి లో
  • క్యాబినెట్ మిషన్ భారతదేశం రావడానికి కారణం? భారతదేశ అధికార బదిలీకి సంబందించిన అంశాలను చర్చించడానికి
  • సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం లో ఎన్ని స్వదేశీ సంస్థానాలు భారత్ యునియన్ లో విలీనం అయ్యాయి? 554 సంస్థానాలు
  • భారత్ స్వతంత్రం ఎప్పుడు పొందింది? 1947 ఆగస్ట్ 15 (ఐఖ్య భారతదేశం 2గా విడిపోయిన సంవత్సరం కూడా ఇదే)
  • మౌంట్ బాటన్ ప్రణాళికను బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? 1947 జూలై లో
  • బ్రిటిష్ వారు చివరిగా ఏర్పాటు చేసిన చట్టం? మౌంట్ బాటన్ ప్రణాళిక
  • ఇండిపెండెన్స్ అఫ్ ఇండియా యాక్ట్ 1947 గా నిలిచిన చట్టం ? మౌంట్ బాటన్ ప్రణాళికా చట్టం
  • యావత్ ప్రపంచం నిద్రించే అర్దరాత్రి వేళ భారతదేశం నూతన స్వతంత్ర దిశగా మేల్కొంటుంది అని ప్రకటించిన వారు ? నవహర్ లాల్ నెహ్రు (1947 ఆగస్ట్ 14 అర్ధరాత్రి ప్రసంగం లో )

Constitution of India (భారత రాజ్యాంగం)

  • స్వతంత్ర భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించే భాద్యతను తీసుకొన్నది? రాజ్యాంగ పరిషత్ (కేబినేట్ మిషన్ ప్రణాళికలో భాగంగా ఏర్పడింది)
  • రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
  • రాజ్యాంగ ముసాయిదా కమిటి అధ్యక్ష్దుడు? డాక్టర్ బి ఆర్ అంబేద్కర్
  • రాజ్యాంగ ముసాయిదా ను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? 26 నవంబర్ 1949
  • భారతదేశం ఎప్పుడు సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం అయినది ? 1950 లో
  • గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు? జనవరి 26
  • భారతదేశ స్వతంత్ర పోరాటం Indian National Movement ఏ ఉద్యమం తో ప్రారంభం అయినది? వందేమాతర ఉద్యమం తో
  • కాల పట్టిక Indian National Movement కాలం లో
సంవత్సరంప్రధాన అంశం
1915దక్షిణాఫ్రికా నుండి మహాత్మా గాంధీ రాక
1917చంపారణ్ ఉద్యమం
1918అహ్మదాబాద్ మిల్లు కార్మికుల పోరాటం, ఖేడా సత్యాగ్రహం
1919రౌలత్ సత్యాగ్రహం, జలియన్ వాలాబాగ్ మారణహోమం
1920ఖిలాఫత్, సహాయ నిరాకరణ ఉద్యమాలు
1927సైమన్ కమిషన్ ఏర్పాటు
1928బార్డోలీ రైతుల ఉద్యమం
1929లాహోర్ కాంగ్రెస్ తన లక్ష్యం పూర్ణ స్వరాజ్ అని ప్రకటించింది
1930శాసనోల్లంఘన ఉద్యమం
1931గాంధి ఇర్విన్ ఒప్పందం
1935భారత ప్రభుత్వ చట్టం
1939కాంగ్రెస్ మంత్రి వర్గ రాజీ నామాలు
1942క్విట్ ఇండియా ఉద్యమం
1946మత ఘర్షణలు జరిగిన నవఖోలి ప్రదేశాలను గాంధీజీ సందర్శించాడు

Questions (ప్రశ్నలు)

  • తెనాలి బాంబు సంఘటన తో సంభంధం గల ఉద్యమం? వందేమాతర ఉద్యమం
  • జలియన్ వాలాబాగ్ మారణహోమం ఎక్కడ జరిగింది? అమృత సర్
  • గాంధీ ఇర్విన్ ఒప్పందానికి అనుబంధంగా గల ఉద్యమం? శాసనోల్లంఘన ఉద్యమం
  • క్విట్ ఇండియా ఉద్యమాన్ని గాంధీజీ ఎప్పుడు ప్రారంబించాడు? 1942 లో
  • 1939 లో ఫార్వార్డ్ బ్లాక్ ను స్థాపించిన వారు? సుభాష్ చంద్ర బోస్
  • రంప అనే గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించినవారు? అల్లూరి సీతారామ రాజు
  • జైహింద్ అనే నినాదం ఇచ్చినవారు? సుభాష్ చంద్ర బోస్
  • భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు? ఆగస్ట్ 15, 1947
  • సత్య శోధక సమజాన్ని స్థాపించిన వారు? జ్యోతిబాయి పూలే
  • వందేమాతర గేయ రచయిత? బంకిం చంద్ర చటర్జీ
  • భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన సంవత్సరం? 1885
  • హోం రూల్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంబించారు? అనిబిసెంట్, తిలక్
  • పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? అంబేద్కర్ మరియు గాంధీజీ మధ్య (1932)
  • కర్నూల్ సర్క్యులర్ రూపశిల్పి ? కళా వెంకట్రావు
  • వేదాలకు తరలి వెళ్ళండి అనే నినాదం ఇచ్చినవారు? దయానంద సరస్వతి
  • భారత అశాంతి పితగా ఎవరిని పరిగనిస్తారు? బాల గంగాధర్ తిలక్
  • భారతదేశ తొలి పత్రిక ? బెంగాల్ గెజిట్
  • భారతీయ పత్రికలపై మొదటిసారి ఆంక్షలు విదిచిన బ్రిటిష్ గవర్నర్ ఎవరు? లార్డ్ వేల్లస్లి
  • భారతదేశ కురు వృద్ధుడు అని ఎవరిని పిలుస్తారు? దాదాబాయి నౌరోజీ
  • భారతజాతీయ కాంగ్రెస్ స్థాపకుడు? ఏ వో హ్యూమ్ (Indian National Movement కాలం లో)
  • భారత జాతియోద్యమాన్ని Indian National Movement ఉర్రూతలూగించిన భగత్ సింగ్ నినాదం ఏమిటి? ఇంక్విలాబ్ జిందాబాద్
  • ఇంటువంటి టెక్స్ట్ బుక్ కంటెంట్ బిల్స్ కోసం చూస్తూనే ఉండండి kingsdsc.in

Dokur – A Village on the Plateau
6.4 Dokur – A Village on the Plateau (డోకూర్ – పీఠభూమిలో ఒక గ్రామం)

Leave a Comment