6.6 Early Civilisations – Amazing Facts You Must Know

6.6 తొలి నాగరికతలు

  1. Early Civilisations సింధు నాగరికత కాలం? 2500-1700 బిసి
  2. నాగరికత అనగా? మానవ సమాజం పురోగమించిన దశ
  3. సింధు నాగరికత వెలసిన ప్రాంతం? సింధు ఘగ్గర్ హక్రా నదీ ప్రాంతం

Indus Valley Civilisation (సింధులోయ నాగరికత)

  • Early Civilisations సింధు నాగరికత ఎప్పుడు బయట పడింది? 1920 త్రవ్వకాలలో
  • సింధు నాగరికత లో భాగాలు? హరప్పా మొహంజో దారో
  • 4 వైపులా గదులు ఉన్న స్నాన వాటిక ఎక్కడ భయట పడింది ? మొహంజో దారో లో
  • సింధు నాగరికత పతనానికి కారణం? ఆర్యుల దండయాత్ర
  • సింధు నాగరికత పతనానికి కారణ ఆర్యుల దండయాత్ర అనే అంశాన్ని వ్యతిరేఖించిన శాస్త్రవేత్త? మార్టిమర్ వీలర్

Aryans (Vedic) Civilisation (ఆర్యకాల నాగరికత)

  • ఆర్యుల నాగరికతా కాలం? క్రి పూ 1500-500 బిసి
  • స్వతంత్ర నగర రాజ్యాలు / తొలి సామ్రాజ్యాలు ఏ నాగరికత లో ఏర్పడ్డాయి? మెసపు టోమియా నాగరికత లో

Mesopotamia Civilisation (మెసపుటోమియ నాగరికత)

  1. Early Civilisations మెసపు టోమియా ప్రజల లిపి? క్యూనిఫారం
  2. మెసపు టోమియా ప్రజలు ఎక్కువగా ఏ లోహాన్ని ఉపయోగించారు? కాంస్యం
  3. మెసపు టోమియా ప్రజలు ఏ వస్తువులను ఉపయోగించారు? చక్రం, తెరచాప, నాగలి

Egypt Civilisation (ఈజిప్ట్ నాగరికత)

  1. ఈజిప్ట్ రాజులను ఎలా పిలిచారు? ఫరోలు
  2. ఈజిప్ట్ రాజుల సమాధులను ఏ పేరుతో పిలిచారు? పిరమిడ్ లు
  3. Early Civilisations ఈజిప్ట్ నాగరికత ప్రజల లిపి? హీరియోగ్లిఫిక్ లిపి
  4. ఈజిప్ట్ నాగరికత లో ప్రజలకు తెలిసిన శాస్త్రాలు? గణిత శాస్త్రం, రేఖా గణిత శాస్త్రం, వైద్య శాస్త్రం

China Civilisation (చైనా నాగరికత)

  1. ఈజిప్ట్ వరప్రసాదం? నైలు నది (సహజ వాణిజ్య రహదారిగా ఉపయోగ పడుతుంది
  2. సామాజిక వర్గాల విభజన ఎక్కువగా గల దేశం? చైనా
  3. దైవ లోక సామ్రాజ్యాలు గా ఏదేశం పిలువబడుతుంది? చైనా

Indus Valley Civilisation (సింధు లోయ నాగరికత)

City Planning (పట్టణ ప్రణాళిక)

  • హరప్పా లో ఎన్ని ధాన్యాగారాలు బయట పడ్డాయి? 6 పెద్ద ధాన్యాగారాలు
  • హరప్పా ప్రజల రేవు పట్టణం? లోథాల్
  • హరప్పా ప్రజలు ఏ దేశాలతో వ్యాపార౦ చేసేవారు? మెసపు టోమియా, ఈజిప్ట్, ఇరాన్ దేశాలతో
  • యజ్ఞావాటికలు బయలు పడిన ప్రాంతం? కాలిబంగాన్
  • హరప్పా ప్రజలు సాధారణం గా ఉపయోగించిన గుర్తు? స్వస్తిక్
  • హరప్పా ప్రజలు ఎన్ని అంతస్తులు వరకు ఇళ్ళను నిర్మించేవారు? 2 అంతస్తుల వరకు
  • మొదటి సారి పత్తిని పండించిన వారు? హరప్పా ప్రజలు

Houses (గృహాలు )

  • హరప్పా ప్రజల వృత్తులు? వ్యవసాయం, పత్తి నూలు వస్త్రాలు నేయడం, కాల్చిన ఇటుకల తయారి
  • మొదటి సారి తూనికలు కొలతలు ఉపయోగించిన వారు? హరప్పా ప్రజలు (పర్షియా, మధ్య ఆసియావాసులూ కూడా వీరి కొలతలను ఉపయోగించారు)

Economic Life (ఆర్ధిక జీవనం)

  • హరప్పా ప్రజల పంటలు? గోధుమ, బార్లి, ఆముదాలు, బటాని, కాయ ధాన్యాలు
  • హరప్పా ప్రజల వినోదాలు? నాట్యం, చదరంగం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడడం, ఎద్దుల పోటీ
  • హరప్పా ప్రజల ప్రధాన వినోదం? ఎద్దుల పోటీ
  • హరప్పా ప్రజల దేవుళ్ళు? పశుపతి (శివుడు), అమ్మతల్లి, ప్రకృతి శక్తులు
  • హరప్పా ప్రజలు ఏయే వస్తువులను ఉపయోగించేవారు? కాంస్యం తో చేసిన గొడ్డలి, బంగారు వెండి ఆభరణాలు, కాంస్యం తో చేసిన బల్లెము, మట్టి పాత్రలు, మట్టి ముద్రలు, రాగి పాత్రలు
  • హరప్పా ప్రజల లిపి? బొమ్మల లిపి

Vedic Period (వేదకాలం)

  • ఆర్యుల నాగరికత కాలం ? క్రీ.పూ 1500-500
  • ఆర్యుల నాగరికత విస్తరించిన మైదాన ప్రాంతం? సింధు, సరస్వతి మైదాన ప్రాంతం
  • దార్ ఎడారిలో ఇంకిపోయిన నది? సరస్వతి

Vedic Literature (వేదసాహిత్యం)

  • ఋగ్వేదం లో పలుసార్లు ప్రస్తావించిన నది? సరస్వతి
  • వేదకాలం అనగా? వేద సాహిత్యం ఆవిర్భవించిన కాలం
  • వేదం అనగా? ఉన్నతమైన జ్ఞానం / ఆత్మ జ్ఞానం
  • వేద సాహిత్యానికి మరొక పేరు? శ్రుతులు
  • యోగాకు ఆధారం? వేదాలు
  • వేదకాలానికి మరలి వెళ్ళాలి అని పిలుపు ఇచ్చింది ? స్వామీ దయానంద సరస్వతి
  • వేదాలు ఎన్ని ? 4 (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేద౦, అధర్వణ వేదం)
  • ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం? ఋగ్వేదం
  • యజుర్వేదం వేటిని తెలిపుతుంది? యజ్ఞాలు పాటించవలసిన నియామాలును గూర్చి
  • పాటల రూపం లో ఉన్న ప్రార్ధనల సంకలనం? సామవేదం
  • భారత సంగీత మూలాలు ఏ వేదం లో గలవు? సామవేదం లో
  • శ్లోకాలు పాటల సంకలనం_____? అధర్వణ వేదం
  • వేదాలపై విపులంగా చేసిన వ్యాక్యానాలు? బ్రాహ్మణకాలు
  • బ్రాహ్మణకాలు వేటిని వివరిస్తాయి? శ్లోకాలు, క్రతువులు, తత్వాల గూర్చి గద్య రూపం లో వివరిస్తాయి
  • విద్య వాదము, క్రతువులు, సంస్కారాలను గూర్చి తెలియజేసేవి? అరణ్యకాలు
  • ఆత్మా ప్రకృతి రహస్యాల గూర్చి తెలిపే గ్రంధాలు? ఉపనిషత్తులు
  • హిందూ మత పవిత్ర గ్రంధాలు? ఉపనిషత్తులు
  • ఇతిహాసాలు గా వేటిని పేర్కొంటారు? రామాయణము, మహా భారతము
  • ఆది కావ్యం అని దేనిని పేర్కొంటారు? రామాయణము
  • రామాయణ రచయిత? వాల్మికి (సంస్కృతం లో )
  • మహా భారతాన్ని ఎవరు రచించారు? వ్యాసుడు (సంస్కృతం లో)
  • మహా భారతాన్ని ఏవిధంగా పేర్కొనవచ్చు? అధర్మం పై ధర్మం సాధించిన విజయమే మహాభారతం

Early Vedic Period (తొలివేదకాలం)

  • ఆర్యుల తొలివేద కాలం? క్రి. పూ 1500-1000
  • సమాజానికి ప్రాధమిక అంగం____? కుటుంభం (తండ్రి కుటుంభ పెద్ద)
  • వేదకాలం లో ఎవరిని బానిసలుగా చూసేవారు? యుద్ద ఖైదీలను, దాసులను
  • వేద కాలం లో యుద్ద ఖైదీలను ఏ పేరుతో పిలిచేవారు? దాసులు
  • వేదకాలం లో పేర్కొదగ్గ ఆచారాలు? స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు. పురుషులు ఒకే భార్య కలిగి ఉండేవారు. వితంతువులు తిరిగి వివాహం చేసుకొనేవారు. సాంఘిక దురాచారాలు అమలులో లేవు
  • వేదకాలం లో వేదపండితులైన స్త్రీల పేర్లు ? ఘోష, ఆపాలా, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర
  • వేదకాల ప్రజల వేషదారణ? వాస (ధోవతి), ఆదివాస (శరీర పైభాగం కప్పుకోనేది) దుస్తులు బంగారు దారం తో కుట్టుకోనేవారు, నూనె రాసుకొని జడలు అల్లుకోనేవారు
  • తోలివేదకాల ప్రజల వినోదాలు? రథపు పందాలు, వేట, మల్ల యుద్దాలు, నాట్యం & సంగీతం
  • వేదకాలం లో 3 రకాల సంగీత వాయిద్యాలు ? ధ్వని, తంత్రి, వాయు
  • తోలివేద కాల విద్యాలయాలలో వేటిని నేర్పేవారు? యుద్ద తంత్రాలు వేదాంతం, వ్యవసాయం, పశు పెంపకం, హస్తకళలు
  • వేదకాల ప్రజల ఆహారం? బియ్యం, బార్లి, బీన్స్, నువ్వులు
  • తోలివేద కాలం లో ప్రజల నమ్మకం? ప్రతి వ్యక్తీ దేవుని అంశ తో జన్మించారు. ప్రపంచం అంతా ఒకే చైతన్యం (ఆత్మ) ఆవరించి ఉంటుంది (కులాంతర వివాహాలపై ఎటువంటి వివక్ష లేదు)
  • ఆర్య తెగ నాయకుడు? రాజన్
  • రాజుకు పాలనలో సహాయ పడేవి? సభ, సమితి

Later Vedic Period (మలివేదకాలం )

  • మలివేద కాలం? 1000-600 క్రి పూ
  • మలివేద కాల లక్షణాలు? ప్రజలు వింధ్య పర్వతాలు దాటి దక్షిణ పదం వైపు వెళ్ళిరి, సభ సమితులు ప్రాధాన్యం కోల్పోయాయి. రాజరికం వారసత్వం అయినది. ఆశ్రమ వ్యవస్థ ప్రారంభం. రాజ్య విస్తరణకు యాగాలు చేసిరి. వర్ణ వ్యవస్థ ప్రారంభం అయినది. బాల్య వివాహాలు సతీ సహగమనం ప్రారంభం అయినది. బహు భార్యత్వం ప్రారంభం అయినది. స్త్రీల స్థానం దిగజారింది
  • మలివేద కాల రాజులు రాజ్య విస్తరణకు ఏయే యాగాలు చేసిరి? అశ్వమేధ, రాజసూయ యాగాలు
  • ఆశ్రమ వ్యవస్థ రకాలు ? బ్రహ్మ చర్యం, గృహస్తాశ్రమం, వానప్రస్థం, సన్యాసం
  • మలివేద కాల ప్రజలు ఎవరిని పూజించిరి? విష్ణువు, శివుడు, స్కందుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి
  • మలివేద కాలంలో ప్రారంభం అయిన అంశాలు? ఆశ్రమ వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, బాల్య వివాహాలు, సతీ సహగమనం, బహు భార్యత్వం
  • ఇటువంటి టెక్స్ట్ బుక్ బెస్ట్ కంటెంట్ బిట్స్ కోసం చూస్తూనే ఉండండి kingsdsc.in

Early Life to Settled Life
6.5 Best Explanation: Early Life to Settled Life

Leave a Comment