Ancient Civilizations and Cultures (ప్రాచీన నాగరికత సంస్కృతులు)

Table of Contents

Ancient Civilizations and Cultures (ప్రాచీన నాగరికత సంస్కృతులు)

Ancient Civilizations and Cultures
  • ప్రాచీన భరతదేశ చరిత్ర కాలం? క్రీస్తు పూర్వం 4 లక్షల సంవత్సరాల నుండి 2 లక్షల సంవత్సరాలు
  • ప్రాచీన మానవులను ఎన్ని విధాలుగా విభజించారు? 2 (ప్రాచీన శిలా యుగ మానవులు, నవీన శిలాయుగ మానవులు)
  • ప్రాచీన శిలా యుగ మానవులు నివాసాలు ? కొండలు, గుట్టలు
  • ప్రాచీన శిలా యుగ మానవులు పనిముట్లుగా వేటిని ఉపయోగించారు? రాతి పనిముట్లు (వేటకు స్వీయ రక్షణకు)
  • ప్రాచీన మానవుల రాతి పనిముట్లు లభించిన ప్రాంతాలు? రాజస్థాన్, గుజరాత్, బీహార్, ద భారత్
  • నవీన శిలాయుగ మానవుల పనిముట్లు ఎక్కడ లభించాయి? భారతదేశం అంతటా
  • నవీన శిలాయుగ మానవుల వృత్తులు? వ్యవసాయం, పశుపోషణ, కుండలు తయారి
  • నిప్పును ఏ యుగం లో ఉపయోగించారు?  నవీన శిలాయుగం లో
  • నవీన శిలాయుగ మానవుల నివాసాలు? గుహలు (గుహలలో నివాసం చేస్తూ వాటిపై చిత్రాలను గీసిరి)
  • నవీన శిలాయుగ మానవులు ఉపయోగించిన కుండలుపై ఏవేవి కనిపించేవి? చెట్లు, బొమ్మలు, వృత్తాలు
  • వృషభాలు చిత్రించబడిన కుండలు బయటపడిన ప్రాంతాలు? కుల్లి, రానాఘండై
  • కుల్లి సంస్కృతీ లో రేఖలతో అలంకరించబడిన రాతి పెట్టెలు ఎక్కడ బయట పడ్డాయి? మెసపు టోమియా లో (కుల్లి నుండి మెసపు టోమియా కు జలమార్గం ద్వారా వ్యాపార సంభంధాలు ఉండేవి?
  • నవీన శీలా యుగ మానవుల నివాసాలు కనుగొన్న ప్రాంతాలు? బెలూచిస్తాన్ (చిన్న చిన్న నదులతో ఉండేది), దిగువ సింధు
  • నవీన శీలా యుగ మానవుల నివాసాలు ఎలా ఉండేవి? దిగువున రాతి కట్టు, ఎగువున మట్టి గోడలు తో
  • నవీన శీలా యుగ మానవులు ఏ ప్రాంతంలో వ్యవసాయం చేసేవారు? బెలూచిస్తాన్ ఎగువ ప్రాంతం, సింధు దిగువ ప్రాంతం, మక్రాన్ తీర ప్రాంతం లో
  • ఏ ప్రాంతం లో మృత దేవతలతో పాటు వృషభాలను ఆరాదించిరి? జొబ్ సంస్కృతీ లో
  • మక్రాన్ తీర ప్రాంతం లో చనిపోయిన వారిని ఎక్కడ దహనం చేసేవారు? ద. తీరం లో
  • నాల్ సంస్కృతీ లో మృతదేహాలు ఎక్కడ పాతిపెట్టిరి? ఉ. తీరం లో (మృత దేవతలను ఆరాధించిరి)

హరప్పా నాగరికత

harappan civilization
  • హరప్పా ఎక్కడ ఉంది? ప. పంజాబ్ లో (పాక్)
  • హరప్పా నాగరికత కు సంబంధించి మొదటి త్రవ్వకాలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి? 1921 లో
  • హరప్పా నాగరికత కు సింధు లోయ నాగరికత అని పేరు ఎలా వచ్చింది? మొదట ఆనవాళ్ళు సింధు పరిసర ప్రాంతాలలో కనుగొనడం వల్ల ఆ పేరు వచ్చింది
  • సింధు నాగరికత Indus Valley Civilisation కాలం? 1921 లో
  • హరప్పా నాగరికత పేరు ఎలా వచ్చింది? తొలిసారి వెలుగులోకి వచ్చిన స్థావరం హరప్పా కావడం వల్ల
  • సమకాలీన నాగరికతలు గా వేటిని పేర్కొంటారు? మెసపు టోమియా, ఈజిప్ట్
  • హరప్పా నాగరికత ఏయే ప్రాంతాలలో విస్తరించింది? ఉ. రూపార్ (పంజాబ్) నుండి ద. భగట్రావ్ (గుజరాత్) వరకు, ప. సుట్కాజిందూర్ (పాక్ ఇరాన్ సరిహద్దు ప్రాంతం) నుండి ఆలంగిర్ పూర్ (ఉ. ప్రదేశ్) వరకు
  • ఇటీవల కాలం లో హరప్పా నాగరికత ఏయే ప్రాంతాల మధ్య విస్తరించింది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఉ. మండ (జమ్ముకాశ్మీర్) నుండి ద.దైమాబాద్ (మహారాష్ట్ర)వరకు
  • హరప్పా నాగరికత విస్తీర్ణం ఎంత? 12 లక్షల 99 వేల 6౦౦ చ కి మీ (పాక్ దేశానికంటే విశాలమైనది, ఈజిప్ట్ మెసపుటోమియా కన్నా విశాలమైనది)

ప్రధాన నగరాలు

  • హరప్పా నాగరికత ప్రధాన నగరాలు ఏవి?
  • హరప్పా (పాక్ లోని పంజాబ్ ప్రాంతం),
  • సింధు నదీ తీరం లో మొహంజో దారో, చన్హుదారో కోట్ డిజ్జి,
  • కాలి బంగాన్ (ఉత్తర రాజస్థాన్)
  • రూపార్ (సట్లైజ్ తీరం పంజాబ్)
  • బనవాలి (హిస్సార్ జిల్లా హర్యానా)
  • హర్యానాలో రాకీగర్, మీటాతార్,
  • గుజరాత్ లో దొల్ వీరా, సూర్కొటాడ, లోథాల్,
  • మహారాష్ట్ర లో దైమాబాద్,
  • పాక్ ఇరాన్ సరిహద్దులో సుట్కా జెండూర్ (మక్లాన్ తీరం లో ఉంది)
  • పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో అలంఘీర్ పూర్
  • హరప్పా ఏ నదీ తీరాన వెలసింది? రావి నది తీరం
  • హరప్పాను కనుగొన్నది? దయారాం సరస్వతి (1921 లో)
  • సింధు హరప్పా నగరాల మధ్య దూరం? 483 కిమీ
  • మొహంజొదారో అనగా? మృతుల దిబ్బ అని అర్ధం
  • మొహంజో దారోను ఎవరు కనుగొన్నారు? ఆర్ డి బెనర్జీ (1922)
  • చన్హుదారో & మొహంజో దారో మధ్య దూరం ఎంత? 130 కిమీ
  • చన్హుదారో ను కనుగొన్నది? యం జి మజూందార్ (19౩5)
  • కోట్ డిజ్జి ని కనుగొన్నవారు? చూవె (1935)
  • కాలిబంగన్ అనగా? నల్లగాజులు
  • కాలిబంగాన్ ఎక్కడ గలదు? ఉ. రాజస్థాన్ లోని గగ్గర్ నది తీరం
  • కాలిబంగాన్ ను కనుగొన్నవారు? ఏ ఘోష్ (1953)
  • రూపార్ ఎక్కడ గలదు? సట్లైజ్ తీరం లో (పంజాబ్ ప్రాంతం)
  • రూపార్ ను కనుగొన్నవారు? వైడి శర్మ (1953)
  • సరస్వతి తీరం లో వెలసిన సింధు నాగరికత నగరం? బనవాలి
  • బనవాలి ని ఎవరు కనుగొన్నారు? ఆర్ ఏ బిస్ట్ (1973) లో
  • బనవాలి పట్టణం ఏ జిల్లా లో ఉంది? హిస్సార్ జిల్లా (హర్యానా)
  • సూర్ కోటాడా ఏ తీరం లో గలదు?  రాన్ అఫ్ కచ్ తీరం లో
  • సూర్ కోటాడా ను ఎవరు కనుగొన్నారు? జగపతి జోషి (1964)
  • లోథాల్ ఏ నదీ తీరం లో గలదు? బోగవా తీరం లో
  • లోథాల్ ని కనుగొన్నవారు? ఎస్ ఆర్ రావు (1954)
  • హరప్పా నాగరికతా దశలు ఎన్ని? 3 (తొలి హరప్పా దశ, హరప్పా ఉజ్వల దశ, తుది హరప్పా దశ)

హరప్పా నాగరికత దశలు

  • తొలి హరప్పా దశలో (క్రీ పూ 4000-2600) నిర్మాణాలకు వేటిని ఉపయోగించారు? మట్టి ని
  • తొలి హరప్పా దశలో గల వృత్తులు? వ్యాపారం, కళ, చేతివృత్తులు సాగాయి
  • హరప్పా ఉజ్వల దశ కాలం ? క్రి పూ 26౦౦-19౦౦
  • హరప్పా ఉజ్వల దశ లో నిర్మాణాలు వేటితో చేసేవారు? కాల్చిన ఇటుకలతో (ఈ దశలోనే విదేశీ వాణిజ్యం చేతివృత్తులు అమలులో ఉండేవి)
  • తుది హరప్పా దశ కాలం ? క్రి పూ 19౦౦-175౦ (నాగరికత అంతం కావడం ప్రారంభం వ్యాపారం అంతరించింది)

లిపి

  • హరప్పా ప్రజల లిపిని తొలిసారి గుర్తించిన సంవత్సరం? 185౩ క్రి శ
  • హరప్పా ప్రజల పూర్తీ లిపిని కనుగొన్న సంవత్సరం? 192౩లో
  • చరిత్ర కారులు గుర్తించిన సింధు నాగరికత అక్షరాలూ ఎన్ని? 375-400 (సంఖ్యలు కాదు చిత్రాలు సాంకేతిక గుర్తులు)
  • సింధు ప్రజల లిపి ఏ విధంగా రాయబడినది? కుడి నుండి ఎడమకు, ఎడమనుండి కుడికి (ముద్రికలలో) రాయబడినది
  • సింధు ప్రజలు తమ ముద్రికలను దేని కొరకు ఉపయోగించిరి ? వ్యాపారం కొరకు
  • హరప్పా ప్రజల భాష సంస్కృతం అని పెర్కొన్నవారు? ఆచార్య మధు సూధన మిశ్రా
  • హరప్పా ప్రజల భాష ప్రోటో ద్రావిడ భాష అని పెర్కొన్నవారు ? ఆచార్య మహదేవన్

నగర నిర్మాణం

Urban Planning
  • సింధు పట్టణాలు /నగరాలు అభివృద్ధి పొందడానికి కారణం? మిగులు వ్యవసాయ ఉత్పత్తులు
  • దేశం లో తొలి పట్టణ నాగరికత? హరప్పా నాగరికత
  • సింధు ప్రజలు ప్రత్యేక నివాసాలు ఏర్పాటు చేయని ప్రాంతం? పశ్చిమ కూడలి
  • సింధు ప్రజలు కోట ద్వారాలు ఏ దిక్కులో ఉండేవి? పశ్చిమ దిక్కులో
  • సింధు ప్రజలకు కోటలు ఏ విధంగా ఉపయోగ పడేవి? విపత్కర సమయాలలో రక్షణ గా మిగిలిన సమయాలలో సామాజిక కేంద్రాలుగా
  • హరప్పా కోట కొలతలు? కొలతలు 14౦౦ అడుగులు * 6౦౦ అడుగులు, ఎత్తు 40 అడుగులు
  • సింధు ప్రజలు పునాదులకు ఉపయోగించిన ఇటుకలు వెడల్పు ఎంత? 45 అడుగులు
  • హరప్పా కోటలో ఎన్ని ధాన్యాగారాలు బయట పడ్డాయి? 6
  • నగర నిర్మానాలు ఏ విధంగా సాగేవి? గ్రిడ్ పద్దతి లో (2 అంతస్తులు)
  • సింధు నాగరికత లో ప్రధాన వీధులు ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు ఉండేవి? ఉత్తరం నుండి దక్షిణానికి (ఉపవీదులు తూర్పు నుండి పడమరకు ఉండేవి)
  • సింధు ప్రజలు స్నాన గదులకు, బావికి ఏ ఆకారపు ఇటుకలు వాడేవారు? L ఆకార ఇటుకలు
  • మొహంజొదారో నిర్మాణాలలో ప్రధానమైనది? మహాస్నాన వాటిక
  • మహాస్నాన వాటిక పొడవు వెడల్పులు? 11.88*7.౦ మీటర్లు (లోతు 2.4 మీటర్లు)
  • మహాస్నాన వాటిక అడుగు భాగం వేటితో నిర్మించారు? కాల్చిన ఇటుకలతో
  • ధాన్యాగారం పొడవు వెడల్పులు ? 45.71 * 15.2౩మీటర్లు
  • హరప్పా సమాజం లో పాలకులు ? లేరు (అందరు సమాన హోదా అనుభవించారు)

సాంఘిక ఆర్ధిక పరిస్థితులు

  • సింధు ప్రజల కంకాశాల శాస్త్రీయ పరిశోధన ప్రకారం ఎన్ని జాతులు ఉండేవి? 4 రకాల జాతులు (ప్రోటో-ఆస్ట్రలాయిడ్, మెడిటరేనియన్, మంగోలాయిడ్స్, ఆల్పైన్
  • ఆచార్య భాష్యం ప్రకారం తోలిజాతి ఏది? ప్రోటో-ఆస్ట్రలాయిడ్
  • నాగరికత లక్షణాలు ఏ జాతి లో ప్రారంభం అయ్యాయి? మెడిటరేనియన్
  • ద్రవిడ జాతి ఎలా ఆవిర్భవించింది? మెడిటరేనియన్ జాతి స్థానిక జాతులతో కలవడం వల్ల (సింధు లక్షణాలు ద్రవిడుల లక్షణాలు పోలి ఉండడం వల్ల ద్రావిడులు గా పెర్కొనబడుచున్నారు)
  • ద్రవిడ భాష కు మరొక పేరు? బ్రాహుయ్

సింధు ప్రజల వృత్తులు

Occupations of the Harappan People
  • సింధు ప్రజల వృత్తి ? వ్యవసాయం (నవంబర్ లో విత్తనాలు నాటి ఏప్రిల్ లో పంట కోసేవారు)
  • సింధు ప్రజల ప్రధాన పంటలు? గోధుమ, బార్లి
  • సింధు ప్రజలు నాగలిని ఏ ప్రాంతం లో ఉపయోగించిరి? కాలిబంగన్ లో (కొయ్య నాగళ్ళు, రాతి కొడవళ్ళు ఉపయోగించి నట్టు తెలుస్తుంది
  • సింధు ప్రజలు ఏ ప్రాంతం లో వరిని ఉపయోగించారు? లోథాల్ రంగాపూర్ లలో ఉపయోగించిరి
  • సింధు ప్రజలు వరిని ఉపయోగించారు అని ఎలా తెలుస్తుంది? పొట్టుతో కూడిన బియ్యం కుండలలో లభించడం బట్టి తెలుస్తుంది
  • రైతుల నుండి శిస్తు గా వసూలు చేసిన బియ్యాన్ని ఎప్పుడు ఉపయోగించే వారు? అత్యవసర సమయాలలో (వేతనాలు చెల్లించడానికి కూడా)
  • సింధు ప్రజలు ఆహరం? చేపలు, మాంసం
  • పత్తిని తొలుత పండించిన వారు? హరప్పా ప్రజలు
  • సింధు ప్రజలు ఉపయోగించిన లోహాలు? రాగి, బంగారం, వెండి
  • ఖేత్రి గనులు ఎక్కడ గలవు? రాజస్థాన్ (రాగి గనులు)
  • కోలార్ బంగారు గని ఎక్కడ గలదు? కర్ణాటక
  • హరప్పా కాలం లో వెండి ఎక్కడ లభించేది? ఆఫ్ఘనిస్తాన్
  • హరప్పా ప్రజలు లావా దేవీలకు ఉపయోగించిన పద్దతి? వస్తు మార్పిడి పద్దతి
  • హరప్పా ప్రజల నౌకాయానం ఏ సముద్రం లో జరిగేది? అరేబియా సముద్రం లో (వీరికి చక్రం ఉపయోగించడం తెలుసు)
  • ఏయే దేశాలతో హరప్పా ప్రజలకు వ్యాపార సంబంధాలు ఉండేవి? ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మెసపు టోమియా మధ్య పశ్చిమ ఆసియా లతో
  • మెసపుటోమియా లో హరప్పా ప్రజల ముద్రికలు ఎక్కడ బయట పడ్డాయి? టైగ్రిస్, యుఫ్రటేస్ ప్రాంతాలలో
  • మెసపుటోమియా గ్రంధాలు పేర్కొన్న వ్యాపార కేంద్రాలు ఏవి? దిల్ మాన్, మకాన్ (మెసపుటోమియా మేలూహా మధ్య గలవు)
  • మధ్య, పశ్చిమ ఆసియాల్లో నౌకా వాణిజ్యానికి పునాది వేసిన వారు? హరప్పా ప్రజలే
  • హరప్పా ప్రజలు వారి తూకాలలో వేటి గుణకాలు వాడినట్టు అధరాలు ఉన్నాయి? 16 దాని గుణకాలు (ఉదా 16,64,160,320,640)
  • హరప్పా ప్రజలు ముద్రికలు ఎన్ని లభించాయి? సుమారు 2 వేలు
  • హరప్పా ప్రజలు ప్రధాన ముద్రిక ? పశుపతి (పురుష దేవత)

పశుపతి ముద్రిక

  • పశుపతి ముద్రిక ఏవిధంగా ఉండేది
    • కొమ్ములుండి శిరో వేష్టనం ధరించిన ముద్రిక
    • 3 తలలు కలిగి యొక ముద్రలో ఉన్నట్టు ఉంటుంది
    • చుట్టూ 4 రకాల జంతువులూ ఉంటాయి (పులి, ఏనుగు, ఖడ్గ మృగం, గేదె)
  • హరప్పా కళాత్మక రూపాలలో ప్రధానమైనది? గడ్డం ఉన్నరాతి బొమ్మ (వస్త్రాలంకరణ చేయబడినట్లు ఉంది)

సింధు ప్రజల బొమ్మలు

  • గడ్డం ఉన్నరాతి బొమ్మను చరిత్ర కారులు ఏవిధంగా భావించారు? పూజారి బొమ్మ అని బావించారు
  • నాట్య భంగిమ లో ఉన్న బొమ్మ దేనితో తయారు చేయబడినది? కంచుతో తయారు చేయబడినది (నడుము పై కుడి చేయి ఉంచుకొని ఎడమ చేయి నాట్య బంగిమలో ఉన్నట్లు చెక్కబడింది
  • నాట్య భంగిమ లో ఉన్న బొమ్మ యొక్క విశేషం ఏమి? చేతికి అధికంగా గాజులు ఉన్నట్లు మలచబడడం
  • అమ్మతల్లి ఆరాధనకు నిదర్శనగా చెప్పబడేది? టెర్రా కోటా
  • ప్రధాన చేతి పనిగా ప్రసిద్ది చెందిన పని? పూసలు తయారీ

సింధు ప్రజల జంతువులు

  • సింధు ప్రజల పెంపుడు జంతువులు ? గేదెలు, గొర్రె మేక, పంది
  • సింధు ప్రజలకు తెలియని జంతువు? గుర్రం
  • సుర్కోతోడా లో లభించిన ఎముకలు గుర్రానికి సంభందించినవి కాదని గాడిదకు సంభందించినవి అని అభిప్రాయ పడినవారు? రొమిల్లా థాపర్
  • సింధు ప్రజలు అగ్నిని పూజించి నట్లు ఆధారాలు ఎక్కడ లభించాయి? లోథాల్, కాలిబంగన్
  • ఇటుకలతో నిర్మించిన వేదికలు, బూడిద, జంతువుల ఎముకలు ఎక్కడ లభించాయి? కాలిబంగన్

సింధు ప్రజల మత విస్వాశాలు

  • సింధు ప్రజల మత విశ్వాశాలు?
    • మరణం తరువాత జీవనం ఉంటుంది
    • ఉ. తల ద. కాళ్ళు ఉండేటట్లు పూడ్చి పెట్టేవారు
    • మృత దేహాలతో గాజులు పూసలు రాగి అద్దాలు పూడ్చి పెట్టేవారు
    • శివుడిని పశుపతి గా కొలిచేవారు

నాగరికత పతనం

  • సింధు ప్రజల పతనానికి కారణం ఆర్యుల దండయాత్రలు అని పేర్కొన్నవారు? మార్టిమార్ వీలర్ (195౩)
  • సింధు ప్రజల పతనానికి కారణం ఆర్యుల దండయాత్రలుఅని తెలియజేస్తూ మార్టిమార్ వీలర్ రుజువుగా వేటిని చూపించాడు? 37 అస్టిపంజరాలు వేదాలలో పేర్కొన్న ఆధారాలు
  • ఆస్థి పంజరాల మిద వున్న గుర్తులు ధౌర్జన్యకర యుద్దాలవల్ల కాకుండా కోతల వల్ల ఏర్పడినవి అని వెల్లడించినవారు? కెన్నెత్ కెన్నడి (1994)

భారత పురావస్తు శాస్త్రం లో ప్రధాన యుగాలు

Main Periods in Archaeology
    • దిగువ ప్రాచిన శిలా యుగం                 క్రి పూ 2 మిలియన్ల సంవత్సరాలు
    • మధ్య ప్రాచిన శిలా యుగం                  క్రి పూ 80 వేలు సం
    • ఎగువ ప్రాచిన శిలా యుగం                 క్రి పూ 35 వేల సం
    • మధ్య శిలా యుగం               క్రి పూ 12 వేల సం
    • నవీన శిలా యుగం               క్రి పూ 10 వేల సం
    • తామ్ర శిలా యుగం               క్రి పూ 6 వేల సం
    • హరప్పా నాగరికత                                క్రి పూ 2 వేల 6 వందలు
    • తొలి అయో, బృహత్ శిలా సమాధులు               క్రి పూ 1౦౦౦ సం

వైదిక యుగం

  • వైదిక యుగ కాలం ? క్రి పూ 15౦౦-6౦౦ సం మధ్య కాలం
  • వైదిక యుగాన్ని ఎన్ని భాగాలు గా విభజించారు? 2 (తొలి వేదకాలం, మలివేద కాలం)

తొలివేద కాలం

  • తోలివేద కాలం? క్రి పూ 15౦౦-10౦౦

ఆర్ధిక వ్యవస్థ

  • కంచు లోహ పనిముట్లు ఏ కాలం లో ఉపయోగించిరి? తొలివేద కాలం లో
  • ఋగ్వేదం లో ఏ వృత్తులు ప్రస్తావించ బడ్డాయి? కంచులోహ పనివారు, వడ్రంగి, రధాలు తయారు చేసేవారు
  • ఇనుము కాల్చే పని ఏ ప్రాంతం లో మాత్రమే ఉండేది? అనటోలియా బయట మాత్రమే
  • ఇనుము కాల్చే పనిని రహస్యంగా ఉంచిన వారు? హిటైట్ లు
  • ఇనుము కాల్చే పని గూర్చిఎప్పుడు తెలిసింది? క్రి పూ 2వ సహస్రాబ్ది
  • సింధు ప్రజల ప్రధాన వృత్తులు ? వ్యవసాయం పశుపాలన
  • ఋగ్వేద యుద్దాన్ని ఏ విధంగా పేర్కొంది? ఆవుల అన్వేషణ గా
  • ఆకాలం లో ఒక మనిషి ఎన్ని గోవుల విలువతో సమానం? 100
  • ఋగ్వేద ప్రజల జీవనం లో ప్రధాన పాత్ర పోషించిన జంతువు ? గుర్రం
  • భూమినిదున్నడం గూర్చి పేర్కొనబడినది? ఋగ్వేద తొలి భాగం లో

సమాజం

  • తొలి వేద కాలం లో ఏ తరహ కుటుంభ విధానం అమలులో ఉండేది? పితృస్వామ్య వ్యవస్థ
  • తోలివేద కాల సమాజ లక్షణాలు
    • ఏక భార్యత్వం అమలులో ఉండేది (ఉన్నత వర్గాలలో బహుభార్యత్వం ఉండేది)
    • పురుషునితో సమానంగా స్త్రీకి జ్ఞానసముపార్జన పొందే అవకాసం
    • కుటుంభ పెద్దను గృహపతి అనేవారు
    • సభ సమితులలో స్త్రీలకు సభ్యత్వం ఉండేది
    • స్త్రీ పురుషులిద్దరూ నూలు ఉన్ని దుస్తులు ధరించేవారు
    • ఆవు ను అత్యంత పవిత్రంగా భావించిరి (మాంసం తినడం నిషేదించ బడినది)
    • సాంఘిక విభజన సమాజం లో లేదు
  • ఋగ్వేదం లో పేర్కొనబడిన కవయిత్రులు? అపల, విశ్వవర, ఘోష, లోపా ముద్ర
  • తోలివేద కాల ప్రజల వినోదాలు
    • రధాల పోటీ
    • గుర్రపు స్వారి
    • పాచికలు
    • సంగీతం
    • నాట్యం

వర్ణ వ్యవస్థ

caste system
  • తోలివేద కాలం లో వర్ణం అనే పదాన్ని దేనికొరకు ఉపయోగించే వారు? మానవుని రంగు కు
  • తొలివేద కాలం లో గల 3 వర్ణాలు ఏవి? యుద్ద వీరులు, పూజారులు, సామాన్యులు
  • తొలివేద కాలం లో గల 4వ వర్గం? శూద్రులు (ఋగ్వేద కాల చివర ఏర్పడ్డారు)
  • తొలివేద కాలం లో సూద్రుల ప్రస్తావన ఏ అధ్యాయం లో పేర్కొనబడినది? 10వ అధ్యాయం
  • తొలివేద కాలం లో వృత్తి విభజన బలంగా లేదు అని తెలిపే మాటలు? నేను కవిని, మాతండ్రి వైద్యుడు మా తల్లి తోటమాలి

దేవతలు

  • తొలి వేదకాలం నాటి దేవతలు?
    • ఇంద్రుని పూజించిరి              యుద్ద దేవత           వాతావరణ దేవతగా
    • మార్స్                                     ఇంద్రునికి సహాయకునిగా పూజించేవారు
    • అగ్ని                                        మానవులు దేవతల మధ్య వారధి గా
    • సోమ పానీయం                    వృక్షాలు మూలికలతో తయారు చేయబడేది పూజలు ఉత్సవాలలో ఉపయోగించారు
  • స్త్రీ దేవతలు                             అదితి      పృద్వీ      ఉష
    • వైదిక ప్రజలు ఎటువంటి దేవాలయాలు నిర్మించలేదు

మలివేద కాలం

  • మలివేద కాలం ? క్రి పూ 10౦౦-6౦౦
  • రామాయణం మహాభారతం ఎప్పుడు రచించ బడ్డాయి? మలివేద కాలం లో
  • మలివేద కాల ప్రజలు తూర్పుగా గంగా మైదానానికి విస్తరించారు అని ఏ వేద గ్రంధం పేర్కొంది ? శతపత బ్రాహ్మణం

ప్రారంభ రాజ్యాలు

Ancient Civilizations and Cultures
  • మలివేద కాల౦ లో ప్రధాన అంశం? విశాల రాజ్యాలు ఆవిర్భవించడం
  • పంచాల రాజ్య రాజధాని? హస్తినాపురం
  • ఏ వంశ చరిత్రను భారత యుద్దానికి ప్రధాన కారణంగా భావిస్తారు? కురు
  • మహా భారత యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రి పూ 95౦ లో
  • మహా భారత యుద్ధం ఎవరి మధ్య జరిగింది? కౌరవ పాండవుల మధ్య
  • మహా భారత యుద్ధం యొక్క ఫలితం? కురు వంశం తుడుచు పెట్టుకు పోయింది

ప్రాముఖ్యం లోకి వచ్చిన రాజ్యాలు

  • మలివేద కాలం లో ప్రాముఖ్యత లోకి వచ్చిన రాజ్యాలు? కోసల, కాశి, విదేహ, మగధ, అంగ, వంగ
  • మలివేద కాలం లో ప్రసిద్ది చెందిన కాశి రాజు ? అజాత శత్రువు
  • మలివేద కాలం లో విదేహ పాలకుడు ? జనకుడు
  • యజ్ఞావల్కుడు ఎవరి ఆస్థానం లో ఉండేవాడు? జనకుని ఆస్థానం లో
  • విదేహ రాజధాని? మిదిల
  • ఆర్యావర్తము అనగా ?ఉ. భారత దేశము
  • మధ్య దేశ అనగా? మధ్య బరతదేశము
  • దక్షిణాపధం అనగా ? ద భారత దేశము

రాజకీయ వ్యవస్థ

  • జనపదాలు అనగా? జన లేదా తెగ రాజ్యాలు
  • జనపదాలను వేటితో పోల్చవచ్చు? రాష్ట్రాలతో
  • మలివేద కాలం లోని రాజులు ఏయే యాగాలు చేసేవారు? రాజసూయ, అశ్వమేధ, వాజపేయ
  • మలివేద కాలం లోని రాజులు ఏయే బిరుదులూ పొందేవారు ? రాజవిశ్వ జనన్, ఏకరాట్, సామ్రాట్
  • మలివేద కాలం లోని గ్రామాధి కారులు? పురోహితుడు, సేనాని, గ్రామణి, ఖజానా అధికారి, పన్ను వసూలు అధికారి, రాయల్ మెసెంజర్
  • స్టానిక పాలన గ్రామ సంఘాలు నిర్వహించేవి (సభ సమితులు పూర్వ ప్రభావాలు కోల్పోయాయి)

ఆర్ధిక వ్యవస్థ

  • మలివేద కాలం లో విస్తృతంగా వాడుకలోకి వచ్చిన ఖనిజం? ఇనుము
  • మలివేద కాల ప్రజల ప్రధాన వ్రుత్తి? వ్యవసాయం
  • మలివేద కాల ప్రజల పంటలు ఏవి? బార్లి, వరి, గోధుమ
  • మలివేద కాల ప్రజల ఎవరితో వ్యాపారాలు చేసేవారు? బాబిలోనియన్ లతో  
  • గణ అనే శ్రేణులు వేటికి సంబందించినవి? వర్తక వ్యాపారాల కోసం (వైశ్యులు ఏర్పాటు చేసుకొన్నారు)
  • రుగ్వేదకాలం లో వాడుకలో ఉన్న నాణెం ? నిష్క
  • శతమాన అనేది ఏ రకమైన నాణెం? బంగారు నాణెం
  • కృష అనేది ఏ రకమైన నాణెం? వెండి నాణెం

సామాజిక వ్యవస్థ

society
  • మలివేద కాలం లో ఏర్పడిన వర్ణ వ్యవస్థ ? చాతుర్వర్ణ వ్యవస్థ ? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు
  • మలివేద కాలం లో ప్రత్యెక హక్కులను ఏ వర్ణాలు అనుభావించేవి? బ్రాహ్మణ, క్షత్రియ వర్గాలు
  • మలివేద కాలం లో ప్రత్యెక హక్కులు లేని వర్గం? వైశ్య, శూద్రులు
  • మలివేద కాల సామాజిక లక్షణాలు?
    • వర్నా శ్రమ పద్దతి అమలులోకి వచ్చింది
    • కుటుంబ వ్యవస్థ లో తండ్రి అధికారం బలపడింది
    • స్త్రీ ని పురుషునికి సేవకురాలిగా భావించారు
    • స్త్రీలు సభలలో సభ్యత్వ అర్హత కోల్పోయారు
    • కూతురిని భారంగా చూసేవారు (ఐతరేయ బ్రహ్మనం ప్రకారం)
  • ద్విజులు అనగా? 2 సార్లు జన్మించినవారు
  • బ్రాహ్మణుల ప్రధాన వ్రుత్తి? యజ్నయాగాలు పూజలు
  • చాతుర్వర్ణ వ్యవస్థ లో ప్రధాన వర్గం గా గుర్తింపు పొందినవారు? బ్రాహ్మణులూ
  • యోగ ధర్మాన్ని నిర్వహించేవారు? క్షత్రియులు
  • వైశ్యుల వ్రుత్తి? వ్యాపారం
  • తక్కువ వారుగా గుర్తింపు పొందిన వారు? శూద్రులు
  • బ్రాహ్మణ క్షత్రియ పురుషులు వైశ్యసూద్ర స్త్రీలను వివాహం చేసుకోవచ్చు, వైశ్య సూద్ర పురుషులు బ్రాహ్మణ క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోరాదు అని ఎక్కడ చెప్పబడినది? శతపత బ్రాహ్మణం

ఆశ్రమ పద్దతి

  • 100 సం జీవన కాలాన్ని 25 సం గల 4 భాగాలుగా విభజించారు దీనికి గల పేరు? ఆశ్రమ పద్దతి (1 బ్రహ్మచర్యం, 2 గృహస్తం, ౩ వానప్రస్థం, 4 సన్యాస)
  • బ్రహ్మచర్యం ఎన్ని సంవత్సరాల వరకు పరిగణన లోనికి తీసుకొన్నారు? 25 సంవత్సరాలు(విద్యార్థి దశ)
  • గృహస్థం దశ ఎన్ని సంవత్సరాలు? 25-5౦సం దశ (కుటుంబ భాద్యత)
  • వానప్రస్థం దశ ఏయే సంవత్సరాల మధ్య ఉంటుంది? 50-75 మధ్య కాలం
  • తపస్సులో నిమగ్నం అయ్యే వర్ణాశ్రమ దశ ? వానప్రస్థం
  • సన్యాస దశ కాలం ? 75 సం పై బడినవారు
  • సంచార జీవనం ఏ దశలో సంభవిస్తుంది? సన్యాసం దశ లో

మతం

  • త్రిమూర్తులు గా ఎవరిని పేర్కొంటారు? బ్రహ్మదేవుడు(సృష్టికర్త అని), విష్ణువు(స్టితి కారుడు అని), శివుడు(లయకారుడు అని విశ్వాసం)
  • ప్రార్ధనలు తెరమరుగు అయి కర్మఖాండలు యాగాలు అధికం అయిన కాలం? మలివేద కాలం
  • మలివేదకాలం చివరిలో ఖర్మకాండలు వ్యతిరేఖించి ఆధ్యాత్మిక జ్ఞానం శాంతి సంపాదించే మార్గంవైపు దృష్టి సారించినవి? ఉపనిషత్తులు

ఆర్యులు

aryan civilization
  • భారతదేశం లో వైదిక యోగం ఎప్పుడు ప్రారంభం అయినది? ఆర్యులు భారత్ కి రావడం తో ప్రారంభం
  • ఆర్యుల మొదటి ప్రాంతం? మధ్య ఆసియా లోని ద రష్యా గడ్డి మైదానాలు
  • ఆర్యులు ఎక్కడ నుండి వలస వచ్చారు అని ప్రతీతి? ఆండ్రనోవా సంసృతి ప్రాంతం నుండి వలస
  • ఆండ్రనోవా సంసృతి ఏ కాలం లో విలసిల్లింది ? ఈ సంస్కృతీ క్రి పూ 2వ సహస్రాబ్దిలో విలసిల్లింది (ద సైబీరియా)
  • ఆర్యులు ఆండ్రనోవా సంసృతి నుండి ఏ ప్రాంతానికి వలస రావడం జరిగినది? హిందూకుష్ ప్రాంతాలకు (ఇక్కడ నుండి ఉత్తర పశ్చిమ భారత్ కి రావడం జరిగినది)
  • ఉత్తర పశ్చిమ భారత్ కి వలస వచ్చిన ఆర్యులను ఏ పేరుతో పిలిచారు? ఇండో ఆర్యన్ లు అని
  • ఆర్యుల జీవనం లో ప్రధాన అంశాలు? గుర్రాలు, చక్రాలు, నిప్పు, అంత్య క్రియలు (క్రి పూ 19౦౦-15౦౦మధ్య కాలం లో)
  • ఆర్యులు అనే పదం ఏ భాష పదం ? సంస్కృతం (అనగా గొప్పవారు)
  • ఆర్యులు ఒక తెగ గా ఎప్పుడు గుర్తించ బడ్డారు? 19వ శతాబ్దం లో
  • ఇటీవల కాలం లో ఆర్యులను ఏవిధంగా భావిస్తున్నారు? ఇండో యురోపియన్ తెగకు చెందిన ఒక భాషా వర్గంగా
  • ఇండో యురోపియన్ తెగకు చెందిన ఒక భాషా వర్గం నుండి ఆవిర్భవించిన భాషలు? సంస్కృతం, లాటిన్, గ్రీకు
  • ఇండో యురోపియన్ తెగలకు దగ్గరగా ఉన్న లాటిన్ సంస్కృత పదాలు? మత్రి, పిత్రి (సంస్కృత పదాలు), మటర్, పటర్ (లాటిన్ పదాలు)
  • ఇండో యురోపియన్ తెగలకు దగ్గరగా ఉన్న కసైట్ వేదకాల పదాలు ? సూర్య మరుట్టాస్(కసైట్ పదాలు), సూర్య మరుట్ (వేద కాల పదాలు)
  • కసైట్ పదాలు ఏ శాసనాల్లో కనిపిస్తున్నాయి? మెసపుటోమియా శాసనాల్లో
  • ఒకేలా ఉచ్చరించే హిటైట్, వేదకాల పదాలు? ఇంద్ర (హిటైట్ బాష), వేద కాల పద౦

వేదసాహిత్యం

Vedic Literature
Screenshot
  • వేదం అనే పదం ఏ పదం నుండి ఆవిర్భవించింది? విద్ అనే పదం నుండి
  • విద్ అనగా? జ్ఞానం అని అర్ధం

వేదాలు

  • వేదాలు ఎన్ని? 4 (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం)
  • వేదకాలానికి మరొక పేరు? వైదిక యుగ౦
  • హిందూ మతానికి పునాదిగా భావించ బడేవి? వేదాలు
  • అతి ప్రాచీన వేదం? ఋగ్వేదం
  • ఋగ్వేదం లో ఉన్న మంత్రాల సంఖ్య? 1028 (దేవతలను స్తుతిస్తూ)
  • యజ్న యగాలలో ఉచ్చరించే మంత్రాలూ ఏ వేదం లో ఉన్నాయి? యజుర్వేదం
  • భారతీయ సంగీతానికి మూలం గా ఉన్న వేదం? సామ వేదం
  • మంత్రం తంత్రాలు గూర్చి పేర్కొనబడిన వేదం? ఆదర్వణ వేదం

బ్రాహ్మణాలు

  • వేదాలతో పాటు ప్రధాన రచనలు గా పేర్కొనబడినవి? బ్రాహ్మణాలు
  • వేదాల్లో మంత్రాలను సంప్రదాయ బద్దంగా వివరి౦చేవి ? బ్రాహ్మణాలు
  • బ్రాహ్మణాలు ఏవిధంగా ఉన్నాయి? వచనం లో రచించబడి పూజా విధానం లో ఉన్నాయి
  • బ్రాహ్మణాలకు అనుబంధంగా పేర్కొన బడేవి? అరణ్యకాలు, ఉపనిషత్తులు
  • అరణ్యకాలు వివరించే అంశాలు? మహత్యాలు, ఉత్సవాలు, త్యాగాలు
  • ఉపనిషత్తులు చర్చించు అంశాలు? ఆత్మా, అంతరాత్మ, ప్రపంచ ఆవిర్భావం, మహాత్మ్యాలు

వేదాంగాలు

  • వేదాంగాలు ఎన్ని ?6 (శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, చాంద, జ్యోతిష్య)
  • ఉచ్చారణ వివరి౦చే వేదంగం? శిక్ష
  • వేదాంగాలలో ప్రధానమైనది? కల్ప
  • కల్ప వేదంగం దేనికి సంబందించినది? కర్మ కాండలకు
  • వ్యాకరణానికి సంబంధించిన వేదంగం? వ్యాకరణ
  • శబ్దాలును వివరి౦చే వేదంగం? నిరుక్త
  • ఛందస్సును వివరించు వేదంగం? చాంద
  • జ్యోతిష్య శాస్త్రాన్ని వివరించు వేదంగం? జ్యోతిష్య

ప్రధాన సూత్రాలు

  • వేద సాహిత్యం లో ప్రధాన సూత్రాలు ఎన్ని? 3 (శ్రౌత సూత్రం, గృహ సూత్రం, ధర్మ సూత్రం)
  • శ్రౌత సూత్రం దేనిని వివరిస్తుంది? ధర్మాలను గురించి
  • గృహస్తు ధర్మాల గురించి వివరించు సూత్రం? గృహ సూత్రం
  • ధర్మ సూత్రం వేటిని వివరిస్తుంది? వివిధ సముదాయాలలో అనుసరించాల్సిన ధర్మాలు వివరిస్తుంది

దర్శనాలు

  • దర్శనాలు ఎన్ని? 6 (న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వ మీమాంస, ఉ. మీమాంస)
  • 6 దర్శనాలను ఏ పేరుతొ పేర్కొంటారు? షడ్దర్శనాలు అని పేరు
  • న్యాయ దర్శనాన్ని రచించింది? గౌతమ
  • వైశేషిక దర్శనాన్ని రచించిన వారు? కనడ ఋషి
  • సాంఖ్య దర్శనాన్ని రచించిన వారు? కపిలుడు
  • యోగ దర్శనాన్ని రచించిన వారు? పంతజలి రచించాడు
  • పూర్వ మీమాంస దర్శనాన్ని రచించిన వారు? జైమిని
  • ఉ. మీమాంస దర్శనాన్ని రచించిన వారు? బాదరాయణుడు

పాలనా విధానం

  • వేద కాలం లో పాలన ఎవరు సాగించారు? ట్రైబల కౌన్సిల్ పాలించేది (పాలకులు లేరు)
  • రాజన్ యొక్క ప్రధాన విధి? తెగ ప్రజలను రక్షించడం
  • రాజన్ కు సహకరించిన వారు?  సేనాని, పురోహితుడు
  • వేదకాలం లో పురోహితుని విధులు ? పూజా కార్యక్రమాలు, యుద్దాల్లో విజయానికి పూజలు, దేశ శాంతి సౌభాగ్యాలకు ప్రార్ధనలు
  • for more information please visit our kingsdsc.in website

Political, economic, social conditions, and culture from the 3rd to the 7th century
5.Political economic social conditions and culture from the 3rd to the 7th century

Leave a Comment