Disaster Management

7. ప్రమాదాలు, విపత్తులు కారణాలు పరిణామాలు నిర్వహణ

Disasters (విపత్తులు అర్ధం, రకాలు)

  • (Disaster Management) విధ్వంశం అనగా ? ఏదైనా ఒక సంఘటన వల్ల జరిగే హాని చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దానిని
  • ప్రకృతి విపత్తులపై రియో డి జనీరో సమ్మేళనం ఎప్పుడు జరిగింది? 1993 (బ్రెజిల్ లో )
  • యోఖహమా లో జరిగిన ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ పై సమ్మేళనం? 1994 (జపాన్ లో)
  • విపత్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగినది ? 4 (ప్రకృతి వైపరిత్యాలు, పర్యావరణ అత్యవసర పరిస్ధితులు, సంక్లిష్ట అత్యవసర పరిస్ధితులు, పండమిక అత్యవసర పరిస్ధితులు)
  • సాంకేతిక / పారిశ్రామిక ప్రమాదాలు, ప్రమాదకర పదార్ధాల ఉత్పత్తి, మానవుల వల్ల కలిగే అటవీ అగ్ని ప్రమాదాలు, రవాణా ప్రమాదాలు ఏ ప్రకృతి విపత్తుల కోవలోకి వస్తాయి? పర్యావరణ అత్యవసర పరిస్ధితులు కోవలోకి

Floods (వరదలు)

 

Political, economic, social conditions, and culture from the 3rd to the 7th century
5.Political economic social conditions and culture from the 3rd to the 7th century
  • వరదలు, తుఫానులు, భూకంపాలు, సునామీలు ఏ విపత్తుల వర్గం లోకి వస్తాయి? ప్రకృతి వైపరిత్యాలు వర్గం లోకి
  • సంక్లిష్ట అత్యవసర పరిస్ధితులు వర్గం లోకి వచ్చే అంశాలు ఏవి? అధికారాన్ని కూల దోయడం , వ్యూహాత్మక సంస్తాపనలపై దాడులు , సంఘర్షణ పరిస్ధితులు , యుద్ధం & దోపిడీ ఉంటాయి
  • పాండమిక అత్యవసర పరిస్ధితులు వర్గం లో ఏ అంశాలు ఉంటాయి? ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆకస్మిక అంటువ్యాదులు ఉంటాయి
  • తరచుగా భారత్ లో జరిగే ప్రమాదాలు   ఏవి? కుంభ వృష్టి, ఆకస్మిక వరదలు
  • కుంభ వృష్టి అనగా? అనుకోని ఆకస్మిక వర్షపాతం (కొన్ని సార్లు 1 గంటలో 5 అంగుళాల వర్షపాతం కురుస్తుంది)
  • ఆకస్మిక వరదలు లక్షణం ఏమి? విపరీతంగా కొన్ని రోజులు వర్షం కురుస్తుంది
  • నేషనల్ ఫ్లడ్ కమిషన్ భారత్ లో ఎన్ని హెక్టార్ల భూమిని వరద ప్రమాద భూమిగా గుర్తించింది? 40 మిలియన్ హెక్టార్ల భూమిని
  • భారత్ లో అధిక వర్షం గల రాష్ట్రాలు ఏవి? అస్సాం, ప బెంగాల్, బీహార్
  • ప్రపంచం లో అతిపెద్ద నది ద్వీపం ఏది ? మజూలి ద్వీపం (అస్సాం లో )
  • వరదలను ఏవిధంగా నియంత్రించ వచ్చు? ముంపు ప్రాంతాలకు చెక్ డాం లు నిర్మించడం, చెట్లు పెంచడం, నది ఎగువ పరివాహక ప్రాంతాలలో నిర్మాణాలు జరగకుండా చూడడం ద్వారా

Drought (కరువు)

  • కరువు అనగా? దీర్ఘ కాలం లో ఒక ప్రాంతం లో నీటి కొరత ఏర్పడడాన్ని
  • కరువుకు దారి తీసే పరిస్థితులు ఏవి? జలాశయాల నుండి నీరు అధికంగా ఆవిరి అవడం, అధిక నీటి వినియోగం, భూ గర్భ జలాలు పడిపోవడం

కరువు రకాలు

  • థారన్ వైట్ కరువును ఎన్ని ప్రాంతాలు గా వర్గీకరించాడు? 3 (శాశ్వత కరువు ప్రాంతం, ఋతుపవన ఆధారిత కరువు, నిరంతర కరువు)
  • శాశ్వత కరువు ప్రాంతం  అనగా ? శాశ్వతంగా పొడిగా శుష్క ఎడారిగా ఉండే ప్రాంత౦
  •  శాశ్వత కరువు ప్రాంతం  లో పెరిగే వృక్ష సంపద ఏది? కాక్టస్, ముళ్ళ పొదలు, జేరోఫైట్స్
  • ఋతుపవన ఆధారిత కరువు ఎక్కడ సంభవిస్తుంది? వర్షపు పొడి వాతావరణం అని స్పష్టంగా నిర్వహించబడిన ప్రాంతాలలో సంభవిస్తుంది (వర్శాదార ప్రాంతాలలో సంభవిస్తుంది)
  • నిరంతర కరువు ఏ ప్రాంతాలలో సంభవిస్తుంది? తేమ ఉప తేమ ప్రాంతాలలో సంభవిస్తుంది (వర్షం రాణి తక్కువగా నమోదు అయ్యే ప్రాంతం వల్ల)
  • వర్షపాతం కురిసే విధానం బట్టి కరువు ఎన్ని రకాలు? 3 (సాధారణ కరువు, మాధ్యమిక కరువు, తీవ్ర కరువు)
  • సాధారణ కరువు అనగా? వర్షపాతం సాధారణం కంటే 11-25% తక్కువ ఉండడం
  • మాధ్యమిక కరువు అనగా ? వర్షపాతం సాధారణం కంటే 26-5౦% తక్కువ ఉండడం
  • తీవ్ర కరువు అనగా? వర్షపాతం సాధారణం కంటే 5౦% తక్కువ ఉండడం
  • జల సంభంద కరువు అనగా? జల వనరులు ఎండిపోయి భూ గర్భ జలాలు అంతరించి పోవడం
  • వ్యవసాయ కరువు ఎప్పుడు ఏర్పడుతుంది? అతి తక్కువ వర్షాభావ పరిస్థితులలో ఏర్పడుతుంది (ఈ సమయం లో నేలలో దీర్ఘకాలిక తేమ శాతం పడిపోతుంది)
  • వ్యవసాయ కరువు భూమిని ఏ విధంగా నిర్ణయిస్తారు? ౩౦% భూభాగం కంటే తక్కువగా పంటభూమి ఉన్న ప్రదేశాన్ని
  • మీడియం ఆధారంగా కరువును ఎన్ని వర్గాలు గా విభజించారు? 4 (నేల కరువు, వాతావరణ కరువు, జల కరువు, పర్యావరణ కరువు)
  • నేల కరువు అనగా? నేల తేమ క్షీణించి పంట యొక్క బష్పిభావన స్థాయి పడిపోవడం
  • వాతావరణ కరువు ఎలా ఏర్పడుతుంది? తక్కువ తేమ పొడి గాలులు కారణంగా ఏర్పడుతుంది (కొన్ని సార్లు వర్షం తేమసరఫరా ఉన్నప్పుడు కూడా సంభవిస్తుంది)
  • జల కరువు అనగా? ఒక ప్రదేశం లోని కుంటలు చెరువులు కాలువలు భూగర్భాజలం నిల్వలు పడిపోవడం నీరు ఆవిరయ్యే స్థాయికన్నా తగ్గడాన్ని జల కరువు గా పేర్కొంటారు
  • పర్యావరణ కరువుఎలా ఏర్పడుతుంది? సహజ వాతావరణ వ్యవస్థ ఉత్పాదకత విఫలమైనపుడు

కరువు పీడిత ప్రాంతాలు

  • భారత్ లో కరువు పీడిత ప్రాంతాలును తీవ్రత ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3 (అతి తీవ్ర కరువు పీడిత ప్రాంతాలు, తీవ్ర కరువు పీడిత ప్రాంతాలు, సాధారణ కరువు ప్రాంతాలు)
  • అతి తీవ్ర కరువు పీడిత ప్రాంతాలుగా వేటిని గుర్తించారు? రాజస్థాన్ లో జై సల్మిర్,బార్మర్ గుజరాత్ లో మరుస్తలి కచ్ ప్రాంతాలు, ఆరావళి ప ప్రాంతాలు
  • అతి తీవ్ర కరువు పీడిత ప్రాంతాలు లో వర్షపాతం ఎంత ఉంటుంది? 90 మిమి కంటే తక్కువ
  • తీవ్ర కరువు పీడిత ప్రాంతాలుగా వేటిని గుర్తించారు? రాజస్థాన్ తూర్పు ప్రాంతం, మహారాష్ట్ర తూ ప్రాంతం, కర్ణాటక పీటభూమి, జార్ఖండ్ దక్షిణ ప్రాంతం, తమిళనాడు, ఓడిసా,మధ్య ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలు
  • సాధారణ కరువు ప్రాంతాలు గా వేటిని గుర్తించారు? రాజస్థాన్ హర్యానా లో ఉ.ప్రాంతాలు, కొంకన్ ప్రాంతం మినహా మహారాష్ట్ర ప్రాంతం, కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్, ఉ ప్రదేశ్ లో ద . జిల్లాలు గుజరాత్ ప్రాంతాలు, కోయంబత్తూర్ పీటభూమి

కరువు పరిణామాలు  

  • కరువు సంభవించి నపుడు ఎన్ని  అంశాలు పరిగణన లోకి తీసుకోవాలి? 2 (బాదితులకు సురక్షిత త్రాగునీరు ఏర్పాటు చేయాలి, మందులు పంపిణి చేయాలి)

Earthquakes (భూకంపాలు) Tsunamis (సునామీలు)

భూ కంపాలు

  • అన్ని విపత్తులలో Disasters కెల్ల అత్యంత వినశానమైనవి? టెక్టనిక్ మూలానికి చెందిన భూ కంపాలు
  • తీవ్ర భూకంపాలు ఏ రాష్ట్రాల్లో సంభవించాయి? గుజరాత్, మహారాష్ట్ర లో
  • నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసినవారు? నేషనల్ జియోలాజికల్ లేబొరేటరి, భారత జియోలజికల్ సర్వే, వాతావరణ శాఖ, భారత ప్రభుత్వం
  • భారత భూ పలకం ఆసియా వైపు సం కి ఎన్ని  మిమి నెట్టబడుతుంది? 47 మిమి
  • నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధారంగా భారత దేశ భూకంప మండలాలు ఎన్ని? 5 (అత్యధిక నష్టం కలిగించే ప్రాంతాలు, అధిక నష్టం కలిగించే ప్రాంతాలు, సాధారణ నష్టం కలిగించే ప్రాంతాలు, తక్కువ నష్టం కలిగించే ప్రాంతాలు, చాలా తక్కువ నష్టం కలిగించే ప్రాంతాలు)
  • నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారము అత్యధిక, అధిక నష్టం కలిగించే ప్రాంతాలు ఏవి? ఉత్తర దర్భంగా , అర్రియా, బీహార్ లో నేపాల్ భారత్ సరిహద్దు ప్రాంతం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ ప ప్రాంతం, హిమాలయాలలో కాశ్మీర్ ప్రాంతం, ఖచ్ గుజరాత్ ప్రాంతం
  • UNO ప్రపంచ బ్యాంకు ప్రకారం 2050 కి ఎంత మంది ప్రజలు తుఫానులు భూకంపాలను ఎదుర్కోనున్నారు? 200 మిలియన్స్ ప్రజలు
  • భారతదేశ భూకంప జోన్ లలో జోన్ 1 లో ఏ ప్రాంతాలను చేర్చారు? ఏ ప్రాంతాన్ని కేటాయించే లేదు
  • తక్కువ భూకంపం తో సంబంధం కలిగి ఉన్న జోన్ ఏది ? 2వ జోన్ (msk VI తక్కువ నష్టం జరిగే జోన్)
  • ప్రమాద బరిత జోన్ గా ఏ జోన్ ను పేర్కొంటారు? జోన్ 3 (msk VII కి చెందినది)
  • జోన్ నెంబర్ 3 IS కోడ్ ఎంత? 7.8
  • అధిక ప్రమాద బరిత జోన్ గా ఏ జోన్ ను పిలుస్తారు? 4 నెంబర్ జోన్ ను
  • 4 నెంబర్ జోన్ లో గల ప్రాంతాలు ఏవి? జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, గంగా సింధు మైదానాలు, బీహార్ లో రక్సాల్ ప్రాంతం, భారత్ నేపాల్ సరిహద్దు
  • Msk VIII కి చెందినా ప్రాంతాలు ఏ జోన్ లో ఉన్నాయి? 4 నెంబర్ జోన్ లో
  • అత్యధిక రిస్క్ జోన్ ప్రాంత౦ గా ఏ జోన్ ను ప్రకటించారు? 5వ నెంబర్ జోన్ ను
  • 5వ నెంబర్ జోన్ లో గల ప్రాంతాలు ఏవి? కాశ్మీర్ ప్రాంతం, హిమాలయాలు, బీహార్, ఈ భారత్ రాష్ట్రాలు
  • 5వ నెంబర్ జోన్ ఏ స్థాయి భూకంపాలను సూచిస్తుంది? msk స్థాయి IX లేదా ఎక్కువ స్థాయి భూకంపాలు సూచిస్తుంది
  • జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ఏ శాఖ పరిధిలో గలదు? కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ వారి నోడల్ ఏజెన్సీ
  • జాతీయ భూకంప అధ్యయన కేంద్రం కార్యకలాపాలు? రోజూ 24 గంటలు (24*7) ముందస్తు హెచ్చరికలు, జాతీయ సిస్మోలజి నెట్వర్క్ స్థానిక నెట్వర్క్ ల నిర్వహణ, భూకంప ప్రక్రియలు మోడలింగ్, భూకంప ప్రమాదాలు తీవ్రత సంబందిత అధ్యయనం, భూకంప అనంతరం క్షేత్ర స్థాయి పర్యవేక్షణ, కేంద్ర స్థాయి స్పందన
  • MSK పూర్తీ రూపం? మెద్వెదేవ్ స్సోనిహేర్ కార్నిక్ (భూకంపాలను వివరించే స్కేలు)
  • MSK ఎన్ని భూకంప జోన్ లను సూచిస్తుంది? 4
  • భూకంప సముద్ర తరంగాలుకు గల పేరు ? సునామి

సునామీలు

  • సునామీలు ఎక్కువగా ఏ ప్రాంతం లో గుర్తించారు? పసిఫిక్ వలయం చుట్టూ
  • సునామీలు వేటి వల్ల సంభవిస్తాయి? భూకంపాలు అగ్నిపర్వత విస్పోటనాల వల్ల సంభవిస్తాయి
  • సునామిలకు మరొక పేరు? ఉపరితల నీటి తరంగాలు
  • 2004 డిసెంబర్ 26 న సంభవించిన సునామీలో ఎంత మంది మరణించారు? 3 లక్షల మంది

Tropical Cyclones (ఉష్ణమండల తుఫానులు)

  • ఉష్ణమండల తుఫానులు ఏ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి? ౩౦ డిగ్రీల ఉ ద అక్షాంశాల మధ్య ఏర్పడతాయి
  • ఉష్ణమండల తుఫానులు అధిక పీడనం ప్రవణత కలిగి ఎంత ఉంటుంది? 14-17 mb/100 కిమీ
  • ఉష్ణ మండల తుఫానులకు ఉదా? సర్జ్
  • సర్జ్ లక్షణాలు ఏవి?
    • 180 కిమీ వేగం తో గాలులు తీరాన్ని తాకుతాయి
    • సముద్ర మట్టం అసహజంగా పెరిగి పోతుంది
    • పంటలు మునిగి పోతాయి
    • మానవ నిర్మాణాలు దెబ్బతింటాయి

Landslides (కొండచరియలు)

  • కొండ చరియలు అనేవి? పెద్ద పెద్ద బండరాళ్ళు (వేగంగా విరిగి పడిపోతాయి)

కొండచరియల ప్రభావిత ప్రాంతాలు

  • కొండ చరియలు ప్రభావిత ప్రాంతాలు ఏవి? అత్యధిక అవరోధా మండలం, అధిక అవరోధ మండలం, సాధారణ మధ్యస్థ ప్రభావ మండలం, ఇతర ప్రాంతాలు
  • అత్యధిక అవరోధా మండలంనకు ఉదా? హిమాలయాలు, అండమాన్ నికోబార్ దీవులు, పచ్చిమ పర్వత ప్రాంతాలు
  • అధిక అవరోధ మండలం నకు ఉదా? హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాలు, అస్సాం మైదానాలు
  • సాధారణ మధ్యస్థ ప్రభావ మండలంనకు ఉదా? హిమాచల్ ప్రదేశ్ లో లడక్, స్పితి, ట్రాన్స్ హిమాలయన్ ప్రాంతాలు, తూర్పు కనుమలు, దక్కన్ పీటభూమి ప్రాంతాలు
  • కార్బి, అంగ్లోంగ్ జిల్లాలు ఏ రాష్ట్రము లో గలవు? అస్సాం లో
  • డార్జిలింగ్ ప్రాంతం గల రాష్ట్రము ? ప. బెంగాల్

కొండచరియల నిర్వహణ తగ్గింపు దశలు

  • కొండ చరియలు నిర్వహణ తగ్గింపు లో ఎన్ని దశలు గలవు? 3 (మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ)
  • కొండ చరియలు నిర్వహణ తగ్గింపు లో మొదటి దశలో గల అంశాలు ఏవి? విపత్తుకు ముందు వైపరీత్యాల దత్తాంశం సమాచారం సృస్తించడం, దుర్భాలత్వం గల జోన్ మ్యాప్ లు తయారు చేయడం, ప్రజల మధ్య అవగాన కల్పించడం
  • కొండ చరియలు నిర్వహణ తగ్గింపు లో రెండవ దశలో గల అంశాలు ఏవి? విపత్తుల సమయం లో అత్యవసర ప్రాతిపదికన తరలింపు, పునరావాస సిభిరాల నిర్మాణం, నీరు ఆహరం వస్త్రాలు వైద్య పరికరాల సరఫరా
  • కొండ చరియలు నిర్వహణ తగ్గింపు లో మూడవ దశలో గల అంశాలు ఏవి? విపత్తుల అనంతర బాదితులకు పునరావాస చర్యలు చేపట్టడం, భవిష్యత్ వైపరిత్యాలు ఎదుర్కోవడానికి కావాల్సిన సామర్ధ్యం పెంపొందించు కోవడం
  • కొండ చరియలులో ఎన్నవ వంతు భూ భాగం  వైపరిత్యాలకు గురౌతుంది? 2/౩ వంతు భూభాగం (జనాభా లో సగం మంది వైపరీత్యాలకు గురౌతున్నారు)

విపత్తుల నిర్వహణ కు భారత్ లో తీసుకొన్న సానుకూల చర్యలు

  • విపత్తు నిర్వహణ బిల్లు ఏ సంవత్సరం లో ఏర్పాటు చేసారు? 2005 లో
  • మన దేశం లో విపత్తుల నిర్వహణకు ఏర్పాటు చేసిన సంస్థ? నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏర్పాటు
  • విపత్తు అనేది?
    •  ప్రకృతి / మానవుడు సృష్టించిన కారణాల వల్ల సంభవించే ప్రమాదం
    • ప్రమాదం సంభవించడం/ సమాధి అవడం
    • పర్యావరణ నష్టం జననష్టం కోలుకోలేని తెరుకోలేని పరిస్ధితులు

for more information visit our website kingsdsc.in

The economic conditions of early kingdoms and empires
3.The economic conditions of early kingdoms and empires

Leave a Comment