4.1 కుటుంబ వ్యవస్థ – మార్పులు

Family Structure (కుటుంభ వ్యవస్థ)
- అమ్మ, నాన్న, చెల్లి, తాతయ్య, నానమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, వాళ్ళ పిల్లలు అంతాకలిసి ఉండే కుటుంబం ? ఉమ్మడి కుటుంభం (changing family structure)
- ఉమ్మడి కుటుంబానికి గల పేర్లు? పెద్ద కుటుంభం, సమిష్టి కుటుంభం (changing family structure)
- కుటుంభం లో వృద్దులు అనగా? అమ్మమ్మ, నాయనమ్మ, తాత, బామ్మ
- అమ్మ, నాన్న, పిల్లలు ఉండే కుటుంభం? వ్యష్టి కుటుంభం (changing family structure)
- వ్యష్టి కుటుంభాలు ఏర్పడుటకు కారణం (changing family structure)? పెళ్లి కాగానే వేరే కాపురం పెట్టడం, ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళడం, ఆస్తులు పంచుకోవడం, నివాసానికి ఇల్లు సరిపోక పోవడం
Advantages of a Joint Family (ఉమ్మడి కుటుంభ ప్రయోజనాలు)
- ఉమ్మడి కుటుంభాల ప్రయోజనాలు (changing family structure)
- పిల్లలుకు వృద్దులు తోడుగా ఉంటారువీరు కథలు తెలియని విషయాలు చెబుతూ ఉంటారుఅందరు కలిసి భోజనం చేయడం
- పనులను కలిసిమెలిసి చేసుకోవడం
Different Games and Rules
4.2 ఆటలు – నియమాలు

Different Games and Rules (ఆటలు – నియమాలు)
- కబడ్డీ ఆటలో ఒక్కొక్క జట్టులో సభ్యుల సంఖ్య? 7
- కబడ్డీ ఆట నియమాలు
- కూతకు వెళ్ళినవారు వెనుకకు వేచ్చేలోగా డేడ్ లైన్ తప్పక తాకాలి
- అలా డేడ్ లైన్ తాకక పోతే అవుట్ అయినట్లే
- కూత మధ్య గీత వద్ద మొదలు పెట్టి మళ్ళీ అక్కడ వరకు కొనసాగాలి. అలా కాకుండా కూత మధ్య లో ఆపితే అవుట్ అయినట్లే
- ఆటగాల్లు కోర్ట్ హద్దు గీతాలు దాటితే అవుట్ అయినట్లే
- అవుట్ అయినవారు కోర్ట్ వెలుపల కూర్చోవాలి
- జట్టుకు పాయింట్ వచ్చినపుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ సభ్యులు జట్టులో చేరాలి
- ఆటగాళ్ళు గోళ్ళు పెంచుకోరాదు
- శరీరానికి నూనే లాటి పదార్ధాలు రాసుకొని ఆడరాదు
- ఆడ పిల్లలు ఈ ఆట ఆడేటపుడు జుట్టు, జడపట్టుకొని లాగడం చేయరాదు
Road Rules (రోడ్డు నియమాలు)
- రోడ్డు నియమాల వల్ల ఉపయోగం ఏమిటి? రోడ్ ప్రమాదాలు నివారించడానికి
- ట్రాఫిక్ సిగ్నల్స్ (సిగ్నల్ సిస్టం)
- ఎర్ర లైట్ వెలిగినపుడు : ఆగడం
- అరేంజ్ లైట్ వెలిగినపుడు : సిద్దంగా ఉండడం
- పచ్చ లైట్ వెలిగినప్దుడు : ముందుకు వెళ్ళడం
- ట్రాఫిక్ సిగ్నల్స్ ఉపయోగం ఏమిటి? వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోకుండా నియంత్రించ డానికి, క్రమ బద్దీకరించ డానికి. వీటివల్ల ప్రమాదాలు నివారించ బడతాయి.
- రోడ్డుపై చారలు ఉన్న చోట మనుషులు రోడ్డు దాటుతారు. దీనికి గల పేరు? జీబ్రా క్రాసింగ్ (దీనివద్ద వాహనాలు తక్కువ వేగం తో వెళతాయి)
School Rules (పాటశాల నియమాలు)
- పాటశాల నియమాలు
- ప్రార్ధనా సమయానికి ఉపధ్యాయులూ పిల్లలు హాజరు కావడం
- టైం టేబుల్ ప్రకారం తరగతులు జరగడం
- ఆటల పిరియడ్ లో ఆటలు ఆడడం
- మధ్యాహ్న భోజనం సక్రమంగా నిర్వహించడం
- నెలకొక సారి తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం
Personal Body Safety Rules (వ్యక్తిగత శరీర భద్రతా నియమాలు)
- వ్యక్తిగత శరీర భద్రతా నియమాలు
- శరీర భాగాలు కప్పబడునట్లు గా దుస్తులు ధరించాలి
- పరిచయం లేనివారితో శరీర భాగాలు గురించి ప్రశ్నించడం, మాట్లాడడం, తాకడానికి ప్రయత్నిస్తే నిశ్శబ్ధంగా ఉండడం చేయరాదు
Famous Sports and Sportspersons (ప్రముఖ క్రీడాకారులు వారి క్రీడలు)

- ప్రముఖ క్రీడాకారులు వారి క్రీడలు
| క్రీడాకారుల పేరు | వారి క్రీడలు |
| సైనా నెహ్వాల్ | బాడ్మింటన్ |
| విశ్వనాథన్ ఆనంద్ | చెస్ |
| మితాలీరాజ్ | క్రికెట్ |
| మేరీ కొమ్ | బాక్సింగ్ |
| కోనేరు హంపి | చెస్ |
| కారణం మల్లేశ్వరి | వెయిట్ లిఫ్టింగ్ |
| గగన్ నారాంగ్ | షూటింగ్ |
| సానియా మీర్జా | టెన్నిస్ |
| లియాండర్ పేస్ | టెన్నిస్ |
| విజేందర్ సింగ్ | బాక్సింగ్ |
| పిటి ఉష | అథ్లెటిక్స్ |
| పివి సింధు (పుసర్ల వెంకట సింధు) | బాడ్మింటన్ |
| సాక్షి మాలిక్ | రెజ్లర్ |
- క్రీడలలో గెలుపొందిన జట్టును ఏమంటారు? విజేత
- క్రీడా స్పూర్తి అనగా? తెలుపు ఓటములను సమానంగా తీసుకొని అభినందించు కోవడం
- ఆటలు ఆడడం వల్ల ఉపయోగం ఏమిటి? ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు
- పిల్లల ఆటల సమయంగా ఏ సమయాన్ని పేర్కొన్నారు? సాయంత్రం 4 – 6 గంటలు
- పాటశాల లో ఆటల పోటీలు ఎంతకాలానికి ఒక సారి నిర్వహించాలి? ప్రతి 3 నెలలకు ఒక సారి
(2011 లో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలుచుకొంది. కబడ్డీ ఆటలో బంగారు పథకం సాదించింది)
Various Types of Animals
4.3 రకరకాల జంతువులు

- చెవులు బయటకు కనిపించని జంతువులకు/పక్షులకు ఉదా? కప్ప, చేప, కోడి, కాకి, పిచుక, పాము, బల్లి, బాతు
- చెవులు చేసే పనిని పాములకు ఏ అవయవం చేస్తుంది? చర్మం
- ఎటువంటి జంతువులు పిల్లలను కంటాయి? చెవులు బయటకు కనిపిస్తూ, చర్మం పై వెంట్రుకలు ఉన్న జంతువులు (చెవులు బయటకు కనిపించకుండా చర్మం పై వెంట్రుకలు లేని జంతువులూ గుడ్లు పెడతాయి)
- గుడ్లు పెట్టి పిల్లలను పోషించే జంతువులకు గల పేరు? అండోత్పాదకాలు
- పిల్లలకు నేరుగా కనే జంతువులకు గల పేరు? శిశోత్పాధకాలు
Animals and Their Uses (జంతువులూ వాటి ఉపయోగాలు)
- జంతువుల వల్ల ఉపయోగాలు
- జంతు చర్మం నుండి చెప్పులు, డోలు వంటి వాయిద్యాలు తయారుచేసుకోవచ్చు
- జంతు వెంట్రుకలతో ఉన్ని వస్త్రాలు తయారుచేస్తారు
- జంతువుల నుండి మనకు ఆహార పదార్ధాలు లభిస్తాయి
- వ్యవసాయ పనులకు, సరుకు రవాణాకు ఉపయోగపడతాయి
- తెలంగాణా రాష్ట్ర జంతువుగా రాష్ట్ర ప్రభుత్వం దేనిని ప్రకటించింది? జింక
- తెలంగాణా లో జింకలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? నల్లమల అడవులలో
- మనదేశ జాతీయ జంతువు ఏది? పెద్ద పులి (అంతరించి పోయే దశలో ఉన్నాయి)
- కొన్ని జంతువులు గుడ్లు పెడతాయి. కాని వీటికి ఈకలు ఉండవు. అటువంటి జంతువులకు ఉదా? పాము, బల్లి, మొసలి, తాబేలు, కప్ప, చేప
- ఇటువంటి ఉపయోగకరమైన టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి kings dsc యు ట్యూబ్ ఛానల్ మరియు kingsdsc.in వెబ్సైట్








