India Relief Features (Useful Content)

10.1 భౌగోళిక స్వరూపాలు

  • India Relief Features: భౌగోళిక స్వరూపాలు అనగా? పర్వతాలు, పీటభూములు, మైదానాలు

ఉనికి

  • ఒక ప్రదేశాన్ని కచ్చితంగా సూచించడానికి ఉపయోగించేవి? అక్షాంశాలు, రేఖాంశాలు
  • భారతదేశ విస్తరణ అక్షాంశ రేఖాంశాల పరంగా? 8°4 ′ నుండి 37°6 ′ ఉత్తర అక్షాంశాలు, 68° 7 ′ నుండి 97°25 ′ తూర్పు రేఖాంశాల మధ్య (టెక్స్ట్ బుక్ లో 8 – 50 డిగ్రీలు ఉత్తర రేఖాంశాల మధ్య 68 డిగ్రీలు దక్షిణ మరియు 9 డిగ్రీలు తూర్పు అక్షాంశాల మధ్య అని తప్పుగా పేర్కొనబడినది. పేజి నెంబర్ 2లో గమనించగలరు)
  • భారత దేశం ఏ అర్ధ గోళం లో ఉంది (India Relief Features)? ఉత్తరార్ధ గోళం లో ( టెక్ట్ బుక్ లో దక్షిణార్ధ గోళం అని పేర్కొనబడినది గమనించగలరు పేజి నెంబర్ 2లో)
  • తెలంగాణా ఏయే అక్షాంశాలు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? 15° 46′ నుండి 19°47′ ఉత్తర అక్షాంశాలు, 77°16′ నుండి 81°43′ తూర్పు రేఖాంశాల మధ్య  
  • ద్వీపకల్పం అనగా? 3వైపులా నీరు ఒక వైపు భూ భాగం కలిగి ఉండడం చేత
  • ఇందిరా పాయింట్ ప్రాముఖ్యత
    • భారతదేశానికి అత్యంత దక్షిణాన ఉన్న భూ భాగం చివరి (బిందువు) (భారత ప్రధాన భూ భాగానికి దక్షిణాన ఉన్న చివరి బిందువు కన్యాకుమారి)
    • గ్రేట్ నికోబార్ దీవిలో ఉంది
    • ఇందిరా పాయింట్ అనే పేరును 1984 లో పెట్టారు
    • 2004 సునామీలో ఈ ప్రాంతం లో కొంత సముద్రం లో మునిగి పోయింది
  • గుజరాత్ ఓడిస్సా సముద్ర తీర రేఖల పొడవు ఎంత? గుజరాత్ తీర రేఖ పొడవు 2340.62 km, ఓడిసా తీరరేఖ పొడవు 574.71 km
  • భారతదేశ ప్రామాణిక రేకాంశం గా దేనిని గుర్తించారు? 82°30′ తూర్పు రేఖాంశాన్ని
  • 82°30′ తూర్పు రేఖాంశ0 ఏ ప్రాంతం మీదుగా పోతుంది? అలహాబాద్ మీదుగా
  • గ్రీనిచ్ మరియు భారత ప్రామాణిక కాలానికి మధ్య వ్యత్యాసం ఎంత? 5 గంటల 30 నిమిషాలు
  • భారతదేశం తూర్పు పడమర లుగా ఎంత దూరం విస్తరించి ఉంది? 2933 కిమీ లు
  • భారతదేశం ఉత్తర దక్షినాలు గా ఎంత దూరం విస్తరించి ఉంది? 3214 కిమీ

భూగర్భ నేపథ్యం

  • ప్రపంచ భూ భాగం 2 ప్రధాన ఖండాలు గా ఏర్పడ్డాయి అవి ఏవి? అంగరా భూమి (లరేశియా). గొండ్వానా

(భారత భూ భాగం గొండ్వానా భూ భాగం లో ఉంది)

  • గొండ్వానా భూ భాగం ఎప్పుడు ముక్కలు గా విడిపోయింది? 20 కోట్ల సంవత్సరాల క్రితం
  • భారత ద్వీపకల్ప ఫలకం ఏ దిశగా పయనించి యురేషియా ఫలకం (అంగరా భూమి) తో డీ కోట్టింది ? ఈశాన్యంగా పయనించి (ఇలా ఒత్తిడి ముడుతలు పడే ప్రక్రియ వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి)
  • భారతదేశం లో ఉత్తర సమతల మైదానాలు ఎలా ఏర్పడ్డాయి (India Relief Features)? ద్వీపకల్ప పీటభూమి అంచులు పగలడం వల్ల పెద్ద లోయ ఏర్పడింది. ఈ లోయలోకి ఉత్తరాది నుండి హిమాలయ నదులు, దక్షిణాది నుండి ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రు తో మేటలు వేయబడి మైదానాలు ఏర్పడ్డాయి.

India Relief Features (ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు)

  • భారత దేశాన్ని ఎన్ని భౌతిక స్వరూపాలు గా (India Relief Features) విభజించారు? 6 (హిమాలయాలు, గంగా సింధు మైదానం, ద్వీపకల్ప పీటభూమి, తీరప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం, దీవులు)

హిమాలయాలు

  • హిమాలయాలు ఎన్ని కిమీ పొడవుతో విస్తరించి ఉన్నాయి (India Relief Features) ? 2400 కిమీ పొడవుతో (ప. ప్రాంతం లో 500 కిమీ వెడల్పుతో, మధ్య తూర్పు ప్రాంతాలలో 200 కిమీ వెడల్పుతో ఉన్నాయి)

హిమాద్రి

  • హిమాలయాలలో అన్నిటికన్నా ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఏ పేరుతో పిలుస్తారు? హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు అని (పర్వతాల సగటు ఎత్తు సముద్ర మాట్టం నుండి 6100 మీటర్లు)

మిమాచల్

  • మధ్య హిమాలయాలకు గల పేరు? హిమాచల్, నిమ్న హిమాలయాలు
  • మధ్య హిమాలయాలు వేటి వేటి మధ్య ఏర్పడ్డాయి? శివాలిక్ శ్రేణులు, ఉత్తరాన ఉన్నత హిమాలయాల మధ్య (వీటి ఎత్తు 3500 నుండి 4500 మీటర్లు, వెడల్పు 60-80 కిమీ. చాలా పర్వతాలు 5050 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్నాయి)
  • మాక్ డొక్ డింపెప్ లోయ ఎక్కడ ఉంది? మేఘాలయ లో
  • మధ్య హిమాలయాలలో ముఖ్య పర్వత శ్రేణులుకు ఉదా? పీర్ పంజాల్, దౌల్ దార్, ముస్సోరీ, నాగ్ తిబా, మహా భారత లేక్
  • మధ్య హిమాలయాలలో పొడవైన పర్వతశ్రేణి? పీర్ పంజాల్ (కాశ్మీర్ లో) హిమాలయాల ద. భాగాన ఉంది
  •  కాశ్మీర్ లోయ ఏయే పర్వతశ్రేణుల మధ్య ఉంది (పీర్ పంజాల్ మరియు జస్కర్ శ్రేణుల మధ్య)
  • కాశ్మీర్ లోయ పొడవు ఎంత? 135 కిమీ (వెడల్పు 40 కిమీ, వైశాల్యం 4921 చ కిమీ) ఆగ్నేయం నుండి వాయవ్య దిశగా వ్యాపించి ఉంది.
  • కాశ్మీర్ లోయ సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? 1585 మీటర్ల సగటు ఎత్తులో
  • మధ్య హిమాలయాలకు తూర్పున ఉన్న శ్రేణులు? ముస్సోరీ మరియు నాగ్ తిబా
  • ముసోరి శ్రేణి ఎత్తు ఎంత? 2వేలు – 2వేల 600 మీటర్లు (పొడవు 120 కిమీ. ముస్సోరీ నుండి లాన్స్ డౌన్ మధ్య విస్తరించి ఉంది.
  • మధ్య హిమాలయాలలో వేసవి విశ్రాంతి స్థావరాలు? ముస్సోరీ, నైనిటాల్, చక్రాటా & రానిఖేట్, సిమ్లా, డార్జిలింగ్, ఆల్మోరా (సముద్ర మట్టం నుండి 1500-2000 మీటర్ల ఎత్తులో ఉన్నాయి)

శివాలిక్ శ్రేణులు

  • శివాలిక్ శ్రేణులకు గల మరొక పేరు? బాహ్య హిమాలయాలు (బాహ్య శ్రేణులు కలిగి ఉన్నందున ఆ పేరు)
  • శివాలిక్ శ్రేణి నిటారైన ఉత్తర వాలు కలిగి ఏవిధంగా కనిపిస్తుంది? హాగ్ బ్యాక్ గా
  • శివాలిక శ్రేణి పొడవు? 2400 కిమీ (పోట్వార్ పీటభూమి నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు వ్యాపించి ఉంది)
  • శివాలిక శ్రేణి వెడల్పు? హిమాచల్ ప్రదేశ్ లో 50 కిమీ, అరుణాచల్ ప్రదేశ్ లో 15 కిమీ కన్నా తక్కువగా
  • శివాలిక్ శ్రేణులు ఏ నదీ లోయతో విస్తరించ బడ్డాయి? తీస్తా నదీ లోయతో (ఈ శ్రేణులు ఎత్తు 600 నుండి 1500 మీటర్ల మధ్య )
  • శివాలిక్ శ్రేణుల సరస్సులు ఎండిపోయి మైదానాలుగా ఏర్పడ్డాయి వాటికి గల పేరు? పశ్చిమాన డూన్స్, తూర్పున డౌర్స్ అని పిలువబడుతున్నాయి (ఉదా: డెహ్ర డూన్)
  • డెహ్ర డూన్ ఎక్కడ ఉంది? ఉత్తరాంచల్ లో (75 కిమీ పొడవు, 15-20 కిమీ వెడల్పు తో)
  • హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా ఉన్న లోయ బ్రహ్మపుత్ర లోయ
  • దిహంగ్ లోయ ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్ లో
  • హిమాలయాలు ఏ ప్రాంతం లో జడ పిన్ను వంపు తిరిగి దక్షిణానికి విస్తరించి ఉన్నాయి? దిహంగ్ లోయ తరువాత
  • తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలకు గల పేరు? పూర్వాంచల్
  • పూర్వాంచల్ పర్వతాలు వేటితో ఏర్పడ్డాయి? అవక్షేప శిలలు, ఇసుక తో
  • ప్రాంతీయంగా పూర్వాంచల్ పర్వతాలకు గల పేరు? పాట్ కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపురి కొండలు, ఖాసి కొండలు, మిజో కొండలు
కొండలువిస్తరించిన రాష్ట్రాలు
పూర్వాంచల్అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరాం
పాట్ కాయ్ కొండలుఅరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ (భారత్ మయన్మార్ సరిహద్దు ప్రాంతం)
నాగా కొండలునాగాలాండ్
మణిపురి కొండలుమణిపూర్

గంగా సింధు మైదానం

  • విశాల ఉత్తర మైదానం ఏ నదుల వల్ల ఏర్పడింది? గంగా, సింధూ, బ్రహ్మపుత్ర నదులవల్ల
  • గంగా సిందు మైదానాన్ని ఎన్ని ప్రధాన భాగాలు గా విభజించారు? 3 (పశ్చిమ భాగం, మధ్య భాగం, తూర్పు భాగం)
  • గంగ సింధు మైదానం యొక్క పశ్చిమ భాగం ఏ నదులతో ఏర్పడింది? సింధు, దాని ఉపనదులతో
  • సింధు నది ఉపనదులు ఏవి? జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లైజ్
  • సింధు నది పరివాహక ప్రాంత అధిక భాగం ఎక్కడ ఉంది? పాకిస్తాన్ లో
  • అంతర్వేది అనగా? 2 నదుల మధ్య ప్రాంతం
  • గంగ సింధు మైదానం యొక్క ఏ భాగం లో సారవంతమైన అంతర్వేదులు (దో అబ్) అత్యధికంగా ఉన్నాయి? పశ్చిమ భాగం లో
  • గంగ సింధు మైదాన మధ్య భాగానికి గల పేరు? గంగా మైదానం (గగ్గర్ నుండి తీస్తా వరకు విస్తరించి ఉంది)
  • గంగా మైదానం లో ప్రవహించు నదులు? గంగా, యమునా, వాటి ఉపనదులు సొన్, కోసి వంటివి
  • గంగా మైదానం లో ప్రధానంగా ఏ ప్రాంతాలు ఉన్నాయి? ఉత్తర ప్రదేశ్, బీహార్, కొంత హర్యానా, జార్ఖండ్, ప. బెంగాల్
  • గంగా సింధు మైదాన తూర్పు భాగం ఎక్కడ ఉంది? అసోం లోని బ్రహ్మపుత్ర లోయలో (బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడినది)
  • శివాలిక్ పాద బాగం లో 8-16 కిమీ సన్నటి మేఖలుగా గులక రాళ్ళతో నిక్షేపనం చేయబడిన భూ భాగానికి గల పేరు? బాబర్ (వీటి క్రింద నదులు వాగులు ప్రవహించి దిగువ ప్రాంతం లో బయటకు వస్తాయి)
  • టెరాయి అనగా? చిత్తడి నేలలు

ద్వీపకల్ప పీటభూమి

  • భారత దేశ పీటభూమి కి ద్వీపకల్ప పీటభూమి అని పేరు ఎందుకు వచ్చింది? భారత పీటభూమి కి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి
  • ద్వీపకల్ప పీటభూమి దక్షిణ అంచు? కన్యాకుమారి (పడమరి అంచుగా పడమటి కనుమలు, తూర్పు అంచుగా తూర్పు కనుమలు ఉన్నాయి)
  • ద్వీపకల్ప పీటభూమి ప్రధాన భాగాలు? 2 (మాళ్వా పీటభూమి, దక్కన్ పీటభూమి)
  • మాళ్వా పీటభూమికి దక్కన్ పీటభూమి కి సరిహద్దుగా ఉన్న స్వరూపాలు? వింధ్య శ్రేణులు
  • మాళ్వా పీటభూమి కి తూర్పు వైపున ఉన్న పీటభూమి? చోటా నాగపూర్ పీటభూమి
  • ఖనిజ వనరులు సమృద్ది గా ఉన్న పీటభూమి? చోటా నాగపూర్ పీటభూమి
  • దక్కన్ పీటభూమి యొక్క ఆకారం? త్రిభుజాకారం
  • దక్కన్ పీటభూమికి ఉత్తర సరిహద్ధుగా ఉన్న పర్వతాలు? సాత్పూరా పర్వతాలు
  • దక్కన్ పీటభూమి సరిహద్దులు
    • ఉత్తర సరిహద్దు గా         : సాత్పురా పర్వతాలు
    • తూర్పు హరిహద్దు గా      : మహాదేవ్, కైమూర్ పర్వతాలు, తూర్పు కనుమలు
    • పశ్చిమ సరిహద్దుగా        : పచ్చిమ కనుమలు ఉన్నాయి
    • దక్షిణ సరి హద్దుగా         : నీలగిరి పర్వతాలు ఉన్నాయి
  • పడమటి కనుమలు
    • తూర్పు కనుమల కంటే ఎత్తు ఎక్కువ
    • అవిచ్చిన్నత శ్రేణులు గా ఉండి తీర మైదానాలకు ప్రవేశ ద్వారంగా ఉన్నాయి
    • పొడవు 1600 కిమీ
    • గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలను కలుస్తాయి
    • ఎత్తు 2000 మీటర్లు
    • కొండలు: పళని (తమిళనాడు), అన్నామలై, కార్దమం కొండలు (కేరళ)
  • దక్కన్ పీటభూమి ఎటువైపు నుండి ఎటువైపు కు వాలి ఉంది? పడమర నుండి తూర్పు కు
  • నీలగిరి పర్వతాలలో ప్రఖ్యాతి గాంచిన వేసవి విడిది ? ఊటి (ఉదగమండలం)
  • నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం? దొడబెట్ట (2637 మీటర్లు ఎత్తు)
  • అన్నామలై కొండలలో ఎత్తైన శిఖరం? అనై ముడి (2695 మీటర్లు)
  • తూర్పు కనుమలు
    • ఉత్తరాన మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు విస్తరించి ఉన్నాయి
    • విచ్చిన్న శ్రేణులు
    • సగటు ఎత్తు 900 మీటర్లు
    • ఎత్తైన శిఖరం అరోమా కొండ (చింతపల్లి ఆంధ్ర ప్రదేశ్)
    • అరోమా కొండ ఎత్తు 1680 మీటర్లు
    • భాగాలు : నల్లమల, వేలికొండ, పాలకొండ, శేషాచలం
  • అగ్ని పర్వత ప్రక్రియ వల్ల ఏర్పడిన నేలలు? నల్లరేగడి నేలలు

థార్ ఎడారి

  • ఆరావళి పర్వతాల వర్శచాయా ప్రాంతం లో ఉన్న ఎడారి? థార్ ఎడారి (వర్షపాతం 100-150 మిమి మధ్య)
  • థార్ ఎడారిలో ఉన్న ఒకే ఒక్క నది ? లూని (కాలువల నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సులలోనికే ప్రవహిస్తాయి. ఇలా ప్రవహించే వాటిని అంతస్తలీయ ప్రవాహం అంటారు)
  • దేశం లోనే అత్యంత పొడవైన కాలువ? ఇందిరా గాంధి కాలువ (650 కిమీ)
  • ఇందిరా గాంధి కాలువ ఎక్కడ ప్రారంభం అవుతుంది? పంజాబ్ నుండి (థార్ ఎడారికి నీళ్ళు అందిస్తుంది)

తీర మైదానాలు

  • పశ్చిమ తీర మైదానం ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటుంది? రాన్ అఫ్ కచ్ నుండి కన్యాకుమారి వరకు
  • పశ్చిమ తీర మైదానాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు? 3 ( కొంకన్ తీర ప్రాంతం, కెనరా తీర ప్రాంతం, మలబార్ తీరప్రాంతం)
  • కొంకన్ తీర ప్రాంతం ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉంది? మహారాష్ట్ర, గోవా (ఉత్తర భాగం)
  • కెనరా తీర ప్రాంతం ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉంది? కర్ణాటక (మధ్య భాగం)
  • మలబార్ తీరప్రాంతం ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉంది? కేరళ (దక్షిణ భాగం)
  • తూర్పు తీర మైదానం విస్తరణ? ఓడిసాలోని మహానది నుండి తమిళనాడు లోని కావేరి డెల్టా వరకు
  • తీర మైదానాలు వాటి పేర్లు
    • ఉత్కల్ తీరం (ఓడిసా)
    • సర్కార్ తీరం (ఆంధ్ర ప్రదేశ్)
    • కోరమండల్ తీరం (తమిళనాడు)
  • చిల్కా సరస్సు ఎక్కడ ఉంది? ఒరిసా లో
  • కొల్లేరు సరస్సు ఎక్కడ ఉంది? ఆంధ్ర ప్రదేశ్ లో

దీవులు

  • భారతదేశం లో దీవులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 (అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతం, లక్షదీవులు అరేబియా సముద్రం)
  • మయన్మార్ కొండలలో భాగము గా ఉన్న కొండలు? అండమాన్ నికోబార్ దీవులు
  • మయన్మార్ కొండలు ఎక్కడ ప్రారంభం అయ్యాయి? అర్కాన్ యోమా నుండి (సముద్రం లో మునిగి పైకి వచ్చిన శిఖర ప్రాంతాలే అండమాన్ దీవులు)
  • అండమాన్ నికోబార్ దీవులలో అగ్ని పర్వతాల వల్ల ఏర్పడిన దీవులు? నార్కొండా౦, బారెన్
  • భారతదేశ దక్షినాది అంచు ఎక్కడ కలదు (India Relief Features)? నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ దగ్గర (2004 సునామీలో ముంపుకు గురైనది)
  • లక్ష దీవులు ఎలా ఏర్పడ్డాయి? ప్రవాళ బిత్తికల నుండి
  • లక్షదీవుల విస్తీర్ణం? 32 చదరపు కిమీ
  • ఇటువంటి ఉపయోగకరమైన టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి kings dsc యు ట్యూబ్ ఛానల్ మరియు kingsdsc.in వెబ్సైట్

Leave a Comment