1.2 భూమి
The Earth Introduction (పరిచయం):

- ఖగోళ వస్తువులకు మరొక పేరు? సెలిస్టియాల్ బాడిస్
- సెలిస్టియాల్ బాడిస్ కు ఉదా? నక్షత్రాలు
- ప్రకాశవంతమైన ఖగోళ వస్తువులుకు ఉదా? నక్షత్రాలు
- నక్షత్రాల లక్షణం ? వేడిని కాంతిని విడుదల చేస్తాయి
- నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు ? నక్షత్ర రాసులు
- నక్షత్ర రాసులలో ప్రముఖ మైనది ? సప్తర్షి మండలం
- ధ్రువ నక్షత్రం (పోల్ స్టార్ ) ఏ దిక్కును సూచిస్తుంది ?ఉత్తర దిక్కును
- బిలియన్ ల నక్షత్రాల సమూహం పేరు? గెలాక్సీ
- మిలియన్ ల గెలాక్సీ లను ఏమంటారు? విశ్వం
- సౌర వ్యవస్థ అనగా? (సోలార్ సిష్టం ) నక్షత్రాలు, 8గ్రహాలూ ఉపగ్రహాలు కలిపి సౌర వ్యవస్థ గా పేర్కొంటారు
- ఉపగ్రహాలు ఎంత కాలం క్రితం ఏర్పాడ్డాయి ? 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం

The Evolution of Earth’s Formation (భూమి పుట్టుక పరిణామక్రమం):
- భూమి Earth పుట్టుక గూర్చి శాస్త్రీయ ఆలోచనలు ఎప్పుడు మొదలైనాయి ? 18 వ శతాబ్దం లో
- భూమి పుట్టుక గూర్చి మొదటి శాస్త్రీయ పరిశోధన చేసినది ఎవరు ? జార్డి డి బాఫన్
- జార్డి డి బాఫన్ ప్రకారం ఉప గ్రహాలూ ఏవిధంగా ఏర్పడ్డాయి ? పెద్ద తోకచుక్క భూమిని డీ కొట్టింది. ఆ ఘర్షణ వల్ల ఉపగ్రహాలు గా విడిపోయింది
- గ్యాసియాస్ మాస్ థియరీ ఎవరు ప్రతిపాదించారు ? ఇమ్మాన్యుయేల్ కాంట్
- ఇమ్మాన్యుయేల్ కాంట్ ఏ దేశస్తుడు ? జర్మని
- ఇమ్మాన్యుయేల్ కాంట్ ప్రకారం గ్రహాలూ ఎలా ఏర్పడ్డాయి ? ఆదిమ పదార్ధం రేణువుల రూపం లో గురుత్వాకర్షణ కారణంగా గురౌతుంది. ఘర్షణ కారణంగా ఉష్ణోగ్రత పెరిగి కాంతి విడుదల మొదలైనది. . కోణీయ వేగంవల్ల అపకేంద్ర బలం పెరిగి రింగుల రూపం లో తిరగడం ప్రారంభమైనది తరువాతి కాలంలో గ్రహాలూ ఉపగ్రహాలుగా పరిణామం చెందాయి. ఆదిమ పదార్ధం సూర్యునిగా మిగిలిపోయింది
- నేబ్యులర్ పరికల్పన ఎవరిది ? లాప్లస్
- లాప్లేస్ ఏ దేశ శాస్త్రవేత్త ? ఫ్రెంచ్
- నేబ్యులర్ పరికల్పన దేనిని గూర్చి వివరిస్తుంది ? సౌర వ్యవస్థ పుట్టుక గూర్చి తెలిపాడు
- నేబ్యులర్ పరికల్పన ప్రకారం ఆరంభ పదార్ధం ఎప్పుడు ఏర్పడింది ? 5-5.6 మిలియన్ సంవత్సరాల క్రితం
- నేబ్యులర్ పరికల్పన లో నేబ్యులర్ పదార్ధం ఎలా పరిగనించ బడుతుంది? సూర్యుడి గా
- బిగ్ బ్యాంగ్ థియరీ ఎవరు ప్రతిపాదించారు ? ఎడ్విన్ హబుల్ (1920లో )
- సౌర వ్యవస్థ లో గ్రహాలూ ఎన్ని ? 8
- 8 గ్రహాలను ఎన్ని వర్గాలు గా విభజించారు ? 2 (అంతర గ్రహాలూ, భాగ్య గ్రహాలూ )
- ప్లూటో గ్రహాన్ని డార్ఫ్ గ్రహంగా పరిగణించిన వారు ? అంతర్జాతీయ ఆస్ట్ర నామికల్ యునియన్ వారు
- ఫ్లూటో గ్రహాన్ని ఏ ఉపగ్రహం తో పోల్చారు? 2003 UB 313 తో
- సౌర వ్యవస్థ లో ఉప గ్రహాలూ ఎన్ని ? 63

Scientific Theories (సిద్దాంతాలు):
- అంతర గ్రాహాలు వేటి వేటి మధ్య ఉన్నాయి ? సూర్యుడు ఆస్ట్రరాయిడ్ మధ్య లో ఉన్నాయి
- అంతర గ్రహాలను భౌమ గ్రహాలూ అని ఎందుకు పిలుస్తారు ? శిలలతో కప్పబడి ఉండడం వల్ల
- అంతర గ్రహాలూ గా ఏ గ్రహాలను పేర్కొంటారు ? బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు
- భూమి సూర్యుని నుండి యెంత దూరం లో ఉంది ? 149.5 మిలియన్ కిమీ దూరం లో
- భూమధ్య రేఖ యొక్క వ్యాసార్ధం ? 6౩78 కిమీ
- భూ చలనాలు ఎన్ని ? 2 (భూ భ్రమణం, భూ పరిబ్రమనం)
- భూ భ్రమణం అనగా ? భూమి తన అక్షం పై తానూ తిరుగుట
- భూమి బ్రమణ౦ వేటిని ఆధార౦ చేసుకొని ఉంటుంది ? ఉ. ద ద్రువాలను ఆధారం చేసుకొని తిరుగుతుంది
- ఉత్తర బిందువుకు గల పేరు? ఉత్తర ధృవం (దక్షిణ బిందువును దక్షిణ ధృవం అంటారు)
- అక్షం అనగా? ధ్రువాలను కలుపుతూ భూ నాభి గుండా గీసిన ఊహారేఖ
- భూ బ్రమణ వేగం గంటకు ? 15 డిగ్రీలు (1 డిగ్రీ తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది )
- భూ బ్రమణ౦ నకు పట్టు సమయం ? 23 గంటల 56 నిమిషాల 4 సెకన్లు
- భూ బ్రమణం నకు గల మరొక పేరు ? దిన చలనం
- భూ బ్రమణ వేగం ? గంటకు 1700 కిమీ ( ధ్రువాల వైపుకు వెళ్ళే కొద్ది ఈ వేగం తగ్గుతుంది)
- ధ్రువాల వద్ద భూ బ్రమణ వేగం ఎలా ఉంటుంది ? సూన్యం
- 60 డిగ్రీల అక్షాంశం వద్ద భూ భ్రమణ వేగం ఎంత ? 850 కిమీ గంటకు
- భూ బ్రమణ దిశ? పశ్చిమం నుండి తూర్పుకు (అపసవ్య దిశలో)
- భూమధ్య రేఖ వద్ద అక్షాంశం పొడవు యెంత ? 40 వేల కిమీ కంటే ఎక్కువ
- భూ బ్రమణ వేగాన్ని వివరించేది ? ఫౌకల్ట్ పెండ్యులం
- ఫౌకల్ట్ పెండ్యులం ఎవరు తయారు చేసారు ? జీన్ బెర్న్ హార్డ్ లీన్ ఫౌకల్ట్
- జీన్ బెర్న్ హార్డ్ లీన్ ఫౌకల్ట్ ఏ దేశస్తుడు ? ఫ్రెంచి శాస్త్రవేత్త
- భూ బ్రమణ ప్రభావ ఫలితం? రాత్రి పగలు ఏర్పడడం, పవనాలు సముద్ర ప్రవాహ దిశలో మార్పు, అలల స్థానం లోమార్పు,తేదీల మార్పు
- పవనాల దిశ ? ఉ గోళం లో కుడి వైపుకు, దక్షిణార్ధ గోళం లో ఎడమ వైపుకు ఉంటుంది
- భూ పరిబ్రమణ౦ అనగా ? భూమి తన అక్షం పై తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం
- భూ పరిబ్రమణానికి మరొక పేరు ? ఉష్ణ మండల సంవత్సరం అని పిలుస్తారు
- భూ పరిబ్రమణానికి పట్టు సమయం ? 365 1/4 రోజులు
- లీపు సంవత్సరం లో రోజులు ఎన్ని ? 366 (ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి)
- లీపు సంవత్సరం ఎన్ని సంవత్సరాలకు ఒక సారి వస్తుంది ? 4 సంవత్సరాలకు
- కక్ష్య యొక్క ఆకారం ? దీర్ఘ వృత్తాకారం
- భూ కక్ష్య ఎప్పుడు దేనిని సూచిస్తుంది ? ధ్రువ నక్షత్రాన్ని
- భూ కక్ష్య సూర్యునికి ఎన్ని డిగ్రీల కోణం లో ఉంటుంది? 90 డిగ్రీల కోణం లో
- సూర్యుడు భూమి మధ్య అత్యధిక దూరం ? అపహేళి
- అపహేళి సమయం లో సూర్యుడు భూమి మధ్య దూరం? 150.5 మి కిమీ (93 మి మైళ్ళు)
- అపహేళి ఏ రోజున సంభవిస్తుంది ? జులై 4 న
- అపహేళి అనే పదం ఏ పదాల నుండి ఉద్భవించింది ? ఎపి మరియు హేలియో (గ్రీకు పదాలు )
- ఎపి అనగా అర్ధం ? దూరం
- హేలియో అనగా అర్ధం ? సూర్యుడు
- సూర్యుడు భూమి మధ్య అత్యల్ప దూరాన్ని ఏ పేరుతొ పిలుస్తారు ? పరిహేలి
- పరిహేలి ఏ రోజున సంభవిస్తుంది ? జనవరి 3న
- పరిహేలి సమయం లో సూర్యుడు భూమి మధ్య దూరం ? 147.5 మి కిమీ
- పరిహేలి అనే పదం ఏ 2 పదాల నుండి ఉద్భవించింది ? పెరి మరియు హేలియో (గ్రీకు పదాలు)
- పెరి అనగా ? దగ్గర
- హేలియో అనగా ? సూర్యుడు
- భూమి తన అక్షం పై ఎన్ని డిగ్రీలు వాలి ఉంది ? 23 1/2 డిగ్రీలు వాలి ఉంది
- భూఅక్షానికి క్రాంతి వ్రుత సమతలం మధ్య కోణం ఎన్ని డిగ్రీలు ? 66 1/2 డిగ్రీలు
- రాత్రి పగలు సమానంగా ఉన్న రోజులును ఎలా వర్ణిస్తారు ? విషవత్తులు
- సూర్యకిరణాలు నిటారుగా భూమధ్య రేఖపై ఎప్పుడు పడతాయి ? మార్చ్ 20/21, సెప్టెంబర్ 22/23
- వసంతకాల విషవత్తు కాలం ? మార్చ్ 20. 21
- శరత్ కాల విషవత్తు కాలం ? సెప్టెంబర్ 22/23
- ఏ 2 రోజులలో రాత్రి పగలు సమానంగా ఉంటాయి ? మార్చ్ 20/21, సెప్టెంబర్ 22/23
- ఉత్తరాయనాంత కాలం ? జూన్ 20/21
- సూర్య కిరణాలు కర్కట రేఖపై నిటారుగా ఎప్పుడు పడతాయి ? జూన్ 20/21
- ఉత్తర ఆయనంత కాలం లో భూ అక్షం ఎన్ని డిగ్రీలు వాలి ఉంటుంది? 23 1/2 డిగ్రీల వరకు తూర్పు దిశలో వాలి ఉంటుంది
- దక్షిణాయనాంతం కాలం ? డిసెంబర్ 21/22
- భూ పరిబ్రమణ సమయం లో భూమి ఎన్ని సార్లు సూర్యుని వైపు వాలి ఉంటుంది ? 2 సార్లు (ఉ వైపు ఒకసారి ద వైపు ఒక సారిసూర్యుని వైపు వాలి ఉంటుంది)
- భూ పరిబ్రమణ ప్రభావ ఫలితం ? ఋతు సీజన్ లలో మార్పులు, రోజులు రాత్రి సమయాలలో మార్పులు, పవన మేఖలలో మార్పులు సంబవిస్తాయి
- సూర్య కిరణాలు ఎక్కడ ఒంపు కలిగి ఉంటాయి ? దక్షిణార్ధ గోళం లో
- అక్షాంశాలు అనేవి ? తూర్పు పడమర దిశలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలు (ఇవి వృత్తాలు)
- అతిపెద్ద వృత్తం ? భూమధ్య రేఖ (0 డిగ్రీల అక్షాంశం)
- అక్షాంశానికి అక్షాంశానికి మధ్య దూరం భూమధ్య రేఖ వద్ద ? 110.6 కిమీ
- అక్షాంశానికి అక్షాంశానికి మధ్య దూరం ధ్రువాల వద్ద ? 117.7 కిమీ (భూమధ్య రేఖవడ్డ కంటే 1% పొడవు ఎక్కువ)
- గ్లోబు పై ఎన్ని అక్షాంశాలు గీయవచ్చు ? అనంతం
- అక్షాంశాల మొత్తం ? 181 (ఒక భూమధ్య రేఖ + 90 ఉ. అక్షాంశాలు + 90 దక్షిణ అక్షాంశాలు)
- రేఖాంశాలు అనేవి? ఉ ద ధ్రువాలను కలుపుతూ భూమధ్య రేఖను కండిస్తూ గీసిన ఊహారేఖలు (గ్రేట్ సర్కిల్ లో సగ భాగం ఉంటాయి)
- రేఖాంశాలుకు గల పేర్లు ? అర్ధ వృత్తాలు, మధ్యాహ్న రేఖలు
- భూమధ్య రేఖ గుండా ఎన్ని అర్ధ వృత్తాలు గీయవచ్చు ? 360 (మొత్తం రేఖాంశాలు)
- ఒక రేఖాంశం____ ? బృహత్ వృత్తం లో సగ భాగం మాత్రమే (180 డిగ్రీలు)
- గ్రీనిచ్ రేఖ ఏ ప్రాంతం మీదుగా పోతుంది ? లండన్ లో ఖగోళ పరిశోధనా కేంద్రం
- 0 డిగ్రీలు రేఖాంశానికి గల పేరు ? గ్రీనిచ్ రేఖ
- గ్రీనిచ్ రేఖ నుండి తూర్పుకు వెళ్ళేటపుడు 1 డిగ్రీకి ఎంత సమయం కలుపుకోవాలి ? 1 డిగ్రీకి 4 నిముషాలు కలుపుకోవాలి
- రేఖాంశం పొడవు భూమధ్య రేఖ వద్ద? 111 కిమీ (69 మైళ్ళు)
- రేఖాంశం పొడవు 60 డిగ్రీల వద్ద? 55.5 కిమీ (34.5 మైళ్ళు)
- ఉదయం మధ్యాహ్నాలను విడదీసే రేఖాంశం ? మధ్యాహ్న రేఖాంశం (సూర్యకిరణాలు నిటారుగా పడే సమయం)
- అర్ధ రాత్రి రేఖాంశం అనగా ?మధ్యాహ్న రేఖాంశానికి వ్యతిరేఖంగా ఉన్నదానిని అర్ధరాత్రి రేఖాంశం అని పిలుస్తారు (ప్రస్తుత రోజు మరుసటి రోజులను విడదీస్తుంది)
- మధ్యాహ్నం అర్ధరాత్రి రేఖాంశాలు ఏ దిశలో వంగి ఉంటాయి ? పశ్చిమం వైపు వంగి ఉంటాయి
- స్థానిక కాలమానం అనగా ? సూర్యుడు నడినెత్తిన ప్రకాసిస్తున్నప్పుడు మధ్యాహ్నం 12గంటలు గా గల కాలం (ప్రతి డిగ్రీకి 4 నిమిషాల చెప్పున మారుతుంది)
- ప్రామాణిక కాలానికి ఉదా ? ప్రపంచం లో గ్రీనిచ్ కాలాన్ని ప్రామాణిక కాలం గా వాడుతున్నారు GMT
- మనదేశం లో ప్రామాణిక రేఖాంశం ? 82 1/2 డిగ్రీల తూ రేఖాంశాన్ని IST
- 82 1/2 డిగ్రీల తూ రేఖాంశ౦ మన రాష్ట్రము లో ఏ ప్రాంతం గుండా పోతుంది? కాకినాడ గుండా పోతుంది
- IST కి GMT కి మధ్య కాల వ్యత్సాసం? 5 1/2 గంటలు
- అంతర్జాతీయ దినరేఖను ఎప్పుడు గుర్తించారు ? 1884 ఇంటర్ నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్ లో (వాషింగ్ టన్ డిసి లో)
- అంతర్జాతీయ దిన రేఖ ఎన్ని డిగ్రీలు ? 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం
- ఆసియా వైపు సోమవారం ఐతే అమెరికా వైపు ఏ వారం ఉంటుంది ? ఆదివారం అవుతుంది
- అంతర్జాతీయ దినరేఖ నుండి ప వైపు పయనిస్తే ప్రతి 15 డిగ్రీలకు యెంత సమయం తగ్గిపోతుంది? ఒక గంట సమయం తగ్గిపోతుంది
- ఒక వ్యక్తీ ఆదివారం సాయంత్రం గ్రీనిచ్ నుండి బయలుదేరితే 179 డిగ్రీల రేఖాంశం చేరే సరికి ఏ సమయం అవుతుంది ? ఆదివారం సాయంత్రం 5 గంటల 56నిమిషాలు అవుతుంది
- అంతర్జాతీయ దినరేఖకు ఒక వైపు ఆదివారం అయితే మరొక వైపు ఏ వారం ఉంటుంది ? సోమ వారం
- అంతర్జాతీయ దినరేఖ చాలా వరకు ఏ ప్రాంతం మీదుగా పోతుంది ? పసిఫిక్ సముద్రం మీదుగా పోతుంది
- భూమి యొక్క వ్యాసార్ధం? 6౩7౦ కిమీ
- అంతర్నిర్మాణ౦ గూర్చి పరిశోధన చేసిన వారిలో ముఖ్యులు? ఆర్ధర్ హోమ్స్. స్యూస్, వెండర్ గ్రాచ్, కన్రాద్
- అంతర్నిర్మాణ౦ గూర్చి తెలుసుకొనే ప్రత్యక్ష ఆధారాలు ? శిలలు, డ్రిల్లు, అగ్నిపర్వత విస్పోటనం
- భూ అంతర్నిర్మాణ౦ తెలుసుకొనే ఉష్ణోగ్రత, పీడనం, సాంద్రత లు ఏ కోవలోకి వస్తాయి? పరోక్ష ఆధారాల కోవలోకి
- అత్యంత లోతైన డ్రిల్లు ఎక్కడ కనుగొనబడినది ? ఆర్కిటిక్ సముద్రం లో కనుగొన్నారు (12 కిమీ లోతు)
- అగ్నిపర్వత విస్పోటనం వల్ల ఏమి తెలుసుకోవచ్చు ? భూ అంతర్నిర్మాణ తెలుగు కోవడానికి ఉపయోగపడుతుంది
- భూమి లోపలికి పోయెకొద్దీ ఉష్ణోగ్రత ఏ విధంగా పెరుగుతుంది? ప్రతి 32 మి కి 1డిగ్రీ సెంటిగ్రేడ్ చెప్పున
- భూమి లోపలికి పోయెకొద్దీ ఉష్ణోగ్రత 100 కిమీ వరకు ఏ విధంగా పెరుగుతుంది ? ప్రతి కిమీ కి 12 డిగ్రీలు చెప్పున
- భూమి లోపలికి పోయెకొద్దీ ఉష్ణోగ్రత 100-300 కిమీ మధ్య ఏ విధంగా పెరుగుతుంది ? కిమీ కి 2 డిగ్రీల చెప్పున పెరుగుతుంది
- భూమి లోపలికి పోయెకొద్దీ ఉష్ణోగ్రత 300-6400 కిమీ మధ్య ఏ విధంగా పెరుగుతుంది ? కిమీ కి 1డిగ్రీ సెంటిగ్రేడ్ చెప్పున పెరుగుతుంది
- భూమి లోపలికి పోయెకొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది అని వేటిద్వారా తెలుస్తుంది ? లావా, గీసర్లు ద్వారా
- భూ కేంద్రం లో ఉష్ణోగ్రతలు? 2-6 వేలు డిగ్రీలు ఉంటాయి అని అంచనా
- ద ఆఫ్రికా లో బంగారు గనులు యెంత లోతులో ఉంటాయి ? 3-4 కిమీ లోతులో
- భూ కేంద్రం లో శిలలు ఏ రూపం లో ఉంటాయి ? ద్రవ రూపం లో (6400 కిమీ లోతులో)
- పీడనం అనగా ? ప్రమాణ వైశాల్యం ఉన్న ప్రదేశం పై పనిచేస్తున్న ఒత్తిడి
- భూమిలోపల ఉండే పీడనం కొలవడానికి వేటిని ఉపయోగిస్తారు ? Atmospheric Units (వాతావరణ యూనిట్స్)
- ఒక వాతావరణ యూనిట్ ఎన్ని చ. సెం మీ కు సమానం ? 14.7 lbs / చ సెం మి కి సమానం
- భూ విజ్ఞాన శాస్త్ర ప్రాధమిక సూత్రం ? నొన్ టు అన్ నొన్
- భూ లోపలి వెళ్లేకొద్ది పీడనం ____? పెరుగుతుంది (సాంద్రత కూడా పెరుగుతుంది)
- సాంద్రత అనగా ? అనగా ఘనపరిమాణం లో ఉన్న ద్రవ్యరాశి
- భూ ఉపరితలం పై అత్యధికంగా ఉన్న శిలలు ? అగ్ని శిలలు, అవక్షేప శిలలు
- అగ్ని శిలలు, అవక్షేప శిలలు సాంద్రత ? సాంద్రత 2.7-2.9
- బసాల్ట్ శిలసముద్ర సాంద్రత ? 3.0-3.5
- సాంద్రతను దేనితో కొలుస్తారు ? క్యూబిక్ సెంటి మీటర్ కు గ్రాములలో వ్యక్త పరుస్తారు
- కే ఇ బుల్లెన్ ఏ దేశస్తుడు? ఆస్ట్రేలియా (భూ భౌతిక శాస్త్రవేత్త)
- కే ఇ బుల్లెన్ వేటి ఆదరంగా లోతును ఒక అక్షాంశం పై సాంద్రత ను ఒక అక్షాంశం పై తీసుకొని గ్రాఫ్ గీసాడు? భూ కంప సమాచారం ఆధారంగా
- కే ఇ బుల్లెన్ ప్రకారం 500 కిమీ ల లోతులో సాంద్రత? 3.5 (1000 కిమీ లోతులో 5.5 గా ఉంటుంది)
- కే ఇ బుల్లెన్ ప్రకారం 2900 దాటగానే సాంద్రత ఎంత ? 10.2 (5000 కిమీ లోతులో 12.2 గా ఉంటుంది)
- భూ కేంద్ర౦ వేటితో ఏర్పడింది? ఇనుము నికెల్ మిశ్రమ౦ తో
- భూ కేంద్ర సాంద్రత ? 17 ఉంటుంది అని అంచనా
- శాస్త్రజ్ఞుల ప్రకారం భూగోళ సగటు సాంద్రత? 5.5 (భూ పటల సాంద్రత 2.5-2.9, ప్రావారం సాంద్రత 2.9-4.7, బాహ్యకేంద్ర సాంద్రత 11-12, భూ కేంద్ర సాంద్రత 17)
- భూ అంతర్నిమానం గూర్చి అధికారికంగా వేటి ద్వారా తెలుస్తుంది? భూకంప శాస్త్రం ద్వారా (Seismology)
- భూకంప తరంగాలను అధ్యయనం చేయు శాస్త్రం ? భూకంప శాస్త్రం ద్వారా (Seismology)
- భూ కంప తరంగాలు వేటి ద్వారా నమోదు చేయబడతాయి ? భూకంప లేఖిని ద్వారా
- భూకంపం ద్వారా జరిగిన సంఘటనలు వేటి ఆధారంగా కొలుస్తారు? భూకంప తీవ్రత ఆధారంగా కొలుస్తారు
- భూ కంప శక్తి అనగా ? భూకంపం సంభవించినపుడు విడుదలయ్యే శక్తి
- భూకంపం సంభవించినపుడు విడుదలయ్యే శక్తిని ఈ రూపం లో కొలుస్తారు? 0-10 అంకెల మధ్య
- మెర్కలి స్కేలు రూపొందించిన వారు ? మెర్కలి (ఇటలి భూకంప శాస్త్ర వేత్త)
- మెర్కలి స్కేలులో తీవ్రత వేటి మధ్య ఉంటుంది? 1-12 అంకెల మధ్య
- నాభి అనగా ? భూకంపం సంభవించిన ప్రదేశం (భూమి లోపల ఉంటుంది)
- తరంగాలు ఎచట నుండి ప్రారంభం అవుతాయి? భూకంప నాభి నుండి
- శరీర తరంగాలుకు మరొక పేరు ? ఉపరితల తరంగాలు అని పేరు (ఇవి ఉపరితలం పై శిలలతో సంఘర్షించి కొత్త తరంగాలు సృష్టిస్తాయి)
- ఉపరితల తరంగాలుకు మరొక పేరు? దీర్ఘకాల తరంగాలు, L తరంగాలు
- L తరంగాలు వేగం ? PS తరంగాల కంటే తక్కువ వేగం కలిగి ఉంటాయి
- తరంగ వేగం కలిగి ఉంటాయి వేటిపై ఆధారపడి ఉంటుంది ? సాంద్రత మీద
- ప్రాధమిక తరంగాలు ఏవి? P తరంగాలు (వేగంగా కదిలి భూ ఉపరితలం మొదట చేరుకొంటాయి)
- P తరంగాలుకు మరొక పేరు? Longitudinal Waves అంటారు
- P తరంగాలుకు వేటి గుండా పయనిస్తాయి ? ఘన ద్రవ వాయు పదార్ధాల గుండా ప్రయాణిస్తాయి
- P తరంగాల వేగం వేటిపై ఆధారపడి ఉంటుంది ? సాంద్రత పై
- ద్వితీయ తరంగాలుకు ఉదా? S తరంగాలు
- S తరంగాలు వేటిని పోలి ఉంటాయి ? తిర్యక్ తరంగాలను పోలి ఉంటాయి (ఘన పదార్ధాల గుండా పయనిస్తాయి)
- S తరంగాల ఛాయా ప్రాంతం ఏ డిగ్రీల మధ్య ఉంటుంది? (105-180 డిగ్రీల మధ్య)
- S తరంగాల వల్ల ఉపయోగం ? అంతర్భాగం తెలుసుకోవడానికి
- S తరంగాల ద్వారా వేటిని గుర్తించ వచ్చు ? బాహ్య ప్రావారం, బాహ్య కేంద్రం, అంతర కేంద్రం
- బాహ్య కేంద్రం ద్రవ పదార్ధం లో ఉందనితెలిపిన శాస్త్రవేత్త ? రిచర్డ్ డిక్సన్ ఒల్డం (19౦6 లో)
- నాభినుండి భూ ఉపరితలానికి నిటారుగా దగ్గరలో ఉన్న బిందువు? అధికేంద్రం (భూమి మీద ఉంటుంది)
- భూకంపాలను వాటి పుట్టుక ఆధారంగా ఎన్ని వర్గాలుగా విభజించారు? 5 (అగ్నిపర్వత, టెక్టనిక్, పతనం చెందించే, ప్రేలుడు, రిజర్వాయర్ ప్రేరిత భూకంపాలు)
- క్రాకటోవా విస్పోటనం ఏరకమైన భూకంపాలకు ఉదా ? అగ్ని పర్వత భూకంపాలు ( భూకంప తరంగాలు 12874 కిమీ ప్రయాణించాయి) 1883 లో
- టెక్టనిక్ ఏ భాష పదం ? గ్రీకు భాషాపదం
- టెక్టనిక్ అనగా అర్ధం ? నిర్మించు
- టెక్టనిక్ భూకంపానికి ఉదా ? బీహార్ భూకంప౦ (1934), అస్సాం భూకంపం (1950)
- భూగర్భ గనులు ఉపరితలం పతనం చెంది ఏర్పడిన భూకంపాలు? పతనం చెందించే భూకంపాలు
- ప్రేలుడు సంభవించి నపుడు ఏర్పడే భూకంపాలు ? ప్రేలుడు భూ కంపాలు
- పెద్ద జలాశయాలు నిర్మించడం వల్ల ఏర్పడే భూ కంపాలు ? రిజర్వాయర్ ప్రేరిత భూకంపాలు
- అధికేంద్రం కింది భాగం లో భూకంప పరిమాణం ఎక్కువగా ఉన్నట్లయితే ఏది సంభవిస్తుంది ? సునామి
- భూ అంతర్నిర్మానాన్ని ఎన్ని భాగాలుగా విభజించ వచ్చు ? 3 (పటలం, ప్రావారం, కేంద్రం)
- భూ అంతర్నిర్మాణ భాగాలలో అత్యంత ఘనమైన భాగం ? పటలం
- భూ పటల సగటు సాంద్రత ? 2.79 గ్రా / ఘ సెం.మీ
- భూ పటల మందం ? ఖండం పై ౩౦ కిమీ, సముద్రం పై 5 కిమీ
- భారీ రాళ్ళతో ఏర్పడే భూ అంతర్నిర్మాణ భాగం? భూ పటలం
- భూ పటలం క్రింది భాగం ? ప్రావారం
- పటలానికి బాహ్య ప్రవారానికి మధ్య గల భాగం ? మొహరోవిక్/మోహో
- ప్రావారం మోహో నుండి ఎంత లోతులో ఉంటుంది ? మోహో నుండి 29౦౦ కిమీ లోతువరకు ఉంటుంది
- ప్రావారం పైన ప్రాంతం ఏ పేరుతొ పిలువా బడుతుంది? ఎస్తనోస్పియర్
- ఎస్తనోస్పియర్ పొరకు గల పేర్లు? ప్లాస్టిక్ పొర, సౌకర్యవంత పొరగా పరిగనించ బడినది
- విస్పొటన సమయం లో మాగ్మా రావడానికి ప్రధాన మూలంగా పనిచేసే ప్రావార భాగం? ఎస్తనోస్పియర్
- ఎస్తనోస్పియర్ యొక్క సాంద్రత ? 3.4 గ్రా/ఘ సెం మీ
- పటలం బాహ్య ప్రావారం 2 కలిపి ఏ పేరుతో పిలువ బడ్డాయి ? శిలవరణం అంటారు
- ఎస్తనో స్పియర్ కంటే ఎక్కువ సాంద్రత కలిగి ఉండేది? శిలావరణం
- అంతర ప్రావారం నుండి భూ కేంద్రం ఎన్ని కిమీ లోతు వ్యాపించి ఉంది ? 6౩71 కిమీ లోతు
- భూ కేంద్రం లో భాగాలు ? బాహ్య కేంద్రం (2900-5150 కిమీ), అంతర కేంద్రం (5150-6371 కిమీ)
- భూ కేంద్ర సగటు సాంద్రత? 1.3 గ్రా / ఘ సెం మీ
- భూ కేంద్రం వేటి మిశ్రమం తో ఏర్పడింది ? నికెల్ ఫెర్రాస్ (నిఫే)
- బాహ్య గ్రహాలను ఏ పేరుతో పరిగనిస్తారు? జోవియన్ గ్రహాలూ, గ్యాస్ గ్రహాలూ
- జోవియన్ అనగా ? గురుడు
- బాహ్య గ్రహాలూ ఉండే వాతావరణం లో ఏ వాయువులు అధికంగా ఉన్నాయి? హీలియం హైడ్రోజన్ వాయువులు
- బాహ్య గ్రహాలూ గా వేటిని పేర్కొంటారు? గురుడు, శని, వరుణుడు, నెప్ట్యూన్
- ఫ్లూటో ను డార్ఫ్ గ్రహంగా పరిగణించిన వారు? అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ యునియన్ వారు
- ఫ్లూటో ఏ గ్రహాన్ని పోలి ఉంటుంది? 2౦౦౩ UB 313
- సౌర వ్యవస్థ లో ఉప గ్రహాల సంఖ్య? 63
- మొదటి తరగతి భూ స్వరూపాలు? ఖండాలు, సముద్రాలు
- ఖండాలు భూ భాగాన్ని ఎంత శాతం ఆక్రమించాయి? 29% (సముద్రాలు 71% ఆక్రమించాయి)
- ఖండచలన సిద్దాంతాన్ని మొదట ప్రతిపాదించిన వారు ? అబ్రహాం ఓర్టేలాస్ 1596లో
- ఖండచలన సిద్దాంతాన్ని రూపొందించిన వారు ? ఆల్ఫ్రెడ్ వేజినర్ (1912)
- ద అమెరికా, ద ఆఫ్రికా ఖండాలు ఒకే సరిహద్దు కలిగి ఉన్నాయి అని మొదట కనుగొన్నవారు ? సర్ ఫ్రాన్సిస్ బేకన్ (1620)
- అంటోనియో స్నిడర్, పోలిగ్రీన్ ఏ దేశ శాస్త్ర వేత్తలు? ఫ్రెంచ్
- అమెరికా ఖండం ఐరోపా ఆఫ్రికాలో కలుసుకోన్నట్లు ఒక పాఠం రూపొందించినవారు ? అంటోనియో స్నిడర్, పోలిగ్రీన్
- ఆల్ఫ్రెడ్ వేజినర్ ఏ దేశ శాస్త్రవేత్త ? జర్మని
- ఆల్ఫ్రెడ్ వేజినర్ కలిసి కట్టుగా ఉన్న భూభాగాన్ని ఏ పేరుతో పిలిచాడు? పాంజియా
- పాంజియా చుట్టూ ఆవరించిన సముద్రం ? పంథాల్సా
- పాంజియా దేని కారణంగా విడిపోయింది ? టెథిస్ సముద్ర భూ అభినతి కారణ౦ గా విడిపోయింది
- టెథిస్ సముద్ర ఉత్తర భూభాగం యొక్క పేరు ? లారేషియా / అంగోరా
- టెథిస్ సముద్రం యొక్క దక్షిణ భూభాగం యొక్క పేరు ? గొండ్వానా భూభాగం
- ఈ ఖండాలు చలనం ఎప్పుడు జరిగి ఉంటుంది అని అంచనా ? 200 మిలియన్ సంవత్సరాల క్రితం
- ఖండచలనం బలపరిచే ఆధారాలు ? ఖండాలు కలవడం, ఒకే సమయానికి చిందిన శిలలు ఉండడం, హిమ సంబంధ నిక్షేపాలు, శిలాజాల విస్తరణ, సంవహన ప్రవాహ సిద్దాంతాలు, టేయిలర్ వివరణలు
- ఖండచలనం బలపరిచే ఆధారాలు ఏ ఏ ప్రాంతాలలో లభించాయి? బ్రెజిల్ తీరం తో పాటు, ఆఫ్రికా భారత్ ఆస్ట్రేలియా లో లభించాయి.
- టేయిలర్ ప్రకారం ఖండాలు ఎన్ని మార్గాలలో పయనించాయి? 1 భూమధ్య రేఖ వైపు 2 పశ్చిమం వైపు
- ఇలా 2 మార్గాలలో పయనించడానికి కారణం ? చంద్రుడి నుండి జనించిన తరంగబలం
- ఖండాలు భూమధ్య రేఖ వైపు పయనించ డానికి కారణం? టైడల్ ఫోర్స్
- సంవహన ప్రవాహ సిద్దాంతం ప్రతిపాదించింది ? ఆర్ధర్ హోమ్స్ 1930 లో
- ఆర్ధర్ హోమ్స్ తన సంవహన ప్రవాహ సిద్దాంతంలో దేనిని ప్రతిపాదించాడు? ప్రావారం లో సంవహన ప్రవాహాలు, ఖండచలన సిద్దాంతానికి సంబంధం చర్చించాడు
- సంవహన ప్రవాహాలు వేటి కారణంగా ఏర్పడతాయి ? రేడియో ధార్మికత కలిగిన మూలకాలలో గల ఉష్ణోగ్రత బేదాల వల్ల ఏర్పడిందని
- సముద్ర స్వరుపాలను ఏయే భాగాలు గా విభజించారు? ఖండతీరపు అంచు, అగాధ సముద్ర మైదానం, సముద్ర అగాధాలు
- ఖండతీరానికి సముద్ర అగాధానికి మధ్య ఏర్పడిన సముద్ర స్వరూపం? ఖండ తీరపు అంచు
- ఖండ తీరపు అంచులో భాగాలు ? ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, సముద్ర అగాధం ఉంటాయి
- సముద్ర అగాదాలు వేటిని తెలియజేస్తాయి? ఖండాలు సముద్రాల విస్తరణ గురించి అధిక సమాచారం తెలియజేస్తుంది
- అగాధ సముద్ర మైదానం వేటిమధ్య ఉంది ? ఖండతీరపు అంచుకు మిడ్ ఓషియానిక్ రిడ్జ్ కు మధ్య ఉంది
- మిడ్ ఓషియానిక్ రిడ్జ్ ఎక్కడ ఏర్పడింది? మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ క్రష్ఠల్ ప్లేట్స్ జంక్షన్ వద్ద ఏర్పడింది
- మిడ్ ఓషియానిక్ రిడ్జ్ తీరానికి ఎంత వెడల్పు లో ఉంది? 50-70 మైళ్ళు వెడల్పు / (80-12౦కిమీ) వెడల్పు
- మిడ్ ఓషియానిక్ రిడ్జ్ ప్రావారం లో ఉష్ణోగ్రత ? 6 వేల డిగ్రీల సెంటి గ్రేడ్
- మిడ్ ఓషియానిక్ రిడ్జ్ సం.లో ఎంత విస్తరిస్తుంది? 1-10 సెం మీ
- ఉష్ణ సంవహన ప్రవాహాలు ఉన్నచోట ఈ రిడ్జ్ ఉన్నట్లు ప్రతిపాదించింది ? హోరిహెన్ శాస్త్రవేత్త
- హోరిహెన్ శాస్త్రవేత్త ప్రకారం వేటి ఆధారంగా ఈ శిలలు ఉన్నట్లు ప్రతిపాదించాడు? సముద్రం గర్భం లో శిలల పాలియో మాగ్నటిక్ అధ్యయనాల ఆధారంగా
- సముద్ర అగాధ విషయాలు వేటి ద్వారా తెలుసుకోవచ్చు ? పాలియో మాగ్నటిక్ అధ్యయనం చేయడం వల్ల
- పలక విరూపాక సిద్ధాంతం / ప్లేట్ టెక్టనిక్ అనగా ? పలకల కదలిక దాని ప్రతిచర్య దాని జననం మొత్తం
- పలక విరూపాక సిద్ధాంతం / ప్లేట్ టెక్టనిక్ థియరీ ప్రతిపాదించింది ? 1967 లో మెకంజీ, పార్కం, మోర్గాన్
- పలకల మ౦దం ? సముద్రం లో 5-100 కిమీ భూమి మీద 200 కిమీ
- మొత్తం పలకలు ఎన్ని ? పెద్దవి 7, చిన్నవి 12
- పూర్తిగా ఖండ పలక ? యురేషియా & దాని పక్క పలక
- పూర్తిగా సముద్ర పలక ? పసిఫిక్ పలక
- యురేషియా పలకలో ఏయే ఖండాలు ఉన్నాయి? ఐరోపా ఆసియా ఖండాలు ఉన్నాయి (దీనిలో ఇండియా లేదు)
- ఇండియా ఏ పలకలో ఉంది ? ఇండియా ఆస్ట్రేలియా పలకలో
- కిర్తార్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి ? పాకిస్తాన్ లో
- రాకిన్ యామా పర్వతాలు ఎక్కడ ఉన్నాయి ? మయన్మార్ (భౌవా ట్రెంచ్ వరకు వ్యాపించి ఉన్నాయి)
- కరేబియన్ దీవుల ప్లేట్ తో కలిసి ఉన్న పలక? ఉ. అమెరికా పలక (కొంత భాగం దక్షిణ అమెరికా పలక కూడా కలిగి ఉంది)
- 7 పలకలలో పెద్ద పలక ? పసిఫిక్ పలక
- ఆఫ్రికా పలక లో ఏ సముద్ర భాగాలు ఉన్నాయి ? తూర్పు అట్లాంటిక్, ప హిందూ సముద్ర పలకలు
- ఈ పలకల కదలికలు? 10 సం కు 3 మీటర్లు / స౦. కి 2 సెంటి మీటర్ల నుండి 7 సెంటి మీటర్లు
- పలకల బలం గూర్చి వివరించిన శాస్త్ర వేత్తలు? DL తురోకోటి, ER ఆక్స్ బర్గ్
- ఈ పలకలు వేటి ఆధారంగా కదులుతున్నాయి? సంవహన ప్రవాహాల కారణంగా
- సంవహన ప్రవాహాలు అనగా ? భూమి లోపల కదలికలు
- సంవహన ప్రవాహాలు వల్ల పలకలు కదులుతున్నాయి అన్న అంశాన్ని బలపరచిన వారు ? ఆర్ధర్ హోమ్స్
- ఆర్ధర్ హోమ్స్ ప్రకారం సం. లో జనించు ఉష్ణం ? 100 జౌల్స్
- ఈ పలకలు ఎన్ని విధాలుగా కదులుతున్నాయి? 3 (వ్యతిరేఖ దిశలో, దగ్గరగా, సమాంతరంగా)
- పలకలు వ్యతిరేఖ దిశలో జరగడం వల్ల జరుగు పరిణామం? రిడ్జ్ ల రూపం లో పర్వతాలు ఆవిర్భవించడం, సముద్ర గర్భం విస్తరించడం
- పలకలు దగ్గరకు జరగడం వల్ల జరుగు పరిణామం? ముడుత పర్వతాలు, అగ్ని పర్వతాలు, మహా సముద్ర అగాధాలు పరిణామం చెందుతాయి
- పలకలు ఒకదానికొకటి సమాంతరంగా జరగడం వల్ల పరిణామం ? బ్రంశాలు ఏర్పడతాయి
- షాన్ ఆండ్రిస్ బ్రంశం ఎక్కడ ఏర్పడింది? కాలిఫోర్నియా లో
- కిలిమంజారో, కెన్యా అగ్ని పర్వతాలు వేటివల్ల ఏర్పడ్డాయి? ఆఫ్రికా పళ్ళెం జరగడం వల్ల
Rocks (శిలలు):

- సహజ సిద్దంగా ఏర్పడిన పదార్దానికి గల పేరు ? శిల (ఘన పదార్ధం లేదా ఖనిజాలు కలిసి ఏర్పడినదే శీల)
- సాదారణంగా శిలలో ఉండే ఖనిజాలు ? క్వార్ట్జ్, ఫెల్ స్పార్, బయోటైట్
- ఆధార శిలకు మరొక పేరు ? సంస్తర శిల (బెడ్ రాక్) లేదా రేగోలిత్ అని పేరు
- శిలా శాస్త్రం అనగా? శిలల అధ్యయనం
- శిలల మధ్య సంబంధం తెల్పేది? శిలా చక్రం (ఒకదాని కొకటి అవినాభావ సంభందం ఉంది అని తెల్పుతుంది)
- ఖటినంగా ఉన్న శిలలకు ఉదా? గ్రానైట్
- చిన్న చిన్న కణాలతో గల శిలలు ? ఇసుక శిలలు
- శిలలు తయారైన విధానం బట్టి ఎన్ని వర్గాలు ? 3 (అగ్ని శిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు)
- శిలా ద్రవం బయటకి వచ్చి ఘనిభవించడం ద్వారా ఏర్పడిన శిలలు ? అగ్ని శిలలు
- భూ పటలం లో అగ్ని శిలలు ఎంత శాతం ఆక్రమించ బడి ఉంటాయి? 90%
- అగ్ని శిలలకు గల పేర్లు ? అస్థిరత శిలలు, ప్రథమ శిల, మాతృశిలలు
- వివిధ ఆకారాలలో గల శిలలు ? అస్థిరత శిలలు
- అగ్ని శిలలకు ఉదా ? బసాల్ట్ శిల, గ్రానైట్ శిల, అండిసైట్ శిల, రయోలైట్ శిల, గాబ్రో
- బసాల్ట్ శిలలు ఏ భూ స్వరుపాలలో ఏర్పడతాయి? కలమ్నార్ జాయింట్స్, ఎస్కార్ప్ మెంట్
- బసాల్ట్ శిలలు ___? తొందరగా చల్లబడి చిన్న స్పటికాలు కలిగి ఉంటాయి
- ఆలస్యంగా చల్లబడి పెద్ద పరిమాణం లో ఉన్న శిలలు ? గ్రానైట్
- గ్రానైట్ శిలలు ఎక్కడ ఏర్పడతాయి ? భూమి లోపల అధిక పీడనం వద్ద ఏర్పడతాయి
- గ్రానైట్ శిల పగుళ్ళ నుండి బయటకు వచ్చే పదార్ధం ? మాగ్మా
- ఉపరితలం చేరిన మాగ్మా ఎలా మారుతుంది? లావా గా
- గ్రానైట్ శిల ద్వారా ఏర్పడే భూ స్వరూపం ? ఎక్స్ పోలియేషన్ డోమ్స్
- సాధారణగా కనిపించని శిల ? అండిసైట్
- రయోలైట్ శిలద్వారా ఏర్పడే భూ స్వరూపం ? బ్లఫ్స్, క్లిఫ్స్
- గాబ్రో శిల ఏర్పరిచే భూ స్వరూపం ? ఎస్కర్ప్ మెంట్
- అగ్ని శిల రేణువుల పరిమాణం బట్టిఎన్ని రకాలు? 4 (పెగ్ మాటిక్ అగ్ని శిలలు, ఫానరెటిక్ అగ్ని శిలలు, అఫానిటిక్ అగ్ని శిలలు, ఫార్ ఫింటిక్ అగ్ని శిలలు)
- రేణువుల పరిమాణం కొన్ని మీటర్లు ఉండి పెద్దగా ఉన్న అగ్ని శిల రకం ? పెగ్ మాటిక్ అగ్ని శిలలు
- పెగ్ మాటిక్ అగ్ని శిలలుకు ఉదా ? గ్రానైట్
- కంటికి కనిపించేంత రేణువుల పరిమాణం గల అగ్నిశిల రకం ? ఫానరెటిక్ అగ్ని శిలలు
- రేణువుల పరిమాణం కంటికి కనిపించేంత ఉండని అగ్ని శీలా రకం? అఫానిటిక్ అగ్ని శిలలు
- రేణువుల పరిమాణం చిన్నగా పెద్దగా ఉన్న అగ్ని శిలా రకం ? ఫార్ ఫింటిక్ అగ్ని శిలలు
- అగ్నిశిలలు అవి ఏర్పడే ప్రదేశం బట్టి ఎన్ని రకాలు? 2 రకాలు (బాహ్య అగ్ని శిలలు, అంతర్గత అగ్ని శిలలు)
- సేడిమేంట్ వల్ల / అవక్షేపం వల్ల ఏర్పడిన శిలలు ? అవక్షేప శిలలు
- అగ్నిశిలలు రూపాంతర శిలలు ప్రకృతి శక్తుల కారనంగా శిధిలమై చిన్న రేణువులు గా మారి, నిక్షేపించ బడిన ప్రాంతం లో గట్టిబడి స్తరిత రూపం దాల్చే శిలలు? అవక్షేప శిలలు
- అవక్షేప శిలలు శిలావరణం లో ఎంత శాతం ఉన్నాయి ? 80%
- అవక్షేప శిలల లో లభించే ఖనిజాలు ? హమటైట్, బొగ్గు, రాతి ఉప్పు, జిప్సం, పెట్రోలు
- హమటైట్ శిలనుండి లభించు ఖనిజం? ఇనుపదాతువు
- అవక్షేప శిలలకు గల పేర్లు ? ద్వితీయ శిలలు/సెకండరి శిలలు, స్తరిత శిలలు
- అవక్షేప శిలలకు స్తరిత శిలలు అని పేరు రావడానికి కారణం? పొరలు పొరలు గా ఉండి సమతలంగా ఉండడం వల్ల
- అవక్షేప శిలగా మారే ప్రక్రియకు గల పేరు ? లితిఫికేషణ్
- కాల్షియం కార్బనేట్ ఫార్ములా ? Caco3
- ఐరన్ ఆక్సైడ్ ఫార్ములా? Fe2 O3
- సిలికా ఫార్ములా ? GiO2
- క్లే ఏర్పడే భూ స్వరూపం ? బాడ్ ల్యాండ్
- షెల్, మార్గ్ లు ఏ భూ స్వరూపం లో ఏర్పడతాయి ? లోయలు
- కంగ్లమరేట్ ఏ భూ స్వరూపలలో ఏర్పడతాయి ? పర్వతాలు, పీట భూములు
- ఇసుకరాయి ఏ భూ స్వరూపాలలో ఏర్పడతాయి ? పీట భూమి
- సున్నపు రాయి ఏర్పడే భూ స్వరూపం ? కారస్ట్
- అవక్షేప శిల ఏర్పడడానికి సహకరించే ప్రక్రియలుఎన్ని ? 5 (శిలా సైదిల్యం, క్రమక్షయం, రవాణా, నిక్షేపణ, స్తరిత రూపం)
- అవక్షేప శిలలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 (ప్రక్రియ ఆధారంగా, రవాణా చేసే ఏజెంట్ ఆధారంగా)
- ప్రక్రియ ఆధారంగా ఏర్పడిన అవక్షేప శిలలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3 (భౌతిక ప్రక్రియవల్ల ఏర్పడ్డవి, రసాయన ప్రక్రియవల్ల ఏర్పడ్డవి, జీవ ప్రక్రియవల్ల ఏర్పడ్డవి)
- అగ్ని, అవక్షేప శిలలు రూపాంతరం చెందడం ద్వారా ఏర్పడే శిలలు? రూపాంతర శిలలు
- మెటామార్పిక్ అనే పదం ఏ భాష పదం? గ్రీకు
- మెటామార్పిక్ అనగా ? పాత రూపం పొడవం
- ఆర్థోమెటామర్పిజం అనగా? అగ్ని శిలలు రూపాంతరం చెందడం
- పారా మెటామార్పిజం అనగా ? అవక్షేప శిలలు రూపాంతరం చెందడం
- పాలీ మెటామార్పిజం అనగా ? రూపాంతరం చెందిన శిలలు మరలా రూపాంతరం చెందడం
- స్లేట్ రూపాంతరం చెంది ఎలా మారుతుంది ? ఫైల్లైట్ గా మారుతుంది
- ఫైల్లైట్ రూపాంతరం చెంది ఏవిధంగా మారుతుంది ? మైకా సిస్ట్ గా, గార్నెట్ శిష్ట్ గా మారుతుంది
- రూపాంతర శీలా రకాలు ? ఉష్ణోగ్రత రూపాంతరం, చలన రూపాంతరం, జియో థర్మల్ రూపాంతరం, మెటాసోమటిక్ రుపంతరం, డైనమో థర్మల్ రూపాంతరం, పాతాళ రూపంతరం
- రూపాంతర శిలలో గల ఖనిజాలు ? స్టేరోలైట్, ఎండాలసైట్, సిల్లిమనైట్, కయనైట్
- రూపాంతర శిల నిర్మాణాలు? లీనిఏషణ్, ఫోలిఏషణ్, సిస్టాసిటి, నైససిటి, పలకలు, పాలరాయి, క్వార్ట్ జైట్
- సిస్టాసిటీ ఏర్పడే భూ స్వరూపం? ఎత్తైన భూములు
- నైస సిటీ ఏర్పడే భూ స్వరూపం? పర్వతాలు, పీటభూములు
- పలకరాయి, పాలరాయి ఏర్పడే భూ స్వరూపం ? లోయలు
- క్వార్ట్ జైట్ ఏర్పడే భూ స్వరూపం? మొనోడ్ నాక్స్
for more updates please visit our website
Good morning sir
Thank you so much sir bits PDF