భూమి
- (Oceanography) అంతరిక్షం నుండి చుస్తే భూమి ఏ రంగులో కనిపిస్తుంది? నీలి రంగులో
- అంతరిక్షం నుండి చుస్తే భూమి నీలి రంగులో కనిపించుటకు కారణం ? ఉప్పునీటి జలాశయాలు ఉండడం వల్ల (2/3వ వంతు)
- హైడ్రాలజి (జల విజ్ఞాన శాస్త్రం) అనగా ? భూ ఉపరితలం పై జలభాగాల అధ్యయనం
- జల చక్రానికి గల మరొక పేరు? ద్రవ సంబందిత చక్రం (ఇది ఒక క్లోజుడ్ సిస్టం/ సంవృత వ్యవస్థ)
- ద్రవ సంబందిత చక్రం అనగా ? భూ ఉపరితలం పై చేరిన వర్షపు నీరు ప్రవాహ రూపం లో చలనం చెందుతూ మహాసముద్రాలు చేరడ౦
ద్రవ సంబందిత చక్రం లోని అంశాలు
- ద్రవ సంబందిత చక్రంలోని అంశాలు ఏవి ? అవపాతం, ప్రవాహం, ఇంకడం, భాస్పిభవనం, భాష్పిభవనం-ఉత్సర్జనం, పునఃపూరణం
- అవపాతం (Precipitation) అనగా ? వాతావరణం లోని నీరు గురుత్వాకర్షణ ప్రభావం తో ౩ భౌతిక రూపాల్లో భూమిని చేరడం (ఈ నీరు భాష్పిభవనం ద్వారా కొంత వాతావరణం చేరుతుంది, అన్తఃస్రవనం ద్వారా కొంత భూగర్భ జలంగా మారుతుంది, మిగిలిన భాగం సముద్రాలను చేరుతుంది)
- ప్రవాహం (Runoff) అనగా ? ఆధారం తో సంబంధం లేకుండా చలించే మొత్తం నీటినే ప్రవాహం అంటారు
- ఇంకడం (Infiltration) అనగా? ఉపరితలం నుండి నీరు భూగర్భానికి చేరే ప్రక్రియను ఇంకడం అంటారు
- భూగర్భ జలం అనగా? భూ ఉపరితలం నుండి దిగువున ఉన్న నీటిని భూగర్భ జలం అంటారు
- భాష్పిభవనం (Evaporation) అనగా ? నీటి ఆవిరి వాతావరణ పై భాగం చేరడాన్ని (జలావరణం నుండి నీరు వాతావరణం చేరుతుంది)
- భాష్పిభవనం-ఉత్సర్జనం (Evapo-transpiration) నకు మరోకపేరు ఏవి? భాస్పోత్సేకం
- ద్రవాభిసరణం (osmosis) అనగా? మొక్కలు తమకు కావలసిన నీటిని వేర్లు ద్వారా సంగ్రహి౦చడం
- భాస్పోత్సేకం అనగా? మొక్కలు వినియోగించుకోగా మిగిలిన నీటిని పత్రరంద్రాలు ద్వారా ఆవిరి రూపం లో వాతావరణం లోకి విడుదల చేయుట (నీరు మృత్తికలు ఇతర మూలాల నుండి భాస్పిభవనం ద్వారా వాతావరణం చేరుతుంది)
- మొక్కలు నుండి నీరు ఏ ప్రక్రియ ద్వారా వాతావరణం చేరుతుంది? బస్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా
- భూగర్భ జల వనరులను తిరిగి భర్తీ చేసే సహజ ప్రక్రియనే ఏమంటారు? పునఃపూరణం (Recharge)
- ఎక్కువ భూ గర్భజలాన్ని ఉపయోగించేది? మొక్కలు
సముద్ర భూతల నిమ్నోన్నతాలు (Oceanic undulations)
Oceanography
- భూగోళం ఎన్ని మహా సముద్రాలుగా విభజింప బడినది? 5 (పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, దక్షిణ మహాసముద్రం, ఆర్కిటిక్ మహా సముద్రం)
- సముద్ర భూతలం ఎక్కువ భాగం ఎన్ని కిమీ లోతులో ఉంది? ౩-6 కిమీ లోతులో ఉంది

సముద్ర భూతల ప్రధాన భాగాలు
- సముద్ర భూతల ప్రధాన భాగాలు ఎన్ని? 4 (ఖండతీరపు అంచు, ఖండ తీరపు వాలు, అగాధ సముద్ర మైదానం, మహా సముద్ర అగాధం)
- ఖండతీరపు అంచు అనగా? సింధు శాఖలు, గాద సముద్ర జలాల చే అక్రమించబడి ప్రతి ఖండానికి ఉన్న అంచును ఖండతీర అంచు అంటారు
- మహా సముద్రాలలో అతి తక్కువ లోతైన భాగం ఏది ? ఖండతీర అంచు
- ఖండతీర అంచు యొక్క వాలు యెంత ఉంటుంది? 1 డిగ్రీ కన్నా తక్కువ
- ఖండతీర అంచు యొక్క సగటు వెడల్పు యెంత? 80 కిమీ (లోతు 30-60 మీటర్లు)
- ఖండతీర అంచు చాలా తక్కువగా ఉన్న ప్రాంతాలు? చీలీ, సుమత్రా దీవి పశ్చిమ తీరం
- ప్రపంచం లో వెడల్పైన ఖండతీరపు అంచుగల ప్రాంతం? ఆర్కిటిక్ సైబీరియా ప్రాంతం (వెడల్పు 15౦౦ కిమీ)
- ఖండతీరపు అంచును మహాసముద్ర హరివానాలను కలిపే సరిహద్దును ఏమంటారు? ఖండ తీరపు వాలు
- ఖండ తీరపు వాలు ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 2-5 డిగ్రీలు
- ఖండ తీరపు వాలు యొక్క లోతు యెంత? 200-3000 మీటర్లు
- అగాధాలు అగాధ దరులు విస్తరించి ఉన్న ప్రాంతం? ఖండ తీరపు వాలు
- సముద్ర హరివానాలలో తిన్నగా వాలు గల ప్రాంతాలు ఏవి? అగాధ సముద్ర మైదానాలు
- అగాధ సముద్ర మైదానాల లోతు ఎంత ఉంటుంది? 3000-6000 మీటర్లు
- క్లే బంకమట్టి వంటి మృదువైన అవక్షేపాలచే వ్యాపించిఉన్న సముద్ర స్వరూపం ? అగాధ సముద్ర మైదానం
- మహాసముద్రాలలోని అత్యంత లోతైన భాగాలు ? మహా సముద్ర అగాధాలు
- నిట్రవాలు తో ఉన్న ఇరుకైన హరివానాలు? మహా సముద్ర అగాధాలు
- మహా సముద్ర అగాధాలు లోతు యెంత? 3-5 కిమీ
- క్రియాశీల అగ్నిపర్వతాలు కేంద్రీకృతమై ఉన్న సముద్ర స్వరూపాలు? మహా సముద్ర అగాధం
- ఇప్పటివరకు ఎన్ని మహా సముద్ర అగాధాలను కనుగొన్నారు? 57 (పసిఫిక్ లో 32, అట్లాంటిక్ లో 19, హిందూ మహాసముద్రం లో 6)
ఇతర సముద్ర భాగాలు
- సముద్ర భూతలం మీద 2 పర్వత గొలుసులను కలిగిఉన్న నిర్మాణం? సముద్ర రిడ్జ్ లు
- సముద్ర రిడ్జ్ లులో శిఖరాల ఎత్తు యెంత ఉంటుంది? 25౦౦ మీ
- విరుపకారక సిద్దాంతం ప్రతిపాదించిన వారు? హేస్ & మోర్గాన్
- విరుపకారక సిద్దాంతం ప్రకారం పెద్ద రిడ్జ్ లు ఎక్కడ ఉన్నాయి? అట్లాంటిక్ హిందూ మహాసముద్రాల మధ్య భాగం లో
- మధ్య అట్లాంటిక్ రిడ్జ్ లో భాగంగా ఉన్న ప్రాంతానికి ఉదా ? ఐస్ లాండ్
- సముద్రాలలో శిఖరాలతో కూడిన పర్వత నిర్మాణాలుకు గల పేరు? సముద్ర మౌంట్ లు
- సముద్ర మౌంట్ లు వేటి మూలంగా ఏర్పడ్డాయి? అగ్నిపర్వతాల మూలంగా ఏర్పడ్డాయి
- సముద్ర మౌంట్ లు సముద్ర భూతలం లో ఎంత ఎత్తు వరకు ఉంటాయి? ౩౦౦౦-45౦౦ మీ ఎత్తువరకు
- ఎంపరల్ సీమౌంట్ ఎచట గలదు? హవాయి దీవులలో (పసిఫిక్ మహా సముద్రం)
- చదునుగా ఉన్న సీమౌంట్ లును ఏమంటారు? గయోట్ లు
- పసిఫిక్ లో ఎన్ని సీమౌంట్ లు గయోట్ లు ఉన్నాయి? 10 వేలకంటే ఎక్కువ సీమౌంట్ లు గయోట్ లు ఉన్నాయి
- సముద్రాలలో మునిగిఉన్న పర్వతాల క్రమ క్రమ నిమజ్జనానికి సాక్ష్యాలు? గయోట్ లు
- మధ్య లో పల్లంగా ఉండి చుట్టూ ప్రవాళ బిత్తికలచే ఏర్పడిన చిన్న దీవుల సముదాయానికి గల పేరు? అటాల్
- అటాల్ ఎచట కనిపిస్తాయి? అయన రేఖా మహా సముద్రాలలో కనిపిస్తాయి (కొన్ని సందర్భాలలో వీటి చుట్టూ మంచినీరు/ఉప్పు నీరు ఆవరించి ఉంటుంది)
- సముద్రం లో ఉండే అగాధ లోయలుకు గల పేరు ? అగాధదరులు (వీటిని గ్రాండ్ కెన్యాన్ అఫ్ కొలరాడో తో పోల్చవచ్చు)
- గ్రాండ్ కెన్యాన్ అఫ్ కొలరాడో ఎక్కడ కలదు? అమెరికాలో
- సముద్ర అగాధ దరికి ఉదాహరణ ? హడ్సన్ కెన్యాన్
మహాసముద్రాలు (Oceans)

- భూ ఉపరితలం పై మహాసముద్రాలు ఎంత శాతం అక్రమించబడి ఉన్నాయి? 71%
- మనకు లభించే జల భాగం లో ఉప్పునీటి శాతం ? 97%
- యెంత భాగాన్ని గాధ సముద్రం తో కూడిన పసిఫిక్ అట్లాంటిక్ మహా సముద్రాలు ఆక్రమిస్తున్నాయి? 55% భాగాన్ని
పసిఫిక్ మహాసముద్రం
- ప్రపంచంలోనే పెద్దది లోతైనది ఏ మహా సముద్రం? పసిఫిక్ మహాసముద్రం
- పసిఫిక్ మహాసముద్రం వైశాల్యం యెంత? 6 00 60 700 చ మైళ్ళు (1 5 55 57౦౦౦ చ కిమీ)
- పసిఫిక్ మహాసముద్రం యొక్క సగటు లోతు? 1౩215 అడుగులు (4028 మీటర్లు)
- ప్రపంచం లోనే లోతైన అఘాధం ? మెరియాన ట్రెంచ్ (పిలిప్పైన్స్ సమీపం లో)
- మెరియాన ట్రెంచ్ యొక్క లోతు యెంత? 35 840 అడుగులు (10 924 మీటర్లు)
- CIA వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ ప్రకారం మొత్తం భూ భాగం లో ఎంత శాతం భాగాన్ని పసిఫిక్ ఆక్రమిస్తుంది? 28% భూ భాగాన్ని (ఇది మొత్తం భూభాగ విస్తీర్ణానికి సమానం)
అట్లాంటిక్ మహాసముద్రం
- ప్రపంచం లో 2వ అతిపెద్ద మహా సముద్రం ఏది? అట్లాంటిక్ మహాసముద్రం
- అట్లాంటిక్ మహాసముద్రం యొక్క వైశాల్యం యెంత? 2 96 ౩7 9౦౦ చ మైళ్ళు (76 76 2౦౦౦ చ కి మి)
- అట్లాంటిక్ మహాసముద్రం ఏయే ఖండాల మధ్య విస్తరించి ఉంది? ఆఫ్రికా ఐరోపా ద మహాసముద్రం మధ్య విస్తరించి ఉంది
- అట్లాంటిక్ మహాసముద్రం యొక్క లోతు? 12 88౦ అడుగులు (౩926 మీటర్లు) ఆఫ్రికా ఐరోపా ద మహాసముద్రం మధ్య విస్తరించి ఉంది
- అట్లాంటిక్ మహాసముద్రం లో భాగాలు :
- బాల్టిక్ సముద్రం
- నల్ల సముద్రం
- కరేబియన్ సముద్రం
- మెక్సికో సింధు శాఖ
- మధ్య ధరా సముద్రం
- ఉత్తర సముద్రం
- అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత లోతైన అఖాతం? పోర్టో రికో
- పోర్టో రికో అఖాతం యొక్క లోతు ఎంత? 282౩1 అడుగులు (86౦5 మీటర్లు)
- అట్లాంటిక్ మహా సముద్రం లో హరికేన్స్ ఎనెలలో ఆవిర్భవిస్తాయి? ప్రతి సంవత్సరం ఆగస్ట్ సెప్టెంబర్ మధ్య
- హరికేన్స్ ఆఫ్రికా లో ఏతీరం వెంబడి ఆవిర్భవిస్తాయి? కేప్ వర్డి తీరాల వెంబడి (కరేబియన్ సముద్రం వైపు పయనిస్తాయి)
హిందూ మహాసముద్రం
- ౩వ పెద్ద మహా సముద్రం? హిందూ మహా సముద్రం
- హిందూ మహా సముద్ర వైశాల్యం ఎంత? 2 64 69 9౦౦ చ మైళ్ళు (6 85 66 ౦౦౦ చ కిమీ)
- హిందూ మహాసముద్రం ఏయే ఖండాల మధ్య ఉంది? ఆఫ్రికా ద మహాసముద్రం ఆసియా ఆస్ట్రేలియా ఖండాల మధ్య ఉంది
- హిందూ మహాసముద్రం యొక్క లోతు యెంత? 13 003 అడుగులు (౩96౩ మీటర్లు)
- హిందూ మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రాంతం? జావా అఘాధం (సుమత్రా దీవి దగ్గరలో)
- జావా అఘాధం లోతు యెంత? 23 812 అడుగులు (7258 మీటర్లు)
- హిందూ మహా సముద్ర భాగాలు:
- అండమాన్ దీవులు
- అరేబియన్ సింధు శాఖ
- ఆడెన్ సింధు శాఖ
- పర్షియన్ సింధు శాఖ
- ఫ్లోర్స్
- జావా
- గ్రేట్ ఆస్త్రేలియన్ బైట్
- ఎర్ర సముద్రం
- బంగాళాఖాతం
- ఒమెన్ సింధు శాఖ
- మొజాంబిక్ చానల్
- ఇరుకైన అంతర్జాతీయ జలమార్గాలకు ప్రసిద్ది చెందిన మహా సముద్రం? హిందూ మహా సముద్రం
ద మహా సముద్రం
- ప్రపంచం లో కెల్ల కొత్త మహా సముద్రం? ద మహా సముద్రం
- ద మహా సముద్రం ఎన్నవ పెద్ద మహా సముద్రం? 4వ పెద్ద మహా సముద్రం
- 2౦౦౦ లో 5వ మహా సముద్ర సరిహద్దులు గుర్తించాలని నిర్ణయించిన వారు? ఇంటర్ నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ వారు
- ద మహా సముద్ర సరిహద్దులు గుర్తించ డానికి ఏయే మహాసముద్రాల సరిహద్దులును తీసుకొన్నారు? పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహా సముద్రాల నుండి సరిహద్దులు
- ద మహా సముద్రం ఎక్కడ నుండి ఎక్కడ వరకు వ్యాపించి ఉంది? అ౦టార్కిటిక్ తీరం నుండి 60 డిగ్రీల ద అక్షాంశం వరకు
- ద మహా సముద్రం వైశాల్యం యెంత? 78 48 ౩౦౦ చ మైళ్ళు (2 03 27 ౦౦౦ చ కిమీ)
- ద మహా సముద్రం సగటు లోటు ఎంత? 12 1౦౦ నుండి 16 4౦౦ అడుగులు (4౦౦౦ నుండి 5౦౦౦ మీటర్లు)
- ద మహా సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతం? ద శాండ్విజ్ ట్రెంచ్ కు ద గా ఉంది (ఇంకా పేరు పెట్టలేదు)
- ద మహా సముద్రంలో అతి లోతైన ప్రాంతం ఎన్ని అడుగుల లోతులో ఉంది? 23 7౩7 అడుగులు (7 2౩5 మీటర్లు)
- ప్రపంచం లోనే అతిపెద్ద సముద్ర ప్రవాహం? అంటార్కిటికా పరిధ్రువ ప్రవాహం
- అంటార్కిటికా పరిధ్రువ ప్రవాహం ఎంత దూరం ప్రయాణిస్తుంది? 13 ౦49 మైళ్ళు పొడవున తూ దిశలో ప్రయాణిస్తుంది (21౦౦౦ కిమీ)
ఆర్కిటిక్ మహాసముద్రం
- ప్రపంచం లోకెల్ల అతి చిన్న మహా సముద్రం? ఆర్కిటిక్ మహాసముద్రం
- ఆర్కిటిక్ మహాసముద్రం యొక్క వైశాల్యం ? 54 27 ౦౦౦ చ మైళ్ళు (1 4౦ 56 ౦౦౦ చ కిమీ)
- ఆర్కిటిక్ మహాసముద్రం ఏయే ఖండాల మధ్య విస్తరించి ఉంది? యూరప్ ఆసియా ఉ అమెరికాల మధ్య విస్తరించి ఉంది
- ఆర్కిటిక్ మహాసముద్ర జలాలు ఆర్కిటిక్ సర్కిల్ కి ఏ దిశలో ఉన్నాయి? ఉత్తర దిశలో
- ఆర్కిటిక్ మహాసముద్ర సగటు లోతు యెంత? ౩95౩ అడుగులు (1205 మీటర్లు)
- ఆర్కిటిక్ మహాసముద్ర౦ లో అతి లోతైన ప్రదేశం? ఫ్రాం హరివానం
- ఫ్రాం హరివానం యొక్క లోతు యెంత? 15 ౩౦5 అడుగులు (4665 మీటర్లు)
- చలించే దృవపు మంచుతో కప్పబడి ఉన్న మహా సముద్రం? ఆర్కిటిక్ మహా సముద్రం
- ఆర్కిటిక్ మహా సముద్ర దృవపు మంచు మందం యెంత? 10 అడుగులు (౩ మీటర్లు)
సముద్రాలు వాటి ఉష్ణోగ్రతలు
- సముద్రాలు Oceans ఉష్ణోగ్రత లను పొందడానికి ప్రధాన ఆధారాలు ఎన్ని? 2 (సముద్ర ఉపరితల జలాలపై పడే సౌర వికిరనాన్ని శోషించడం, భూ అంతర్భాగం లో ఉన్న వేడి కారణంగా ఏర్పడే సంవహన ప్రవాహాల ఆధారాలతో)
- సముద్ర ఉపరితల జలాల సగటు ఉష్నోగ్రత ఎన్ని డిగ్రీల సెంటి గ్రేడ్ ఉంటుంది. 26.7 డిగ్రీల సెంటి గ్రేడ్
- భూమధ్య రేఖనుండి ఉన్నత అక్షంశాలకు పోయెకొద్దీ ఉష్ణోగ్రత ప్రతి అక్షాంశానికి ఎన్ని డిగ్రీల ఫారన్ హీట్ తగ్గుతుంది? ౦.5 డిగ్రీల ఫారన్ హీట్ (ఈ ఉష్ణోగ్రతలు ద గోళం కంటే ఉ గోళం లో ఎక్కువగా ఉంటాయి)
- ఊర్ద్వ ఉష్ణోగ్రత విస్తరణ అనగా? సముద్రాల లోతులకు పోయెకొద్దీ ఉష్నోగ్రత తగ్గుతుంది దీనినే (ఇలా 2౦౦ మీటర్ల లోతువరకు వేగంగా తగ్గుతుంది)
లవణీయత (Ocean Salinity)

- సముద్ర నీటికి ఉండే ముఖ్య లక్షణం ఏమిటి? లవనీయత
- లవనీయత ప్రధానంగా వేటిపై ఆధారపడుతుంది? భాష్పిభవనం అవపాతం పై
- లవనీయత ధ్రువ ప్రాంతాలలో ఏ ప్రక్రియల ద్వారా నిర్ధారించబడుతుంది? ఘనిభవన ద్రవీభవన ప్రక్రియల ద్వారా
- లవనీయత అనగా? ఒక కిలో గ్రాము సముద్ర నీటిలో కరిగి ఉన్న ఘన పదార్ధాల పరిమాణం
- సముద్ర నీటిలో కరిగి ఉన్న ఘన పదార్ధాల సాంద్రీకరణ ను తెలియజేసేదే______? లవనీయత
- సాధారణ లవనీయత అనగా? 1000 గ్రాముల సముద్ర నీటిలో 35 గ్రాముల లవణాలు ఉంటే దానిని సాధారణ లవనీయత అంటారు
- సముద్ర సామాన్య లవనీయత యెంత ఉంటుంది? 35%
- లవనీయతను ఏ విధంగా నిర్ధారిస్తారు? లవణ మాపకం ద్వారా నిర్ధారిస్తారు (నీటి విధ్యుత్ వాహకత ను కొలవడం వల్ల నిర్దారిస్తారు)
లవనీయతను ప్రభావితం చేసే అంశాలు
- భాష్పిభవన
- అవపాతం
- మంచి నీటి కలయికవీచే పవనాలు
- సముద్ర నీటి చలనాలు
- భూమధ్య రేఖా ప్రాంతాల నుండి ధ్రువాల వైపుకు పోయెకొద్దీ లవనీయత ఏవిధంగా ఉంటుంది? తగ్గుతుంది
- భాష్పిభవనం రేటు ఎక్కువగా ఉంటె లవనీయత ఎలా ఉంటుంది? అధికంగా
- ఆర్ద్ర ప్రాంతాలలో ఏ ప్రక్రియ వల్ల అధిక వర్షాలు సంభవిస్తాయి? అవపాతం వల్ల
- మంచి నీటి కలయిక వల్ల లవనీయత తగ్గుతుంది ఉదా? నల్ల సముద్రం
- ఏ ప్రవాహ ప్రభావం వల్ల ఈశాన్య అట్లాంటిక్ మహాసముద్రం లో లవనీయత పెరుగుతుంది? గల్ఫ్ ఉష్ణ ప్రవాహం వల్ల
- సముద్ర నీటి చలనాలు ఎన్ని రకాలు? 3 (తరంగాలు, పోటుపాటులు, ప్రవాహాలు)
లవనీయత విస్తరణ
- ఎర్ర సముద్రం యొక్క లవనీయత యెంత? 41% (భూ పరివేష్టిత ప్రాంతం)
- బాల్టిక్ సముద్రం యొక్క లవనీయత? 6.2% (చాలా తక్కువ లవనీయత)
- హిందూ మహా సముద్ర సగటు లవనీయత యెంత? 36%
- ఎన్ని డిగ్రీల అక్షాంశం మధ్య అత్యధిక లవనీయత నమోదు అవుతుంది? 15-2౦ డిగ్రీల అక్షాంశం మధ్య
- లోతుకు పోయెకొద్దీ లవనీయత ఎలా ఉంటుంది? మారుతుంది
- హాలో క్లైన్ అనేది ఎక్కడ ఉంటుంది? అల్ప లవనీయత అధిక లవనీయత మండలాల మద్య ఉంటుంది
- లవనీయత స్థిరీకరణ పొరలు ఉద్భవానికి కారణమయ్యే ప్రక్రియ? అధిక లవనీయత గల సముద్ర నీరు అల్ప లవనీయత గల సముద్ర నీటి క్రిందకు చేరడం
సముద్ర ప్రవాహాలు
తరంగాలు, పోటు పాటులు, ప్రవాహాలు
- సముద్ర నీటి చలనాలు ఎన్ని రకాలు ? 3 (సముద్ర తరంగాలు, పోటు పాటులు, ప్రవాహాలు)

తరంగాలు
- గాలి ఒరిపిడ్ బలం వల్ల సముద్ర ఉపరితలం పై ఏర్పడే డోలాయమాన చలనాలును ఏమంటారు? సముద్ర తరంగాలు
- శృంగం అనగా ? తరంగ నిర్మాణం లో ఎత్తైన భాగం
- ద్రోణి అనగా ? తరంగ నిర్మాణం లో లోతైన భాగం
- డోలన పరిమితి అనగా ? శృంగానికి ద్రోనికి మధ్య గల దూరం
- వేగాన్ని ఏ రూపం లో కొలుస్తారు? “వాట్స్ లో
పోటు పాటులు
- పోటు పాటులు అనగా ? తీర ప్రాంతాలలో సముద్ర నీటిమట్టం పెరగడం తగ్గడాన్నే అలలు/పోటు పాటులు అంటారు
- పోటు పాటు ల మధ్య కాల వ్యవధి వ్యత్యాసం? 6 గంటల 13 నిమిషాలు
- ఒక రోజులో ఎన్ని పోటు పాటులు సంబవిస్తాయి? 2 పోటులు 2 పాటులు
- రెండు వరుస పోటుల మధ్య గాని, రెండు వరుస పాటుల మధ్య గాని కాల వ్యవధి వ్యత్సాసం ఎంత ఉంటుంది? 12 గంటల 26 నిమిషాలు
- పోటు అనగా ? తీర ప్రాంతం లో సముద్ర నీటి మట్టం పెరిగితే దానిని
- పాటు అనగా ? సముద్ర నీటి మట్టం తగ్గితే దానిని
- పోటు పాటుల మధ్య వ్యత్యాసానికి గల పేరు? వేలా పరిమితి
- వేలా తరంగ విరామం అనగా? 2 వరుస పోటు పాటు లమధ్య కాల వ్యవధి
- వేలా తరంగ రకాలు ఎన్ని ? 2 (పర్వ వేలా తరంగాలు, లఘు వేలా తరంగాలు)
- పర్వ వేలా తరంగాలు (స్ప్రింగ్ టైడ్స్) అనగా? సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు సముద్ర పోటు సాధారణం కంటే ఎక్కువ ఉంటుంది (అమావాస్య పౌర్ణమి రోజులలో ఏర్పడతాయి)
- లఘు వేలా తరంగాలు (నేప్ టైడ్స్) అనగా ? సూర్యుడు చంద్రుడు భూమికి లంభంగా ఉన్నప్పుడు చంద్రుని గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేఖ దిశలో సూర్యుని గురుత్వాకర్షణ బలం ఉంటుంది (ఈ సమయం లో సముద్ర పోటు మామూలు కన్నా తక్కువ గా ఉంటుంది)
- లఘు వేలా తరంగాలు ఎప్పుడు ఏర్పడతాయి? ప్రతి నేలలో శుద్ధ అష్టమి బహుళ అష్టమి రోజులలో ఏర్పడతాయి
- పోటు పాటులు యేర్పడ డానికి కారణాలు కారణాలు ఎన్ని? 2 (సూర్య చంద్రుల గురుత్వాకర్షణ బలం, భూ బ్రమణ౦ వల్ల జనించే అపకేంద్ర బలం)

ప్రవాహాలు (Ocean Currents)
- ఉష్ణోగ్రత వ్యత్యాసాలు సముద్ర జలాలలో చలనాలు ఏర్పరుస్తాయి వీటికి గల పేరు? ప్రవాహాలు
- ప్రవాహం అనగా? ఒక నిర్ణిత దిశలో స్థిరంగా ప్రయాణించే సముద్ర ఉపరితల జలరాశి (నిరంతరం ప్రభలంగా ప్రవహించే సముద్ర నీరు)
- ప్రవాహాలు ప్రధానంగా ఎన్ని బలాల వల్ల ఏర్పడతాయి? 3 బలాల వల్ల (సముద్రాల మీద వీచే పవనాలు, భూ భ్రమణం, సముద్ర నీటి సాంద్రత లో వ్యత్యాసం)
- సముద్ర నీటి సాంద్రత లో వ్యత్యాసం వేటిపై ప్రభావం చూపుతాయి? అధఃసముద్ర ప్రవాహాల మీద ప్రభావం చూపుతాయి
- ఉష్ణోగ్రత ఆధారంగా ప్రవాహాలు ఎన్ని రకాలు? 2 (ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు)
- ఉష్ణ ప్రవాహాలు అనగా? ఉష్ణాన్ని బదిలీ చేసే సముద్ర ప్రవాహాలు
- ఉష్ణ ప్రవాహాలుకు మరొక పేరు? వెచ్చని సముద్ర ప్రవాహాలు అంటారు (శీతల సముద్ర ప్రవాహాల కంటే ఎక్కువ వేగంగా పయనిస్తాయి)
- గల్ఫ్ స్ట్రీం ఏ రకమైన ప్రవాహం? ఉష్ణ ప్రవాహా౦
- చల్లని నీటిని ప్రసరణ చేసే ప్రవాహాలు ఏవి ? శీతల ప్రవాహాలు
- శీతల ప్రవాహాలుకు ఉదా? లబ్రడార్ (ఉ అమెరికా తూ తీరం లో ప్రవహిస్తుంది)
- అట్లాంటిక్ మహాసముద్ర ప్రధాన ప్రవాహాలు ఏవి? ఉ భామధ్య రేఖా ప్రవాహం, ద భూమధ్య రేఖా ప్రవాహం
- గల్ఫ్ స్ట్రీం అనేది ______? ఉ భామధ్య రేఖా ప్రవాహం (ఉ అమెరికా తూ తీరం లో 37 డిగ్రీల వరకు ప్రవహిస్తుంది)
- గల్ఫ్ స్ట్రీం ప్రవాహం ఎన్ని డిగ్రీలు అక్షాంశం వద్ద 2 గా చీలుతుంది? 40 డిగ్రీల అక్షాంశం వద్ద
- 40 డిగ్రీల అక్షాంశం వద్ద గల్ఫ్ స్ట్రీం ప్రవాహం ఏయే ప్రవాహాలుగా విడిపోతుంది? ఉ అట్లాంటిక్ డ్రిఫ్ట్, కేనరీ శీతల ప్రవాహం
- ద భూమధ్య రేఖా ప్రవాహం వేటి ప్రభావం వల్ల ఏర్పడింది? ఆగ్నేయ వ్యాపార పవనాల ప్రభావం వల్ల ఏర్పడింది
- ద అట్లాంటిక్ ప్రవాహంనకు మరొక పేరు? పశ్చిమ పవన ప్రవాహం అంటారు (బ్రెజిల్ తీరం వెంబడి ప్రవహించి 40 డిగ్రీలు ద అక్షాంశం వద్ద తూ కి తిరిగి పిలువబడుతుంది)
- ద అట్లాంటిక్ ప్రవాహం ఆఫ్రికా ప తీరం చేరిన తరువాత ఏ పేరుతొ పిలువబడుతుంది? బెంగ్యులా శీతల ప్రవాహం గా
- పాక్ లాండ్ ప్రవాహం _________? ఒక శీతల ప్రవాహం (ద. భూమధ్య రేఖా ప్రవాహం లో భాగం)
- పసిఫిక్ మహాసముద్ర ప్రవాహాలు ఏవి? ఉ పసిఫిక్ భూమధ్య రేఖా ప్రవాహం, కాలిఫోర్నియా ప్రవాహం, ద పసిఫిక్ భూమధ్య రేఖా ప్రవాహం, భూమధ్య రేఖా ప్రతి ప్రవాహం, క్యూరోషియో ప్రవాహం, ఒయాషియో ప్రవాహం, పెరు ప్రవాహం, ప్రతి ప్రవాహం / ఎల్ నినో, తూ ఆస్ట్రేలియా ప్రవాహం, ప పవన ప్రవాహం
- ఉ పసిఫిక్ భూమధ్య రేఖా ప్రవాహం ఏ ప్రవాహం మూలంగా ఏర్పడింది? కాలిపోర్నియా ప్రవాహం మూలంగా
- ఉ పసిఫిక్ భూమధ్య రేఖా ప్రవాహం ఏ రకమైన ప్రవాహం? ఉష్ణ ప్రవాహం
- మెక్సికో ప తీరం లో ఏ ప్రవాహం ప్రవహిస్తుంది? కాలిపోర్నియా ప్రవాహం
- ఉ పసిఫిక్ భూమధ్య రేఖా ప్రవాహం ప దిశలో ఉన్న ఏ తీరాన్ని చేరుతుంది? పిలిప్పైన్స్ తీరం
- కాలిఫోర్నియా ప్రవాహం ఏ రకమైన ప్రవాహం? శీతల ప్రవాహం
- కాలిఫోర్నియా ప్రవాహం ఏ ప్రవాహం తో కలుస్తుంది? భూమధ్య రేఖా ప్రవాహం తో కలుస్తుంది
- ద పసిఫిక్ భూమధ్య రేఖా ప్రవాహం ఏ రకమైన ప్రవాహం? ఉష్ణ ప్రవాహం
- ద పసిఫిక్ భూమధ్య రేఖా ప్రవాహ౦ ఏ పవనాల ప్రభావం వల్ల ఏర్పడింది? ఆగ్నేయ వ్యాపార పవనాల ప్రభావం వల్ల ఏర్పడింది
- ద పసిఫిక్ భూమధ్య రేఖా ప్రవాహం ఏ ప్రాంతం లో 2 గా చీలుతుంది ? న్యూ గినియా వద్ద
- ద పసిఫిక్ భూమధ్య రేఖా ప్రవాహం యొక్క ఉత్తర శాఖ కు గల పేరు? భూమధ్య రేఖా ప్రతి ప్రవాహం
- ద పసిఫిక్ భూమధ్య రేఖా ప్రవాహం యొక్క దక్షిణ శాఖ కు గల పేరు? తూ ఆస్ట్రేలియా ప్రవాహం
- భూమధ్య రేఖా ప్రతి ప్రవాహం ఏ రకమైన ప్రవాహం? ఉష్ణ ప్రవాహం
- క్యూరోషియో ప్రవాహం ఏ రకమైన ప్రవాహం? ఉష్ణ ప్రవాహం
- తైవాన్ నుండి బేరింగ్ జలసంధి వైపు ప్రవహి౦చె ప్రవాహం ? క్యూరోషియో ప్రవాహం
- ఒయాషియో ప్రవాహం ఏ రకమైన ప్రవాహం? శీతల ప్రవాహం
- ఒయాషియో ప్రవాహం నకు మరియొక పేరు? కురైల్ శీతల ప్రవాహం అని పేరు
- ఆర్కిటిక్ లోని శీతల జలాన్ని పసిఫిక్ లోకి రవాణా చేసే ప్రవాహం? ఒయాషియో ప్రవాహం
- పెరు ప్రవాహంనకు మరియొక పేరు? హంబోల్ట్ ప్రవాహం గా పేరు (శీతల ప్రవాహం)
- ప్రతి ప్రవాహం /ఎల్ నినో ఏ ప్రవాహం? ఉపరితల ఉష్ణ ప్రవాహం (ఉ నుండి ద వైపు ప్రవహిస్తుంది)
- పెరు తీరం వెంట ప్రవహించే ప్రవాహం? ప్రతి ప్రవాహం /ఎల్ నినో ప్రవాహం
- భారతదేశ ఋతుపవన వ్యవస్థను ప్రభావితం చేసే ప్రవాహం? ప్రతి ప్రవాహం / ఎల్ నినో
- తూ ఆస్ట్రేలియా ప్రవాహం (ఉష్ణ ప్రవాహం) ఏ ప్రాంతం లో 2గా చీలుతు౦ది ? ఆస్ట్రేలియా తీరం వద్ద
- ప పవన ప్రవాహం (శీతల ప్రవాహం) ఏయే తీరాల మధ్య పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తుంది? టాస్మానియా ద అమెరికా తీరం మధ్య
- హిందూ మహాసముద్ర ప్రధాన ప్రవాహాలు ఎన్ని ? 2 (ఈశాన్య ఋతుపవన డ్రిఫ్ట్, నైరుతి ఋతుపవన డ్రిఫ్ట్)
- ఈశాన్య ఋతుపవన డ్రిఫ్ట్ ఏ ఋతుపవనాల వల్ల ఏర్పడుతుంది? ఈశాన్య ఋతుపవనాల వల్ల ఏర్పడుతుంది
- ఈశాన్య ఋతుపవన డ్రిఫ్ట్ ఏయే డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రవహిస్తుంది? 2 డిగ్రీలనుండి 8డిగ్రీల ద అక్షాంశాల మధ్య
- ఈశాన్య ఋతుపవన డ్రిఫ్ట్ ఏయే ప్రాంతాల మధ్య ప్రవహిస్తుంది? జాంజిబార్ నుండి సుమత్రా దీవి వరకు ప్రవహిస్తుంది
- ఈశాన్య ఋతుపవన డ్రిఫ్ట్ ఎక్కడ 2గా చీలుతుంది? అరేబియా వద్ద (ఒక పాయ ఎర్ర సముద్రం లోకి, మరొకటి సోమాలియా తీరం వెంబడి భూమధ్య రేఖను దాటుతుంది)
- నైరుతి ఋతుపవన డ్రిఫ్ట్ అనేది___? ఈశాన్య ఋతుపవనాలు పూర్తిగా తిరోగమనం చెంది వేసవిలో నైరుతి ఋతుపవనాల మూలంగా ఏర్పడిన వెచ్చని ప్రవాహం
- ద హిందూ భూమధ్య రేఖ ఉష్ణ ప్రవాహం ఏయే తీరాల మధ్య ప్రవాహిస్తుంది? ఆస్ట్రేలియా ఆఫ్రికా తీరలమధ్య ప్రవహిస్తుంది
- ద హిందూ భూమధ్య రేఖ ఉష్ణ ప్రవాహం ఎక్కడ 2 గా చీలుతుంది? మడగాస్కర్ వద్ద
- సముద్ర వనరులు యొక్క ఉపయోగం ఏమిటి? ఆహారం, రవాణా గా, ఖనిజాల మైనింగ్ కోసం చమురు నిల్వలు, జంతు సంబంధ జీవరాసుల పరిశీలనకు
- ప్రపంచ మొత్తం పోషకాలలో ఎంత శాతం సముద్ర చేపల నుండి లభిస్తున్నాయి? 16%
- సాల్మన్ చేపల ఉత్పత్తికి ప్రసిద్ది పొందిన ప్రాంతం? అలస్కా
- ట్యూనా చేపల ఉత్పత్తి ఎక్కడ ఎక్కువ జరుగుతుంది? తూ పసిఫిక్ లో
- చేపల ఉత్పాదకత అధికంగా ఉన్న దేశం? చైనా (ప్రపంచ ఉత్పత్తి లో 3వ వంతు)
- అధిక మొత్తం లో చేపలు ఉత్పత్తి చేసే దేశాలు? పెరు, జపాన్, అమెరికా
- చేపలు ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానాన్ని ఆక్రమించింది? 7వ స్థానాన్ని
- చేపల ఎంత శాతం ఆక్వా కల్చర్ సాగుకి ఉపయోగించ బడుతుంది? 40%
- చేప నూనె కోసం ఏ చేపలు ఉపయోగిస్తున్నారు? అట్లాంటిక్ హెర్రింగ్ మెన్ హడెన్ చేపలను
- సముద్ర పర్యాటకం ప్రపంచ వ్యాప్తంగా ఎంత మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తుంది? 2౦౦ మిలియన్స్ కంటే ఎక్కువ మందికి
- అమెరికా దేశం పర్యాటకం ద్వారా ఎంత ఆదాయాన్ని సమకూర్చు కొంటుంది? 478 బిలియన్ డాలర్స్
- ఎంత శాతం దేశాలకు పర్యాటకం అతి ముఖ్యమైన ఆర్దిక వనరుగా ఉంది? 38% దేశాలకు (8౩% ప్రపంచ దేశాలకు మొదటి 5 ముఖ్యమైన ఆర్దిక అనుకూలతలలో ఒకటిగా ఉంది)
- ఏ కంపెని స్థాపన నుండి వజ్రాలు బంగారం వెండి త్రవ్వడం ప్రారంభించారు? సాం కాలిన్స్ డిమాండ్ టైడల్ కంపెని
- సాం కాలిన్స్ డిమాండ్ టైడల్ కంపెని ఎప్పుడు ప్రారంబించ బడినది? 1950లో
- సముద్ర ఒప్పంద చట్టం ఎక్కడ జరిగింది? జమైకా లోని మాండే గాబెలో
- సముద్ర ఒప్పంద చట్టంలో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? 159 దేశాలు
- సముద్ర ఒప్పంద చట్టం ఎప్పుడు జరిగింది? 1982
- ఉత్పత్తి జరిగే చమురులో ఎన్నవ వంతు అమెరికా సముద్ర తీరలనుండి తీస్తున్నారు? 4వ వంతు (శక్తి విధాన చట్టం 2౦౦5)
- సముద్ర జలాలు ఎన్ని రకాల శక్తిని ఉత్పత్తి చేస్తాయి? 2 రకాల శక్తిని (సూర్య రశ్మి నుండి వచ్చే శక్తి, అలలు తరంగాల నుండి వచ్చే శక్తి)
- అలలు తరంగాల నుండి వచ్చే శక్తికి మరియొక పేరు? సముద్ర ప్రవాహ శక్తి అని పేరు
సముద్ర నిక్షేపాలు (Oceanic sediments)

- సముద్ర అడుగు భాగం లో భూతలంపై నిక్షేపితమై ఉన్న పదార్ధాలును ఏమంటారు? సముద్ర నిక్షేపాలు
- సముద్ర నిక్షేపాలు ఎన్ని రకాలు? 2 (భూ జనిత నిక్షేపాలు, పెలాజిక్ నిక్షేపాలు)
- భూ జనిత నిక్షేపాలు ఏ సముద్ర భాగాలలో కనిపిస్తాయి? ఖండ తీరపు అంచు ఖండ తీరపు వాలుల్లో కనిపిస్తాయి
- భూ జనిత నిక్షేపాలు ఎలా ఉత్పన్నం అవుతాయి? అగ్ని పర్వతాలు కర్బన ఉత్పత్తులు క్రమక్షయం చెందడం వల్ల ఉత్పన్నమౌతాయి (శిధిల పదార్ధాలు కలిగి ఉంటాయి)
- శిలా రేణువుల పరిమాణం ఆధారంగా భూ జనిత నిక్షేపాలు ఎన్ని రకాలు? 3 రకాలు (బంకమన్ను, ఇసుక, గ్రావెల్)
- క్వార్ట్జ్ లాంటి అతి సూక్ష్మశిలా రేణువులతో కూడిన మెత్తని పదార్ధం? బంకమన్ను
- బంకమన్నును 3 రకాలు గా వర్గీకరించిన వారు? ముర్రే శాస్త్రవేత్త
- ముర్రే శాస్త్రవేత్త ప్రకారం బంకమన్ను లో రకాలు ఏవి? నీలి బంకమన్ను, ఆకు పచ్చ బంకమన్ను, ఎర్ర బంకమన్ను
- ఇసుక ఎటువంటి రేణువులు కలిగి ఉంటుంది? ముతక శిలా రేణువులు కలిగి ఉంటుంది
- గ్రావెల్ ఏ రేణువులను కలిగి ఉంటుంది? స్తూల శిలా రేణువులు
- పెలాజిక్ నిక్షేపాలు ఏ సముద్ర భాగాలలో కనిపిస్తాయి? అగాధ సముద్ర మైదానాలు, మహసముద్ర అగాదాలపై కనిపిస్తాయి
- పెలాజిక్ నిక్షేపాలు సముద్ర భూతలం లో ఎంత శాతం ఆక్రమించ బడి ఉంటాయి? 75%
- పెలాజిక్ నిక్షేపాలు ఏ పదార్ధాలను కలిగి ఉంటాయి? కర్భాన ఆకర్భాన పదార్ధాలు రెంటిని కలిగి ఉంటాయి
- కర్బన పదార్ధాలు వేటిచే ఏర్పడతాయి? సముద్ర జీవుల కర్పరాలు ఆస్థి పంజరాలతో కూడిన స్రావాలచే ఏర్పడతాయి
- కర్బన పదార్ధాలు కర్పరాలు కాల్షియం కార్బోనేట్ తో కలిసినపుడు వాటిని ఎలా పిలుస్తారు? సున్నపు రాయి స్రావాలు
- సున్నపురాయి స్రావాలుకు ఉదా ? టేరోపాడ్ స్రావాలు, సున్నపు రాయి స్రావాలు, గ్లోబిజేరినా స్రావాలు
- కర్బన పదార్ధాలు సిలికాతో ఏర్పడినపుడు ఏవిధంగా పిలుస్తారు? సిలికాశ్రావాలు
- డయటం రీతి/రేడియో లేరియన్ రీతి స్రావాలు ? సిలికా శ్రావాలు
- సిలికా స్రావాలు ఎక్కడ ఎక్కువ నిక్షేపించ బడి ఉన్నాయి ? హిందూ అట్లాంటిక్ సముద్ర ద భాగాలలో
- అకార్బనిక పదార్ధాలు అనగా? అగ్నిపర్వాతానికి చెందిన ఎర్రమన్ను రూపాలు
- ఎర్రమన్ను లో ఉండే పదార్ధాలు? సిలికా అల్యూమినియం ఆక్సైడ్ లు
- ఎర్రమన్ను అధిక భాగం లో ఉండే నిక్షేపాలు? పెలాజిక్ నిక్షేపాలు
- అకార్బనిక పదార్ధాలు సముద్ర భూతలం లో ఎంత శాతం ఆక్రమించి ఉంటుంది? 38%
- అగ్ని పర్వత ఉత్పాదిత నిక్షేపాలు ఏ సముద్ర భాగాలలో ఉంటాయి? ఖండ తీరపు అంచు వాలుల్లో ఉంటాయి
- భూ జనేతర నిక్షేపాలు ఏవిధంగా ఏర్పడతాయి? ఉల్కలు తోక చుక్కలు భూమిపై పడినపుడు వాటి శిధిలపదార్ధాలు సముద్రం లో చేరి భూ జనేతర నిక్షేపాలు ఏర్పడతాయి
- ఏ జీవులు నశించడం వల్ల ఆక్సిజన్ శాతం తగ్గుతుంది? ఆల్గే జీవులు
సముద్ర కాలుష్యం (Marine pollution)

- UNO ప్రకారం సముద్ర కాలుష్యం అనగా? మానవుని చేత ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కాని సముద్ర పర్యావరణం లోకి ప్రవేశించిన పదార్ధాలు మానవ ఆరోగ్యానికి విషతుల్య ప్రభావాలను సముద్ర కాలుష్యం అంటారు
- నాన్ పాయింట్ సోర్స్ కాలుష్యం అనగా? కార్లు ట్రక్కులు సెప్టిక్ ట్యాంక్ లు పొలాలు కలప సేద్యపు చర్యల నుండి ఉద్భవించే కాలుష్యం
- ప్రతి ఏటా ఎంత మురుగునీరు సముద్రాలలో చేరుతుంది? 10 వేల మిలియన్ గ్యాలన్ల మురుగునీరు
- ప్రతి ఏటా ఎంత ప్లాస్టిక్ సముద్రాలను చేరుతుంది? 8 మి టన్నుల ప్లాస్టిక్ సముద్రాలను
- 2010లో 1207 మి మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ సముద్రంసముద్రం లో చేరి ఉంటుంది అని ఎవరి అధ్యయనాల ద్వారా తెలిసింది? ఎకోవాచ్ అధ్యనం ప్రకారం
- ప్లాస్టిక్ బ్యాగ్ లు అంతర్గత వరోధాలవల్ల ఎన్ని జీవులు చనిపోతున్నాయి? లక్ష సముద్ర క్షీరదాలు , 2 మిలియన్ల సముద్ర పక్షులు చనిపోతున్నాయి
- ప్రపంచ వ్యాప్తంగా సముద్రాలలో సులభంగా శిధిలం గాని వ్యర్ధాలు ఎన్ని టన్నులుగలవు? 10 కోట్ల మెట్రిక్ టన్నులు గలవు
- ఒక ఔన్స్ నివారణ ఎన్ని పౌండ్ల చికిత్సకు సమానం? ఒక పౌండ్ చికిత్సకు సమానం
- సముద్ర కాలుష్య నియంత్రణ సమావేశాలు
- ఒస్లా సమావేశం (1972) నౌకలు ఎయిర్ క్రాఫ్ట్ ల ద్వారా డంపింగ్ నివారణ
- మార్ పాల్ సమావేశం (1973) ఓడల వల్ల కలిగే సముద్ర కాలుష్య నివారణ
- పారిస్ సమావేశం (1974) భూ ఆధారాల నుండి వచ్చే సముద్ర కాలుష్య నివారణ
- ఒస్టార్ సమావేశం (1992) ఈశాన్య అట్లాంటిక్ లో సంభవించే పర్యావరణ కాలుష్యం పై సముద్ర కాలుష్య నివారణ
for more information visit our website kingsdsc.in