Landforms Of Earth Introducation (పరిచయం)

Topography
- భూ ఉపరితలం పై జరిగే మార్పులు గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం ? భూగోళ శాస్త్రం
- భూమిలోపల జరిగే చర్యలను అధ్యయనం చేసే శాస్త్రం ? భూ స్వరూప శాస్త్రం
- భూ స్వరూప శాస్త్రం అనగా? నిర్మాణానికి దోహదం చేసే ప్రక్రియలను భూ స్వరూప శాస్త్రమా అంటారు
- భూస్వరూపాలు ఏర్పడడానికి దోహదం చేసే కారకాలు ? అగ్నిపర్వతాలు, పలకల కదలికలు

Major Types of Landforms (ప్రధాన భూ స్వరూపాలు రకాలు)
- ప్రధాన భూ స్వరూపాలు Landforms ఎన్ని రకాలు ? 3 (పర్వతాలు పీటభూములు మైదానాలు)
- భూ స్వరుపాలలో అత్యంత ప్రధానమైనవి ? పర్వతాలు
- మనకు లభించే మంచినీటిలో అధిక భాగం ఏ భూ స్వరుపాలనుండి అవిర్భావిస్తునాయి? పర్వతాలు
- పర్వతాల ముడుతలు వేటివల్ల ఏర్పడుతున్నాయి ? పార్శ్వ చలనాల
- ఖండపర్వతాలు లోయలు పీటభూములు వేటివల్ల ఏర్పడుతున్నాయి ? ఊర్ధ్వ అధోముఖ చలనాల వల్ల
- కొండ అనగా? 600 మీటర్ల కంటే తక్కువ ఎత్తుగల భూ స్వరూపాన్ని కొండ అంటారు
- పర్వతం అనగా ? 600 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగల భూ స్వరూపాన్ని పర్వతం అంటారు
- ఉపరితలం మీద శిఖరం తో కూడిన సహజసిద్ద౦ గా ఏర్పడిన ఎతైన భూ స్వరూపం ? పర్వతం
- పర్వతం లో అత్యున్నత స్థానం ? శిఖరాగ్రం
- పర్వతం లో మానవుడు చేరుకోగల భాగం ? శిఖరం
- ఒక ప్రదేశం యొక్క ఎత్తును వేటి ఆధారంగా కొలుస్తారు? సముద్ర మట్టం ఆధారంగా
- పర్వతం యొక్క పొడవును ఎక్కడనుండి కొలుస్తారు? దాని పీటం నుండి ( నీటిలో మునిగి ఉన్నప్పటికీ కూడా)
- పర్వతాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 5 (ముడుత పర్వతాలు, కలశ పర్వతాలు, అగ్ని పర్వతాలు, ఖండ పర్వతాలు, అవసిష్ట పర్వరాలు)
- ముడుత పర్వతాలకు మరొక పేరు ? ఫోల్డ్ మౌంటేన్స్
- ముడుత పర్వతాలు ఎలా ఏర్పడతాయి ? ఫలకాలు ఒక దానికొకటి అభిముఖంగా కదలడం వల్ల భూ పటలం లో రాతి పొరలు ఒత్తిడికి గురై ఏర్పడతాయి
- ముడుత పర్వతాలు ఏ కాలం లో ఏర్పడాయి ? కలిడోనియన్, హీర్సినియన్, అల్ఫైన్ కాలం లో
- ముడుత పర్వతాలు ఏ రకమైన శిలలతో కూడి ఉన్నాయి ? అవక్షేప శిలలు (12 వేల మీటర్ల మంద౦ తో)
- జియో సింక్లైన్ అనగా ? కందకం/ ఖండ పర్వత వ్యవస్థ
- జియో సింక్లైన్ ఎలా ఏర్పడుతుంది ? ఒక ఖండ పలక కిందికి దిగడం వల్ల (మొదటి దశలో) ఏర్పడుతుంది
- జియో సింక్లైన్ ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది ? సముద్ర పలక ఖండ పలక కలిసినపుడు )ఇలా ద. అమెరికా ప. భాగం లో జరిగింది)
- ఏ పలకల ఘర్షణ వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి ? ఆసియా పలక భారతీయ ఉప ఖండ పలక ఘర్షణ వల్ల ఏర్పడ్డాయి
- ముడుతలలో అపనతులను ఎలా పేర్కొంటారు ? పర్వతాలు
- ముడుతలలో అభినతులను ఎలా పేర్కొంటారు ? లోయలు
- సాధారణ ముడుతలకు ఉదా ? పెన్నిస్, వీల్డ్
- అభినతికి మంచి ఉదా ? స్నోడర్ (వేల్స్ లో ఉంది)
- శిలద్రవం పైకి రావడం వల్ల ఏర్పడే పర్వతాలు? కలశ పర్వతాలు
- కలశ పర్వతాలుకు ఉదా ? అండీరాండాక్ పర్వతాలు, బ్లాక్ హిల్స్ (అమెరికాలో)
- అగ్ని పర్వతం అనగా ? ఉపరితలానికి శిలద్రవం, భస్మం, వాయువులు విడుదల చేసే రంద్రం లేదా విదరం (పగులు, ఫిసర్)
- జ్వలాభిలం వద్ద శంకు ఆకారం లో ఏర్పడే పర్వతాలు ? అగ్ని పర్వతాలు
- అగ్నిపర్వతాలు ఎన్ని విధాలుగా ఏర్పడతాయి ? 3 (2 ఫలకాలు దూరంగా జరిగినపుడు ఖాలీ భర్తీ చేయడానికి లావా పెల్లుభికి పొడవైన శ్రేణులు ఏర్పడతాయి. 2 ఫలకాలు దగ్గరగా జరిగినపుడు 2వ ఫలకం అవరోహణ చెంది కరిగిపోవడం వల్ల కూడా అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. ఫలకం మీద హాట్ స్పాట్ మీదుగా కదిలినపుడు ఏర్పడతాయి)
- ప్రపంచం లోనే పొడవైన రిడ్జ్ ఎక్కడ ఏర్పడింది? అట్లాంటిక్ రిడ్జ్
- పర్వత శిఖరాలు ద్వీపాలుగా ఏర్పడ్డాయి అటువంటివాటికి ఉదా ? ఐస్లాండ్ అజోర్స్ కేనరీ
- మధ్య ప్రపంచ మేఖలుగా పిలువబడే అగ్ని పర్వత శ్రేణి ఎక్కడ గలదు? మధ్యధరా సముద్రం లో
- ఫలకం మీద హాట్ స్పాట్ మీదుగా కదిలినపుడు ఏర్పడిన దీవులుకు ఉదా ? హవాయి దీవులు
- భూపటలం లో రాతి పొరలు ఒత్తిడి తట్టుకోలేని స్థితిలో పగిలిపోతాయి. అటువంటి స్వరూపాలకు ఉదా ? బ్రంశాలు
- ఖండపర్వతానికి మరొక పేరు ? బ్రంసోద్ధిత శిలవిన్యాసం (బ్రంశం నుండి పైకి లేపబడిన భాగం)
- ఖండపర్వతాలకు ఉదా ? బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు (ప. జర్మనీలో ఉన్నాయి)
- బ్రంశం లో క్రిందికి జారిన పల్లపు ప్రాంతానికి గల పేరు ? గ్రాబెల్, పగులు లోయ (రిఫ్ట్ వేలి), ఖండ బ్రంసికరణ
- USA లో ఉన్న సియర్రా నెవాడా, వాస్ జేస్ పర్వతాలు మధ్య ప్రాంతం దేనికి ఉదా ? గ్రాబెల్ / పగులు లోయకు
- అంతర్ భూ భాలాల వల్ల కాకుండా బాహ్య బలాలు పీటభూములను క్రమక్షయం చేయడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు? అవసిష్ట పర్వతాలు
- అవసిష్ట పర్వతాలుకు ఉదా ? స్కాటిస్ ఉన్నత భూములు
- వివిధ పరిమాణాలలో ఇసుక దిబ్బలు నిటారుగా ఉంటాయి. ఈ స్వరుపాలకు గల పేరు ? ఇన్సెల్ బర్గ్
- జాన్ పీటభూమి ఎక్కడ గలదు? నైజీరియా
- బిస్మార్క్ శిల ఏ ప్రాంతం లో ఉంది ? టాంజానియా లో
- ఇన్సెల్ బర్గ్ అనేది _____? 2 పెడిమేంట్ల మధ్య పాత ఉపరితలం
- విరూప కారక ప్రక్రియల వల్ల భూపటలం ఉత్తానం చెందిన స్వరూపాలకు గల పేరు ? పీటభూములు
- విరూపకారక పీఠభూమి ప్రక్రియలను ఏమని పిలుస్తారు? టెక్నానిక్ పీఠభూమి అని పిలుస్తారు
- పీటభూములు ప్రధానంగా ఎన్ని రకాలు? రెండు రకాలు (అవి పర్వతాంతర పీఠభూములు, లావా పీఠభూములు)
- చుట్టూ ఉన్న ప్రాంతం కంటే ఎక్కువ ఎత్తు గల పీఠభూములు? పర్వతాంతర పీఠభూములు
- పర్వతాంతర పీఠభూములకు ఉదాహరణ? దక్కన్ పీఠభూమి, టిబెట్ పీఠభూమి, బొలీవియా పీఠభూమి
- టిబెట్ పీఠభూమి ఎక్కడ ఉంది? కున్ లున్ షా – టిబెట్ మధ్య ఉంది
- ఆలిస్ ముడత పర్వతాలలో ఉన్న పీఠభూమి? బొలీవియా పీఠభూమి
- భూ చలనాల వల్ల ఏర్పడి భూ పటలంలో కదలికలు లేకుండా పెద్ద మొత్తంలో లావా కప్పబడి ఉన్న పీటభూములు? లావా పీటభూములు
- పెద్ద మొత్తంలో లావా కప్పబడి ఉన్న స్వరూపాలకు గల పేరు? ఫోల్డ్స్, ట్రాప్స్
- ఉపరితల క్రమక్షయాన్ని నిరోధించినట్లయితే ఏర్పడే స్వరూపాలు? మేసాస్, బుట్టేస్
- మెసాస్ స్వరూపాలు ఏ ప్రాంతాలలో ఏర్పడతాయి? సుశ్క ప్రాంతాలలో ఏర్పడతాయి. వాలు నిటారుగా ఉంటాయి కొన్ని తేమప్రాంతాల్లో ఏర్పడతాయి
- చేదించబడిన పీఠభూమికి ఉదాహరణ? హంబోరి పర్వతాలు (మాలి- ఆఫ్రికాలో ఉన్నాయి)
- మొదటి ఆవాసాలు ఏ భూస్వరూపాలలో ఏర్పడ్డాయి? మైదానాలు
- మైదానాలు సముద్రం కంటే ఎంత ఎత్తులో ఉంటాయి? 160 మీటర్ల ఎత్తులో ఉంటాయి
- . మైదానాలు అనేవి _____? సువిసాలమైన సమతల పల్లపు ప్రాంతాలు
- మైదానాల ఉద్భవాన్ని బట్టి ఎన్ని రకాలుగా విభజించారు? రెండు రకాలు (అవి నిక్షేపిత మైదానాలు, క్రమక్షయ మైదానాలు)
- అవక్షేపాలు నిక్షేపించడం వల్ల ఏర్పడిన మైదానాలు? నిక్షేపిత మైదానాలు
- ఎక్కువ మొత్తంలో నిక్షేపాలను నిక్షేపించగా ఏర్పడిన మైదానాలు? వరద మైదానాలు (వీటినే ప్లడ్ ప్లన్స్ అని పేర్కొంటారు)
- నది ముఖద్వారాల వద్ద ఏర్పడే మైదానాలు? డెల్టా మైదానాలు
- ప్రపంచంలో అధిక జనసాంద్రత గల ప్రాంతాలకు ప్రసిద్ధి పొందిన మైదానాలు? డెల్టా మైదానాలు
- డెల్టా మైదానాలకు ఉదాహరణ? నైలు, గంగ, మిసిసిపి మైదానాలు
- క్రమమైన రీతిలో అమర్చబడని అవక్షేపాలతో ఏర్పడిన మైదానాలు? గోలాష్మ మృత్తిగా మైదానాలు
- గోలాష్మ మృత్తిగా మైదానాలు వేటి వల్ల ఏర్పడతాయి? హిమనీ నదాల వల్ల
- పవన నిక్షేపాల వల్ల ఏర్పడిన మైదానాలు? లోయస్ మైదానాలు
- లోయస్ మైదానాలు ఏ పంటకు అత్యధిక అనుకూలంగా ఉంటాయి? వరి పంటకు
- లోయాస్ మైదానాలు ఎక్కడ గలవు? చైనా
- క్రమక్షయ మైదానాలు వేటి ఆధారంగా ఏర్పడతాయి? నదులు పవనాలు హిమనీ నదాల వికోశీకరణ వల్ల ఏర్పడతాయి
- క్రమక్షమైదానాలకు ఉదాహరణ? కోత మైదానం, లోయ సమతలం, ఎడారి దుమ్ము
- క్రమక్షయం వల్ల ఏర్పడిన విశాల సమతల ప్రాంతం? కోత మైదానం
- కోత మైదానానికి ఉదాహరణ? హడ్సన్ బే (ఇది ఉత్తర అమెరికాలో ఉంది)
- పార్శ్వ క్రమక్షయం ద్వారా లోయలు నదికిరువైపులా విస్తరిస్తాయి ఇటువంటి మైదానాల పేరు? లోయ సమతలాలు
- లోయ సమతలంపై వండ్రు మట్టి నిక్షేపించబడి నిక్షేపిత మైదానం గారూపొందుతుంది దీనినే ఏమంటారు? వరద మైదానం అంటారు
- ఎడారిలో నునుపు శిలా పదార్థానికి గల పేరు? ఎడారి దుమ్ము
- ఎడారి దుమ్ము వేటి ఆధారంగా ఏర్పడుతుంది? పవనక్రమ క్షయం వల్ల ఏర్పడుతుంది. ఎగురువేత మూలంగా సంభవిస్తుంది
- ఎడారి దుమ్ముకు ఉదాహరణ? సహారా ఎడారిలోని రెగ్

Geomorphic Processes (భూ స్వరూప ప్రక్రియలు)
- భూ ఉపరితలాన్ని మార్పుకు గురి చేసే భౌతిక రసాయనిక మార్పులు అన్నిటినీ కలిపి ఎలా ఏమని పేర్కొంటారు?
భూ స్వరూప ప్రక్రియలు అని - భూ స్వరూప ప్రక్రియలు వేటి ఆధారంగా ఏర్పడతాయి? నిర్మాణము, సమయం, ఏర్పడే విధానం
- భూ ఉపరితల బలాలు ఎన్ని రకాలు? రెండు (అంతర్గత బలాలు, బహిర్గత బలాలు)
- భూ అంతర్భాగం నుండి జనించే బలాలు? అంతర్గత బలాలు
- ఏ బలాల వల్ల భూపటల విరూపణ అగ్నిపర్వతా ప్రక్రియలు ఏర్పడతాయి? అంతర్గత బలాల వల్ల
- అంతర్గత బలాలలో ఏర్పడే కదలికలు ఎన్ని? రెండు (క్షితిజ సమాంతర కదలికలు, నిలువు కదలికలు)
- అంతర్గత బలాలను ఎన్ని రకాలుగా విభజించారు? రెండు రకాలు (విరూపకారక బలాలు, ఆకస్మిక బలాలు)
- విరూపకారక బలాలను ఎన్ని రకాలుగా విభజించారు? రెండు (కండోద్భవ బలాలు, పర్వతోద్భవ బలాలు)
- భూ ఉద్ధరణ లో సహాయం చేస్తూ నిరువుగా పనిచేసే బలాలు? కండోద్భవ బలాలు
- సమాంతరంగా పనిచేస్తూ ఉపరితలం వళులుగా ముడుతలుగా పనిచేసే బలాలు? పర్వతోద్భవ బలాలు
- విరూపకారక బలాలకు మరొక పేరు? నిర్మాణాత్మక బలాలు
- విరూపకారక బలాల కదలికలు ఏ విధంగా ఉంటాయి? నిలువు సమాంతరంగా
- ఆకస్మిక బలాల వివిధ రూపాలు? అగ్నిపర్వత ప్రక్రియ, భూకంపాలు అనే రెండు రూపాలు
- భూగర్భంలో శిలాద్రవం వివిధ రూపాలలో ఉపరితలం చేరడమే______ ? అగ్నిపర్వత ప్రక్రియ
- భూమి లోపల మాగ్మా ఏర్పరిచే స్వరూపాలు? బాతోలిత్, డైక్స్, సిల్స్
- తెరచి ఉన్న గొడుగు ఆకారంలో ఉండి పక్క గోడలు నిటారుగా ఉన్న స్వరూపాలు? బాతోలిత్
- బాతులిత్ కి ఉదాహరణ ? ఇంగ్లాండులోని డార్డ్ మోర్, బాడ్ మిన్ మోర్, ల్యాండ్ ఎండ్
- సముద్రాలలో మాగ్మా ఏర్పరచని స్వరూపాలు? బాతోలిత్ లు (ఇవి ఖండ ప్రాంత లోపల వందల కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంటాయి)
- మాగ్మ సమతలంపై ప్రవహించి కోడ వట్టి నిర్మాణం ఏర్పరిస్తే దాన్ని ఎలా పేర్కొంటారు? డైక్
- డైగ్స్ కి ఉదాహరణ? ఐర్లాండ్, స్కాట్లాండ్ పశ్చిమ భాగం లో చూడవచ్చు
- సిల్స్ అనే మాగ్మా ఏర్పరిచే భూ స్వరూపాలు ఏ రకమైన శిలలు? అవక్షేప శిలలు
- చిక్కదనం లేని మాగ్మా 2 పొరల మధ్య ఖాళీలో ఇరుక్కుపోయి పొరలను వేరు చేస్తుంది ఇటువంటి మాగ్మాస్వరూపానికి గల పేరు? సిల్స్
- గనిభవించిన సిల్స్ ను ఏ పేరుతో పిలుస్తారు? షీల్
- సన్నగా ఉన్న షీల్ కు గల పేరు? షీట్
- ఏ ప్రదేశంలో అయితే నది సిల్ ని దాటుతుందో ఆప్రదేశాన్ని ఏ విధంగా పేర్కొంటారు? జలపాతం
- భూ ఉపరితలంపై ఏర్పడే అగ్నిపర్వత స్వరూపాలు? లావా, బూడిద, సిన్దర్ కోన్, శిలాద్రవ శంకువు, పీలి పర్వత ప్రజ్వలనం, మిశ్రమ శంకువు
- భూ ఉపరితలం చేరుకున్న మాగ్మాకు గల పేరు? లావా
- లావా గొట్టం ద్వారా బయటికి వచ్చి శంకు ఆకారంలో ఏర్పడిన స్వరూపానికి గల పేరు? లావా విధరం
- లావా బయటకు వచ్చే మార్గానికి గల పేరు? పైప్
- పైపు పైభాగం ఏ ఆకారంలో ఉంటుంది? గరాటు (దీనినే బిలం అంటారు)
- మాగ్మా విధ్వంసం చిన్న ముక్కలుగా భూమిని చేరి శంకు ఆకారంలో ఏర్పడే స్వరూపానికి గల పేరు? సి౦డర్ కోన్
- సి౦డర్ కోన్ కు ఉదాహరణ ? గ్వాటి మాల లోని డిప్యూగో, మెక్సికోలోని పారి కుట్టిన్, బొక్వేరాన్ అగ్నిపర్వతం
- బొక్వేరాన్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? సన్ బెనాడిట్ ద్వీపంపై (పసిఫిక్ లో)
- శిలాద్రవ శంకువు దేనిపై ఆధారపడి ఉంటుంది? లావా యొక్క జిగట పదార్థం పై
- శిలా ద్రవ శంకువకు ఉదాహరణ? హెల్గా ఫెల్ అగ్నిపర్వతం
- హెల్గా ఫెల్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఐస్ లాండ్
- మానలోవ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? హవాయి దీవులు (వీటి ఎత్తు 9100 మీటర్లు వ్యాసార్థం 400 కిలోమీటర్లు)
- నిట్రవాలు తో జిగట లావాతో గల శంకువకు పేరు? పీలి పర్వత ప్రజ్వలనం
- పీలి పర్వతం ఎప్పుడు ప్రజ్వలనం పొందింది? 1902 సంవత్సరంలో
- పీలి పర్వతం ప్రజ్వలనం వల్ల ఎంతమంది మరణించారు? 30 వేలమంది (సెయింట్ పీయరి రాజధాని మొత్తం నాశనం అయ్యింది)
- మిశ్రమ శంకువు అధిక విస్ఫోటనం వల్ల మరింత పెద్దగా విస్తరిస్తుంది దానికి గల పేరు? కాల్దేరా
- కాల్దేరా కు ఉదాహరణ? క్రేటర్ సరస్సు (అమెరికా)
- అగ్నిపర్వతా ప్రక్రియ దశలు ఎన్ని? మూడు (క్రియాశీలక దశ, నిద్రాణ దశ, విలుప్తదశ)
- క్రియాశీలక దశ అనగా? తరచూ విస్పోటనం చెందే దశ
- నిద్రాణ దశ అనగా? ఎప్పుడో ఒకసారి విస్పోటనం చిందే దశ
- విలుప్తదశ అనగా? ఎప్పుడూ విస్పోటనం చెందని దశ
- పార్శ్వ ప్రజ్వలనం అనగా? అగ్నిపర్వత పార్శ్వ భాగాలు ఉన్న సందుల నుండి పేలుడు లేకుండా చేరితే దానినే పార్శ్వ ప్రజ్వలన అంటారు
- పార్శ్వ ప్రజ్వలనం చెందిన భాగాలు ఏ విధంగా ఏర్పడతాయి? లావా పీఠభూములుగా
- క్రాకటోవా అగ్నిపర్వత ప్రేలుడు ఎప్పటి నుండి ప్రారంభమైంది? 1883 నుండి
- క్రాకటోవా అగ్నిపర్వత ప్రభావం వల్ల ఆస్ట్రేలియాకు ఎంత దూరంలో విపరీత ప్రేలుడు సంభవించింది? 4800 కిలోమీటర్ల దూరంలో
- క్రాకటోవా అగ్నిపర్వతం ప్రేలుడు సమాయం లో వాయువులు ఎంత ఎత్తుకు చేరాయి? 20 కిలోమీటర్ల ఎత్తుకు చేరాయి (బూడిద 80 కిమీ ఎత్తులో గాలిలోకి చేరింది)
- క్రాకటోవా అగ్నిపర్వత ప్రేలుడు పదార్థం 2/3 వంతు జలగర్భంలో మునిగిపోగా మిగిలిన పదార్థమే ఏ విధంగా ఏర్పడింది? కల్దేరా గా
- ఆంట్రిమ్ పీఠభూమి ఎక్కడ ఉంది? బ్రిటన్ లో
- ఆంట్రిమ్ పీఠభూమి విస్తీర్ణం ఎంత? 1,50,000 చదరపు కిలోమీటర్లు
- భూ పటలంపై జరిగే ఆకస్మిక చలనాలకు గల పేరు? భూకంపాలు
- భూకంపాలకు ప్రధాన కారణం? ఒక టేక్తనిక్ పలకపై ఇంకొక పలక కదలడం, అగ్నిపర్వత విస్ఫోటనం
- ప్రధానంగా భూకంపాలు సంభవించే ప్రాంతాలు? మధ్య అట్లాంటిక్రిడ్జ్, సముద్రఖండం, పటలం సంపీడనానికి గురయ్యే ప్రాంతాలు
- ఏ ప్రాంతంలో సంభవించే భూకంపాలు సాధారణ తీవ్రతతో ఉంటాయి? ఆఫ్రికాలో
- చాలా తీవ్రతతో సంభవించే భూకంపాలుకు ఉదాహరణ? ఎల్ ఆస్నాం (1954) ఆగాదిర్ (1960)
- భూకంపం జరిగే బిందువుకు గల పేరు? నాభి
- భూకంప నాబిపై గల కేంద్రానికి పేరు? అధికేంద్రం (తరంగాలు మొదట ఇచటనే డీ కొంటాయి
- భూకంప తీవ్రత కొలిచే పరికరం? సిస్మోగ్రాఫ్ (ఇది ప్రకంపాలను నమోదు చేస్తుంది)
- భూకంపం పరిమాణాన్ని దేని సహాయంతో కొలుస్తారు? రిక్టర్ స్కేల్
- రెక్టర్ స్కేల్ లో ఎన్ని నెంబర్లు ఉంటాయి? 0 నుండి 10
- భూకంప పరిమాణం 2.0 గా నమోదు అయితే దీని తీవ్రతను ఎలా పేర్కొంటారు ? 1.0 గా నమోదైన తీవ్రత కన్నా 10 రేట్లు ఎక్కువ ఉంటుంది అని
- ఏ భూకంపం ప్రభావం వల్ల సముద్ర గర్భం పెరిగి కొన్ని ప్రదేశాలలో సముద్ర లోతు తగ్గింది? మొరాకో భూకంప ప్రభావం వల్ల
- ఏ భూకంప శాస్త్ర ప్రభావం వల్ల తీర ప్రాంత శిలల ఎత్తు 16 మీటర్ల పెరిగింది? అలస్కా భూకంపం (1899)
- అల్జీరియా భూకంపం వల్ల ఎంత మేర ప్రదేశం నాశనం అయ్యింది? 40 కిలోమీటర్లు వ్యాసార్థం గల ప్రదేశం (ఉపరితలంలో మూడు మీటర్లు వరకు పగుళ్లు ఏర్పడ్డాయి) 1954లో
- తరంగాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? రెండు (అవి శరీర తరంగాలు, ఉపరితల తరంగాలు)
- శరీత తరంగాలు తిరిగి ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి? రెండు రకాలు (ప్రాథమిక తరంగాలు, ద్వితీయ తరంగాలు)
- శిలలను ముందుకు వెనుకకు కదిలేటట్లు చేసి తరంగాలు? ప్రాథమిక తరంగాలు
- ఉపరితలం గుండా పయనించే తరంగాలు? ద్వితీయ తరంగాలు/ ఉపరితల తరంగాలు
- ఎల్ తరంగాలు ఆర్ తరంగాలకు గల పేరు? ఉపరితల తరంగాలు
- ఉపరితల తరంగాలు నాభి గుండా పయనించిన కంపన తరంగాల కంపర పరిమితి నిమిషానికి ఎన్నిసార్లు ఉంటుంది?
200 సార్లు - సునామీ ప్రభావం వల్ల ఉపరితల కెరటాలు ఎంత ఎత్తు వరకు చేరుతాయి? 2.5 మీటర్ల ఎత్తు వరకు
- బహిర్గత బలాలు అనేవి ఎక్కడ పనిచేస్తాయి? భూ ఉపరితలంపై
- అన్ని బహిర్గత బలాలకు కావలసిన శక్తి ఎక్కడ నుండి లభిస్తుంది? సూర్యుని నుండి
- శిలా సైదిల్యం అనగా? శిలలు సహజ స్థితిలో విచ్ఛిన్నం చెందడాన్ని శిలా సైదుల్యం అంటారు
- క్రమక్షయ రవాణాకు కావలసిన ముడి పదార్థాలను అందించేది? శిలా సైదిల్యం
- వికోశికరణం అనే పదం ఏ భాషాపదం ? లాటిన్
- వికోశికరణం అనగా ? శిలలు విచ్చిత్తి కావడం
- వికోశికరణ ప్రక్రియలు ఎన్ని ? 4 (శిలాసైదిల్యం, పదార్ధ రాసి నాసనం, క్రమక్షయం నిక్షేపణ౦)
- భూ స్వరూపాలు ఏర్పడే విధానం లో మొదటి ప్రక్రియ? శిలాసైదిల్యం
- సాధారణ శిలసైదిల్యం ఎక్కడ సంభవిస్తుంది? ఖనిజాలకు తేమ అందుబాటులో ఉండే ప్రాంతాలలో
- శిలాసైదిల్య రకాలు ? 3 (భౌతిక శిలా సైదిల్యం, రసాయనిక శిలా సైదిల్యం, జీవ సంభంద శిలా సైదిల్యం)
- భౌతిక శిలా సైదిల్యం ఎన్ని రకాలుగా ఉంటుంది? 4 రకాలు (అపదలనం, పీడన విముక్తి, మంచు చర్య, బ్లాకులుగా విడిపోవడం)
- అపదలనం అనగా ? ఉష్ణోగ్రత /తేమ కారణంగా శిలలు పైపొర పగిలిపోవడం
- అపదలనం ఎక్కడ సంబవిస్తుంది? ఉష్ణ ఎడారులు, ఆర్ద్ర సమ శీతోష్ణ ప్రాంతాలలో
- భౌతిక శిలా సైదిల్యంలో యోసోమైట్ జాతీయ పార్క్ ఏ రకమైన సైదిల్యానికి ఉదాహరణ గా చెప్పబడినది ?
అపదలనం - యోసోమైట్ జాతీయ పార్క్ ఎక్కడగలదు ? అమెరికా లో
- హిమానీనదాలు అవక్షేపశిలలు బరువు ఒత్తిడి తొలగి బీటలు ఏర్పడి పై పొర విచ్చిన్నం కావడాన్ని ఏమంటారు?
పీడన విముక్తి - మంచు చర్య అనగా ? శిలల పగుళ్ళలో చేరిన నీరు గడ్డ కట్టినపుడు ఒత్తిడికి బద్దలై పోవడం
- మంచు చర్య ఎక్కువగా ఏ ప్రాంతం లో సంబవిస్తుంది ? ఆర్కిటిక్ ప్రాంతం
- శిలలు వేడెక్కి చల్లబడడం వల్ల శిలలు దీర్ఘ చతురస్రాకారంగా విచ్చిత్తి చెందడాన్ని ఏమంటారు ? బ్లాకులు గా విడిపోవడం అంటారు
- శిలలు నీటితో లేదా ఆక్సిజన్/కార్బన్ డై ఆక్సైడ్ కలిసి విఘటనం చెందడాన్ని ఎలా పేర్కొంటారు? రసాయన శిలా సైదిల్యం
- కొన్ని ఖనిజాలు రసాయన సంఘటన లో మార్పు చెంది శిలల నుండి విచ్చిన్నం చెందడమే ____? రసాయన శిలా సైదిల్యం
- రసాయనిక శిలా సైదిల్యం ఎన్ని విధాలుగా జరుగుతుంది ? 5 (ద్రావణికరణం, జల సంకలన చర్య/ఆర్ద్రికరణం, జల విశ్లేషణ, ఆక్సికరణం, కార్బనేటికరణం)
- ద్రావణికరణం అనగా ? ఖనిజాలు నీటిలో కరిగి ద్రావణ రూపం లో మాతృ శిల నుండి విడిపోవడం
- శిలలు నీటిని పీల్చుకొన్నపుడు వాటి పరిమాణం పెరిగి ఆ శిలలో కొన్ని ఖనిజాలు మార్పు చెంది ఆశిలలు బలహీన పడడాన్ని ఏమంటారు? జల సంకలన చర్య/ఆర్ద్రికరణం
- జల విశ్లేషణ అనగా ? ఒక శిల నీటిని పీల్చుకోన్నప్పుడు ఆశిలలో సిలికేట్ ఖనిజాలు హైడ్రోజన్ పరమాణువుల మధ్య రసాయన చర్య సంభవించి విచ్చిన్నతకు దారి తీయడం
- జల విశ్లేషణకు ఉదా ? పొటాషియం ఫెల్డ్ స్పార్ జల విశ్లేషణ చెంది ఆకయోలిన్ గా మార్పు చెందడం
- శిలలు ఆక్సిజన్ నీటిలో సంపర్కం చెందినపుడు రసాయన చర్య జరిగి లోహాలు ఆక్సైడ్ లుగా మారినందువల్ల ఆశిలలు బలహీనపడతాయి దీనికి గల పేరు ? ఆక్సీ కరణం
- ఆక్సికరణంకు ఉదా ? ఇనుము ఆక్సీకరణ మూలంగా హైడ్రాక్సైడ్ లు గా మార్పు చెందడం
- కార్బనేటికరణం అనగా ? వాతావరణం లోని కార్బన్ డై ఆక్సైడ్ వర్షపు నీటిలో కరిగి బలహీనమైన ఆమ్లం తయారవుతుంది దీనిపేరే
- కార్బనేటికరణం ఎలా ఏర్పడుతుంది? ద్రావణం తో కార్బోనేట్ లేదా బై కార్బోనేట్ అయాన్లు చర్య జరపడం వల్ల ఏర్పడుతుంది
- కార్బనేటికరణానికి ఉదా? కార్బోనిక్ ఆమ్లం తో పొటాషియం హైడ్రాక్సైడ్ చర్య జరిపి పొటాషియం కార్బోనేట్ గా మార్పు చెందడం
- జీవ సంభంద శిలా సైదిల్యం ఏ విధంగా జరుగుతుంది ? వృక్షాల వేర్లు రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి ఇవి శిలలను సైదిల్యానికి గురి చేస్తాయి (ఉదా: జంతువులూ చేసే బోరియలు వల్ల కొన్ని శిలలు శిధిలం అవుతాయి)
- ఒక ప్రాంత జీవము /జీవ వైవిద్యం దేనిపై ఆధార పడుతుంది? అటవీ సంపద మీద
- ఎత్తైన ప్రదేశం లో ఏటవాలు ప్రాంతాలను ప్రభావితం చేసే నిమ్నికరణ ప్రక్రియ? పదార్ధ రాసి నాసనం
- పదార్ధ రాసి నాసనం అనగా ? భూ ఉపరితలం పై వదులుగా కప్పి ఉంచే మట్టి అణువుల మిశ్రమం రవాణా మాధ్యమాల సహాయం పొందకుండా గురుత్వాకర్షణ ప్రభావం తో కదలడం
- పదార్ధ రాసి నాసనం ఎప్పుడు సంభవిస్తుంది? శిలా సైదిల్యం తరువాత క్రమక్షయం రవాణాకు ముందు సంబవిస్తుంది
- పదార్ద రాశి నాశనం తీవ్రంగా ఉండడానికి కారణం ? వాలు
- వాలు ఎన్ని రకాలుగా పయనిస్తుంది? 5 (సాయిల్ క్రీప్, ఫ్లో, మడ్ ఫ్లో, లేండ్ స్లైడ్, రాక్ ఫాల్)
- ఘనిభావించిన నేల కరిగినపుడు ప్రవాహ స్థితికి మారి సబ్ సాయిల్ మీదనుంచే ప్రవహిస్తుంది దీనినే? మృత్తికా సర్పణం
- సాయిల్ క్రీప్ ని ఎలా గుర్తించ వచ్చు? చుట్టూ కంచె వేయడం వల్ల గుర్తించవచ్చు
- సాయిల్ క్రీప్ అనేది _____? రెగోలిత్ ప్రవాహం
- ఫ్లో ______________? సాధారణ సర్పణం కన్నా వేగంగా జరుగుతుంది (కొన్ని సందర్భాలలో ద్రవ పదార్ధంగా మారి ప్రవాహంగా పయనిస్తుంది)
- బురద ప్రవాహంనకు మరొక పేరు ? మడ్ ఫ్లో
- మడ్ ఫ్లో అనేది _________? భూ ప్రవాహం కన్నా వేగంగా పయనిస్తుంది
- మడ్ ఫ్లో ఎక్కువ ఎక్కడ సంభవిస్తుంది? ఎడారులలో
- మడ్ ఫ్లో టండ్ర ప్రాంతం లో ఎప్పుడు సంభవిస్తుంది ? వేసవి ప్రారంభం లో సంభవిస్తాయి
- లేండ్ స్లైడ్ ఎప్పుడు సంభవిస్తుంది? పెద్ద మొత్తం లో కొండ చరియలు విరిగినపుడు సంభవిస్తుంది
- సాధారణంగా దోర్లిపోవడం పడిపోవడం వల్ల ఏది సంభవిస్తుంది? ల్యాండ్ స్లైడ్
- రాక్ పాల్ అనగా ? శిలా పాతాలు (ఒక శిలా ఖండం నిటారు వాలు ప్రాంతం నుండి విడిపోయి వాలు వెంబడే వేగంగా పడిపోవడం)
- పదార్ధ రాసి నాశనం ఎప్పుడు సంభవిస్తుంది? వాలు అస్తిరంగా ఉన్నపుడు
- వాలు అస్తిరతకు కారణాలు? 5 (అఘాతాలు, వాలుతల మార్పులు, క్రిందిభాగపు కోత, అసాధారణ అవపాతం, అగ్నిపర్వత ఉద్భేధానం)
- భూ ఉపరితల శిధిల శిలా పదార్ధాలు సంగ్రహించి తొలగించడానికి గల పేరు? క్రమక్షయం
- ఎరోజన్ అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది ? ఎరోడియా (గ్రీకు పదం)
- క్రమక్షయాన్ని ప్రభావితం చేసే కారకాలు ? అవపాతం, వర్షపాతం, సగటు ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రత వ్యత్యాసాలు, పవన వేగం, తుఫానులు, పునఃపున్యం
- వేటిని క్రమక్షయ నిక్షేపనా భూ స్వరుపాలుగా పేర్కొంటారు ? నదులు, పవనాలు, హిమానీనదాలు, సున్నపురాయి
- ఏ క్రమక్షయ కారకమైనా తన గమ్యం పూర్తీ చేయడానికి ౩ దశలు అనుసరిస్తుందిఅలానే నదీ కూడా పుర్తిచేసుకొంటు౦ది అని పెర్కొన్నవారు? WM డేవిస్
- నదులు ఎన్ని విధాల క్రమక్షయాన్ని కల్గి ఉంటాయి? 2 (1 యాంత్రిక, రసాయనిక క్రమక్షయం 2 నిలువుగా కిందికి కోతవేయడం, పార్శ్వ క్రమ క్షయం
- ఘర్షణ అపఘర్షణ ద్రవనికరణ కర్బనికరణ ద్వారా కలిగే క్రమక్షయం? యాంత్రిక క్రమక్షయం
- అపఘర్షణ ద్వారా ద్రావనికరణం కర్బనికరణం ద్వారా కలిగే క్రమక్షయం? రసాయనిక క్రమక్షయం
- నిలువుగా క్రిందికి కోతవేయడం అనేది దేనికి దారి తీస్తుంది? లోతైన లోయకు దారి తీస్తుంది
- లోయ విస్తరనకు దారి తీసే క్రమక్షయం ? పార్శ్వ క్రమక్షయం
- క్రమక్షయ ప్రక్రియలు ఎన్ని ? 4 (తుప్పు లేదా రాపిడి (ఒరిపిడి), జలోత్పిడన చర్య, సన్నీ ఘర్షణ, ద్రావనికరణం లేదా తుప్పు)
- ఏ ప్రక్రియలో ఉపరితలం గోడలకు గల రాళ్ళు వదులు మట్టి పదార్ధం తొలగిపోతుంది? తుప్పు లేదా రాపిడి (ఒరిపిడి) ప్రక్రియలో
- తుప్పు లేదా రాపిడి (ఒరిపిడి) ప్రక్రియ అనగా ? నది క్రమక్షయ కారకాల ద్వారా ఏర్పడిన శిలా విచ్చేదన౦
- జలోత్పిడన చర్య (హైడ్రాలిక్ ఏక్షన్) ప్రక్రియలో శిలల పదార్ధాలు తొలగించడం లోకీలక పాత్ర వహి౦చేది ?
నీరు - నీటిలో గల రాళ్ళుమధ్య రాపిడి జరిగి అవి క్రమక్షయం చెందడాన్ని ఏమంటారు? సన్నీ ఘర్షణ (అట్రిసన్)
- ద్రావనికరణానికి గల పేరు ? తుప్పు
- నది దశలు ఎన్ని? 3 (యవ్వన దశ, పరినతిదశ, చివరి లేదా వృద్ద దశ)
- యవ్వన దశలో నది ఏర్పరిచే స్వరూపాలు ? వి ఆకారపు లోయలు, జలపాతాలు, రాపిడ్లు, అంతభందిత కూటాలు
- విలోమ/తిర్యక్ ప్రొఫైల్ గా (ట్రాన్స్ ఫర్ ప్రొఫైల్) పేర్కొంటారు? వి ఆకారపు లోయలను
- జలపాతం పడే లోతైన భాగం ? ఫ్లంజ్ పూల్
- పూల్అనగా? నెమ్మదిగా ప్రవహించే నీరు
- రిఫెల్ అనగా ? గాధ జలపాత ప్రాంతం (నీటి మార్గాన్ని అధిక లోతుకు ప్రవహించే టట్లు చేస్తుంది)
- ఇంగిల్టాన్ జలపాతం ఎక్కడ కలదు? యార్క్ షైర్
- నది రాపిడ్లు ఏ దశలో ఏర్పడతాయి? యవ్వన దశలో
- నదికి ఇరువైపులా ఉన్న ఎత్తైన భూ రక్షకులకు గల పేరు? అంతర్భందిత కూటాలు (సర్ఫ్ లు)
- లోథార్ హిల్స్ ఎక్కడ ఉన్నాయి ? దమ్రిస్ లో
- నదికి ఏ దశలో పార్శ్వ క్రమక్షయం అధికంగా ఉంటుంది? ఇంటర్ మీడిఎట్ దశలో (పరిణతి దశ)
- నది బ్లఫ్ లు ఏర్పడు దశ ? ఇంటర్ మీడిఎట్ దశలో (పరిణతి దశ)
- ఇంటర్ మీడిఎట్ దశలో (పరిణతి దశ)లో ఏర్పడు స్వరూపాలు ? బ్లఫ్ లు, వెడల్పైన లోయలు
- నదులు వరద మైదాన సమయం లో నిక్షేపాలను ఒడ్డుపై రిడ్జ్ లా ఏర్పాటు చేసే ఆకారం పేరు? లేవీ
- వైరావి/వైరు నది ఎక్కడ కలదు? న్యూజిలాండ్
- ఆక్స్ భౌ సరస్సులుకు ఆపేరు రావడానికి కారణం? ఎద్దు అడుగును పోలి అర్ధ చంద్రాకారంలో ఉండడం వల్ల ఆపేరు వచ్చింది
- వరద మైదానం చిన్న ముక్కలుగా ఏర్పడడానికి గల పేరు? నదీ వేదికలు
- నది ఒంపులు దిగువకు కదిలే సమయం లో పై భాగం లో వరదను వదిలి వేస్తాయి దీనికి గల పేరు ? టేర్రోసేస్ (ఇవే ఆక్స్ భౌ సరసులుగా ఇవి రూపాంతరం చెందుతాయి)
- మార్గం లో నిరోధక శిల ఉండడం వల్ల వంపులు ప్రారంభం అవుతాయి వీటిని ఏమంటారు? నది ఒంపులు
- నదీ దశలలో చివరి దశ? చివరి / వృద్ద దశ
- నదీ పాయలు వేరు చేయబడి మరలా కలుస్తాయి ఇలా కలిసిన నదికి గల పేరు ? జటాకృతి నది
- వేణి నది అనగా? నది విసర్జిత సామర్ధ్యం తగ్గినట్లయితే నదిలో నిక్షేపిత పదార్ధం మరింత ఎక్కువ అవుతుంది
- వరదతో ఉన్న నది ఒడ్డున నిక్షేపనం జరుగిన స్వరూపానికి గల పేరు ? కరకట్టు
- డెల్టా అనగా ? చిన్నగా ఉన్న చిత్తడి నేల (నది సముద్రం లో ప్రవేసించే ముందు నిక్షేపణ చేసిన ఒండ్రుమట్టి సిల్ట్)
- మిస్సిసిపి డెల్టా, బయోనది డెల్టా గల దేశం ? ఇథియోపియా
- కయ్యాలు ఎలా ఏర్పడతాయి? డెల్టా నది ముఖ ద్వారం లో నిక్షేపించబడిన పదార్ధాలచే
- సీన్ నది ఎక్కడ కలదు? ఫ్రాన్స్
- విస్తులా నది గల దేశం? పోలాండ్
- ఓల్గా నది ఎక్కడ గలదు ? రష్యా
- పవన ప్రభావం ఎక్కువగా గల ప్రాంతాలు? ఉష్ణ ఎడారులు
- ప్రపంచ ఎడారులా విస్తీర్ణం సం కి ఎంత పెరుగుతుంది? 50 లక్షల హెక్టార్ల చెప్పున సం కి పెరుగుతుంది
- ఎగురవేత తరువాత మిగిలిన ఉపరితలానికి గల పేరు? హమడా/రాతి ఎడారి
- ఎగురువేత అనగా ? చిన్న కణాలు శిలల నుండి తొలగించ బడడం
- అతిపెద్ద హమడా లలో ఒకటిగా ప్రసిద్ది పొందినది ? ఎల్ హమ్రా (లిబియా సహారాలో)
- ఆకస్మిక హింసాత్మక వర్షం సంభవించే ప్రాంతం ? బాడ్ లాండ్
- భూతలంపై అనేక సందులుగా రిడ్జ్ లుగా చీలికలు ఏర్పడడం స్వరూపాలు? బాడ్ లాండ్
- బాడ్ ల్యాండ్ కు ఉదా? అల్బర్టా నుండి ఆరిజోనా వరకు ఏర్పడిన ఎడారి (ఇది డకోటాస్ వరకు విస్తరించింది)
- పవన క్రమక్షయం ద్వారా ఏర్పడే భూ స్వరూపాలు? రాక్ ఫెడేస్టాల్, జాగెన్, యర్దాంగ్స్, ఎగురవేత హరి వాణాలు, ఇన్సెల్ బర్గ్
- రాక్ ఫెడేస్టాల్ అనగా ? శిలలు గాలితో జరిగే అపగార్షణ ద్వారా విచిత్ర ఆకారం లోకి మారడం
- తిబెస్టి పర్వతాలు ఎక్కడ గలవు? మధ్య సహారాలో
- గారా పర్వతాలు ఎక్కడ గలవు? సౌది అరేబియా
- ఎడారి శిలా సముదాయం లో కొన్ని పొరలు మెత్తగా గట్టిగా ఉండి వాటి మధ్య పొడవైన సంధులు ఉంటాయి వాటికి గల పేరు ? జాగెన్
- పవన ప్రభావం వల్ల మెత్తనిపొర క్రమక్షయం చెంది గట్టి పొర రిడ్జ్ మాదిరిగా కనిపిస్తుంది దానికి గల పేరు? యార్దాంగ్ లు
- యార్దాంగ్ ల ఎత్తు సాధారంగా యెంత ఉంటుంది? 5-15 మీటర్లు
- ఇన్ సలహా యర్దాంగ్ ఎక్కడ గలదు? మధ్య ఆస్ట్రేలియా
- కార్న్ ఓం యర్దాంగ్ ఎక్కడ కలదు? ఈజిప్ట్
- ఒయాసిస్ కు ఉదా ? ఖట్టర అఖాతం (ఈజిప్ట్)
- ఖట్టార అఖాతం అలేగ్జండ్రియా దేశానికి ఏ దిశలో ఉంది? నైరుతి దిశలో
- ఖట్టార అఖాతం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో గలదు? 120 మీ ఎత్తులో
- ఎడారులలో క్రమక్షయం చెంది మిగిలిపోయిన చిన్న కొండలుకు గల పేరు? ఇన్సెల్ బర్గ్
- పవన నిక్షేపణ ద్వారా ఏర్పడు భూ స్వరూపం? సాల్టేషాన్
- సాల్టేషాన్ అనగా ? ఎడ్డిస్ అని పిలువబడే గాలి కదలికల వల్ల ఇసుక రేణువులు ముందుకు కదలడం
- సాల్టేషాన్ ద్వారా ఏర్పడు దిబ్బలు ఎన్ని రకాలు? 2 (బార్కన్లు, సీఫ్)
- బార్కన్లు అనగా ? అర్ధ చంద్రాకారం లో ఏర్పడిన ఇసుక దిబ్బలు
- ఎక్కువ బార్కన్లు ఎక్కడ చూడవచ్చు? అరేబియా ఎడారిలో అనేకం
- బార్కన్ల ఎత్తు ఎంత ఉంటుంది? 8-30 మీటర్లు
- బార్కన్ల వెడల్పు ? 400 మీటర్లు
- రిడ్జ్ ఆకారం లో పవనాలకు సమాంతరంగా నిటారుగా గల భూ స్వరూపాలు? సీఫ్ లు
- సీఫ్ ల సృ౦గం _____? చాలా పదును గా ఉంటుంది (ఎత్తు 100 మీ, పొడవు 150 కిమీ)
- ధ్రువ ప్రాంతాలులో ఎత్తైన పర్వత ప్రాంతాలనుండి అతినెమ్మదిగా జాలువారే మంచుకు గల పేరు? హిమనినదాలు
- హిమనినదాలు ఎన్ని రకాలు? 4 రకాలు (ఐస్ షీట్స్ లేదా ఐస్ క్యాప్స్, లోయ/పర్వత హిమని నదం, సిర్క్ హిమానీనదం, గిరిపద హిమానీనదం)
- ఐస్ షీట్స్ లేదా ఐస్ క్యాప్స్ అనేవి ____? కొన్ని వందలు వేల కిమీ వైశాల్యం దుప్పటి పరచినట్లు ఉంటుంది, ఖండ తీరానికి వ్యాపించి 5౦౦ కిమీ వెడల్పు గల మంచు తీర అంచును ఏర్పరస్తుంది, ప్రపంచ మంచులో 85% ఆక్రమించ బడి ఉంది (10% గ్రీన్ లాండ్ లో ఉంది)
- హిమనీనద పై భాగం లో ఉండి నాలుక ఆకారం లో జాలు వారే హిమానీనద రకం? లోయ/పర్వత హిమని నదం
- చిన్నమొత్తం లో పర్వతానికి పక్కన/శిలలోని పైభాగ ఖాళీ ప్రదేశం లో చేరుకొన్న మంచు ఇది ఏరకమైన హిమానీనదం? సిర్క్ హిమానీనదం
- పర్వత పాదాల వద్ద ఏర్పడిన హిమానీనదం? గిరిపద హిమానీనదం (పిడ్ మెంట్ గ్లేషియర్)
- పర్వత పాదాల వద్ద కలుసుకొన్న సంయుక్త హిమానీనదాలు? గిరిపద హిమానీనదాలు
- వేసవిలో హిమానీనద మంచు కరగడాన్ని ఎలా పేర్కొంటారు? హిమనీనది అంతం
- గ్లేషియర్ అబ్లేషణ్ అనగా ? మంచుకొండల రూపం లో హిమనీనదాలపై కరిగే మంచు పరిమాణం
- గ్లేషియర్ అబ్లేషణ్ అనేది _____? కూడా బెట్టడానికి అనే పదానికి వ్యతిరేఖం
- గ్లేశియాల్ కి గ్లేశియాల్ అబ్లేషణ్ కి మధ్య గల మంచును ఏమంటారు? నికర మిగులు (నెట్ బేలెన్స్)
- హిమనీనది వ్యవస్థలు ఏర్పరిచే భూ స్వరూపాలు? హిమానీనదం గర్తలు, మొరైన్ లు, నిక్షేపనం వల్ల ఏర్పడినభూ స్వరూపాలు, క్రమక్షయం వల్ల ఏర్పడిన భూ స్వరూపాలు
- మంచు ప్రయాణాన్ని వేగాన్ని నిర్దారించేవి? హిమనీనది గర్తలు
- హిమనీనది గర్తలు అనగా ? హిమానీనదం ప్రవహించే లోయలో ఏర్పాటు చేసిన పగుళ్ళు
- హిమానీనదాలు ప్రయాణం లో తీసుకొచ్చి నిక్షేపించిన శిలా పదార్దానికి గల పేరు? మొరైన్ లు
- మొరైన్లు ఎన్ని రకాలు? ఐదు రకాలు ( సబ్ గ్లేషియాల్, యెన్ గ్లేశియాల్ లేటరల్ మొరైన్స్ మీడియాల్ మొరైన్స్ , టెర్మినల్ మొరైన్స్ )
- హిమనీనదానికి లోయ చివరి భాగం లో ఉండే మొరైన్స్ ? సబ్ గ్లేషియాల్ (ఉప హిమానీనద మొరైన్స్ )
- హిమానీనద లోపల ఉండే మొరైన్స్ ? యెన్ గ్లేశియాల్ (అంతర హిమానీనద మొరైన్స్ )
- యెన్ గ్లేశియాల్ మొరైన్స్ ఎలా ఏర్పడతాయి ? ఉపగార్తల నుండి హిమానీనద ఉపరితలం నుండి వచ్చే పదార్ధం వల్ల ఏర్పడుతుంది
- లేటరల్ మొరైన్స్ హిమనీనదానికి ఏ భాగం లో ఉంటాయి ? పక్క భాగం లో (పక్క మొరైన్స్ అని పేరు)
- మీడియాల్ మొరైన్స్ ఎక్కడ ఏర్పడతాయి ? 2 ప్రక్కల మొరైన్స్ కలిసిన చోట
- మీడియాల్ మొరైన్స్ (మధ్య మొరైన్స్ ) ఎప్పుడు ఏర్పడతాయి ? హిమనీనది ఉప హిమనీనది కలిసినపుడు ఏర్పడుతుంది
- టెర్మినల్ మొరైన్స్ అనగా ? సబ్ గ్లేషియాల్, యెన్ గ్లేశియాల్ లేటరల్ మొరైన్స్ మీడియాల్ మొరైన్స్ ఈ 4 మొరైన్స్ కలిసి ఏర్పడతాయి
- హిమనీనది వ్యవస్థ నిక్షేపనం వల్ల ఏర్పడిన భూ స్వరూపాలు? శిలపధర్ధం డ్రం లిన్స్, ఎస్కర్లు, కొమ్స్, ఎరాటిక్స్
- కొమ్స్ అనగా ? స్తిరికరించిన పదార్ధం హిమానీనదం పై లేదా అంచుల వద్ద డెల్టా రూపం లో నిక్షేపించబడిన స్వరూపం
- పొడవుగా సన్నగా సర్పకారం లో ఉండే గుట్టలుకు గల పేరు? ఎస్కర్లు
- ఎస్కర్లు ఎన్ని మీటర్ల ఎత్తు వరకు ఏర్పడతాయి ? 40 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి (పక్క మొరైన్ లకు లంభంగా ఉంటాయి
- ఎస్కర్లకు ఉదా? పిన్ ల్యాండ్ లో సరసులు
- హిమనీనది క్రమక్షయం వల్ల ఏర్పడిన భూ స్వరూపాలు? గ్లేషియాల్ ట్రఫ్, సిర్క్, ఎరిటేస్, లంభమాన ధరులు, రోచే మౌంటెనీ, క్రాగ్ & టెల్
- నిటారుగా ఉండి భూతలం సమతలంగా ఉన్న స్వరూపాలు ? గ్లేషియాల్ ట్రఫ్
- హిమానీనదాలు జారువారుతున్నపుడు అర్ధచంద్రకారంగా ఏర్పడే గుంటలుకు గల పేరు ? సిర్క్
- సిర్క్ లకు గల పేర్లు ? స్కాట్లాండ్ లో కోర్రిలు , వేల్స్ లో స్వమ్, ఫ్రాన్స్ లో సిర్క్ లు
- లేటేర్ బ్రంజేన్ లోయ దేనికి ఉదాహరణ గా చెప్పబడుతుంది? సిర్క్ లకు
- లేటేర్ బ్రంజేన్ లోయ ఎక్కడ గలదు ? స్విట్జర్లాండ్
- 2 లేదా ౩ హిమానీనదాలు పక్కపక్కన అమరినపుడు ఏర్పడే కత్తిలాంటి చదునైన ఉపరితలానికి గల పేరు ? ఎరిటేస్
- ఆకస్మికంగా ముగిసే U అకార లోయ యొక్క ఉపనదికి గల పేరు? లంభమాన ధరులు (హేన్గింగ్ వేలి)
- రోచే మౌంటెనీ అనగా ? బహిర్గత శిలలపై ఏర్పడిన చారలు/గీతలు (ఇవి ఒక పర్వతం వలె ఏర్పడతాయి)
- హిమానీనదం క్రిందివైపుకు ఉండి నిరోధక శిల యొక్క నాబ్ గా పనిచేస్తూ కాపాడే స్వరూపం ? క్రాగ్ & టెల్
- హిమానీనద క్రమక్షయం ఎన్ని రూపాలలో జరుగుతుంది? 3 రూపాలలో (సేపింగ్, ప్లకింగ్, అబ్రాజన్)
- సేపింగ్ అనగా ? విచ్చిన్నం చేయడం
- సేపింగ్ అనగా ? ధ్రువ ప్రాంత శిలల పగుళ్ళలోకి నీరు చేరి గడ్డ కట్టినపుడు మంచుగా మారుతుంది కరిగినపుడు నీరుగా ప్రవహిస్తుంది ఇలా పగుళ్ళు పెద్దగా మారి విచ్చిన్న చెందుతాయి
- హిమనీనదికి పక్కన/కింది భాగాన ఘనీభవించిన శిల ను ఏమంటారు? ప్లకింగ్ లేదా ఉత్పాతనం
- అబ్రాజన్/ అపదలనం అనగా ? హిమానీనద నిక్షేపాలు ఆయుధాలుగా మారి బండ రాళ్ల పైభాగం ఊడిపోయే విధంగా చేయడం
- సున్నపు రాయి క్రమక్షయం వల్ల ఏర్పడు స్వరూపాలు? నిక్షేపణ మైదానాలు, డింట్ , నీటిబుగ్గ , సింక్ హోల్ /స్వాల్ హోల్,
- సున్నపు రాయి నిక్షేపిత భూ స్వరూపాలు ? స్థాలగ్ టైట్, స్థాలగ్ మైట్, స్థంబాలు
- నిక్షేపాల వల్ల ఏర్పడిన మైదానాలుకు గల పేరు? నిక్షేపణ మైదానాలు
- నిక్షేపణ మైదానాలుకు గల మరొక పేరు? ఔట్ వాష్ మైదానాలు అని పేరు (నిటారు ప్రవణత కలిగి ఉంటాయి )
- సున్నపురాయి నిక్షేపాలతో ఏర్పడిన లోయలకు గల పేరు ? లోయ ట్రైన్స్
- వేరు చేయబడిన సున్నపురాయి భాగాలు ? డింట్ / గల్లిస్
- డింట్ / గల్లిస్ యొక్క ఉపరితలానికి గల పేరు ? లైం స్టోన్ పావ్మెంట్
- నీటిబుగ్గ ఎలా అభివృద్ధి చెందుతుంది ? పారగమ్యత గల పారగమ్యత లేని శిల కలిసినపుడు నీటి బుగ్గ అభివృద్ధి చెందుతుంది
- వర్షపు నీరు / అంతర్భూజాలం లో సున్నపురాయి కరిగి పల్లపు ప్రదేశంగా ఏర్పడిన దాని పేరు ? సింక్ హోల్ /స్వాల్ హోల్
- సింక్ హోల్ యొక్క భారీ స్వరూపాన్ని ఏమంటారు ? డోలైన్
- డోలైన్స్ కలిసిపోవడం వల్ల ఏర్పడిన భారి స్వరూపం ? యువాలా
- అగాధ బ్రంశాలు వందల కిమీ వరకు వ్యాపించిన వాటి పేరు ? పోల్జేస్
- అంతర్భూజల గుహలలో కరిగి ఉన్న సున్నపురాయి గుహ పైకప్పు నుండి కిందికి వ్రేలడినట్లున్న స్వరూపం ? స్థాలగ్ టైట్
- స్థాలగ్ టైట్ లు ఏ ఆకారం లో ఉంటాయి ? చేతివ్రేళ్ళ ఆకారం లో
- స్టాలగ్ టైట్ నుండి నీరు కిందికి పడుతున్నపుడు నీరు ఆవిరై సున్నపు రాయి నిక్షేపం పైకి పెరుగుతూ ఉన్న స్వరూపం ? స్థాలగ్ మైట్
- స్టాలగ్ టైట్, స్థాలగ్ మైట్ కలిసిపోయి స్తంభంగా ఏర్పడిన స్వరూపం ? స్థంబాలు
- రవాణా చేయబడిన క్రమక్షయ పదార్ధం ఒక చోట వదిలివేయ బడడాన్ని ఏమంటారు ? నిక్షేపణ

Landform Soil (మృత్తిక)
- నేల (మృత్తిక) అనగా ? రాళ్ళు విచ్చిన్నం కావడం, సేంద్రియ పదార్ధాలు కుళ్లడం, జీవరాసులు నీరు గాలి అంశాల కలయిక వల్ల ఏర్పడిన భూ ఉపరితల పొర
- నేల (మృత్తిక) ఎలా ఏర్పడుతుంది? సైదిల్య ప్రక్రియ రేటు ఆధారంగా (సైదిల్య ప్రక్రియ మీద ఆధార పడి ఉంటుంది)
- ప్రకృతి మూలకాలు మృత్తికా విధానం లో భాగస్వామ్యం కలిగి ఉండడాన్ని ఏమంటారు ? పేడో జెనిసిస్
for more information Please visit our website
Thank you so much sir excellent sir balance lessons kuda twaraga post chayandi sir