పరిచయం (Introduction to Geography)

- ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు కు ఉదా ఏమిటి ? GIS ,Digital కార్టోగ్రాఫీ
- విశ్వం భూగోళం మానవుడు మధ్య సంబంధాలు తెల్పేది ఏది? భూగోళ శాస్త్రం
- జియోగ్రఫీ Geography ఏ భాషాపదం? గ్రీకు భాషాపధం
- జియోగ్రఫీ అనే పదాన్ని మొదట ఉపయోగించింది ఎవరు? ఏరిటోస్థానీస్
- ఏరిటోస్థానీస్ ఏ దేశస్తుడు? గ్రీకు దేశస్తుడు (276-194 BC)
- జియోగ్రఫీ అనే పద౦ ఏ 2 పదాలనుండి ఉద్భవించింది? జియో, గ్రాఫోస్ అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. అందువల్ల ఈ రెండు పదాలు (both words) జియోగ్రఫ్గి అని పేరు రావడం జరిగింది
- సాధారణంగా జియోగ్రఫీ అనగా అర్ధం ఏమి? భూమిని గూర్చిన వర్ణన
- జియో అనగా అర్ధం ఏమిటి? భూమి
- గ్రాఫోస్ అనగా అర్ధం ఏమిటి? వర్ణన
- సామాన్య సాంఘిక శాస్త్రాల నుండి సమాచారం పొంది తద్వారా సంశ్లేషణ కు ప్రయత్ని౦చే శాస్త్రం ఏది? భూగోళ శాస్త్రం
- భూగోళశాస్త్రం ఉద్దేశం ఏమిటి? 2 దృగ్విషయాలు లేదా ఎక్కువ దృగ్విషయాల మధ్య సంబంధం గుర్తించడం (దృగ్విషయాలను వివరించడమే కాకుండా వీటి భవిష్యత్ ను చూస్తుంది)
- సాంఘికశాస్త్ర విభాగం (భూగోళ శాస్త్రం ) సంది౦చే ౩ రకాలు తెల్పండి? ఏమిటి, ఎక్కడ, ఎందుకు
- పైన పేర్కొన్న ఏమిటి అనే అంశం దేనికి సంబంధించినది? ఉపరితలం పై సహజ సంస్కృతిక లక్షణాల సమూహాలను గుర్తించడానికి
- ఏమిటి, ఎక్కడ, ఎందుకు ఈ 3 అంశాలలో విదేశీయుల కాలం లో ప్రాచుర్యం పొందినది ఏమిటి? ఎక్కడ
- ఎక్కడ అనే అంశం దేనిని తెలియజేస్తుంది? భూమిపై మానవ/సాంస్కృతిక లక్షణాల విస్తరణ గూర్చి తెలియజేస్తుంది
- ద్రుగ్విషయాలకు సంబందించిన లక్షణాలు ప్రక్రియలకు సంబందించినవి ఏవి? ఎందుకు (భూగోలశాస్త్రానికి సంబందించిన ప్రశ్న)
- భూగోళం త్రి పరిమానాత్మకం, మ్యాప్ ద్వి పరిమానాత్మకం)
ఇతర శాస్త్రాలతో సంబంధం (Relationship with Other Sciences)
- సంప్రదాయ భూగోళ శాస్త్రం తో సంబంధం గల శాస్త్రాలు ఏవి? భూగర్భ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, జల విశ్లేషణ శాస్త్రం, భూసార అధ్యయన శాస్త్రం
- జీవ భూగోళ శాస్త్రంతో సంబంధం గల శాస్త్రాలు ఏవి? వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, జీవావరణ శాస్త్రం
- సామజిక విజ్ఞాన శాస్త్ర విభాగాలు ఏవి? రాజనీతి శాస్త్రం, సామజిక శాస్త్రం, ఆర్దిక శాస్త్రం, జనాభా అధ్యయనం
భూగోళ శాస్త్ర శాఖలు (Branches of Geography)

- భోగోళ శాస్త్రశాఖలు ఎన్ని? 2 (భౌతిక భూగోళ శాస్త్రం, మానవ భూగోళ శాస్త్రం )
- భోగోళ శాస్త్ర అదనపు శాఖలు ఎన్ని? 2 (ప్రాంతీయ భూగోళ శాస్త్రం, మానచిత్ర లేఖనా శాస్త్రం)
- విజ్ఞాన శాస్త్రాలలో ప్రధానమైన శాస్త్రం ఏది? భౌతికభూగోళ శాస్త్రం
- భౌతిక భూగోళ శాస్త్రం యొక్క ఉద్దేశం ఏమిటి ? భూమి యొక్క సహజ లక్షణాలు అధ్యయనం
- భౌతిక భూగోళ శాస్త్రం లో భాగాలు ఏవి? అంతరిక్ష భూగోళ శాస్త్రం, భూ స్వరూప శాస్త్రం, వాతావరణ శాస్త్రం, సముద్ర శాస్త్రం, మృత్తిక భూగోళ శాస్త్రం, జీవ భూగోళ శాస్త్రం)
- భూ ఉపరితల ప్రక్రియలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? భూ స్వరూప శాస్త్రం
- వివిధ ప్రాంతాల శీతోష్ణ స్టితి అంశాలు అధ్యయనం చేసే శాస్త్రం ఏది? వాతావరణ శాస్త్రం
- భూ ఉపరితలం పై నీటిని గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? సముద్ర శాస్త్రం
- నేలల రకాలు పోషకాలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? మృత్తిక భూగోళ శాస్త్రం
- జీవ భూగోళ శాస్త్రం లో భాగాలు ఏవి? వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, మానవ పరిసరాలు
- మానవ భూగోళ శాస్త్ర ఉద్దేశం ఏమిటి? మానవ జాతిని అధ్యయనం చేస్తుంది
- సంస్కృతిక/సామాజిక భూగోళ శాస్త్ర ఉద్దేశం ఏమి? సమాజం యొక్క అధ్యయనం
- వ్యవసాయం, పారిశ్రామిక, వాణిజ్య రవాణా, పర్యాటకం దేనిలోని భాగాలుగా ఉన్నాయి? ఆర్దిక శాస్త్రం లో
- పొరుగు దేశాలతో గల రాజకీయ సంబంధాలు విధానాలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? రాజనీతి శాస్త్రం
- చారిత్రక ప్రక్రియలు చారిత్రక స్థలాలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? చరిత్ర
- ప్రవర్తనా భూగోళ శాస్త్ర ఉద్దేశం ఏమిటి? వృక్షాలు జంతువులూ జీవుల లక్షణాలు అధ్యయనం
- ఆవాస భూగోళ శాస్త్రం/ పర్యావరణం వేటిని అధ్యయనం చేస్తుంది? నేల కోత, కాలుష్యం పర్యావరణం మొదలగు అంశాలను అధ్యయనం చేస్తుంది
- మానచిత్ర లేఖనా శాస్త్రానికి గల మరొక పేరు ఏమిటి? కార్టో గ్రఫీ
- మానవ భూగోళ శాస్త్రం లో శాఖలు ఏవి ఇవ్వండి ? మానవ జాతి భూగోళ శాస్త్రం , సాంస్కృతిక/సామాజిక శాస్త్రాలు, జనాభా ఆర్దిక, రాజనీతి, చారిత్రక, వైద్య భూగోళ శాస్త్రం.ప్రవర్తనా భూగోళ శాస్త్రం/జీవ, ఆవాస భూగోళ శాస్త్రం / పర్యావరణం అందువల్ల
- for more details please visit our website
Good morning sir
Thanks sir bits pdf pettinamduku