ఆర్యులు ఎప్పటికి భారతదేశం అంతటా విస్తరించారు? క్రి పూ 600 సంవత్సరాలు నాటికి
ఎవరి కాలం నాటికి తెగ రాజ్యాలు మహాజన పదాలు గా మార్పు చెంది రాజరిక గణతంత్ర రాజ్యాలు ఏర్పడాయి? ఆర్యులు కాలం నాటికి
రొమిల్లా థాపర్ ప్రకారం తొలి సమాజాల కాలం లో ఎన్ని మత శాఖలు ఉండేవి? 60 మత శాఖలు
రొమిల్లా థాపర్ ఆకాలం లో ఏమతాలను ముఖ్య మతాలుగా పేర్కొన్నాడు? భౌద్ధ జైన మతాలను
ధనవంతుల ఇళ్ళల్లో అలంకరణ గా వేటిని ఉంచేవారు? మట్టి పాత్రలను (ఇవి గాజు పాత్రల లాగ మెరుస్తూ ఉండేవి )
తొలి సమాజాలు
ఏ కాలం నాటికి తెగ సంస్కృతీ తెరమరుగై వర్ణ వ్యవస్థ అమలులోకి వచ్చింది? క్రి పూ 6వ శతాబ్దం నాటికి
ఋగ్వేదం లో వర్ణ విభజన ను బ్రాహ్మణుల అధిఖ్యాన్ని పేర్కొన్న గ్రంధం? పురుష సూక్తం
ప్రజాపతి దేహం నుండి వర్ణాలు ఆవిర్భవించి నట్లు పేర్కొన్న గ్రంధం ? పురుష సూక్తం
వర్ణధర్మం పాటించడం ప్రజల విధి అని వర్ణాశ్రమ ధర్మం రక్షంచడం రాజు భాద్యత అని పేర్కొన్న గ్రంధం? పురుష సూక్తం
Caste System (వర్ణాలు)
పురుష సూక్తం ప్రకారం ఎన్ని వర్ణాలు ఉన్నాయి? 4 (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, సూద్ర)
బ్రాహ్మణులు
4 వర్ణాలలో ఉన్నత వర్గంగా పేరు పొందిన వారు? బ్రాహ్మణులు
బ్రాహ్మణులూ గోత్రాన్ని ఎప్పుడు రూపొందించారు? క్రి పూ 10౦౦ సం లో
గోత్ర ఏ వర్ణం లో కొనసాగుతుంది? బ్రాహ్మణ వర్ణం లో (బ్రాహ్మణుల తోనే ప్రారంభం అయినది)
గోత్రం అనే పదం ఏ జంతువుకు సంబందించినది? ఆకులకు
గృహ్య సూత్రాలు ప్రకారం గోత్రాలు ఎలా ఏర్పడ్డాయి? 7 మంది ఋషులతో గోత్ర నామాలు ఏర్పడినట్లు పేర్కొంది (సగోత్రికులు)
బ్రాహ్మణుల వృత్తులు ఏవి? వేదాల అధ్యయనం, యజ్న యాగాలు చేయడం, బహుమతులు స్వీకరించడం
క్షత్రియులు
క్షత్రియ వర్ణం ఎలా ఏర్పడింది? బ్రహ్మ దేహం నుండి
క్షత్రియుల వృత్తులు ఏవి?
యుద్దాలు చేస్తూ ప్రజలను రక్షించడం
పరిపాలన
వేదాద్యయనము
యజ్ఞయాగాలు నిర్వహణ
బహుమతుల స్వీకరణ
వైశ్యులు
వైశ్యులు ఎలా ఏర్పడ్డారు ? బ్రహ్మ తొడల నుండి
వైశ్యుల వృత్తులు?
వేదాధ్యయనం
యజ్న యాగాలు నిర్వహణ
వ్యవసాయ వ్యాపారాల నిర్వహణ
బహుమతులు ఇచ్చుట
సూద్రులు
శూద్రులు ఎలా ఏర్పడ్డారు ? బ్రహ్మ పాదాల నుండి (తక్కువ వర్గంగా పేరు పొందారు)
సూద్రుల వ్రుత్తి? పై 3 వర్ణాల వారికి సేవ చేయడం, వ్యవసాయ కార్యక్రమాల నిర్వహణ
రక్త సంబంధ వివాహాలు
సంస్కృత గ్రంధాల ప్రకారం కులం కుటుంబాలకు గిర్తింపునిస్తే వంశం ____? పుట్టుకను తెలియ జేస్తుంది
నాటికాలం లో కుటుంభ విధానం? పితృ స్వామిక వ్యవస్థ అమలులో ఉండేది
వివాహ పద్దతులు
మనుస్మృతి ప్రకారం వివాహ పద్దతులు ఎన్ని రకాలు? 8 రకాలు
ఎండోగమి అనగా? అదే ప్రాంతానికి చెందినవారిని వివాహం చేసుకోవడం
ఎక్సోగమి అనగా ? ఇతర ప్రాంతాలవారిని వివాహం చేసుకోవడం
పోలోగమి అనగా? బహు భార్యత్వం
పోలయాండ్రి అనగా? బహు భర్తృత్వం
సామాజిక విబేధాలు
మన దేశం లో న్యాయ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది? వర్ణ వ్యవస్థ కాలం లోనే
ఏ కాలం లో శూద్రులు బ్రాహ్మణులకు బానిసలుగా ఉండడం వల్ల వారితో స్నేహం చేయడానికి వివాహం చేసుకోవడానికి నిషేధం గా ఉండేది? వర్ణ వ్యవస్థ కాలంలో
సామాజిక పురోగతి
మనదేశం లో జాతులు సంఖ్య? నిర్దిష్ట సంఖ్య లేదు
జాతులును వర్ణాలుగా ఒప్పుకోని వారు? బ్రాహ్మణులూ
జాతులు వారు వృత్తులు నిర్వహించ డానికి ఎలా ఏర్పడ్డారు? శ్రేణులు గా
జాతుల ఏర్పడిన కాలం లోనే శూద్రులు సేవకుల స్తాయి నుండి ఏ స్థాయికి పురోగమించారు ? వ్యవసాయ దారులు గా పురోగమించారు
సమాజం లో అంటరానివారు గా భావించ బడే వారు ఏయే వృత్తులు చేసేవారు? జంతు చర్మాలు మృత కళేబరాల పనులు చేసేవారు (వీరిని సమాజం లో అపవిత్రంగా భావించి అట్టడుగు వారిగా పరిగణించి దూరంగా ఉంచారు)
స్త్రీల పరిస్థితి
ఏ శాస్త్రం ప్రకారం నాటి కాలం లో స్త్రీలకు ఆస్తి హక్కు లేదు? మనుస్మృతి ధర్మ శాస్త్రాల ప్రకారం
స్త్రీలు ఎన్ని పద్దతులలో ఆస్తి పొందే అవకాశం కల్పించారు? 6 పద్దతులలో (అన్న తమ్ముడు తల్లి తండ్రి ద్వారా, వివాహ సమయం లో కానుకలు రూపం లో, ప్రేమతో భర్త ఇచ్చిన ఆస్తి ఈ విధంగా ఆస్తి పొందే అవకాశం కల్పించారు)
వివాహ సమయం లో స్త్రీ కి ఇచ్చే కానుకలపై హక్కు ఎవరికి గలదు ? స్త్రీ కి మాత్రమే (భర్తకు హక్కు లేదు)
భర్త అనుమతి లేకుండా స్త్రీలు ఆస్తి కలిగి ఉండడం నేరంగా పేర్కొన్న గ్రంధం? మను స్మృతి
మనుస్మృతి ప్రకారం ఎన్ని పద్దతుల ద్వారా పురుషులకు ఆస్తి పొందవచ్చు ? 7 పద్దతులు ద్వారా (వారసత్వం, కొనుక్కోవడం, కనుగొనడం, జయించడం, పెట్టుబడి పెట్టడం, సంపాదించడం, బహుమతుల స్వీకరణ