Introduction (పరిచయ)
Climate (శీతోష్ణస్థితి)

- క్లైమేట్ climate అనే పదం ఏ భాష పదం ?గ్రీకు భాష పదం
- క్లైమేట్ climate అనగా అర్థం? వాలు
- శీతోష్ణస్థితి అనగా? ఒక ప్రదేశ ఉష్ణోగ్రత ఆర్ద్రత అనార్థతల సరాసరి
- సరాసరి శీతోష్ణస్థితిని లెక్కించటానికి ఎన్ని సంవత్సరాలు పరిగణలోకి తీసుకుంటారు? 30 సంవత్సరాలు
Factors Influencing Temperature Conditions (శీతోష్ణస్థితి ఆధారపడే అంశాలు)
- శీతోష్ణస్థితి climate ఆధారపడే అంశాలు ఏవి? అక్షాంశం ఎత్తు సముద్ర సామీప్యం పవనాలు వాయిరాసులు అధిక అల్ప పీడన ప్రాంతాలు తుఫానులు సముద్ర పవనాలు నేల ఉద్బిజ్జం వాలు
- ఉన్నత అక్షాంశాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? తక్కువగా ఉంటాయి ( తక్కువ అక్షాంశాలలో అయితే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి)
- భూమధ్యరేఖ ప్రాంతంలో గల ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? అధికంగా ఉంటాయి
- . ఎత్తుకుపోయే కొద్ది ఉష్ణోగ్రతలు ఏ విధంగా తగ్గుతాయి? ప్రతి 165 మీటర్ల కి ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి
- సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? ? అధికంగా ఉంటాయి
- . పోర్టు బెడ్జన్ ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఎక్కడ కలదు? నార్వేలో
- ఏ డ్రిప్ట్ ప్రవాహం వల్ల నార్వేలో చలికాలంలో కూడా మంచు లేకుండా ఉంటుంది? పోర్టు బెడ్జిన్ ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ ప్రభావం వల్ల
- కెనడాలో ప్రవహించే ప్రవాహం? క్యూబిక్ శీతల లాబ్రడార్ ప్రవాహం
- కెనడా ప్రాంతంలో ఏ ప్రవాహం వల్ల శీతాకాలంలో కూడా మంచు కరిగి ఉంటుంది? శీతల లాబ్రడార్ ప్రవాహం వల్ల
- వేడిని గ్రహించే నేలకు ఉదాహరణ? రాతినేలలు ఇసుక నేలలు
- సూర్యరశ్మిని త్వరితంగా గ్రహించే నేలలు? నల్లరేగడి నేలలు
- ఇరుకు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? తక్కువగా
Weather Condition (వాతావరణ స్థితి)
- ఉష్ణోగ్రతకు మూలం? సూర్యుడు
Major Elements of Weather Conditions (వాతావరణ స్థితిలోని అంశాలు)
- వాతావరణ స్థితి కారకాలలో ముఖ్యమైనది? ఉష్ణోగ్రత ( అనగా వేడి యొక్క తీవ్రత)
- ఉష్ణోగ్రతను ఒక ప్రాంతంలో ఏ విధంగా కొలుస్తారు? రోజువారిగా
- ఒక ప్రాంతంలో నమోదైన ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించే పరికరం? సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం, థర్మామీటర్
- పీడనం అనగా? వాతావరణం కలిగించే ఒత్తిడి లేదా గాలి బరువు (వాతావరణ పరిస్థితిని ప్రభావం చేసే రెండవ అంశం)
- పీడనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం? బారోమీటర్, ఎనిరాయిడ్ బారోమీటర్
- వాతావరణం అనగా? భూమి చుట్టూ ఆవరించిన దట్టమైన గాలి పొర
- భూమికి క్షితిజ సమాంతరంగా వీచే గాలిని ఏమంటాం? పవనము
- పవనాలు ఏ విధంగా వీస్తాయి? అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి వీస్తాయి
- పవన లక్షణాలు ఏవి? వేగం దిశ
- పవన వేగాన్ని దేనితో కొలుస్తారు? ఎనిమోమీటర్ తో
- పవన దిశ తెలుసుకోవడానికి వేటిని ఉపయోగిస్తారు? విండ్ వేన్ ( పవన సూచి)
- ఆర్ద్రత అనగా? వాతావరణం లో ఉన్న నీటి ఆవిరి ( ఇది వాయు రూపంలో ఉంటుంది)
- ఇది గాలి కంటే తేలికైనది? ఆర్ద్రత
- ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం? హైగ్రో మీటర్
- ఆర్ద్రత ఎన్ని రకాలు? రెండు రకాలు( సాపేక్ష ఆర్ద్రత, ఆర్ద్రత)
- సాపేక్ష ఆర్ద్రత అనగా? గాలిలో ఆర్ద్రత ఎంత శాతం ఉంది అనేది తెలిపేది
- విశిష్ట ఆర్ద్రత అనగా? గాలిలో మొత్తం నీటి ఆవిరి శాతం ఎంత ఉంది అని తెలిపేది
- ఒక ప్రాంతంలో ఒక కాలంలో ఎంత మేర మేఘాలు కొమ్ముకున్నాయో తెలియజేసేది? మేఘావృత్తి
- మేఘ వృత్తిని దేని ఆధారం చేసుకుని నిర్ణయిస్తారు? పొగ మంచు ఆధారం చేసుకుని
- నీటి ఆవిరి ద్రవీభవనం చెందడం వల్ల కొలవడానికి వీలుగా ఉన్న దానిని ఏమంటారు? వర్షపాతం
- వర్షపు రోజు అనగా? ఒక రోజులో రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురవడం
- వర్షపాతాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? వర్షం మాపకంతో
- వాతావరణ స్థితి అనగా? ఒక ప్రదేశంలో ఒకటి నుండి మూడు రోజులలో వాతావరణంలో వచ్చే మార్పులు
- వాతావరణ స్థితి అనేది దేనికి పరిమితంగా ఉంటుంది? చిన్న ప్రాంతానికి కొద్ది కాలానికి పరిమితంగా ఉంటుంది
- వాతావరణ చార్టులను రోజులో ఎన్నిసార్లు ముద్రిస్తారు? రెండుసార్లు ( ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు, సాయంత్రం ఐదు గంటలకు)
- ఈ వాతావరణం చార్టులు ఎవరికి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటాయి? . నావికులు వ్యవసాయదారులు మత్స్యకారులు విమాన యానానికి అనుకూలంగా ఉంటాయి

India’s Thermal Condition (భారత దేశ శీతోష్ణ స్థితి)
- . భారతదేశ శీతోష్ణస్థితి climage? రుతుపవన శీతోష్ణస్థితి
- భారతదేశంలో ఏ సంవత్సరంలో శీతోష్ణస్థితి గుర్తులను ఆమోదించారు? 1935
- భారతదేశ శీతోష్ణస్థితి గుర్తులు ఏ సమావేశంలో ఆమోదించారు? వార్సాలో జరిగిన సమావేశంలో
- ఈ శీతోష్ణస్థితి గుర్తులను ఎవరు ఆమోదించారు? ఇంటర్నేషనల్ మెటిరలాజికల్ ఆర్గనైజేషన్ వారు
Climatic Event & Formation (వాతావరణ సంఘటన & నిర్మాణం)
- వాతావరణం అనే పదం సంస్కృతంలో ఏ అర్ధాన్నిస్తుంది? తొడుగు
- వాతావరణం అనగా? భూమిని ఆవరించిన గాలి పొర
- ఎక్కడ నైట్రోజన్ ఆక్సిజన్ మిశ్రమ వాతావరణం ఉంది? భూగోళంపై మాత్రమే
- వాతావరణ మూలకాలు అనగా? ఆవర్తన పట్టికలో ఉన్న మూలకాలు
- వాతావరణ మూలకాలకు ఉదాహరణ? హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్, నైట్రోజన్, ఓజోన్
- వాతావరణం రోజులో భూమితో పాటు ఎంత దూరం కదులుతుంది? 24 వేల మైళ్ళు
- భూగోళం ఎంత వేగంతో తిరుగుతుంది? 34400 కిలోమీటర్ల వేగంతో
- గ్రీన్ హౌస్ ఎఫెక్ట్( హరితగృహ వాయువులు) అనగా? సూర్యుని నుండి వెలువడే ఉష్ణోగ్రతలను వాతావరణం క్రమబద్ధం చేస్తూ సాలినంత జీవనాన్ని అందిస్తుంది దీనినే హరితగృహ వాయువులు అని చెప్పవచ్చు
- భూ ఉపరితలంపై ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు 99% వాతావరణ పదార్థంతో నిండి ఉంది? 32 కిలోమీటర్ల ఎత్తు వరకు
- భూ ఆకర్షణ శక్తి వల్ల ఎంత శాతం వాతావరణము ఉపరితల సమీపంలోనే ఉంది? 97%
- వాతావరణ సాంద్రత భూ ఉపరితలం దగ్గర అధికంగా ఉండి పైకి పోయే కొద్దీ ఎలా ఉంటుంది? తగ్గుతూ ఉంటుంది
Layers of the Atmosphere (వాతావరణంలోని పొరలు)

- వాతావరణంలోని పొర పేర్లు ఏంటి? ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మేసో ఆవరణము, ఐనో / తెర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము
- భూమిని ఆవరించిన మొదటి ఆవరణము? ప్రోపో ఆవరణము
- ఎంత శాతం వాతావరణం ట్రోపో ఆవరణంలో గలదు? 75%
- ట్రోపో ఆవరణము యొక్క ఎత్తు భూమధ్యరేఖ ప్రాంతం వద్ద ఎన్ని కిలోమీటర్లు వరకు ఉంటుంది? 18 కిలోమీటర్ల వరకు
- ట్రోపో ఆవరణ ఎత్తు ధ్రువ ప్రాంతంలో ఎంత ఎత్తులో ఉంటుంది? ఎనిమిది కిలోమీటర్లు (ఈ ఎత్తులు వేసవిలో ఎక్కువగాను శీతాకాలంలో తక్కువగాను ఉంటాయి)
- దూళికణాలు నీటి ఆవిరి ఉరుములు మెరుపులు తుఫానులు ఏ ఆవరణంలో సంభవిస్తాయి? ట్రోపో ఆవరణములో
- ప్రోపో ఆవరణము యొక్క పైభాగా సరిహద్దును ఏ పేరుతో పిలుస్తారు? ట్రోపో పాస్
- ఈ ట్రోపో పాస్ అనేది ధ్రువాల వద్ద ఎన్ని కిలోమీటర్లు ఎత్తులో ఉంటుంది? ఎనిమిది కిలోమీటర్లు
- ట్రోపో పాస్ సమశీతోష్ణ మండలంలో ఎంత ఎత్తులో ఉంటుంది? 12 కిలోమీటర్ల ఎత్తులో
- ఉష్ణ మండలంలో ట్రోపో పాస్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 15 కిలోమీటర్ల ఎత్తులో
- భూమధ్యరేఖ ప్రాంతంలో ట్రోపో పాస్ ఎన్ని కిలోమీటర్లు ఎత్తులో ఉంటుంది? 18 కిలోమీటర్ల ఎత్తులో
- భూమధ్యరేఖ ప్రాంతంలో ట్రోపో పాస్ వద్ద ఉష్ణోగ్రతలు? మైనస్ 80 డిగ్రీలు
- ధ్రువ ప్రాంతంలో ట్రోపో పాస్ వద్ద ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? ? మైనస్ 45 డిగ్రీలు
- ఎత్తుకుపోయే కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గడం అనేది ఏ ఆవరణము యొక్క ప్రత్యేకత? ట్రోపో ఆవరణము యొక్క ప్రత్యేకత
- సాధారణ ఉష్ణోగ్రత క్షణత క్రమం అనగా? ఎత్తుకుపోయే కొద్ది ఉష్ణోగ్రత తగ్గడం
- ఎత్తుకుపోయే కొద్ది ఉష్ణోగ్రత ఏ విధంగా తగ్గుతుంది? ప్రతి 165 మీటర్ల కి ఒక డిగ్రీ సెంటీగ్రేట్ చెప్పున తగ్గుతుంది
- ఏ ఆవరణంలో సంవహన క్రియ ప్రత్యేకంగా జరుగుతుంది? ట్రోపో ఆవరణంలో
- సంవాహన క్రియ అనగా? భూమిని ఆనుకుని ఉన్న గాలి వేడెక్కి తేలికైకి పోయి చల్లబడుతుంది ఈ ప్రక్రియనే సంవాహన క్రియ అంటారు
- ట్రోపో పాస్ ని ఆనుకుని ఉన్న పై పొర ? స్ట్రాటో ఆవరణము
- స్ట్రాటో ఆవరణము ఎంత ఎత్తు వరకు ఉంటుంది? 50 కిలోమీటర్ల ఎత్తు వరకు
- స్ట్రాటో ఆవరణం మందం భూమధ్య రేఖ వద్ద ఎంత ఉంటుంది? 62 కిలోమీటర్లు
- స్ట్రాటో ఆవరణ మందం ధ్రువాల వద్ద ఎంత ఉంటుంది? 72 కిలోమీటర్లు
- స్ట్రాటో ఆవరణం యొక్క పై బాగ సరిహద్దును ఏమంటారు? స్ట్రాటో పాస్
- ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది? స్ట్రాటో ఆవరణంలో
- అల్ట్రా వైలెట్ రేస్ నుండి మానవాళిని కాపాడేది? ఓజోన్ పొర( దీనినే ఓజోన్ ఆవరణము అని పిలుస్తారు)
- ఆవరణములో కనిపించే మేఘాలు? సిరస్ మేఘాలు
- జెట్ విమానాలు ఏ ఆవరణంలో ఎగురుతాయి? స్ట్రాటో ఆవరణం లో
- స్ట్రాటో ఆవరణంలో ఎత్తుకుపోయే కొద్దీ ఉష్ణోగ్రతలు____? పెరుగుతాయి
- మిస్సో ఇది ఏ భాషా పదం? గ్రీకు బాషా పదం
- మిసో అనగా అర్థం? . మధ్య అని
- మిస్సో ఆవరణ పై బాగా సరిహద్దును ఏమంటారు? మిస్సో పాస్
- మిస్ ఆవరణంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా తగ్గుతాయి ? . ఎత్తుకుపోయే కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి
- ఉల్కలు ఏ ఆవరణములో బద్దలై పోతాయి? మిసో ఆవరణంలో
- కీమోస్పియర్ అని ఏ ఆవరణను పిలుస్తారు? మీసో ఆవరణం
- మీసో ఆవరణాన్ని కీమో స్పియర్ అని ఎందుకు పిలుస్తారు? ఎందుకు అనగా జీవులను ఉల్కల భారీ నుండి రక్షించడం వల్ల
- మిసో ఆవరణంలో పీడనం ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది
- ఐనో ఆవరణం ఎన్ని కిలోమీటర్ల ఎత్తువరకు ఆక్రమించబడి ఉంది? మీసో పాస్ పైభాగం నుండి 800 కిలోమీటర్ల ఎత్తు వరకు (80-800 కిమీ)
- ఐ నో ఆవరణానికి మరొక పేరు? తెర్మో ఆవరణం
- ఐ నో ఆవరణం అని ఎందుకు పేరు వచ్చింది? ఎందుకు అనగా ఆయనైజేషన్ జరగడం వల్ల
- రేడియో తరంగాలు ఏ ఆవరణంలో పయనిస్తాయి? ఐనోఆవరణంలో
- వాతావరణంలో చివర బాహ్య పొర ఏది? ఎక్సో ఆవరణం
- తెర్మోఫాస్ దాటిన తర్వాత ఎక్సో ఆవరణము ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది? పదివేల కిలోమీటర్ల ఎత్తు వరకు
- ఏ ఆవరణం దాటిన తరువాత మిగిలినదంతా శూన్యంగా ఉంటుంది? ఎక్సో ఆవరణం దాటిన తర్వాత
- ఎక్సో ఆవరణ ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయి? 5565 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉంటాయి
Weather Event (వాతావరణ సంఘటన)
- ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఆక్సిజన్ కనిపించదు? 120 కిలోమీటర్ల ఎత్తులో కనిపించదు
- . కార్బన్ ఆక్సైడ్ నీటి ఆవిరి ఎన్ని కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటాయి? 90 కిలోమీటర్లు వరకు మాత్రమే ఉంటాయి
- . CO2 అనగా? కార్బన్ డై ఆక్సైడ్
- పారదర్శకంగా ఉండి సూర్యకిరణాలు అడ్డుకునే వాయువు? కార్బన్ డై ఆక్సైడ్
- హరితగృహ ప్రభావానికి కారణంగా ఉన్న వాయువు? కార్బన్ డై ఆక్సైడ్
Atmospheric Gases & Their Percentages (వాతావరణ వాయువులు వాటి శాతాలు )
- వాతావరణంలో నైట్రోజన్ (N2) ఎంత శాతం ఉంది? 78.08
- వాతావరణం లో ఆక్సిజన్ (O2) ఎంత శాతం ఉంది ? 20.95
- ఆర్గాన్ (AR) వాతావరణం లో ఎంత శాతం ఉంది ?0.93
- కార్బన్డై ఆక్సైడ్ (CO2) వాతావరణంలో ఎంత శాతం ఉంది? 0.036
- నియాన్ (NE) వాతావరణంలో ఎంత శాతం ఉంది? 0.002%
- హీలియం (HE) వాతావరణంలో ఎంత శాతం ఉంది? 0.0005%
- క్రిప్టో (KR) వాతావరణం లో ఎంత శాతం ఉంది? 0.001 %
- జియాన్ (XE) వాతావరణంలో ఎంత శాతం ఉంది? 0.00009%
- హైడ్రోజన్ (H2) వాతావరణంలో ఎంత శాతం ఉంది? 0.00005%
- వాతావరణం లో ఉన్న వాయువులను ఎన్ని రకాలుగా విభజించారు? 15 రకాలు
- వాతావరణంలో ఉన్న ముఖ్యమైన వాయువులు ఏవి? నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్ కార్బన్డయాక్సైడ్
Major Gases in the Atmosphere & Their Information (వాతావరణం లో ముఖ్యమైన వాయువులు వాటి సమాచారం)
- వాతావరణంలో అధిక భాగం ఆక్రమించి ఉన్న వాయువు? నైట్రోజన్
- మన శరీర నిర్మాణానికి తోడ్పడే వాయువు? నైట్రోజన్
- మాలిక్యులర్ నైట్రోజన్ ఎన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది? 50 కిలోమీటర్ల వరకు
- అటామిక్ నైట్రోజన్ ఎన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది? 50 నుండి 100 కిలోమీటర్ల వరకు
- అతినీలాలోహిత కిరణాలు నీటి ఆవిరిపై జరిపిన రసాయనిక చర్య వల్ల ఏర్పడే వాయువు? ఆక్సిజన్ ( ఈ వాయువు మొదట లేదు)
- ఆక్సిజన్ వాతావరణంలో ఎన్నో స్థానాన్ని ఆక్రమిస్తుంది? రెండు
- ప్రాణవాయువు అని ఏ వాయువుని పేర్కొంటారు? ఆక్సిజన్
- స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువు ఎలా ఉంటుంది? ఘాటుగా చురుకుగా ఉండి మండే గుణం కలిగి ఉంటుంది
- ? శిలాలు లో చోటుచేసుకునిప్రథమ స్థానాన్ని ఆక్రమించిన వాయువు ఏది? ఆక్సిజన్
- పరమాణు ఆక్సిజన్ ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు ఆక్రమించబడి ఉంది? 60 కిలోమీటర్ల ఎత్తు వరకు
- అణు ఆక్సిజన్ ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది? 60 నుండి 120 కిలోమీటర్ల ఎత్తు వరకు
- భూ పొరలలో రేడియో ధార్మిక శక్తి వల్ల వాతావరణంలో చేరిన వాయువు? ఆర్గాన్
- ఆర్గాన్ వాయువుకు గల పేర్లు ఏవి? నోబెల్ గ్యాస్ జడ వాయువు
- ఆర్గాన్ వాయువును జడవాయువు అని ఎందుకు పిలుస్తారు? ఇతర వాయువులతో రసాయనిక చర్య జరపనందువల్ల
- రంగు రుచి వాసన లేని వాయువు ఏది? ఆర్గాన్
- ఆర్గాన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? సముద్ర జలాలలో ఎక్కువగా ఉంటుంది
- ఆర్గాన్ వాయువును దేనికి ఉపయోగిస్తారు? బల్బులు వెల్డింగ్ లలో ఎక్కువగా ఉపయోగిస్తారు
- ఓజోన్ వాయువు ఏ విధంగా ఉపయోగపడుతుంది? 10 నుండి 50 కిలోమీటర్ల మధ్య ఉండి ఫిల్టర్ లాగా ఉపయోగపడుతుంది
- సూర్యుని నుండి వచ్చే అతి నేల లోహిత కిరణాలను గ్రహించే వాయువు? ఓజోన్ వాయువు
- నీటి ఆవిరి ఎత్తుకుపోయే కొద్ది ఏ విధంగా ఉంటుంది? తగ్గుతుంది ( భూమధ్యరేఖ నుండి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ తగ్గుతుంది)
- ఉష్ణ సమూస్ణ మండల ప్రాంతాలలో గాలి కంటే నీటి ఆవిరి ఎంత శాతం బరువుగా ఉంటుంది? నాలుగు శాతం
- పొడి ఎడారి ప్రాంతాలలో ధృవ ప్రాంతాలలో గాలి కంటే నీటి ఆవిరి ఎంత శాతం తక్కువ పరిమాణంలో ఉంటుంది? ఒక శాతం తక్కువ పరిమాణంలో ఉంటుంది
- ఉప్పు కారకాలతో కలిసి న్యూక్లియగా ఏర్పడి నీటి ఆవిరిని గ్రహించి మేఘాలు ఏర్పరిచేవి? దూళికణాలు
Heat (ఉష్ణం)

- ఉష్ణానికి గల పేర్లు ఏవి? ఉష్ణోగ్రత వేడి సోలార్ ఎనర్జీ
- ఉష్ణం అనగా? సూర్యుని నుండి నిరంతరం విడుదల అయ్యే సౌర శక్తి ( వాతావరణం లో వేడి యొక్క తీవ్రత)
- ఉష్ణోగ్రతను దేనితో కొలుస్తారు”? ఉష్ణమాపకం (దీనినే ధర్మామీటర్ అంటారు)
- రోజువారి అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలిచే పరికరం? సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం
Temperature Measurement Scales (ఉష్ణోగ్రత ను కొలిచే స్కేలులు )
- ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేలు ఎన్ని రకాలు? మూడు( ఫారన్హీట్ స్కేలు సిల్సియస్ స్కేలు కెల్విన్ స్కేలు)
- ఫారెన్ హీట్ స్కేలను ఏ గుర్తుతో సూచిస్తారు? సున్న డిగ్రీలు F అనే గుర్తుతో
- ఫారన్హీట్ స్కేలులో ఫ్రీజింగ్ పాయింట్? 32 డిగ్రీలు F వద్ద
- ఫారెన్హీట్ స్కేలులో బాయిలింగ్ పాయింట్? 20012 డిగ్రీలు F వద్ద
- ? ఒక డిగ్రీ ఫారన్ హీట్ ఎన్ని డిగ్రీల సెంటిగ్రేట్ కి సమానం? 0.56 డిగ్రీల సెంటిగ్రేడ్ కు
- ఉష్ణోగ్రత కొలవడానికి అంతర్జాతీయ గుర్తింపు పొందిన స్కేలు? సిల్సిఎస్ స్కేలు
- సిల్సియస్ స్కేలును ఏ గుర్తుతో సూచిస్తారు? 0° లు C అనే గుర్తుతో
- నీరు ఎన్ని డిగ్రీల వద్ద గణిభవిస్తుంది? 0° c వద్ద
- నీరు ఎన్ని డిగ్రీల వద్ద మరుగుతుంది? 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద
- 100 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎన్ని డిగ్రీల ఫారం హీట్ కు సమానం? 180 డిగ్రీల ఫారం హీట్ కు
- కెల్విన్ స్కేల్ లో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఎన్నికెల్విన్ డిగ్రీలకు సమానం? 273.16 కెల్విన్ డిగ్రీలకు సమానం
Insolation (సూర్య పుటం)
- సూర్య పుటం (ఇన్సోలేషణ్) అనగా ? భూమి గ్రహించే సౌర శక్తి (భూమి మీద ప్రాణికోటి కి జీవనాధారం)
- భూమి సౌర శక్తిని ఏయే రూపాలలో గ్రహిస్తుంది ? సుర్యునిలోని ఫోటో స్పియర్ అనే భాగం నుండి, హ్రస్వ తరంగాల రూపం లో గ్రహిస్తుంది
- సూర్య పుటం నకు మరొక పేరు ? సౌర స్థిరాంకం
- ప్రసరించే సౌర శక్తిలో ఎంత శాతం భూమిని చేరుతుంది? 47% మాత్రమే
- సోలార్ రేడియేషన్ అనగా? చిన్న తరంగ ధైర్గ్యాల ద్వార సూర్య కిరణాలు అన్నివైపులా ప్రసరించడం (భూమి నుండి బయలుదేరే మొత్తం సౌర శక్తి)
- సూర్య కిరణాల శక్తి లో భూమి మీదకు ఎంత శాతం చేరుతాయి? 2% మాత్రమే
- సూర్యునికి భూమికి మధ్య సగటు దూరం ? 149.5 మిలియన్ కిమీ
- సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత? 6000 డిగ్రీల సెంటి గ్రేడ్
- సూర్యుని అంతర్భాగ ఉష్ణోగ్రత ? 455 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్
- సూర్యుని వ్యాసం భూ వ్యాసం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ? 109 రెట్లు ఎక్కువ
- అపహేళి ఎప్పుడు సంభవిస్తుంది ? జులై 4
- అపహేళి అనగా ? సూర్యునికి భూమికి అత్యధిక దూరం (152.5 మి కిమీ)
- అపహేళి సమయం లో సూర్యుని నుండి గ్రహించే సూర్యపుటం ఎంత ? నిమిషానికి చ సెం మి కి 1.88 గ్రాములు
- పరిహేలి పరిహేలి టప్పుడు సంభవిస్తుంది? జనవరి ౩
- పరిహేలి అనగా ? సూర్యునికి భూమికి అత్యల్ప దూరం (147.5 మి కిమీ)
- పరిహేలి సమయం లో సూర్యుని నుండి గ్రహించే సూర్యపుటం ఎంత? నిమిషానికి చ సెం మి కి 2.01 గ్రాములు
- సూర్య పుటం ప్రభావితం చేసే కారకాలు ? భూ బ్రమణ౦, సూర్య కిరణాల కోణం రోజులో కాల వ్యవధి, వాతావరణం లో పారదర్శకత
- సూర్యపుటం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండక పోవడానికి కారణం? అక్షాంశం
- భూ అక్షం సూర్యుని చుట్టూ తిరిగేటపుడు ఎన్ని డిగ్రీలు వాలి ఉంటుంది ?23 1/2 డిగ్రీలు వాలి ఉంటుంది
- సూర్య కిరణాల కోణం రోజులో కాల వ్యవధి దేనిని బట్టి మారుతూ ఉంటుంది ? పగటి వ్యత్యాసం, ప్రదేశాన్ని బట్టి, రుతువును బట్టి మారుతూ ఉంటుంది
- ఏ సమయం లో నూరు శాతం సూర్యపుటం భూమిని చేరుతుంది? వాతావరణం లో పారదర్శకత సమయం లో
- భూమిని చేరే సూర్య కిరణాలు ఏ రూపం లో భూమిని చేరుతాయి ? హ్రస్వ తరంగాల రూపం లో
- ఉష్ణోగ్రత బదిలీ అనగా ? ఉష్ణోగ్రత ఒక వస్తువునుండి మరొక వస్తువుకు / ఒక పదార్ధం నుండి మరొక పదార్దానికి బదిలీ కావడం
Heat Budget (ఉష్ణ నిర్వహణ)
- ఉష్ణ నిర్వహణ అనగా? ఒక పదార్ధం లో పరమాణువుల ద్వారా ఉష్ణోగ్రత బదిలీ అవడం
- ఉష్ణ నిర్వహణ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒకే వస్తువుతో ఒక భాగం నుండి మరొక బాగానికి బదిలీ కావడం, విభిన్న ఉష్ణోగ్రతలు ఉన్న 2 వస్తువులు మధ్య ఉష్ణోగ్రత ఒకేలా బదిలీ కావడం
- ఉష్ణం ఒకే వస్తువుతో ఒక భాగం నుండి మరొక బాగానికి బదిలీ కావడానికి ఉదా ? వేడి చేసిన ఇనుప ఖడ్డి 2 చివరల వేడిగా ఉండడం
- విభిన్న ఉష్ణోగ్రతలు ఉన్న 2 వస్తువులు మధ్య ఉష్ణోగ్రత ఒకేలా బదిలీ కావడానికి ఉదా ? వేడిగా ఉన్న భూమి చల్లగా ఉన్న వాతావరణం మధ్య ఉష్ణోగ్రత బదిలీ అవడం
Heat Convection (ఉష్ణ సంవహన)
- ఉష్ణ సంవహన అనగా ? ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఉష్ణోగ్రత లంభంగా కదలడం ద్వారా బదిలీ కావడం
- ఉష్ణ సంవహన ఏ ఆవరణం లో జరుగుతుంది? ట్రోపో ఆవరణం లో
- ఉష్ణ సంవహనకు ఉదా ? భూమి వాతావరణం మధ్య ఉష్ణోగ్రత బదిలీ
Thermal Radiation (ఉష్ణ వికిరణం)
- ఉష్ణ వికిరణం అనగా ? యానకం లేకుండా 2 వస్తువుల మధ్య ఉష్ణోగ్రత బదిలి జరిగితే దానిని
- ఉష్ణ వికిరణంలో వాతావరణం దేనిద్వారా వేడెక్కుతుంది? భూ పుటం ద్వారా
- ఉష్ణ వికిరణ ప్రక్రియ అనగా ? ఉష్ణాన్ని ఒక పదార్దానికి బదిలీ చేస్తే దానిని
- ఉష్ణోగ్రత బదిలీ ఏ పద్దతి ద్వారా ఎక్కువ జరుగుతుంది? ఉష్ణ వికిరణం
- భూమి సౌర శక్తిని ఏ రూపంలో గ్రహించి ఏ రూపం లో వాతావరణానికి అందిస్తుంది? హ్రస్వ తరంగాల రూపం లో గ్రహించి, దీర్ఘ తరంగాల రూపం లో వాతావరణానికి అందిస్తుంది
Thermal Equilibrium (ఉష్ణ సమాంతరం)
- ఉష్ణ సమాంతరం అనగా ? పవనాలు ఉష్ణోగ్రతను క్షితిజ సమాంతరంగా బదిలీ చేయడం
- ఉ భారత్ లో స్థానిక వేసవి పవనాలును ఏ పేరుతో పిలుస్తారు ? లూ పవనాలు
- ఉష్ణ సమంతర పద్దతి వల్ల ఏర్పడిన పవనాలకు ఉదా ? లూ పవనాలు
- సూర్యోదయం సుర్యస్తమయాలకు గుర్తుగా ఉన్న రంగు ? ఎరుపు
- ఆకాశంలో వెలుతురు వెదజల్లినట్లు భావించే రంగు? నీలి రంగు
- ఆకాశానికి రంగులు రావడానికి కారణం ఏమిటి? సుర్యపుటం ప్రయాణించే టపుడు వాయువులు ఉష్ణ వికిరనాన్ని గ్రహిస్తాయి. చిన్న చిన్న పదార్ధాలు ట్రోపోస్పియర్ లో వెదజల్లినట్లు కనిపిస్తాయి
Temperature Budget (ఉష్ణోగ్రత బడ్జెట్)

- ఉష్ణ శక్తిని భూమి అన్ని వైపులకు వెదజల్లె ప్రక్రియ ? భూ సంవహనం
- భూ ఉష్ణ సంవహనం దేనివల్ల సాధ్యం అవుతుంది. సూర్యపుట సమతౌల్యం వల్ల (ఈ సమతౌల్యాన్ని ఉష్ణ సమతౌల్యం లాభ నష్టాల పట్టిక అని వ్యవహరిస్తారు)
- ఉష్ణ సమతౌల్యం అనగా? సూర్యుని నుండి భూమి గ్రహించే ఉష్ణం, భూమి నుండి బయటకు వేళ్ళ ఉష్ణం మధ్య గల సమతౌల్యత
- దేనివల్ల భూమి జీవ గ్రహంగా పిలువ బడుతుంది? ఉష్ణ సమతౌల్యం
- భూమికి బయలుదేరిన 100 యూనిట్ల ఉష్ణం లో రోదసి లోకి వెనుతిరిగే ఉష్ణం ఎన్ని యూనిట్లు ? 34 యూనిట్లు
- (ఈ ఉష్ణం హ్రస్వ తరంగాల రూపం లో వెనుతిరుగు తుంది)
- ఈ వెనుతిరిగే ఉష్ణం లో 34 యూనిట్లులో ఏ ఏ విభాగాలకు యెంత చేరుతుంది? మేఘాల వల్ల 25 యూనిట్లు, నేలలో 2 యూనిట్లు, దుమ్ము కణాల వల్ల వాతావరణం లోకి 7 యూనిట్లు జరుగుతుంది
- భూమికి బయలుదేరిన 100 యూనిట్ల ఉష్ణం లో వాతావరణం గ్రహించే ఉష్ణం ? 19 యూనిట్లు (దీనిలో వాతావరణ వాయువులు ద్వారా 17 యూనిట్లు, మేఘాలు ద్వారా 2 యూనిట్లు గ్రహిస్తాయి)
- భూమికి బయలుదేరిన 100 యూనిట్ల ఉష్ణం లో భూమి గ్రహించు యూనిట్లు? 47 యూనిట్లు
- భూమి గ్రహించు 47 యూనిట్లు ఉష్ణం లో సూర్య రశ్మీ ద్వారా గ్రహించు ఉష్ణం ? 19 యూనిట్లు (మేఘాల ద్వారా 23 యూనిట్లు, పరిక్షేపణం ద్వారా 5 యూనిట్లు గ్రహిస్తుంది)
- భూమికి బయలుదేరిన 100 యూనిట్ల ఉష్ణం లో జంతు వృక్ష ప్రక్రియలకు తోడ్పడు యూనిట్లు ? 66 యూనిట్లు
- (ఈ యూనిట్ల నిర్వహణ నే సౌర శక్తి అంటారు
- భోగోళం పై ఉష్నోగ్రాత సమతౌల్యం ఉంది అని ఎలా చెప్పవచ్చు ? ఎన్ని యూనిట్లు సంపాదించిందో అన్ని యూనిట్లు కోల్పోతుంది కాబట్టి
Factors Controlling Temperature (ఉష్ణోగ్రతను నియంత్రించే కారకాలు)
- ఉష్ణోగ్రతను నియంత్రించే కారకాలు ఏవి? భూ పుటం, లేండ్ బ్రీజేస్, సముద్ర ప్రవాహాలు
Geothermal Heat (భూ పుటం)
- గ్రహించిన ఉష్ణోగ్రతను భూమి దీర్ఘ తరంగాల ద్వారా వాతావరణం లోకి అందించడాన్ని ఏమంటారు ? భూ పుటం
- ఉష్ణ మండల దేశాలలో సముద్ర సామీప్య ఉష్ణోగ్రత 80 డిగ్రీల f ఉన్నపుడు 45౦౦ అడుగుల ఎత్తులో ఎన్ని డిగ్రీల ఉష్నోగ్రత నమోదు అవుతుంది? 65 డిగ్రీల ఉష్నోగ్రత నమోదు అవుతుంది
- నార్మల్ లేప్స్ రేట్ అనగా ? ఎత్తుకు పోయెకొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుట
- ఎత్తుకు పోయెకొద్దీ ఉష్ణోగ్రతలు ఏవిధంగా తగ్గుతుంది? ప్రతి ౩౦౦ అడుగులకు 1 డిగ్రీ f ఉష్ణోగ్రత తగ్గుట (ప్రతి 10౦ మీటర్లకు ౦.6 డిగ్రీలు c తగ్గుట)
- ఎత్తుకు పోయెకొద్దీ ఉష్ణోగ్రతలు ఏవిధంగా తగ్గుతుంది? ప్రతి 100౦ మీటర్లకు 6.4 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గుట
- నార్మల్ లేప్స్ రేట్ తిరోగమనం చెందితే దానిని ఏమంటారు? ఉష్ణోగ్రత విలోమం
Land Breezes (స్థల పవనాలు)
- స్థల పవనాలు (లేండ్ బ్రీజేస్) అనగా నేలల పై నుండి గాలులు సముద్రం పైకి వీయడం
- ఏసమయం లో నేలకంటే సముద్రం వెచ్చగా ఉంటుంది? రాత్రి సమయం లో
- బ్రిటిష్ దీవుల రేవులలో మంచు గడ్డ కట్టకుండా ఉండేటట్లు చేసే ప్రవాహం ? గల్ఫ్ స్ట్రీం
- జపాన్ తీరాన్ని వెచ్చగా ఉంచు ప్రవాహం ? కురోశివో ప్రవాహం
- స్థానిక పవనాలకు ఉదా ? ఫోహెన్, చినూక్, సిరోక్, మిస్ట్రాల్
- రాఖీ పర్వతాలలో మంచును కరిగించు పవనాలు ? చినూక్
Types of Thermal Expansion (ఉష్ణోగ్రత విస్తరణ రకాలు)
- ఉష్ణోగ్రత విస్తరణ ఎన్ని రకాలు? 2 రకాలు (క్షితిజ సమాంతర విస్తరణ, ఊర్ద్వ విస్తరణ)
- క్షితిజ సమాంతర విస్తరణ అనగా ? భూమిపై క్షితిజ సమాంతరంగా విస్తరించిన ఉష్ణోగ్రత
- క్షితిజ సమాంతర విస్తరణ వేటి ఆధారంగా చూపుతారు ? సమోష్ట్నోగ్రత రేఖలతో చూపిస్తారు
- సమోష్ట్నోగ్రత రేఖలు అనగా ? సమన ఉష్ణం ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలు (అక్షంశాలకు సమాంతరంగా ఉంటాయి) (తూర్పు నుండి పడమరకు గీయాలి)
- క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ ఆధారపడే అంశాలు ? అక్షాంశాలు, ఎత్తు, భూజల విస్తరణ, సముద్ర ప్రవాహాలు, వాయు రాసులు, ఉద్బిజ్జ సంపద)
- ఊర్ద్వ విస్తరణ అనగా ? ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది (వాయు పదార్ధాలు సౌర శక్తిని గ్రహించడం వల్ల జరుగుతుంది)
- ఉష్ణోగ్రత విలోమం అనగా ? ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత పెరగడం
- ఉష్ణోగ్రత విలోమం ఎప్పుడు ఏర్పడుతుంది? ఉష్ణ వాయురాశి శీతల వాయురాసి కలిసినపుడు ఏర్పడుతుంది
- ఉష్ణ వాయురాశి అనగా ? ఉష్ణ పవనాలు ఉన్న చోట గాలి వెచ్చగా ఉంటుంది దీనిని
- శీతల వాయు రాసి అనగా ? చల్లగా ఉన్న గాలి
- ఉష్ణోగ్రత విలోమంనకు ఉదా ? ఉ గోళం లో సమశీతోష్ణ మండలం
Pressure Expansion (పీడన విస్తరణ)

- పీడనం అనగా ?గాలికి గల బరువు
- పీడనాన్ని దేనిలో కొలుస్తారు ? మిల్లి బార్స్ లో
- పీడనం కొలవడానికి ఉపయోగించు పరికరం ? బారోమీటార్
- గాలి వాలు అనగా ? గాలి అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతానికి ప్రయాణించడం
- సముద్ర మట్టం వద్ద సాధారణ వాయు పీడనం యెంత ఉంటుంది ? 1013.2 మిల్లీ బార్లు ఉంటుంది
- పీడన మేఖలు అనగా ? భూగోళం పై ఏర్పడిన అధిక అల్ప పీడన మండలాలను పీడన మేఖలు అంటారు
- భూ ఉపరితలం పై పీడన మేఖలు ఎన్ని రకాలుగా విస్తరించి ఉన్నాయి? 2(క్షితిజ సమాంతర విస్తరణ, ఊర్ధ్వ విస్తరణ)
- భూ ఉపరితలం పై క్షితిజ సమాంతర విస్తరణ మండలాలను ఎన్ని గుర్తించారు ? 4 (భూమధ్య రేఖా అల్ప పీడన మేఖలు, ఉప ఆయన రేఖా అధిక పీడన మేఖలు, సబ్ పోలార్ అల్ప పీడన మేఖలు, ధ్రువ అధిక పీడన మేఖలు)
- పీడన మండలాలకు గల పేర్లు ఏవి? పీడన మేఖలు, ప్రపంచ పీడన మేఖలు, ప్రపంచ పీడన మండలాలు
- పీడనం ఉష్ణోగ్రత విలోమాను పాతం లో ఉండే పీడన మేఖలు ? భూమధ్య రేఖా అల్ప పీడన మేఖలు (ఈక్విటోరియల్ లో ప్రెజర్ బెల్ట్)
- భూమధ్య రేఖా అల్ప పీడన మేఖలులో పీడనం ఎంత ఉంటుంది? 1013 మిల్లి బార్ల కంటే తక్కువ ఉంటుంది
- విషవత్తులుగా ఏ రోజులను ప్రకటించారు ? మార్చి 21, సెప్టెంబర్ 22
- ఏ రోజులలో భూమధ్య రేఖపై సూర్య కిరణాలు లంభంగా పడతాయి ? మార్చి 21, సెప్టెంబర్ 22 (విషవత్తుల లో)
- కర్కట రేఖపై సూర్యకిరణాలు ఎప్పుడు లంభంగా పడతాయి? జూన్ 21
- ఏ రోజున సూర్య కిరణాలు ఉర్ధ్వానికి జరిగి 20 డిగ్రీల వద్ద కేంద్రీకృతమై ఉంటాయి? జూన్ 21
- ఏరోజున మకర రేఖపై సూర్య కిరణాలు లంభంగా పడతాయి? డిసెంబర్ 22
- భూమధ్య రేఖా అల్ప పీడన మండలానికి గల పేర్లు ఏవి ? ప్రశాంత మండలం & డోల్డ్ డ్రమ్స్
- భూమధ్య రేఖా అల్ప పీడన మండలానికి డోల్డ్ డ్రమ్స్ అని పేరు ఎందుకు వచ్చింది? తేలిక పాటి గాలులు వీస్తూ ఉండడం వల్ల
- ఉప ఆయన రేఖా అధిక పీడన మేఖలు ఏయే డిగ్రీల మధ్య వ్యాపించి ఉన్నాయి? భూమధ్య రేఖకు ఇరువైపులా 25-౩౦ డిగ్రీల మధ్య వ్యాపించి ఉంది
- ఉప ఆయన రేఖా అధిక పీడన మేఖలుకు మరొక పేరు ? ఆశ్వ అక్షాంశాలు అని పేరు (హార్స్ లేటిట్యూడ్), పీడన కేంద్రాలు
- ఉప ఆయన రేఖా అధిక పీడన మేఖలుకు ఆశ్వ అక్షాంశాలు అని పేరు ఎందుకు వచ్చింది ? ప్రాణాలు రక్షించు కోవడానికి సముద్రం లో గుర్రాలను వదలి వేయడం వల్ల
- ఉప ఆయన రేఖా అధిక పీడన మేఖలుకు పీడన కేంద్రాలు అని పేరు ఎందుకు వచ్చింది? ఈ మేఖలు ముక్కలు ముక్కలుగా విరిగినట్లు ఉండడం వల్ల
- చాలా వరకు ఎడారులు ఏ పీడన మేఖలలో ఉన్నాయి ? ఉప ఆయన రేఖా అధిక పీడన మేఖలు
- ఉప ధ్రువ అల్ప పీడన మేఖలు ఏ డిగ్రీల అక్షాంశాల మధ్య వ్యాపించి ఉన్నాయి? 45 డిగ్రీల ఉ ద అక్షాంశాల మధ్య ఉన్నాయి
- ఉప ధ్రువ అల్ప పీడన మేఖలు ఎలా ఏర్పడింది ? ప పవనాలు ధ్రువ పవనాలు కలవడం వల్ల
- శీతాకాలం లో భూమి సముద్రం లో వ్యత్యాసం వల్ల 2 ప్రత్యెక అల్ప కేంద్రాలు ఎక్కడ ఏర్పడతాయి? విలూసియన్ ద్వీపాల దగ్గర, ఐస్ లాండ్ గ్రీన్ లాండ్ మధ్య
- ఏ పీడన మేఖలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి? ధ్రువ అధిక పీడన మేఖలు
- సముద్ర మట్టం వద్ద గాలి పీడనం ఎంత ఉంటుంది (మిల్లి బార్లలో)? 1013.25
- సముద్ర మట్టం వద్ద ఉష్ణోగ్రత యెంత ఉంటుంది ? 15 డిగ్రీలు
ఎత్తు కిలో మీటర్లలో | ||||||||
సముద్ర మట్టం వద్ద | 0.5 కిమీ వద్ద | 1.0 కిమీ వద్ద | 2.0 కిమీ వద్ద | 5.0 కిమీ వద్ద | 10 కిమీ వద్ద | 20 కిమీ వద్ద | 30 కిమీ వద్ద | |
గాలి పీడనం మిల్లి బార్లలో | 1013.25 | 954.61 | 898.76 | 795.01 | 540.48 | 264.99 | 11.92 | 11.97 |
ఉష్ణోగ్రత (డిగ్రీల సెంటి గ్రేడ్) | 15 | 11 | 8.5 | 2.0 | -17.5 | -49.9 | -56.5 | -46.5 |
- ఊర్ధ్వ విస్తరణ అనగా ? ఎత్తుకు పోయెకొద్దీ వాయు పీడనం తగ్గుతుంది
- ఎత్తుకు పోయెకొద్దీ వాయు పీడనం ఏవిధంగా తగ్గుతుంది? ప్రతి కిమీ ఎత్తుకు 34 మిల్లి బార్ల చెప్పున
- ఎవరస్ట్ శిఖరం వద్ద వాయు పీడనం ఏవిధంగా ఉంటుంది ? 2/౩ వంతు తక్కువగా ఉంటుంది
- పీడన వ్యవస్థ ను నియంత్రించే కారకాలు ఎన్ని ? 2 (థర్మల్ కారకాలు, డైనమిక్ కారకాలు )
- , డైనమిక్ కారకాలుకు ఉదా? కోరియాలిస్ ఎఫెక్ట్
- కోరియాలిస్ ఎఫెక్ట్ అనగా ? భూ పరిభ్రమణం వల్ల గాలులు తూకి మళ్ళించ బడుటకు గల పేరు
- పీడన వ్యవస్థ ను నియంత్రించే కారకాలు ఏవి? ఉష్ణోగ్రత, సముద్ర మట్టం నుండి ఎత్తు, గాలిలోని తేమ, భూ గురుత్వాకర్షణ, భూ బ్రమణ౦
- పొడి గాలికంటే తేలికగా ఉండేది ? నీటి ఆవిరి
- వాతావరణం అనగా ? భూమిని ఆవరి౦చి ఉన్న దట్టమైన గాలి పొరను
- వాయువు అనగా? ఒకే రసాయనిక సంఘటన ఉన్న వాయు పదార్ధం
- గాలి అనగా? వాయువులు మిశ్రమం
- పవనం అనగా ? క్షితిజ సమాంతరంగా వీచే గాలి (అధిక పీడనం ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తాయి) వీచే దిశను బట్టి పేరు రావడం జరిగింది
- పవన వేగాన్ని కొలుచుటకు ఉపయోగించు పరికరం ? ఎనిమో మీటర్
- పవనం వీచే దిక్కును దేనితో కొలుస్తారు? పవన సూచిక తో
Classification of Winds (పవనాల వర్గీకరణ)
- పవనం వీచే దిశ వేగం భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3 (ప్రపంచ పవనాలు, ఋతు పవనాలు, స్థానిక పవనాలు)
- ప్రపంచ పవనాలకు ప్లానిటరి విండ్స్ అని పేరు ఎలా వచ్చింది? థర్మల్ డైనమీక్ పీడన మేఖలు భూ బ్రమణ౦ తో సంబంధం కలిగి ఉండడం వల్ల
- ప్రపంచ పవనాలు అనగా? అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతం వైపు క్రమపద్దతి లో స్థిరంగా వీచే పవనాలు (వీటికి శాశ్వత పవనాలు అని పేరు)
Major Global Winds (ముఖ్య ప్రపంచ పవనాలు)
- ప్రపంచ పవనాలులో ముఖ్యమైనవి? వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు
- ఉప ఆయన రేఖా అధిక పీడన మేఖల నుండి భూమధ్య రేఖా అల్ప పీడన మేఖల వైపు వీచే పవనాలు (వ్యాపార పవనాలు/ ట్రేడ్ విండ్స్)
- వ్యాపార పవనాలు ఉత్తరార్ధ గోళం లో ఏ దిక్కునుండి వీస్తాయి? ఈశాన్యం నుండి (ద గోళంలో ఆగ్నేయం నుండి వీస్తాయి)
- వ్యాపార పవనాలు ఉ గోళం లో ఈశాన్యం నుండి ద గోళంలో ఆగ్నేయం నుండి వీయడానికి కారణం? ఫెరెల్ సూత్రం లేదా కోరియలిస్ ఎఫెక్ట్
- వ్యాపార పవనాలుకు ఆపేరెలా వచ్చింది? సముద్ర వ్యాపారులకు పడవలు పోయే దిశ స్థిరంగా చేయడం వల్ల ఆపేరు రావడం జరిగింది
- ఉష్ణ మండల పవనాలు అని వేటిని పేర్కొంటారు? ౩౦ డిగ్రీలు ఉ.ద మధ్య భాగం
- సైక్లోన్స్ టైఫూన్స్ హరికేన్స్ కి కారణంగా ఉన్న పవనాలు? వ్యాపర పవనాలు
- ITF అనగా ? ఇంటర్ టైపికల్ ఫ్రాన్స్ (వాతాగ్రం /అంతర ఉష్ణ మండల సరిహద్దు) (భూ మధ్య రేఖా ఉష్ణ మండల సరిహద్దులు)
- పశ్చిమ పవనాలకు గల మరొక పేరు ? ప్రతి వ్యాపార పవనాలు అని
- పశ్చిమ పవనాలు ఏయే అక్షాంశాల మధ్య వేస్తాయి? ౩౦-40 డిగ్రీల అక్షాంశాల మధ్య (ఉప ఆయన రేఖా ప్రాంతం అంటారు)
- పశ్చిమ పవనాలు ఉత్తరార్ధ గోళం లో ఏ దిక్కునుండి వీస్తాయి? నైరుతి నుండి వీస్తాయి
- పశ్చిమ పవనాలు దక్షిణార్ధగోళం లో ఏ దిక్కునుండి వీస్తాయి? వాయవ్యం నుండి
- పశ్చిమ పవనాలు వేగం గంటకు యెంత ఉంటుంది? 50 – 70 కిమీ
- పశ్చిమ పవనాలుకు దక్షిణార్ధ గోళం లో గల పేరు? సాహస పశ్చిమ పవనాలు (బ్రేవ్ వేష్టర్ లైన్స్)
- 40-60 డిగ్రీల మధ్య దక్షిణార్ధ గోళం లో భీకర శబ్దం తో వీచే పవనాలు? గర్జించే నలబై లు (రోరింగ్ పార్టిస్)
- దక్షిణార్ధ గోళం లో 60 డిగ్రీల అక్షాంశాల వద్ద భీకర శబ్దం తో వీచే పవనాలు? గర్జించే అరవైలు (రోరింగ్ సిక్స్ టేస్)
- ఆర్కిటిక్ అంటార్కిటిక్ వలయాల వైపు వీచే పవనాలు ? ధ్రువ పవనాలు (పోలార్ విండ్స్)
- ధ్రువ పవనాలు ఎలా వీస్తాయి ధ్రువ అధిక పీడన మండలాల నుండి ఉప ధ్రువ అల్ప పీడన మండలాల వైపు వీస్తాయి
- ధ్రువ పవనాలు ఏయే అక్షాంశాల మధ్య వీస్తాయి? 60-80 ఉ ద అక్షాంశాల మధ్య
- ధ్రువ పవనాలు ఉ గోళం లో ఏ దిశ నుండి వీస్తాయి? ఈశాన్యం నుండి (ఈశాన్య ధ్రువ పవనాలుగా పేరు)
- ధ్రువ పవనాలు ద గోళం లో ఏ దిశ నుండి వీస్తాయి? ఆగ్నేయం నుండి (ఆగ్నేయ ధ్రువ పవనాలు అని పేరు)
- ఆగ్నేయ ధ్రువ పవనాలుకు గల మరొక పేరు? తూర్పు పవనాలు అని కూడా అంటారు
- ఉత్తరాయణం అనగా ? సూర్యుడు కర్కట రేఖ మీద ఉన్న రోజు (జూన్ 21)
- శరత్ కాల విషవత్తు ఎప్పుడు ? సెప్టెంబర్ 23
- ద ఆయనాంతం ఎప్పుడు సంభవిస్తుంది? డిసెంబర్ 23
- వెర్నాల్ విషవత్తు కాలం ____? మార్చ్ 21
Secondary Winds (మాధ్యమిక పవనాలు)
- మాధ్యమిక పవనాలుకు గల పేర్లు? ఆవర్తన పవనాలు, సెకండరి విండ్స్/ పీరియాడిక్ విండ్స్ గా పేరుభూ
- పవనాలు అనగా? నేల నుండి సముద్రం మీదకు వీచే పవనాలు
- జల పవనాలు? అనగా సముద్రం నుండి భూమి మీదకు వీచే పవనాలు
- పర్వత లోయ పవనాలు ఏ విధంగా ఏర్పడతాయి ? రాత్రి పగలు ఉష్ణోగ్రత మార్పులతేడాల వల్ల ఏర్పడతాయి
- లోయ పవనాలు అనగా (వేలి సి బ్రీజ్)? లోయలనుండి పర్వతాలకు ఎగబాకే పవనాలు
- పర్వత పవనాలు (మౌంటెన్ బ్రీజ్) అనగా? పర్వతాలనుండి లోయలోకి దిగే పవనాలు
- పీటభూమి నుండి పవనాలు మంచు క్షేత్రాల లోకి ప్రవేశించినపుడు ఆ అపవనాలను ఏ పేరుతొ పిలుస్తారు ? కటబాటిక్ పవనాలు
- కటబాటిక్ పవనాలుకు ఉదా ? మిస్ట్రల్
- మిస్ట్రల్ పవనాలు ఎక్కడ వీస్తాయి ? రోన్ లోయ నుండి మధ్య ధర సముద్రం వైపు (యూరప్ లో )
- చక్రవాతాలు (విండ్ సిస్టం) నకు గల పేర్లు ? డిప్రెషన్ లు, వాయు గుండాలు
- చక్రవాతం అనగా ? అల్ప పీడనం చుట్టూ గాలులు అతి వేగంగా తిరుగుతున్నట్లయితే అలా తిరిగే పవన వ్యవస్థను పిలుస్తారు
- చక్రవాత కేంద్రానికి గల పేరు ? ఐ అఫ్ ది సైక్లోన్ (అత్యల్ప పీడన ప్రాంతం పేరు)
- పీడన విస్తరణను వేటిద్వారా తెలుసుకోవచ్చు? సమభార రేఖల ద్వార
- చక్రవాతా గాలులు ఉ గోళం లో ఏవిధంగా వీస్తాయి? అపసవ్యంగా (ద గోళం లో సవ్యంగా వీస్తాయి)
- చక్రవాతాలు ఎన్ని రకాలు ? 2 (సమ శీతోష్ణ మండల చక్రవాతాలు, ఉష్ణ మండల చక్రవాతాలు)
- సమ శీతోష్ణ మండల చక్రవాతాలు ఏ డిగ్రీల అక్షాంశాల మధ్య ఏర్పడతాయి? భూమధ్య రేఖకు ఇరువైపులా 23 1/2 – 60 1/2 డిగ్రీల మధ్య (25-60 డిగ్రీల అక్షాంశాల మధ్య)
- సమ శీతోష్ణ మండల చక్రవాతాలు ఎక్కడ ఎక్కువ ఏర్పడతాయి? అట్లాంటిక్ మహాసముద్రం లో (ఇక్కడ ఎక్కువ వర్షం మంచు రూపం లో కురుస్తుంది)
- సమ శీతోష్ణ మండల చక్రవాతాలుకు గల పేరు ? మధ్య అక్షంశ తుఫానులు
- సమ శీతోష్ణ మండల చక్రవాతాలు ఎలా ఏర్పడతాయి? ఉష్ణ మండల వాయురాశి, ధ్రువ మండల వాయు రాసి కలుసుకొన్నపుడు
- సమ శీతోష్ణ మండల చక్రవాతాలును అమెరికాలో ఏపేరు తో పిలుస్తారు? హరికేన్లు, టొర్నాడో లు
- సమ శీతోష్ణ మండల చక్రవాతాలును చైనా లో ఏ పేరుతొ పిలుస్తారు? టైఫూన్ లు
- సమ శీతోష్ణ మండల చక్రవాతాలు
- వైశాల్యం :1600 కిమీ
- వ్యాసం :300-400 మైళ్ళు
- గాలుల వేగం :200-300 కిమీ/గంటకు
- ఎత్తు :5-6మైళ్ళు లేదా 9.6 కిమీ
- ఆకారం :V
- సమభార రేఖలు :కోడిగుడ్డు ఆకారం లో ఉంటాయి
- ఉష్ణ మండల చక్రవాతాలు సంభవించు ప్రాంతానికి ఉదా? ఫిలిప్పైన్ దీవులు చైనా జపాన్ ఫ్లోరిడా బంగాళాఖాతం అరేబియా తీరాలలో సంభవిస్తాయి
- గాలులు వేడెక్కి పైకి పోవుటను ఏవిధంగా పేర్కొంటారు? కన్వెన్షన్ కరెంట్. సంవహన ప్రవాహం
- ఉష్ణ మండల చక్రవాతాలు ఎలా ఏర్పడతాయి? ఉష్ణమండల సాగర వాయురాశి (ట్రోపికల్ మెరైన్ ఎయిర్ మాస్ )లోని ఉష్ణోగ్రత బేధం వల్ల ఏర్పడతాయి
- ఉష్ణ మండల చక్రవాతాలు ఉత్తరార్ధ గోళం లో ఏ నెలలో సంభవిస్తాయి? సెప్టెంబర్ (ద గోళం లో మే నెలలో సంభవిస్తాయి)
- ఉష్ణ మండల చక్రవాతాలు యొక్క ఆకారం? వృత్తాకారం / దీర్ఘ వృత్తాకారంగా ఉంటాయి
- ఉష్ణ మండల చక్రవాతాలు భూమధ్య రేఖకు ఇరువైపులా ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి? 6-20డిగ్రీల భూమధ్య రేఖకు ఇరువైపులా
- ఉష్ణ మండల చక్రవాతాలు హిందూ మహాసముద్రం లో ఏ నెలలో సంభవిస్తాయి? అక్టోబర్-డిసెంబర్ నెలల మధ్య (ఈశాన్య ఋతుపవన కాలం లో)
- ఉష్ణ మండల చక్రవాతాలు 0-15 డిగ్రీల అక్షాంశాల మధ్య ఏ దిశలో ప్రవహిస్తాయి? పశ్చిమ దిశలో
- ఉష్ణ మండల చక్రవాతాలు మార్గం ఏయే డిగ్రీల మధ్య క్రమము గా ఉంటుంది? 15-౩౦ డిగ్రీల అక్షాంశం మధ్య
- ఉష్ణమండల చక్రవాత లక్షణాలు
- వీటి సమ భార రేఖలు గుండ్రంగా ఉంటాయి
- పరిధి 150-300 మీటర్లు
- మధ్య ప్రాంతాన్ని “చక్రవాత కన్ను” గా వ్యవహరిస్తారు
- వ్యాసం 20౦మైళ్ళ లోపు ఉంటుంది
- గాలుల వేగం గంటకు 50-80 మైళ్ళు
- శరదృతు కాల౦ లో సంభవిస్తాయి
- క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి (12 కిమీ ఏటవాలు గా విస్తరిస్తాయి)
- ఉష్ణమండల చక్రవాతాలుకు ఉదా ? హరికేన్లు, టైఫూన్స్, టోర్న డోలు, విల్లి విల్లి, తుఫానులు, సుడిగాలులు)
- హరికేన్లు ఎక్కడ సంభవిస్తాయి? ప ఇండియా దీవులు, కరేబియన్ సముద్రం, మెక్సికో సింధుశాఖ, ఉ అట్లాంటిక్ సముద్ర౦, ఈ పసిఫిక్ ప్రాంతం
- టైఫూన్స్ ఎక్కడ సంభవిస్తాయి? పిలిప్పిన్స్, జపాన్, చైనా, ప పసిఫిక్ ప్రాంత౦
- టోర్న డోలు ఎక్కడ సంభవిస్తాయి? ప ఆఫ్రికా
- ప ఆస్ట్రేలియా సంభవించు ఉష్ణ మండల చక్రవాతాలు? విల్లి విల్లి
- తుఫానులుగా పిలువబడే ఉష్ణ మండల చక్రవాతాలు ఎక్కడ సంభవిస్తాయి? ప ద పసిఫిక్ ప్రాంతం, నైబిరియా, హిందూ మహా సముద్ర ప్రాంతం
- సుడిగాలులు ఎక్కడ సంభవిస్తాయి? అమెరికా వాయవ్య రాష్ట్రము లో
- ప్రతి చక్ర వాతాలు అనగా ? సమ భార రేఖలు గుండ్రంగా ఉండి కేంద్రం లో అధిక పీడనం ఉంది చక్రవాత వాతావరణానికి భిన్నంగా ఉన్న దానిని
- ప్రతి చక్ర వాతాలు ఏవిధంగా వీస్తాయి? గాలులు ఉ గోళం లో కుడినుండి ఎడమ వైపుకు ద గోళం లో ఎడమ నుండి కుడివైపుకు తిరుగుతాయి
- గాలులు ఉ గోళం లో కుడినుండి ఎడమ వైపుకు ద గోళం లో ఎడమ నుండి కుడివైపుకు తిరుగుతాయి ఇలా తిరగడానికి కారణం ఏమిటి? కోరియలిస్ ప్రభావం
- ప్రతి చక్ర వాతాలు లక్షణ౦ ? గాలుల వేగం గంటకు 20-౩౦ మైళ్ళు ఉంటుంది
- వాయు రాసులు ప్రధానంగా ఎన్ని విభాగాలు? 4 (పోలార్ (P), ఉష్ణ మండలం (T), మారిటైం (M), కాంటినెంటల్ (C)
- పోలార్ అనగా ? చల్లని ధ్రువ అక్షాంశాలు (60 డిగ్రీల ఉ. ద ద్రువాలు)
- పోలార్ అనేది ఎక్కడినుండి ఉద్భవిస్తుంది? స్కెండి నేవియా రష్యా అధిక పీడన ప్రాంతాల నుండి ఉద్భవిస్తుంది
- ఉష్ణ (వెచ్చని) మండలం భూమధ్య రేఖకు ఎన్ని డిగ్రీల లోపల ఉంది ? భూమధ్య రేఖకు 25 డిగ్రీల లోపల
- అట్లాంటిక్, అజోర్స్ ప్రాంతం నుండి వేడి తేమ ఉండే గాలి ద్రవ్యరాశి గా ఉద్భవించిన వాయు రాశి విభాగం? ఉష్ణ మండలం వాయురాశి విభాగం
- మారిటైం అనే వాయురాశి విభాగాన్ని ఏ అక్షరం తో సూచిస్తారు ? M
- మారిటైం అనగా ? తేమ (గ్రీన్ లాండ్ కెనడా శీతల ప్రాంతాలలో అభివృద్ధి చెందుతుంది)
- కాంటినెంటల్ వాయురాశి విభాగాన్ని ఏ అక్షరం తో సూచిస్తారు? C
- కాంటినెంటల్ అనగా ? ఖండాంతర (పెద్ద భూ భాగం)
- కాంటినెంటల్ అనే వాయురాశి విభాగాన్ని UK వాసులు వేటినుండి చర్చించారు? ఉష్ణ తరంగాల నుండి
- కాంటి నెంటల్ ద్రవ్య రాసి ద ఐరోపాలో అధిక వరదలు ఉరుములు అవపాతం కలిగిస్తుంది దీనిని ఏమంటారు? స్పానిష్ ఫూం
- వాతాగ్రం ఎలా ఆవిర్భవిస్తుంది ? భిన్న లక్షణాలు ఉన్న వాయు రాసులు ఎదురెదురుగా రావడం వల్ల ఆవిర్భవిస్తాయి (2 భిన్న వాయురాసులకు పరివర్తనా మండలం గా ఉంటుంది)
- వాతాగ్రం అనగా? 2 వాయురాసుల ధర్మాలు వేరుగా ఉండడం వల్ల అవి కలిసినపుడు వాటిమధ్య ఏర్పరచుకొనే సరిహద్దును
- వాతాగ్రం ఎన్ని రకాలు? 4 (ఉష్ణ వాతాగ్రం, శీతల వాతాగ్రం, స్థిర వాతాగ్రం, అధివిష్ట వాతాగ్రం)
- ఉష్ణ వాతాగ్రం (విండ్ ఫ్రాంట్) ఎక్కడ రూపు దిద్దుకొంటుంది? ఎడారి ప్రాంతం లో
- ఉష్ణ వాతాగ్రం అనగా ? ఉష్ణ వాయురాశి వేరే వాయురాశి లోకి చొచ్చుకొని పోయినపుడు దాని ముందు భాగాన్ని ఉష్ణ వాతాగ్రం అంటారు
- శీతల వాతాగ్రం వల్ల ఏర్పడు మేఘాలు ? నింబస్ మేఘాలు
- శీతల వాతాగ్రం ఏ ప్రాంతాలలో రూపు దిద్దు కొంటుంది? అంటార్కిటికా సైబీరియా ఆర్కిటిక్ ప్రాంతాలలో
- శీతల వాతాగ్రం అనగా ? శీతల వాయురాశి ఉష్ణ వాయురాశి లోకి చొచ్చుకొని పోయినపుడు శీతల వాయురాశి ముందు భాగంకి గల పేరు
- స్థిర వాతాగ్రం అనగా ? కొన్ని రోజుల పాటు కదలకుండా స్థిరంగా ఉండే వాతాగ్రం పేరు
- శీతల ఉష్ణ వాయు రాసులు కలుసుకొన్నప్పుడు శీతల వాయు రాసి కిందికి దిగడానికి ఉష్ణ వాయురాశి పైకి పోవడానికి ప్రయత్నిస్తాయి వీటిని ఏమంటారు? అధివిష్ట వాతాగ్రం
- అధివిష్ట వాతాగ్రం ఎన్ని రకాలు? 2 (శీతల అధివిష్ట వాతాగ్రం, ఉష్ణ అధివిష్ట వాతాగ్రం)
- అధివిష్ట అనగా అర్ధం ఏమిటి ? అధివిష్ట అంటే దాగుకొన్నది అని అర్ధం
Monsoon Winds (ఋతు పవనాలు)
- మాన్సూన్స్ (ఋతు పవనాలు) అనగా ? ఋతువులను బట్టి వీచే పవనాలు
- వర్షం కురిపించే శక్తి ఉన్న పవనాలు ? ఋతు పవనాలు
- ఆసియా లోని అధిక దేశాలు వర్షాన్ని పొందడం వల్ల ఏ పేరుతొ పిలుస్తారు? ఋతుపవన ఆసియా
Local Winds (స్థానిక పవనాలు)
- స్థానిక పవనాలుకు గల పేర్లు ? తృతీయ పవనాలు, లోకల్ విండ్స్ (కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి )
Major Local Winds (ముఖ్య స్థానిక పవనాలు)
- స్థానిక పవనాలులో ముఖ్యమైనవి? ఫోహెన్, చినూక్, సమూన్, సిరాక్, సైమూన్, పంపిరో, మిస్ట్రల్, బోరా
- ఆల్ఫ్స్ పర్వతాల నుండి స్విర్జర్లాండ్ వైపు వీచు పవనాలు ? ఫోహెన్/ఫోన్
- ఫోహెన్/ఫోన్ పవనాలు ఏ పంటకు అనుకూలం ? ద్రాక్షా పంటకు
- ఫోహెన్/ఫోన్ పవనాల ఉష్ణోగ్రత యెంత ఉంటుంది ? 15-20 డిగ్రీలు
- అమెరికా కెనడా రాఖి పర్వతాల నుండి తూర్పు మైదానాలు (ప్రయరీలు) వైపు వీచు పవనాలు ? చినూక్
- చినూక్ పవనాలకు కాలిఫోర్నియా లో ఏ పేరుతో పిలుస్తారు? శాంతాఅన్నా
- అరేబియా ఎడారిలో వీచే పవనాలు ? సైమూన్
- సైమూన్ పవనాలు ఏ నెలల్లో వీస్తాయి ? ఏప్రిల్ జూన్ మధ్య వీస్తాయి
- సెప్టెంబర్ నవంబర్ మధ్య అరేబియా లో వీచే పవనాలు ? హబూల్
- అప్ ఆసియా వేసవిలో వీచే దుమ్ము పవనాలు ఏవి ? షమాల్ (ఎడారి నుండి వీయడం వల్ల దుమ్ము ధూళి తో ఉంటాయి)
- పాక్, ఉ భారత్ మైదాన ప్రాంతాల వైపు వీచే పవనాలు ? లూ
- మే, జూన్ మాసాలలో లూ పవనాలు ఏ సమయం లో వీస్తాయి ? మధ్యాహ్న సమయాలలో
- లూ పవనాలలో ఉష్ణోగ్రత యెంత ఉంటుంది? 45-50 డిగ్రీలు ఉంటుంది
- హానికర మైన పవనాలు ఏవి ? మిస్ట్రల్ (వేగం గంటకు 64 కిమీ)
- మిస్ట్రల్ పవనాలు ఎప్పుడు వీస్తాయి? శీతాకాలం లో
- ఫ్రాన్స్ నుండి మధ్య ధరా సముద్రం వైపువీచు పవనాలు ? మిస్ట్రల్ (ప్రభావం వల్ల దక్షిణ ఫ్రాన్స్ లో అధిక మంచు కురుస్తుంది
- ఇటలి నుండి ఏడ్రియాటిక్ సముద్రం వైపు వీచు పవనాలు? బోరా (ఇటలి భాష పదం)
Precipitation (అవపాతం)

- నీటి ఆవిరి ద్రవరూపం లో గాని ఘన రూపం లో గాని భూమికి చేరడాన్ని ఏమంటారు?అవపాతం
- అవపాతం ఏ ఆరవనం నుండి వస్తుంది? ట్రోపో స్పియర్ నుండి వస్తుంది (8-16 కిమీ పైన మేఘాల నుండి)
- మేఘలలోని అవపాతం కరగడానికి నిబంధనలు ఎన్ని? 2 (గాలిలోని తేమ విస్తారంగా ఉండి సంతృప్తి గా ఉండాలి, గాలి ప్రకృతి సిద్దంగా పైకి లేచి చల్లబడాలి)
Types of Precipitation (అవపాత రకాలు )
- నీరు తన స్థితిని ఎన్ని రకాలుగా మార్చు కొంటుంది? 5 (భాస్పిభవనం, సబ్లిఏషణ్, ద్రవీకరణం, ద్రవి భవనం, ఘనిభవనం)
- భాస్పిభవనం అనగా ? నీరు ఆవిరిగా మారడం
- సబ్లిఏషణ్ అనగా ? నీటి ఆవిరి మంచుగా మారడం
- ద్రవీకరణం (మెల్టింగ్) అనగా ? నీటి ఆవిరి నీరుగా మరే ప్రక్రియ
- అవపాత రూపాలుకు ఉదా ? తుంపర, వర్షం, మంచు, వడగళ్ళు, హిమసీకరం, సూర్య రశ్మితో కూడిన వర్షం
- తుంపర అనగా (డ్రిజిల్) ? తేలికైన వర్షం
- తుంపర లో నీటి తుంపరల పరిమాణం యెంత ఉంటుంది ? 0.5 మిల్లి మీటర్లు
- తుంపర ఏ మేఘాల నుండి సంభవిస్తుంది? స్ట్రాటో క్యూములాస్, స్ట్రాటాస్ మేఘాల నుండి
- వర్షపాత౦ (రైన్) కొలిచే పరికరం ? వర్శమాపకం
- అవపాతం లో చాలా ముఖ్యమైనది? వర్షం
- వర్షం అనగా ? ద్రవరుపం లో ఉన్న నీరు వాతావరణం నుండి భూమిని చేరడం
- వర్షం లో నీటి తుంపరల పరిమాణం ? 0.5 మిల్లి మీటర్లు అంతకంటే ఎక్కువ
- వర్షం ఏ మేఘాల నుండి కురుస్తుంది? నింబో స్ట్రేటస్, క్యూములో ని౦బాస్, ఆల్టో స్ట్రేటస్, స్ట్రాటో క్యూములాస్)
- ఏ మేఘాల నుండి వచ్చే వర్షం రోజంగా పడుతుంది ? నింబో స్ట్రేటస్ మేఘలనుండి
- తక్కువ ఎత్తులో ఉండి భారి వర్షాలు ఇచ్చే మేఘాలు? క్యూములో ని౦బాస్ (0.3 అంగుళాల కంటే ఎక్కువ గంటకు)
- పుట్టుక ఆధారంగా వర్షం పాతం ఎన్ని రకాలు ? 3 రకాలు (సంవహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం, చక్రవాత వర్షపాతం)
- సంవహన వర్షపాతం ఏ మేఘాల నుండి సంభవిస్తుంది? క్యూములో నింబస్ మేఘాల నుండి వర్షం కురుస్తుంది
- సంవహన వర్షపాతం అనగా ? వేడిక్కిన గాలి పైకి పోయి మేఘాలుగా ఏర్పడి వర్షించడం
- సంవహన వర్షపాతం ఎక్కడ ఎక్కువ సంభవిస్తుంది ? భూమధ్య రేఖా ప్రాంతం లో తరచూ సంభవిస్తుంది
- మన రాష్ట్రము లో సంవహన వర్షపాతం ఎప్పుడ సంభవిస్తుంది? వేసవిలో
- పర్వతీయ వర్షపాతంనకు మరొక పేరు? నిమ్నోన్నత వర్షపాతం
- పర్వతీయ వర్షపాతం ఎలా సంభవిస్తుంది? గాలులు ప్రయాణ మార్గం లో పర్వతాలు అడ్డుగా ఉన్నపుడు పర్వతాలను అనుసరించి గాలి పైకి లేస్తుంది అచట ఉష్ణోగ్రతకు గాలి చల్లబడి వర్షం పడుతుంది
- పర్వతీయ వర్షపాతంలో ఎక్కువ వర్షం ఎటువైపు సంభవిస్తుంది? పవానాభి ముఖ దిశలో
- పర్వతీయ వర్షపాతంలో ఎక్కువ సంభవించు ప్రాంతం? చిరపుంజి, మాసిండ్రం
- వర్ష చాయా ప్రాంతం అనగా? పవన పరాన్ముఖ దిశలో వర్ష తక్కువ /పడక పోవచ్చు దానిని (ఉదా: రాయలసీమ, దార్ ఎడారి, పూనే, పేటగోనియ ఎడారి)
- పేటగోనియ ఎడారి ఎక్కడ కలదు? అర్జెంటీనా
- 2 వాయురాసుల వత్తిడి చర్యవల్ల సంభవి౦చు వర్షపాతం ? చక్రవాత వర్షపాతం
- చక్రవాత గాలులు ఏవిధంగా ఉంటాయి? ఉ గోళం లో అప సవ్యంగా ద గోళం లో సవ్యంగా తిరుగుతూఉంటాయి (కోరియాలిస్ ప్రభావం వల్ల)
- చక్రవాతం లేదా తుఫాను అనగా? ట్రోపో ఆవరణం లో అల్పపీడనం చుట్టూ అతివేగంగా తిరిగే పవన వ్యవస్థను చక్రవాతం లేదా తుఫానులు అంటారు
- చక్రవాతంలో కేంద్ర భాగాన్ని ఏ పేరుతొ పిలుస్తారు? చక్రవాత కన్ను
- చక్రవాతాలను వాయుగుండాలు అని ఎందుకు అంటారు ? పవనాలు సుడిగుండాల లాగ ఉంటాయి కాబట్టి
- చక్రవాత వర్షపాతం ఎన్ని రకాలు? 2(ఉష్ణ మండల చక్రవాతాలు, సమ శీతోష్ణ మండల చక్రవాతాలు)
- ఉష్ణ మండల చక్రవాతాలు ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య ఏర్పడతాయి? భూమధ్య రేఖ కు ఇరువైపులా 6-20 డిగ్రీల అక్షాంశాల మధ్య
- ఉష్ణ మండల సాగర వాయురాశి ఏవిధంగా ఏర్పడుతుంది? వాయురాశి లో ఉష్ణోగ్రత బేధం వల్ల కలిగే సంవహన క్రియవల్ల
- ఉష్ణ మండల సాగర వాయురాశి ఏర్పడడానికి సముద్రజల ఉష్ణోగ్రత యెంత ఉండాలి? 26-27 డిగ్రీలు ఉండాలి
- ఉష్ణ మండల సాగర వాయురాశి గాలులు గంటకు యెంత వేగం తో పయనిస్తాయి? గంటకు 100-200 కిమీ వేగం తో
- ఉష్ణ మండల చక్రవాతాల మందం యెంత ఉంటుంది? 8 కిమీ వరకు ఉంటుంది
- సమ శీతోష్ణ మండల చక్రవాతాలు ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య ఏర్పడతాయి? భూమధ్య రేఖ ఇరువైపులా 23 1/2 డిగ్రీలు నుండి 66 ½ డిగ్రీల అక్షాంశాల మధ్య
- సమ శీతోష్ణ మండల చక్రవాతాలు ఎప్పుడు ఏర్పడతాయి? 2 వాయురాసులు ఎదురెదురు గా కలుసుకొన్నప్పుడు మాత్రమే ఏర్పడతాయి (వివిధ వాయురాసుల వాతాగ్రాల కలయికల వల్ల మాత్రమే ఏర్పడతాయి)
- వాతాగ్రం అనగా ? 2 వాయురాసులు కలుసుకోకుండా మధ్యఏర్పడే సరిహద్దు
- సమ శీతోష్ణ చక్రవాతాలకు వేవ్ సైక్లోన్ అని పేరు ఎందుకు వచ్చింది? వాతగ్రాలు ప్రారంభం లో తరంగాలు గా ఉండి చక్రవాతాలు గారూపుదిద్దుకోవడం వల్ల (మిడ్ లేటిట్యూద్ సైక్లోన్ గా పేరు)
- సమ శీతోష్ణ చక్రవాతాలు ముఖ్యంగా ఎక్కడ ఏర్పడతాయి? అట్లాంటిక్ సముద్రం లో ఏర్పడతాయి
- సమ శీతోష్ణ చక్రవాతం లో సమభర రేఖల ఆకారం? గుండ్రంగా/ కోడిగుడ్డు/ వి ఆకారం
- సమ శీతోష్ణ చక్రవాతం లో వర్షం ఏ మేఘాల వల్ల కురుస్తుంది? నింబస్ మేఘాల వల్ల
- ప్రతి చక్రవాతాలులో సమ భార రేఖలు ఏ విధంగా ఉంటాయి? గుండ్రంగా
- ప్రతి చక్రవాతాలు కేంద్రం లో పీడనం ఏ విధంగా ఉంటుంది? అధికంగా (బయటకు పోయెకొద్దీ అల్ప పీడనం ఏర్పడుతుంది)
- ప్రతి చక్రవాతాలు సమయం లో ఉత్తరార్ధ గోళం లో గాలులు ఏ విధంగా ఉంటాయి? సవ్యంగా
- ప్రతి చక్రవాతాలులో ఏ మేఘాలు ఆవరిస్తాయి? (సిర్రాస్, క్యూములాస్ మేఘాల వల్ల అవరిస్తాయి)
- ఏ ఋతుపవనాల వల్ల ద ఆసియా వర్షపాతం ఎక్కువ గా ఉంటుంది? నైరుటి ఋతుపవనాల వల్ల
- ఈశాన్య భారత్ లో సం సగటు వర్షపాతం యెంత ఉంటుంది ? 2032 మిమి
- ఋతుపవన వర్షపాతం ఆంద్ర తూర్పు తీరం లో ఎంత ఉంటుంది? ఆంధ్ర తూ తీరం లో 1060 మిమి
- తేలికైన వర్షపాతం అనగా ? గంటకు 2.5 మిమి లోపు వర్షపాతం
- మధ్యస్థం వర్షపాతం అనగా? గంటకు 2.5-7.5 మిమి వర్షపాతం
- అధిక / ఎక్కువ వర్షపాతం అనగా ? గంటకు 7.5 మిమి కంటే ఎక్కువ వర్షపాతం
- మంచు (స్నో) ఏ మేఘాల వాళ్ళ పడుతుంది? సిర్రాస్ మేఘాల వల్ల, నింబో స్ట్రేటస్, స్ట్రాటో క్యూములాస్ మేఘాల నుండి
- మంచు ఏర్పడడానికి కావలసిన ఉష్ణోగ్రత యెంత ? 0” డిగ్రీల కంటే తక్కువ
- అంటార్కిటికా లో పౌడర్ వలే ఉన్న మంచును ఏవిధంగా వర్షపాతం తో కొలుస్తారు? ౩౦ సెం మి హిమం 1 సెం మి వర్షానికి సమానంగా భావిస్తారు
- మంచు రేణువులు పరిమాణం యెంత ఉంటుంది? 1 మిమి వ్యాసం కంటే తక్కువ
- డిమాండ్ డస్ట్ అనగా ? చిన్న మంచు క్రిష్టల్స్ (ఉష్ణోగ్రత -౩౦ డిగ్రీలు ఉన్నపుడు భూ ఉపరితల పై పొరలలో ఏర్పడతాయి)
- వడగళ్ళువర్షానికి కారణమైన మేఘాలు? క్యూములో నింబస్ మేఘాలు (క్యూములో నింబస్ మేఘాలు వర్షపు బిందువులను పైకి తీసుకొని వెళ్ళడం వల్ల అక్కడ అత్యల్ప ఉష్నోగ్రతలకు ఈ బిందువులు గుండ్రటి మంచు గడ్డలుగా మారి వర్షంతో పాటు భూమిని చేరుతాయి)
- నీటిలోపలి భాగం ఉల్లిపాయ మాదిరిగా గుండ్రటి చారలు కలిగిఉన్న స్వరూపాలు ? వడగళ్ళు (హెయిల్)
- వడగళ్ళు వ్యాసం ఎంత ఉంటుంది? 5-50 మిమి
- మనదేశం లో వడగళ్ళు ఏ నెలల్లో బాగా కనిపిస్తాయి? మర్చి – మే నెలల్లో
- వడగళ్ళు కనిపించని ప్రాంతాలు? ధ్రువ ప్రాంతాలు / సముద్రాలు
- హిమసీకరణం (స్లీట్) అనగా ? మంచు ముక్కలు (వర్షపు బిందువులు మార్గ మధ్యలో ఘనిభవనం చెంది భూమిని చేరుతాయి వీటినే)
- హిమసీకరణం పేర్లు ఏవి? ఘనీభ వించిన వర్షం (ఉరుములు మెరుపులతో కూడిన మంచు ముక్కలుగా భూమిని చేరుతుంది)
- గ్లేజ్ అనగా ? వర్షపు బిందువులు భూమిని చేరిన తరువాత మంచుగా మారితే దానిని
- సూర్య రశ్మితో కూడిన వర్ష ప్రభావ ఫలితం? మేఘాలు లేకున్నా అప్పుడప్పుడు సంబవిస్తుంది, ఆకాశం లో ఇంద్ర ధనుస్సు ప్రత్యక్ష మౌతుంది
Thermal Equilibrium Change (శీతోష్ణ స్థితి మార్పు)

- లీనియర్ ట్రెండ్ అనగా? భూగోళం పై ఉష్ణోగ్రత ధోరణిఎలా వేడెక్కుతుందో పసిగట్టడం
- అత్యంత వేడైన సంవత్సరం గా గుర్తించ బడిన సంవత్సరం ? 1998 (2వ వేడియైన సంవత్సరం 2005)
- ఆర్కిటిక్ యాంప్లిఫీకేషన్ అనగా ? గత 100 సం లలో ఉష్ణోగ్రతలు ఆర్కిటిక్ ప్రాంతం లో రెట్టింపు పెరగడం
- ఆర్కిటిక్ యాంప్లిఫీకేషన్లో భూగోళ ఎన్ని డిగ్రీల వరకు వేడెక్కుతుంది ? ౦.5 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు (౦.9 డిగ్రీల ఫారన్ హీట్)
Global Warming (గ్లోబల్ వార్మింగ్)
- గ్లోబల్ వార్మింగ్ అనగా? భూమి వేడెక్కడం (శిలాజ ఇందనాలు మండడం ద్వారా భూగోళం విపరీతంగా వేడెక్కుతుంది)
- గ్లోబల్ వార్మింగ్ కి కారణం ? ఓజోన్ వాయువు తగ్గిపోవడం
- గత శతాబ్దం భూగోళం ఎన్ని డిగ్రీలు వేడి ఎక్కింది ? ౦.74 +/- ౦.18 డిగ్రీలు సెంటిగ్రేడ్ వేడెక్కింది
- గ్రీన్ హౌస్ వాయువుల విడుదల నియంత్రణ కు ఏర్పాటు చేసిన ఒప్పందం ? క్యోటో ఒప్పందం
- IPCC పానెల్ (UNO ఇంటర్ గవర్నమెంట్ పానల్) భూ ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలు పెరిగింది అని తెలిపింది? 12 సం లలో 1.5 డిగ్రీలు పెరిగింది అని తెలిపింది (పారిశ్రామిక విప్లవం ముందు)
- పారిస్ పర్యావరణ సదస్సు యొక్క ఉద్దేశం ఏమిటి ? వ్యవసాయరంగం లో ఉద్గారాలు తగ్గించడం
- పారిస్ పర్యావరణ సదస్సులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి ? 119 దేశాలు
Greenhouse Effect (గ్రీన్ హౌస్ ఎఫెక్ట్)
- గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ను ఎవరు కనిపెట్టారు ? జోసెఫ్ ఫోరియర్ (1824) లో
- స్వాంటే అరెనియాస్ 1896 లో వేటిమీద పరిశోధన చేసాడు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్
- గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో ప్రధాన పాత్ర పోషించే వాయువు? నీటి ఆవిరి
- ఎంత శాతం నీటి ఆవిరి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కి దోహదం చేస్తుంది? 36-70%
- గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో కార్బన్ డై ఆక్సైడ్ ప్రభావం యెంత ఉంటుంది ? 9-26% (175౦ తరువాత గాఢత 36% పెరిగింది)
- గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో కార్బన్ డై ఆక్సైడ్ ప్రభావం ప్రస్తుత స్థాయి ? 541 PPM (parts per million)
- 2100 నాటికి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో కార్బన్ డై ఆక్సైడ్ ప్రభావ స్థాయి యెంత ఉంటుంది అని అంచనా? 970 PPM (గ్లోబల్ వార్మింగ్ పై 40-45% ఉంటుంది)
- గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో మీథేన్ ప్రభావ శాతం ? 4-9% (175౦ తరువాత గాఢత 148% పెరిగింది)
- గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో మీథేన్ విడుదల కు ప్రధాన కారణం ? వేడెక్కడం
- ట్రోపో స్పియర్ పై ఓజోన్ ప్రభావం యెంత శాతం ఉంటుంది ? ౩-7%
- గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణం గా ఉన్న వాయువులు ? CFC నైట్రస్ ఆక్సైడ్ లు
- గ్లోబల్ వార్మింగ్ పై నల్ల కార్బన్ ప్రభావం యెంత శాతం ఉంటుంది?17-20%
- గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల ____? ట్రోపో స్పియర్ వేడెక్కుతుంది స్ట్రాటో స్పియర్ చల్లబడుతుంది
Global Dimming (గ్లోబల్ డిమ్మింగ్)
- గ్లోబల్ డిమ్మింగ్ (భౌగోళిక కాంతి హీనత) అనగా ? భూ ఉపరితలం మీద సూర్యుడి ప్రభావం క్రమంగా తగ్గడం
- ఏరోసోల్ అనగా ? గాలిలో సన్నని ఘనపదార్ధ కణాలు లేదా ద్రవాల తుంపరలు కలిసి ఉన్నదానిని
- ఏరో సోల్ ఎక్కడ కనిపిస్తాయి? అగ్ని పర్వత విస్పోట నాలలో, మానవ జనిత ఉద్ఘరాలలో ఉంటాయి
- (సూర్య కాంతి భూమి మీద పడకుండా భూమికి చల్లదనాన్ని కలిగిస్తాయి)
- ఏరో సోల్ జీవిత కాలం ట్రోపో స్పియర్ లో ఎంత ఉంటుంది ? వారం రోజులు
- ఏరో సోల్ అనేవి స్ట్రాటో స్పియర్ లో ఎంత కాలం నిలిచి ఉంటాయి? కొన్ని సం పాటు
- గ్లోబల్ డిమ్మింగ్ లో గోదుమా రంగు మేఘాలు ఎంత శాతం భూమిని వేడెక్క నివ్వకుండా కాపాడుతున్నాయి ? 50% భూమిని వేడెక్క నివ్వకుండా కాపాడుతున్నాయి
Solar Activities (సౌర చర్యలు)
- సౌర వికిరనాన్ని కొలిచేవి ? కృతిమ ఉపగ్రహాలు కోలుస్తున్నాయి (1978 నుండి)
- స్ట్రాటో స్పియర్ ఎప్పటి నుండి చల్లబడుతుంది? 1976 నుండి
Consequences of Climate Change (శీతోష్ణ స్థితి మార్పుల పరిణామాలు)
- 2050 నాటికి 1103 వృక్ష జాతులలో ఎంత శాతం నశించే అవకాసం ఉంది? 18-35% నశించే అవకాశం ఉంది
- 2050నాటికీ ప్రపంచ జనాభా ఎంతకు చేరుతుంది అని అంచనా? 900 కోట్లకు
- 20౩౦ నాటికి భూమి మీద వెలువడే కార్బన్ పరిమాణం ఎన్ని PPM ల మధ్య స్థిరీకరించడం జరుగుతుంది? 445-71౦ PPMల మధ్య
- శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఎప్పటికి ఆర్కిటిక్ ప్రాంతం కుచించుకు పోతుంది? 2090-2100 నాటికి (సముద్రం లో ప్రాణ వాయువు తగ్గుతుంది)
- 2090-2100 నాటికి CO2 భూగోళ ఉష్ణోగ్రత ను ఎంతకు పెంచుతుంది అని శాస్త్రజ్ఞుల అంచనా? ౩ డిగ్రీల వరకు
- CO2 నీటితో కలిసినపుడు ఏవిధంగా మారుతుంది? కార్బనిక్ ఆమ్లంగా
- CO2ను అమెరికా కంటే ఎక్కువ విడుదల చేసే దేశం? చైనా
- 19౦౦-2౦05 మధ్య కాలంలో ప్రపంచం లో అతిపెద్ద CO2 ఉద్ఘారినిగా ఉన్న దేశం? అమెరికా (౩౦% కలిగి ఉంది)
- 19౦౦-2౦05 మధ్య కాలంలో ప్రపంచం లో 2వ అతిపెద్ద CO2 ఉద్ఘారినిగా ఉన్న దేశం? EU
- 19౦౦-2౦05 మధ్య కాలంలో CO2 ఉద్ఘారినిగా ఉన్న దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానం ఆక్రమించింది? 5వ స్థానం (2%)
- అణువు అణువు ఆధారిత మీథేన్ CO2 కంటే ఎన్ని రెట్లు బలమైన గ్రీన్ హౌస్ వాయువుగా ఉంటుంది? 80 రెట్లు
- వాతావరణం లో ఎప్పటి నుండి 35% CO2 సాంద్రత పెరిగింది? 19౦౦ సం నుండి
- భూమి వేడెక్కడాన్ని తగ్గించడానికి ఏయే చర్యలను చేపట్టాలి ? జియో ఇంజినీరింగ్ విభాగాన్ని ఆశ్రయించడం, సిసియస్ ద్వారా కార్బన్ ని నిల్వ ఉంచడం
- క్యోటో ప్రోటోకాల్ అనేది ఏమిటి ? గ్రీన్ హౌస్ వాయువుల విడుదల తగ్గించడానికి ప్రపంచ ప్రాధమిక అంతర్జాతీయ ఒప్పందం
- 1997 లో UNFCCC జరిగిన చర్చలకు సవరణ కార్యక్రమం ? క్యోటో ప్రోటోకాల్
- క్యోటో ప్రోటోకాల్ ద్వారా ఎన్ని దేశాలలో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ విడుదల ను నియంత్రిస్తుంది? 160 దేశాలలో (55% గ్రీన్ హౌస్ గేసెస్ విడుదల ను నియంత్రిస్తుంది)
- క్యోటో ప్రోటోకాల్ ప్రకారం శిలాజ ఇందనాల వినియోగానికి ఉపయోగించు పద్దతి ? కోటా పద్దతి
- EU వాయువుల విడుదల మార్పిడి పధకాన్ని ఎప్పుడు ప్రవేశ పెట్టింది? 2005 లో
- ఏ పధకం ప్రకారం స్వచ్చదంగానే కంపెనీలు ప్రభుత్వం తో కలిసి వాయువుల విడుదల స్థాయిని తగ్గిస్తాయి? EU వాయువుల విడుదల మార్పిడి పధక౦ ప్రకారం
- ఆస్ట్రేలియా తమ కర్బన కాలుష్యాన్ని తగ్గించే పధకాన్ని ఎప్పుడు ప్రకటించింది ? 2008 లో
- గ్రీన్ హౌస్ వాయువులు అనే పదం ఎక్కడనుండి వచ్చింది? తోటలో వాడే గ్రీన్ హౌస్ లనుండి
- ప్రధాన గ్రీన్ హౌస్ వాయువులు ఎన్ని ? 3 (co2, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఫ్లోరిన్)
- 2007 ప్రకారం ప్రస్తుత CO2 పరిమాణం యెంత ఉంది? 387 PPM (పార్ట్స్ పర్ మిలియన్) గా ఉంది
- 2007 ప్రకారం ప్రస్తుత మీథేన్ పరిమాణం యెంత ఉంది? 1754 PPB (పార్ట్స్ పర్ బిలియన్)
- 2007 ప్రకారం ప్రస్తుత మీథేన్ పరిమాణం యెంత ఉంది? 314 PPB
- గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావాన్ని కనుగొన్నవారు ? జోసెఫ్ ఫోరియర్ (1824)
- గ్రీన్ హౌస్ వాయువులమీద మొదటి సారి ఖచ్చితమైన ప్రయోగం చేసింది ? జాన్ టండల్ (1858 లో)
- గ్రీన్ హౌస్ వాయువులు లేకపోతే భూ ఉపరితల సగటు ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది? 14 డిగ్రీల సెంటిగ్రేడ్
- గ్రీన్ హౌస్ వాయువులు లేకపోతే భూ కనిష్ట ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలు సెంటిగ్రేడ్ కి చేరవచ్చు? -18 డిగ్రీలు సెంటిగ్రేడ్ కి చేరవచ్చు
- క్యోటో ఒప్పందం అమలును ఏ ఒప్పందం ద్వారా క్రమబద్దికరించారు? మాంట్రియాల్ ఒప్పందం ద్వారా క్రమబద్దికరించారు
- మాంట్రియాల్ ఒప్పందం దేనికొరకు ఉద్దేశించ బడినది? CFC గ్రీన్ హౌస్ వాయువుల గూర్చి
- us పర్యావరణా పరిరక్షణ సంస్థ గ్రీన్ హౌస్ వాయువుల పై తుది గణాంకాలు ఎప్పుడు విడుదల చేసింది? 7 డిసెంబర్ 2009
- గ్రీన్ హౌస్ వాయువులు అమెరికా ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ముప్పుగా పరిణమించాయి అని పేర్కొంది? us పర్యావరణా పరిరక్షణ సంస్థ
- క్యోటో ఒప్పందంలో ఎన్ని గ్రీన్ హౌస్ వాయువులను కీలక వాయువులు గా ప్రకటించింది? 6 (co2, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రో ఫ్లోరో కార్బన్, పర్స్ప్లోరో కార్బన్స్, సల్ఫర్ హెక్సాస్లోరైడ్)
- N2 & O2 పరారుణ వికిరణం నకు గల పేరు ? కృష్ణ వికిరణం
- N2 & O2 పరారుణ వికిరణం పేరును ఏ శతాబ్దం లో ప్రస్తావించారు? 19వ శతాబ్దపు చివరికాలం లో
- మౌలోసేన్ అనగా? గడిచిన 10 వేల సం ల కాలం
- వాతావరణం లో గ్రీన్ హౌస్ వాయువులు, గాలి, తుంపరలు, భూమి పొర, సౌర వికిరణ సంద్రతల్లో మార్పులు, వాతావరణ వ్యవస్థ యొక్క శక్తి తుల్యత ను మారుస్తున్నాయి అనే ప్రకటనను జారిచేసినవారు ? IPCC నివేదిక వారు
- పర్యావరణానికి జరిగే నష్టాన్ని పుడ్చేలా పునరుద్దరణ కార్యక్రమాలు చేపట్టడానికి భవిష్యత్ కార్యాచరణ నివేదికలు సూచి౦చేది? UNO ప్రపంచ ఆర్దిక సామజిక సర్వే (2౦11)
- గ్రీన్ హౌస్ వాయువుల వల్ల అనర్ధాలు ఏమిటి? భూగోళం వేడెక్కడం/హరిత గృహ ప్రభావం, ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొర తరుగుదల
- ఆమ్ల వర్షాలుకు ప్రధాన కారణం? నైట్రిక్ అక్సైడ్లు, నైట్రోజన్ డై ఆక్సైడ్ లు, సల్ఫర్ డై అక్సైడ్లు
- ఆమ్ల వర్షాలు వల్ల జరిగే పరిణామం? భూ సారం కోల్పోతుంది, చర్మ వ్యాదులు రావచ్చు
Role of Water Vapor (నీటి ఆవిరి పాత్ర )
- ప్రదేశం మరియు కాలం లో సాంద్రత అత్యధికంగా మారే ఏకైక గ్రీన్ హౌస్ వాయువు? నీటి ఆవిరి
- ద్రవ ఘన రూపాలు రెంటిలోనూ ఉండగలిగేది ? నీటి ఆవిరి
- నీటి ఆవిరి వాతావరణం లో ఎన్ని రోజులు ఉండగలదు? 9రోజులు ఉండగలుగుతుంది
- దేని ప్రకారం గాలి వేడెక్కినపుడు ఒక్క యూనిట్ ఘన పరిమాణానికి అధిక మొత్తం లో నీటి ఆవిరి అట్టిపెట్టు కొంటుంది? క్లాసియాస్ క్లేపిరాన్ సంబంధం ప్రకారం
- క్లాసియాస్ క్లేపిరాన్ సంబంధం ప్రకారం పెరిగిన గ్రీన్ హౌస్ వాయువుల సాంద్రతల తో పాటు తాపం ద్వారా వేటి సాంద్రత మరింత పెరుగుతుంది ? నీటి ఆవిరి సాంద్రత
- తాపం ఒరవడి ద్వారా కలిగిన ప్రభావాలు మరింత వేడిని పుట్టిస్తాయి దీనికి గల పేరు? సానుకూల పరిపుష్టి
- సానుకూల పరిపుష్టి అనేది దేనిని తగ్గిస్తుంది? వాస్తవిక తాపాన్ని తగ్గిస్తుంది
- మరింత సమాచారం కోసం సంప్రదించండి kingsdsc.in