Biosphere జీవావరణము అనగా? భూమిపై వివిధ మొక్కలు జంతువులూ సూక్ష్మజీవులు మొదలగు జీవ అంశాలు వాటి పరిశరాలను జీవరణం అంటారు (అన్ని పర్యావరణ వ్యవస్థల సమాహారమే జీవావరణం)
జీవావరణ విభాగాలు
Biosphere జీవరణము ఎన్ని విభాగాలతో ఉంది ? 3 (జీవ విభాగం, శక్తి విభాగం, భౌతిక పర్యావరణము)
భౌతిక పర్యావరణములో అంశాలు ఏవి? జీవ, నిర్జీవ అంశాలు
నిర్జీవ విభాగానికి గల మరియొక పేరు? అకార్భానిక విభాగం
భౌతిక పర్యావరణం లో భాగాలు
భౌతిక పర్యావరణంలో భాగాలు ఏవి? జలా వరణము, శిలావరణము, వాతావరణము
జలావరణం
నిర్జీవ విభాగం లో అతి ముఖ్య అంశం? నీరు
జలావరణ విభాగాలు ఏవి? ఉపరితల జలం, భూ గర్భ జలం, వాతావరణ జలం
వాతావరణం
వాతావరణ ముఖ్య లక్షణాలు ? వాయువులు, ఆర్ద్రత సూర్య రశ్మి ఉష్ణోగ్రత
శిలావరణం
భూ ఉపరితలం పై శిలావరణం ఎంత శాతం ఆక్రమించ బడి ఉంది? 29%
శిలావరణం లో భాగాలు ఏవి? పటలం, ప్రవారము, భూ కేంద్ర మండలం
ఖండాలు మహా సముద్రాలను ఏ పేరుతో పిలుస్తారు? ప్రధాన భూ స్వరూపాలు
భూ పటల౦ మొత్తం ద్రవ్యరాశిలో ఎన్ని మూలకాలతో ఉంది? 8 మూలకాలతో (ఆక్సిజన్, సిలికా, అల్యూమినియం, కాల్షియం, పొటాషియం, సోడియం)
శిలావరణ విభాగాలలో అతి చిన్న మూలకం? భూ పటలం
భూమిపై ఒకటి కన్నా ఎక్కువ మూలకాలు కలిగిన మిశ్రమం నకు గల పేరు? ఖనిజం
శిల అనేది —–? ఖనిజాల సమూహం
మధ్యమిక భూ స్వరూపాలు అని వేటిని పేర్కొంటారు? పర్వతాలు, పీటభూములు, మైదానాలు
తృతీయ శ్రేణి భూ స్వరూపాలు అని వేటిని పేర్కొంటారు ? చిన్న భూ స్వరూపాలు, వి అకార లోయలు, యు అకార లోయలు
జీవావరణం
జీవావరణ మందం ఎంత ఉంటుంది? ౩౦ కిమీ
భూమిపై లోతు అనగా? వృక్షాలు వేర్లు ప్రవేశించి నంత లోతు (మాతృ శిల వ్యాపించి ఉన్న లోతు)
జీవావరణం సముద్రాలలో ఎంత లోతులో ఉంటుంది? 9౦౦౦ మీటర్లు లోతులో
జీవా వరనానికి గల పేర్లు ? ఆవరణ వ్యవస్థ, పర్యావరణ జీవన విభాగాలు, కార్భానిక విభాగాలు
జీవావరణం లో ఉప విభాగాలు? మొక్కల వ్యవస్థ, మానవులతో కూడిన వ్యవస్థ, సుక్ష్మ జీవులు
సుక్ష్మ జీవులచే కార్బన్ పదార్ధాన్ని ఉత్పత్తి చేసే జీవావరణ ఉప విభాగం? మొక్కల వ్యవస్థ
జీవ మండలాలు
జీవమండలం అనగా ? ఒక నిర్దిష్ట ఆవరణ వ్యవస్థ ను కలిగిఉన్న విశాల భౌగోళిక ప్రాంతాన్ని పిలుస్తారు
జీవమండలం లోని భాగాలు
ప్రపంచ జీవ మండలాలు ప్రధానంగా ఎన్ని వర్గాలు ? ౩ వర్గాలు (టండ్రా జీవ మండలం, సమ శీతోష్ణ జీవమండలం, ఆయన రేఖా జీవ మండలం)
టండ్ర జీవ మండలం
టండ్రా జీవ మండలం లో విభాగాలు ఏవి? ఆర్కిటిక్ టండ్రా జీవ మండలం, అల్ఫైన్ టండ్రా జీవ మండలం
ఆర్కిటిక్ టండ్రా జీవ మండలం ఏయే ప్రాంతాలలో విస్తరించింది? అలస్కా, కెనడా, సైబీరియా
ఆర్కిటిక్ టండ్రా జీవ మండలం యొక్క ప్రత్యెక లక్షణం? శాశ్వత హిమం
హిమ ప్రాంతం లో క్రియాశీల పొర అనగా? ప్రతి వేసవి లో కరిగే మంచు
ఆర్కిటిక్ టండ్రా జీవ మండలంలో ఎన్ని రోజులు మంచు రహితంగా ఉంటుంది? 50-90 రోజులు
ఆర్కిటిక్ టండ్రా జీవ మండలంలో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి? 1700 రకాలు
ఫిన్ లాండ్ భాష అని ఏ ప్రాంతాలను పేర్కొంటారు? టండ్రా
టండ్రా అనగా ? చెట్లు లేనివి అని అర్ధం
ఆర్కిటిక్ టండ్రా జీవ మండలం లో ముఖ్య జంతువులు ఏవి? కస్తూరి ఎద్దు, ఆర్కిటిక్ తోడేలు, బ్రౌన్ ఎలుగుబంటి
సమ శీతోష్ణ జీవ మండలం
సమ శీతోష్ణ జీవమండలంలో భాగాలు ఏవి? టైగా అడవుల జీవ మండలం, సమ శీతోష్ణ మండల ఆకురాల్చు అడవుల జీవ మండల౦, సమ శీతోష్ణ మండల పశ్చిక బయళ్ళ జీవ మండలం, మధ్యధరా జీవ మండలం, వెచ్చని సమా శీతోష్ణ మండల జీవ మండలం
సమ శీతోష్ణ జీవమండలంలో వర్షపాతం ఎంత ఉంటుంది? వర్షపాతం 75-15౦ సెం మి
టైగా అడవుల జీవ మండలంలో భాగాలు ఏవి ? ఉ అమెరికా జీవ మండలం, ఆసియాటిక్ జీవ మండలం, పర్వత అరణ్య జీవ మండలం
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద జీవ మండలం? టైగా అడవుల జీవ మండలం
టైగా అడవుల జీవ మండలం ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? ఉ గోళం లో 50-60 డిగ్రీల ఉ అక్షాంశం మధ్య విస్తరించి ఉంది
టైగా అడవుల జీవ మండలంలో ఎంత శాతం ప్రాంతాన్ని సైబీరియా ఆక్రమిస్తుంది? 2/౩ వంతు ప్రాంతాన్ని
టైగా అడవుల జీవ మండలం అధిక జనాభా గల నగరాలు ఏవి? మాస్కో, టొరంటో
టైగా అడవుల జీవ మండలంలో ఎన్ని రకాల శ్రుంగాకార వృక్షాలు ఉన్నాయి? 4 రకాల శ్రుంగాకార వృక్షాలు ఉన్నాయి (స్ప్రూస్, ఫర్, ఫైన్, లార్చ్ మొదటి 3 సతత హరిత అరణ్యాలకు చెందినవి. 4వ జాతి ఆకు రాల్చు అరణ్యాలకు చెందినది)
టైగా అడవుల జీవ మండల వృక్షాల యొక్క ప్రత్యేకత ఏమి? ఆకులు సూదులు గా ఉంటాయి
టైగా అడవుల జీవ మండలంలో వెంట్రుకల చర్మాన్ని రంగును ఋతువులు బట్టి మార్చుకొనే క్షీరదం? ఎర్మైన్ క్షీరదం (సవిలో ముదురు గోధుమ రంగు, శీతాకాలం లో తెలుపు రంగు లోకి)
సమ శీతోష్ణ మండల ఆకురాల్చు అడవుల జీవ మండలం లో భాగాలు ఏవి ? ఉ అమెరికా జీవ మండలం, యూరోపియన్ జీవ మండలం
సమ శీతోష్ణ మండల పశ్చిక బయళ్ళ జీవ మండలంలో భాగాలు? యురేషియా స్టెప్పీ జీవ మండలం, ఉ అమెరికా ప్రయారి జీవ మండలం, పంపా జీవ మండలం, ఆస్ట్రేలియా పశ్చిక బయళ్ళ జీవ మండలం
మధ్యధరా జీవ మండలంలో భాగాలూ ? ఉ గోళ జీవ మండలం, ద గోళ జీవ మండలం
పశ్చిమ ప్రాంత తీరాలలో శీతల సముద్ర ప్రా౦తాలు ఏర్పడే ప్రాంతాలలో విస్తరించి ఉన్న జీవ మండలం? మధ్యధరా జీవ మండలం
మధ్యధరా జీవ మండలం వార్షిక సగటు వర్షపాతం? 15-40 అంగుళాలు
మధ్యధరా జీవ మండలం యొక్క ప్రత్యెక లక్షణం ? పొగమంచు ప్రభావం వల్లమధ్యస్థ ఉష్ణోగ్రతలు ఏర్పడడం
సమ శీతోష్ణ జీవమండలంలో విలక్షణమైన మొక్క ? ఎడావిస్ వేర్నాలిస్
ఎడావిస్ వేర్నాలిస్ మొక్క యొక్క ఉపయోగం ? మత్తు మందుగా, గుండె మూత్రపిండాల వైద్యానికి ఔషదంగా ఉపయోగిస్తారు
ఎడావిస్ వేర్నాలిస్ మొక్కకు గల మరొక పేరు? స్వీట్ వెర్నాల్ అని పిలుస్తారు
సమ శీతోష్ణ జీవమండలంలో ప్రస్తుతం అంతరించి పోయే స్థితిలో ఉన్న జంతువులు ఏవి? బైసన్, ఎల్క్
ఏ జీవ మండలం యొక్క వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం ప్రపంచం లోనే అధికంగా ఉంటుంది? సమ శీతోష్ణ జీవమండలం యొక్క వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం
సమ శీతోష్ణ ప్రాంత గడ్డి భూములు వాటి పేర్లు ?
ఆఫ్రికా – వెల్దులు
హంగేరి – పుష్టాలు
అర్జెంటీన, ఉరుగ్వే – పంపాలు
రష్యా, చైనా, యురేషియా – స్టెప్పీలు
ఉ అమెరిక మధ్య మైదానాలు – ప్రయరీలు
మిన్నెసోటా రాష్ట్రము, అమెరికా – సేడార్ క్రీక్
ఆస్ట్రేలియా – డౌన్ లు
ఆయన రేఖా జీవ మండలం
ఆయన రేఖా జీవ మండలంలో భాగాలూ ? ఆయన మండల అరణ్య జీవ మండలం, సవన్నా జీవ మండలం, ఎడారి జీవ మండలం
ఆయన మండల అరణ్య జీవ మండలంలో భాగాలు ఏవి? సతత హరిత వర్షారణ్య జీవ మండలం, ఉప సతత హరిత వర్షారణ్య జీవ మండలం, ఆకు రాల్చు అరణ్య జీవ మండలం, ఉప ఆకు రాల్చు అరణ్య జీవ మండలం, పర్వతారణ్య జీవ మండలం, స్వాంప్ అరణ్య జీవ మండలం
ఆయన మండల అరణ్య జీవ మండలం సంవత్సర వర్షపాతం ఎంత ఉంటుంది? 150-400 సెం మీ
ప్రపంచం లోనే అత్యధిక ప్రమాణం తో జీవ వైవిధ్యం తో ఉన్న జీవ మండలం? ఆయన మండల అరణ్య జీవ మండలం
ఆయన మండల అరణ్య జీవ మండలం భూ గోళ జీవమండలం లో ఎంత శాతం ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది? 4% (ఈ జీవమండలం భూమిపైన అత్యధిక అటవీ ప్రాంతం)
ఆయన మండల అరణ్య జీవ మండలం యొక్క వృక్షాలు చ.కి మీ కి ? 100 వరకు ఉంటాయి
ఆయన మండల అరణ్య జీవ మండలంలో ప్రధాన వృక్షం? ష్ట్రంగ్లార్ ఫిక్ (అత్తి జాతి చెట్టు)
ష్ట్రంగ్లార్ ఫిక్ అనగా అర్ధం? గొంతు పిసికి చంపడం
భూతలం పై నివసించే వృక్ష జాతులలో ప్రధానమైనవి? సిలింద్రాలు
ప్రపంచం లోనే అత్యంత సోమరి జంతువుగా పిలువబడే జంతువు ? స్లాత్ (ఆయన మండల అరణ్య జీవ మండలంలోనే గలదు)
సవన్నా జీవ మండలంలో భాగాలు ? సవన్నా అడవుల జీవ మండలం, సవన్నా పశ్చిక బయళ్ళ జీవ మండలం
సవన్నా జీవ మండలానికి మరియొక పేరు? ఉష్ణమండల పశ్చిక బయళ్ళ జీవమండలం
సవన్నా జీవ మండలం గల ప్రాంతాలు? ఆఫ్రికా, ఎవర్ గ్లేడ్స్ ప్రాంతం (ఫ్లోరిడా రాష్ట్రము లో ఉ అమెరికా), ఆస్ట్రేలియా
సవన్నా జీవ మండలం యొక్క ప్రత్యేకత? చిన్నగా ఉండే వృక్ష సమూహాలు పెరగడం
సవన్నా జీవ మండలంలో వర్షాకాలం మాత్రమే చిగురించే వృక్షాలు? బావ్ బాబ్ వృక్షాలు
ఎడారి జీవ మండలంలో భాగాలూ? శుష్క ఎడారి జీవ మండలం, ఉప శుష్క జీవ మండలం
ఎడారి జీవ మండలం యొక్క విశిష్ట లక్షణం ? పొడి ప్రాంతం ఉండడం
ఎడారి జీవ మండలం వర్షపాతం? 1 సెం మీ – 37 సెం మీ
ఎడారులు ఎన్ని రకాలు? 2 (ఉష్ణ మండల ఎడారులు, శీతల ఎడారులు)
ఉష్ణ మండల ఎడారులుకు ఉదా ? సహారా, సోనారిన్
శీతల ఎడారికి ఉదా? గోబీ, అర్జెంటీనా ఎడారి
తీర ప్రాంత ఎడారులు ఏయే డిగ్రీల అక్షాంశాల మధ్య ఏర్పడ్డాయి? ఖండాల ప తీరం లో 20-30 డిగ్రీల అక్షాంశాల మధ్య ఏర్పడ్డాయి
తీర ప్రాంత ఎదారులకు ఉదా? అటకామా, నమీబియా
ఖండాంతర ప్రాంతాలలో సముద్రాలకు దూరంగా ఏర్పడ్డ ఎదారులకు గల పేరు ? ఖండంతర్గ ఎడారులు
ఖండంతర్గ ఎడారులుకు ఉదా? కలహారి ఎడారి, ఆస్ట్రేలియా ఎడారి, గోబీ ఎడారి
హిమాలయ పర్వత ఛాయా ప్రాంతలలో, మంగోలియా లో ఏర్పడిన ఎడారి? గోబీ ఎడారి
ఎడారి జీవ మండలంలో పెరిగే వృక్ష జాతులు ఏవి? కురుచ గడ్డి, సేజ్ బ్రష్, క్రకేయో సొట్ పొదలు, ముల్గా చెట్టు, నాగజెముడు, రసబరిత వృక్షాలు /succulents అని పేరు
సాగారో జాతి మొక్కలు ఏ ఎడారిలో పెరుగుతాయి? సోనోరాన్ ఎడారిలో
స్పినిప్లేక్స్ వృక్షాలు ఏ ఎడారిలో మాత్రమే పెరుగుతాయి? ఆస్ట్రేలియా ఎడారిలో మాత్రమే పెరుగుతాయి
నిశాచర జీవులు అనగా? రాత్రి సమయాలలో జంతువులను క్రియా సీలంగ వేటాడే జంతువులు (పగలు శరీర ద్రవాలు కోల్పోకుండా ఇలా చేస్తాయి)
ఒక భౌగోళిక ప్రాంతం లో ఒక నియమిత కాలం లోతమలో తాము పరస్పర చర్యలు జరుపుకొనే సజీవ నిర్జీవ ముదాయాలతో కూడిన ప్రాధమిక క్రియాత్మక విభాగమే ఆవరణ వ్యవస్థ అని పెర్కొన్నవారు ? సవింద్రా సింగ్ (1991)
జీవరాసులు అనగా ? ఏకకణ బహుకణ జీవులు, వృక్షాలు మానవునితో సహా జీవులన్నిటిని కలిపి జీవరాసులు అంటారు
జాతి అనగా ? పునరుత్పత్తి చేయగల సామర్ధ్యం ఉండి ఆకారంలోనూ ప్రవర్తన లోను పోలికలు గల జీవుల సముదాయం
జీవ జనాభా అనగా? భౌగోళిక ప్రాంతం లో పరస్పర చర్యలు జరుపుకొంటూ నివసించే ఒకే జాతికి చెందిన జీవరాసులు
కమ్యూనిటి సమాజం అనగా? భౌగోళిక ప్రాంతం లో చర్యలు జరుపుకొంటూ నివసించే వివిధ జాతులు
ఆవరణ వ్యవస్థ ఆవరణ శాస్త్రం లో ప్రాధమిక విభాగాలను కలిగింది ఎందుకంటె అవి క్లిష్టమైనవి పరస్పర ఆధారమైనవి త్యంత వ్యవస్తిక్రుతమైన వ్యవస్థలు అవి జీవావరనానికి ప్రాధమిక నిర్మాణ విభాగాలు అని పెర్కొన్నవారు ? సిసి పార్క్
జీవావరణ పారంపర్యత అనగా ? భౌతిక పర్యావరణం లో కాలక్రమం లో ఒక సముదాయం లో వచ్చే మార్పు
జీవావరణ పారంపర్యత ప్రక్రియలు ఎన్ని? 2 (భౌతిక పర్యావరణాన్ని సంస్కరించడం వల్ల ఒక సమాజం, అధిక మొత్తంలో కార్బన్ పదార్ధాల లభ్యత వల్ల పర పోషకాల సమాజం గా ఉంటుంది)
ఏ సమాజాన్ని మార్గదర్శి సమాజం అంటారు? భౌతిక పర్యావరణాన్ని సంస్కరించడం వల్ల గల సమాజాన్ని (ఇది ఎల్లప్పుడు స్వయం పోషక సమాజంగా ఉంటుంది)
భౌతిక పర్యావరణాన్ని సంస్కరించడం వల్ల గల సమాజానికి మార్గదర్శి సమాజం అని పేరు ఎందుకు వచ్చింది? దీని పరిణామం పూర్తిగా ఆకర్బన పర్యావరణం లో సంభవించడం వల్ల
అభివృద్ధి చెందే సమాజం లో సమాజాల పరివర్తన శ్రేణులును ఏమంటారు సేరేల్ దిశ
క్లైమాక్స్ సమాజం అనగా? అంతిమంగా అభివృద్ధి చెందే సమాజం
ఆవరణ వ్యవస్థ లో జరిగే అంత్రోపోజేనిక్ ప్రక్రియకు గల పేరు? జీవ వృద్దికరణం
జీవ వృద్దికరణం అనగా ? హానికరమైన స్థాయికి తగ్గించలేని కాలుష్య కారకాలు (విష పదార్ధాలు) పేరుకు పోవడం
ప్రాధమిక పారంపర్యత అనగా? ఒక నిస్సారమైన ప్రాంతం లో మొదటి సారిగా జీవజాతుల పరిణామం
భూగోళం పై జీవమండలాల సరిహద్దులను వేటి ద్వారా నిర్ణయిస్తారు? శీతోష్ణస్థితుల ద్వారా
ఆవరణ వ్యవస్థలు రకాలు
ఆవరణ వ్యవస్థలు ఎన్ని రకాలు? 2 (భౌమ ఆవరణ వ్యవస్థ, జలావరణ వ్యవస్థ)
ఆవరణ వ్యవస్థలో ప్రధాన అంశాలు ఎన్ని ? 3 (సజీవ అంశాలు, నిర్జీవ అంశాలు, శక్తి అంశాలు)
సజీవ అంశాలుకు ఉదా ? మొక్కలు, జంతువులూ, సూక్ష్మ జీవరాసులు ఉంటాయి
సజీవ అంశాలు క్రియత్మకాలను బట్టి ఎన్ని వర్గాలు? 2 (స్వయం పోషకాలు, పర పోషకాలు)
స్వయం పోషకాలు గల మరొక పేరు ? ఉత్పత్తి దారులు
హరిత పదార్ధాలను రసాయనిక శక్తిగా మార్చే సామర్ధ్యం వేటికి గలదు? స్వయం పోషకాలకు (కార్బన్ డై ఆక్సైడ్ నీరు లభించి నపుడు ఆహార పదార్ధాలను నిల్వ చేసుకొంటాయి)
స్వయం పోషకాలుకు ఉదా? అన్ని రకాల జీవులు, ఆకుపచ్చ మొక్కలు, బాక్టీరియా, శైవలాలు
పర పోషకాలుకు గల మరొక పేరు? వినియోగ దారులు (మనుగడ సాగించడం కోసం స్వయం పోశాకాలపై ఆధారపడే జీవులు)
ఆహార అలవాట్ల ఆధారంగా పరపోషకాలను ఎన్ని రకాలు గా వర్గీకరించారు? 4 (ప్రాథమిక వినియోగ దారులు, ద్వితీయ వినియోగ దారులు, తృతీయ వినియోగ దారులు, పూతికాహారులు)
ప్రాథమిక వినియోగ దారులుకు మరొక పేరు? శాకాహారులు (మొక్కల నుండి ఆహారాన్ని తీసుకొని కాల్వసిన శక్తిని పొందుకొంటాయి)
ద్వితీయ వినియోగ దారులు అనగా ? శాకాహార జీవులను ఆహారంగా గ్రహించే జంతువులూ (ప్రాధమిక వినియోగ దారుల మాంశాన్ని తింటాయి)
తృతీయ వినియోగ దారులు అనగా? ద్వితీయ వినియోగ దారుల మాంశాన్ని గ్రహించే జంతువులు
అగ్రమంశాహారులు అని వేటిని అంటారు? తృతీయ వినియోగ దారులుల్ (టాప్ కార్నివోర్స్ గా పేరు)
అగ్రమంశాహారులు / తృతీయ వినియోగ దారులు /టాప్ కార్నివోర్స్ కి ఉదా? పులులు సింహాలు రాబందులు
పూతికాహారులు అనగా ? చనిపోయిన జీవులను ఆహారంగా గ్రహించే జీవులు (ఉదా బాక్టీరియా, సుక్ష్మ జీవులు)
శక్తి ప్రవాహం అనగా ? ఆహారపు గొలుసు ప్రక్రియలో శక్తి ఒక స్థాయి నుండి మరొక స్థాయికి బదిలీ కావడం
ఆహారవతి (ఫుడ్ వెబ్ అనగా)? జీవజాతుల అంతర్జాతీయ అనుసంధాన క్షేత్రవల
ఆవాసం అనగా? ఒక జాతి ఏప్రాంతం లోనైతే జీవన అనుసరనీయత సాధించిందో ఆప్రాంతం
జీవావరణ సముచితం (ఎకోలజికల్ నీచే) అనగా? జీవ జాతికి తన ఆహరం నివాసం పునరుత్పత్తికి సంబందించిన జీవనశైలి లక్షణాలు
జీవావరణ సమతుల్యత అనగా ? అనుక్రమం గా సంభవించే మార్పులకు లోబడి ఉన్న జీవరాసుల సమాజం లోని సహజ సిద్దమైన క్రియాశీల సమస్థితి
నిర్జీవ అంశాలుకు గల మరొక పేరు? భౌతిక పర్యావరణ అంశాలు అని పేరు (ఉదా: భూమి, మృత్తిక, నీరు, గాలి, సూర్య రశ్మి)
జీవ వైవిధ్య పరిరక్షణ
జీవ వైవిధ్య పరిరక్షణ లో గల అంశాలుఎన్ని ? 2 (మొక్కలు జంతువులు)
జీవ వైవిధ్య పరిరక్షణ దేనిని గూర్చి తెలియ జేస్తుంది? ఆవరణ వ్యవస్థ లో జీవుల నాణ్యతను విశిష్టత లను తెలియ జేస్తుంది
జీవ వైవిధ్య సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగింది? రియో దిజేనేరో లో (1992)
జీవ వైవిధ్య సమావేశంలో జీవ వైవిధ్యాన్ని ఏవిధంగా నిర్వచించారు? భౌమ సముద్ర ఇతర జల ఆవరణ వ్యవస్థ లు వీటిలో జీవావరణ సముదాయాలలో జీవరాసులలో ఉన్న వైవిధ్యాన్ని జీవ వైవిద్యంగా నిర్వసించారు
జీవ వైవిధ్య పరిరక్షణా రకాలు
జీవ వైవిధ్య పరిరక్షణ రకాలు ఎన్ని? 3 (జన్యుపర జీవ వైవిధ్యం, జాతిపర జీవ వైవిద్యం, ఆవరణ వ్యవస్థ జీవవైవిద్యం)
భౌగోళికం గా విడిపోయిన ప్రాంతం లో జీవ జనాభాలో ఉన్న జీవుల వైవిద్యమే ______? జీవ వైవిద్యం
జాతులలో ఉండే వైవిద్యానికి సంబంధించి పరిమాణాత్మక ఆలోచనే_____? జాతిపర వైవిద్యం
ఆవరణ వ్యవస్థ జీవవైవిద్యం అనగా ? జీవ జాతి నివసించే వివిధ ఆవాసాలను జీవావరణ ప్రక్రియలు ఆవరణ వ్యవస్థ లో వ్యత్యాసాలు తెలియ జేసేది
ఆవరణ వ్యవస్థ జీవవైవిద్యంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? భౌమ ఆవరణ వ్యవస్థ, జలచర ఆవరణ వ్యవస్థ, కృత్రిమ/మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థ
భౌమ ఆవరణ వ్యవస్థలో అంశాలు ఏవి ? అడవులు ఎడారులు పశ్చిక బయళ్ళు మొదలైనవి ఉంటాయి
జలచర ఆవరణ వ్యవస్థలో ఎన్ని భాగాలు గలవు? 2 (మంచి నీటి ఆవరణ వ్యవస్థ, సముద్ర ఆవరణ వ్యవస్థ)
కృత్రిమ/మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థలో భాగాలు ? సరస్సులు పంట భూములు ఉంటాయి
జీవ వైవిద్యం పరిరక్షణ ప్రక్రియ ఎన్ని రకాలు? 2 రకాలు (అవాసాంతర ప్రక్రియలు, ఆవాసేతర ప్రక్రియలు)
జీవ వైవిద్యం లోని ప్రాథమిక సూత్రం? అంతరించి పోయే స్థితి లో ఉన్న జీవ జాతులను వాటి అవాసాలు రక్షిత క్షేత్రాలు ఏర్పాటు చేయడం
ప్రస్తుత ప్రపంచం లో రక్షిత ప్రాంతాలు పార్కులు అభయారణ్యాలు సంఖ్య ఎంత? 7000 (భూ ఉపరితలం లో 65౦ మిలియన్స్ హెక్టార్ల, ప్రంచ వైశాల్యం లో 5% కలిగి ఉంది)
జీవ వైవిద్యం పరిరక్షణ ఆవాసేతర ప్రక్రియల ప్రధాన లక్ష్యం ? అంతరించి పోయిన జీవ జాతులను జూపార్క్ లు ప్రయోగ శాలల్లో ఉత్పత్తి చేయడం
జీవ వైవిద్యం పరిరక్షణ ఆవాసేతర ప్రక్రియలు ఎన్ని దశలలో జరుగుతున్నాయి? 2 దశలలో (సంరక్షించ వలసిన జీవ జాతులను గుర్తించుట, అవాసేతర సంరక్షణకు అనుసరించాల్సిన పద్దతిని ఎంపిక చేయుట)
అవాసేతర సంరక్షణకు అనుసరించాల్సిన పద్దతులు ఏవి? దీర్ఘ కాలిక బంధన ఉత్పత్తి, స్వల్పకాలిక వృద్ది, విడుదల, జంతువుల స్తానాంతరం
హాట్ స్పాట్ పదం దేనికొరకు వాడతారు? ఈ పధం అధిక సంరక్షణ ప్రాధాన్యతా ప్రాంతాలు నిర్వసించ డానికి వాడతారు
కీస్టోన్ జాతులు యొక్క ఉద్దేశం ఏమిటి? ఒకే జాతిపై దృష్టి కేంద్రీకరించి సంరక్షణ ప్రయత్నాలు సాధించడం
భౌగోళిక ప్రాంతం లోని ఏర్పడిన రక్షిత ప్రాంతాలు ఏ ప్రోగ్రాం క్రింద అంతర్జాతీయంగా గుర్తించ బడ్డాయి? Man and Biosphere programme (యునెస్కో అర్ద్వర్యం లో)
రక్షిత ప్రాంతాలు ఏర్పాటు ఉద్దేశం? భౌమ తీర ప్రాంత ప్రాతినిధ్య ఆవరణ వ్యవస్థల సంరక్షణ కోసం
భారత్ లో బయో స్పియర్ రిజర్వ్ లు
భారత్ ప్రభుత్వ బయోస్పియర్ రిజర్వ్ నిపుణుల కమిటి ని ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1979 లో
భారత్ ప్రభుత్వ ఎన్ని బయోస్పియర్ స్థానాలు ప్రకటించాలి అని భావించింది ? 14 (13 స్థలాలను జీవావరణ రిజర్వ్ లు గా ప్రకటించారు)
ప్రస్తుత బయోస్పియర్ రిజర్వులు మొత్తం? 18
వ.సంఖ్య
బయోస్పియర్ రిజర్వ్ పేరు
ఏర్పాటు చేసిన సంవత్సరం
ఎక్కడ ఉంది
1
నీలగిరి
1 సెప్టెంబర్ 1986
తమిళనాడు కేరళ కర్ణాటక
2
నందాదేవి
15 జూన్ 1988
ఉత్తరాంచల్
3
నోక్రిక్
1 సెప్టెంబర్ 1988
మేఘాలయ
4
మన్నార్ సింధు శాఖ
18 ఫిబ్రవరి 1989
ఇండియా శ్రీలంక మధ్య
5
మానస్
14 మార్చ్ 1989
అస్సాం
6
సుందర్ బన్స్
29 మార్చ్ 1989
బెంగాల్
7
గ్రేట్ నికోబార్
6 జూన్ 1989
అండమాన్ నికోబార్ లోని దక్షిణ ద్వీపం
8
సిమ్లిపాల్
21 జూన్ 1994
ఒరిసా లోని మయూర్ బంజ్
9
డిబ్రూ సైకోవా
28 జులై 1997
అస్సాం లోని దిబ్రుగర్ టిన్ సుఖియ జిల్లాలు
10
దేహంగ్ దేబాంగ్
2 సెప్టెంబర్ 1998
అరుణాచల్ ప్రదేశ్
11
పంచ్ మారి
3 మార్చ్ 1999
మధ్య ప్రదేశ్
12
కాంచన జంగా
7 ఫిబ్రవరి 2000
సిక్కిం
13
అగస్త్య మలై
12 నవంబర్ 2001
కేరళ
14
అచంకార్ అమర్ కంటాక్
2005
మధ్య ప్రదేశ్ ఛత్తీస్ ఘర్
15
గ్రేట్ రాన్ అఫ్ కచ్
2008
గుజరాత్
16
శీతల ఎడారి
2009
హిమాచల్ ప్రదేశ్
17
శేచచలం కొండలు
2010
ఆంధ్ర ప్రదేశ్
18
పన్నా
2011
మధ్య ప్రదేశ్
ప్రపంచం లో బయో స్పియర్ రిజర్వ్ లు
ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని బయోస్పియర్ లు ఏర్పాటు చేసారు? 425 బయోస్పియర్ లు (95 దేశాలలో 1979 నుండి నేటి వరకు)
భారత్ లో బయోస్పియర్ రిజర్వ్ లును ఎన్ని మండలాలు గా వర్గీకరించారు? 3 (కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సిషన్ ఏరియా)
కోర్ జోన్ (కేంద్ర మండలం) యొక్క ఏర్పాటు ఉద్దేశం ? జీవ వైవిద్య పరిరక్షణ
కోర్ జోన్ లో ఏయే కార్యక్రమాలు నిర్వహణ జరుగుతుంది? విద్వంశ కరం కాని పరిశోధనలు, తక్కువ ప్రభావాలను చూపే విద్య, ఎకో టూరిజం
కోర్ జోన్ చుట్టూ వ్యాపించి ఉన్న మండలం ? బఫర్ జోన్ (మధ్యస్థ మండలం)
బఫర్ జోన్ లో నిర్వహించు కార్యక్రమాలు? పర్యావరణ విద్య వినోదం, ప్రాధమిక అనువర్తిత పరిశోధన
బఫర్ మండలం చుట్టూ ఆవరించబడి ఉన్న ప్రాంతం ? ట్రాన్సిషన్ ఏరియా (పరివర్తిత ప్రాంతం)
ట్రాన్సిషన్ ఏరియా (పరివర్తిత ప్రాంతం) దేనికొరకు ఉద్దేశించ బడినది? వ్యవసాయ కార్యకలాపాలకు, సహజ ఆవాసాలకు, NGO కార్యకలాపాలకు, సుస్థిర అభివృద్దికి ఉపయోగిస్తారు
జీవ వైవిధ్య హాట్ స్పాట్ అనే పదాన్ని ఉపయోగించిన వారు? నార్మన్ మైయర్స్ (బ్రిటిష్ జీవ శాస్త్రవేత్త)
జీవ భూగోళం అనగా మొక్కలలో అసాదారణ స్థాయిలో మరియు అవాసాల నష్టం లో తీవ్ర స్థాయిలు రెంటి లక్షణాలు గలది అని వర్ణించిన వారు ? నార్మన్ మైయర్స్
నార్మన్ మైయర్స్ 1990 లో ఎన్ని హాట్ స్పాట్ లు పేర్కొన్నాడు? 4 మధ్యధరా రీతి హాట్ స్పాట్ లు మరొక 8 హాట్ స్పాట్ లు పేర్కొన్నాడు
అంతర్జాతీయ సంరక్షణా విభాగం నార్మన్ మైయర్స్ హాట్ స్పాట్ లను ఏ విధంగా అనుకరించింది? సంస్థాగత బ్లూ ప్రింట్ గా
అంతర్జాతీయ సంరక్షణా విభాగంప్రకారం ఒక ప్రాంతం హాట్ స్పాట్ గా అర్హత సాధించాలంటే ఎన్ని ఖటిన ప్రమాణాలు కలిగి ఉండాలి? 2 (1500 జాతుల నాడి వ్యవస్థ గల మొక్కలు కలిగి ఉండాలి, వాస్తవిక ఆవాసం లో 70% కోల్పోయి ఉండాలి)
అంతర్జాతీయ సంరక్షణా విభాగం 1999 లో ఏ గ్రంధాన్ని ప్రచురించింది? రిచెస్ట్ అండ్ మోస్ట్ ఎండేంజర్ద్ టేరేట్రియాల్ ఎకోరిజియన్స్
రిచెస్ట్ అండ్ మోస్ట్ ఎండేంజర్ద్ టేరేట్రియాల్ ఎకోరిజియన్స్ అనే గ్రంధం లో ఎన్ని జీవ వైవిధ్య హాట్ స్పాట్ లను గుర్తించింది? 1 (ఈ ప్రాంతాలు సమిష్టిగా 44% మొక్కలు 35% భౌమ సకశేరుకాలు కలిగి ఉన్నాయి)
అంతర్జాతీయ సంరక్షణా విభాగం గుర్తించిన హాట్ స్పాట్ ఎంత విస్తీర్ణం తో ఉంది? 11.8 % (భూభాగం లో ఆవాసాల పరిది 87.8% తగ్గింది. జీవ వైవిధ్య సంపద 1.4% కి పరిమితం చేయబడినది)
అంతర్జాతీయ సంరక్షణా విభాగం 2005 లో ఏ పుస్తకాన్ని ముద్రించింది? హాట్ స్పాట్ సంస్కరణలు (భూ జీవశాస్త్ర సుసంపన్నమైన మరియు అంతరించి పోతున్న భౌమ ఎకో ప్రాంతాలు అనే శీర్షిక ప్రచురించ బడినది)
ప్రపంచం లో జీవ వైవిధ్య హాట్ స్పాట్ లు ఎన్ని ఉన్నాయి? 35 ఉన్నాయి (భూ ఉపరితలం పై 2.౩% ఆక్రమిస్తున్నాయి)
వ.సంఖ్య
రీజియన్
హాట్ స్పాట్ ప్రాంతాలు
1
ఆఫ్రికా
ఫ్లోరిస్థిక్ అగ్ర ప్రాంతం
2
తూ ఆఫ్రికా తీర ప్రాంత అడవులు
3
తూర్పు ఆఫ్రో మౌంటేన్
4
ప ఆఫ్రికా గినియా అడవులు
5
ఆఫ్రికా కొమ్ము సోమాలియా ప్రాంతం
6
మడగాస్కర్ హిందూ మహా సముద్ర దీవులు
7
మపుట లాండ్ పొండోలాండ్ ఆల్బని ప్రాంతం
8
సిక్కులేంట్ కారూ ప్రాంతం
1
ఆసియా పసిఫిక్
తూ మలేషియన్ దీవులు
2
హిమాలయ ప్రాంతం
3
ఇండో బర్మా ప్రాంతం
4
జపాన్ ప్రాంతం
5
నైరుతి చైనా పర్వతాలు
6
నూ కేలడోనియా
7
న్యూజిలాండ్
8
పిలిప్పైన్ ప్రాంతం
9
పాలినేషియా మైక్రోనేషియా దీవులు
10
నైరుతి ఆస్ట్రేలియా
11
తూ ఆస్ట్రేలియా అడవులు
12
సూండా లాండ్
13
వలెశియా
14
ప కనుమలు & శ్రీలంకా
1
ఐరోపా & మధ్య ఆసియా
కాకసస్ ప్రాంతం
2
ఇరానో అనటోలియా ప్రాంతం
3
మధ్య ధరా హరివానం
4
మధ్య ఆసియా పర్వతాలు
1
ఉ.మధ్య అమెరికా
కాలిఫోర్నియా ఫ్లోరింష్టిక్ ప్రావిన్స్
2
కరేబియన్ దీవులు
3
మడ్రియన్ పైన్ ఒక్వుడ్ ల్యాండ్ ప్రాంతం
4
మేసో అమెరికా
1
ద అమెరికా
అట్లాంటిక్ అడవులు
2
సేర్రాడో
3
చిలియన్ శీతాకాల వర్షపు వేల్డివియాన్ అడవులు
4
ట్యూబ్స్ చోకో మాగ్దలీనా
5
ఆయన రేఖ యాన్దిస్ ప్రాంతం
భారత్ లో జీవ వైవిధ్య ప్రాంతాలు
హాట్ స్పాట్ రీజియన్స్
భాగాలు
హిమాలయ ప్రాంతం
పాక్
టిబెట్
నేపాల్
చైనా
మయన్మార్ తో సహా
ఇండో బర్మా ప్రాంతం
మొత్తం ఈ భారత్
అస్సాం అండమాన్ దీవులు మినహాయింపు
సుండల్యాండ్ ప్రాంతం
నోకోబార్ దీవులు
ఇండోనేషియా
మలేషియా
సింగపూర్
బ్రూనై
పిలిప్పైన్స్
ప కనుమలు శ్రీలంక ప్రాంతం
శ్రీలంక భారత్ ప కనుమలు
హిమాలయ ప్రాంతం లో ఎన్ని మీటర్ల ఎత్తులో నాడి వ్యవస్థ గల వృక్షాలు ఉంటాయి? 6 వేల మీటర్ల కన్నా ఎత్తైన ప్రాంతాలలో
హిమాలయ ప్రాంతం లో అంతరించి పోయే జాతులు ఎన్ని ? అంతరించి పోయే జాతులు లేవు (పక్షులు 8, క్షీరదాలు 4, బయ జీవులు 4ఉన్నాయి)
హిమాలయజీవ వైవిధ్య ప్రాంతం ఏ ఆకారం లో ఉంది? అర్ధ చంద్రాకారం లో విస్తరించి ఉంది
హిమాలయ ప్రాంతంలో ఉన్న అతి పెద్ద మొక్కల కుటుంభం? ఆర్చిడేసియా
హిమాలయ ప్రాంతం లో ఆవాల జాతికి చెందినా స్క్రి మొక్క? హీర్మానియా హిమాలయోసిస్ (6౩౦౦ మీటర్ల ఎత్తులో) పెరుగుతుంది
ఇండో బర్మా ప్రాంతం జీవ వైవిధ్య ప్రాంత విస్తీర్ణం ఎంత? విస్తీర్ణం 2 మి చ కిమీ
ఇండో బర్మా ప్రాంతంలో గడచిన 12 సం కాలం లో ఎన్ని పెద్ద క్షీరదజాతులు కనుగొన బడ్డాయి? 6 పెద్ద క్షీరద జాతులు కనుగొన బడ్డాయి
ఇండో బర్మా ప్రాంతం ఉన్న పక్షి జాతుల సంఖ్య? 1300
ఇండో బర్మా ప్రాంతం అంతరించి పోయే జాతులు ఎన్ని ? 4
పంజర పక్షి వ్యాపారం నకు ప్రసిద్ది పొందిన ప్రాంతం? ఇండోనేషియా
సుండల్యాండ్ జీవ వైవిధ్య ప్రాంతం ఏ భాగం లో ఆక్రమించ బడి ఉంది ? ఇండో మలయా ద్వీపం లోని ప భాగం లో ఆక్రమిస్తుంది
సుండల్యాండ్ ప్రాంతంలో క్షీణించే దశలో ఉన్న జాతులు? తాబేళ్లు
గ్రానైట్ సున్నపురాయి పర్వతాలు గల ప్రాంతం? సుండల్యాండ్ ప్రాంతం (2189 మీటర్ల ఎత్తు తో)
మాలే ద్వీపకల్పానికి వెంనేముఖగా ఉన్న పర్వతాలు? గ్రానైట్ సున్నపురాయి పర్వతాలు
మాలే ద్వీపం లో అగ్రం వద్ద నగరం? సింగపూర్
అతి పెద్ద జీవ వైవిధ్య దేశం ? ఇండోనేషియా
సుండల్యాండ్ ప్రాంతం ఎన్ని హాట్ స్పాట్ లకు సరిహద్దు గా ఉంది ? ౩ హాట్ స్పాట్ లకు (కాంగార్ పట్టని రేఖ, తూ న వెలసియా భాగం, ఈ గా పిలిప్పైన్ హాట్ స్పాట్ కలదు
కాంగార్ పట్టని రేఖఏయే ప్రాంతాల సరిహద్దు గా ఉంది? ఇండో బర్మాల మధ్య సరిహద్దుగా (థాయ్ ల్యాండ్ బర్మా సరిహద్దు దాటిన తరువాత)
పిలిప్పైన్ హాట్ స్పాట్ లో ఎన్ని దీవులు గలవు? దీవులు 7100
డిఫ్టేరో కార్పెసియా కుటుంబానికి చెందిన పొడవైన వృక్షాలు ఏ హాట్ స్పాట్ లో ఉన్నాయి? పిలిప్పైన్ హాట్ స్పాట్లో
సుండల్యాండ్ ప్రాంతంలో నాడి వ్యవస్థ గల మొక్కల జాతులు? 25 వేల జాతులు
స్కైఫో స్టేజియోసి కుటుంబానికి చెందిన మొక్క జాతి ఈ ప్రాంతానికే పరిమితం? సుండల్యాండ్ ప్రాంతం
సుండల్యాండ్ ప్రాంతంలో విశిష్టత గల మొక్క జాతులు ఎన్ని కనుగొన బడ్డాయి? 117
భూమధ్యరేఖా దీవులు, బుకిట్ బారిషాన్ సెల్టన్, గునుంగ్ పులుంగ్ నేషనల్ పార్క్ ఏ హాట్ స్పాట్ ప్రాంతానికి చెందినది ? సుండల్యాండ్ ప్రాంతం
భూమధ్యరేఖా ప్రాంతం లో అతి పెద్ద దీవులు? బోర్నియా, సుమత్రా
బోర్నియో లో పూల మొక్కల జాతులు ఎన్ని? 2 వేల జాతుల
ప్రపంచం లోనే అతి పెద్ద పుష్పించే మొక్క? రఫ్లేసియా (ఒక మీటరు వ్యాసం గల పుష్పాలు పూస్తాయి)
బుకిట్ బారిషాన్ సెల్టన్ నేషనల్ పార్క్ కు ప్రతి సంవత్సరం ఎంత శాతం అటవీ నష్టం సంభవిస్తుంది? 2%
గునుంగ్ పులుంగ్ నేషనల్ పార్క్ కు ఏటా యెంత అటవీ నష్టం సంభవిస్తుంది? 9.5%
శ్రీలంక లో అడవులు ఎంత శాతం? 1.5% మాత్రమే
శ్రీలంక లో ఉబయచర జాతులు? 140 రకాలు
శ్రీలంక లో స్థానిక చేప జాతులు? 140 కి పైగా
భారత ప తీరం ప్రాంత పొడవు వెడల్పులు? ఉ ద గా పొడవు 16౦౦ కిమీ, వెడల్పు 30 కిమీ
ప తీరం ఏ కనుమల చే వేరుచేయ బడినది? పాలక్కడ్ గ్యాప్ చే
ప కనుమలు శ్రీలంక ప్రాంతంలో అంతరించే పోయే జాతులు? 20
ప కనుమలు శ్రీలంక ప్రాంతంలో అంతరించే పోయే విశిష్ట పక్షులు? 10
ప కనుమలు శ్రీలంక ప్రాంతంలో అంతరించే పోయే క్షీరదాలు? 14
ప కనుమలు శ్రీలంక ప్రాంతంలో అంతరించే పోయే ఉబయ చరాలు? 87
ప కనుమలు శ్రీలంక ప్రాంతం లో మాత్రమే కనిపించి ప్రపంచం లో ఎక్కడా కనిపించని మొక్కలు ? డిప్ టేరో కార్ప్ జాతి మొక్కలు
ప కనుమలు శ్రీలంక ప్రాంత హాట్ స్పాట్ లో ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయి? 6 వేలు (స్థానిక విశిష్టత కలిగినవి 52%, పూల మొక్కలు 267 జతలు, వృక్ష జాతులు 433)
అత్యధిక జన సాంద్రత గల హాట్ స్పాట్ ప్రాంతం? ప కనుమలు శ్రీలంక ప్రాంతం
for more updates please visit our website kingsdsc.in