జీవితాన్ని గురించి జీవితం కోసం జేవితాన్నే ప్రేమించేస్వభావం కలిగించే చమత్కారాలతో కూడినదే చరిత్ర అని పెర్కొన్నవారు? ఏ యల్ రౌజ్
మానవ స్వతంత్రం వివరించే గాధగా చరిత్రను నిర్వసించిన వారు? ఏ యల్ రౌజ్
గతకాలపు చరిత్ర వర్తమాన కాలాన్ని నడిపిస్తుంది వర్తమానం నుండి భవిష్యత్ పుట్టుకొస్తుంది ఈ ౩ కాలాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని కొనసాగుతాయి ఇది సుఖ దుఖాల భావాల కలయికతో కూడిన జీవన వాస్తవం అని చరిత్రను నిర్వసించిన వారు? నెహ్రు
గొప్ప మేదస్సు ఉన్నతాశయాలు దీరోదాత్తులతో పాటు సామాన్య ప్రజల స్వేదం కన్నీళ్ళు ప్రేమ చేత చరిత్ర చేయబడింది అని పెర్కొన్నవారు? నెహ్రు
మనం పుట్టకముందు ఏం జరిగిందో తెలుసుకొనక పొతే మనం బాల్య వ్యవస్థలో ఉన్నట్టే పూర్వికుల చరిత్రతో మన జీవితాన్ని చరిత్ర విజ్ఞానాన్ని ఉపయోగించి ముడి వేయకపోతే మానవ జీవితానికి విలువ ఎలా ఏర్పడుతుంది అని ప్రశ్నించిన వారు ? సిసిరో
చరిత్ర పిత ? హెరిడోటస్ (484-4౩౦ బి సి)
గతం లో మానవుడు పొందిన వైఫల్యాలను గూర్చి కాకుండా మానవుడి వివిధ చర్యలు తెలిపేదే చరిత్ర అని నిర్వసించిన వారు? హెరిడోటస్
హిస్టోరియా గ్రంధ కర్త? హెరిడోటస్
హిస్టరీ అఫ్ ది పెలఫోనిశియాన్ వార్స్ గూర్చి తెలిపే గ్రంధం? హిస్టోరియా (సమకాలిన సంఘటనల ఆధారంగా రచించ బడినది)
వీరి ప్రకారం చరిత్ర శాస్త్రియమైనది. హేతుబద్ద మైనది. మనవీయమైనది? హెరిడోటస్
చరిత్ర ను శాస్త్రియమైనది అని ఏల చెప్పవచ్చు? నిర్దిష్ట ఆదారాలు పరిశీలించి క్రమపద్దతిలో రచించడం వల్ల
చరిత్ర హేతుబద్దమైనది అని ఏల చెప్పగలము? కారణాలు విశ్లేషించి తర్కించి వివేచనతో రచించ బడడం వల్ల
చరిత్ర మానవీయమైనది అని ఏల చెప్పవచ్చు? వివిధ కాలాలు పరిస్తితులలో మనవ చర్యలు గూర్చి తెలుపు తున్నందువల్ల
జ్ఞాపకం ఉంచుకోగల సంఘటనల సమాహారమే చరిత్ర అని నిర్వసించిన వారు? థ్యూసిడైడ్స్ (46౦-4౦౦ బిసి)
థ్యూసిడైడ్స్ ఏ దేశానికి చెందినవాడు? గ్రీకు చరిత్ర కారుడు
థ్యూసిడైడ్స్ ప్రకారం చరిత్ర యొక్క పని? మనవ సమాజం చర్యలు ఆలోచనలును కారణాలను పరిశీలించడం, లక్ష్య సాధనలో మానవుడు పొందిన జయాపజయాలను తర్కించడం
నిష్పాక్షికత వివేకం తో చరిత్ర రచన గావించడానికి కృషి చేసినవారు? థ్యూసిడైడ్స్
మార్పు లేని గత సంఘటనల సమాహారమే చరిత్ర అని పెర్కొన్నవారు? అరిస్టాటిల్ (గ్రీకుతత్వవేత్త)
సమాజం లో నివసించే మానవుడి జీవనాన్ని వివరించేదే చరిత్ర అని పెర్కొన్నవారు? జి జే రీనియర్
మానవ జీవిత౦ అనే నాటకాన్ని ప్రదర్శించే వెదికే సమాజం అని ప్రకటించింది? జి జే రీనియర్
అసంఖ్యాక జీవిత చరిత్రల సమాహారమే చరిత్ర అని పెర్కొన్నవారు ? థామస్ కార్లైల్ (1795-1881)
మహాపురుషులు పాలకులు కళాకారులు ప్రభోధకులు జీవితాలే చరిత్ర అని పెర్కొన్నవారు ? థామస్ కార్లైల్
నిరాశా నిస్పృహలు తో ఉండే సామాన్యులు కాకుండా మేధావులు మాత్రమే చరిత్రకు అవసరం? అని తెల్పినవారు? థామస్ కార్లైల్
థామస్ కార్లైల్ ప్రకటనలతో విభేదించిన వారు? ఏ యల్ రౌజ్
చరిత్రలో గొప్పవారి జీవిత చరిత్రే కాకుండా వారి వృద్దికి కృషి చేసిన లక్షలాదిమంది గుర్తింపు లేని సామాన్యుల కృషి కుడా దాగి ఉంటుంది? అని తెలిపినవారు? ఏ యల్ రౌజ్
చరిత్ర విశ్వ శక్తిని తెలుసుకొనే సాధనం భౌతిక రూపం కానటువంటిది భావాత్మక మైనది అని నిర్వసించిన వారు? జి డబ్య్లు ఎఫ్ హెగెల్ (177౦-18౩1)
మానవునిలో దైవ శక్తిని గుర్తి౦చెదే చరిత్ర అని తెలియజేసినవారు? జి డబ్య్లు ఎఫ్ హెగెల్
కోరికలు ఆశలు నెరవేర్చుకొనే క్రమం లోమానవులు చేసే కార్యకలాపాలే చరిత్ర అని నిర్వసించిన వారు? కార్ల్ మార్క్స్
చరిత్ర (History) అంటే గొప్ప సంఘర్షణ వర్గ పోరాటం అని భావించినవారు? కార్ల్ మార్క్స్
మనవ స్వతంత్రాన్ని గురించి వివరించేదే చరిత్ర అని నిర్వసించిన వారు? ఆక్టన్
భలమైన ఆయుదాలు భుజ శక్తితో బలమైన రాజ్యాలు నిర్మించడం కాదని మేదోశక్తి వల్ల సాధించిన ఘన కార్యాలు స్వేచ్చా స్వతంత్రాలే చరిత్ర అని అభిప్రాయ పడినవారు? ఆక్టన్
వాట్ ఈజ్ హిస్టరీ గ్రంధ కర్త? E H కార్
చరిత్ర కారుడి యధార్దాల మధ్య నిరంతరం సాగే పరస్పర కార్యవిధానం, గతానికి వర్తమానానికి సాగే అనంత సంభాశానే చరిత్ర అని తెలిపినవారు? ఇ హెచ్ కార్
చరిత్ర అనేది సమకాలినమైనది. సమకాలిన సమస్యల పరిష్కార క్రమం లో ఆధునిక దృష్టితో గతాన్ని అవలోకనం చేయడం అని తెలిపినవారు? ఇ హెచ్ కార్
చరిత్ర అంటే వ్యాక్యానించడం అని పెర్కొన్నవారు? ఇ హెచ్ కార్
చరిత్ర కేవలం పాట్యంశం మాత్రమే కాదు సమస్త అధ్యయనాల నిలయం వంటిది అని నిర్వసించిన వారు? డాక్టర్ ట్రేవిలియన్
Scope of History (చరిత్ర పరిధి)
ఎన్నవ శతాబ్దం వరకు చరిత్ర కేవలం గత సంఘటనలను వివరించేందుకు పరిమితమై ఉండేది? 18వ శతాబ్దం వరకు
చరిత్ర ఏయే శాస్త్రాలతో పరిమితమై ఉంది? సాహిత్యం, భూగోళం, రాజనీతి శాస్త్రం, అర్ధ శాస్త్రం, సమాజ శాస్త్రం తో
పృద్విరాజ్ రాసో గ్రంధం ఎవరు రచించారు? చాంద్ బర్దాయ్ (గొప్ప చారిత్రక కావ్యం)
సాకేత్ గ్రంధ రచయిత ? మైథిలి శరణ గుప్త
ఊర్మిళ అనే పౌరాణిక పాత్రను వివరించే గొప్ప సాహిత్య గ్రంధం ? సాకేత్
వివిధ కాలాలలో ప్రజలను చరిత్ర అధ్యయనం చేస్తే వివిధప్రాంతాలలో ప్రజలను అధ్యయనం చేసే శాస్త్రం? భూగోళం
పరిపాలనా విధానం గూర్చి రాజనీతి శాస్త్రం అధ్యనం చేస్తే వివిధ రకాలప్రభుత్వాలు, ప్రభుత్వ కార్యకలాపాలు ను అధ్యయనం చేయుశాస్త్రం? చరిత్ర
సమాజ శాస్త్రం సామజిక సంభందాలను అధ్యయనం చేస్తే సమాజం లో ఆచారాలు అలవాట్లు ఆహారం దుస్తులు కుటుంబ జీవనం పండుగలు ఉత్సవాలు ను అధ్యయనం చేసే శాస్త్రం? చరిత్ర
Historiography (చరిత్ర రచనా శాస్త్రం)
ఈ శాస్త్రాన్ని 19వ శతాబ్దం ముందు వరకు గ్రంధస్తం చేసే ప్రయత్నం జరగలేదు? చరిత్ర ను
చరిత్రకు పునాది వేసినవారు
చరిత్రకు పునాది వేసినవారు? గ్రీకులు రోమనులు
కల్పిత గాధ నుండి గాన సంప్రదాయానికి గానం నుండి చరిత్ర రచనకు మారడానికి వేదిక గా నిలిచిన దేశం? గ్రీకు
గ్రీకులు చరిత్రను ఏవిధంగా గుర్తించారు? చరిత్రను తత్వ చింతనతో కూడిన గొప్ప సాహిత్యంగా
గ్రీకుల తరువాత చరిత్ర రచనకు కృషి చేసిన వారు? రోమనులు
చరిత్రను కళగా భావించిన వారు? రోమనులు
కళ, విమర్శనా శాస్త్రం రెండింటి సమ్మేళనమే చరిత్ర అని అభిప్రాయ పడినవారు? గ్రీకులు
ప్రసిద్ది చెందిన రోమ్ చరిత్ర కారులు ఎవరు? లివి, టాసిటాస్
ఇయోనియా లో చరిత్ర తొలిదశ ను ఏవిధంగా వినిపించారు? గాన సంప్రదాయంగా
ఎవరి పద్యాలలో అపరిమితమైన చారిత్రక సమాచారం ఉంది? హోమర్ పద్యాలూలో
వైవిద్యం ఉన్న రచయితా మేధావి గా ఎవరిని పేర్కొంటారు? గ్జనాఫోన్
చరిత్ర రచనలో సంఘటనలు వివరించడం తో పాటు వీటి వెనుక ఉన్న కారణాలు వివరించినవారు? పోలిబియాస్
చరిత్ర ప్రాచీన రచనలు
చరిత్రను సంస్కృతీ శాస్త్రంగా తీర్చిదిద్దిన ప్రముఖుడు? ఇబన్ ఖల్డున్ (13౩2-14౦౦ క్రి శ)
అశ్వఘోషుడు రచన ? బుద్ధ చరిత్ర
బాణుడి రచన? హర్ష చరిత్ర
బిల్హనుడి రచన? విక్రమాంక దేవ చరిత్ర
కౌటిల్యుడి రచన? అర్ధ శాస్రం
మేరుతుంగ రచన ? ప్రభంధ చింతామణి (13౦6 లో)
కల్హనుడిజ రచన ? రాజ తరంగిణి (ఇది కాశ్మీర్ రాజుల చరిత్ర)
రాజ తరంగిణి ఎప్పుడు రచించ బడినది? 1148 క్రి శ రచించ బడినది
సంఘటనలకు ప్రాధాన్యం ఇచ్చి చరిత్ర రచన చేసినవారు? అమీర్ ఖుష్రు
అమీర్ ఖుష్రు రచనల్లో ఎక్కువగా కనిపించేది? వేదాంత ధోరణి
తరుల అనుభవాలు పరిగణన లోకి తీసుకోవడం వల్ల చరిత్ర రచనకు న్యాయం చేయవచ్చు అని పేర్కొన్నవారు? జియాఉద్దీన్ బరౌనీ
సమగ్ర చరిత్ర సమాహారం సేకరించేందుకు ప్రముఖులను అధికారులను యువకులను వ్రుద్దులను కలిసి వివరాలు సేకరించినవారు? అబుల్ ఫజల్
అబుల్ ఫజల్ గ్రంధం? అక్బర్ నామా
Modern European History (ఆధునిక ఐరోపా చరిత్ర)
347 x 469 mm; ¤ 1300
ఆధునిక ఐరోపా చారిత్ర లో మొదటి దశలో కనిపించే ధోరణులు? వైజ్ఞానిక వికాశం, మనోహర శైలి, సానుకూల దృక్పధం
ఆధునిక ఐరోపా చరిత్రలో ప్రధాన పద్దతులు? జర్మన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియా పద్దతులు
ఆధునిక ఐరోపా చరిత్ర రచనలో నూతన శకానికి నాంది? పునరుజ్జీవన ఉద్యమం, సంస్కరణ ఉద్యమాలు
Modern European History (ఆధునిక భారతదేశ చరిత్ర)
హిస్టరీ అఫ్ బ్రిటిష్ ఇండియా రచయిత ? జేమ్స్ మిల్ రచన 1806 లో
చరిత్ర లో ఉన్నత ప్రమాణాలు సాధించే సాధనం? విషయ నిష్టత
విషయ నిష్టతకు మరొక పేరు? నిష్పాక్షికత
నిష్పాక్షిక చరిత్ర రచన అనగా? జరిగిన విషయాలు వాస్తవాల ఆధారంగా పొందుపరచడం
చరిత్ర రచనలో పూర్తీ నిష్పాక్షికత సాధ్యం కాదు అయితే చారిత్రక వాస్తవాలకు చరిత్ర వ్యాక్యానానికి మధ్యగతానికి వర్తమానానికి భవిష్యత్ కు మధ్య సంభంధాలను రాసే క్రమం లో నిష్పక్షికతకు ప్రాధాన్యం ఉంటంది అనే అభిప్రాయం వ్యక్తం చేసినవారు? ఇ హెచ్ కార్
లియోపాల్డ్ రాంకి ఏదేశ చరిత్ర కారుడు? జర్మన్
నిష్పాక్షికత ఆధారాలను విమర్శ నాత్మకంగా సోదించి వ్యాక్యానించడం వాస్తవాలు నిరూపించడం కల్పితాలు వాస్తవాలు రాబట్టడం చరిత్రను క్రమ పద్దతిలో రచించడం పరిశోధనా ఫలితాలు గుర్తించడంవంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చినవారు? లియోపాల్డ్ రాంకి
విమర్శనాత్మక ప్రక్రియ ద్వారా రూపొందిన చరిత్రకు శాస్త్ర విజ్ఞాన హోదా లభిస్తుంది అని పేర్కొన్నవారు? లియోపాల్డ్ రాంకి
కచ్చితంగా జరిగిన విషయాలు చెప్పడమే చరిత్రకారుని ప్రథమ ధర్మం అన్నవారు? లియోపాల్డ్ రాంకి
చరిత్రను కచ్చితంగా విజ్ఞాన శాస్త్రంగా పేర్కొన్నవారు? జే బి బ్యురి (రాంకే ను అనుసరించాడు)
చరిత్ర విజ్ఞాన శాస్త్రము మనవ శాస్త్రము అని అభిప్రాయ పడ్డావారు? ట్రెవిలియన్