5.Political economic social conditions and culture from the 3rd to the 7th century

5. (3-7 శతాబ్దం వరకు రాజకీయ ఆర్దిక సామజికపరిస్తితులు సంస్కృతీ

పరిచయం)

5. Political economic social conditions and culture from the 3rd to the 7th century

4. Early social movements and reforms
4. Early social movements and reforms

(3-7 శతాబ్దం వరకు రాజకీయ ఆర్దిక సామజికపరిస్తితులు సంస్కృతీ పరిచయం)

The economic conditions of early kingdoms and empires
3.The economic conditions of early kingdoms and empires
  1. అలెగ్జాండర్ భారతదేశం విడిచిపెట్టిన సంవత్సరం? క్రీ పూ 326
  2. శకులు భారతదేశం లో స్థావరాలు ఎప్పుడు ఏర్పాటు చేసుకొన్నారు? క్రి పూ 1వ శతాబ్దం లో

చారిత్రక ఆధారాలు

Political, economic, social conditions, and culture from the 3rd to the 7th century
  • మౌర్యులచరిత్ర గూర్చి ఏ గ్రంధాలు తెలియ జేస్తున్నాయి? కౌటిల్యుని అర్ధశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా, విశాఖ దత్తుని ముద్ర రాక్షసం, పురాణాలు, బౌద్ద వాంగ్మయం(జాతక కథలు), సింహళ కథనాలు, టిబెట్ ఆధారాలు, జైన గ్రంధాలు
  • ఇండికా గ్రంధ రచయిత? మెగస్తనీస్
  • ముద్ర రాక్షసం ఎవరు రచించారు? విశాఖ దత్తుడు
  • అర్ధశాస్త్ర రచయిత? కౌటిల్యుడు
  • కుషానులుచరిత్ర గూర్చి ఏ గ్రంధాలు తెలియ జేస్తున్నాయి? అశ్వ ఘోషుని బుద్ధ చరిత్ర, సరీపుత్త ప్రకరణ, వజ్ర సూచి, ఆచార్య నాగార్జుని సుహృల్లేఖ, వసుమిత్రుని మహా విభాష సూత్రం
  • సుహృల్లేఖ రచన ఎవరిది?  ఆచార్య నాగార్జునుడు ది
  • వజ్ర సూచి ని ఎవరు రచించారు? అశ్వ ఘోషుడు
  • సరీపుత్త ప్రకరణ ఎవరు రచించారు? ఆశ్వ ఘోషుడు
  • బుద్ధ చరిత్ర రచయిత? ఆశ్వ ఘోషుడు
  • వసుమిత్రుని రచన? మహా విభాష సూత్రం
  • గుప్తుల చరిత్ర గూర్చి తెలిపే ఆధారాలు? ఫాహియాన్ (ఫు కువో కి), వాయు పురాణం, మత్స పురాణం, విశాఖ దత్తుని దేవిచంద్ర గుప్తం, కాళిదాసు రచనలు, సుద్రకుని మృచ్చకటికం
  • పుష్య భూతి వంశ చరిత్ర తెలిపే రచనలు? హుయాన్ త్సాంగ్ సియుకి, బాణుడి హర్ష చరిత్ర, హర్షుని నాగానంద౦, రత్నావళి, ప్రియ దర్శిని
  • ఫు కు వో కి రచయిత? పాహియాన్
  • విశాఖ దత్తుని రచన దేవిచంద్ర గుప్తం
  • కాళిదాసు రచనలు
    • అభిజ్ఞాన శాకుంతలం
    • విక్రమోర్వశీయం
    • మేఘ సందేశం
    • రఘువంశం
    • కుమార సంభవం
  • మృచ్చ కటికం రచన ఎవరిది? శుద్రకుడు
  • సి యు కి రచయిత? హుయాన్ త్సాంగ్
  • బాణుడి రచన? హర్ష చరిత్ర
  • హర్షుని రచనలు? నాగానందం, రత్నావళి, ప్రియ దర్శిని
  • అశోకుని రాతి స్తంబ శాసనాలులో కనిపించు జంతువులు? ఏనుగు, ఎద్దు, గుర్రం
  • నౌససి రాగి పలక శాసనం దేనిని గూర్చి తెలుపుతుంది? వల్లభిపై హర్షుని విజయం గూర్చి
  • అలేగ్జాండర్ దండయాత్ర తరువాత భారత్ కి వచ్చ్సిన వారు? మెగస్తనీస్, డెమాస్కస్
  • మెగస్తనీస్ ఎవరి ఆస్థానం లో ఉండేవాడు? చంద్ర గుప్త మౌర్యుని ఆస్థానం లో
  • డెమాస్కస్ ఎవరి ఆస్థానం లో ఉండేవాడు? బిందుసారుని ఆస్థానం లో
  • చైనా యాత్రికులు కాలాలు
    • పాహియాన్           399-413
    • హుయంత్సాంగ్   636-644
    • ఇత్సింగ్                  671-695
  • 4వ వర్గ చరిత్ర కారులు గా ఎవరిని పేర్కొంటారు? స్త్రాబో, డియోడరాస్, అత్రియన్, ప్లిని, టాలెమీ

మౌర్య వంశం (Mourya Empire)

Mourya Empire
  • దేశం లో మొదటి చారిత్రక వంశం? మౌర్య వంశం
  • మౌర్య వంశ స్థాపకుడు? చంద్ర గుప్త మౌర్యుడు (క్రి పూ 321-297)
  • మౌర్యుల పుట్టుక పట్ల భిన్నాభిప్రాయాలు
    • మౌర్యులు శూద్రులు అని కొందరి అభిప్రాయం
      • ముర అనే స్త్రీకి జన్మించినందున మౌర్య అనే పేరు వచ్చింది అని
      • మొడియ అనే పేరు మౌర్యులకు దగ్గరగా ఉంది అని
      • శూద్రునికి పర్యాయ పదం గా వృశాల పదాన్ని ఉపయోగించారు
    • మౌర్యులు క్షత్రియలు అని కొందరి అభిప్రాయం
      • భౌద్ధ సాహిత్యం క్షత్రియులు అని వర్ణించింది
      • మౌర్యులు క్షత్రియులు అని భౌద్ధ గ్రంధం లో మహావంశం పేర్కొంటుంది
      • దిశునిక లో పిప్పలివనం లో మౌర్య అనే క్షత్రియ తెగ ఉండేదని తెలిపారు
      • జైన సాహిత్యం కూడా మౌర్యులు క్షత్రియులు అని వివరంగా పేర్కొంది
  • ఏ రచనలో చంద్ర గుప్త మౌర్యునికి త్రిషాల అనే పదాన్ని విశాఖ దత్తుడు వాడాడు? ముద్ర రాక్షసం అనే రచన లో
  •    కౌటిల్యునికి గల పేర్లు ? చాణుక్యుడు, విష్ణు గుప్తుడు (బ్రాహ్మణుడు)

చంద్రగుప్త మౌర్యుడు

  •  నందరాజు అవమానించడం వల్ల నందవంశం నిర్మూలించడానికి ప్రతిజ్ఞా చేసిన వాడు? చంద్రగుప్త మౌర్యుడు
  • ధన నందుడిని ఓడించి నంద వంశాన్ని నిర్మూలించిన రాజు? చంద్ర గుప్త మౌర్యుడు
  • చంద్ర గుప్త మౌర్యుడు పాటలీ పుత్రాన్ని ఎప్పుడు ఆక్రమించాడు? 321 లో
  • సెల్యూకస్ నికెటార్ గూర్చిన ముఖ్యాంశాలు
    • ఇతనిని 305 లో చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు
    • యితడు గ్రీకు యోధుడు
    • ఇతని కుమార్తె పేరు హెలీనా
    • హెలీనా ను చంద్ర గుప్త మౌర్యునికి ఇచ్చి వివాహం చేసాడు
    • చంద్ర గుప్త మౌర్యునినుండి  500 ఏనుగులు బహుమానం గా స్వీకరించాడు
    • మెగస్తనీస్ ను గ్రీకు రాయబారిగా చంద్రగుప్తుని ఆస్తానం లో ఉంచాడు
  • చంద్రగుప్త మౌర్యుని చివరి రోజులు గూర్చి ఏ గ్రంధాలు తెలియ జేస్తున్నాయి? జైన సాహిత్యం
  • చంద్రగుప్త మౌర్యుని కుమారుడు? బిందు సారుడు
  • చంద్రగుప్త మౌర్యుడు చివరి రోజులలో ఏ మతాన్ని స్వీకరించాడు? జైన మతాన్ని
  • చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ మరణించాడు? శ్రవణ బెలగోల
  • జైన మతం లో మృత్యువును స్వాగతించే పద్దతికి గల పేరు? సల్లెఖనం

బిందు సారుడు 

  • బిందుసారుని పాలనా కాలం? క్రి పూ 297-272
  • మౌర్య సామ్రాజ్యాన్ని బిందుసారుడు ఏ ప్రాంతం వరకు దక్షిణ ప్రాంతం లో విస్తరింప చేసాడు? మైసూర్ వరకు
  • గ్రీకులు బిందు సారుని ఏ విధంగా పేర్కొన్నారు? అమిత్రో ఖేట్స్
  • అమిత్రో ఖేట్స్ అనగా? శత్రు సంహారకుడు
  • అమిత్రో ఖేట్స్ అనే పదం ఏ పదం నుండి వచ్చింది? అమిత్ర ఘాత అనే సంస్కృత పదం నుండి వచ్చింది

అశోకుడు

  • అశోకుని పాలనా కాలం? 268-232 బిసి
  • అశోకుని తండ్రి? బిందు సారుడు
  • అశోకుడు చంద్ర గుప్త మౌర్యుడు మధ్యగల సంభంధం? చంద్ర గుప్త మౌర్యుని మనుమడు అశోకుడు
  • అశోకుడు ఏవిధంగా రాజ్య పాలనకు వచ్చాడు? సోదరులను హతమార్చి పాలనకు వచ్చాడు (క్రి పూ 268 లో)
  • కలింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రి పూ 261 లో (అశోకుని పాలనలో అతి ముఖ్య సంఘటన)
  • కలింగ యుద్ధ వివరాలు ఏ శాసనం తెలియ జేస్తుంది? 13 వ శిలశాననం
  • కళింగ యుద్ధం తరువాత అశోకుడు స్వీకరించిన మతం? బౌద్ద మతం
  • ఎవరి ప్రభావం తో అశోకుడు భౌద్ధ మతం స్వీకరించాడు? ఉప గుప్తుడి ప్రభావం తో (భౌద్ధ సన్యాసి)
  • అశోకుడు ఎప్పటి నుండి ధర్మ అశోకుని గా గుర్తించ బడ్డాడు? భౌద్ధ మతం స్వీకరించి నప్పటి నుండి
  • అశోకుని చరిత్ర గూర్చి తెల్పిన చరిత్ర కారులు? జేమ్స్ ప్రిన్సెస్, డా రాయ్ చౌదరి, డా వి ఏ స్మిత్
  • అశోకుని బ్రహ్మ లిపి శాసనాన్ని వివరించిన చరిత్ర కారుడు? జేమ్స్ ప్రిన్సెస్
  • అశోకుని బిరుదు ? దేవానాం ప్రియ (దేవతలకు ప్రియమైన వాడు )
  • అశోకుని దేవానాం ప్రియ గా పేర్కొన్న చరిత్ర కారుడు? జేమ్స్ ప్రిన్సెస్
  • అశోకుని జీవితం లో కలి౦గ యుద్ధం ఒక మలుపు అని పేర్కొన్న చరిత్ర కారుడు? డా రాయ్ చౌదరి
  • కాలింగ యుద్ద ఫలితం భారత చరిత్రను ప్రభావితం చేయడం మాత్రమే గాకుండా ప్రాచ్య ప్రపంచాన్ని మార్చి వేసింది అని పేర్కొన్న చరిత్ర కారుడు? డా రాయ్ చౌదరి
  • కాలింగ యుద్ధం తరువాత అశోకుడు యుద్ధం వదిలి ధర్మ విజయాలు విధానాలు గా ప్రకటించుకొన్నాడు అని తెల్పిన చరిత్ర కారుడు? డా రాయ్ చౌదరి
  • మౌర్యులు చాలా కటిన శిక్షాస్మృతి అమలు చేసి ఆస్తి పాస్తుల రక్షణ సాధించారు అని తెలియజేసిన చరిత్ర కారుడు? డా వి ఏ స్మిత్
  • చంద్ర గుప్త మౌర్యుని పాలన గూర్చి చరిత్ర కారుడైన డా వి ఏ స్మిత్ తెలియజేసిన ఆశక్తికర అంశాలు ఏవి? చక్రవర్తి అత్యుత్తమ గూడచారులను నియమించుకొన్నాడు. (మారువేషాల్లో సంచరించడం ఆధునిక జర్మని లో ప్రత్యెక నిఘా విభాగ నియంత్రణను గుర్తుకు తెస్తుంది)
  • అశోకుని మరణం తరువాత మౌర్య సామ్రాజ్యం ఎన్ని విభాగాలు  విభజింప బడినది? 2 విభాగాలు గా (పశ్చిమ మౌర్యులు, ప్రాక్ మౌర్యులు)
  • పశ్చిమ మౌర్య ప్రాంత పాలకుడు? కునాలుడు (అశోకుని కుమారుడు)
  • ప్రాక్ మౌర్య ప్రాంత పాలకుడు? దశరధుడు (అశోకుని మనుమడు)
  • కుణాలుని తరువాత పశ్చిమ మౌర్య ప్రాంతాన్ని ఎవరు పాలించారు? సంప్రతి
  • తరువాతి కాలం లో పశ్చిమ మౌర్య ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించారు? ఉ.ఆగ్నేయ భాగం గ్రీకులు, దక్కన్ భాగం శాతవాహనులు
  • దశరధుడు ఏ ప్రాంతాన్ని రాజధాని గా చేసుకొని పాలించాడు? పాటలీపుత్రం రాజధాని గా
  • ప్రాక్ పశ్చిమ భాగాల పాలకుడు? సంప్రతి
  • మౌర్య సామ్రాజ్య చివరి పాలకుడు? బృహ ద్రదుడు
  • బృహ ద్రదుడు యొక్క సేనాని? పుష్య మిత్ర శుంగుడు
  • బృహ ద్రదుడు ఎవరి చేతిలో ఓడిపోయాడు? పుష్య మిత్ర శుంగుడు
  • మౌర్య సామ్రాజ్యం లో అత్యున్నత అధికారి?  రాజు (సర్వ సైన్యాధికారి)
  • రాజు ఎవరి సలహాలు తేసుకొనే వాడు? మంత్రి పరిషత్ సలహాలు
  • కౌటిల్యుని గ్రంధం? అర్ధ శాస్త్రం (సరాసరి దొంగతనాలు రోజుకు 8కి దాటలేదు)
  • కౌటిల్యుడు అర్ధ శాస్త్రం లో ఎవరి గూర్చి వివరించాడు?  రాజు లక్షణాలు గూర్చి, గూడచారి వ్యవస్థ గూర్చి పేర్కొన్నాడు (మంత్రి పరిషత్ రాజు శకటం లో ఒక చక్రం లాంటిది)
  •  కౌటిల్యుడు ఎవరి కొలువులో ఉండేవాడు? చంద్ర గుప్త మౌర్యుని కొలువు లో (ప్రధానిగా) ఉండేవాడు
  • మౌర్యుల కాలం లో పాతలిపుత్ర జనాభా? 6 లక్షలు
  • అశోకుని శిలాశాసనం లో కనిపించే లిపులు ఎన్ని? 2 (బ్రహ్మ లిపి, కరోష్టి లిపి)
  • ప్రజా లందరూ నాబిడ్డలు అని ప్రస్తావించిన చక్రవర్తి? అశోకుడు
  • మౌర్య సామ్రాజ్యం లో కేంద్ర పరిషత్ సభ్యులను ఎవరు నియమించేవారు? రాజు (1 ప్రధాని + 18 మంత్రులు )
  • మౌర్య సామ్రాజ్యం లో ముఖ్య మైన మంత్రులు? మంత్రి సేనాపతి పురోహితుడు యువరాజు
  • చంద్ర గుప్త మౌర్యుని కేంద్రపాలన ప్రశంసించిన చరిత్ర కారుడు? డా వి ఏ స్మిత్ (మౌర్య సామ్రాజ్యం లో ఆయా శాఖలకు సంబందిచిన అధికారులకు స్పష్టమైన విధులు ఉండేవి అని పేర్కొన్నాడు
  • మౌర్యులు రాజ్యాన్ని ఏవిధంగా విభజించారు?  రాష్ట్రాలు గా
  • రాష్ట్రాలు వాటి పేర్లు
    • ప్రాచ్య – మగధ రాజ్యం
    • ఉత్తరాపద – వాయవ్య రాష్ట్రము
    • అవంతీ పదం – ప. రాష్ట్రము
    • దక్షిణాపద – ద రాష్ట్రము
  • మౌర్య సామ్రాజ్యం లో గవర్నర్ లు గా ఎవరు వ్యవహరించేవారు? యువ రాజులు (వీరు రాజ బంధువులు)
  • సరిహద్దు రాష్ట్రాల గవర్నర్లు గా ఎవరు ఉండేవారు? కుమార మహా మాత్రలు (దూరప్రాంత గవర్నర్ లుగా)
  • చంద్రగుప్త మౌర్యుని పాలన ఎన్ని రకాలు గా విభజించ వచ్చు ? 2 రకాలు (మున్సిపల్ పాలన, గ్రామ పాలన)
  • నగర పాలక అధికారిని ఎపేరుతో పిలిచేవారు? నాగరికుడు (నగరాధ్యక్షుడు అనేవారు)
  • నగర పాలన గూర్చి తెలిపే గ్రంధాలు? ఇండియా మెగస్తనీస్, కౌటిల్యుని అర్ధశాస్త్రాలు
  • నగరి పాలను ఎంత మంది సభ్యుల సభ నిర్వహించేది? 30 మంది సభ్యుల సభ
  • నగరి పరిపాలన లో ఎన్ని శాఖలు ఉండేవి? 6 (చేతి వృత్తులు పరిశ్రమలు, విదేశీయుల వ్యవహారాలు, జనాభా వివరాలు, తూనికలు కొలమానాలు, తయారైన వస్తువులు, పన్నుల నిర్వహణ)
  • ఒక్కొక్క శాఖలో ఎంత మంది సభ్యులు ఉండేవారు? 5 సభ్యులు ఉండేవారు
  • ప్రతి జిల్లాను ఎన్ని భాగాలూ గా విభాజించిరి? 4 భాగాలు గా (భాగాధికారి ని స్థానికుడు అనేవారు)
  • మౌర్య సామ్రాజ్యం లో చిన్న పాలనా విభాగం ? గ్రామం
  • గ్రామాదికారిని ఏ పేరుతో పిలిచేవారు?  గ్రామణి
  • గోపుడు అనగా ఎవరు? 10 గ్రామాలకు పెద్ద
  • కౌటిల్యుని ప్రకారం న్యాయస్థానాలు ఎన్ని రకాలు ఉండేవి? 2 రకాలు (ధర్మస్తేయ, కంటక శోధన )
  • ధర్మస్తేయ న్యాయ స్థానం ఏ వ్యవహారాలు చూసేది? సివిల్ వ్యవహారాలు
  • ధర్మస్తేయ న్యాయ స్థానం యొక్క న్యాయ మూర్తిని ఏ పేరుతో పిలిచేవారు? వ్యవహారిక
  • కంటక శోధన అనేది_____? క్రిమినల్ న్యాయస్థానం
  • క్రిమినల్ న్యాయస్థానం యొక్క న్యాయమూర్తి ని ఎలా పిలిచేవారు?  ప్రదేష్ట
  • మహా మాత్రులు అనగా ? నగర న్యాయ మూర్తులు
  • జిల్లా న్యాయ మూర్తులను ఏ పేరుతొ పిలిచేవారు? రజుకలు
  • పంచలు అనగా ___? గ్రామాలలో తగాదాలు పరిష్కరించే పెద్దలు
  • చంద్ర గుప్త మౌర్యుని కాలం లో చాల ముఖ్యమైన విభాగం? గూడచార వ్యవస్థ (ముద్ర రాక్షసం లో పేర్కొనబడినది)
  • విశాఖ దత్తుని రచన? ముద్ర రాక్షసం
  • కౌటిల్యుని ప్రకారం ఎన్ని రకాల గూడచారులు ఉండేవారు? 2 రకాలు (సంతక్, సంచార)
  • ఒక ప్రదేశం లో సమాచారం సేకరించే గూడచారులను ఎమనేవారు? సంతక్ లు
  • వివిధ ప్రాంతాలలో సమాచారాన్ని సేకరించే గూడచారులను ఎమనేవారు? సంచారులు
  • చంద్ర గుప్త మౌర్యుని సైన్యం
    • కాల్బలం 6 లక్షలు
    • ఆశ్వ దళం 30 వేలు
    • గజాదళం 9 వేలు
    • రధాలు 8 వేలు
  • సైనిక పాలన నిర్వహణ కు ప్రత్యెక సైనిక శాక లో సభ్యులు ? 30 మంది (6 శాఖలు గా ఒక్కొక్క శాఖలో 5 మంది సభ్యులు ఉండేవారు
  • ధర్మ మహామత్రులు అనగా ? మత వ్యాప్తికి అశోకుడు నియమించిన ఉద్యోగులు
  • ధర్మ మహామత్రులు విధి ఏమి? ప్రజలకు మత నైతిక నియమాలు బోధించడం
  • ధర్మ మహామత్రులు నియామకం గూర్చి పేర్కొన్న శిలా శాసనం? 13 వ శిలాశాసనం
  • ధర్మ మహామత్రులు పని తీరుపై పర్య వేక్షణ ఏర్పాట్లు జరిగేవి అని తెలిపే శిలా శాసనం? 6వ శిలా శాసనం
  • అశోకుడు రూపొందించిన నీతి సూత్రాలుకు గల పేరు? అశోక ధమ్మము
  • అశోక ధమ్మము అనేది___? మతం కాదు జీవన విధానం
  • జంతుబలి పండుగ సమూహాలు నిషేధం గూర్చి తెలిపే శిలా శాసనం? పెద్ద రాతి శిలా శాసనం 1
  • సాంఘిక సంక్షేమం గూర్చి తెలిపే శిలాశాసనం? పెద్ద రాతి శిలా శాసనం 2
  • బ్రాహ్మణుల పట్ల ఉదారత గూర్చి వివరించు శిలాశాసనం? పెద్ద రాతి శిలాశాసనం 3
  • జంతువుల పట్ల జాలి కరుణ గూర్చి తెలుపు శిలా శాసనం? పెద్ద రాతి శిలాశాసనం 4
  • యజమానులు సేవకుల పట్ల దయార్ద్ర హృదయం, నేరస్తుల పట్ల మానవీయ ప్రవర్తన కలిగి ఉండుట మొదలుగు అంశాలను వివరించు శిలాశాసనం? పెద్ద రాతి శిలాశాసనం 5
  • అన్ని వర్గాల పట్ల ఔదార్యం గూర్చి తెలిపే శిలాశాసనం? పెద్ద రాతి శిలాశాసనం 7 & 12
  • పెద్ద రాతి శిలాశాసనం 8 దేనిని గూర్చి తెల్పుతుంది? దమ్మ యాత్రలు వివరిస్తూ ప్రజలతో సంభందాలు కలిగి ఉండుట గూర్చి  
  • అత్యంత ఖరీదైన ఉత్సవాలు నిలుపుదలను గూర్చి తెలిపే శిలాశాసనం? పెద్ద రాతి శిలాశాసనం 9
  • బెరిఘోష స్తానం లో దమ్మ గోషా అనగా? యుద్ద బేరి స్తానం లో శాంతి శబ్దం ద్వార ప్రజలను జయించడం (పెద్ద రాతి శిలాశాసనం 13 తెల్పుతుంది)
  • మౌర్యుల కాలం లో ప్రజల ప్రధాన వ్రుత్తి ?  వ్యవసాయం
  • మౌర్యుల కాలం లో శిస్తులు ఏవిధంగా ఉండేవి? 1/4 నుండి 1/6 మధ్య (అధికారులే స్వయంగా శిస్తులు వసూలు చేసేవారు)
  • మౌర్యుల కాలం లో కొయ్య, రాతి వస్త్ర పరిశ్రమలు అభివృద్ధి పొందిన ప్రాంతాలు ? మధుర, కాశి, పాటలీపుత్రం, వంగ, మహీశ నగరాలాలో (కుండల తయారీ కూడా అభివృద్ధి పొందింది)
  • చాతుర్వర్ణ వ్యవస్థ ను కటినంగా అమలు చేయాలి అనుకోన్నవారు? బ్రాహ్మణులు
  • ఆర్దికంగా వృద్ది చెందినా సామాజిక హోదా పెరగని వర్ణం వారు? వైశ్యులు
  • మెగస్తనీస్ నాటి సమాజాన్ని ఎన్ని వర్గాలు గా విభజించాడు? 7 (తత్వ వేత్తలు, వ్యవసాయదారులు, సైనికులు, పశుపాలకులు, వృత్తి నిపుణులు, న్యాయమూర్తులు, బోధకులు)
  • మెగస్తనీస్ పేర్కొన్న సైనిక వర్గం లో అధికంగా ఎవరు ఉండేవారు? క్షత్రియులు
  • తత్వవేత్తల కోవలోని వర్గం? బ్రాహ్మణులూ
  • శూద్రులు, వైశ్యులు ఏ వ్రుత్తి నిర్వహించేవారు? వ్యవసాయం
  • మెగస్తనీస్ మౌర్య సామ్రాజ్యం లో సమాజ విభజన దేని ఆధారంగా నిర్వహించాడు? ఆర్దిక స్తితి ఆధారంగా
  • వితంతువులు పునర్వివాహము విడాకులు గూర్చి తన గ్రంధం లో తెలియజేసినవారు?  మెగస్తనీస్
  • మౌర్యుల కాలం లో స్త్రీల స్థానం? పురుషుల కంటే తక్కువ
  • స్త్రీలను కటినంగా చూస్తూ తక్కువ హోదా కల్పించారు అని వేటిద్వార తెలుస్తుంది? బ్రాహ్మణ సాహిత్యం ద్వారా
  • ఏ గ్రంధాలు స్త్రీలను గౌరవించాయి? భౌద్ధ గ్రంధాలు
  • నాటి కాలం లో అంతఃపురాలలో ఏయే ఉద్యోగాలు ఉండేవి? రక్షక భటులు, గూడచారులు
  • మౌర్యుల కాలం లో స్థంబాలు ఎన్ని రకాల రాతి తో నిర్మించేవారు? 2 రకాల రాతితో (ఎరుపు తెలుపు మచ్చలలో ఉన్న ఇసుకరాయి, బాగా పొడిచేసిన ఇసుకరాయి)
  • ఎరుపు తెలుపు మచ్చలలో ఉన్న ఇసుకరాయి ఏ ప్రాంతం లో లభించేది? మధుర లో
  • బాగా పొడిచేసిన ఇసుక రాయి ఎక్కడ లభించేది? చూనల్ వద్ద బెనారస్ సమీపం లో
  • మౌర్యుల కాలం లో స్థంబాలను ఏ ప్రాంత శిల్పకారులు చేక్కేవారు? తక్షశిల వాసులు
  • ఇసుక రాయితో నిర్మించిన అర్ధగోళ నిర్మాణం నకు గల పేరు?  స్తూపాలు (క్రింద గుండ్రటి ఆకారం, చుట్టూ గొడుగు ఆకారం తో ఉండేవి)
  • చుట్టూ ఉన్న గొడుగు ఆకారం దేనికి చిహ్నంగా ఉండేది? సార్వ భౌమదికారం నకు
  • అశోకుడు నిర్మించిన స్తూపాల మొత్తం? 84 000 (భారత్, ఆఫ్ఘనిస్తాన్ లో కలిపి)
  • సాంచి స్తుపాన్ని ఎవరు నిర్మించారు? అశోకుడు (భోపాల్ సమీపం లో)
  • నాటి కాలం లో గుహలు ఏ విధంగా ఉండేవి? గట్టి రాళ్ళు చీలిన రాళ్ళు తో చేక్కబడేవి. లోపలి గోడలు నునుపుగా అద్దంలా ఉంటాయి
  • ఈ గుహలు ఏవిధంగా ఉపయోగ పడేవి? సన్యాసుల నివాసాలు, అసెంబ్లీ గదులు గా
  • నాటి కాలం లో శిల్ప కళలు? గాంధార, మధుర, అమరావతి
  • గ్రీకు రోమన్ సంప్రదాయాలలో నిర్మించ బడిన శిల్పకళ?  గాంధార (బుద్దుని విగ్రహాలు ఈ రీతిలోనే చెక్కబడ్డాయి)
  •  మధుర శిల్పకళ కు సంబందించిన శిల్పాలు ? మొదట్లో బోధి సత్వుని ప్రతిమలు, జైన తీర్ధంకరుల శిల్పాలు, శివుడు విష్ణువు పార్వతి లక్ష్మి ప్రతిమలు
  • అమరావతి శిల్పానికి ఉదా? అమరావతి స్తూపం (బుద్దుని జీవితానికి సంభందించిన చిత్రాలు బుద్దుని విగ్రహం చుట్టూ కనబడతాయి)
  • భద్రుడు రచన? కల్ప సూత్రాలు
  • తక్షశిల విశ్వ విద్యాలయం?
    • అతి ప్రాచీన విద్యాలయం
    • చాతుర్వర్నాల వారు విద్యాభ్యాసం చేసారు
    • విదేశీయులు కూడా విద్యను అభ్యసిన్చిరి

కుషానులు  

  1. మనదేశానికి వచ్చిన విదేశీ ఆక్రమణకారుల్లో శక్తివంతమైన వారు? కుషానులు
  2. మధ్య ఆసియా లో ఉన్న యూచి తెగలు ఎన్ని ? 5 (వీటిలో కుషానుల తెగ ఒకటి)
  3. శక రాజ్యం అంతం చేసి వాయవ్యభాగం లో పాలన ఏర్పాటు చేసిన వారు? పార్దియన్ లు
  4. పార్థియన్ లను ఓడించిన వారు? కుశానులు (సింధులోయ ఎగువ గంగా ప్రాంత౦ వరకు విస్తరించారు)

కనిష్కుడు (Kushan Empire)

Kushan Empire
  1. కుషానులలో గొప్పవాడు?  కనిష్కుడు
  2. శకయుగం ప్రారంభించిన వాడు? కనిష్కుడు (క్రి శ 78 లో )
  3. కనిష్కుడు బోధించిన భౌద్ధ శాఖ? మహాయాన భౌద్ధ శాఖ
  4. కనిష్కుని రాజధాని? పెషావర్ / పురుషపురం
  5. కనిష్కుడు నిర్మించిన నగరాలు? పురుష పురం, కనిష్కపురం (కాశ్మీర్)
  6. బుద్దుని విగ్రహాలు ఏ శైలిలో రూపొందించారు? గాంధార శైలి లో
  7. గాంధార శైలి అనేది ___? గ్రీకు భారతీయ శిల్పకళా సమ్మేళనం
  8. కనిష్కుని పాలన ఏ పద్దతిపై ఆధారపడి ఉంది? క్షాత్రపి పద్దతిపై
  9. క్షాత్రపి పద్దతి అనగా? విశాల రాజ్యం పై సమర్ధపాలన
  10. క్షాత్రపులు అనగా? కనిష్కునిచే నియమింప బడిన అధికారులు
  11. కనిష్కుని పాలన లో విరాజిల్లిన భాష? సంస్కృతం
  12. కనిష్కుని ఆస్థాన కవులు? ఆశ్వ గోషుడు, నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు
  13. అశ్వఘోషుని గ్రంధాలు ఏవి? బుద్ధ చరిత్ర, సౌందరానంద కావ్యం, సారిపుత్త ప్రకరణ
  14. నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు ఏ భాషలో వారి గ్రంధాలు వ్రాసిరి? సంస్కృత భాషలో
  15. కుషానులలో చివరి గొప్ప చక్రవర్తి? మొదటి వాసుదేవుడు
  16. ఏ రాజు పాలనా కాలం తరువాత కుషానుల పతనం ప్రారంభం అయినది? మొదటి వాసు దేవుడు పాలన తరువాత
  17. కుషానుల రాజ్యాన్ని ఎవరు ఆక్రమించారు? ససానియన్ పాలకులు, నాగ వంశీయులు
  18. ససానియన్ పాలకులు ఏ దేశానికి చెందినవారు? పర్షియాకు
  19. భారత దేశం లో చీకటి యుగం ? క్రి పూ 200- క్రి శ 300 మధ్య కాలం (అంధకార యుగం) అని పేరు
  20. ఎవరి కాలాన్ని చరిత్ర కారులు భారత దేశ వాణిజ్య యుగం అని పేర్కొన్నారు? కుషానుల కాలాన్ని

గుప్తులు

  1. ప్రాచిన భారత చరిత్రలో స్వర్ణ యుగం గా ఎవరి కాలాన్ని పేర్కొన్నారు? గుప్తుల కాలాన్ని
  2. ఎవరి మరణం తరువాత గుప్త సామ్రాజ్యం క్షీణించింది? స్కంద గుప్తుని తర్వాత (హూణుల దాడులవల్ల)

మొదటి చంద్ర గుప్తుడు

  1. గుప్తవంశం లో మొదటి చక్రవర్తి? మొదటి చంద్ర గుప్తుడు
  2. మొదటి చంద్ర గుప్తుని బిరుదు? మహా రాజాధిరాజు
  3. మొదటి చంద్రగుప్తుని భార్య ? కుమారదేవి (లిచ్చవి రాకుమారి)
  4. మొదటి చంద్ర గుప్తుడు కుమారదేవి వివాహం గూర్చి తెలియజేసేవి? శాసనాలు, నాణాలు

సముద్ర గుప్తుడు (Gupta Empire)

Gupta Empire
  1. సముద్రగుప్తుడు ఏ సంవత్సరం లో రాజ్య పాలనకు వచ్చాడు? 335 లో (మొదటి చంద్ర గుప్తుని తర్వాత)
  2. ఏ శాసనం సముద్ర గుప్తుని పట్టాభి షేకం గూర్చి పేర్కొంటుంది? అలహాబాద్ స్తంబ శాసనం/అలహాబాద్ ప్రసస్తి పేర్కొంటుంది
  3. సముద్ర గుప్తుడు తన ఘన విజయాలకు గుర్తుగా ఏ యాగాన్ని నిర్వహించాడు? అశ్వమేధ యాగాన్ని
  4. సముద్ర గుప్తుని సామ్రాజ్యం ఏ ఏ ప్రాంతాల మధ్య విస్తరించింది? ఉ హిమాలయాలు నుండి ద నర్మదా నది, తూ బ్రహ్మపుత్ర నుండి ప చంబల్ వరకు
  5. సముద్రగుప్తుడుమరణం? క్రి శ 375
  6. సముద్ర గుప్తుని తర్వాత ఎవరు సింహాసనం అధిష్టించాడు? రామ గుప్తుడు (చంద్ర గుప్తుని అన్న)

2వ చంద్ర గుప్తుడు

  1. 2వ చంద్ర గుప్తుని పాలనా కాలం ? క్రి శ 380 – 414
  2. 2వ చంద్ర గుప్తుడు ఎవరిని వధించి సింహాసనానికి వచ్చాడు? రామ గుప్తుని వధించి (380 లో)
  3. 2వ చంద్ర గుప్తుని పేరు? చంద్రగుప్త విక్రమాదిత్యుడు అని పేరు
  4. గుప్తులలో 2 వ గొప్ప పాలకుడు? చంద్రగుప్త విక్రమాదిత్యుడు అని పేరు
  5. సముద్ర గుప్తుని కుమారుడు? చంద్రగుప్త విక్రమాదిత్యుడు
  6. గుప్తులలో కొత్త నాణాలు ప్రవేశ పెట్టిన రాజు? చంద్రగుప్త విక్రమాదిత్యుడు
  7. చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఎవరిని ఓడించి వాయవ్యం లో హిందూ కుష్ వరకు రాజ్యాన్ని విస్తరింప జేశాడు? కుషానులను
  8. 2వ చంద్ర గుప్తుడు/ చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఎవరిని ఓడించి గాంధార కంబోజు వరకు తన రాజ్యాన్ని విస్తరింప జేశాడు? శాక మురనదా ను ఓడించి
  9. చంద్రగుప్త విక్రమాదిత్యుడు రాజ్య విస్తరణ? ఉ. హిమాలయాల నుండి నర్మదా వరకు, తూ అస్సాం నుండి ప. సౌరాష్ట్ర వరకు, వాయవ్యం హిందూ కుష్, గాంధార కంబోజు వరకు
  10. చంద్రగుప్త విక్రమాదిత్యుడు కాలం లో భారత్ కు వచ్చిన చైనా యాత్రికుడు? పాహియాన్ (భౌద్ధ సన్యాసి)
  11. పాహియాన్ క్రి శ 405 లో ఏ మార్గం గుండా భారత్ కి వచ్చాడు? భూ మార్గం గుండా
  12. పాహియాన్ రచనలు ఎవరి పాలన గూర్చి తెలియ జేస్తున్నాయి? 2వ చంద్ర గుప్తుని గూర్చి

1వ కుమార గుప్తుడు

  • 1వ కుమార గుప్తుని పాలనా కాలం? క్రి శ 414-455
  • 1వ కుమార గుప్తుని తండ్రి? 2వ చంద్ర గుప్తుడు
  • 1వ కుమార గుప్తుడు ఎన్ని సంవత్సరాలు పాలన సాగించాడు? సుమారు 40 సంవత్సరాలు

స్కంద గుప్తుడు

  • స్కంద గుప్తుని పాలనా కాలం? క్రి శ 455-467
  • స్కంద గుప్తుడు ఎవరి కుమారుడు? 1వ కుమార గుప్తుని
  • గుప్తవంశం లో చివరి గొప్ప పాలకుడు? స్కంద గుప్తుడు

చివరి గుప్త పాలకులు

  • చివరి గుప్త పాలకులు ఎంత కాలం పాలన సాగించారు? 80 సంవత్సరాలు
  • చివరి గుప్తపాలకులు ఎవరి చేతిలో ఓడిపోయారు? హూణుల చేతిలో
  • విష్ణు గుప్తుడు ఎవరి కుమారుడు? ౩వ కుమార గుప్తుని కుమారుడు
  • ౩వ కుమార గుప్తుని కుమారుడు విష్ణు గుప్తుని పాలన ను తెలియజేసేవి? నలందా ముద్ర, నాణాలు
  • గుప్తవంశ చివరి పాలకుడు? విష్ణు గుప్తుడు (55౦ వరకు పాలించాడు)

గుప్తుల పాలన

  • గుప్తులలో అత్యున్నత అధికారి? చక్రవర్తి
  • గుప్త చక్రవర్తుల ఏ బిరుదును ధరించే వారు? మహా రాజాధిరాజ
  • సముద్ర గుప్తుని దేవునిగా వర్ణించిన శాసనం? అలహాబాద్ ప్రశస్తి
  • గుప్తుల పాలనా కేంద్రాలు? బెంగాల్, బీహార్, ఉ ప్రదేశ్

కేంద్ర పాలన

  • గుప్తుల కాలం లో కేంద్ర మంత్రులకు గల పేరు? సచివులు (చక్రవర్తికి సహాయపడేవారు)
  • గుప్తుల కాలం లో కేంద్ర మంత్రులు
    • సర్వాధ్యక్షుడు – కేంద్ర ఆదేశాలు పరగానాలకు జిల్లాలకు తెలిపేవాడు
    • మహా సేనాపతి – సైన్యం పై అధికారాలు కలిగిన మంత్రి
    • మహా దండ నాయకుడు – ప్రధాన న్యాయమూర్తి
    • మహా సంధి విగ్రహకుడు – విదేశీ వ్యవహారాలు
    • బండాగారాదికృత – ప్రభుత్వ ఖజానా అధికారి
    • ఇతర అధికారులు
      • ప్రతిహారులు
      • రాజ సన్యాసులు
      • కుమారామాత్యుడు
      • కంచుకులు

రాష్ట్ర పాలన

  • గుప్తులు తమ రాజ్యాన్ని ఏ విభాగాలు గా విభజించారు?  రాష్ట్రాలు గా
  • గుప్తుల కాలం లో రాష్ట్రాలకు గల పేరు? దేశ / భుక్తి
  • దేశ / భుక్తి పాలనాధికారి ? ఉపరికుడు (యువరాజులు/రాజ కుటుంబీకులు నియమించ బడేవారు)
  • దేశ / భుక్తులు ఏ విధంగా విభజింప బడ్డాయి? విషయాలు గా (జిల్లాలుగా చెప్పవచ్చు)
  • దేశ / భుక్తులు యొక్క పాలనాధికారి? విషయపతి
  • డా ఏ యస్ అల్టేకర్ ప్రకారం గుప్తుల ప్రభుత్వం ___? పాలనా పరంగా వికేంద్రి కరించ బడినది, విధులు చాలా వరకు జిల్లా పాలనకు బదిలీ చేయబడ్డాయి

ప్రాంతీయ పాలన

  • గుప్తుల ప్రాంతీయ పాలనను ఎన్ని భాగాలూ గా పేర్కొన వచ్చు? 2 (నగర పాలన, గ్రామ పాలన)
  • గుప్తుల కాలం లో నగర పాలన గల ప్రాంతాలు? పాటలీపుత్రం, తక్షశిల, మండసార్, ఉజ్జయిని
  • గుప్తుల కాలం లో నగర పాలన ఎవరు నిర్వహించేవారు? విషయపతి
  • నగర పాలన లో పరిషత్ ల విధి ? పన్నులు వసూలు చేయుట (ఆరోగ్యం, పరిశుబ్రత, ప్రాధమిక విద్య)
  • గుప్తుల పాలనలో అతిచిన్న విభాగం ? గ్రామం
  • గ్రామా పాలనాధికారి? గ్రామికుడు (గ్రామాధ్యక్షుడు అనేవారు)
  • గ్రామాధ్యక్షుడు/ గ్రామికుడు ప్రధాన విధులు? గ్రామ సంరక్షణ, శాంతి భద్రతల నిర్వహణ
  • గ్రామాలలో గ్రామ పెద్దలు ఏర్పాటు చేసే సభ? పంచ మండల సభ (గ్రామా పాలనకు సహాయకారిగా ఉండేది)

న్యాయపాలన

  • గుప్తుల కాలం లో ప్రధాన న్యాయ మూర్తిని ఈ విధంగా వ్యవహరించేవారు? మహా దండ నాయకుడు
  • మహా దండనాయకుల వివరాలు ఎక్కడ కనిపిస్తాయి? పాహియాన్ రచనల్లో

సైనిక పాలన

  • గుప్తుల కాలం లో ఉన్న సైనిక దళాలు? గజాదళం, అశ్వదళం, కాల్బలం (ఎడారి ప్రాంతం లో ఒంటెలు కూడా ఉపయోగించేవారు)
  • గుప్తుల కాలం లో ప్రధాన సైనికాధికారి? మహా సేనాపతి
  • మహా సేనాపతికి గల పేర్లు? రణ భాండాగారాధి కరణ గా, సైనిక పద్దుల నిర్వహణ అధికారి
  • గుప్తుల సైన్యం లో ప్రధాన భాగం? భూ స్వాములు పంపే సైన్యం
  • ఏ శాసనం గుప్తులు ఉపయోగించిన ఆయుధాలను గూర్చి పేర్కొంటుంది? అలహాబాద్ స్థంబ శాసనం (ఆయుధాలు, విల్లంబులు, కత్తులు, ఈటెలు, గొడ్డళ్ళు ఉపయోగించి నట్లు పేర్కొంది)

ఆర్ధిక వ్యవస్థ

  • చక్రవర్తులు పురోహితులకు భూ దానాలు చేసేవారు. గ్రామాలను దేవాలయాల భూములను విరాళాలుగా ఇచ్చేవారు. వీటిలో పురోహితులు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించేవారు? పన్ను వసూలు, పాలనా భాద్యత
  • భూ స్వామ్య వ్యవస్థకు దారి తీసిన అంశం ? భూ దానం
  • సేద్యపు బానిసత్వం అనగా? భూములు అమ్మినపుడు దానితో పాటు సేద్య బానిసలను కూడా ఇచ్చే విధానం
  • వర్తక వాణిజ్య క్షీణత ఎవరి కాలం లో ప్రారంభం అయినది? గుప్తుల కాలం  లోనే ప్రారంభం అయినది

గుప్తుల సమాజం

  • సామాజిక ఏర్పాటుకు ఆధారం? కుల వ్యవస్థ
  • నాటి సమాజం కులాలు ఎన్ని వర్గాలు గా ఉండేవి? 4 (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, సుద్రులు)
  • బ్రాహ్మణుల ఏయే కార్యక్రమాలు నిర్వహించేవారు? సమాజం లో ఉన్నత స్థానం కలిగి ఉండేవారు, చక్రవర్తికి ప్రధాన సలహాదారులు గా ఉండేవారు
  • పాహియాన్ ప్రకారం గుప్తుల కాలం లో చండాలురు ఏయే వృత్తులు నిర్వహించేవారు? వేట, చేపలు పట్టుట,కసాయి పనులు చేసేవారు
  • గుప్తుల కాలంలో స్త్రీల పరిస్థితి? స్త్రీ ల స్థానం తగ్గింది, బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి, సతి సహగమనం వాడుకలోకి వచ్చింది

సంస్కృతీ

  • గుప్తులు నగర నిర్మాణం లో ఎవరిని అనుసరించారు? ద్రావిడులను
  • అజంత, ఎల్లోరా గుహలు ఎక్కడ గలవు? మహారాష్ట్ర లో
  • బాగ్ గుహలు ఎక్కడ గలవు? మధ్య ప్రదేశ్ లో
  • గుప్తుల కాలం లో నిర్మించ బడిన పార్వతి దేవాలయం ఎక్కడ గలదు? సచానకుదార వద్ద
  • గుప్తులు భూమ్రా లో ఏ దేవాలయాన్ని నిర్మించారు? శివాలయం
  • దేవఘడ్, బట్టార్ గాంవ్ దేవాలయాలు ఎక్కడ గలవు? మధ్య ప్రదేశ్ లో
  • గుప్తులు నిర్మించిన దేవాలయాల యొక్క ప్రత్యేకత ఏమిటి? గర్భ గుడిపైన శిఖరం ఉంటుంది
  • గుప్తులు నిర్మించిన దేవాలయాలు రకాలు
    • చతురస్రాకార చదరపు పైకప్పు దేవాలయం
    • 2వ అంతస్తు (విమాన) చతురస్రాకార చదరపు పైకప్పు దేవాలయం
    • శిఖరం తో చతురస్రాకార దేవాలయం
    • దీర్ఘ చతురస్రాకార దేవాలయం
    • వృత్తాకార దేవాలయం
  • గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అన్నారు? శిల్పకళ లో
  • దశావతార దేవాలయం ఎక్కడ గలదు? ఝాన్సి జిల్లా దేవఘడ్ లో
  • గుప్తులు టిగావా వద్ద ఏ దేవాలయాన్ని నిర్మించారు? విష్ణు దేవాలయాన్ని (జబల్పూర్ జిల్లా
  • భిట్టార్ గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది అని పేర్కొన్న చరిత్ర కారుడు? పెర్షి బ్రౌన్
  • సుల్తాన్ గంజ్ లో ఉన్న బుద్దుని విగ్రహం ఎత్తు ఎంత? 7 ½ అడుగులు
  • నిలబడిన బుద్ద విగ్రహం ఎక్కడ గలదు? మధుర లో
  • నలంద (బీహార్ లో) ఉన్న రాగి విగ్రహం ఎత్తు? 18 అడుగుల ఎత్తు (క్రీ శ 6వ శతాబ్దం లో నిర్మించిరి)
  • వరాహ ప్రతిమ ఎక్కడ గలదు? ఉదయగిరి లో గుహ ప్రవేశ ద్వారం వద్ద
  • నృత్య కారిణి తో మహిళా సంగీత విద్వాంసురాలి చిత్రం ఎక్కడ గలదు?  గ్వాలియర్ లో
  • గుప్తుల సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చు తునక? మొహరోలి వద్ద (ఢిల్లీ) ఇనుప స్థంభం

గణితం ఖగోళం

  • సూర్య సిద్దాంతం ఎవరిది? ఆర్యభట్ట (క్రి శ 5-6 శతాబ్దాలలో)
  • సూర్య సిద్దాంతం దేనిని తెలుపుతుంది? సూర్య చంద్ర గ్రహణాలు వివరిస్తుంది
  • భూమి తనచుట్టూ తానూ తిరుగుతుంది అని మొదట కనుగొన్న మేధావి? ఆర్యభట్ట
  • ఆర్యభట్ట యొక్క రచన ? ఆర్య భట్టీయం (గణిత శాస్త్ర అంశాలు పేర్కొన్నాడు)
  • వరాహ మిహిరుడు యొక్క గ్రంధాలు? బృహత్ సంహిత, పంచ సిద్దాంతిక, బృహత్జాతక
  • బృహత్ సంహిత దేనిని గూర్చి తెలుపుతుంది? ఖగోళ శాస్త్ర గ్రంధం, వృక్ష శాస్త్రం, సహజ చరిత్ర (క్రి శ 6వ శతాబ్దం లో)
  • న్యూటన్ అంశాలను ముందుగానే తెలిపిన ఖగోళ శాస్త్రజ్ఞుడు? బ్రహ్మ గుప్తుడు (క్రి శ 6,7 శతాబ్దాలు)
  • బ్రహ్మ గుప్తుడు యొక్క గ్రంధాలు? బ్రహ్మస్పుట, సిద్దాంత, ఖండ ఖడ్యక
  • గుప్తుల కాలం నాటి ప్రసిద్ద వైద్యులు? ధన్వంతరి, చరకుడు, శుశ్రుతుడు
  • ప్రాచీన కాలానికి చెందిన వైద్యునిగా పేరు పొందినవారు? ధన్వంతరి
  • నవనీతం అనే గ్రంధం దేనిని తెలియ జేస్తుంది? మందుల వివరాలు, వాటి తయారీ విధానం గూర్చి (వైద్య గ్రంధం)
  • సంస్కృత వైద్య శాస్త్రం మన దేశం నుండి ఏ ప్రాంతానికి చేరింది ? అరేబియా కు (తర్వాత అలెగ్జాండ్రియ ద్వారా ఐరోపాకు చేరింది)
  • హస్తాయుర్వేద గ్రంధకర్త? పాలకావ్య (పశు వైద్య శాస్త్రానికి చెందిన వాడు)

పుష్యభూతి వంశం

Pushyabhuti Dinasty
  • స్తానేస్వర్ లో రాజకీయ ఐఖ్యత తెచ్చిన రాజవంశం ? పుష్య భూతి వంశం
  • ఉత్తర భారత దేశం లో మంచి పాలన ఏర్పాటు చేసిన హర్షుని యొక్క వంశం? పుష్యా భూతి
  • మధుబన్ ఫలకం ప్రకారం మొదటి పుష్యభూతి వంశ రాజు? ప్రభాకర వర్ధనుడు
  • ప్రభాకర వర్ధనుడి బిరుదులు? మహా రాజాధి రాజు, పరమ భట్టారకుడు
  • హుణులు హరిణాలకు సింహం వంటివాడు ప్రభాకర వర్ధనుడు అని ప్రభాకర వర్ధనుడి గూర్చి పేర్కొన్న గ్రంధం? హర్ష చరిత్ర
  • ప్రభాకర వర్ధనుడి అధికారం ఉత్తర భారతదేశం అంతా విస్తరించింది అని పేర్కొన్న చరిత్ర కారుడు? డా ఆర్ కే ముఖర్జీ
  • ప్రభాకర వర్ధనుడి కుమారులు? రాజ్య వర్ధనుడు, హర్ష వర్ధనుడు
  • ప్రభాకర వర్దనుడి కుమార్తె ? రాజశ్రీ
  • ప్రభాకర వర్డనుండి కుమార్తె రాజశ్రీ ఎవరి భార్య? గృహవర్మ భార్య
  • గృహవర్మ ఏ ప్రాంత రాజు? మాళ్వా రాజు
  • రాజ్య వర్ధనుడు తన తండ్రి మరణ సమయం లో ఏ ప్రాంతం పై దండెత్తాడు? మంచాల పై
  • మాళ్వా రాజు గృహవర్మ ను సంహరించి ఎవరిని బందీని చేసాడు? రాజశ్రిని
  • మాళ్వా రాజుని సంహరించిన వాడు? శశాంకుడు
  • తండ్రి మరణవార్త విని రాజ్య వర్ధనుడు రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు? సోదరుడు హర్ష వర్ధనుడికి

హర్ష వర్ధనుడు (Medieval India)

  • హర్షుడు ఏ సంవత్సరం లో జన్మించాడు? క్రి శ 590 లో
  • హర్షుడు ఏ వయసులో రాజు అయ్యాడు? 16వ ఏట (606 లో )
  • హర్షుడు సింహాసనం అధిష్టించే నాటికి అతని లక్ష్యాలు ఏమిటి? బందీగా ఉన్న సోదరిని విడిపించడం, శాసాంకుని శిక్షించడం
  • హర్షుడు ఏ ప్రాంతాన్ని కొత్త రాజధానిగా చేసుకొన్నాడు? కనౌజ్ ను
  • హర్షుడు ఎవరిని ఓడించి కనౌజ్ ను రాజధానిగా చేసుకొన్నాడు? శాసంకుని ఓడించి
  • హర్షుడు శాసంకుని ఓడించడానికి ఎవరితో ఒప్పందం చేసుకొన్నాడు? భాస్కర వర్మ తో
  • హర్షుడు ఆక్రమించిన కనౌజ్ ను ఏ ప్రాంతం లో కలుపుకొన్నాడు? స్థానేస్వర్ లో
  • హర్షుడు 2 వ పులకేసి తో చేసిన యుద్ధం గూర్చి విపులంగా వర్ణించిన వారు? హుయాన్ త్సాంగ్
  • హర్షుడు 2 వ పులకేసి మధ్య జరిగిన యుద్ధం లో హర్షుడు పూర్తీ విజయం సాధించినట్లు పెర్కొన్నవారు ? హుయాన్ త్సాంగ్  (నిజానికి పులకేసి తో సంధి చేసుకొని రాజ్య సరిహద్దులు పరిమితం చేసుకొన్నాడు)
  • హర్షుని గ్రంధాలు ఏవి? నగానందం, రత్నావళి, ప్రియ దర్శిని
  • హర్షవర్ధనుడి బిరుదు? శిలాదిత్య, పరమ భట్టారకుడు, పరమేశ్వర, పరందేవత, మహారాధి రాజ (దానాలద్వారా విద్యావ్యాప్తికి కృషి చేసాడు)
  • హర్షుని ఆస్థాన కవి ? బాణుడు
  • హర్షుడు నలందా విశ్వ విద్యాలయ పోషణకు ఎన్ని గ్రామాలు దానం చేసాడు? 100 గ్రామాలు
  • నలందా విశ్వ విద్యాలయానికి ఏయే దేశాలనుండి వచ్చి విద్యనూ అభ్యసించేవారు? చైనా, టిబెట్, మంగోలియా ల నుండి (సంస్కృతం లో)
  • నాటి కాలం లో నలందా విశ్వ విద్యాలయ౦ లో ఎంత మంది అధ్యాపకులు ఉండేవారు? 1500 మంది
  • నలందా అధ్యాపకులలో కొన్ని పేర్లు? ధర్మ పాలుడు, చంద్ర పాలుడు, గుణవతి, స్తీర్మతి, ధ్యాన్ చంద్ర, కమల్ శీల
  • నాటి కాలం లో నలందా విశ్వ విద్యాలయ౦ అధ్యక్షులు/ చాన్సలర్? శీల భద్రుడు
  • నలందా విశ్వ విద్యాలయం లో బోధించే శాస్త్రాలు? వేదాలు, వ్యాకరణం, ఖగోళం, గణితం, జ్యోతిష్యం, సాహిత్యం, నైతిక విలువలు
  • నలందా విశ్వ విద్యాలయం లో విద్యనూ అభ్యసించిన చైనా యాత్రికుడు? హుయాన్ త్సాంగ్
  • హర్షుడు గొప్ప సేనాపతి పరిపాలనాదక్షుడు. పండిత పోషణకు ఉదారంగా విరాళాలు ఇచ్చాడు అని తెలియజేసిన చరిత్ర కారుడు? డా. రాయ్ చౌదరి
  • హర్షుడు యుద్ధం శాంతి కళలలో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడు. కలం కత్తి సమానంగా వాడగల నిపుణుడు మేధావి అతడు అని తెలిపిన చరిత్ర కారుడు ? ఆర్ సి మజుందార్
  • యుద్ద భూమి సర్వ సైన్యాధ్యక్షునిగా వ్యవహరించిన రాజు? హర్షుడు

హుయాన్ త్సాంగ్ 

  • హర్షుని పాలన గూర్చి వివరించిన చైనా యాత్రికుడు? హుయాన్ త్సాంగ్
  • హోయన్ త్సాంగ్ రచించిన ముఖ్య అంశాలు (చైనా యాత్రికుడు)
    • కచ్చిత పాలన ఉన్నా రహదారులు సరిగా లేవు అని రాసాడు
    • 2 సార్లు దోపిడీకి త్సాంగ్ గురయ్యాడు
    • 605 లో జన్మించాడు
    • క్రి శ 630 లో భారతదేశం దండర్శించాడు (భౌద్ధ వాంగ్మయ సేకరణ కొరకు)
    • 15 సంవత్సరాలు భారత్ లో గడిపాడు
    • స్వదేశం లో 661 లో సి యు కి అనే గ్రంధాన్ని రాసాడు (పశ్చిమ ప్రాంత ప్రతులు అని పేరు)
    • సి యు కి గ్రంధం లో హర్షుని కాల పరిస్థితులు పేర్కొన్నాడు

పరిపాలన

  • హర్షుని మంత్రి మండలిని ఏ పేరుతో పిలిచేవారు? సచివులు, అమాత్యులు
  • హర్షుని ప్రధాని ? భండి
  • ఆర్ ఎస్ త్రిపాటి ప్రకారం హర్షుని మంత్రి మండలి పేర్లు
    • మహా సంధి విగ్రహదికృత    యుద్ధం శాంతి భద్రతల మంత్రి
    • మహా బలాదికృత అత్యున్నత సైన్యాధికారి
    • బలాది కృత                           సేనాపతి
    • బ్రహదాశ్వవర                       అశ్విక దళాధిపతి
    • కాటుక                                    గజ బలాధ్యక్షుడు
    • రాజ స్తానియా                       విదేశీ కార్యదర్శి
    • ఉపరిక                                    రాజ్య ప్రతినిధి
    • విషయ పతి                            విషయాదికారి
  • హర్షుని సామ్రాజ్యం ఏ విధంగా విభజింప బడినది? భుక్తులు గా (రాష్ట్రాలు)
  • భుక్తుల పలానాదికారి? భుక్తి
  • భుక్తులను ఏ విధంగా విభజించారు? విషయాలు గా (జిల్లాలు)
  • విషయాలు ఏ విధంగా విభజింప బడ్డాయి? పథకాలు (వీటిని తహసీలు అన్నారు)
  • హర్షుని సామ్రాజ్యం లో చిన్న పాలనా విభాగం ? గ్రామం
  • గ్రామ పాలనాధికారి? గ్రామికుడు
  • రాజ్య సంరక్షణ కోసం హర్షుడు ఎన్ని ఏనుగులు గుర్రాలు పెంచాడు? 60 వేల ఏనుగులు, 1 లక్ష గుర్రాలు
  • హర్షుని రాజ్యం లో ఏ సమయం లో నేరస్తులను విడుదల చేసే వెసులుబాటు కల్పించారు? రాజు పుట్టిన రోజు నాడు

సమాజం

  • నాటి సమాజం లో ఏ వ్యవస్థ పటిష్టంగా పాటించ బడేది? వర్ణాశ్రమ వ్యవస్థ పటిష్టంగా పాటించ బడేది
  • సమాజం లో 4 వర్ణాలు ఉండేవి అని పెర్కొన్నవారు? హుయాన్ త్సాంగ్ (మిశ్రమ జాతులు, ఉప కులాలు ఉన్నాయిని తెల్పాడు
  • హుయాన్ త్సాంగ్ ప్రకారం అగ్రవర్నాలతో కలవ కుండా అంటరాని వారుగా ఉండే వర్గాలు ఏవి? కసాయివారు, మత్సకారులు, పారిశుధ్య కార్మికులు
  • హర్షుడు వర్ణ ధర్మ సూత్రాలు ఆశ్రమాలు పాటించాడు అని తెల్పినవారు? బాణుడు
  • సమాజం లో స్త్రీ పాత్ర
    • స్త్రీల హోదా తగ్గింది
    • వివాహం లో స్వయం వర పద్దతి పాటించ బడినది
    • వితంతు పునర్వివాహాలు అగ్రవర్ణం లో అంగీకరించ బడలేదు
    • వరకట్న దురాచారం సర్వ సాధారణం అయినది 
  • for more details please visit our kingsdsc.in website

Leave a Comment